ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
24, ఫిబ్రవరి 2026, మంగళవారం
దేవాలయాలను ఎందుకు దర్శించాలి.........!!
🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🕉️🍀🕉️🍀
దేవాలయాలను ఎందుకు దర్శించాలి.........!!
శాస్త్రీయ కారణాలు.....
భారతదేశంలో అనేకవేల సంఖ్యలలో దేవాలయాలు ఉన్నాయి.వాటిని వివిధ ప్రదేశాలో,వివిధ ఆకారాలలో,అనేక సైజులలో నిర్మించడం జరిగినది.
కానీ వాటిలో కొన్ని మాత్రమే వైదికమైన(వేదాలను అనుసరించి) పద్దతిలో నిర్మించడం జరిగినది(అని భావించడం జరిగినది).ఎక్కడైతే భూమియొక్క ఆకర్షన శక్తి అధికంగా ప్రసారిత మవుతుందో అయా ప్రదేశాలలోనే దేవలయాలు సాధారనంగా నిర్మించ బడాలి.ఆ ప్రదేశాలు ఊరిమద్యలో నివాశస్ధలంలో అయినా కావచ్చు,ఊరివెలుపల కావచ్చు,కొండలపైన అయినా కావచ్చు.
దేవాలయాలను స౦దర్శి౦చవలసిన ప్రాముఖ్యతను ఇక్కడ ప్రస్తావి౦చడ౦ జరిగినది.
ఏఏ ప్రదేశాలలో అయితే విత్యుదయస్కా౦త శక్తి యధేష్టముగా ఉత్తర దక్షిన ద్రువాలను౦డి ప్రసారితమవుతు౦దో ఆయా ప్రదేశాలలో ఈ దేవాలయాలు నిర్మి౦చబడినవి.ఆ ప్రదేశములో మధ్యస్దానములో మూలవిగ్రహము(మూలవిరాట్) ను స్దాపి౦చడ౦ జరుగుతు౦ది.ఆ ప్రదేశము గర్భగ్రుహము లేదా మూలస్ధానముగా పిలవబడుతు౦ది.నిజానికి మూలవిగ్రహము స్దాపి౦చబడిన తరువాతనే ఆలయనిర్మానము జరుగుతు౦ది.ఈ మూలస్దానములోనే భూమి యొక్క అయస్కా౦త శక్తి అధికముగా వు౦టు౦ది.మన అ౦దరికీ తెలిసిన విషయమేమిట౦టే వేద ప్రతులు వ్రాయబడిన రాగిపత్రాలు ఆ మూలవిగ్రహము క్రి౦ద ప్రా౦తములో తాపడము చేయబడి వు౦టాయి.నిజానికి అవి ఏమిటి? అవి పూజారులు శ్లోకాలను మర్చిపోతేగనక వాటిని గుర్తుచేయడానికి పెట్టిన పత్రాలు ఎ౦త మాత్రమూ కాదు.ఆ తామ్రపత్రాలు భూమియొక్క అయస్కా౦త తర౦గాలను ఆకర్షి౦చుకొని తమలో నిక్షిప్తపరచుకొని ఆ పరిసరాలలో వెదజల్లుతాయి.కాబట్టి ఒక వ్యక్తి దేవలయాన్ని క్రమముగా స౦దర్శి౦చుకొని మూలవిగ్రహము చుట్టూ ప్రదక్షనలు జరుపుతున్నట్లైతే ఆ వ్యక్తి శరీరము ఆ తామ్రపత్రాల ద్వారా వెదజల్లబడిన అయస్కా౦త తర౦గాలను గ్రహి౦చుకొని, నిక్షిప్తపరుచుకు౦టు౦ది. ఇది అతి నెమ్మదిగా జరిగే చర్య మరియు క్రమముగా ఆ వ్యక్తి దేవలయాన్ని స౦దర్శి౦చుకు౦టున్నట్లైతే మరి అధికముగా ఆ "పాజిటివ్ ఎనర్జీ" ని గ్రహి౦చుకో గలుగుతాడు. పరిపుష్టమైన జీవితము జీవి౦చుటకు ఆ "పాజిటివ్ ఎనర్జీ" మన అ౦దరికీ ఎ౦తైనా అవసరమని శాస్త్రీయముగా నిరూపితమైనది.
✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀
మరణం లేని జీవమే లేదు
*ఈ ప్రపంచంలో మరణం లేని జీవమే లేదు. ఏ జీవికి లేని అదృష్టం ఒక మనిషికి మాత్రమే ఉంది.*
*అదేంటో తెలుసా..!*
*మనిషి తలుచుకుంటే మరణం తర్వాత కూడా బ్రతికి ఉండవచ్చు. ఔను ఇది నిజం!!!*
*ప్రతి మనిషి మరణం తప్పదని తెలిసి కూడా స్వార్థంతోనే బ్రతుకుతున్నాడు. అన్ని నాకే కావాలనే స్వార్థం.*
*అంతేనా!!!*
*కోపాలతో, పగలతో మనశ్శాంతి కూడా లేకుండా బ్రతుకుతున్నాడు. మనం ఏం చేసినా, ఎంత సంపాదించినా, మనకెలాగో మరణం తప్పదు. కాబట్టి బ్రతికినంత కాలం మంచిగా బ్రతుకుదాం. ఆపదలో ఉన్న వారికి చేయూతనిద్దాం. బాధలో ఉన్న వారికి ఓదార్పునిద్దాం. మనమంటూ లేని నాడు మన ఆలోచనలు... మనం చేసిన మంచి పనులే మనల్ని బ్రతికిస్తాయి. ఈ సృష్టిలో ఒక మనిషి తప్ప ఏ జీవి కూడా మరో జీవి పై కారణం లేకుండా దాడి చేయొద్దు.. కానీ మనిషి మాత్రం అకారణంగా తనకోసం, తన బిడ్డల కోసం, తరతరాల కోసం కూడబెట్టడం కోసం ఎదుటి వ్యక్తిని నాశనం చేస్తున్నాడు.. కానీ ఒక విషయం మర్చిపోతున్నాడు ఇతరుల క్షోభతో కూడబెట్టిన డబ్బు తన కీడునే కాదు, తన బిడ్డల నాశనాన్ని కూడా కోరుతుందని..*
*ఇంతే కాదు కష్టపడి, కడుపు కట్టుకొని, తన కోరికలను తీర్చుకోకుండా, ఆఖరికి కడుపునిండా తిండి కూడా తినకుండా, ఎవరికి ఒక రూపాయి కూడా దానం చేయకుండా, తను కూడబెట్టిన డబ్బును తన బిడ్డలకు ఇస్తాడు, కానీ కష్టం పడకుండా తేరగా వచ్చిన డబ్బు విలువ తెలియని ఆ బిడ్డలు ఆ డబ్బుతో దుర్వ్యసనాలకులోనై ఉత్తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు.*
*కాబట్టి ఇతరులను బాధపెట్టి, సంపాదించిన ఆ డబ్బు తన బిడ్డల భవిష్యత్ కి అవరోధమని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి.. అంతేకాకుండా బిడ్డలకు చదువు తప్ప మరే ఆస్తులు ఇవ్వనప్పుడే, తన కాళ్ళ మీద తను నిలబడి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు..*
*కాబట్టి దయచేసి ప్రతీ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు స్వయంకృషితో ఎదగడం నేర్పండి, తేరగా వచ్చిన దానితో బతకడం కాదు🙏*
🟣🔵🟡🔴🙏🔴🟡🔵🟣
*_🌴భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ వ్యాపకుడు. అయన లేని చోటులేదు. అయనకు తెలియకుండా ఎదీ జరుగదు. మనం చేసే ప్రతి పనిలో అయన మనలను అన్ని వేళల యందునూ గమనిస్తుంటాడు. ఆయన దగ్గర ఏదీ దాచలేం. మనం చేసిన ప్రతీ పనికీ నేడు కాకున్నా రేపైనా లేదా మరొక రోజైనా దేవుని ముందు నిలబడి ఒంటరిగా సమాదానం చెప్పుకోవలసి ఉంటుంది. జవాబు దారీతనం కలిగి ఉండాలంటే మంచినే ఆచరించాలి. హింసకు దూరంగా ఉండాలి. 🌴_*
🟢🔴🟡🔵🙏🔵🟡🔴🟢
చదువుకొనెడి ప్రాయంబున
*2325*
*కం*
చదువుకొనెడి ప్రాయంబున
చదువొక కర్మంబెగాని చదువను మిషలన్
సదనుష్ఠానిత ధర్మము
వదులుకొనుట పాడిగాదు సతతము సుజనా.
(వదలగ నష్టమ్ము మనకె పదపడి సుజనా).
*భావం*:-- ఓ సుజనా! చదువుకునే వయస్సు లో చదువు ఒక కర్మ మే(పనియే) గానీ చదువు అనే మాయల చేత (సాకు చూపి) చక్కగా ఏర్పడి యున్న సదాచారమును వదులుకోవడం న్యాయం
కాదు. (సమాచారము ను వదులుకోవడం వలన నష్టము మనకే కలుగుతుంది).
*సందేశాత్మక హెచ్చరిక*:--- చాలా కాలం గా ఆంగ్లేయ విద్యాభ్యాసం మాయలో పడి కులవృత్తులనూ కుల ధర్మాలనూ దూరం చేసుకుని భారతీయులు ఎంతో నష్టపోతున్నారు,అదేదో ఘనకార్యం అనే భ్రమలో పడి ఈనాడు మరింత గా నష్టపోతున్నారు. (ముఖ్యంగా బ్రాహ్మణులు) సకాలంలో ఉపనయన,వివాహాది సంస్కారాలకు దూరమై,ఆహారవ్యవహారాదులు భ్రష్టమై, వేదశాస్త్రాలకు దూరమై భారతీయానికి భారమై అధోగతి పాలవుతున్నారు. తద్వారా విదేశీయులు భారత దేశాన్ని ఆక్రమించుకోవడానికి భారతీయులు భారత భూమి పై స్వాధీనం, స్వాతంత్ర్యం కోల్పోవడానికి మార్గం సుగమమవుతోంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
స్వామి--నేను*
*స్వామి--నేను*
*స్వామి:* ```
ఏంటయ్యా ఇలా వచ్చావ్, అది కూడా ఇంత చలిలో..?```
*నేను:* ```
నిన్ను చూడాలనే సంకల్పం ముందు ఈ చలి ఎంత స్వామీ..?```
*స్వామి:*```
ఐతే నా దర్శనం కోసం నువ్వేమైనా చేస్తావా..?```
*నేను:*```
అవును స్వామి, అలిపిరి మెట్లు ఎక్కమన్నా ఎక్కుతా, గంటల తరబడి waiting hall లో ఉండమన్నా ఉంటా, చలి చూడను,ఎండను పట్టించుకోను మంచుందని భయపడను..!```
*స్వామి:*```
నా దర్శనం ఎందుకు నీకు?```
*నేను:*```
అదేంటి స్వామీ అలా అంటారు. నిన్ను చూస్తే వచ్చే ధైర్యం, హాయి, సంతోషం, మనశ్శాంతి అంతా ఇంత కాదు..!```
*స్వామి:*```
నన్ను చూస్తే నీకు ఇవన్నీ కలుగుతాయంటావు, అవునా..?```
*నేను:*```
అవును స్వామి..!```
*స్వామి:*```
దేవుడు అంటే ఏమిటి నీ దృష్టిలో?
```
*నేను:*```
దేవుడు అంటే మనల్ని నడిపించే నమ్మకం కాపాడే శక్తి, కాసే కాపు.```
*స్వామి:*```
ఇవన్నీ నేను చేస్తానా..?```
*నేను:*```
చేస్తున్నావు కాబట్టే కదా స్వామీ ఇంతమంది నిన్ను ఇలా కొలుస్తున్నది.
```
*స్వామి:*```
నీ దృష్టిలో ఇలాంటివి చేసేవాళ్లే దేవుళ్లు అంటావు, అంతేనా..?```
*నేను:*```
అవును స్వామీ..!```
*స్వామి:*```
ఇంత కన్నా ఎక్కువ చేస్తే..?```
*నేను:*```
అసంభవం స్వామీ, ఇంతకన్నా ఎక్కువ ఎవరూ చేయరు, చేయలేరు. నిన్ను మించిన majesty ఎవరూ లేరు,ఉండరు.```
*స్వామి:* ```
అదేంటయ్యా, ఉంటే ఏం చేస్తావ్?
```
*నేను:* ```
ఉండనే ఉండరు. స్వామీ
ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఉంటే నా ఊపిరి ఆగే వరకూ వాళ్లకు సేవ చేస్తా!```
*స్వామి:* ```
సరే, ready ఐపో..!```
*నేను:*```
ఏంటి స్వామి, నిజంగా నీకన్నా నాకోసం ఎక్కువ కష్టపడే వాళ్లు ఉన్నారా..?```
*స్వామి:* ```
ఉన్నారు..!```
*నేను:*```
ఎవరు స్వామి, వాళ్లు ఎక్కడ ఉంటారు..?```
*స్వామి:*```
ఉన్నారు```
*నేను:*```
ఎవరు స్వామి, వాళ్లు ఎక్కడ ఉంటారు..?```
*స్వామి:*```
నీ కోసం నీకంటే ముందు మేల్కొన్న వాళ్లు, నీ నిద్ర కోసం తమ నిద్రను త్యాగం చేసిన వాళ్లు, నీ ఆకలికి తమ ఆకలిని అడ్డేసిన వాళ్లు, నీ నవ్వు కోసం తమ కన్నీళ్లను దాచుకున్న వాళ్లు.```
*నేను:*```
స్వామీ, అలా మాట్లాడొద్దు, అర్థమవుతోంది..!```
*స్వామి:* ```
నీవు అలిపిరి మెట్లు ఎక్కుతావన్నావు కదా, వాళ్లు నీ పుట్టుక నుంచే జీవితమంతా మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. నీవు గంటల తరబడి waiting hall లో ఉంటానన్నావు. వాళ్లు ఏళ్ల తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నారు.```
*నేను:*```
స్వామీ, ఆపండి, నా గుండె తట్టుకోలేకపోతోంది..!```
*స్వామి:*```
నీవు చలిని పట్టించుకోనన్నావు. వాళ్లు వర్షాన్ని, ఎండను, ఆకలిని కూడా పట్టించుకోలేదు. నీవు మంచుకి భయపడనన్నావు. వాళ్లు అప్పుల్ని, అవమానాల్ని, ఒంటరితనానికీ భయపడలేదు.```
*నేను:*```
స్వామీ, వాళ్లేనా..```
*స్వామి:* ```
అవును నిన్ను భవిష్యత్తులా చూసిన వాళ్ల. నీ విజయంలో దేవుణ్ణి చూసిన వాళ్లు.
