7, ఏప్రిల్ 2023, శుక్రవారం

*దత్త దీక్ష..దత్తహోమము

 *దత్త దీక్ష..దత్తహోమము..*


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయ పరిసరాలు మొత్తం కాషాయ వర్ణ శోభితంగా ఉంది..గత 20 రోజులుగా శ్రీ స్వామివారి మందిరం లో శ్రీ దత్తాత్రేయుడికి హారతులిచ్చే సమయాన దత్త నామ స్మరణ తో నిండిపోతున్నది..

ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం శ్రీ స్వామివారి కి ఇచ్చే హారతులు కళ్లకద్దుకోవడం..రాత్రికి భజన చేయడం..సాధ్యమైనంత వరకూ దత్త నామాన్ని స్మరించడం అనేవి ఈ దీక్షా కాలం లో పరిపాటి..ఈ సంవత్సరం దీక్ష స్వీకరించిన స్వాములు కూడా ఎక్కువగా వున్నారు..


"అయ్యా..ఈసారి చైత్ర బహుళ అష్టమి ..ఏప్రిల్ 13వతేదీ గురువారం నాడు మన మందిరం వద్ద 41 హోమగుండాలతో *దత్తహోమము* నిర్వహిద్దామని మా అర్చకులము ఒక నిశ్చయానికి వచ్చాము..దత్తదీక్ష 41 రోజులు కాబట్టి..బహుళ అష్టమి నాడు అనఘా వ్రతం చేయడం ఒక పరిపాటి కాబట్టి..ఆరోజు దత్తహోమము చేస్తే..దీక్ష లో ఉన్న స్వాములు కూడా పాల్గొంటారు..ఆసక్తి ఉన్న ఇతర భక్తులూ పాల్గొనే అవకాశం కల్పిద్దామని అనుకున్నాము..మీరు అంగీకరిస్తే..అందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము.." అని మా అర్చక స్వాములు నా దగ్గరకు వచ్చి అడిగారు..


*దత్తహోమము..అందునా దత్త మాలాధారణ సమయంలో* 

మారు మాట్లాడకుండా నా సమ్మతి తెలియ చేసాను.."ముందుగా దీక్షలో ఉన్న స్వాములకు అవకాశం ఇవ్వండి..ఆ తరువాత ఇతర భక్తులకు హోమ గుండాలు కేటాయింపులు చేయండి.." అని చెప్పాను..సంతోషంగా ఒప్పుకున్నారు..ఇంతవరకూ బాగానే వుంది..ఏర్పాట్లకు.. హోమద్రవ్యాలకు..ఋత్విక్కులకు..అన్నింటికీ సరిపడా ధనం కావాలి..అది ఎలా?..


"స్వామీ దత్తహోమము నిర్వహించాలని సంకల్పించాము..నువ్వు మాకు అండగా ఉంటే..ఎంతటి కార్యమైనా చేయగలము.. మమ్మల్ని ఆశీర్వదించు తండ్రీ.." అని స్వామివారి సమాధి వద్ద మనస్ఫూర్తిగా మొక్కు కున్నాను..


మరో గంట తరువాత .. ఓ ఇద్దరు ముగ్గురు స్వాములు నా వద్దకు వచ్చి.." అయ్యా..ఇక్కడేదో దత్తహోమము నిర్వహించాలని అనుకుంటున్నారట కదా..మేము అందులో పాల్గొనాలని అనుకుంటున్నాము..మేము మాత్రమే కాదు..సుమారు 10 మందిస్వాములు సిద్ధంగా ఉన్నారు..ఒక్కొక్క హోమగుండాన్ని ఒక్కొక్కరికి కేటాయించండి..అందుకు అయ్యే ఖర్చు చెప్పండి..మేము భరిస్తాము.."

అన్నారు.."మొత్తం ఖర్చు సుమారుగా 1,80,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకూ అవుతుంది..అంటే ఒక్కొక్క హోమగుండానికి దగ్గర దగ్గర 5 వేల రూపాయలు..మీరు భరించవచ్చు..కానీ అందరూ అంత స్తోమత ఉన్నవాళ్లు కాదు కదా?.." అన్నాను.."ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి.. లేని వాళ్ళ గురించి ఆలోచన చేద్దాము.." అన్నాను..సరే అన్నారు..


ఈరోజు ఉదయం నేను స్వామివారి మందిరం వద్ద నుండి బయలుదేరి..సింగరాయకొండ లో మా ఇంటికి చేరాను..సెల్ మోగింది..అవతలి నుంచి.."ప్రసాద్ గారూ..నేను హైదరాబాద్ నుంచి వచ్చాను..నిన్న సాయంత్రం మీరు దత్తహోమము గురించి చర్చించుకోవడం విన్నాను..నాకూ హోమము లో పాల్గొనాలని ఆశ వుంది కానీ..ప్రస్తుతం నేను పాల్గొనలేను..నిన్న మీరు ఆర్ధిక స్తోమత లేని స్వాములకు దత్తహోమము లో భాగం చేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నానని అన్నారు..హోమానికి అయ్యే ఖర్చుకు గాను నేనొక 25 వేలు ఇస్తాను..ఇక్కడ దీక్ష లో వుండి.. ఆర్ధిక స్తోమత లేని 5 గురు స్వాములకు దత్తహోమము లో పాల్గొనే అవకాశం ఇవ్వండి..నేను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా..ఆ స్వాములకు సహాయం చేసి..దత్తుడి సేవ చేసుకుంటాను..నాకు ప్రచారం వద్దు..వ్యక్తిగతంగా రేపు మిమ్మల్ని కలుస్తాను..మీరేమీ వ్యాకుల పడవద్దు..దత్తహోమము నిర్విఘ్నంగా జరుగుతుంది.. నాలాటి వారిని ఆ దత్తుడు తట్టి మరీ లేపి..మీ వద్దకు తీసుకొస్తాడు.." అని ఫోన్ పెట్టేసారు..


నా మనసులో ఒక మూలనున్న సందేహానికి స్వామివారు ఈ రకంగా సమాధానం ఇప్పించారు..ఇక ఏ శంకలూ లేవు..సర్వం ఆ దత్తాత్రేయుడే నడిపిస్తాడు..


*చైత్ర బహుళ అష్టమి..గురువారం..సరియగు తేదీ 13 ఏప్రిల్ 2023 నాడు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద దత్తహోమము నిర్వహిస్తున్నాము..యధావిధిగా ఆరోజు అన్నప్రసాద వితరణ వుంటుంది* .


సహకారం ఇవ్వదలచిన భక్తులు..సంప్రదించవలసిన సెల్ నెంబర్లను పొందు పరచడం జరిగింది..


*1. 99497 53615*

*2. 99487 42865.*


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలము..వయా..కందుకూరు..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్: 99089 73699 & 94402 66380)

కామెంట్‌లు లేవు: