17, జులై 2024, బుధవారం

18-07-2024 / గురువారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


•••••┉━•••••┉━•••••┉━•••••

*18-07-2024 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

---------------------------------------

వృషభం


భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

మిధునం


నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహమునకు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.  సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

కర్కాటకం


బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు చేస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది.  వృత్తి ఉద్యోగాలలో మరింత ఓర్పుతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

---------------------------------------

సింహం


ఆర్ధిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో   మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి  వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగులు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

కన్య


నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఋణగ్రస్తులు నుండి ధనం వసూలు అవుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున  అధికారుల సహాయ సహకారాలతో  కొన్ని సమస్యలు  తొలగుతాయి. 

---------------------------------------

తుల


నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసి రావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం


ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.   ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు  అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. ఆర్థికంగా అనుకూలత  కలుగుతుంది.

---------------------------------------

ధనస్సు


ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. 

---------------------------------------

మకరం


గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

---------------------------------------

కుంభం


వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. 

---------------------------------------

మీనం


మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో  శ్రమ మరింత అధికం అవుతుంది. వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

Panchaag

 


శాంతాకారం భుజగశయనం

 శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |



లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||


శాంత-ఆకారం భుజగ-శయనం పద్మ-నాభం సుర-ఈశం

విశ్వ-ఆధారం గగన-సదృశం మేఘ-వర్ణ శుభ-అంగమ్|

లక్ష్మీ-కాంతం కమల-నయనం యోగిభిర్-ధ్యాన-గమ్యం

వందే విస్సన్నుం భవ-భయ-హరం సర్వ-లోక-ఏక-నాథమ్ ||

అర్థం:

నిర్మలమైన స్వరూపం కలవాడు, సర్పం (ఆదిశేషుడు), నాభిపై కమలం ఉన్నవాడు , దేవతలకు అధిపతి అయినవాడు, విశ్వాన్ని నిలబెట్టేవాడు

, ఆకాశమంత హద్దులు లేనివాడు, అనంతుడు అయిన శ్రీ విష్ణువుకు నమస్కారములు. ఎవరి వర్ణం మేఘం (నీలం) వంటిది మరియు అందమైన మరియు మంగళకరమైన దేహం కలవాడు , ఎవరు దేవి లక్ష్మీ భర్త , ఎవరి కళ్ళు కమలంలా ఉన్నాయి మరియు ధ్యానం ద్వారా యోగులకు ఎవరు లభిస్తారు , భయాన్ని పోగొట్టే ఆ విష్ణువుకు నమస్కారం. ప్రాపంచిక ఉనికి మరియు అన్ని లోకాలకు ప్రభువు ఎవరు .

స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని

 *అశ్వత్థ మేకం పిచుమన్ద మేకం* *న్యగ్రోధ మేకం దశతింత్రిణీకం!* 

 *కపిత్థ బిల్వాఽమలక త్రయంచ* *పంచామ్రవాపీ నరకం న* *పశ్యేత్!!*


ఒక రావి చెట్టు, ఒక  పిచుమన్ద వృక్షం, (అంటే వేప చెట్టు. దీనినే నింబతరువు అని కూడా పిలుస్తారు.) ఒక మర్రి చెట్టు, పది చింత చెట్లు, మూడు వెలగ చెట్లు, మూడు మారేడు చెట్లు, మూడు ఉసిరిక చెట్లు, అయిదు మామిడి చెట్లు కలిగిన తోటను పెంచాలని ఈ శ్లోకంలో చెప్పబడింది. దానిలో ఒక దిగుడు బావిని తవ్వించమని కూడా చెప్పారు.అలా చేసిన వారు నరకం చూడరని దీని భావం!  అంటే, వారికి స్వర్గప్రాప్తి  కలుగుతుందని ఆశీర్వదించారు.


స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని శ్లోకంలో చెప్పిన లెక్క ప్రకారం అవే చెట్లను నాటి,అక్కడ ఒక దిగుడు బావి తవ్విస్తే సరిపోతుంది. లెక్క కేం కానీ , వీలైనన్ని చెట్లను పెంచి తగిన నీటి వసతి ఏర్పరచ మని చెప్పడమే ప్రధానోద్దేశ్యం.