నీ ఓటమిలో కూడా నిన్ను వదలని వాళ్లు..!```
*నేను:*```
వాళ్లు ఎవరో కాదు, మా అమ్మా, నాన్నా కదా స్వామీ..!```
*స్వామి:*```
నువ్వు నా కోసం వచ్చావ్! కానీ నిన్ను నా దగ్గరకు నడిపించింది వాళ్లే! నన్ను చూసి ధైర్యం వస్తుందన్నావు. నీకు ధైర్యం నేర్పింది వాళ్లే..!```
*నేను:*```
స్వామీ, నేను ఇంతకాలం దర్శనాల వెంటే పరిగెత్తాను కానీ నా ఇంట్లోనే ఉన్న దేవుళ్లను చూడలేకపోయాను.
```
*స్వామి:*```
అందుకే చెప్పాను నా దగ్గరకు రావడం పుణ్యం. కానీ వాళ్ల దగ్గర ఉండటం మోక్షం..!```
*నేను:*```
స్వామీ, ఇక నా సేవ అక్కడే!
నా ఊపిరి ఆగే వరకూ ఆ ఇద్దరికీ
ఆఇద్దరి సేవకే పరిమితం.```
*స్వామి:*```
ఎప్పుడైతే నీ తల్లితండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజిస్తావో అప్పుడే నువ్వు నన్ను పూర్తిగా దర్శించినట్టు.
అంతవరకూ నువ్వెన్ని సార్లు మెట్లెక్కినా ఎన్ని ముడుపులు కట్టినా
నా హుండీలోకి ఎన్ని డబ్బులేసినా నాకోసం నీ తల నీలాలిచ్చినా
నా తలకు బంగారు కిరీటం పెట్టినా అవన్నీ వేస్ట్.
వచ్చి నా దర్శనం చేసుకుని రెండు reels చేసి, అవి social media లో post చేసి వైరల్ అవుతావు తప్ప లైఫ్ లో సక్సెస్ అవ్వవు.
నీ తల్లితండ్రుల కళ్లలో హాయిగా నిద్ర వస్తే అదే నీ first success. వాళ్ల ఒంటికి, మెదడుకి రోగాలు లేకుండా వాళ్ల ముఖంలో భయం తగ్గితే అదే నీ real ప్రమోషన్.
వాళ్ల బాధ్యతలు కొన్ని నీ భుజాన వేసుకో! నన్ను పూజించడమంటే పూలు, కొబ్బరికాయలు కాదు.
మీ అమ్మ అలసినప్పుడు ఒక్క గ్లాస్ నీళ్లు ఇవ్వడం!
నీ నాన్న మౌనంగా కూర్చున్నప్పుడు కారణం అడగకుండా పక్కన కూర్చోవడం.
నువ్వు నాకోసం వ్రతాలు చేస్తే ఆకాశం నుంచి నేను చూడగలను.
కానీ వాళ్ల కోసం నువ్వు ఒక్కసారి త్యాగం చేసి చూడు,
నేనే నీ ఇంటికొచ్చి కూర్చుంటాను.
నా గుడిలో నువ్వు భక్తుడిగా కాదు మీ ఇంట్లో ..
మీ అమ్మానాన్నలకు సేవ చేసే
అర్చకుడిగా ఉండిపో అందుకే! గుర్తుంచుకో నా కాళ్ల దగ్గర పువ్వులు కాదు.
మీ తల్లితండ్రుల చేతుల్లో నేనున్నానే భరోసా పెట్టు.
నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్టే!
మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్టే..!!
