14, మార్చి 2022, సోమవారం

నిమ్మకాయతో చికిత్స

 నిమ్మకాయతో చికిత్స  - 


  అజీర్ణం  ( Dyspepsia ) - 


   గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 


  మలాశయం బాధ  ( Bowel Trouble ) - 


    నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.


 స్థూలకాయం  ( Obesity ) - 


    నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు     ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.


 ముఖ సౌందర్యం  ( cosmetic ) - 


   సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు         ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 


  చలి జ్వరం  - ( Maleria ) 


     నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు        ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 


   అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.


 రక్తస్రావం  - 


    శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను.  ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen కడుపులో బల్ల పెరుగుట హరించును. 


    నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 


  దంతశుద్ధి  - 


     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది.


           మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

తంగేడు చెట్టు ఉపయోగాలు -

 తంగేడు చెట్టు ఉపయోగాలు  - 


 *  ఈ చెట్టు యొక్క వేరు కషాయం కాచుకొని తాగిన నీళ్ల విరేచనాలు తగ్గును. లేదా 4 గ్రాముల తంగేడు బెరడు నమిలి రసం మింగినా కూడా విరేచనంలో చీము వంటి పదార్థం పొవడం తగ్గుతుంది . 


 *  5ml తంగేడు చెట్టు యొక్క బెరడు రసాన్ని రోజుకి ఒకసారి చొప్పున 3 రోజులపాటు  తాగితే టాన్సిల్స్ సమస్య తొలగిపోవును .


 *  తంగేడు చెట్టు లేత ఆకు నమిలి మింగితే దగ్గు తగ్గును.


 *  తంగేడు చిగుళ్లు దంచి కడితే తేలు విషం విరిగి మంట తగ్గును. 


 *  తంగేడు లేత ఆకుతో పాటు రెండు వెల్లుల్లి రెక్కలు , రెండు మిరియాలు కలిపి మెత్తగా నూరి ముద్దచేసి ఒకే రోజున మూడు మోతాదులు పెరుగు అనుపానంతో కలిపి ఇస్తే చీముతో కూడిన విరేచనాలు తగ్గుతాయి .


 *  తంగేడు ఆకుని నీడలో ఎండించి ఆ చూర్ణాన్ని గొరువెచ్చటి నీటితో రోజు తీసుకోవడం వలన మలబద్దకం తగ్గును. 


 *  రేచీకటి తో భాదపడుతున్న వారు కోడి లేక మేక చేదుకట్టు , లివరు , మసాలా దినుసులు కలిపి మెత్తగా నూరి కోడికూర కాని మేకకూర కాని వొండుకొని తింటూ ఉంటే రేచీకటి బాధ నుంచి విముక్తం అవ్వుదురు .


 *  తంగేడు చిగుళ్లు మెత్తగా నూరి పెరుగులో కలుపుకుని పరగడుపున తాగితే నీళ్ల విరేచనాలు నశించును.


 * తంగేడు చిగుళ్లు మజ్జిగలో నూరి పాదాల మడమలు కు రాస్తే కాలిపగుళ్ళు తగ్గుతాయి. 


 *  తంగేడు చిగుళ్లు నేతితో వెచ్చచేసి కన్నులకు కట్టిన కంటి ఎరుపులు , పోట్లు నివారించును.


 *  మూత్రం బంధించి ఉన్నప్పుడు తంగేడు పువ్వులతో కషాయం పెట్టి దానియందు పంచదార చేర్చి ఇచ్చినచో మూత్రం వెంటనే బయటకి వెడలును.


 *  తంగేడు విత్తనాల చూర్ణం 3 గ్రాములు తీసుకుని దానియందు తేనే కలిపి పుచ్చుకొనిన అతిమూత్రం కట్టను. 


 *  తంగేడు పువ్వులను నీడ యందు ఎండించి చూర్ణం చేసి సమంగా పంచదార కలిపి పూటకు 2 నుంచి 3 గ్రాముల చొప్పున తీసుకున్న యెడల అతిమూత్ర వ్యాధి నివారణ అగును. 40 దినములు పాటించవలెను . 


 *   తంగేడు లేత చిగుళ్లు మాడుమీద వేసి గట్టిగా తలకు బట్ట కట్టిన యెడల తలపోటు , తలనొప్పి నయం అగును. మరియు నేత్రరోగాలు నివారించబడును . 


          మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

Wildlife

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

A man working in an IT Company 🏢 became sick... 

He consulted many Multi Specialty Hospitals 🏥... Still he couldn't get cured... 

He was sad... 


Then his wife 👩advised him "Why don't you consult a Veterinary doctor?"

   

He was shocked 😨😳... 

He screamed at her... "Are you mad... ?" 😡 


She spoke softly... "Nothing happened to me.... It is you having a problem... You wake up early in the morning 🌞 like a Cock 🐔, take half bath like a Crow 🐧 , eat something like a Monkey 🐒,  then run to office like a Race Horse 🐴🐎, you work like a Donkey 🐺,   there you scream at your juniors like a Wild Bear 🐻,   evening 🌝 you reach home and bark at us like a Dog 🐕,  then you eat like a Crocodile 🐊, 🌚 you go to bed and sleep like a Buffalo 🐃... 😴😴.......... That's the reason why I asked you to meet a Veterinary doctor..."

 

The man just sat...😇 wife asked, “*NOW why are you looking at me like an Owl...?"*


😂😀😬😂😂 Belated (03.March)

Happy World Wildlife Day 😀

'పుక్కిటి పురాణాలు

 'పుక్కిటి పురాణాలు'


*


"బాబాయ్, ఇతనే నేను చెప్పిన జనార్ధన్, షార్ట్ గా జానీ అంటారు. రిస్ట్ ఫైట్ లో ఛాంపియన్" అంటూ పరిచయం చేసాడు సత్యం తన ఫ్రెండుని, 'బాబాయ్' అని అందరితోను పిలవబడే కృష్ణమూర్తి గారికి.


"రిస్ట్ ఫైట్ అంటే?" అని అడిగారు కృష్ణమూర్తి గారు.


"అదే బాబాయ్ .... బల్లకు అటూ ఇటూ ఇద్దరు కూర్చుని అరచేతులు కలిపి నెట్టుకుంటారే .... అది" అన్నాడు సత్యం.


"ఓహో .... అలాగా? బెస్టాఫ్ లక్" అంటూ బైటకు వెళ్ళబోయారు కృష్ణమూర్తి గారు.


"బాబాయ్ ఒక్క నిముషం. నీకు నువ్వు యంగ్ అని అనుకుంటావు కదా, జానీతో ఓ పట్టు పడతావేంటి?" అని అన్నాడు సత్యం సరదాగా.


కృష్ణమూర్తి గారు నవ్వేసి "అలాగే. కానీ నాకు ఆ ఆటలోని నియమాలు తెలియవే?" అన్నారు.


"మావాడు చెబుతాడు" అన్నాడు సత్యం.


'జానీ' ఆ ఆట ఎలా ఆడాలో చెప్పాడు. 


"ఎంతసేపు అలా ఉండాలి?" అని అడిగారు కృష్ణమూర్తి గారు.


"అలా ఏమీ లేదు. మామూలుగా అయితే ఒక నిముషంలోనే వంచేయాలి లేదా చేతిని నిలువుగా నిలబెట్టగలిగితే పడగొట్టేదాకా ఆడవచ్చు" అని చెప్పాడు 'జానీ'.


"నేను సిధ్ధమే" అన్నారు కృష్ణమూర్తిగారు.


సత్యం చెక్క బల్ల సిధ్ధం చేసాడు. 


"బైటకు వెళ్తానన్న ఈయన పిల్లలతో ఏదో భేటీ వేసినట్లున్నారు' అనుకున్నారు కృష్ణమూర్తి గారి భార్య రుక్మిణిగారు.


కృష్ణమూర్తిగారికి రిస్ట్ ఫైట్ నియమాలు వివరించి చెబుతున్నాడు 'జానీ'. 


"మోచెయ్యి బల్ల మీదనుండి లేవకూడదు.


చెయ్యి శరీరంలోని ఏ భాగానికి తగలరాదు.


ఎవరి చెయ్యి వెనక్కి వంగుతుందో వాళ్ళు ఆ చేతిని ఆట మొదలైన నిముషంలోగా నిలువుగా నిలబెట్టాలి.


ఈ లోపలే చెయ్యి వెనక్కి వంగిపోయి బల్లను తాకితే ఓడిపోయినట్లు. దీనినే 'పిన్' చెయ్యడం అంటారు" అని వివరంగా చెప్పాడు 'జానీ'.


"అయితే నువ్వు మొబైల్లో టైమ్ సెట్ చెయ్యరా సత్యం" అన్నారు కృష్ణమూర్తిగారు.


"అలాగే బాబాయ్ .... నేను రెడీ .... గో అనగానే ఆట మొదలయినట్లు" అని చెప్పాడు సత్యం.


"వాఖే .... నేన్రెడీ" అన్నారు కృష్ణమూర్తిగారు, హూషారుగా.


జానీ నవ్వుకున్నాడు. 'ముసలోడు ఎగస్ట్రాలేస్తున్నాడు' అనుకున్నాడు.


ఇద్దరు తమ మోచేతులు బల్లమీద ఆనించి అరచేతులు కలిపారు.


సత్యం టైమర్ పెట్టుకుని "రెడీ .... గో" అన్నాడు.


కృష్ణమూర్తిగారికంటే ముందే 'జానీ' పట్టు బిగించాడు. 


పది .... పదకొండు .... పన్నెండు .... పదమూడు .... పధ్నాలుగు .... పదిహేను సెకన్లకల్లా కృష్ణమూర్తి గారి చెయ్యి పిన్ అయింది.


"ఎలా ఉందంకుల్?" అని అడిగాడు 'జానీ' నవ్వుతూ ....


నవ్వేసారు కృష్ణమూర్తిగారు.


"ఇంకో రౌండు వేద్దామా అంకుల్?" అని అడిగాడు 'జానీ'.


కృష్ణమూర్తిగారు "ఓకే. నేను రెడీయే .... " అనగానే మళ్ళీ సర్దుకుని కూర్చున్నారు ఇద్దరు.


మళ్ళీ ఇద్దరు తమ మోచేతులను బల్ల మీద ఆనించి అరచేతులను కలిపారు. బొటనవేళ్ళు ముడి పడ్డాయి.


అయితే ఈ సారి 'జానీ' అనుకున్నంత ఈజీగా నడవలేదు. కృష్ణమూర్తిగారి రెసిస్టెన్స్ అర్ధం కావడం లేదు 'జానీ'కి. అంత రెసిస్టెన్స్ ఉన్నవాడు తనను 'పిన్' చెయ్యకుండా ఎందుకు ఊరుకున్నారు?' అన్న ఆలోచనలో పడ్డాడు 'జానీ'.


మరుక్షణం 'జానీ' చెయ్యి 'పిన్' అయింది.


ఊహించని విధంగా తన చెయ్యి పిన్ అవడం ఛాంపియన్ అయిన 'జానీ'కి మింగుడు పడలేదు.


"బెస్టాఫ్ త్రీ వేద్దామంకుల్" అన్నాడు 'జానీ'. ఈసారి అతడి మాట దెబ్బతిన్న పులిలా ఉంది.


"బెస్టాఫ్ త్రీయేం కర్మా? బెస్టిఫ్ హండ్రెడ్ అయినా నేను రెడీయే" అన్నారు కృష్ణమూర్తిగారు.


'ఏంటి ఈయన ధైర్యం?' అర్ధం కాలేదు 'జానీ'కి. టీషర్ట్ చేతి మడత కొంచెం పైకి లాగి సిధ్ధమయ్యాడు 'జానీ'.


సత్యం "రెడీ .... గో" అన్నాడు.


మూడోసారికూడా కృష్ణమూర్తిగారు అదే టెక్నిక్ వాడుతున్నాడని అర్ధమయింది 'జానీ'కి.


పది, ఇరవై, ముప్ఫై, నలభై, యాభై సెకన్లు గడిచాయి.


యాభై ఒకటి .... యాభై రెండు ....


కృష్ణమూర్తిగారు తలెత్తి 'జానీ' చొక్కా మడత పైకెత్తిన చేతి కండలను చూసి కళ్ళెగరేసారు.


'జానీ చూపు తన చేతి కండలపై నిలిచింది. మరుక్షణం 'జానీ' చెయ్యి 'పిన్' అయింది.


2:1 


'ఛాంపియన్ అయిన తను ఆఫ్ర్టాల్ ఒక ముసలోడి చేతిలో ఓడిపోవడమా? హౌ ఈజిట్ పాజిబుల్ .... ' 


"యూ ఆర్ గ్రేట్ అంకుల్ .... " అన్నాడు 'జానీ'.


"అది నీ స్పోర్టివ్ నెస్. కానీ నువ్వు మొదటిసారి నన్ను 'పిన్' చేసావు. రెండోసారి, మూడోసారి చెయ్యలేకపోయావు. ఎందుకో తెలుసా?" అని అడిగారు కృష్ణమూర్తి.


"మీ విల్ పవర్ .... " అన్నాడు 'జానీ'.


"కాదు .... అందుకు నువ్వే కారణం" అన్నారు కృష్ణమూర్తిగారు.


"నేనా?" ఆశ్చర్యంగా అడిగాడు 'జానీ'.


"వివరంగా చెప్పు బాబాయ్" అంటూ సత్యం కూడా మొబైల్ పక్కన పడేసి స్టూలు లాక్కుని కూర్చున్నాడు.


కృష్ణమూర్తిగారు చెప్పడం మొదలుపెట్టారు.


"మొదటి రెండు సెకన్లలోనే నీ కండబలం నాకు అర్ధమయింది. అలాగే నా చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు నా చేతిని ఎక్కడ ప్రెస్ చెస్తున్నావో అర్ధమయింది. ఆ పరిస్థితిలో నేను మొండిగా వ్యవహరిస్తే నా రిస్ట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నా అంతట నేనే 'పిన్' చేసేసుకున్నాను.


రెండోసారి మన చేతులు లాక్ చేసినప్పుడు నువ్వు మొదటీసారి ఎక్కడ ప్రెస్ చేసావో ఆ ప్రాంతం నీకు అందకుండా జాగ్రత్త పడ్డాను. యాభై సెకన్లైనా నా చేతిని కనీసం వంచలేకపోయావు. కారణం, నీ బలం అంతా అఫెన్సుకే వాడావు. నేను నా బలాన్ని డిఫెన్సుకి కావలసినంత మాత్రమే వాడుతూ అవకాశం కోసం ఆగాను. అప్పుడు నీలో అసహనం మొదలయింది. అది నీ చేతిలోనే తెలిసిపోయింది. అంతే .... నాకు మిగిలిన బలాన్ని అఫెన్సుకి వాడాను. నీ చెయ్యి పిన్ అయింది.


నేను లేచి వెళ్దాం అనుకునే వేళ నువ్వు 'బెస్టాఫ్ త్రీ వేద్దాం అంకుల్" అన్నావు. అంటే నీలో ఓడిపోయానన్న భావన బాగా పాతుకుంది. ఔనా?" అని ఆగారు కృష్ణమూర్తిగారు.


"ఔనంకుల్ .... " అన్నాడు 'జానీ'.


"మూడోసారి నీవే గెలిచేవాడివి. కానీ యాభై సెకన్ల సమయంలో నీ కండలవైపు చూసి కళ్ళెగరేసాను. 


అప్పుడు ....


నీ మనసు నీ కండబలం మీద నిలిచింది. నా బలం నా మనసు మీద నిలిచింది. 


మరుక్షణం నీ చెయ్యి 'పిన్' అయింది" అంటూ ముగించారు కృష్ణమూర్తి గారు.


'జానీ' మాట్లాడలేదు. సత్యం మౌనంగా ఉన్నాడు.


మళ్ళీ కృష్ణమూర్తిగారే మాట్లాడారు.


"జానీ, ఒక విషయం గుర్తు పెట్టుకో. మన పురాణాలు పుక్కిటి పురాణాలు కావు. వాటినుండి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి" అన్నారు.


"బాబాయ్ .... బోడిగుండుకి మోకాలుకి వేసిన ముడి విప్పి అసలు విషయం చెప్పు" అన్నాడు సత్యం.


"బోడిగుండుకి మోకాలుకి ముడి కాదురా సత్యం. 


మొదటిసారి .... అతడు పట్టుకున్న పట్టు ద్వారా నా బలహీనత నాకు అర్ధం అయింది. రెండోసారి నేను 'జానీ'కి ఆ అవకాశం ఇవ్వలేదు. 


రెండోసారి .... జూదంలో మొదటిసారి గెలిచిన దుర్యోధనుడు ధర్మరాజుని మళ్ళీ జూదానికి పిలిచాడు. అంటే విజయగర్వంతో ఉన్నాడు. నువ్వు కూడా అప్పుడు అదే పరిస్థితిలో ఉన్నావు. కానీ నా నుండి ప్రతిఘటన ఊహించలేదు. అది నీ అహాన్ని దెబ్బ కొట్టింది. అహం వివేకాన్ని, విచక్షణని కప్పేస్తుంది. అదే నాకు కలసివచ్చింది.


మూడోసారి .... 'బెస్టాఫ్ త్రీ' వేద్దామా అంకుల్? అన్నావు. 


నేను 'బెస్టాఫ్ త్రీయేం కర్మా? బెస్టాఫ్ హండ్రెడైనా నేను రెడీయే' అన్నాను. అదే నువ్వు ఆలోచించుకోవలసిన సమయం. రామాయణంలో వాలి, సుగ్రీవుల యుధ్ధం గురించి విన్నావుగా? వాలి చేతిలో చావుదెబ్బ తిన్న సుగ్రీవుడు వెంటనే వాలిని యుధ్ధానికి పిలుస్తాడు. వాలి కూడా "సై' అంటాడు. కానీ తార వద్దంటుంది. 'ఇప్పుడే చావు దెబ్బ తిన్నవాడు వెంటనే మళ్ళీ యుధ్ధానికి వస్తున్నాడంటే ఆలోచించండి, అతడి వెనుక ఏ బలం ఉందో? ఏ ధైర్యం లేకపోతే అతడు మళ్ళీ మిమ్మల్ని యుధ్ధానికి పిలుస్తాడు? వెళ్ళొద్దు' అంటుంది. కానీ వాలి వినపించుకోకుండా తన కండబలం మీద నమ్మకంతో యుధ్ధానికి వచ్చాడు. పతనమైనాడు. అలాగే మూడోసారి నా బలం చాలడం లేదు అనిపించగానే నీ చేతి కండలవైపు చూసి కళ్ళెగరేసాను. నీ మనసు నీ కండబలంవైపు మళ్ళింది. నా బలం మనసు వైపు మళ్ళింది. నా శక్తినంతా నా మనసులో కేంద్రీకరించి నిన్ను పిన్ చేసేసాను" అంటూ ముగించారు కృష్ణమూర్తిగారు.


వాళ్ళిద్దరు మౌనంగా ఉండిపోయారు.


"సత్యం, నువ్వెప్పుడైనా రామాయణం కానీ భారతం కానీ చదివావా?" అని అడిగారు కృష్ణమూర్తిగారు.


"లేదు బాబాయ్ .... కానీ సినిమాల్లో చూసాను" అన్నాడు సత్యం.


"సినిమాల్లో అయినా ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, ఆయన ఆహార్యం చూసారే తప్ప ఆ కధల వెనుక ఉన్న అర్ధాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు కదా?" అని ఆగారు కృష్ణమూర్తి గారు.


ఇద్దరు మౌనంగా ఉండిపోయారు.


"సత్యం, మన పురాణాలు పుక్కిటి పురాణాలు కాదురా. వాటిలో నిగూఢమైన జీవిత సత్యాలు, విజయ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మీ తరం ఎంతసేపు పబ్బులు, సినిమాలు, డేటింగులు, చాటింగులతోనే కాలం వృధా చేస్తున్నారు. మన సాహిత్యం అనంతం. ఆయనెవరో ఇంగ్లీషాయన అన్నాడట .... భారతీయ సాహిత్యం మొత్తం కలిపినా ఇంగ్లీషు సాహిత్యంతో పోలిస్తే కాకిరెట్టతో సమానం అని. కానీ ఇంగ్లీషు సాహిత్యం మొత్తం కలిపినా భగవద్గీతలో ఒక శ్లోకంతో సమానం కాదురా. మరి ఆ భగవద్గీతే భాగంగా ఉన్న భారతం మరెంత గొప్పదై ఉండాలి? అంతకంటే ముందుదైన రామాయణం మరెంత గొప్పదై ఉండాలి? మీ యువతే ఆలోచించుకోవాలి" అంటూ లేచారు కృష్ణమూర్తిగారు 'జానీ' భుజం తట్టి.


****************************** (శుభం)


రచన : అధరాపురపు మురళీకృష్ణ, గుంటూరు

తేది : 14-03-2022

నగరాల అందమైన పేర్లు

 *మన దేశం మరియు నగరాల అసలు మరియు అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా?*


 1. హిందుస్థాన్, ఇండియా లేదా భారత్ 

అసలు పేరు - ఆర్యవర్త!

 2. కాన్పూర్ 

అసలు పేరు కన్హాపూర్.

 3. ఢిల్లీ 

అసలు పేరు ఇంద్రప్రస్థ.

 4. హైదరాబాద్ 

అసలు పేరు భాగ్యనగర్.

 5. అలహాబాద్ 

అసలు పేరు ప్రయాగ్.

 6. ఔరంగాబాద్ 

అసలు పేరు శంభాజీ నగర్.

 7. భోపాల్ 

అసలు పేరు - భోజ్‌పాల్!

 8. లక్నో 

అసలు పేరు లక్ష్మణపురి.

 9. అహ్మదాబాద్ 

అసలు పేరు కర్ణావతి.

10. ఫైజాబాద్ 

అసలు పేరు అవధ్.

11. అలీఘర్ 

అసలు పేరు హరిగఢ్.

12. మీరాజ్ 

అసలు పేరు - శివప్రదేశ్!

13. ముజఫర్‌నగర్ 

అసలు పేరు లక్ష్మీ నగర్.

14. షామ్లీ 

అసలు పేరు శ్యామాలి.

15. రోహ్తక్ 

అసలు పేరు రోహితాస్పూర్.

16. పోర్బందర్ 

అసలు పేరు సుదామపురి.

17. పాట్నా 

అసలు పేరు పాట్లీపుత్ర.

18. నాందేడ్ 

అసలు పేరు నందిగ్రామ్.

19. అజంగఢ్ 

అసలు పేరు ఆర్యగఢ్.

20. అజ్మీర్ 

అసలు పేరు అజయమేరు.

21. ఉజ్జయిని 

అసలు పేరు అవంతిక.

22. జంషెడ్‌పూర్ 

అసలు పేరు కాళీ మతి!

23. విశాఖపట్నం 

అసలు పేరు విజత్రపశ్మ.

24. గౌహతి 

అసలు పేరు ప్రాగ్జ్యోతిష్‌పురా. 

25. సుల్తాన్‌గంజ్ 

అసలు పేరు చంపానగరి.

26. బుర్హాన్‌పూర్ 

అసలు పేరు బ్రహ్మపూర్.

27. ఇండోర్ 

అసలు పేరు ఇందూర్.

28. నశ్రులగంజ్ 

అసలు పేరు - భిరుండా!

29. సోనిపట్ 

అసలు పేరు స్వర్ణప్రస్థ.

30. పానిపట్ 

అసలు పేరు పర్ణప్రస్థ.

31. బాగ్‌పత్ 

అసలు పేరు - బాగ్‌ప్రస్థ!

32. ఉస్మానాబాద్ 

అసలు పేరు ధరాశివ్ (మహారాష్ట్రలో).

33. డియోరియా 

అసలు పేరు దేవ్‌పురి.  (ఉత్తరప్రదేశ్‌లో)

34. సుల్తాన్‌పూర్ 

అసలు పేరు - కుష్భవన్‌పూర్

35. లఖింపూర్ 

అసలు పేరు లక్ష్మీపూర్.  (ఉత్తరప్రదేశ్‌లో)

36. మొరెనా 

అసలు పేరు మయూర్వన్.

37. జబల్పూర్ 

అసలు పేరు జబలిపురం

38. గుల్మార్గ్ 

అసలు పేరు గౌరీమార్గ్

39. బారాముల్లా 

అసలు పేరు వర్హముల

40. సోపోర్ 

అసలు పేరు సుయ్యపూర్

41. ముల్తాన్ 

అసలు పేరు ములాస్థాన్

42. ఇస్లామాబాద్ 

అసలు పేరు తక్షశిల

43. పెషావర్ 

అసలు పేరు పుర్షపుర

44. స్కర్డు 

అసలు పేరు స్కంద


 ఈ పేర్లన్నీ మొఘలులు మరియు బ్రిటిష్ వారిచే మార్చబడ్డాయి.......

యుక్తమైన కాలంలో విద్యుక్తంగా నిద్రించడం వలన

 శ్లోకం:☝️

*నైన యుక్తాపునర్యుఙ్త్కే*

  *నిద్రా దేహం సుఖాయుషాః l*

*నిద్రాతు సేవితా కాలే*

  *ధాతు సామ్య మతంద్రితాం ll*

*యామ ద్వయం శయానస్తు*

   *బ్రహ్మ భూతాయకల్పతే ll*


భావం: యుక్తమైన కాలంలో విద్యుక్తంగా నిద్రించడం వలన దేహానికి, మనస్సుకు సుఖమును కలిగించి ఆయువును వృద్ధిపరుస్తుంది.ప్రతి జీవికి తమ జీవితంలో మూడోవంతు నిద్రనే ఆక్రమిస్తుంది. నిద్ర అలసటను పోగొట్టి తత్ఫలితంగా ధాతువులు సమత వహించి దేహంలో ఉత్సాహం పూరిస్తుంది. కాబట్టి, నియమానుసారం నిద్రించడం ఆరోగ్యప్రదం. రాత్రికాలంలో ఎంత వేగంగా నిద్రిస్తే, ప్రాతఃకాలంలో అంతవేగంగా మేల్కొనడం వీలౌతుంది. రెండు యామములంటే 6 గంటలు క్రమం తప్పకుండా నిద్రించేవారికి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది!

వినతం నుండి విజయం వరకూ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

* శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ.*                           

                  🌷🌷🌷

వినతం నుండి విజయం వరకూ…..కథ

( వినతము-వంచబడినది) 


ఆ సువిశాలప్రాంగణాన అలుముకున్న ప్రశాంతతను భంగం చేస్తూ… కిర్రుమని శబ్దంచేస్తూ ఆ చిన్నతలుపుతీసుకుని ఆమె ఆ భవనంలోకి ప్రవేశించింది. ఆ పెద్ద భవనంలోపల విశాలమైన హాలు…మొత్తం లేతనీలి పరదాలతో… అతితక్కువ కాంతితో …ఇంచుక దూరం నుండీ వీస్తున్న సంద్రపుగాలితో...బయట చుట్టూ ఆవరించివున్న పచ్చని వృక్షవాటికతో…ఆశ్రమవాతావరణాన్ని తలపిస్తోంది!  ఇంచుమించు ఐదొందలమంది శ్రోతలతో.. ఒకేఒక శాంతగంభీర స్వరం… శ్రోతలను మంత్రముగ్దులుగా కట్టిపడేస్తూ…మంద్రమందాకినీ ఝరిలా సాగిపోతోంది. ఆ కంఠస్వరం శ్రీనారాయణానంద స్వామివారిది! 


ఆయన ప్రవచనానంతరం… ఒకరొకరుగా ఆయన పాదాలు తాకి శెలవుతీసుకుంటున్నారు! కొందరు విదేశీయులు తమ సందేహాలను ఆయన ముందుంచుతున్నారు. స్వచ్ఛమైన ఆంగ్లంలో ఆయన సందేహనివారణ చేస్తుంటే… ఆ సనాతనధర్మసర్వస్వం జాడలు తెలుసుకుంటూ వారు ముగ్దులవుతున్నారు. ముఖ్యంగా భారతీయ సమాజంలో వైవాహికవ్యవస్థ ప్రాముఖ్యత గురించి అద్భుతంగా వివరించారు స్వామి. అందరూ నిష్క్రమించాకా… అక్కడే నిలబడి ఉన్న ఆఖరివ్యక్తిని చూసి స్వామీజీ ఒక్కసారి తడబడ్డారు. మొహం ఛాయామాత్రంగా వివర్ణమయింది. “ యశోదా! నువ్వు... మీరిక్కడ? “ అంటూ నిర్వికారంగా పలకరించారు. ఆమె వినయంగా చేతులుజోడించి నమస్కరించింది. “ మీతో కాస్త మాట్లాడడాలి!  అనుమతిస్తారా? “….సందిగ్దంగా అడిగినా… దృఢంగానే అడిగిందామె. ఒక్క నిమిషం ఆలోచించి…” నా నివాసానికి పదండి.”…. అంటూ బయటకు దారి తీసారు స్వామి! 


           బయటకది పర్ణకుటీరంలా కనిపిస్తున్నా… లోపలంతా అత్యంత ఆధునికమైన సౌకర్యాలున్నాయి. ముఖ్యంగా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన లైబ్రరీగది… వేలకొలది పుస్తకాలతో! అక్కడ అతిథులకోసం కేటాయించబడిన సోఫాలలో ఆమెను కూర్చోమని సైగచేసారు స్వామీజీ! 

“ ఇప్పుడు చెప్పండమ్మా… ఏం మాట్లాడాలని వచ్చారో! “… చాలా మృదువుగా అడిగారు. 

“ ఆపండి ఈ నటనలు నారాయణరావుగారూ! మీరు సర్వసంగ పరిత్యాగులు అని చెప్పుకోడానికి అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్యను... ఇంత పరాయిగా పలకరించనక్కరలేదు. మీరు మీ గురువుగారిని అనుసరించి, ఆశ్రమం కోసం సగం ఆస్థితో మనింటి గడప దాటిననాడే ,నాకు నా తాళి బరువెంతో అర్ధమయింది.” సుమంగళి” అన్న బిరుదు తప్పా మరో హోదా, గౌరవం లేని విగతను నేను! ఈరోజు కేవలం మీరే తీర్చగల కొన్ని సమస్యలతో మీముందుకు వచ్చా. ఎందుకంటే ఇంతకన్నా నాకు మరో మార్గం లేదు”!....యశోద మాటలకు దెబ్బతిన్నట్టు చూసారు నారాయణానంద. మరోమాటకు తావివ్వకుండా… బయట వేచివున్న శిష్యుడను పిలిచి…” ఈ మాతను భోజనానికి తీసుకువెళ్ళు. సాయంత్రం నాలుగింటి వరకూ వారిని విశ్రాంతి తీసుకుని రమ్మను! “…. అంటూ పొడిగా చెప్పి.. చివ్వున లేచి లోపలకు వెళ్ళిపోయారు. భర్త నిరాదరణ అలవాటయిన విషయమే అయినా అతిథిగా కూడా తనను ఆదరించని ఆయన వైరాగ్యానికి హతాశురాలయింది యశోద! 


           భోజనానంతరం…ఆ ఆశ్రమంలో దట్టంగా పరచుకున్న ఆ వృక్షఛాయల్లో ఒక చప్టా మీద కూర్చుంది యశోద! ఎంత అతిసాధారణం తన జీవితం! ఎలాంటి సంభ్రమాలు లేవు. సంతోషాలసలు లేవు. జీవితం ఉంది కాబట్టి జీవించాలి అన్నట్టు నిర్వేదంగా! నిర్లిప్తంగా! నిశ్చల సరోవరంలో రాయివేసినట్టు… తన జీవితాన్ని ఒక్కకుదుపు కుదిపింది మూడునెలల క్రితం ఆడపడచు తనకు పంపిన ఫోటో ఆల్బమ్! ఆరోజు… ఆ తరువాత… ఆమెను అస్థిమితం చేసిన సంఘటనలన్నీ ఆమె మనోపధంలో చలనచిత్రంలా కదిలిపోతున్నాయి! 


                        ******


యశోద స్వగతం:-


అసలు మనుషులంత కుట్రలూ, దగాలూ ఎలా చెయ్యగలరూ!? తన, తమ అనే భేదం ఉండదా వారికి?

తనెప్పుడూ ఎవ్వరినీ మోసం చెయ్యలేదు. 

ప్రతీదీ తనపనే అనుకుంది. 

ప్రతీవాళ్లూ తనవారే అనుకుంది. 


కానీ ఇలా కూడా నమ్మకద్రోహాలు చేస్తారన్న సంగతి తలుచుకుంటుంటే ఒళ్లంతా మంటలు రేగిపోతున్నాయి. 


ఎన్నేళ్ల నుండో అణిగిపోయిన, ఉందో లేదో కూడా తెలీని కోపం లావాలా పొంగుకొచ్చేసింది. 


ఏం చెయ్యాలి!? ఏం చెయ్యగలదు తను! ఎంత అశక్తురాలయిపోయిందో ! 


సడన్ గా తన సవితి తల్లి లక్ష్మి గుర్తుకొచ్చింది. 


ఆమె మంచిదే. 


కానీ " అమ్మా" అని పిలవనిచ్చేది కాదు. 

“నేను కననిదే నీకు అమ్మనవను”.... అని ఖచ్చితంగా చెప్పేసేది. 


తండ్రి తనకు పదవ తరగతి అవడంతో పెళ్లి చేసేస్తానంటే , అడ్డుపడి బీ. యెస్. సీ వరకూ చదవనిచ్చింది. 

చదువయ్యాకా తనచేత బేంక్ పరిక్షలు రాయిద్దామని, లేకపోయే బీ యీడీ చేయిద్దామని నాన్నతో పోట్లాడడం తనకింకా గుర్తే! 


ఆడదానికి తనకాళ్ల మీద తను నిలబడే ఆర్ధిక స్వేచ్ఛ ఉండాలని ఎంతో వాదించింది. 


ఆరోజు తనకు నారాయణరావు సంబంధం ఒచ్చినపుడయితే , ఆమె తండ్రిమీద శివంగిలా విరుచుకుపడిపోయింది. 


రెండవ పెళ్లివాడికిచ్చి యశోద గొంతు కోయద్దని కాళ్లావేళ్లా పడింది . 


అక్కడే ఆమె మంచితనం తెలిసింది తనకు. ఆమె ముభావత లో ఉండే ఆప్యాయత తెల్సింది. 


కానీ  తండ్రికి రెండో భార్యకన్నాకూతురి బాధ్యతే పెద్దగా కనిపించి తను అనుకున్నట్టే తన పెళ్లి చేసేసాడు….  పదిహేనేళ్ళు పెద్దవాడయిన నారాయణరావుతో. 


తనకు ఇప్పటికీ అంతా కలలోలా ఉంటుంది. 


పెళ్లయి సంపన్నుల ఇంటికి కాపురం. 

లంకంత ఇల్లు, ఒంటినిండా బంగారం! ఇంటినిండా మనుషులు! 


నారాయణరావు కూతురిని తను చేరదీయాలనుకుంది. గారంగా సొంత తల్లిలా పెంచాలనుకుంది. 

కానీ ఆ పిల్లను కొన్నాళ్ళకే వాళ్ల అమ్మమ్మగారింటికి ఇచ్చేసారు. 


పెళ్లయిన ఏ కొన్నాళ్లో రావు తనతో అన్యోన్యంగా సహజీవనం చేసారు. 


అంతే! తరువాత తెలీని దూరమేదో ఇద్దరినీ పట్టి ఉంచింది. 


ఇంటికి పెద్దకొడుకుగా ఐదుగురు చెల్లిళ్ల పెళ్లి చేసి, ఆస్తిపాస్తులిచ్చి పంపారు. 


పాపం అమ్మాయిలు చాలా మంచివాళ్లు. అత్తగారయితే దేవతే. 

వాళ్ల పురుళ్లూ, పుణ్యాల మధ్యే తనూ సంతోష్ ని కన్నది. 

  

కాలంతో జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.


నారాయణరావులో రానురానూ ఆధ్యాత్మిక పోకడలు ఎక్కువయ్యాయి! 


యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేసే ఆయన, రోజూ యోగసాధన, సూర్యనమస్కారాలు, రెండు గంటల శ్రీచక్రార్చనలు, చండీ హోమాలు, నవరాత్రి పూజలు .... అంటూ విపరీతమయిన భక్తిసాధనలోకి వెళ్లిపోయారు. 


అంతంతే అయిన సంసారం ఇంక పూర్తిగా మూసుకుపోయింది. 


ఆయనకన్నీ అమర్చిపెట్టి, ఇంటినీ, పిల్లాడినీ, అత్తగారినీ సంభాళించే సరికే తనకి రోజులిట్టే తిరిగిపోయేవి. 


తనను గురించి ఆలోచించుకునే తీరికకానీ, ఇచ్ఛ కానీ మిగిలేదే కాదు. గాలివాటపు జీవితం!! 


మెల్లగా ఇల్లు ఆశ్రమంగా మారిపోతుంటే, సంతోష్ ఇంజినీరింగ్ చదువుకు హాస్టల్ కు వెళ్లిపోయాడు. 


ఎవరెవరో స్వాములు, వారి భిక్షలూ, దేవుడి భోగాలూ , ప్రవచనకర్తల రాకపోకలూ.... వీరి దర్శనార్ధం ఒచ్చే భక్తజనులు, వారి పరివారాలతో ఇల్లు తీర్ధప్రజలా ఉండేది. 


నారాయణరావు మంచి వక్త. ఆయన స్వయంగా ప్రవచనాలివ్వడమో, లేక ఇంగ్లీష్ లో భారతీయ తత్వగ్రంధాలు అనువదించడానికి ఉత్తరాదికో, విదేశాలకో వెళ్తూ ఉండేవారు.


మెల్లమెల్లగా బొత్తులతో ఉండే జమీందారీ ఆస్తిపత్రాలు చిక్కిపోతూ వచ్చాయి. 


అత్తగారే కాదుకూడదని తాముంటున్న రెండువేల గజాలలో ఉన్న పూర్వోత్రపు ఇల్లు , ఒక పెద్ద ఇంటిస్థలం తన పేరు మీదకూ మార్పించారు. 


సంతకాలు పెట్టడమే కానీ తనకే వివరాలూ తెలీదు. 


తన తండ్రి పోయాకా, పిన్ని తన కొడుకులతో ఢిల్లీ వెళిపోయే ముందు ఒచ్చి కలిసి, ఒకటే మాటంది. " యశోదా! కళ్లు మూసుకుని కూర్చోకు. కాస్త గమనించుకో ఇల్లూ వాకిలీ "... అంటూ! అప్పుడు కూడా తనకంటూ చూసుకోవాలని తెలీలేదు. 


సంతోష్ సివిల్ ఇంజినీరింగ్ చదివి, స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. 


అక్కడే తన కొలీగ్ 

సునీతను పెళ్లిచేసుకుంటానని తండ్రికి చెప్పాడు. తనకి చెప్పడం ఏనాడూ లేదు. 


అప్పటికే హిందూ ధర్మ పునరుద్ధరణలో పూర్తిగా తలమునకలయ్యున్న నారాయణరావ్ కులాంతర వివాహానికి సహజంగానే ఒప్పుకోలే! 


అత్తగారే పెద్దమనసు చేసుకుని నగానట్రా పెట్టి తనకోడల్ని ఇంట్లోకి తెచ్చారు!


సునీత గృహప్రవేశం , నారాయణరావు గారి సన్యాసాశ్రమం ఒకేరోజు జరగడం ఏమాత్రం యాధృచ్ఛికం కాదు. 


అప్పుడప్పుడే గురువుగా ఎదుగుతున్న ఒక ఆధ్యాత్మిక వేత్తకు నారాయణరావ్ గారిలాంటి జ్ఞాని సహాయం చాలా అవసరం అవడం కూడా బాగా కలిసొచ్చింది. 


తనకు మాత్రం , తమ మధ్య ఎంత దూరమున్నా తన భర్త తన పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఉండేది. 


హోమాల్లో , పూజల్లో ఆయనతో పీటలమీద కూర్చుంటే ఎంతో గర్వంగా ఉండేది. 


అలాంటిది భర్త తన వస్తువులూ, పుస్తకాలూ లారీ కెక్కించి, సన్యసించడానికి తల్లి అనుమతిని బలవంతంగా తీసుకుని, ఇల్లువిడిచి వెళ్లిపోతూ, కొడుక్కి అప్పగింతలు పెట్టి , సహధర్మచారిణి తనకేసి కన్నెత్తికూడా చూడకుండా ,నిష్క్రమించడం ఆమెకు తన జీవితంలో తను గెలుచుకున్న స్ధానమేమిటో పెద్ద ప్రశ్నార్ధకమై నిలిచింది. 


అయితే అతిత్వరలోనే సునీత తన స్థానానికి మంచి స్పష్టతిచ్చింది. 


కాశీ వెళ్లిపోయి, కొన్నాళ్ళకు అత్తగారు మహాప్రస్థానమయిపోయారు. 


ఇంటి యజమానిగా తనభర్త పడుకున్న నైఋతిమూల గది, ఇనప్పెట్టెతో సహా కొడుకు పరమయింది. 


అయినా తనకేనాడూ ఆ ఇనప్పెట్టెతో పని పడలేదు. ఏ ఫంక్షనొచ్చినా అత్తగారు “ ఇవి వేసుకో” అని ఇవ్వడం, తను వేసుకుని తిరిగి ఇచ్చేయడమే! అప్పుడెప్పుడో... కౌలు డబ్బులతో అత్తగారు తనకంటూ ...ఆమె ఒక కాసులపేరు, డజన్ గాజులూ చేయించడం మటుకు తెలుసు. 


"అయినా నాభర్తే సన్యసించాక నేనేమి పెట్టుకుతిరుగుతానులే ".......అని తనే పెద్దగా నగలు పెట్టుకునేది కాదు. 

అత్తగారు అనేవారెప్పుడూ ," వెండి, బంగారాలు పాడుచేసుకోకూడదు. అక్కరకొస్తాయని. " !!


ఆ వెండిబంగారాలే ఆరోజు గుండెలో మంటనెగదోసాయి తనకి……….


మనసు చంపుకుని, ఆత్మాభిమానం అణుచుకుని కొడుకు నీడలో బ్రతుకుతోంది తను. 


పదిహేనేళ్లలో ఎన్ని మార్పులో తెచ్చారా ఇంటికి!!


 ఇంట్లో పెద్దల ఫోటోలు మాయమయ్యాయి. 


దేవతార్చన ...దేవుడిగది నుండి వంటింటి గూటికి చేరింది. 


పండగలు మారాయి. 


కొత్తచుట్టాలు బయలుదేరారు. 


ఇంటి ఆడపిల్లలను పిలిచే వారే లేరు! 


ఇంటి యజమానిరాలి నుండి ...ఆ ఇంటి వంటకు, పిల్లలను సాకడానికీ పనికొచ్చే మనిషిగా తనను దిగజార్చారు! అయినా తనెవరికోసం చేస్తోంది? తనవాళ్లేగా! అలాగే అనుకుంది ఇన్నాళ్లూ! "


మనవలిద్దరూ డబ్బుపట్టినట్టు ఉంటారు. 

ఇంటివంట కిట్టదు. నానమ్మనోలాగా, అమ్మమ్మనోలాగా చూడడం అలవాటు చేసుకున్నారు! 


అదనంగా పట్టలేనంత నోటిజోరు! 


పదేళ్లవరకూ వాళ్ల ఆరోగ్యాలు చూసి, అన్నాలు పెట్టి, అఆ లనుండి అవసరమైన పునాది చదువు చెప్పిన తనంటే ...వాళ్లకేమీ ప్రత్యేక ప్రేమ లేదు! 


తన అవసరాలూ, ఆరోగ్యాలు ఎవరికి పడతాయి? కొడుకుకి తను ఆ ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్లో ఒకటి!! 


మూడేళ్ల క్రితం సంతోష్ తన ఉద్యోగం రిజైన్ చేసి, రియల్ ఎస్టేట్ లోకి వెళ్లాడు. మొదలుపెట్టిన కొన్నాళ్ళకే" బిజినెస్ లో పెద్దగా రాణింలేకపోతున్నానమ్మా!"..... అనడం మొదలుపెట్టాడు! 


తను ఒకరోజు ఆడపడచు కూతురు పెళ్లికెళ్లాలి. బీరువాలో నగలు కావాలని అడిగింది కొడుకును. 


అప్పుడు చెప్పాడు ...అప్పులవాళ్లు మీద పడడంతో నగలు , వెండిసామానంతా అమ్మాల్సి వచ్చిందని. 


మనస్సంత చివుక్కుమందో తనకి! తన బంగారం అమ్ముతూ తనకు ఒక్కమాట కూడా చెప్పలేదు కదా అని. 


సునీత మాత్రం రోజూ వంటిమీద వందగ్రాములు తగ్గకుండా వేసినవి వెయ్యకుండా వేసుకుని తిరుగుతూనే వుంది. 


అయినా సంభాళించుకుంది తను… పాపం వాడికి ఎంత కష్టమొచ్చిందో కదా ! భార్యని అడగలేక అమ్మ వస్తువులు వాడుకున్నాడు అని! 


కానీ ఈరోజు ఊళ్లోనే ఉండే ఆఖరాడపడుచు సీత తన కళ్లు తెరిపించింది. హెచ్చరించింది! 


సీత తనకు ఇచ్చిన పెద్ద కవర్ అక్కడే పడుంది. దానిని తెరవాలని లేకపోయినా ద్రోహం తాలూకు రంగు, రూపూ ఎలా ఉంటాయో ఇంకోసారి చూడాలనిపించింది. 


పెద్ద పెద్ద ఫోటోలు! కంప్యూటర్ లో కాపీలు తీసిందట సీత! 


"సునీతా పారడైజ్" 


అత్యంత ఆధునాతనమైన అపార్ట్ మెంట్! బిల్డర్ సంతోష్.....! 


ఐదవ అంతస్థు ....పెంట్ హౌజ్ ....ఓనర్ సునీతాకుమారి. 


అద్దె లక్ష రూపాయలు. ఏదో కంపెనీకి గెస్ట్ హౌస్ కిచ్చినట్టున్నారు. 


సీత మరిది ఆ కంపెనీ ఎమ్ డీ! అందుకే సీతకు అన్ని వివరాలూ తెలిసాయి!


ఆ ఫర్నిష్ట్ అపార్ట్ మెంట్ లో...లోపలంతా అత్యంత ఖరీదయిన ఫర్నిచర్, ఇంటీరియర్స్! 


సెల్లార్ లో రెండు కారు పార్కింగుల్లో సరికొత్త ఇన్నోవా, టయోటా కారులు! వెనక తన మనవల పేర్లతో! తన ఇంటి పోర్టికోలో పార్క్ చేసున్నసంతోష్ తిరిగే పాత స్విఫ్ట్ కారు తనని వెక్కిరిస్తోంది…..” ఎంత పిచ్చిదానివే” అంటూ! 


నగరంలోనే అత్యంత ఖరీదయిన ఏరియాలో..... తన అత్తగారుతన పేరు మీద.. కొని ఇచ్చిన స్థలంలో ,కట్టబడ్డ అపార్ట్ మెంట్ అది. 


ఆ స్థలం కాగితాలు తనేమీ సందీప్ కి ఇవ్వలేదే! తన సంతకాలు ఫోర్జరీ చేసుండాలి! 


అంతకన్నా ఘోరం.!సునీత… ఫేస్ బుక్ లో రెండు నెలల క్రితం పెట్టిన ఆ ఇంటి గృహప్రవేశం ఫోటోలు! 


గృహప్రవేశం చేసుకుంటూ! సునీత,మనవరాలు రియా ..చుట్టాలందరి మధ్యలో ప్రత్యేకంగా వెలిగిపోతూ....... వంటినిండా తన నగలు దిగేసుకుని! తనకి తెలుసు తన నగలేవో! తనకెంతో ఇష్టమైన ఆ నగలు! ఎప్పుడూ తనివితీరా ధరించలేకపోయిన నగలు! సంతోష్ అమ్మేసానన్న నగలు! 


అక్కడసునీత బంధువులున్నారు, వారిద్దరి స్నేహితులున్నారు. లేనిది " తనొక్కతే!" !!


ఆఖరి ఫోటో చూసేసరికి తనకు పళ్లు పటపటలాడాయి కోపంతో! 


అపార్ట మెంట్ పక్కన తన తరువాతి వెంచర్ ప్రకటిస్తూసంతోష్ పెట్టిన బోర్డు, అపార్ట్ మెంట్స్ ప్లాన్ ! సైట్ అడ్రస్...... ప్రస్థుతం తాము ఉంటున్న ,తన పేరిట అత్తగారు పెట్టిన ..తనిల్లు! 


అంటే అతి తొందరలో ఈ ఇల్లు కూడా "సునీతా బిల్డర్స్ " పాలవుతుందన్నమాట! 

ఈ ఒక్కటయినా నిలుపుకోవాలి. 

చాలీ వంచన! 

కానీ ఏం చెయ్యగలదు తను! 

పట్టుమని పది రూపాయలు లేవు చేతిలో! 

కానీ ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి. 


ఎల్ టీ సీ మీద నలుగురూ నెలరోజులు నార్త్ ఇండియీ ట్రిప్ కు వెళ్తున్నామని చెప్పి ముందురోజే వెళ్లారు! 


ఫోన్ మోగింది! సీత!


"ఒదినా! రెడీగా ఉన్నావా? డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తా! ఆ హైపర్ అసిడిటీ ఏంటో చూపిద్దాం"


————————————————————


సీతతో డా. సరోజ దగ్దరకెళ్లి , చూపించుకుని, మందులు కొనడానికి మెడికల్ షాప్ దగ్గరకెళ్లారు! 


" హాయ్ సీతత్తా!" 


 ఇద్దరూ గిరుక్కున తిరిగి చూసారు! ఒక అందమైన అమ్మాయి, ఇద్దరు టీనేజ్ కూతుళ్లతో! 


ఎందుకో ఆ మొహం చిరపరిచితంగా ఉంది. తెలుపు మీద నలుపుపూల ప్యూర్ శిల్క్ చీరకట్టుకుని ఉంది. 

చెవులకు చిన్న రవ్వల కమ్మలు. మెడలో సన్నగొలుసూ. 

మరే ఆభరణాలు లేకపోయినా రాకుమారిలా ఉంది ఆమె. 


" అరే! సంజూ! బంగారీ! ఎన్నాళ్లయిందే నిన్ను చూసీ....." అంటూ సీత గట్టిగా కావలించుకుని. 

" నీ కూతుళ్లా! ఎంత పెద్దవాళ్లయిపోయారే...." అంటూ వాళ్లనూ పొదివి తీసుకుంది. 


తనకేసి ప్రశ్నార్ధకంగా చూస్తున్న ఆమెతో సీత,

" సంజూ! వదిన! మీ నాన్నగారి భార్య"… అంటూ పరిచయం చేసింది! 


ఆమె వెంటనే తన దగ్గరకొచ్చి, చెయ్యి పట్టుకుని, " నమస్తే! అమ్మా! ఎప్పటినుండో మిమ్మల్ని చూడాలని!! ఇప్పటి కయ్యింది. వీళ్లు మా అమ్మాయిలు. " ... అంటూ ఎంతో ప్రేమగా, చనువుగా పరిచయం చేసుకుంది సంజన….అచ్చం తన అత్తగారి పోలికలో...రాజసంగా ఉన్న అమ్మాయి.” అమ్మా” అన్న ఆమె పిలుపుతో తనలోమాతృభావన ఉప్పొంగిపోయింది. 

సంజన చెయ్యి తనచేతిలోకి తీసుకుని అలాగే ఉండిపోయింది కాసేపు. 


సంజూ ఆహ్వానం మీద పక్కవీధిలోనే ఉన్న తన ఇంటికెళ్లారు తనూ, సీతా! 


అందమైన ఆ గూటిలో గోరింక ఎగిరిపోయిన సంకేతంగా దండవేసుకున్న ఫోటో! 


సొంత కూతురిలా " అమ్మా! అమ్మా!" అంటూ కబుర్లు చెప్తూనే వంటచేసిన సంజూ, " అమ్మమ్మా" అంటూ నోరారా పిలుస్తూ వాళ్ల చదువులూ, సంగీతాల కబుర్లు చెప్తూ మాలిమయిపోయిన ఆమె కూతుళ్ల సమక్షంలో........ పుట్టి బుద్దెరిగిన తరవాత తనెంతో ఆనందంగా గడిపిన రోజు ఇదే అని అర్ధమయ్యింది ! 


మాటల్లో సంజూ ముందున్న సమస్య అర్ధమయింది. 


సంజనది ప్రేమవివాహం. 

పర్యవసానం… తనను అల్లారుముద్దుగా పెంచిన

అమ్మమ్మ కుటుంబం నుంచి వ్యతిరేకత. 

హాయిగా సాగిపోతున్న జీవితంలో అతని అకాలమృత్యువొక పిడుగుపాటు! 


అయినా సంజూ క్రుంగిపోకుండా.. ధైర్యంగా చిన్న స్కూల్ మొదలు పెట్టింది. తన పరిశ్రమ, నిబద్ధత వలన అది అతి త్వరలో మంచి పేరు సంపాదించుకుని, ఏడవ తరగతి వరకూ, సీబీఎస్ సీ సిలబస్ లో ఆరొందలలస్టూడెంట్స్ తో నడుస్తోంది. 


కానీ ఇప్పుడు తను స్కూల్ నడుపుతున్న బిల్డింగ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ రాబోతోంది. 


మూడు నెలల్లో బిల్డింగ్ ఖాళీ చెయ్యాలి. ఏం చెయ్యాలో తోచక ప్రెమిసెస్ కోసం ఊరంతా ఒక్కలా వెతుకుతోంది! 


ఇన్ని సమస్యలలో కూడా ఆ అమ్మాయి పెదవులపై చిరునవ్వు, మొహాన ప్రశాంతత చెరగకపోవడం చూసింది తను 


ఇంటికి తిరిగొచ్చాకా...తను నిద్రపోలేకపోయింది.


 తననుండి ఇన్ని తీసుకున్నా...విశ్వాసం లేని తన రక్తానికీ, ఏ రక్తసంబంధం లేకపోయినా ఎంతో ప్రేమ పంచిన సంజూకి మధ్య వ్యత్యాసం గురించి ఆలోచిస్తూ కూర్చుంది. 


సంజనకు మంచి జరగాలి. ఎందుకో కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అత్తగారి ఫొటోకి చెప్పుకోడం అలవాటు తనకు.ఆరాత్రి ఆమె ఫోటోముందు నిలబడి… చేతులు జోడించి, “  అత్తమ్మా! మీ పేరింటి పిల్ల! ఈ ఇంటి ఆడపిల్లగా కనీసం పసుపు, కుంకుమ కూడా మనం ఇచ్చి పంపలేదు. ఈరోజు బిడ్డ సమస్యలో ఉంది. పరిష్కారం చూపించండి"...... అనుకుని శాంత , స్వాధుమూర్తి ఆ వృద్ధురాలి మొహం చూస్తూ కళ్లు మూసుకుంది. 


ఇంతలో గోడమీద బల్లి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అరిచింది. 


ఉలిక్కిపడి గోడవేపు చూసిన తన కళ్లు గోడకే అతుక్కుపోయాయి! 


బరువుగా తాళాలగుత్తి! మధ్యలో ఠీవిగా సంతోష్ పడగ్గదిలో ఉండే ఇంటి ఇనప్పెట్టె  తాళం. 


ఉరుములూ, మెరుపులూ ఒస్తే తన గదిలో కంప్యూటర్, టీవీ కనెక్షన్లు తీసేయమని  , అప్పుడెప్పుడో సంతోష్ ఇచ్చిన డూప్లికేట్ తాళాల గుత్తి! 


"గదితలుపులు తెరిచి… ఒకసారి ఇనప్పెట్టెలో చూస్తే పోలేదా...ఏం మిగిల్చాడో! సంస్కారం కాదు నిజమే! కానీ అలాంటి మంచి వ్యవహారం ..అవతలి వారు సంస్కారవంతులయితేనే కదా వర్తిస్తుంది! "… తనలో ముప్పిరిగొన్న భావసంచలనం!  


"నమ్మకద్రోహానికి నమ్మకద్రోహమే విరుగుడు! సహనం అంచులు దాటించేసారు తనని. పేగుబంధాలన్నీ నిలబెట్టుకున్నన్నాళ్లే! పాశం తెంపుకుంటే తల్లెవరు? బిడ్డెవరూ? చూపించి తీరాలి నేనేంటో! ఎంత ఖర్చయినా సరే!"....స్వాభిమానం పొంగుకొస్తుంటే…  సాలోచనగా, తన పెళ్ళిలో పెట్టిన తన చెవులకున్న  అత్యంత విలువైన ,బ్లూ జాగరీ వజ్రాల కమ్మలు తడుముకుంది!!


———————————————————


ఆ మరుసటి వారం రోజులూ తన జీవితంలోనే సాహసోపేతమైన, స్వేచ్ఛా దినాలు! 


అదృష్టవశాత్తూ ఇంకా చేతులు మారని ఇంటి పత్రాలూ, అత్తగారిచ్చిన దంతం పెట్లో భద్రంగా దొరికిన తన నగలను సీత సాయంతో బేంక్ లో తనఖా పెట్టి లోన్ కు అప్లయి చేసింది. 


సంజనను పిలిచింది. 


స్కూల్ ప్లాన్ ఇమ్మంది. 


సంజూకి తెలిసిన బిల్డర్ తో మూడు నెలల్లో తమ మేడను స్కూలుకనుగుణంగాచేసి,పైన మరో రెండు అంతస్థులు లేపి, విశాలమయిన స్కూల్ భవంతి తయారయ్యేట్టు, , విశాలమైన ఖాళీస్థలమంతా పిల్లల ఆటలకు కేటాయించేట్టూ ప్లాన్ చేసారు! 


సీతభర్త సలహా మీద, లాయర్ ద్వారా కట్టబోయే స్కూల్ లో తను ముఖ్యభాగస్వామిగా డీడ్ రాయించారు.


తమ ఇంట్లో ఉన్న విలువయిన రోజే వుడ్ ఏంటిక్ ఫర్నిచర్ అంతా అమ్మడానికి ఆమధ్య సంతోష్ పార్టీలు మాట్లాడి పెట్టుకున్నాడు. 


ఖర్మకాలి ఆ నంబర్ల కాయితం తల్లికిచ్చి , వాళ్లు ఫోన్ చేస్తే ఏంచెప్పాలో, ఎంత చెప్పాలో చెప్పి ఉన్నాడు! 


తను… ఇదే అదననుకుని చాలా మంచి రేటుకు ఇంట్లో ఉన్న ఏంటిక్ ఫర్నిచర్ అమ్మేసింది! డబ్బు తనపేరున వేసుకుంది.


ఎదురింట్లో ఒక ఫ్లాటు అద్దెకు తీసుకుని సంతోష్ కుటుంబానికి సంబంధించిన సామానంతా పేక్ చేయించి పెట్టేసింది. 


తను అవుట్ హవుస్ బాగుచేయించుకుని అక్కడకు మారిపోయింది. 


బలాన్ని కూడగట్టుకుని తను ధైర్యంగా నటిస్తోందే కానీ లోలోపన ఆమెకు ఒణుకుగానే ఉంది….కొడుకు తిరిగొచ్చి చెయ్యబోయే వీరంగానికి. 

కొడుకు కోపం, దుర్మార్గం తనకెరుకే! 


పగ పడితే ఎంత దూరం వెళ్లగలడో , ఎంత తెగిస్తాడో గతంలో కొన్ని సంఘటనలు చూసి ఉంది కూడా! 


సునీత ఇద్దరుఅన్నలు, బావ గవర్నమెంట్ లో చాలా పెద్ద పదవుల్లో ఉన్నారు. తండ్రి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్!చాలా బలగం ఉన్నవారు! 


ఇన్ని వ్యతిరేకబలాలకు తను ఎదురీదగలదా! తనంటే ప్రాణాలకు తెగించింది. కానీ సంజనను కూడా లాగింది. ఏం చెయ్యాలి. సీత, ఆమెభర్త మోరల్ సపోర్ట్ ఇస్తారు కానీ, పూర్తిగా నిలబడతారా?


తన భయాలు నిజం చేస్తూ ఇరవై రోజులకే , ఉప్పంది పరిగెట్టుకొచ్చాడు సంతోష్ కుటుంబంతో! 


ఖాళీ ఇల్లు, ఇంటా బయటా కూలీలు, చుట్టూ కన్ స్ట్రక్షన్ జరుగుతున్న దాఖలాగా నిలబెట్టిన సరుగుడు కర్రలు, ఇంటిముందు ఇసుక, ఇటుకలు.......కాంక్తీట్ మిక్సింగ్ మిషన్ అతనికందిన సమాచారాన్ని ధృవపరుస్తూ! 


సునీత అప్పటికే ఫోన్ తీసి తనవాళ్లకు సమాచారమిస్తోంది. 


పిల్లలు " మా గదులేవి? మా సామాన్లేవి"" అంటూ ఏడుపు లంఘించుకున్నారు. 


సంతోష్ శివాలెత్తుతూ, అక్కడ సపోర్ట్ కోసం పెట్టబడ్డ కర్రలను కాళ్లతో బలవంతంగా తంతూ పడేస్తున్నాడు. 


కాంట్రాక్టర్ అడ్డుపడి , అవుట్ హవుస్ లో ఉన్న తన దగగరకు పరిగెట్టుకొచ్చాడు.సంతోష్ కూడా వెంబడే వెళ్లి, బయటకొస్తున్న తనను చూసాడు. 


 గజగజలాడిపోయింది కొడుకు ఉగ్రరూపం చూసి. ఏదో అనబోతోంది.... అంతే.....


"దొంగ ..... ***! ఎంత పనిచేసావే !" .... అంటూ


...... జుట్టు పట్టుకుని హాల్లోకి ఈడ్చుకొచ్చాడు. 


కిందపడేసి తన్నడం మొదలు పెట్టాడు. 


కాంట్రాక్టర్ సంజనకు కాల్ చేసి, పనివాళ్ల సాయంతో సంతోష్ ను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు. 


సంతోష్ కొడుకు అడ్డుపడుతున్న పనివాళ్లని కర్రతో కొడుతున్నాడు. 


సునీత...ఇంకాస్త ఎక్కిస్తూ, " తన్ను రాస్కెల్ ను. డోంట్ లీవ్ దిస్ బ్లడీ వుమన్! చీట్! థీఫ్!" అంటూ అరుస్తోంది.


ఈలోపున సంజన తన స్కూల్ లో పనిచేసే నలుగురు మాస్టర్లతో అక్కడకి వచ్చింది. 


సంతోష్ తనను వదలి దుర్భాషలాడుతూ , సంజూ మీద కలబడ్డాడు. 


ఆఖరికి ఇరుగూపొరుగూ మూగడంతో మర్నాడు చూసుకుందామంటూ, తమసామాన్లు పెట్టిన ఫ్లాటుకి వెళ్లిపోయారు. 


ఇనప్పెట్టె కూడా అక్కడే ఉండడంతో, గబగబా తెరిచిచూసి, ఇంటిపత్రాలు, తన నగలూ తప్పా మిగిలినవన్నీ యధాతధంగా ఉండడం చూసి నిప్పులు చెరిగాడు. 


సాయంత్రం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనమీద దొంగతనం ఆరోపణ, తన భార్యను దూషించి,తమను రక్తాలోడేట్టు కొట్టించారని రిపోర్ట్ చేసాడు! 


బావమరుదులతో మాట్లాడి తమను బెదరగొట్టాలో ప్లాన్ చేసుకుంటున్నాడు.


సంజనకు పరిస్థితి తీవ్రత అర్ధమయింది. 


తనను తీసుకుని తన మేనమామలను కలిసింది. తమకిష్టంలేని పెళ్లి చేసుకుని దూరమయిన మేనకోడలు ...మళ్లీ వెతుక్కురావడం వాళ్లకి మహదానందమయింది. 


క్రిమినల్ లాయరయిన పెద్దమేనమామ సంతోష్ ను ఎదురుకోడానికి రంగం సిద్ధం చేసాడు. 

దాని పర్యవసనమే తను ఈ రోజు నారాయణానందస్వామి ఆశ్రమానికి శరణువేడుతూ సాయం అర్ధించడానికి వచ్చింది! 


                     *********


దాదాపు నాలుగుగంటల సమయానికి స్వామినుండి పిలుపు వచ్చింది ఆమెకు. ఈసారి కాస్త ఆప్యాయత ధ్వనించింది ఆయనగొంతులో. ఆ చిన్నపాటి ఆదరణకే కన్నీరుమున్నీరయింది యశోద. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది! 


“ ఎప్పటికయినా వాడి పంచనే రక్షణ పొందవలసిన దానివి. ఇప్పుడు “ నాదీ” అంటూ ఆస్థులకోసం పోరాటం అవసరమా” అని అడిగారాయన. ఆమె అహం దెబ్బతింది. జేవురించిన మొహంతో….


“ నిజమే!నా బ్రతుకంతా ఒకరి అండలోనే బతకాలి కదా! మర్చపోయాను! సంపన్నులింట మెట్టి… నేనెంత ఐశ్వర్యం అనుభవించానో మీకు తెలియదా! నాతిచరామి అంటూ వేలుపట్టుకుని మీరెంత రక్షణనిచ్చారు నాకు? నాకు ఆ ఆస్థికావాలి. బిడ్డతో కలిసి…. నా అత్తమామల పేరిట ఏదయినా సత్కార్యం చేసి… వారి పేర్లు నిలబెట్టాలి. అంతకు మించి తాపత్రయం లేదు. సంతోష్ కు వారసత్వంగా చాలానే సంపద దొరికింది. ఈ ఇంటికోడలిగా అత్తగారు నాకోసం ఇచ్చిన ఈ ఆస్థి నాకు కావాలి. మీ దగ్గర ఒరిజినల్ దస్తావేజులు, మీ అమ్మగారి వీలునామా అసలూ ఉన్నాయి. నాకు దయచేయించండి! మళ్ళీ మీగుమ్మం ఎక్కే సాహసం చెయ్యనని మాటిస్తున్నా! “….కంఠం దుఃఖంతో గద్గదమౌతుంటే ఆమె అర్ధిస్తోంది! 


         ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళిపోయిన భర్తకేసి వెర్రిదానిలా చూస్తూ ఉండిపోయింది యశోద.చేసేదిలేక తిరిగి వెళ్దామని లేచింది.ఆశ్రమం బయట ఉన్న పెద్దగేటు తెరుచుకుని ,బయటకు అడుగుపెట్టింది. “ హు! మనసుకు గేట్లు, గోడలూ కట్టుకుని తాళాలేసుకున్న కఠినహృదయులు! పైకి మాత్రం దైవజ్ఞులు”… అంటూ విరక్తిగా నవ్వుకుంది. ఇంతలో దూరం నుంచీ పరిగెట్టుకొస్తూ... ఆయన శిష్యుడు... ఆమెను ఆగమని అరుస్తూ! ఆ కుర్రాడు ప్లాస్టిక్ కవర్లో పెట్టిన కాగితాల కట్ట ఆమె చేతిలో పెట్టి… నమస్కరించి వెళ్ళిపోయాడు. “ ఆస్థి దస్తావేజులు” అవి!!!


ఆ మర్నాటి నుంచి అసలు సిసలయిన న్యాయపోరాటం మొదలైంది. 


బీహార్ నుండి మనుషులను తెప్పించి వేధించడం మొదలుపెట్టారు... సంతోష్ బృందం! 


లంచం దండిగా అందిన ఇన్స్పెక్టర్ అరెస్ట్ వారెంట్ తో వచ్చాడు. 


కానీ సంజూ మేనమామ ఏంటిసిపేటరీ బెయిల్ తో వెంటనే యశోదనూ, సంజననూ బయటకు తెచ్చారు . 


కోర్టులో తన తాతగారి ప్రోపర్టీ క్లెయిమ్ చేస్తూ సంతోష్ వేసిన దావా నిలబడలేదు. 


నారాయణరావు ఇచ్చినతన తండ్రి వీలునామాలో , ఆ ఇల్లూ, స్థలమూ తన తల్లి పేరిట రిజిస్టర్ అయ్యి ఉండగా,ఆయన తల్లి సరస్వతమ్మ గారి వీలునామా ప్రకారం కోడలుకు ఆ రెండు ఆస్థులూ బహుమతిగా రిజస్టర్ చేయించినట్టు స్పష్టంగా ఉంది. 


పైగా పెద్దామె తన కూతుళ్లకిచ్చిన బంగారంతో పాటూ, కోడలికి ఇచ్చిన మూడొందల తులాల బంగారంనగల తాలూకు వివరాలన్నీ పూసగుచ్చినట్టు ఉండడంతో యశోదపై పెట్టిన కేసులన్నీ వీగిపోయాయి


అనూహ్యంగా... సునీత తల్లితండ్రులు కూతురికీ, అల్లుడికీ ఎదురుతిరిగారు. 


అల్లుడూ, కూతురూ తప్పుడు రిపోర్టు ఇచ్చారని,, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తాము...వారి మోసానికి మద్దతివ్వలేమని, కూతురి అత్తగారు తమని ఎంత ఆదరించిందో చెప్పి , అలాంటి సాత్వికురాలి మీద తప్పుడు సాక్షాలు ఇవ్వమని...నిక్కచ్చిగా చెప్పడంతో కేసు పలుచనయిపోయింది.


యశోదకు ఇంచుమించు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. 


సంతోష్ తన ప్రయత్నాలు మానలేదు. 


అయితే అతనికిప్పుడు సునీత కుటుంబం నుండి,లా అండ్ ఆర్డర్ డిపార్ట్ మెంట్ నుండీ ఎలాంటి సపోర్ట్ దొరకడం లేదు. 


యశోద, సంజనా పూర్తి స్వతంత్రులయ్యారు. సంతోష్ చివరకు ఒక్కటే మాటన్నాడు తల్లితో......


" నిన్ను తల్లివి అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నా! మాతృత్వానికే మచ్చతెచ్చావ్!....." అని! 


మళ్లీ మరోసారి యశోద గుండెలో మంటరేగింది. కానీ ఈసారి అది కేవలం అసిడిటీ మంటే. ఆమెలోని మాతృత్వం ఎప్పుడో కరుడు కట్టేసింది. 


ఆరు నెలల తరువాత నగరం నడిబొడ్డున  " సరస్వతీ రంగారావు స్మారక విద్యానికేతన్" ప్రారంభం అత్యంత ఘనంగా జరిగింది. 


నగరంలోని ప్రముఖవిద్యావేత్తలూ, నాయకులూ, పురప్రముఖుల మధ్య ప్రారంభోత్సవం జరిపారు.


ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే నిలువెత్తు చిత్రపటాలలో వెలిగిపోతున్న శ్రీ రంగారావుగారు, శ్రీమతి సరస్వతీదేవికి ......తన తల్లితండ్రులకు .....పువ్వులతో నివాళులర్పిస్తూ, .......సర్వసంగ పరిత్యాగి...సద్గురు శ్రీనారాయణానందస్వామి ముకుళితహస్తాలతో… కన్నీళ్ళ పర్యంతంగా నిలబడిపోయారు! 

 

ఒక పక్క కూతురునీ, మనవరాళ్లనూ గర్వంగా పొదువుకొని ఎంతో ఎదిగిపోయినట్టు కనిపిస్తున్న "యశోద”…. గౌతమబుద్ధుడిలా తను పరిత్యజించి వదలిపోయిన “ యశోధర”!!! తను సన్యసిస్తూ వెనుతిరిగి కూడా చూడని తన భార్య!!!ఈరోజు సాధికారంగా…సబలగా…సాధీరలా!!స్వావలంబనతో! జీవనపోరాటంలో గెలిచిన విజేతలా! 


ఆ పక్కనే క్రీడా మైదానంలో బారులు తీరిన పాలపిట్టల్లా, " ఎస్ ఆర్ ఎన్" పాఠశాల ఐడెంటిటీ కార్డ్ లు మెడలో గర్వంగా తగిలించుకుని క్రమశిక్షణతో నిలబడ్డ భావిభారతపౌరులు!! 


 *శశికళ ఓలేటి.* 

🌺🌺🙏

ప్రత్యంగిరా సాధన -

 🔥ప్రత్యంగిరా సాధన -

      ఒక సవాలు విద్య


✴️ప్రత్యంగిరా సాధన అనేది జనాదరణ పొందిన, శక్తివంతమైన మరియు అత్యంత కష్టతరమైన విద్యాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని దక్షణాచారాలలోగాని, వామాచారాలలోగాని ఆచరించవచ్చు. సాధన యొక్క అసలు ప్రక్రియ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే, ఈ దేవి యొక్క సాధనను వర్ణించే సాహిత్యం రికార్డ్ చేయబడింది. ప్రత్యంగిరా యొక్క వివిధ రూపాలు మరియు సుమారు 64 క్రుత్యాలు ఉన్నాయి. ఒక్కో రూపానికి సంబంధించిన ఉపాసన మారుతూ ఉంటుంది.


సాధన చేసేటప్పుడు కఠినమైన నియమాలను పాటించడం అవసరం.


💥ఒక భక్తుడు సాధారణంగా ప్రత్యంగిరా కవచం, స్తోత్రాలు మరియు దైవిక దేవి యొక్క కరుణ కోసం మంత్రాలను పఠించవచ్చు. ప్రత్యంగిరా సాధన అనేది విద్యలలో అత్యంత వేగవంతమైనది మరియు శక్తివంతమైనది అని మంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది సుదర్శనాస్త్రం లేదా కార్తవీర్యార్జున విద్యల ద్వారా చేసిన ప్రయోగాలన్నింటినీ తొలగించగలిగేంత శక్తివంతమైనది.


💥 సాధారణంగా, దేవిని భక్తుడికి మేలు చేయడానికి లేదా శత్రువులను నాశనం చేయడానికి కూడా పిలుస్తారు. ఇటీవలి కాలంలో, ప్రత్యంగిర హోమం, పూజలు మరియు సాధనలు ప్రధానంగా దక్షిణ భారతదేశంలో తిరిగి పుంజుకుంటున్నాయి. అదే సమయంలో,  పూజల కోసం అనేక ప్రత్యేక దేవాలయాలు కూడా స్థాపించబడ్డాయి.


 ✴️శ్రీ ప్రత్యంగిర సాధన రహస్యాలు

అష్టమి, దశమి, చతుర్దశి రోజులలో విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఈ రోజుల్లో ఆదివారాలు వస్తే, శరభేశ్వరుని అభిషేకానికి ముందు రాహుకాలంలో ప్రత్యంగిరా దేవికి అభిషేకం చేస్తారు.


💥ప్రత్యంగిరా దేవికి ఇష్టమైన ఆహారాలు క్రిందివి:


పానకం (శుద్ధమైన నీటిలో బెల్లం చూర్ణం, ఏలకులు, ఎండిన అల్లంతో రుచిగా ఉంటుంది)


పారుప్పు-వెల్లం పాయసం (కదలై పరుప్పు, పైతం పరుప్పు, బెల్లం, కొబ్బరి మరియు స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తారు)


ఉలుండు వడై


ఎల్లు ఉరుండై


ఎర్ర అరటి (చెవ్వజై పజం)


దానిమ్మ


క్రిందివి ప్రత్యంగిరా దేవికి ఇష్టమైన రంగులు (చీరల కోసం):


ముదురు ఎరుపు (శాంత ప్రత్యంగిరా & ఉగ్రహ ప్రత్యంగిరా ఇష్టపడతారు)


పర్పుల్ (శాంత ప్రత్యంగిరా ఇష్టపడేది)


పసుపు (శాంత ప్రత్యంగిరా ఇష్టపడేది)


నలుపు (ఉగ్రహ ప్రత్యంగిరా ఇష్టపడేది)


ప్రత్యంగిర అమ్మన్ కోసం పూజ కోసం క్రింది ప్రత్యేక రోజులు:


అమావాస్య


అష్టమి

ఆదివారం

మంగళవారం

శుక్రవారం


🪔ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమయిన తీరిపోతుంది...

 

 

✴️మనుషులకు ఆపద వచ్చినప్పుడు దేవుడు వేర్వేరు అవతారాలలో వారిని ఆదకుంటాడు. అమ్మవారు కూడా అంతే! భక్తుడి పరిస్థితిని బట్టి ఒకోసారి శాంతమూర్తిగా అవతరిస్తే, మరోసారి ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. అలాంటి అమ్మవారి అవతారాలలో ప్రత్యంగిరాదేవి ఒకరు.


✴️పూర్వం హిరణ్యకశిపుడిని చంపేందుకు, విష్ణువు నరసింహస్వామిగా అవతరించిన విషయం తెలిసిందే. హిరణ్యకశిపుడిని తన గోళ్లతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదట. దాంతో శివుడు, శరభేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడించి... ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మవారు- శూలిని, మహాప్రత్యంగిర అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిరా, అంగీరసుడు అనే ఇద్దరు రుషులు దర్శించారట. అందుకనే ఆ ఇద్దరి పేర్లతో ఈమెను ప్రత్యంగిరా అని పిలుస్తుంటారు.


✴️ప్రత్యంగిరా అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది. ఎవరైతే మనకి హాని తలపెడతారో, వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్టశక్తులు పీడిస్తున్నయని భయపడుతున్నవారు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా మన మీద పనిచేయదు.


✴️ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంబల హోమం. ఈ హోమాన్ని చేసినవాళ్లు ఎలాంటి విజయాన్నయినా అందుకుంటారట. అందుకనే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు. ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగిరావలసి వచ్చింది.

 ✴️కుంభకోణంలో ఉన్న ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు. ఇందుకోసం పళ్లు, కాయగూరలు, పట్టుచీరలు, ఎండుమిర్చిలాంటి 108 రకాల వస్తువులను ఉపయోగించడం విశేషం.

✴️ హోమంలో ఎండుమిర్చి వేసినా, దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియకపోవడం ఓ వింత.

ప్రత్యంగిరా మాతకు సంబంధించి ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. ఆమెను అమ్మవారి సప్తమాతృకలు అంటే ఏడు అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతిగా భావిస్తారు. అందుకే ఆమెను అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి, ఆమెకు నారసింహి అన్న పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు... ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు. అయితే ప్రత్యంగిరా దేవి చాలా ఉగ్రస్వరూపిణి. ఆమెని పూజించేటప్పుడు మద్యపానం చేయడం, మాంసాహారం తినడంలాంటి పనులు చేయకూడదు. వీలైనంతవరకు పెద్దలని సంప్రదించి, వారి సలహా మేరకు ప్రత్యంగిరాదేవిని పూజించాలి.


✴️శ్రీ శ్రీ శ్రీ భరద్వాజానంద భారతీస్వామి వారి ఆశీస్సులుతో

కుంచపర్తి ఆశ్రమంలో »»ప్రతీ అమావాస్యకూ సాక్షాత్తు ప్రత్యంగిరా అమ్మ వారి గుడి ఎదురుగా (హోమగుండంలో) మహా ప్రత్యంగిరా హోమం జరుగుతుంది... హోమం చేయించదులుచుకొనేవారు 

మరియు మంత్ర, తంత్ర, యంత్ర, పూజాది క్రతువుల గురించి ఈ క్రింది నంబర్స్ ను సంప్రదించిన పూర్తి సమాచారం లభించును..

సంతోషం...

ఓం నమఃశివాయ.. 🔥


[సేకరణ »»

దశమహావిద్యాపీఠం,

కుంచపర్తి ఆశ్రమం,

వేంసూరు మండలం,

ఖమ్మం జిల్లా.👆]

పాఠకులకు విజ్ఞప్తి


"తెలుగు కవులు"  

కొన్ని అనివార్య కారణాలవలన మన బ్లాగు పేరును "తెలుగు పండిత కవులు" గా మార్చటం జరిగింది. దయచేసి గమనించండి. ప్రపంచ పాఠకులు ఇకనుండి మన బ్లాగుని గతంలో మాదిరిగానే ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. 


మన బ్లాగులో కవితలు, ఆధ్యాత్మిక విషయాలు తత్వవిషయాలు, భక్తి విషయాలు సామాజిక విషయాలు అనేక విషయాలమీద ప్రశ్నపత్రాలు ఇలా అనేక శీర్షికలతో మీ ముందుకు వస్తున్న సంగతి మీకు తెలిసిందే. మీ ఆదరాభిమానాలతోటే ఈ బ్లాగు గత పుష్కర కాలంనుండి నిరంతరాయంగా నడుస్తున్న సంగతి మీకు విదితమే. కేవలము తెలుగు కవులు అనే పేరుతొ ఉంటే ఇది కేవలం కవిత్వానికి సంబంధించిందే అనే భావన ఉండవచ్చు అలంటి భావనను తొలగించి సర్వులకు ఉపయుక్తంగా చేయాలనే సంకల్పంతో మన బ్లాగుని "తెలుగు పండిత కవులు" గా మార్చినాము ఈ మార్పుని గమనించి పాఠకులు తమ ప్రోత్సాహాన్ని మునుపటి మాదిరిగానే అందించి ఈ బ్లాగు సర్వులకు జ్ఞ్యానవిస్తర్ణ చేసే ప్రక్రియలో అందరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ 


మీ బ్లాగు నిర్వాహకుడు. 


భార్గవ శర్మ

ఇకనుండి "తెలుగు కవులు" బ్లాగు "తెలుగు పండిత కవులు"

 

 పాఠకులకు విజ్ఞప్తి 

ఇకనుండి "తెలుగు కవులు" బ్లాగు తెలుగు పండిత కవులు"  గా పేరు మార్చుకొని మీ ముందుకు వస్తున్నది.


కొన్ని అనివార్య కారణాలవలన మన బ్లాగు పేరును "తెలుగు పండిత కవులు" గా మార్చటం జరిగింది. దయచేసి గమనించండి. ప్రపంచ పాఠకులు ఇకనుండి మన బ్లాగుని గతంలో మాదిరిగానే ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. 


మన బ్లాగులో కవితలు, ఆధ్యాత్మిక విషయాలు తత్వవిషయాలు, భక్తి విషయాలు సామాజిక విషయాలు అనేక విషయాలమీద ప్రశ్నపత్రాలు ఇలా అనేక శీర్షికలతో మీ ముందుకు వస్తున్న సంగతి మీకు తెలిసిందే. మీ ఆదరాభిమానాలతోటే ఈ బ్లాగు గత పుష్కర కాలంనుండి నిరంతరాయంగా నడుస్తున్న సంగతి మీకు విదితమే. కేవలము తెలుగు కవులు అనే పేరుతొ ఉంటే ఇది కేవలం కవిత్వానికి సంబంధించిందే అనే భావన ఉండవచ్చు అలంటి భావనను తొలగించి సర్వులకు ఉపయుక్తంగా చేయాలనే సంకల్పంతో మన బ్లాగుని "తెలుగు పండిత కవులు" గా మార్చినాము ఈ మార్పుని గమనించి పాఠకులు తమ ప్రోత్సాహాన్ని మునుపటి మాదిరిగానే అందించి ఈ బ్లాగు సర్వులకు జ్ఞ్యానవిస్తర్ణ చేసే ప్రక్రియలో అందరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ మన బ్లాగ్ యుఆర్ఎల్ ను క్రింద ఇస్త్తున్నాము కపి చేసుకొని భద్రపరచుకోండి 

http://kavulu.blogspot.com/


మీ బ్లాగు నిర్వాహకుడు. 


భార్గవ శర్మ