నామజప మహిమ

 **నామజప మహిమ** గురించి పరమపూజ్యులు శృంగేరీజగద్గు రువులు ఇలా సెలవిచ్చారు.

భగవంతుని నామం మనలను ఎంతటి చెడు నుంచి అయినా కాపాడగలదు. మన చేయి అగ్నికి తెలిసితగిలినా,తెలియకతగిలినా కాలకుండా ఉండదు. అలానే, భగవంతుని నామం పలుకుటచే సర్వ పాపలను దగ్ధంచేయగలదు అందుకే మనం ఏ పనిలోఉన్నా, ఏ సమయములో అయినా భగవంతుని నామమును మననం చేస్తూ ఉండాలి. అందరికి మంత్రజపం చేయాలని కోరిక ఉంటుంది . వారికి పరమేశ్వరుడు ఒక మంత్రం ప్రసాదించాడు, ఆమంత్రాన్ని ఎలాఅయినా చేయవచ్చు. ఈ మంత్రం అందరు చేయవచ్చు. చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఆచారం పాటించే వాళ్ళు, పాటించని వాళ్ళు సర్వులు కూడా సర్వకాలాలలో చేసే మంత్రం .ఆమంత్రం ఏమిటంటే -

 *"హరే రామ హరే రామ రామ* *రామ హరే హరే!* 

*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*".

ఈ మంత్రం అందరు జపించ తగ్గది. క్రమం తప్పకుండా ఈ మంత్రం జపించడం వల్ల భగవంతుని కృప కలిగి, చిత్తశుద్ధి కలిగి, అన్ని పనులునెరవేరగలవు కాని, మనుషులు తినడం పడుకోవడం, తిరుగడం,చనిపో వడం , పశువులు కూడా ఈ విధంగా జీవిస్తాయి. పశువులకి మనకి తేడా ఏమైనా ఉందా మరి ? అందుకే భగవంతుని నామాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండాలి.

--- *జగద్గురు శ్రీశ్రీ అభినవ* *విద్యాతీర్ధ మహస్వామివారు.*

దుగ్ధోదధి విశ్రమించు



*వేదము లుద్ధరించి, గిరి వీపున మోసి ధరన్ భరించి*, 

*ప్రహ్లాదుని గాచి, వామనుడవై, నృపులన్ వధియించి, దుష్ట లంకాధిపు నుక్కడంచి హలి నాని, వ్రజాధిప! డస్సి తీవు* 

*దుగ్ధోదధి విశ్రమించు మిక కుండలిపై హరి! యోగనిద్రలో*


ఓ శ్రీహరీ! వేదములను ఉద్ధరించావు. మంధరపర్వతాన్ని వీపున మోశావు. ప్రహ్లాదుడిని కాపాడావు. వామనుడవై రాక్షహులనుండి రక్షించావు. అనేకమంది రాజులను సంహరించావు. దుష్టుడైన రావణుని అంతమొందించావు. ఈ విధంగా ఎన్నో లోకోపకారాలను చేసి చేసి అలసిపోయావు. ఇక కుండలి (శేషపాన్పుపై) యోగనిద్రలో విశ్రమించుము.

-------------------------------------


🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝   *ధర్మార్థం క్షీణ కోశస్య కృశత్వమపి శోభతే* 

            *సురైః పీతావశేషస్య శరద్ధిమ రుచేరివ*.


తా𝕝𝕝 *దేవతలు త్రాగగా మిగిలిన సన్నని శరత్కాలపు వెన్నెల కాంతిలా*, ధర్మాచరణలో ఒకని *ధనాగారం క్షీణించిపోయినా, ఆ సన్నగిల్లటం కూడా శోభిస్తుంది*....

సహాయసహకారాలు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝   *అసహాయః పుమానేకః*

            *కార్యాన్తం నాధిగచ్ఛతి* l

           *తుషమాత్రే పృథక్ భిన్నే*

           *తణ్డులం న ప్రరోహతి* ll


తా𝕝𝕝 *ఎంతటి సమర్థుడైననూ అసహాయశూరుడైననూ ఒక్కడే అన్ని కార్యాలను స్వశక్తితో స్వసామర్థ్యంతో సాధించలేడు*.... అందుకు ఇతరుల సహాయసహకారాలు ఉండాలి. బియ్యపుగింజ పొట్టుతో కూడి ఉంటేనే మొలకెత్తుటకు యోగ్యమగుచున్నదిగదా!

చాతుర్మాస్యము

 🕉 *నేటి నుండి చాతుర్మాస్య దీక్షారంభము* 🕉️


చాతుర్మాస్యము- అవశ్యకర్తవ్యము


ఆషాఢే తు సితే పక్షే 

ఏకాదశ్యా ముపోషితః|

చాతుర్మాస్య వ్రతం కుర్యా

దత్కించిన్నయతో నరః’’||


చాతుర్మాస్యం గురించి ఇతిహాసం

ఒకటి ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మ దేవుడు సృష్టి నిర్మాణం చేస్తూ

అలసిపోయి నిదురించాడట. అది

గమనించిన దేవతలు ఒక యజ్ఞం

చేసి, అందులోంచీ ఉద్భవించిన

హవిస్సును బ్రహ్మకు ఇచ్చారట.

అది ఔషధంలా పని చేసి ఆయన

అలసటను పోగొట్టిందట. ఆ యజ్ఞమే వ్రతంగా చెప్పబడింది.

నియమనిష్ఠలతో, శ్రద్ధతో

నిర్వహించే కర్మానుష్ఠానమే వ్రతం.


బ్రహ్మ సృష్టి కార్యం చేస్తూ ‘ఏకం’,

‘ద్వే’, .త్రీణీ’, ‘చత్వారీ’ అంటూ

నాలుగు సార్లు ఆజ్యాన్ని

సమర్పించి, చివరగా ఒక సమిధను

కూడా వేశాడు. ఫలితంగా-

దేవతలు, దానవులు, పితరులు,

మానవులు అనే నాలుగు రకాల

జీవులను సృష్టించి, వారికి

రోమములు, మజ్జ మాంసములు,

ఎముకలను కూడా ఇచ్చాడు.

‘మాసం’ అనే పదానికి జ్ఞానం అనే

అర్థం ఉంది. ‘ఈ నాలుగు రకాల

జీవులలో జ్ఞానాన్ని ఉంచడం కూడా

ఈ వ్రత దీక్ష లక్ష్యం’ అని తైత్తరీయ

బ్రాహ్మణం అంటోంది. మరొక

నిర్వచనం ప్రకారం చతుర్ముఖుడైన

బ్రహ్మ లక్ష్మితో కలిసి సృష్టి చేశాడు.

‘చతుః+ మా+అస్యం

చాతుర్మాస్యం’. నాలుగు లక్ష్ములు

ముఖాలుగా- నాలుగు వేదాలు

చెప్పినవాడు బ్రహ్మ. వేదలక్ష్మియే

శ్రీవిద్య. ఈ నాలుగు నెలలూ- ప్రతి

రోజూ వేదాలను పూజించాలి.

అధ్యయనం, అధ్యాపనం చేయడం

ముఖ్యమైన అనుష్ఠామంగా భావన

చేయాలని ఉపనిషత్తు అంటోంది.


చాతుర్మాస్య వ్రతమును ప్రతి

ఒక్కరూ తప్పకుండ ఆచరించి

తీరవలెను. బ్రాహ్మణ, క్షత్రియ,

వైశ్య, శూద్ర, విధవాస్త్రీ, ముత్తైదువ, బ్రహ్మచారి, గృహస్థ,

వానప్రస్థ, సన్యాసి మొదలగువారు

ఈ వ్రతమును వదలకుండ చేసి

తీరవలెనని శాస్త్రాలు చెబుతున్నవి.


ఇటీవలి కాలంలో యతులు

మాత్రమే ఆచరిస్తున్న కారణంగా-

చాతుర్మాస్య వ్రతాన్ని సన్యాసులు

లేదా పీఠాధిపతుల కార్యక్రమంగా

భావిస్తున్నాం. వాస్తవానికి అన్ని

వర్గాల వారు సర్వ ఆశ్రమాల వారు

చాతుర్మాస్య వ్రతం పాటించాలని

శాస్త్రాలు చెబుతున్నాయి.


నిత్యం కార్యం చ సర్వేషాం 

ఏతద్ వ్రత చతుష్టయం |

నారీభిశ్చ నరైర్వాపి 

చతురాశ్రమ వర్తిభిః || 

బ్రాహ్మణః క్షత్రియః వైశ్యః 

స్త్రియః శూద్రో ప్రతీయథా || 

గృహీ వనస్థః కుటచోబహూదః

పరమహంసకః ॥ 

నరకాన్న నిర్వర్తంతే 

త్యక్త్వా వ్రత చతుష్టయం ॥ 


చాతుర్మాస వ్రతం

ఆచరించడమనేది ఇటీవలి

కాలంలో వచ్చినది కాదు. యుగ

యుగాలుగా ఆచరణలో ఉందని

విష్ణు ధర్మోత్తర, భవిష్య, స్కాంద

పురాణాలలోని కథనాల వలన

అవగతమవుతుంది. ఒకప్పుడు

ఇప్పటిలాగా కాక నాలుగు

నెలలుపాటు కొనసాగే ఋతువులు

మూడే ఉండేవట. అనంతర

కాలంలో రెండేసి నెలల పాటు 

ఉండే ఆరు ఋతువులుగా అవి

మారాయి. తొలినాళ్ళలో వర్ష,

హేమంత, వసంత - అనే మూడు

ఋతువులు మాత్రమే ఉండేవి. 

వర్ష ఋతువుతోనే సంవత్సరము

ఆరంభామవుతూ ఉండేది. ఈ

కారణం వల్ల సంవత్సరానికి " వర్షం"

అనే పేరు వచ్చింది. సంవత్సరానికి

మూడు ఋతువులున్న ఆ

కాలములో ఒక్క ఋతువు

ప్రారంభంలో ఒక్కో యజ్ఞం

చేస్తుండేవారు. ఆషాఢ పూర్ణిమ

నుండి వరుణ ప్రఘాస యజ్ఞం,

కార్తీక పూర్ణిమ నుండి సాకమేద

యజ్ఞం, ఫాల్గుణ పూర్ణిమ నుండి

వైశ్వ దేవయజ్ఞము చేస్తూ

ఉండేవారు. ఆనాటి ఆషాఢంలో

చేసే యజ్ఞమే అనంతర కాలం

నాటికి చాతుర్మాస్య వ్రతము గా

మారి ఆచరణలోకి వచ్చిందని

పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస

వ్రతము పాటించేవారు. ఆహార

నియమాలలో భాగంగా శ్రావణ

మాసంలో ఆకుకూరలను, భాద్రపద

మాసంలో పెరుగును ఆశ్వయుజ

మాసంలో పాలను కార్తీక మాసంలో

పప్పు పదార్థాలను విధిగా వదిలి

పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ

మాత్రము స్వీకరించ కూడదు. 

పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం

వాడవచ్చును. ఈ ఆహార

నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ

సంబంధ రోగాల నుంచి కాపాడు

కోవటానికి బాగా ఉపకరిస్తాయి.

ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య

వ్రతదీక్ష అనేది మానవాళి ఆరోగ్య

పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత

దీక్ష అని పురాణ వాఙ్మయం

వివరిస్తోంది. 


ఏకభుక్త మధశ్శయ్యా

బ్రహ్మచర్య మహింసనమ్

వ్రతచర్యా తపశ్చర్యా

కృచ్చచాంద్రాయణాదికమ్

దేవపూజా మంత్రజపో దశైతే

నియమాః స్మృతాః


చతుర్మాసాలు అంటే, ఆషాఢ శుక్ల

ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి

వరకు గల సమయం నాలుగు

నెలలు. ఆషాఢ, శ్రావణ, భాద్రపద,

ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే

కాలంలో సాధకులు భూశయనం

చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి,

సొరకాయ, టమాట, ఆవనూనెల

సేవనం మానివేయటం, నిరంతర

జప, తప, హోమ, పురాణ కథా

శ్రవణాల్లో కాలం గడపటం, రోజూ

ఒకే పూట భోజనం చేయటం,

ఏకాదశులలో పూర్తిగా ఉపవాస

దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను

పాటిస్తారు. పీఠాధిపతులు,

దీక్షితులు ఒకే స్థానంలో

నివసించటం, క్షురకర్మలు

నిషేధించడం వంటి నియమాలు

పాటిస్తారు. శ్రావణ, బాధ్రపద

మాసాలు గృహస్థుల నియమాలకు

సరైనవని పద్మపురాణం

తెలుపుతోంది. బాధ్రపద కృష్ణ

ఏకాదశిని అజా ఏకాదశి అంటారు.

ఇది సమస్త పాపాలను

తొలగిస్తుందంటారు. 


హరిశ్చంద్ర మహారాజు సత్యం,

ధర్మం తప్పక తన భార్యకు

దూరమై అనేక ఇక్కట్ల

పాలైనప్పటికీ చాతుర్మాస్య

వ్రతాన్ని మరువలేదని, చివరికి

విజయం చేకూరిందని చెబుతారు.


చాతుర్మాస్యవ్రతము త్యజించినచో

మహాదోషము.


అవ్రతేన నయేద్‌యస్తు

చాతుర్మాస్యమనుత్తమం॥

సపాపీ నరకం యాతి

యావదాభూత సంప్లవం ॥ 


వ్రతము చేయకుండ ఎవరైతే 

ఈ చాతుర్మాస్యాన్ని గడిపెదరో

అటువంటివారు మహా

ప్రళయకాల పర్యంతము

నరకములో పడతాడు.


వ్రతము చేయుట వలన మహాపుణ్యము


ఇదం వ్రతం మహాపుణ్యం

సర్వపాపహరం శుభం ॥

సర్వాపరాధ శమనం

సర్వోపద్రవనాశనం ॥


ఇతర వ్రతములు


పరాకం షష్టకాలం చ 

తథా ధారణపారణం | 

లక్షవర్తివ్రతం చైవ 

భీష్మ పంచకమేవచ ||

తథాలక్షనమస్కారవ్రతం 

లక్ష ప్రదక్షిణం || 

చాతుర్మాస్యే వ్రతాన్యాహుః 

ఏతత్ కామ్యమితీరితం॥


శాకాదివ్రతములే కాక,

పరాకవ్రతము, 

షష్ఠకాల వ్రతము,

ధారణ పారణ వ్రతము, 

లక్ష ఒత్తుల వ్రతము,

భీష్మపంచకవ్రతము, 

లక్ష నమస్కార వ్రతము, 

లక్ష ప్రదక్షిణ వ్రతము,

తులసీ, గో ప్రదక్షిణము,

గోదానము ఇత్యాది వ్రతములు

కూడా చేయుట వలన విశేష

పలములు లభించును.


‘శ్రావణే వర్జయేత్‌ శాకం 

దధి భద్రపదే తథా!

దుగ్ధ మాశ్వయుజే మాసి 

కార్తికే ద్విదళాం తథా!!’’


శ్రావణ మాసంలో కూరగాయలను,

భాద్రపద మాసంలో పెరుగును,

అశ్వయుజ మాసంలో పాలు, పాల

పదార్ధాలనూ, కార్తీకంలో రెండు

బద్దలుగా విడివడే పప్పు

ధాన్యాలూ లేదా పప్పుతో చేసిన

పదార్ధాలనూ త్యజించాలి.


దీనికి కారణాలు ఏమిటంటే,

ఋతువులు మారుతున్న

సమయంలో వ్యాధులు

ప్రబలుతాయి. ముఖ్యంగా గ్రీష్మం

నుంచి వర్ష ఋతువు, ఆపైన

శరదృతువు కాలంలో వీటి ప్రభావం

మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ

ఋతువుల సంధ్య కాలాన్ని

యమదంష్ట్రలని అందుకే అన్నారు. శాస్త్ర రీత్యా ఆషాఢంలో

కామోద్దీపకం హెచ్చు. అందుకే

నూతన దంపతులను దూరంగా

ఉంచుతారు. భాద్రపదంలో

వర్షాలతో నదులలో నీరు

బురదమయంగా ఉంటుంది.

ఆ నీరు తాగితే రోగాల బారిన

పడతారు. అజీర్ణం లాంటి వ్యాధులు ప్రాప్తిస్తాయి. వీటిని

నియంత్రించడానికి నియమిత

ఆహారం, ఉపవాసాలు ఈ నాలుగు

మాసాల్లో చెయ్యాలి. వీటినే

చాతుర్మాస్య నియమంగా- ఆరోగ్య

రీత్యా చెప్పడం జరిగింది. ఈ

నాలుగు నెలల్లో ఎన్నో పండుగలు,

పర్వాలు పేరిట కట్టడి చేయడం

 కూడా జరిగింది. వ్రతాలు,

మహాలయ పక్షాలు, శరన్నవరాత్రులు, కార్తీక స్నానాలు, 

శివారాధనలు ఇలా ఏర్పాటు చేసినవే.


శాక వ్రతము:-


శాక వ్రతములో సకల

కూరగాయలను త్యజించవలెను.

దశవిధములైన శాకములు.

శాకములనగా కేవలము

కూరగాయలని అర్థము కాదు.

చెట్టుకు సంబంధించిన, మూలము,

పత్రము, కరీరము, మొలకలు,

చెట్టు అగ్రభాగము, ఫలములు,

కాండము, వేరు, పండు, దంటు,

చెక్క, పూవు, తొక్క, మొగ్గుచిగురు,

ఆకులు, ఆకుకూరలు, కరివేపాకు, ఇవే మొదలైనవాటిని

శాకవ్రతములో వర్జ్యము.


శాకవ్రతములో స్వీకరించుటకు

యోగ్యములు:- 

బేడలు, తులసీ, అతసీ, బ్రాహ్మీ,

 మిరియాలు, జీలకర్ర, ఎండుశుంఠి,

 పాలు, పెరుగు, నెయ్యి, తేనె,

 ఇంగువ, ఎండిన ఉసిరికాయ

 ఉపయోగిస్తారు.


ప్రప్రథమముగా చాతుర్మాస్య వ్రత

సంకల్పమును చేసుకొనవలెను.

ప్రథమ మాసములో శాక

వ్రతమును, ద్వితీయ మాసములో

దధి వ్రతమును, తృతీయ

మాసములో క్షీర వ్రతమును,

నాల్గవ మాసములో 'ద్విదల'

మరియు బహుబీజ వ్రతమును

ఆచరించవలెను.


కర్కాటక సంక్రమణం నుండి కానీ,

అషాఢ శుక్ల దశమి, ఏకాదశి,

పూర్ణిమ తిథి నాడు ప్రారంభించి

కార్తీక  శుద్ధ ద్వాదశి, పౌర్ణమికి

సమాప్తి చేయవలెను. 


సుప్తే త్వయిజగన్నాథ 

జగత్‌సుప్తం భవేదిదం|

విబుద్ధే చ విబుద్ధ్యేత 

ప్రసన్నోభవ మేకచ్యుత | 

చతురో వార్షికాన్ మాసాన్ 

దేవ దేవ జగత్పతే |

నిర్విఘ్నం సిద్ధిమాయాతు

ప్రసాదాత్ తవకేశవ |

గృహీతే॑స్మిన్ వ్రతే దేవ 

పంచత్వం యదిమేభమే|

తదాభవేత్ సుసంపూర్ణం 

ప్రసాదాత్తే జనార్దన||


ఈ విధముగా ప్రార్థించవలెను.

పంచగవ్య శుద్ది చేసుకొని,

అచమన, ప్రాణాయామ,

సంకల్పంతో శ్రీధర, హృషీకేశ,

పద్మనాభ, దామోదర రూపాణాం

ప్రీతిం కామయమానః చాతుర్మాస్య

వ్రతాంగ శాకవ్రత, దధివ్రత, క్షీరవ్రత

ద్విదళ వ్రతాఖ్య చతుర్విధ వ్రతం

స్వీకరిష్యే.


శాకవ్రత సంకల్పము 

(ఆషాఢ శుక్ల ద్వాదశీ- పూర్ణిమ):


శాకవ్రతం మయాదేవ

గృహీతం పురతస్తవ। 

నిర్విఘ్నం సిద్ధి మాయాతు

ప్రసాదాత్ తే రమాపతే ॥


శాక సమర్పణ:-

ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే । 

శాకంతు ద్విజవర్యాయ 

స హిరణ్యం దదామ్యహం॥


దధివ్రత సంకల్పము : 

(శ్రావణ శుక్ల ద్వాదశీ-పూర్ణిమ)


దధిభాద్రపదే మాసి 

వర్ణయిష్యే సదాహరే || 

ఇమంకరిష్యే నియమం 

నిర్విఘ్నం కురు కేశవ ॥


దధివ్రత సమర్పణము:-


ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే !

ద్విజవర్యాయ దాస్యేంహం

స హిరణ్యం ఘనం దధి ॥


క్షీర వ్రత సంకల్పం 

(భాద్రపద శుక్ల ద్వాదశీ-పూర్ణిమ)

క్షీరవ్రతమిదం దేవ 

గృహీతం పురతస్తవ | 

నిర్విఘ్నం సిద్ధిమాయాతు

ప్రసాదాత్ తే రమాపతే ॥


క్షీరవ్రత సమర్పణ :-

ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే | 

క్షీరంతు ద్విజవర్యాయ 

స హిరణ్యం దదామ్యహం ॥


ద్విదళవ్రత సంకల్పము:-

(ఆశ్వయుజ శుక్ల ద్వాదశీ)

కార్తికే ద్విదలంధాన్యం 

వర్ణయిష్యే సదాహరే || 

ఇమంకరిష్యే నియమం 

నిర్విఘ్నం కురు కేశవ ॥


ద్విదళ సమర్పణ :-


ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే | 

ద్విదలం ద్విజవరాయ 

స హిరణ్యం దదామ్యహం ॥


చాతుర్మాస్యవ్రత సమర్పణ


ఇదం వ్రతం మయాదేవకృతం

ప్రీత్యై తవప్రభో | 

న్యూనం సంపూర్ణతాం యాతు

త్వత్ప్రసాదాత్ జనార్ధన ॥


అదీ కాకుండా, పరివ్రాజకులు

గ్రామాల్లో సంచరిస్తే, వారి బాగోగులు చూడడానికి పల్లెవాసులకూ, గృహస్థులకూ ఇబ్బంది. ఎందుకంటే వారంతా వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటారు. అందువల్ల పరివ్రాజకులు ఏదో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని, నాలుగు మాసాలపాటు తమ సమయాన్ని భగవత్‌ చింతనతో పాటు ధర్మప్రచారానికే వినియోగించాలని నియమం ఏర్పాటు చేశారు. అందరూ ఆరోగ్యవంతమైన జీవితాలు గడపాలని హిందూధర్మశాస్త్రాలు ఆకాంక్షించాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమయమైన కుటుంబవ్యవస్థ, సాంఘిక వ్యవస్థలతో ప్రజలంతా మనుగడ సాగించాలన్న సదుద్దేశంతో మన పూర్వ ఋషులు సంస్కృతి, సంప్రదాయం పేరుతో ఏర్పరచిన వ్రతం ఇది. జీవితంలో ఒక్కసారి చాతుర్మాస్య వ్రతాన్ని అనుసరించినా, దాని ఫలితాన్ని

కలకాలం అనుభవిస్తారని శాస్త్రాలు

చెబుతున్నాయి.


🔯

పిల్లల నుండి ఆశిస్తుంటే

 🔔 *అనగనగా....* 🔔


ఒక జడ్జి తన వృత్తినుండి పదవివిరమణ అయ్యాక తన భార్య తో తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు.


"లక్ష్మీ నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని జడ్జి గా ఉన్నప్పుడు కాని ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది చూడనే లేదు"  అని అన్నాడు.


ఏంటా కేసు అని ఆమె అడగగా


"ఒక తండ్రి తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు" అన్నాడు


కొడుకుని పిలిచి 

"ఏంటయ్యా నీ తండ్రికి నెలకు సరిపడండబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు"  అని అడిగాను


"మా తండ్రిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందిన వ్యక్తి.

నెలనేలా ఆయనకు పెన్షన్ వస్తున్నది.

బాగానే డబ్బులు ఉన్న వ్యక్తి నా పైన ఇలా ఎందుకు కేసు పెట్టాడో అర్థం కాలేదు"  అని కొడుకు అన్నాడు


ఆ తండ్రి "అవును డబ్బుకు నాకు లోటులేదు కాని నా కొడుకు నెలకు 100 రూపాయలు కానివ్వండి స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వమని" అడిగాడు


తీర్పు చెప్పాక ఆ తండ్రిని కలిసాను.. ఎందుకయ్యా ఇలా అడిగావు అని ప్రశ్నించాను.


"మాకు ఉన్నది ఒక్కడే కొడుకు.... మీరు ఇచ్చే తీర్పు కారణంగా అయినా నెలకు ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మాతో గడిపి వెళ్ళగలడని ఆశ... వాళ్ళ అమ్మకు వాడంటే ప్రాణం" అని అన్నాడు


ఇలా చెబుతూ ఆయన కళ్ళు తడిచాయి😢


డబ్బే ప్రధానం అనుకుంటారు... అంత కంటే ఎక్కువగా మనల్ని ఎదురుచూసే వారుంటారు అని గుర్తించలేము.


 *అప్పటి కన్నవారికి నేడు ఉన్న తల్లితండ్రులకి చాలా తేడా  కనిపిస్తుంది*


 *నాటి కాలంలో మా పిల్లలు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు పిల్లలు మా కళ్ళ ముందు ఉంటే చాలు.. సరిపడా సంపాదన చాలు అనుకునే వారు*


*నేడు తల్లిదండ్రులు, పిల్లలు అంటే వారు విదేశాలకు వెళ్ళిపోవాలి... లక్షలు సంపాదించాలి అని కోరుకుంటున్నారు*



అందుకే  ప్రేమ ఆప్యాయతలు బంధాలు అనేవాటికి విలువ లేకుండా పోయింది 


ఎవరైనా ఇవన్నీ పిల్లల నుండి  ఆశిస్తుంటే పిచ్చి వాళ్లను చూసినట్టు చూస్తున్నారు.




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

కర్కాటక సంక్రమణం

 *🌞ॐ మంగళవారం జూలై 16వ తేది, 2024🌞*


           *


*కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం - రా॥ 11.09 నుండి* 


    శాస్త్ర ప్రకారం జనవరి 15 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణం , 

జూలై 17 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు...

దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం , సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి. 

సూర్య గమనాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు...

భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.


ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం...

కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది...

సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. 

ఆ సమయంలో స్నాన , దాన , జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి...


*ఖగోళ శాస్త్రం ప్రకారం* సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ , దక్షిణాయనాలు, *'అయనం'* అంటే ప్రయాణం అని అర్ధం. 

దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. 

సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు, కానీ సూర్యోదయాన్ని గమనిస్తే , అది తూర్పు దిక్కున జరగదు.

సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే, అవి మార్చి 21 , సెప్టెంబరు 23.  మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది...


సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని *'ఉత్తరాయాణం'* అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని *'దక్షిణాయనం'* అని అంటారు...

ఈ దక్షిణాయణంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు...


ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. 

ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు...

ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం, అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. 

అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది, శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. 

ఈ సమయంలో యోగులు , మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.


శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది, ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. 

వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. 

ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప , దాన , పూజలు ఆరోగ్యాన్ని , అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి...


ముఖ్యంగా దక్షిణాయణంలోనే పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు.

 ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన *మహాలయ పక్షాలు* వస్తాయి...

 పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. 

శ్రాద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతానలేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు.

 బతికుండగా తల్లిదండ్రులసేవ , మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి , ఎంతో ముఖ్యం , శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. 

అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.


*చేయవలసినవి*


ధ్యానం , మంత్ర జపాలు , సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు , పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు , సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం , అవసరంలో ఉన్న వారికి దానం చేయడం , అన్నదానం , తిల (నువ్వుల ) దానం , వస్త్ర దానం , విష్ణు పూజ , విష్ణు సహస్రనామ పారాయణ , సూర్యరాధన , ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి , మనసుకు మేలు చేస్తాయని , పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు, దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి ?


జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు.... అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది.

 అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. 

శనిగ్రహం 2 1/2 సం పడుతుంది. 

రాహు , కేతువులకి 1 1/2 సం , రవికి నెల రోజులు... ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీన రాశులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది. 


సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో *‘మేష సంక్రమణం’* అని

సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో *‘వృషభ సంక్రమణం’* అని

సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో *‘మిథున సంక్రమణం’* అని

సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో *‘కర్కాటక సంక్రమణం’* అని


ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి *‘జరగటం’* , *‘ప్రవేశించటం’* అని చెప్పొచ్చు.


సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అని అర్ధం. ఇది జూలై 15నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది.

 సాధారణంగా జూలై 16వ తేదీనే !


ఈ కర్కాటక సంక్రమణాన్ని *‘దక్షిణాయణ’* మని అంటుంటారు. *(మనకి సంవత్సరానికి అయనములు రెండు. ఒకటి ఉత్తరాయనం , రెండవది దక్షిణాయనం)* ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం , తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలాన్ని సంక్రమణంగా చెప్తాం, (మకర సంక్రమణం (సంక్రాంతి)... మకరరాశి ప్రవేశం. కుంభరాశి ప్రవేశం (మహా శివరాత్రి) అయితే సూర్యుని మకర సంక్రమణ మే *‘ఉత్తరాయణ పుణ్యకాలం’*.


ఏ తిథులతోను సంబంధం లేకుండాను , ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ - దక్షిణాయన మనేవి. జనవరి 14 న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ , జూలై 16 న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు. 

ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.


సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. 

దీనికే *‘సంక్రమణం’* అని పేరు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. 

ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు.  

దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా , దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు , దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. 

దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం , విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.


దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి , వినాయక చవితి , రాఖీపూర్ణిమ , ఆదిపరాశక్తి మహిమలనుచాటే దసరా , నరక బాధలు తొలగించిన దీపావళి , శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక , మార్గశిర మాసాలు , గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి.

     ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. 

    కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు.    

   దక్షిణాయనంలో చేసే పితృకర్మలు ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి.

 దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.


దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ , గృహ ప్రవేశం. , ఉపనయనం , వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు.

 కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు , భైరవ , వరాహ , నృసింహ , మహిషాసుర మర్దని , దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. 

కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు , జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని , లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు , పాపాలు వైదొలగుతాయి. 

వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.


సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది.

 ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి.

 అందుకే *మోక్షానికి ఉత్తరాయణం , ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.* ఈరోజు పుణ్యనదీ స్నాన , దాన , జప , హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది...

🌴🎋🌾🌞🌹🛕🌹🌞🌾🎋🌴

            *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*


                🌷 *సేకరణ*🌷

           🌹🌷🌞🌞🌷🌹

                   *న్యాయపతి*

               *నరసింహా రావు*


*(క్రితం సంవత్సర సందేశం యథాతథం)*

🙏🌴🌞🌹🌷🛕🌷🌹🌞🌴🙏

హెచ్.సి.వర్మ. కాన్పూర్ ఐఐటీలో సీనియర్ ప్రొఫెసర్





 *👏  ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి *👏  ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ హెచ్.సి.వర్మ. కాన్పూర్ ఐఐటీలో సీనియర్ ప్రొఫెసర్. "కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్" అని ఆయన రాసిన పుస్తకానికి సంవత్సరానికి సుమారు కోటి రూపాయల రాయల్టీ వస్తుంది. దాన్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు మరియు ఇతర సేవాసంస్థలకు విరాళంగా ఇస్తారు. తనకొచ్చే జీతంలో నుంచే అనేక మంది పేద విద్యార్థులకు ఫీజులు కడుతుంటారు. ఇప్పటికీ తన పాత ప్రియా స్కూటర్ మీదనే ప్రయాణం చేస్తుంటారు. చెత్త రాజకీయాల మీదున్న శ్రద్ధ కనీసం ఒక వంతు దేశం మీదున్నా  మీడియా ఈ విషయాన్ని మనకి తెలియచేసేది* 👏

 హెచ్.సి.వర్మ. కాన్పూర్ ఐఐటీలో సీనియర్ ప్రొఫెసర్. "కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్" అని ఆయన రాసిన పుస్తకానికి సంవత్సరానికి సుమారు కోటి రూపాయల రాయల్టీ వస్తుంది. దాన్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు మరియు ఇతర సేవాసంస్థలకు విరాళంగా ఇస్తారు. తనకొచ్చే జీతంలో నుంచే అనేక మంది పేద విద్యార్థులకు ఫీజులు కడుతుంటారు. ఇప్పటికీ తన పాత ప్రియా స్కూటర్ మీదనే ప్రయాణం చేస్తుంటారు. చెత్త రాజకీయాల మీదున్న శ్రద్ధ కనీసం ఒక వంతు దేశం మీదున్నా  మీడియా ఈ విషయాన్ని మనకి తెలియచేసేది* 👏