*అశ్వత్థ మేకం పిచుమన్ద మేకం* *న్యగ్రోధ మేకం దశతింత్రిణీకం!*
*కపిత్థ బిల్వాఽమలక త్రయంచ* *పంచామ్రవాపీ నరకం న* *పశ్యేత్!!*
ఒక రావి చెట్టు, ఒక పిచుమన్ద వృక్షం, (అంటే వేప చెట్టు. దీనినే నింబతరువు అని కూడా పిలుస్తారు.) ఒక మర్రి చెట్టు, పది చింత చెట్లు, మూడు వెలగ చెట్లు, మూడు మారేడు చెట్లు, మూడు ఉసిరిక చెట్లు, అయిదు మామిడి చెట్లు కలిగిన తోటను పెంచాలని ఈ శ్లోకంలో చెప్పబడింది. దానిలో ఒక దిగుడు బావిని తవ్వించమని కూడా చెప్పారు.అలా చేసిన వారు నరకం చూడరని దీని భావం! అంటే, వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు.
స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని శ్లోకంలో చెప్పిన లెక్క ప్రకారం అవే చెట్లను నాటి,అక్కడ ఒక దిగుడు బావి తవ్విస్తే సరిపోతుంది. లెక్క కేం కానీ , వీలైనన్ని చెట్లను పెంచి తగిన నీటి వసతి ఏర్పరచ మని చెప్పడమే ప్రధానోద్దేశ్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి