7, ఏప్రిల్ 2023, శుక్రవారం

ఆరోగ్య దినోత్సవo

 *అందరికీ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు*

🄷🄰🄿🄿🅈 🄸🄽🅃🄴🅁🄽🄰🅃🄸🄾🄽🄰🄻

🄷🄴🄰🄻🅃🄷   🄳🄰🅈

గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:

1. BP: 120/80

2. పల్స్: 70 - 100

3. ఉష్ణోగ్రత: 36.8 - 37

4. శ్వాస: 12-16

5. హిమోగ్లోబిన్: మగ -13.50-18

స్త్రీ - 11.50 - 16

6. కొలెస్ట్రాల్: 130 - 200

7. పొటాషియం: 3.50 - 5

8. సోడియం: 135 - 145

9. ట్రైగ్లిజరైడ్స్: 220

10. శరీరంలో రక్తం మొత్తం: PCV 30-40%

11. చక్కెర స్థాయి: పిల్లలకు (70-130) పెద్దలు: 70 - 115

12. ఐరన్: 8-15 మి.గ్రా

13. తెల్ల రక్త కణాలు WBC: 4000 - 11000

14. ప్లేట్‌లెట్స్: 1,50,000 - 4,00,000

15. ఎర్ర రక్త కణాలు RBC: 4.50 - 6 మిలియన్లు.

16. కాల్షియం: 8.6 -10.3 mg/dL

17. విటమిన్ D3: 20 - 50 ng/ml.

18. విటమిన్ B12: 200 - 900 pg/ml.

*40/50/60 సంవత్సరాల వయస్సు గల వృద్ధులకు ప్రత్యేక చిట్కాలు:*

*1- మొదటి సూచన:* మీకు దాహం లేదా అవసరం లేకపోయినా అన్ని సమయాలలో నీరు త్రాగాలి, అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో ఎక్కువ భాగం శరీరంలో నీటి కొరత కారణంగా. రోజుకు కనీసం 2 లీటర్లు.

*2- రెండవ సూచన:* శరీరం నుండి సాధ్యమైనంత ఎక్కువ పని చేయండి, నడక, ఈత లేదా ఏదైనా క్రీడ వంటి శరీర కదలికలు ఉండాలి.

*3-3వ చిట్కా:* తక్కువ తినండి... ఎక్కువగా తినాలనే కోరికను విడనాడండి... ఎందుకంటే అది ఎప్పుడూ మంచిని తీసుకురాదు. మిమ్మల్ని మీరు కోల్పోకండి, కానీ పరిమాణాన్ని తగ్గించండి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా వాడండి.

*4- నాల్గవ సూచన:* ఖచ్చితంగా అవసరమైతే తప్ప వాహనాన్ని ఉపయోగించవద్దు. మీరు కిరాణా సామాను తీసుకోవడానికి, ఎవరినైనా కలవడానికి లేదా ఏదైనా పని చేయడానికి ఎక్కడికైనా వెళుతున్నట్లయితే, మీ పాదాలపై నడవడానికి ప్రయత్నించండి. ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి.

*5- 5వ సూచన* కోపాన్ని విడిచిపెట్టండి, చింతించడం మానేయండి, విషయాలను విస్మరించడానికి ప్రయత్నించండి. సమస్యాత్మక పరిస్థితులలో మునిగిపోకండి, అవి అన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి మరియు ఆత్మ యొక్క కీర్తిని తీసివేస్తాయి. సానుకూల వ్యక్తులతో మాట్లాడండి మరియు వారి మాటలు వినండి.

*6- ఆరవ సూచన* ముందుగా, డబ్బుతో ఉన్న అనుబంధాన్ని వదులుకోండి

మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి, నవ్వండి మరియు మాట్లాడండి! డబ్బు మనుగడ కోసం, డబ్బు కోసం జీవితం కాదు.

*7-7వ గమనిక* మీ గురించి లేదా మీరు సాధించలేని దేని గురించి లేదా మీరు ఆశ్రయించలేని దాని గురించి చింతించకండి.

దానిని విస్మరించండి మరియు మరచిపోండి.

*8- ఎనిమిదో నోటీసు* డబ్బు, పదవి, పలుకుబడి, అధికారం, అందం, కులం మరియు ప్రభావం;

ఇవన్నీ అహాన్ని పెంచుతాయి. వినయం మనుషులను ప్రేమతో దగ్గర చేస్తుంది.

*9- తొమ్మిదవ చిట్కా* మీ జుట్టు తెల్లగా ఉంటే, అది జీవితాంతం అని కాదు. ఇది మంచి జీవితానికి నాంది. ఆశాజనకంగా ఉండండి, జ్ఞాపకశక్తితో జీవించండి, ప్రయాణం చేయండి, ఆనందించండి. జ్ఞాపకాలను సృష్టించండి!

*10- 10వ సూచనలు* మీ చిన్నారులను ప్రేమ, సానుభూతి మరియు ఆప్యాయతతో కలవండి! వ్యంగ్యంగా ఏమీ అనకండి! మీ ముఖం మీద చిరునవ్వు ఉంచండి!

గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, వర్తమానంలో దాన్ని మరచిపోయి అందరితో కలిసిపోండి!

ఈ బృందం ఆయుర్వేద వైద్యంపై ఆరోగ్య సమాచారాన్ని రూపొందించింది మరియు వ్యాధులు మరియు నిర్వహణ సమూహంపై అవగాహన కల్పించింది.

లోభము చేతనే

 .

         _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝

*యథైధః స్వసముత్థేన*

*వహ్నినా నాశమృచ్ఛతి౹*

*తథాకృతాత్మా లోభేన*

*సహజేన వినశ్యతి॥*


         _మహాభారతమ్- వనపర్వమ్_


తా𝕝𝕝 

*కర్ర తననుండి పుట్టిన నిప్పు వల్లనే నశిస్తుంది..... అదేవిధంగా వశం తప్పిన మనసు కల మానవుడు సహజంగా తనలోనుండి పుట్టిన లోభము చేతనే నాశనమవుతాడు*".

*దత్త దీక్ష..దత్తహోమము

 *దత్త దీక్ష..దత్తహోమము..*


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయ పరిసరాలు మొత్తం కాషాయ వర్ణ శోభితంగా ఉంది..గత 20 రోజులుగా శ్రీ స్వామివారి మందిరం లో శ్రీ దత్తాత్రేయుడికి హారతులిచ్చే సమయాన దత్త నామ స్మరణ తో నిండిపోతున్నది..

ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం శ్రీ స్వామివారి కి ఇచ్చే హారతులు కళ్లకద్దుకోవడం..రాత్రికి భజన చేయడం..సాధ్యమైనంత వరకూ దత్త నామాన్ని స్మరించడం అనేవి ఈ దీక్షా కాలం లో పరిపాటి..ఈ సంవత్సరం దీక్ష స్వీకరించిన స్వాములు కూడా ఎక్కువగా వున్నారు..


"అయ్యా..ఈసారి చైత్ర బహుళ అష్టమి ..ఏప్రిల్ 13వతేదీ గురువారం నాడు మన మందిరం వద్ద 41 హోమగుండాలతో *దత్తహోమము* నిర్వహిద్దామని మా అర్చకులము ఒక నిశ్చయానికి వచ్చాము..దత్తదీక్ష 41 రోజులు కాబట్టి..బహుళ అష్టమి నాడు అనఘా వ్రతం చేయడం ఒక పరిపాటి కాబట్టి..ఆరోజు దత్తహోమము చేస్తే..దీక్ష లో ఉన్న స్వాములు కూడా పాల్గొంటారు..ఆసక్తి ఉన్న ఇతర భక్తులూ పాల్గొనే అవకాశం కల్పిద్దామని అనుకున్నాము..మీరు అంగీకరిస్తే..అందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము.." అని మా అర్చక స్వాములు నా దగ్గరకు వచ్చి అడిగారు..


*దత్తహోమము..అందునా దత్త మాలాధారణ సమయంలో* 

మారు మాట్లాడకుండా నా సమ్మతి తెలియ చేసాను.."ముందుగా దీక్షలో ఉన్న స్వాములకు అవకాశం ఇవ్వండి..ఆ తరువాత ఇతర భక్తులకు హోమ గుండాలు కేటాయింపులు చేయండి.." అని చెప్పాను..సంతోషంగా ఒప్పుకున్నారు..ఇంతవరకూ బాగానే వుంది..ఏర్పాట్లకు.. హోమద్రవ్యాలకు..ఋత్విక్కులకు..అన్నింటికీ సరిపడా ధనం కావాలి..అది ఎలా?..


"స్వామీ దత్తహోమము నిర్వహించాలని సంకల్పించాము..నువ్వు మాకు అండగా ఉంటే..ఎంతటి కార్యమైనా చేయగలము.. మమ్మల్ని ఆశీర్వదించు తండ్రీ.." అని స్వామివారి సమాధి వద్ద మనస్ఫూర్తిగా మొక్కు కున్నాను..


మరో గంట తరువాత .. ఓ ఇద్దరు ముగ్గురు స్వాములు నా వద్దకు వచ్చి.." అయ్యా..ఇక్కడేదో దత్తహోమము నిర్వహించాలని అనుకుంటున్నారట కదా..మేము అందులో పాల్గొనాలని అనుకుంటున్నాము..మేము మాత్రమే కాదు..సుమారు 10 మందిస్వాములు సిద్ధంగా ఉన్నారు..ఒక్కొక్క హోమగుండాన్ని ఒక్కొక్కరికి కేటాయించండి..అందుకు అయ్యే ఖర్చు చెప్పండి..మేము భరిస్తాము.."

అన్నారు.."మొత్తం ఖర్చు సుమారుగా 1,80,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకూ అవుతుంది..అంటే ఒక్కొక్క హోమగుండానికి దగ్గర దగ్గర 5 వేల రూపాయలు..మీరు భరించవచ్చు..కానీ అందరూ అంత స్తోమత ఉన్నవాళ్లు కాదు కదా?.." అన్నాను.."ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి.. లేని వాళ్ళ గురించి ఆలోచన చేద్దాము.." అన్నాను..సరే అన్నారు..


ఈరోజు ఉదయం నేను స్వామివారి మందిరం వద్ద నుండి బయలుదేరి..సింగరాయకొండ లో మా ఇంటికి చేరాను..సెల్ మోగింది..అవతలి నుంచి.."ప్రసాద్ గారూ..నేను హైదరాబాద్ నుంచి వచ్చాను..నిన్న సాయంత్రం మీరు దత్తహోమము గురించి చర్చించుకోవడం విన్నాను..నాకూ హోమము లో పాల్గొనాలని ఆశ వుంది కానీ..ప్రస్తుతం నేను పాల్గొనలేను..నిన్న మీరు ఆర్ధిక స్తోమత లేని స్వాములకు దత్తహోమము లో భాగం చేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నానని అన్నారు..హోమానికి అయ్యే ఖర్చుకు గాను నేనొక 25 వేలు ఇస్తాను..ఇక్కడ దీక్ష లో వుండి.. ఆర్ధిక స్తోమత లేని 5 గురు స్వాములకు దత్తహోమము లో పాల్గొనే అవకాశం ఇవ్వండి..నేను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా..ఆ స్వాములకు సహాయం చేసి..దత్తుడి సేవ చేసుకుంటాను..నాకు ప్రచారం వద్దు..వ్యక్తిగతంగా రేపు మిమ్మల్ని కలుస్తాను..మీరేమీ వ్యాకుల పడవద్దు..దత్తహోమము నిర్విఘ్నంగా జరుగుతుంది.. నాలాటి వారిని ఆ దత్తుడు తట్టి మరీ లేపి..మీ వద్దకు తీసుకొస్తాడు.." అని ఫోన్ పెట్టేసారు..


నా మనసులో ఒక మూలనున్న సందేహానికి స్వామివారు ఈ రకంగా సమాధానం ఇప్పించారు..ఇక ఏ శంకలూ లేవు..సర్వం ఆ దత్తాత్రేయుడే నడిపిస్తాడు..


*చైత్ర బహుళ అష్టమి..గురువారం..సరియగు తేదీ 13 ఏప్రిల్ 2023 నాడు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద దత్తహోమము నిర్వహిస్తున్నాము..యధావిధిగా ఆరోజు అన్నప్రసాద వితరణ వుంటుంది* .


సహకారం ఇవ్వదలచిన భక్తులు..సంప్రదించవలసిన సెల్ నెంబర్లను పొందు పరచడం జరిగింది..


*1. 99497 53615*

*2. 99487 42865.*


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలము..వయా..కందుకూరు..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్: 99089 73699 & 94402 66380)

REVIEW ON RANGAMARTHANDA ( రంగమార్తాండ ) ‘వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ...’ ఒక వాక్కును పలికితే దాంట్లో ఉండే శబ్దార్ధాలు రెండింటినీ విడదీయడం కష్టం. నిజానికి పాపం కూడా! శబ్దమూ, అర్ధంలా కలిసిమెలిసి ఉండే, విడదీయరాని బంధమున్న ఆ పార్వతీపరమేశ్వరుల్ని స్తుతించే శ్లోకం అది. ఆ పోలిక ఎందుకంటే... అక్షరానికున్న శక్తి అటువంటిది. ఒక్క అక్షరం. కేవలం ఒకే ఒక్క అక్షరం మారినా, ఉచ్చారణలో తేడా చూపించినా శబ్దార్ధాలు రెండూ మారిపోయే అవకాశాలున్నదే భాష. అది కేవలం తెలుగనే కాదు. అటువంటి భాషను ఔపోసన పట్టి, కళను శ్వాసించి, కరతాళధ్వనులను భుజిస్తూ కుటుంబ బాధ్యతలను, స్వీయ ఆరోగ్యాన్ని సైతం విస్మరించే తపనగలవారే రంగస్థల నటులు. నాటకం.... ఇందులో సరిదిద్దుబాటుండదు. నోటివెంట వెలువడిన మాట తిరిగి తీసుకునే అవకాశముండదు. ఏడవాలంటే ఏదో ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టాలి. రాని నవ్వుని కృతకంగా కాకుండా సహజమైన ధోరణిలో ప్రదర్శించాలి. ముఖం మీద పడే ప్రకాశవంతమైన దీపకాంతిలో సైతం చిక్కని హావభావాలు కనబరచాలి. ఉక్కబోతల్ని భరించాలి. ముందున్న ప్రేక్షకుల్లో కొందరు ఆకతాయిలు చేసే వ్యాఖ్యానాలకి స్పందించనంత స్థితప్రజ్ఞత అలవాటవ్వాలి. ఇంత కష్టసాధ్యమైన నాటకాన్ని ఎన్నో ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మహానటులెందరో ఉన్నారు. వారందరికీ నివాళిగా నిండుగా విరబూసిన మందార పుష్పం ఈ ‘రంగమార్తాండ!’ కథా కమామీషుల్లోకి వెళ్లను. ఎందుకిన్ని ప్రివ్యూలు? చాలామంది హేళన చేస్తున్నారు. చూస్తున్నాను. మహా మహా చిత్రాలే మూడువారాలకు మించి థియేటర్లలో ఆడని ఈ రోజుల్లో ఈ రంగమార్తాండ ఏదో కోట్లు కూడబెట్టెయ్యాలని కాదు వారి తాపత్రయం. ఇది ఒక యజ్ఞంలా భావించి తీశారు. కృష్ణవంశీ ఇష్టాలన్నిటినీ కిక్కిరిసేంత దిట్టంగా కూరేసిన చిచ్చుబుడ్డి ఈ సినిమా. అంటించేముందు రాయబారం మందు మేమందరం. ఆ వెలుగులెలాగూ ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతాయి. అందులో సందేహమేమీ లేదు. వెలుగులంటే వసూళ్ళు మాత్రమే కావు. ఈ దిట్టానికి అసలు కారణం మన లక్ష్మీభూపాలగారు. ఏ రీతిలో బయటపడాలి, ఎంత బలంగా ఉవ్వెత్తున ఎగసిపడాలనే స్థాయికి దిశానిర్దేశం చేసింది ఆయనే! కథావిస్తరణలో భాగంగా పాత కథనే ప్రస్ఫుటంగా అభివ్యక్తపరచడంలో వారి పాత్ర స్పష్టంగా కనబడుతుంది. ఒక నటుడు, ఆ మాటకొస్తే నిజమైన నటుడనేవాడు ఎంత తపనపడతాడో ఈ చిత్రం చూపిస్తుంది. ఒక పాత్రపట్ల ఇష్టం, ఆ సంభాషణలపట్ల గౌరవం, భాషపై మమకారం, భావవ్యక్తీకరణపై పట్టుదల ఎంత తీవ్రస్థాయిలో ఉంటాయనేది ఇందులో రాఘవరావు పాత్ర నిరూపిస్తుంది. అదంతా కంఠశోష అనుకుని పక్కకు తోసేసి మళ్లీ మన రొడ్డకొట్టుడే మనకిష్టం అనుకుంటే చేసేదేమీలేదు. కానీ ఇప్పుడీ రొడ్డకొట్టుణ్ణి సైతం రక్తికట్టించేలా చెయ్యగలుగుతున్న పెద్ద హీరోల్ని చూస్తే మనకొక విషయం అర్ధమవుతుంది. ఒకప్పుడు వారందరూ ఎంతో తపనతో, భక్తితో తమకిచ్చిన ప్రతి పాత్రనూ నిబద్ధతతో నటించారు కనుకనే ఇంతకాలం పరిశ్రమలో నిలబడివున్నారని! అదే పునాది. ఏ నటుడికైనా ఆ ఇటుకలు గట్టివైతే ఘటికుడవుతాడు. కృష్ణవంశీ చిత్రాలు లౌడ్‌గా ఉంటాయి. చెప్పదలచుకున్నది గట్టిగా చెప్పడం ఆయనకలవాటు. వినిపించుకోనివాళ్లకి డాల్బీ అట్మాస్‌లో చెబితేనే అర్ధమవుతుందని ఆయన భావన. ఆ ఇంటెన్సిటీ ఇందులో చాలాచోట్ల కనబడుతుంది. నటీనటులకి విపరీతమైన వ్యాయామం ఈ సినిమా. ముఖంలో హావభావాలు పలికించడానికి మొత్తం ముఖ కండరాలన్నిటినీ శాయశక్తులా వాడాల్సిన అవసరం కల్పించారు దర్శకుడు. మరాఠీ నాటకం నటసామ్రాట్ కి ఇది అనుసరణే అయినా తాజాగా ఉంది. ఇక ప్రకాష్‌రాజ్ నటుడిగా ఉగ్రరూపం ప్రదర్శించాడు. చిత్రంలో స్పృశించని అంశం లేదు. తెరవెనుక అన్నిటా తానై దర్శకుడు ఏంచెప్పాలనుకున్నాడో అదంతా తెరమీద నిండుగా ఆవిష్కరించిన మాయలమారి ప్రకాష్‌రాజ్. వాయిస్ ఆఫ్ కృష్ణవంశీ అనిపించాడు. బ్రహ్మానందం సంభాషణలు పలకడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈమధ్య చూసిన నాలుగైదు చిత్రాల్లో ఆయన నోట స్లర్డ్ స్పీచ్ వినబడింది. కానీ ఇందులో ఒకానొక సన్నివేశంలో ఆయన ఒక పావుగంటపాటు తన సత్తా ఏమిటో చూపించేశారు. ఆ సన్నివేశం పూర్తయేవరకూ ఉగ్గబట్టుకున్న హాలంతా ఒక్కసారిగా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. పోనీ వచ్చినవారందరూ విద్యావంతులు, కాస్తోకూస్తో రచనావ్యాసంగంలో ప్రవేశమున్నవారూ కాబట్టి అలా అనుభూతి చెందారని మీరనుకోవచ్చు. కానీ పూర్వం మన నాటకాలన్నింట్లోనూ వన్స్‌మోరంటూ రాత్రి తెల్లవార్లూ మళ్లీ మళ్లీ అదే సన్నివేశాన్ని చేయించుకుని మనసారా ఆనందించిన ప్రజలందరూ నిరక్షరాస్యులూ, నేలక్లాసు ప్రేక్షకులే! అంచేత నాకు ఆ సన్నివేశం మళ్లీ మన పూర్వకాలపు వన్స్‌మోర్లను హాల్లో వినిపించేలా చేస్తుందేమోననిపిస్తోంది. నిజానికి అటువంటి సన్నివేశాలు చూసి చాలా ఏళ్లయింది. అవి చిత్రీకరించడానికి చాలా ఓర్పు కావాలి. నేటి దర్శకులకి అంత సహనం ఉందని నేననుకోవట్లేదు. ప్రకాష్‌రాజ్, కె.కె.మీనన్, పంకజ్ త్రిపాఠీ, నానా పటేకర్, నవాజుద్దీన్ సిద్దికీలాంటి అద్భుతమైన నటుల్ని సైతం కమర్షియల్ చట్రంలో బిగించేసి సాధారణమైన చిత్రాల్నే నిర్మిస్తోంటే వారి కుతి ఎలా తీరుతుంది? కసి ఎలా బయటపడుతుంది? ‘ఇదికదా నేను... ఇలాక్కదా నాలో ఉన్న అసలైనవాడు బయటపడేది?’ అని కాలు నేలమీద దబ్ మని కొట్టిమరీ నటించారు ఇద్దరికిద్దరూ! నిజమైన రంగమార్తాండులనిపించారు ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం! ఇక మిగతావారిలో నాకు బాగా నచ్చింది శివాత్మిక. ఆ అమ్మాయిలో సహజమైన నటి ఉంది. అది ఎవరో నేర్పితే వచ్చేదికాదు. యాక్టింగ్ స్కూళ్లవల్లా రాదు. తనకి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉందనిపించింది. రంగమార్తాండ తప్పకుండా చూడండి. ఇదేదో ప్రచారం కోసం చెప్పట్లేదు. సినిమా కుటుంబసమేతంగా చూడొచ్చు. ఇలాంటి కధలు మన / మీ యిళ్లలో కూడా తప్పకుండా జరుగుతాయి. మీరూ కచ్చితంగా కనెక్టవుతారు. తథ్యం! ఇళయరాజా! ఈయన పాట లేకుండా నా కారు కదలదు. నోరు పెగలదు. అంతిష్టం. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో సైతం దమిడి చేమంతిలాంటి ఫ్యూజన్ పాటతో మళ్ళీ మనందరి ముందుకూ ఘనంగా వచ్చాడు ఈ జ్ఞాన దేశిగన్! ఉత్తరాంధ్ర పదాల్ని హాయిగా పరిచయం చేస్తున్నా బల్లా విజయకుమార్ రాసిన ఈపాట చాలా ప్రాచుర్యం పొందింది. ఆర్ద్రతాలోపంతో బాధపడుతున్న నేటి చిత్రాల మీద బిందెడు నీళ్లు ఒంపి మరీ చెప్పింది ఈ రంగమార్తాండ..... ఏమని? ‘ఎంతసేపూ చేతి తడే కాదురా అబ్బాయిలూ, మనసు తడిని సైతం గమనించుకోం’డంటూ! విజయోస్తు! శుభాభినందనలు! .....సేకరణ

 

( రంగమార్తాండ )


‘.

వాగర్ధ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే

పార్వతీపరమేశ్వరౌ...’


ఒక వాక్కును పలికితే దాంట్లో ఉండే శబ్దార్ధాలు రెండింటినీ విడదీయడం కష్టం. నిజానికి పాపం కూడా!


శబ్దమూ, అర్ధంలా కలిసిమెలిసి ఉండే, విడదీయరాని బంధమున్న ఆ పార్వతీపరమేశ్వరుల్ని స్తుతించే శ్లోకం అది. ఆ పోలిక ఎందుకంటే...


అక్షరానికున్న శక్తి అటువంటిది. ఒక్క అక్షరం. కేవలం ఒకే ఒక్క అక్షరం మారినా, ఉచ్చారణలో తేడా చూపించినా శబ్దార్ధాలు రెండూ మారిపోయే అవకాశాలున్నదే భాష. అది కేవలం తెలుగనే కాదు. 


అటువంటి భాషను ఔపోసన పట్టి, కళను శ్వాసించి, కరతాళధ్వనులను భుజిస్తూ కుటుంబ బాధ్యతలను, స్వీయ ఆరోగ్యాన్ని సైతం విస్మరించే తపనగలవారే రంగస్థల నటులు.


నాటకం....


ఇందులో సరిదిద్దుబాటుండదు. 


నోటివెంట వెలువడిన మాట తిరిగి తీసుకునే అవకాశముండదు. 


ఏడవాలంటే ఏదో ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టాలి. 


రాని నవ్వుని కృతకంగా కాకుండా సహజమైన ధోరణిలో ప్రదర్శించాలి. 


ముఖం మీద పడే ప్రకాశవంతమైన దీపకాంతిలో సైతం చిక్కని హావభావాలు కనబరచాలి. 


ఉక్కబోతల్ని భరించాలి. 


ముందున్న ప్రేక్షకుల్లో కొందరు ఆకతాయిలు చేసే వ్యాఖ్యానాలకి స్పందించనంత స్థితప్రజ్ఞత అలవాటవ్వాలి.


ఇంత కష్టసాధ్యమైన నాటకాన్ని ఎన్నో ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మహానటులెందరో ఉన్నారు. 


వారందరికీ నివాళిగా నిండుగా విరబూసిన మందార పుష్పం ఈ ‘రంగమార్తాండ!’


కథా కమామీషుల్లోకి వెళ్లను. 


ఎందుకిన్ని ప్రివ్యూలు?


చాలామంది హేళన చేస్తున్నారు. చూస్తున్నాను.


మహా మహా చిత్రాలే మూడువారాలకు మించి థియేటర్లలో ఆడని ఈ రోజుల్లో ఈ రంగమార్తాండ ఏదో కోట్లు కూడబెట్టెయ్యాలని కాదు వారి తాపత్రయం. 


ఇది ఒక యజ్ఞంలా భావించి తీశారు. కృష్ణవంశీ ఇష్టాలన్నిటినీ కిక్కిరిసేంత దిట్టంగా కూరేసిన చిచ్చుబుడ్డి ఈ సినిమా. అంటించేముందు రాయబారం మందు మేమందరం. ఆ వెలుగులెలాగూ ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతాయి. అందులో సందేహమేమీ లేదు. వెలుగులంటే వసూళ్ళు మాత్రమే కావు. 


ఈ దిట్టానికి అసలు కారణం మన లక్ష్మీభూపాలగారు. ఏ రీతిలో బయటపడాలి, ఎంత బలంగా ఉవ్వెత్తున ఎగసిపడాలనే స్థాయికి దిశానిర్దేశం చేసింది ఆయనే! కథావిస్తరణలో భాగంగా పాత కథనే ప్రస్ఫుటంగా అభివ్యక్తపరచడంలో వారి పాత్ర స్పష్టంగా కనబడుతుంది.


ఒక నటుడు, ఆ మాటకొస్తే నిజమైన నటుడనేవాడు ఎంత తపనపడతాడో ఈ చిత్రం చూపిస్తుంది. ఒక పాత్రపట్ల ఇష్టం, ఆ సంభాషణలపట్ల గౌరవం, భాషపై మమకారం, భావవ్యక్తీకరణపై పట్టుదల ఎంత తీవ్రస్థాయిలో ఉంటాయనేది ఇందులో రాఘవరావు పాత్ర నిరూపిస్తుంది.


అదంతా కంఠశోష అనుకుని పక్కకు తోసేసి మళ్లీ మన రొడ్డకొట్టుడే మనకిష్టం అనుకుంటే చేసేదేమీలేదు. కానీ ఇప్పుడీ రొడ్డకొట్టుణ్ణి సైతం రక్తికట్టించేలా చెయ్యగలుగుతున్న పెద్ద హీరోల్ని చూస్తే మనకొక విషయం అర్ధమవుతుంది. 


ఒకప్పుడు వారందరూ ఎంతో తపనతో, భక్తితో తమకిచ్చిన ప్రతి పాత్రనూ నిబద్ధతతో నటించారు కనుకనే ఇంతకాలం పరిశ్రమలో నిలబడివున్నారని! అదే పునాది. ఏ నటుడికైనా ఆ ఇటుకలు గట్టివైతే ఘటికుడవుతాడు.


కృష్ణవంశీ చిత్రాలు లౌడ్‌గా ఉంటాయి. చెప్పదలచుకున్నది గట్టిగా చెప్పడం ఆయనకలవాటు. వినిపించుకోనివాళ్లకి డాల్బీ అట్మాస్‌లో చెబితేనే అర్ధమవుతుందని ఆయన భావన. 


ఆ ఇంటెన్సిటీ ఇందులో చాలాచోట్ల కనబడుతుంది. నటీనటులకి విపరీతమైన వ్యాయామం ఈ సినిమా. ముఖంలో హావభావాలు పలికించడానికి మొత్తం ముఖ కండరాలన్నిటినీ శాయశక్తులా వాడాల్సిన అవసరం కల్పించారు దర్శకుడు. 


మరాఠీ నాటకం నటసామ్రాట్ కి 

ఇది అనుసరణే అయినా తాజాగా ఉంది. 


ఇక ప్రకాష్‌రాజ్ నటుడిగా ఉగ్రరూపం ప్రదర్శించాడు. చిత్రంలో స్పృశించని అంశం లేదు. తెరవెనుక అన్నిటా తానై దర్శకుడు ఏంచెప్పాలనుకున్నాడో అదంతా తెరమీద నిండుగా ఆవిష్కరించిన మాయలమారి ప్రకాష్‌రాజ్.


వాయిస్ ఆఫ్ కృష్ణవంశీ అనిపించాడు. 


బ్రహ్మానందం సంభాషణలు పలకడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈమధ్య చూసిన నాలుగైదు చిత్రాల్లో ఆయన నోట స్లర్డ్ స్పీచ్ వినబడింది. 


కానీ ఇందులో ఒకానొక సన్నివేశంలో ఆయన ఒక పావుగంటపాటు తన సత్తా ఏమిటో చూపించేశారు. ఆ సన్నివేశం పూర్తయేవరకూ ఉగ్గబట్టుకున్న హాలంతా ఒక్కసారిగా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. 


పోనీ వచ్చినవారందరూ విద్యావంతులు, కాస్తోకూస్తో రచనావ్యాసంగంలో ప్రవేశమున్నవారూ కాబట్టి అలా అనుభూతి చెందారని మీరనుకోవచ్చు.


కానీ పూర్వం మన నాటకాలన్నింట్లోనూ వన్స్‌మోరంటూ రాత్రి తెల్లవార్లూ మళ్లీ మళ్లీ అదే సన్నివేశాన్ని చేయించుకుని మనసారా ఆనందించిన ప్రజలందరూ నిరక్షరాస్యులూ, నేలక్లాసు ప్రేక్షకులే! 


అంచేత నాకు ఆ సన్నివేశం మళ్లీ మన పూర్వకాలపు వన్స్‌మోర్లను హాల్లో వినిపించేలా చేస్తుందేమోననిపిస్తోంది. 


నిజానికి అటువంటి సన్నివేశాలు చూసి చాలా ఏళ్లయింది. అవి చిత్రీకరించడానికి చాలా ఓర్పు కావాలి. నేటి దర్శకులకి అంత సహనం ఉందని నేననుకోవట్లేదు. 


ప్రకాష్‌రాజ్, కె.కె.మీనన్, పంకజ్ త్రిపాఠీ, నానా పటేకర్, నవాజుద్దీన్ సిద్దికీలాంటి అద్భుతమైన నటుల్ని సైతం కమర్షియల్ చట్రంలో బిగించేసి సాధారణమైన చిత్రాల్నే నిర్మిస్తోంటే వారి కుతి ఎలా తీరుతుంది? కసి ఎలా బయటపడుతుంది? 


‘ఇదికదా నేను... ఇలాక్కదా నాలో ఉన్న అసలైనవాడు బయటపడేది?’ అని కాలు నేలమీద దబ్ మని కొట్టిమరీ నటించారు ఇద్దరికిద్దరూ! నిజమైన రంగమార్తాండులనిపించారు ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం!


ఇక మిగతావారిలో నాకు బాగా నచ్చింది శివాత్మిక. ఆ అమ్మాయిలో సహజమైన నటి ఉంది. అది ఎవరో నేర్పితే వచ్చేదికాదు. యాక్టింగ్ స్కూళ్లవల్లా రాదు. తనకి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉందనిపించింది.


రంగమార్తాండ తప్పకుండా చూడండి. ఇదేదో ప్రచారం కోసం చెప్పట్లేదు. సినిమా కుటుంబసమేతంగా చూడొచ్చు. 

 


ఇలాంటి కధలు మన / మీ యిళ్లలో కూడా తప్పకుండా జరుగుతాయి. మీరూ కచ్చితంగా కనెక్టవుతారు. తథ్యం!


ఇళయరాజా!


ఈయన పాట లేకుండా నా కారు కదలదు. నోరు పెగలదు. అంతిష్టం. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో సైతం దమిడి చేమంతిలాంటి ఫ్యూజన్ పాటతో మళ్ళీ మనందరి ముందుకూ ఘనంగా వచ్చాడు ఈ జ్ఞాన దేశిగన్!


ఉత్తరాంధ్ర పదాల్ని హాయిగా పరిచయం చేస్తున్నా బల్లా విజయకుమార్ రాసిన ఈపాట చాలా ప్రాచుర్యం పొందింది. 


ఆర్ద్రతాలోపంతో బాధపడుతున్న నేటి చిత్రాల మీద బిందెడు నీళ్లు ఒంపి మరీ చెప్పింది ఈ రంగమార్తాండ..... ఏమని?


‘ఎంతసేపూ చేతి తడే కాదురా అబ్బాయిలూ, మనసు తడిని సైతం గమనించుకోం’డంటూ!


విజయోస్తు!


శుభాభినందనలు!


.....సేకరణ

సహనం వహించాలి.*

 *అమాంతం బిందెల కొలదీ నీరు పోసినంత మాత్రమున మొక్క చెట్టుగా మారి ఫలాలను ఇచ్చేయదుగా!* 


*దానికి కొంత సమయం అవసరం.*


*అలానే ప్రార్థన కూడా ఫలించడానికి కొంత సమయం తీసుకుంటుంది.*


*సహనం వహించాలి.* 


*మనం అనుకోగానే పనులు జరిగిపోవాలంటే కుదరదు.*


*దేవుణ్ణి ప్రార్థించి ఆయనపై విశ్వాసము పెట్టుకోండి. ఆలస్యం అయినా తప్పకుండా ఆదుకుంటాడు.*


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

JagoHindu

 #JagoHindu 


అక్బర్ ప్రతీ సంవత్సరం ఢిల్లీలో *నౌరోజ్ కా మేళా* ఏర్పాటు చేయిస్తుండే వాడు..❗


ఇందులో పురుషులకు ప్రవేశం ఉండేది కాదు ....❗


అక్బర్ ఈ జాతరలో ఆడవారి మారు వేషాలతో వెళ్ళుచుండే వాడు మరియు ఏ ఆడవారు అతన్ని మంత్ర ముగ్దం చేయుదురో.... వారిని అతని దాసిలు నమ్మించి కుట్ర పూరితంగా అక్బర్ సమ్ముఖానికి తీసుకు పోయేవారు....❗


ఒక రోజు ఈ నౌరోజ్ జాతరకు మహారాణా ప్రతాప్ సింహ్ చిన్న తమ్ముడు మహారాజు శక్తిసింహ్ బిడ్డ జాతర చూడటానికి వచ్చింది.....❗


ఆమె పేరు బాయిసా కిరణ్ దేవి....❗

ఆమె వివాహం బీకానేర్ యొక్క మహారాజు పృథివీ రాజు గారితో అయ్యింది..❗


బాయిసా కిరణ్ దేవి సౌకర్యాన్ని చూసి అక్బర్ తనను తాను నియంత్రణ చేసుకోలేకపోవటం....❗ మరియు అతను ఎవరు ఏమిటి అని తెలుసు కోకుండానే, దాసీల ద్వారా మోసపూరితంగా రాణివాసం మహల్ లోనికి రప్పించు కున్నాడు....❗


అక్బర్ ఎప్పుడైతే బాయిసా కిరణ్ దేవిని స్పర్శిచటానికి ప్రయత్నించగానే ....


కిరణ్ దేవి గారు నడుంలో దాచిపెట్టు కొచ్చిన ఖడ్గము తీసింది మరియు ఏకధాటిగా అక్బర్ ను కిందపడేసి అతని ఛాతిపైన కాలుతో తొక్కుతూ మెడమీద కత్తిపెట్టింది.....❗

మరియు గర్జిస్తూ అన్నది ఓరీ నీచుడా....❗నరాధముడా, ❗ నా గురించి సరిగ్గా ఎరుగ నట్లున్నావు, ఎవరి పేరు చెప్తే  నీకు నిద్ర పట్టదో...., ఆ నేను మహారాణా ప్రతాప్ తమ్ముని బిడ్డను ....


 నీ చివరి కోరిక ఏమిటో చెప్పు ....❓


అక్బర్ ముఖం రంగు మారింది ముచ్చెమటలు పట్టాయి....❗


ఎప్పుడూ ఊహించి ఉండక పోవచ్చు ఏమనంటే, ఈ విధంగా ఇలా ఒక నాడు అక్బర్ వంటివాడు నేడు ఒక రాకుమారి🤴🏻 కిరణ్ దేవి బాయీసా గారి చరణాలల్లో ఉంటాడని....❗ అనుకొని ఉండడు.


అక్బర్ అన్నాడు:- మిమ్మల్ని గుర్తించ లేకపోయారు, నా ద్వారా తప్పు జరిగిపోయింది .... నన్ను క్షమించు దేవీ❗...!


దీనితో కిరణ్ దేవి బాయిసా  అన్నది:- ఇక మీదట ఢిల్లీలో ఈ నౌరోజ్ మేళా జరగొద్దు....❗


అంతేగాక ఏ ఒక్క స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు ....❗


అక్బర్🤴🏻 చేతులు👏🏻 జోడించి వేడుకున్నాడు ఇక మీదట ఈ జాతర జరుగదు....❗


ఇక రోజు తర్వాత మళ్ళీ ఆ మేళా జరుగలేదు....❗


ఈ దృష్టాంత వర్ణనము  

గిరిధర్ ఆసియ ద్వారా రచించిన *సగథ రాంబో* పుట 632వ పేజీలో ముద్రిత మయ్యింది.


బీకానేర్ సంగ్రహాలయంలో  ఉన్న ఒక పేయింటింగ్ కూడా ఈ ఘటనను ఒక పద్యంలో చెప్ప నైనది.


 కిరణ్ ఆడసింహం వలె పడగొట్టి తొక్కి మెడపై

కత్తి దూయడం..❗  ఈ హఠాత్ పరిణామము వలన

అక్బర్ కు🤲🏼 చేతులు చాచి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడాల్సి వచ్చింది.....❗❗


అక్బర్ ఛాతి పైన కాలుపెట్టి నిలబడిన వీరబాలిక కిరణ్ దేవి చిత్రం ఈనాటికినీ జైపూర్ సంగ్రహాలయంలో సురక్షితంగా ఉంది.


ఈ ప్రకారము ఈ పోస్ట్ ను  షేర్ చేయండి తప్పక చేయండి. మన పౌరుషత్వ వీర వనితల ఆదర్శ ధర్మము దిగ్విజయ గాథలు నేటి పరిస్థితులలో అవసరం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ కథను ప్రతి ఒక్క భారతీయ వ్యక్తికి తెలియాలి. తద్వారా మన గౌరవమయ జీవనశైలిలో భారత వీరపుత్రుల మరియు వీరాంగణల శౌర్య ధైర్య సాహస పరాక్రమము నేటి సమాజానికి కనువిప్పు కావాలి.


అందుకే ఓ స్త్రీ నీ పరాక్రమ శక్తి ఏంటో తెలుసుకో......

సహాయం అనే పేరుతో

 *పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.*

*ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.*

*అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది.*

*ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా.? అని చెప్పడంతో..*

*ఆమె, మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది.*

*ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.*

*ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు.*

*రాజా.! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు.*

*కృష్ణా.! మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు.*

*తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు.*

*సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం. ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు. మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో.? ప్రజలు ఎప్పుడు మారుతారో.?*

**చిన్న విన్నపము🙏🙏* *విధిగా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ సందేశం పంపండి.* *ఎందుకంటే కనీసం కొంతమందినైన మార్చాలని ఆశిస్తూ.🙏🙏*

*వెల కట్టలేని దానం*

 *వెల కట్టలేని దానం*


పూర్వం, చదరంగం అంటే ప్రాణం సైతం ఇచ్చే ఒక రాజు వద్దకు ఒక ఘనపాటి యైన వేద పండితుడు వచ్చి, ఒక ఘన పనసతో రాజును ఆశీర్వదించాడు. చదరంగం పిచ్చిగల రాజు " వేదం నేనైనా నేర్చుకొని చెప్పగలను, కానీ నాతో చదరంగం కేవలం 20 ఎత్తులైనా ఆడగలవా! అలా ఆడితే నువ్వు కోరింది ఇప్పిస్తానన్నాడు. 


 "రాజా, నాకు చదరంగం వస్తుంది. కానీ, మిమ్మల్ని సంతోష పఱచడానికి మాత్రమే ఆడతానని, రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు విజయవంతంగా పూర్తి చేశాడు. ఎవరో ఒకరు గెలిచేదాకా ఆడమన్నాడు రాజు. కానీ అతడు, "మీతో 20 ఎత్తుల వరకు ఆడగలిగానని గొప్పగా చెప్పుకోవచ్చని" సున్నితంగా తిరస్కరించాడు. "సరే, నీ ఇష్టం. నీకేం కావాలో కోరుకో, ఇప్పిస్తానన్నాడు" రాజు. 


దానికి ఘనపాటి, "రాజా, చదరంగంలో 64 గడులు వున్నాయి. మొదటి గడిలో ఒక గింజ, రెండవ గడిలో రెండు గింజలు, మూడవ గడిలో రెండవ గడికి రెట్టింపు అంటే 4 గింజలు ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని ఇప్పించి, పంపించండి చాలు" అంటూ ఒక పద్యం చెప్పాడు వేద ఘనపాటి యైన పండితవర్యుడు.


              చం. శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

                     ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుం

                     జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి

                     స్తర మగు రెట్టి రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్.


పద్యం అర్థంగాని రాజు, ఆ ధాన్యమేదో ఇప్పించమని మంత్రికి అప్పజెప్పాడు. మంత్రి గారు, తన ఆస్థాన పండిత గణికులు ఉభయులూ కలిసి ఎంత ధాన్యం అవుతుందో లెక్కించమన్నాడు. లెక్కించిన గణికులు వచ్చిన సంఖ్య చూసి దిమ్మతిరిగిపోయారు. మంత్రికి వివరించారు. మంత్రి, ఘనపాటి మేధస్సుకు మనసులోనే సాష్టాంగ పడ్డాడు.


మంత్రి రాకను గమనిస్తున్న రాజుకు, వచ్చిన పిచ్చి బ్రాహ్మడి మీద జాలి కలిగింది. పిడికెడు గింజలకు ఆశ పడ్డాడు. కనీసం ఒక మంచి అగ్రహారం కోరుకుని వుంటే బాగు పడేవాడు. అయినా, నాతో 20 ఎత్తులు ఆడాడంటే ఒక అగ్రహారం ఇచ్చినా తప్పులేదనుకున్నాడు. మంత్రి వచ్చిన తర్వాత, " ఆ బ్రాహ్మడికి ధాన్యం ఇచ్చి పంపించారా"! అని చాలా తేలిగ్గా అడిగేశాడు.


"ఆ బ్రాహ్మణుడు సామాన్యుడు కాడు మహారాజా, అతను అడిగినంత ధాన్యం మన దగ్గర లేదు కదా!, మొత్తం భూప్రపంచంలో కూడా లభ్యం కాదు. ఎన్ని ధాన్యపు గింజలో మన పండితులు మరియు గణికులు గంటల కొద్ది లెక్కించిన పిదప చెప్పిన సంఖ్యను, ఆ వేద పండితుడు వేదగణితం ద్వారా ఒకే ఒక పద్యంలో క్షణంలో చెప్పేశాడు" అని దిక్కుతోచని స్థితిలో నిలబడ్డాడు.


ఆశ్చర్యపోయిన మహారాజు ఆ పద్యంలో ఏముందో చెప్పండి అని అడిగాడు. మహారాజా! మన దేశ పండితుల మేధ, సంక్షిప్తంగా చెప్పాలంటే అల్పాక్షరములతో అనల్పార్థ విషయంతో ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది. వివరణగా విన్న నాకు తల తిరిగి పోయింది. మీరూ వినండని అర్థాన్ని చెప్పడం ప్రారంభించాడు.


మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతిలో, వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు.

శర, సాయక, మన్మథుని బాణాలు = 5 (అమరకోశం)

గగన, వియత్ = 0 (ఆకాశం గగనం శూన్యం, అమరకోశం)

శశి, చంద్ర, తుహినాంశు = 1 (భూమికి ఒకే ఒక చంద్రుడు)

షట్కము = 6 (షట్ చక్రవర్తులు), రంధ్ర = 9 (నవ రంధ్రాలు)

నగ, గిరి, భూధర = 7 (సప్త కుల పర్వతాలు)

అగ్ని = 3 (త్రేతాగ్నులు: గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)

అబ్ధి, పయోనిధి = 4 (సముద్రాలు), వేద = 4 ((చతుర్వేదములు)

తర్క = 6 (షట్ తర్కప్రమాణాలు, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి,

                                                                                              అనుపలబ్ధి)

పద్మజాస్య = 4 ( చతుర్ముఖుడు), కుంజర = 8 (అష్ట దిగ్గజములు)


పద్యంలోని అంకెల సంకేతాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ సంఖ్యలను ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూద్దాం.

శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూధర

5 1 6 1 5 5 9 0 7 7


గగన అబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు

   0 4 4 7 6 4 4 8 1


 సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ విస్తరమగు రెట్టి రెట్టి కగు సంకలితంబు

 జగత్ప్రసిద్ధిగన్.


అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం "అంకానాం వామతో గతిః" అలా కుడి నుంచి ఎడమకు చదువుకుంటే


అలా మొత్తం చివరగా తేలిన సంఖ్య = 18 44 67 44 07 70 95 51 615.


ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం. ఇక అంత ధాన్యం నిలవచేయాలంటే, ఒక ఘనమీటరు విస్తృతి గల గాదెలో దాదాపుగా, ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే, 4 మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు సుమారుగా 12,000 ఘన కిలోమీటర్ల విస్తీర్ణ స్థలం కావాలి.


అన్ని గింజలను పేర్చుకుంటూ వెళితే 300,000,000 ముప్పై కోట్ల కిలోమీటర్లు అంటే, భూమికి సూర్యునికి వున్న దూరానికి రెట్టింపు కావాలి. ఒకవేళ సెకనుకు ఒక్కగింజగా లెక్కపెడితే అన్నీ లెక్కించడానికి 58,495 కోట్ల సంవత్సరాలు కావాలి.


ఇది అసలు విషయం మహారాజా. వేదపండితులను తక్కువ అంచనా వేయలేము. నిజానికి అతడు చదివిన ఘనపనస కూడా లెక్కలకు, ధారణా శక్తికి సంబంధించినదే. ఎంతో సాధన, ధారణా శక్తి, పాండిత్యం వుంటే తప్ప ఘనపాటి కాలేరు. అతడు ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించ పరిచి అహంకరించారు. ఇప్పుడు ఏం చేయమంటారు? మాట తప్పిన దోషం మీకు సంక్రమిస్తుంది.


అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకుల నుండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు. ఏం చేసి, ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితుడినే అడుగుదామని, ఆ పండితుడిని మళ్లీ ఘనంగా పిలిపించి క్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏంచేయాలో చెప్పమన్నాడు.


ఆ పండితుడు రాజా! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టడం ఎవరి వల్లా సాధ్యం కాదు. ధాన్యం బదులుగా అవును ఇప్పించండి చాలు! అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు. అందరం ఆవులను రక్షించుకుందాం. వాటికి సేవ చేస్తూ, ఆవు పాలు త్రాగి, మేధో సంపత్తిని పెంపొందించుకుందాం.


🙏🐄🐄🙏

శ్లోకం

శ్లోకం:☝️

*ఆలోడ్య సర్వశాస్త్రాణి*

 *విచార్య చ పునః పునః ।*

*ఇదమేకం సునిష్పన్నం*

 *ధ్యేయో నారాయణః సదా ।।*


భావం: శాస్త్రాలన్నీ శోధించి, పదే పదే విచారించి అర్థాన్ని అన్వయించినట్లయితే, బయటకు వచ్చే ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, “ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుని ధ్యానించాలి."

*ధ్యేయం శ్రీపతి రూపమజస్రం*🙏



*శుభోదయం* 🙏💐


శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే 

*ఆహార నియమాలు* అవసరం... 


అదే మనసు ఆరోగ్యంగా ఉండాలంటే 

*మానసిక క్రమశిక్షణ* అవసరం..


ఆహార నియమాలు 

మనిషికి *బలాన్నిస్తే*

మానసిక క్రమశిక్షణ

మనిషిని *ఉత్తముడిగా* మారుస్తుంది..


💐💐🙏🙏💐💐