24 గంటలు నిన్ను చూస్తూ బతికేస్తారు వాళ్లు, అలాంటి వాళ్లకోసం నువ్వెంత చేసినా తక్కువే.
మా అమ్మ వకుళ మాత ఎప్పుడూ
నా పక్కనే ఉంటుంది బిడ్డ ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అని!
అలాంటి తల్లితండ్రులను మించిన దేవుళ్లు ఉండరు.
చివరగా ఒక్క మాట..
దేవుళ్లకు, అమ్మానాన్నలకు ఉండే చిన్న తేడా ఏంటో చెప్తా విను! పడిపోయాక పట్టుకునే వాళ్లు దేవుళ్లు.
పడిపోకుండా పట్టుకునే వాళ్లు మీ తల్లితండ్రులు..!
వాళ్లను మించిన దేవుళ్లు లేరు✍️```
ఆర్యా శతకం - 1*
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 39*
*మధుకర సహచర చికురైర్మదనాగమ సమయదీక్షిత కటాక్షైః ౹*
*మండిత కంపాతీరైః మంగళ కందైర్మమాస్తు సారూప్యమ్||*
*భావము :*
*తుమ్మెదల సమూహమును పోలిన నల్లని కేశ సంపద కల మాత, తనను ఆరాధించే సాధకులకు కేవలము తన క్రీగంటి చూపుతోనే సకల సిద్ధులను ప్రసాదించగలదు. సర్వ మంగళ స్వరూపిణియైన మాత తన సారూప్యమును నాకు కలిగించుగాక.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
భగవద్గీత
-------------------- భగవద్గీత. -------------------
తృతీయోధ్యాయ: కర్మ యోగము.
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ।। 5 ।।
ప్రతిపదార్థ:
న — కాదు; హి — నిజముగా; కశ్చిత్ — ఎవరూ కూడా; క్షణం — క్షణ కాలము; అపి — కూడా; జాతు — ఎప్పటికిని; తిష్ఠతి — ఉండుట; అకర్మ-కృత్ — కర్మ చేయకుండా; కార్యతే — చేయబడును; హి — తప్పకుండా; అవశః — నిస్సహాయంగా; కర్మ — పని; సర్వః — అన్నీ; ప్రకృతి-జైః — భౌతిక ప్రకృతి జనితములైన; గుణైః — గుణముల చేత.
తాత్పర్యము :
ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి, అన్ని ప్రాణులు తమతమ ప్రకృతి జనితమైన స్వభావాలచే (త్రి-గుణములు) ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును.
వివరణ:
కొంత మంది కర్మ అనగా వృత్తి ధర్మము మాత్రమే అనుకుంటారు, అంతేకానీ రోజువారీ పనులైన తినటం, త్రాగటం, నిద్రపోవటం, నడవటం, మరియు ఆలోచించటం వంటివి కూడా కర్మ అని అనుకోరు. కాబట్టి తమ వృత్తిని విడిచిపెట్టినప్పుడు, ఏమీ పనులు చేయటం లేదు అనుకుంటారు. కానీ, శరీరంతో, మనస్సుతో, వాక్కుతో చేసే అన్ని పనులనూ శ్రీ కృష్ణుడు కర్మలుగానే పరిగణిస్తాడు. అందుకే, ఒక్క క్షణమైనా పూర్తి క్రియా రహితంగా ఉండటం సాధ్యం కాదని అర్జునుడికి చెప్తున్నాడు. ఊరికే కూర్చున్నా సరే, అదొక క్రియ; పడుకుంటే, అది కూడా ఒక క్రియ; మనం నిద్ర పొతే, మనస్సు స్వప్నాల్లో నిమగ్నమవుతుంది; గాఢ నిద్రలో కూడా గుండె మరియు ఇతర శారీరక అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి, మనుష్యులకు పూర్తి క్రియా రహిత స్థితి అసాధ్యము అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు, ఎందుకంటే ఈ యొక్క శరీరము-మనస్సు-బుద్ధి వ్యవస్థ తన యొక్క స్వీయ త్రిగుణముల (సత్వ-రజో-తమో గుణములు) చేతనే ఏదో ఒక పని చేయటానికి ప్రేరేపింపబడుతుంది. శ్రీమద్ భాగవతంలో ఇలాంటిదే ఒక శ్లోకం ఉంది.
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మ-కృత్
కార్యతే హ్యవశః కర్మ గుణైః స్వాభావికైర్బలాత్ (6.1.53)
‘ఎవ్వరూ కూడా ఏ పనీ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేరు. ప్రతివారూ తమ ప్రకృతి గుణములచే ప్రేరేపింపబడి అప్రయత్నంగా కర్మలు చేస్తారు’
రామోవిగ్రహవాన్ ధర్మ
రామోవిగ్రహవాన్ ధర్మ
శ్రీరాముడుధర్మవిగ్రహుడు
శ్రీ్రామునినడతధర్మం
అన్నదమ్ములపైప్రేమ ఆదర్శధర్మం!
గురువుల ఆజ్ఞ పాటించినధర్మం
మునులను కాపాడిన ధర్మం
తండ్రి సమక్షంలో సీతమ్మనుపెండ్లి ఆడటం
వివాహధర్మం
రామప్రభుతండ్రిమాట
తలదాల్చటంధర్మం
నదినిదాటించినగుహునితో స్నేహధర్మం
రాక్షస సంహారం ప్రభుధర్మం
హనుమంతునిపై అనురాగం
సుగ్రీవునితోస్నేహధర్మం
వాలిని
చంపటంరాజధర్మం వానరసహయముతోాావరావణునిచంపటంఅవతారధర్మం
సీతమ్మతోఅయోధ్య చేరటం
అయోధ్యపాలనలో రాజధర్మం
ధర్మరక్షణకేరాముని అవతారం
శ్రీరామచంద్రునిధర్మావతారం🙏🙏🙏🙏
జయలక్ష్మి పిరాట్ల
శూర్పణఖ
అలాగే శూర్పణఖ రాక్షసి కూడా అన్నరాక్షసునితో
అన్నా ! ఆ రాముడు బాణం తియ్యడం కానీ సంధించడం కానీ వదలడం కానీ చూడలేదన్నయ్యా ! ఒక్కడే పదునాలుగు వేలమంది ఖరదూషణాది రక్కసిమూకని 72 నిమిషాల్లో చంపి దండకవనాన్ని పీనుగుల పెంటగా చేసేసి ఋషులకు మునులకు పరమశాంతిని చేకూర్చాడంటుంది..
ఆ పరాక్రమసౌందర్యాన్ని చూస్తుంటే నాలాంటి వాడికి కనులు చమర్చినవండి 🙏🙏
సుఖమే స్వర్గము
(సుఖమే స్వర్గము. దుఃఖమే నరకము. సర్వవిధాలా దుఃఖాన్ని తొలగించుకోవాలి)
శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//
(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).
------------
ఇప్పటివరకు అనుభవించిన దుఃఖాలేవో అనుభవించాము.
ఈ క్షణం నుండి దుఃఖమును అనుభవించకూడదు (హేయం దుఃఖమనాగతం)
అంటున్నది యోగ శాస్త్రం.
యోగ శాస్త్రం ఇంకా ఈ విధంగా చెబుతున్నది:
ప్రాపంచిక విషయాలు చాలా బలవంతమైనవి. ఇంద్రియములకు విషయములైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములన్నింటిలోనూ, మనకు ఇష్టమో అయిష్టమో ఉంటుంది.
రాగ ద్వేషములనబడే ఆ ఇష్టానిష్టాలననుసరించి మనం ఆ,యా, విషయాలలో ప్రవర్తిస్తూ ఉంటాం.
రాగం వల్ల పుణ్య కర్మలు, ద్వేషం వల్ల పాప కర్మలు చేస్తాం.
పుణ్య కర్మల వల్ల సుఖము, పాప కర్మల వల్ల దుఃఖము కలుగుతాయి.
సుఖం వల్ల మళ్లీ ఆ విషయములందు రాగము,దుఃఖము వల్ల ఆ విషయములందు ద్వేషము కలుగుతాయి.
రాగము వల్ల మళ్లీ పుణ్యకర్మలు, ద్వేషం వల్ల మళ్లీ పాప కర్మలు, చేస్తాం.
వాటిఫలితంగా మళ్లీ సుఖ దుఃఖాలు, ఈ విధంగా జనన మరణాలతో కూడిన సంసార చక్రం అనంతంగా పరిభ్రమిస్తూ ఉంటుందని యోగ శాస్త్రము చెబుతోంది.
విషయములచే ఆకర్షింపబడిన ఇంద్రియాలు బలవంతంగా మనస్సును విషయములలో ప్రవర్తింప జేస్తాయి.
ఎంత ప్రయత్నం చేసినా,ఎంత పండితుడినైనా ఇంద్రియాలు లొంగదీసుకుంటాయి, అని శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు.
శ్లో// యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత:/
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః//
( ఓ అర్జునా!మోక్షం కొఱకు తీవ్ర ప్రయత్నం చేస్తున్న మహా పండితుడినైనా, బలవంతమైన ఇంద్రియములు, బలాత్కారంగా వాని మనస్సును ఆకర్షించి సంసారంలో పడవేయును).
కాబట్టి ఈ విషయంలో సామాన్య ప్రయత్నం చాలదు.
గొప్ప ప్రయత్నం చెయ్యాలి.
" సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో
దృఢ భూమి: " (పతంజలి మహర్షి)
(ఆ ప్రయత్నం చాలకాలము, నిరంతరము తపస్సు, జపము, దేవతారాధన మొదలైన సత్కర్మలను ఆచరిస్తూ దృఢపరచు కొనవలెను)
ఆ ప్రయత్నం కూడా ఎప్పుడో ముసలితనం
వచ్చాక " కృష్ణా", "రామా" అనుకుంటామంటే, సాధ్యపడదు.
వార్ధక్యంలో దేహము యోగ సాధనకు సహకరించదు కాబట్టి, ముసలితనం రాక ముందే గట్టి ప్రయత్నం చెయ్యాలి, అంటున్నారు భర్తృహరి మహాయోగి.
శ్లో// యావత్ స్వస్థమిదం శరీర మరుజం యావచ్చ దూరే జరా/
యావచ్చేంద్రియ శక్తి రప్రతిహతా యావత్ క్షయో నాయుష:/
ఆత్మ శ్రేయసి తావదేవ విదుషా కార్య:ప్రయత్నో మహాన్/
సందీప్తే భవనేతు,కూప ఖననం ప్రత్యుద్యమ:కీదృశ://
(ఈ శరీరములో ఆరోగ్యము, స్వస్థత ఉన్నప్పుడే,ముసలితనం రాక ముందే, ఇంద్రియ పాటవం తగ్గక ముందే, ఆయుర్దాయము క్షీణింపక ముందే, తెలివి గలవాడు, తన శ్రేయస్సు కోసం మోక్షప్రాప్తికి, గొప్ప ప్రయత్నం చెయ్యాలి. దేహంలో అన్ని శక్తులు నశించిన పిదప,ప్రయత్నంచేయడము అంటే, ఇల్లు తగలబడి పోతున్నప్పుడు, నీటి కోసం అప్పుడు బావి త్రవ్వడం మొదలు పెట్టడం వంటిది).
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
24-2-'26.
సామెతలు
*సామెతలు*
1)సర్వేజనా స్సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా ? మాసంగతేమిటి ? అని అన్నారుట రెవెన్యూ వాళ్ళు.😄
2) సెహబాస్ మద్దెలగాడా ! అంటే ఆనందంతో ఐదు వ్రేళ్ళూ పగులకొట్టుకొన్నాట్ట.😄
3) రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు పుడతారంటే చుట్టుచుట్టుకూ పొట్టని చూసుకొందట ఒకావిడ😁
తల నొప్పిగా ఉంది అంటే
బామ్మ గారు తల నొప్పిగా ఉంది అంటే వేడి చేసి వచ్చిందేమో అని ఇంత పంచదార వేసి గ్లాస్ నిండా చిక్కటి మజ్జిగ ఇచ్చే వారు. దెబ్బ కి తల నొప్పితో పాటు నీరసం కూడా తగ్గేది.
కడుపు నొప్పి వస్తే కాసింత శొంఠి పొడుం వేడివేడి అన్నంలో తొలి ముద్ద గా తినమని చెప్పవారు లేదా రెండుమూడు వాము ఆకులు నమిలి గోరు వెచ్చని నీళ్లు తాగమని చెప్పవారు. వారు చెప్పినట్టు చేసే వాళ్ళం దెబ్బకి కడుపు నొప్పి వస్తే వొట్టు.
అలాగే పిప్పి పంటికి లవంగం బుగ్గన పెట్టుకో మనేవారు.
జలుబు చేస్తే వెల్లుల్లి పాయ కారంపొడి పెట్టేవారు.
దగ్గు వస్తే కరక్కాయ బుగ్గన పెట్టుకోమని చెప్పేవారు.
జ్వరం వస్తే జీలకర్ర కాషాయం. రొంప జ్వరం ఉంటే మిరియాలు కాషాయం తో లంకణం పరమ ఔషధం అనిచెప్పి ఆరోజు అంతా భోజనం పెట్టేవారు కాదు మరునాటికి జ్వరం ఉంటే ఒట్టు.
మలబద్ధకం గా ఉంటే గోరు వెచ్చగా నీళ్లు తాగించే వారు. మోషన్స్ అయితే పల్చగా మజ్జిగ చేసి అందులో పంచదార ఒక నాలుగు చెంచాలు వేసి ఇచ్చే వారు.
జుట్టు ఊడుతుంటే కుంకుడు కాయ తో పాటు ఇన్ని మందారు ఆకులు ను మెత్తగా దంచి తలంటు పోసుకునే వారు.జుట్టు నిగ నిగ లాడుతూ పెరిగేది.
గుండెల్లో మంట గా ఉంటే
పంచ దార నీళ్లు లేదంటే మజ్జిగ తేట ఇచ్చే వారు.
వడ దెబ్బ తగలకుండా ఇన్ని దబ్బాకులు వేసిన మజ్జిగ బయటకు వెళ్లి వచ్చాక ఇచ్చేవారు..
ఇలా ఇలా అనేక చిట్కాలు... అనేక రోజులు అనుభవం తో నేర్చుకున్న ఇంటి వైద్యాలు...
తలుచుకుంటే అప్పటి వారి మెడికల్ box ఏమిటి అంటే పోపుల పేట్టే...
దురాశ
శుభోదయం.
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
' దురాశ ' మనిషిని కట్టుబానిసగా చేసి ఎలా ఆడిస్తుందో శ్రీ భర్తృహరి మహాయోగి ఇలా తెలియజేస్తున్నారు.
శ్లో// ఖలోల్లాపాః సోఢాః కధమపి తదారాధన పరై:/
నిగృహ్యాంతర్బాష్పం హసిత మపి శూన్యేన మనసా/
కృతో విత్త స్తంభ ప్రతిహత థియా మంజలి రపి/
త్వమాశే! మోఘాశే! కిమపరమతో నర్తయసి మామ్//
(నీచులకు సేవ చేస్తూ వారి దుర్భాషలన్నీ సహించాను.
అవమానకరమైన వారి మాటలకు పొంగి పొంగి వస్తున్న కన్నీళ్లను లో లోపలే మ్రింగుకుంటూ శూన్యమైన మనస్సుతో పైకి వెడ నవ్వు నవ్వాను.
అహంకారంతో మదించిన ధనవంతులకు(ఈ పదంతో అధికారంలో ఉన్నవారు కూడా సూచింపబడ్డారు) రెండుచేతులూ జోడించి నమస్కారాలు చేశాను.
ఓ పనికిమాలిన ఆశా!నాచేత ఇంకా ఏమి ఆటలు ఆడిస్తావు?).
చ// పలువలు పల్కుమాట లొకభంగి సహించితి, బాష్పవారి లో /
పలనె హరించి శూన్యమగు భావమునన్ వెడనవ్వు నవ్వితిన్ /
బొలుపఱి విత్తజాడ్య హత బుద్ధుల కంజలి చేసితిం గటా /
తలకక యింక నేపనికి దార్చెదు నన్ను దురాశ నీవిటన్ //
(ఏనుగు లక్ష్మణకవి)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
24-2-'26.
నేటి వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - సప్తమి & అష్టమి - కృత్తిక - భౌమ వాసరే* (24.02.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
24ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
*🌹24ఫిబ్రవరి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*
*తిథి : సప్తమి* ఉ 07.01 *అష్టమి* రా.తె 04.51 ఉపరి *నవమి*
*వారం : మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : కృత్తిక* మ 03.07 వరకు ఉపరి *రోహిణి*
*యోగం : ఐంద్ర* ఉ 07.24 *వైధృతి* రా.తె 04.26 ఉపరి *విష్కుంబ*
*కరణం : వణజి* ఉ 07.01 *భద్ర* సా 05.56 ఉపరి బవ రా.తె 04.51 వరకు ఆపైన *బాలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *ఉ 12.51 - 02.22*
అభిజిత్ కాలం : *ప 11.57 - 12.44*
*వర్జ్యం : ఈరోజు లేదు*
*దుర్ముహూర్తం : ఉ 08.49 - 09.36 రా 11.07 - 11.56*
*రాహు కాలం :మ03.17- 04.45*
గుళికకాళం :*మ 12.21 - 01.49*
యమగండం : *ఉ 09.25 - 10.53*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *వృషభం*
సూర్యోదయం :*ఉ 06.38*
సూర్యాస్తమయం :*సా 06.21*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.29 - 08.49*
సంగవ కాలం :*08.49 - 11.10*
మధ్యాహ్న కాలం :*11.10 - 01.31*
అపరాహ్న కాలం :*మ 01.31- 03.52*
*ఆబ్ధికం తిధి :ఫాల్గుణ శుద్ధ అష్టమి*
సాయంకాలం :*సా03.52 - 06.13*
ప్రదోష కాలం :*సా 06.13 - 08.40*
రాత్రి కాలం :*రా 08.40 -11.56*
నిశీధి కాలం :*రా 11.56 - 12.45*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.50 - 05.39*
<><><><><><><><><><><><><><><>
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*
*రామరిణా కృతహృతౌ*
*జనకాత్మజాయా*
*లంకాస్థితా జనకజేతి*
*సుశోధకారిన్*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹


