11, జూన్ 2021, శుక్రవారం

భిన్నార్థ పదాలు

 భిన్నార్థ పదాలు 

క్రింద కొన్ని మనం రోజు ఉపయోగించే సాధారణ పదాలు వున్నాయి.  వాటికి రెండు అర్దాలుగా వాడ వచ్చు ఉదాహరణకు చేయి అనే పదం వుంది దానిని ఏదైనా పని చేయి అని లేదా హస్తం అనే రెండు అర్ధాల్లో వాడొచ్చు 

క్రింది వాటికి అటువంటి అర్ధాలను కనిపెట్టండి. 

1) తెలుపు 

2) నలుపు 

3) కలుపు 

4)పన్ను 

5) వలువ 

6) కాయ 

7) చెరుపు 

8) నూరు 

9) మీరు 

10) కూర 

11) అడుగు 

12) వాడనివి 

13) 

Caves

 https://docs.google.com/document/d/1-nbs9v6NIrtKdXrXCekjY_T6L9w6YDj3ZzRXVdyviRM/edit?usp=drivesdk

చిలుక కథ

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

*విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ గారు రాసిన* *🦜చిలుక కథ🦜*

              🌷🌷🌷

 *ఒక చిలుక ఉండేది.  చక్కగా పాడేది.  స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేక పోయేది.  అది రాజు గారి తోటలోని చిలుక.* 


*ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది.  వెంటనే మంత్రిని పిలిచి 'ఎడ్యుకేట్ ఇట్' అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి.* 


*ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే, మొదట అది కుదురుగా ఉండాలి. అంటే, అది ఎగురకూడదు. వెంటనే ఒక మంచి పంజరం చేయించారు.  చిలుకను అందులో కూర్చోబెట్టారు.* 


*కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు వచ్చాడు. చిలుకను చూశాడు. 'ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు' అన్నాడు. గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైంది.* 


*పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లేవరూ 'అబ్బా, భలే చిలుక' అనటం లేదు. ' అబ్బా, ఏం పంజరం!' అంటున్నారు. లేదంటే' అబ్బా! ఎంత చదువు!' అంటున్నారు.  రాజు గారిని మెచ్చుకుంటున్నారు. మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు.  రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారుచేసిన కంసాలిని, చదువు చెప్పటానికి వచ్చిన పండితుడిని 'ఆహా! ఓహో ' అని కీర్తిస్తున్నారు.* 


*రాజు గారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు... ఎన్ని లక్షల వరహాలు ఖర్చైన పర్వాలేదు.  చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని.* 


 *' అలాగే ' అని లక్షల వరహాలు దఫా దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి.* 


 *ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో* *చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. 'చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారహో ' అని తప్పెట్లు, తాళాలు, పెద్ద పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు.* 


 *రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరం లోని చిలుకను ఎవరు పట్టించు కోవటం లేదు.  ఎవరూ దాని వైపు చూడటం* *లేదు. పండితుడు ఒక్కడే చూస్తున్నాడు.  ఆయనైనా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప, చిలకెలా ఉందో చూడటం లేదు.  చిలుక బాగా నీరసించి పోయింది.* *మానసికంగా బాగా నలిగిపోయి ఉంది* . 


*ఆ రోజైతే .... రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది!  ఆ సంగతి ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు.  ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు.* 


*రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి, 'చిలుక ఎలా చదువుతోంది?' అని అడిగాడు.* 

*' చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి' అన్నాడు మేనల్లుడు.* 

*రాజుగారు సంతోషించారు. *తన కృషి ఫలించిందన్నమాట.* 

*'ఇప్పటికి అల్లరి చిల్లర గానే ఎగురుతోందా?'* 

*'ఎగరరదు'* 

*'ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా? '* 

*'పాడదు'* 

*' సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా'* 

*తీసుకొచ్చాడు మేనల్లుడు.* *చిలుక నోరు తెరవడం లేదు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చిలుక కడుపు* *ఉబ్బెత్తుగా ఉంది.  చిలుక అసలు కదలనే కదలటం లేదు.* 


*" ఆ కడుపులోనిది ఏమిటి!"అనిఅడిగారు రాజు గారు.* 

*'జ్ఞానం మామయ్య' అని చెప్పాడు మేనల్లుడు.* 


*'చిలుక చనిపోయినట్లు ఉంది కదా' అన్నారు రాజుగారు.* 

*చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా* *బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు.* 


*నూరేళ్ళ క్రితం విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ రాసిన చిలుక కథ ఇది. ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థలకు సరిగా సరిపోతుంది కదా!* 

సేకరణ: మానస సరోవరం

బహిరంగ లేఖ :

 “ కోవిడ్ వాక్సిన్”  ల పై  దుష్ప్రచారాన్ని ఖండిస్తూ TV5 యాజమాన్యానికి బహిరంగ లేఖ :


అయ్యా !


          మీ ఛానల్ లో గడచిన రెండురోజులలో కరోనా పై జరిపిన ఒక చర్చకు సంబందించిన 5 ని ల .14 సె.ల నిడివిగల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యింది . ఆ చర్చకు  moderator గా Mr . సాంబశివరావు చర్చలో ఉన్నారు  మరియు చర్చలో కెమికల్ ఇంజనీర్ Mr . మల్లిక్ పరుచూరి, ఇంకా తదితరులు పాల్గొన్నారు .


 ఈ చర్చ లో కోవిడ్ variants గురించి , వాక్సిన్ ల efficacy గురించి అవాస్తవాలను , అబద్దాలను , అర్ధ సత్యాలను చెప్పి ప్రజలను గందరగోళపరిచారు  .  3rd wave గురించి చేసిన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు కూడా ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి.  


******************************


1. కెమికల్ ఇంజనీర్ చెప్పిన అవాస్తవం :


  IGIB సైంటిస్టు డాక్టర్. వినోద్ స్కారియా MedRxiv లో అప్లోడ్ చేసిన కొత్త పేపర్ లో కోవిషీల్డ్ , కోవాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కూడా కోవిడ్ వస్తుంది . వాళ్ళ RTPCR శాంపిల్స్ లో Ct values ( cycle threshold ) దారుణంగా పెరుగుతున్నాయి . దీనివలన కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కూడా శరీరం దారుణమైన స్థితి లో కుళ్ళిపోతుంది . gap ఇవ్వకుండా కుళ్ళ బెట్టేస్థది.లోపల కుళ్ళిపోయిందని బయటకు తెలిసేటప్పటికే , పడిన తర్వాత రోజే వెంటిలేటర్ ఎక్కాల్సివస్తుంది . 


వాస్తవం :


       MedRxiv లోఅప్లోడ్ చేసిన స్టడీ పేపర్ యొక్క title “ Variants of concern responsible for SARS-COV-2 Vaccine breakthrough infections from India “ . ( pdf ను ఈ మెసేజ్ కి అనుబంధం గా పెట్టాను ).


 మార్చి 28 వతేదీ 2021 నుండి ఏప్రిల్ 30 వ తేదీ 2021 వరకు జరిగిన ఈ స్టడీ ని AIIMS న్యూఢిల్లీ మరియు CSIR – IGIB వారు సంయుక్తంగా చేశారు. వాక్సిన్ ఒక డోస్ , రెండు డోస్ లు వేయించుకున్న తర్వాత కోవిడ్ లక్షణాలు ఉండి , స్వచ్చందంగా ఆసుపత్రికి వచ్చిన వారి నుండి శాంపిల్స్ తీసుకొని , 36 శాంపిల్స్ కు జెనెటిక్ పరీక్షలు చేశారు . అందులో 63.9% కోవిడ్ డెల్టా variant కాగా , మిగిలినవి కప్పా variant,  UK variant మరియు ఇతర variant లు. వీరిలో రోగనిర్ధారణ సమయంలో viral load ఎక్కువగా ఉంది ( ఒక డోస్ వాక్సిన్ తీసుకున్నా (లేక) రెండు డోసులు తీసుకున్నా సరే , కోవిషీల్డ్ అయినా.. కోవాక్సిన్ అయినా ) మరియు జ్వరం తీవ్రత.... వాక్సిన్ తీసుకోని రోగులలో వలే 5 నుండి 7 రోజులు ఉంది .


    తరువాత మాత్రం ఈ స్టడీ గ్రూప్ లోని వారికి ఎవ్వరికీ రోగ తీవ్రత పెరగటం లేదు ( అనగా పరీక్షలలో biomarkers / inflammatory markers సాధారణంగా (stable ) గానే ఉన్నాయి ; మరియు ఎటువంటి మరణాలు సంభవించలేదు  ( పరిశోధనా పత్రంలోని పేజీ 4-5). 


అదే పరిశోధనా పత్రంలోని  5 వ పేజీ లో స్టడీ పీరియడ్ సమయంలో  ఢిల్లీ లో ఏ కోవిడ్ variants అయితే అత్యధికంగా వ్యాప్తిలో ఉన్నాయో , అవే వాక్సిన్ వేయించుకున్నవారికి కూడా వచ్చాయి. ( ఏప్రిల్ నెల  2020 లో ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం , ఢిల్లీ లో 60% పైగా కోవిడ్ కేసులు ‘ డెల్టా variant ’ వలనే వచ్చాయి ).


పరిశోధనా పత్రం లోని వాస్తవాలు ఇలాఉంటే .... TV5 చర్చలో ‘ కెమికల్ ఇంజనీర్ గారు ...  “  కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కూడా శరీరం దారుణమైన స్థితి లో కుళ్ళిపోతుంది . gap ఇవ్వకుండా కుళ్ళ బెట్టేస్థది. లోపల కుళ్ళిపోయిందని బయటకు తెలిసేటప్పటికే , పడిన తర్వాత రోజే వెంటిలేటర్ ఎక్కాల్సివస్తుంది “ అని చెప్పడం బుద్ధిపూర్వకంగా అసత్య ప్రచారం చేసి , శాస్త్రీయ విషయాలను వక్రీకరించి,  ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం కాదా !!


ఎందుకంటే శరీరంలోపల కుళ్ళిపోవటం అంటే “ necrosis జరిగి రోగి తీవ్రమైన sepsis లోకి వెళ్తారు. తద్వారా తీవ్రమైన అనారోగ్యం వచ్చి, బి‌పి పడిపోయి , శ్వాసతీసుకోవడం కష్టమయ్యి , రక్త పరీక్షలలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి . severe sepsis వచ్చిన వారిలో 70% పైగా మరణాలు ఉంటాయి. కానీ ఆయన చెప్పినట్లు  శరీరం లోలోపల కుళ్ళిపోతే ... స్టడీ గ్రూప్ లో ఒక్క మరణం లేదు ! ఒక్క రక్త పరీక్ష లో కూడా  మార్పు లేదు.


***  నిజంగా వాక్సిన్ పనిచేయకపోతే .... స్టడీ లో biomarkers ఎందుకు పెరగలేదు ? ఎందుకు మరణాలు లేవు ?. 


*****************************


2. కెమికల్ ఇంజనీర్ చెప్పిన అవాస్తవం :


డెల్టా variant పై ఏ వాక్సిన్ పనిచేయదు . 


వాస్తవం : 


  A )  వాస్తవాల వివరణ లోకి వెళ్ళే ముందు , ప్రపంచ ఆరోగ్యసంస్థ వాక్సిన్ ల యొక్క efficacy , effectiveness నిర్వచనాల గురించి స్థూలంగా అర్ధం చేసుకోవాలి .


 Efficacy అంటే “పరిశోధనా సమయం లో వాక్సిన్ తీసుకున్న ఎంత శాతం మంది కి వ్యాధి సోకలేదు “ అని చెప్తుంది . వాక్సిన్ effectiveness అంటే “ సాధారణ పరిస్థితులలో ( పరిశోధనలలో కాకుండా) వాక్సిన్ తీసుకున్న వారికి ఎంతమందికి వ్యాధి సోకలేదు “.


 ఇందులో ఒక్క వ్యాధి సోకడమే కాకుండా , ఆరోగ్య వ్యవస్థలు / ప్రభుత్వాల ప్రాధాన్యతలు అయినంటువంటి తీవ్రమైన వ్యాధి రాకుండా ఉండటం , ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఉండటం , మరణాలు సంభవించకుండా ఉండటం లాంటివి కూడా పరిగణలోకి తీసుకుంటారు.



B ) మనందరి అనుభవం :


          మనందరం మన ఇళ్ళల్లో  ఉన్న చిన్న పిల్లలకు టీకాలు ( వాక్సిన్ లు ) వేయిస్తున్నాము. పోలియో చుక్కలు యొక్క efficacy – 90% మాత్రమే , measles వాక్సిన్ యొక్క efficacy -85% మాత్రమే. అయినా మనమందరం క్రమం తప్పకుండా మన పిల్లలకు టీకాలు వేయిస్తున్నాము . 90% మాత్రమే efficacy ఉన్న వాక్సిన్ ని అందరికీ వేయించి , మన దేశం నుండే పోలియో నే లేకుండా చేశాము . 95% efficacy ఉన్న మశూచి వాక్సిన్ తో , మశూచి అనే వ్యాధి భూమి మీద లేకుండా చేయగలిగాము . దీనికి కారణం 80% మంది కన్నా ఎక్కువమందికి టీకాలు వెయ్యడం ద్వారా , Herd (సామూహిక) ఇమ్యూనిటీ వచ్చి వైరస్ ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమించడం గణనీయంగా తగ్గిపోయి , వ్యాధులు కనుమరుగవటమో (లేక) బాగా తక్కువ మందికి రావటమో జరుగుతుంది. ఇది మన జీవిత కాలం లో,  మనందరం అనుభవంతో తెలుసుకున్న విషయం .


అదే 60% లోపు efficacy ఉన్న BCG , ఫ్లూ వాక్సిన్ లు ... వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆయా వ్యాధుల యొక్క  తీవ్రతను , ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన అవసరాన్ని , మరణాల సంఖ్యను గణనీయం గా తగ్గించాయి. 


C )  ‘ డెల్టా variant పై ఏ వాక్సిన్ పనిచేయదు’ అన్న అవాస్తవం పై వివరణ :-


పూణే లోని  National institute of Virology, ICMR మరియు భారత్ బయోటెక్ సంయుక్తంగా చేసిన పరిశోధనలో తేలిందేమిటంటే.... Covaxin టీకా డెల్టా variant పైన మరియు సౌత్ ఆఫ్రికన్ variant పైన సమర్ధవంతం గా పనిచేస్తుందని.


ఈ విషయంలో మరింత Objectivity కోసం ,  ఇంగ్లాండ్ లో జరిగిన పరిశోధనల ఫలితాలను  చూద్దాము .


 Public Health England ( PHE ) UK వారు 22/05/2021 న వారు డెల్టా variant పై Pfizer వాక్సిన్ , Astrazaneca వాక్సిన్  ల యొక్క effectiveness గురించి 05/04/2021 నుండి 16/05/2021 వరకు 1,054 మంది పై జరిగిన పరిశోధనా ఫలితాలను విడుదల చేశారు.  అందులో “  Pfizer వాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారిలో 88% మందిలో రోగలక్షణాలతో కూడిన డెల్టా variant ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది అని ;  అదే astrazaneca వాక్సిన్ అయితే 66% మందిలో  రోగలక్షణాలతో కూడిన డెల్టా variant ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది అని చెప్పారు .  ఒక్క డోస్ వాక్సిన్ వేసుకున్న వారిలో 33% మందిలో మాత్రమే ఇన్ఫెక్షన్ ను నివారించగలుగుతున్నాయి ... అని చెప్పారు  “. 


* దీనివలన astrazaneca వాక్సిన్ రెండు డోసుల మధ్యగల సమయాన్ని తగ్గించాలన్న చర్చ మొదలయ్యింది .


D )  Francis crick institute , లండన్ వారు 250 మంది పై చేసిన ఒక పరిశోధన  Lancet మెడికల్ జర్నల్ లో  ప్రచురితమైంది . ఇందులో రెండు వాక్సిన్ డోసులు తీసుకున్న వారిలో,  డెల్టా variant కి వ్యతిరేకం గా antibody లు 6 రెట్లు తక్కువ స్థాయిలో ఉన్నాయి  అని చెప్పారు. 


 ఈ పరిశోధనలో వాక్సిన్ efficacy ను చూడటానికి surrogative పరీక్షగా యాంటీబాడీ ( anti body ) లెవెల్స్ లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు , అంటే స్టడీ లోని వారికి వాస్తవానికి వ్యాధి లక్షణాలు వచ్చాయా? లేదా ? , ఎంత తీవ్రత ఉంది? ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉన్నదా? లేదా ?  లాంటి అతిముఖ్యమైన అంశాలు వారి పరిశోధనలో .... పరిగణలోకి తీసుకోలేదు. 


   *** దీనిపై ఆ స్టడీ గ్రూప్ లోని ప్రిన్సిపల్ సైంటిస్టు Emma C .Wall ఈ విధంగా చెప్పారు “ antibody లెవెల్స్ ఆధారంగా వాక్సిన్ యొక్క effectiveness ను నిర్ధారించలేము. దీనికి మనుషులపై పరిశోధనలు ( prospective population studies) జరగటం ఎంతో అవసరం . తక్కువ antibody లెవెల్స్ ఉన్నా కూడా , వాక్సిన్స్ కోవిడ్ నుండి రక్షించగలవు “.


*****************************

  

3.  కెమికల్ ఇంజనీర్ చెప్పిన అవాస్తవం :


    సౌత్ ఆఫ్రికా variant పై పెద్ద పెద్ద Pfizer వాక్సిన్ లు కూడా పనిచేయకుండా పోయాయి , కోవిషీల్డ్ 10% మాత్రమే పనిచేస్తుంది.


వాస్తవం :


         ‘ఖతార్’  దేశం లో వచ్చిన 2 వ వేవ్ మరియు మూడవ వేవ్ లలో  సుమారు 50 % కేసులు సౌత్ ఆఫ్రికన్ variant ( B.1.351)  , 44.5% UK variant (B.1.1.7) . ఆ దేశంలో డిసెంబర్ 21 వ తేదీ 2020 నుండి Pfizer వాక్సిన్ వేస్తున్నారు , మార్చి 31 వ తేదీ 2021 తేదీ వరకు అర్హత కలిగిన వారిలో సుమారు 33% మంది టీకా వేయించుకున్నారు ( ఇందులో 59% మంది ఒక డోస్ , 41% మంది రెండు డోసులు ). సౌత్ ఆఫ్రికన్ variant పై Pfizer వాక్సిన్ 75% effectiveness తో పనిచేస్తుంది . సౌత్ ఆఫ్రికన్ variant తో కోవిడ్ తీవ్రమైన లక్షణాలు రాకుండా , క్రిటికల్ స్టేజ్ రాకుండా , మరణాలు సంభవించకుండా నిరోధించడంలో Pfizer వాక్సిన్ 97.4% effectiveness కనబరిచింది . ( NEJM మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన ఈ స్టడీ రిపోర్ట్ కాపీ ని pdf లో జత చేశాను).


   వాస్తవం ఇలాఉంటే ప్రజలను భయబ్రాంతులను చేయటానికి , వారిని తప్పుదోవ పట్టించడానికి సౌత్ ఆఫ్రికన్ variant పై వాక్సిన్లు పనిచేయవు అని చెప్పడాన్ని ఏమంటారు ?? ఇది బుద్ధిపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా ?? 


******************************


వాక్సిన్ లు వేయించుకున్నవారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ రావటం గురించి CDC , USA వారు 01/01/2021 నుండి 30/04/2021 వరకు దేశవ్యాప్తంగా వచ్చిన కేసులన్నింటినీ పరిశోధించి , క్రోడీకరించి ఇచ్చిన రిపోర్ట్ లోని రెండు  ముఖ్యమైన అంశాలు   :

 ( 28 /05/2021, MMWR ,Vol  70 ..... ఒరిజినల్ కాపీ pdf జత చేశాను ) .


1. 30/04/2021 వరకు అమెరికా లో 10 కోట్ల 11 లక్షల మందికి వాక్సిన్లు వేశారు. వారిలో 10,262 మందికి  vaccine breakthrough infections ( అనగా రెండు డోసుల వాక్సిన్లు వేసుకొన్న 15 రోజుల తర్వాత ) వచ్చాయి . లక్షణాలు లేని వారు , కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారు కోవిడ్ పరీక్షకు వచ్చిఉండకపోవచ్చు.. అందువలన ఈ సంఖ్య కొద్దిగా తక్కువగా ఉంది . ఈ 10,262 మందిలో 2% మంది ( అనగా 160 మంది ) మృతువాత పడ్డారు , వీరి సగటు వయస్సు 82 సంవత్సరాలు . 


2. FDA అనుమతించిన వాక్సిన్ లు చాలా effective గా పనిచేసేవే, అయినా Population immunity (సామూహిక రోగనిరోధక శక్తి) రాకముందు, vaccine breakthrough infection లు ఉండటం అనేది ఒక సాధారణ మైన విషయం. Vaccination మరింత పెరిగి, ప్రజలలో ముందు సూచించిన స్థాయికి Vaccination  జరిగినప్పుడు .... వైరస్ ఒకరి నుండి మరొకరికి సంక్రమించడం ఆగిపోతుంది . తద్వారా vaccine breakthrough infections ఆగిపోతాయి .


*****************************


4. కెమికల్ ఇంజినీర్ చెప్పిన అవాస్తవం :


 డెల్టా variant పైన , సౌత్ ఆఫ్రికా variant అనే కొత్త variants పైన ఈ వాక్సిన్లు ఏవీ పనిచేయవు . కావున 35,000 కోట్ల రూపాయలు ఈ పనికిరాని వాక్సిన్ల పై ఖర్చు పెట్టడం మానెయ్యండి.


వాస్తవం :


 డెల్టా variant పైన , సౌత్ ఆఫ్రికా variant  పైన వివిధ వాక్సిన్ల పనితీరును పూర్తి ఆధారాలతో పైన వివరించాను , సంబందిత పరిశోధనా పత్రాలు కూడా pdf లో జతచేశాను . 


 Variants మరియు vaccination కు సంబందించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధంగా చెప్పింది ...


            “ covid -19 పై మనం చేస్తున్న యుద్ధంలో వాడుతున్న ఆయుధాలలో ‘ వాక్సిన్’ అత్యంత కీలకమైనది . వీటిని వాడటం వలన ప్రజారోగ్యంలోను మరియు ప్రజల ప్రాణాలను కాపాడటంలోను స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి . క్రొత్త variants గురించిన సందేహాలతో , జరుగుతున్న vaccination ను ఆపకూడదు. ఒక వేళ క్రొత్త variants పై వాక్సిన్ ల effectiveness తక్కువగా ఉన్నా కూడా, vaccination కార్యక్రమాన్ని కొనసాగించాలి . వాక్సిన్ లో మార్పుల కోసం ప్రయత్నిస్తూనే , మన చేతిలో ఉన్న అమూల్యమైన ఆయుధం అయినటువంటి వాక్సిన్లను ఉపయోగించుకోవాలి. “


  “ మరిన్ని క్రొత్త variants రాకుండా నివారించాలంటే , vaccination మరింత త్వరగా ... మరింత ఎక్కువమందికి చేరేవిధంగా ఉండాలి . అలా చేస్తే ప్రజలు వైరస్ బారినపడటం తగ్గుతుంది మరియు క్రొత్త variants యొక్క బెడద తగ్గుతుంది . కారణం , ఎక్కువమంది ప్రజలు vaccination చేయించుకుంటే , సమాజంలో వైరస్ ఒకరి నుండి మరొకరికి సంక్రమించడం ఆగిపోతుంది , తద్వారా ఉత్పరివర్తనం ( mutation ) జరిగే ఆస్కారం చాలా వరకు తగ్గిపోతుంది.”


  (  url:    who.int/news-room/feature-stories/detail/the-effects-of-virus-variants-on-Covid-19-vaccines).



విన్నపం : 


ప్రజలందరికీ vaccination అందించడం ద్వారా ఈ కోవిడ్ వైరస్ దాడి నుండి ( 3rd / 4th /5th … వేవ్ ల ) నుండి దేశాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో సుప్రీం కోర్టు ఎంతో తెగువను ప్రదర్శించింది మరియు అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ప్రతిస్పందించి,   దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వాక్సిన్ అందించడం ... కేంద్ర ప్రభుత్వం తన భాద్యతగా స్వీకరించింది .   ఇటువంటి పరిస్థితులలో , బుద్ధిపూర్వకం గా , vaccination కు వ్యతిరేకంగా అసత్యాలను – అబద్ధాలను – కల్పితాలను చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేవారికి మీ ఛానెల్ వేదికగా మారటం చాలా బాధాకరం. ఆ చర్చాకార్యక్రమానికి సంబందించిన వీడియో లు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి .


Vaccination అనేది ప్రజలు స్వచ్చందంగా చేయించుకునేది .  అవికూడా సామూహిక రోగ నిరోధకశక్తి ( herd immunity )  స్థాయికి రావాలంటే 70% పైగా జనాభా కు vaccination జరగాలి . వాక్సిన్ గురించి misinformation ఇవ్వటం వలన , ప్రభుత్వాలు ఉచితం గా వాక్సిన్ ఇచ్చినా సరే,  ప్రజలు ముందుకురారు . ఇందుకు ఎన్నో ప్రాంతాల , దేశాల అనుభావాలే ఉదాహరణలు గా చెప్పవచ్చు .    

   

మీరు ఇటువంటి చర్చా కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు .... మరింత బాధ్యతాయుతంగా వ్యహరించాలి . హైదరాబాద్ లోని CCMB లో పనిచేసిన నిపుణులనో , genetics రంగంలో అనుభవం ఉన్నవారిని లేదా epidemiologist లను , WHO లో వివిధ vaccine ప్రోగ్రామ్స్ లో పనిచేసిన అనుభవం ఉన్నవారినో .... చర్చలో పాలుపంచుకొనేటట్లుగా చూడండి . దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు ... రాజకీయ చర్చలకు , vaccination గురించిన చర్చలకు చాలా వ్యత్యాసం ఉంది . ఈ వ్యత్యాసాన్ని గ్రహించి ... మరింత బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము. 


ఇట్లు ,


డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ . DNB (Gen.Med), MRCP (UK).


అనుబంధం :- 24 పేజీ ల pdf లో 5 annexure లు ఉన్నాయి.

కీలక పాత్ర

 క్రైస్తవ మత వ్యాప్తి లో భాగంగా  ఒక క్రైస్తవ మిషనరీని అస్సాంకు పంపారు. ఆ క్రైస్తవ మిషనరీ క్రైస్తవ బోధకుడు  పేరు క్రజ్.  అతను అస్సాంలోని ఒక ప్రభావవంతమైన కుటుంబానికి చెందిన ఒక అబ్బాయికి ఇంగ్లీష్ నేర్పడానికి వెళ్ళాడు( అప్పటిలో ధనవంతుల ఇళ్ళలో ఇంగ్లీష్ నేర్పే సాకుతో ఆ కుటుంబాలకు దగ్గర అవి క్రైస్తవంలోకి దించేవారు ) .  పాస్టర్ నెమ్మదిగా ఇంటిని అధ్యయనం చేయడం ప్రారంభించాడు, ఆ కుంటుబంలో బాలుడి అమ్మమ్మ ఇంట్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని తెలుసుకున్నాడు.


'అమ్మమ్మ మనస్సును క్రైస్తవం వైపుకి మార్చడం వలన మొత్తం కుటుంబాన్ని కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని గ్రామమంతా క్రైస్తవంలోకి మార్చాలి ' అని ఆయన అనుకున్నాడు


పాస్టర్ బామ్మగారికి చెప్పడం ప్రారంభించాడు.  కుష్ఠురోగుల కుష్టు వ్యాధిని యేసు ఎలా నయం చేశాడు, అంధులకు ఎలా దృష్టి పెట్టాడు అని...


కానీ సనాతన ధర్మాన్ని నిష్ఠతో ఆచరించే అమ్మమ్మ "మా రాముడు రాయిని తాకినప్పుడు ఒక రాయి సజీవ మహిళగా (అహల్య) మారిపోయింది అని మరియు రామ సేతు గురించి మాట్లాడింది మరియు రాముడి పేరుతో ఎంత ప్రభావితమైంది, లంకా మార్గంలో సముద్రపు నీటిలో రాళ్ళు తేలుతున్నాయి  , మరియు అవి నేటికీ తేలుతున్నాయి. "అని చెప్పేది


  పాస్టర్ తన ప్రయత్నాలను కొనసాగించాడు కాని అతని ఉపాయాలన్నీ ఫలించలేదు.


ఒక రోజు అతను చర్చి నుండి ఒక కేక్ తెచ్చాడు, అమ్మమ్మ కేక్ తినదని అతను నమ్మాడు.  కానీ అతని నిరీక్షణకు విరుద్ధంగా ఆమె కేక్ తీసుకొని తిన్నది.


ఆమె కేక్ తినడాన్ని విజయంగా భావించి, పాస్టర్ ఆమెతో 'అమ్మమ్మ, మీరు చర్చి యొక్క ప్రసాదము తిన్నారు,  మీరు ఇప్పుడు ఒక క్రిస్టియన్ మరియు మీ పేరు ఆడ్రీ.  నేను నిన్ను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాను "అని ఆయన అన్నాడు. 


అమ్మమ్మ పూజారిని చెవికి లాగి," మీరు పెద్ద గాడిదలాగా ఉన్నరే మరియు మీలాగే మీ మతంలో ఉన్నవారు కూడా ఉన్నారా అంటూ.  


నేను కేక్ ముక్క తినడానికి క్రిస్టియన్ అయితే.  నేను ప్రతిరోజూ నా ఇంటి నుండి మీకు ఆహారం ఇస్తున్నాను కాబట్టి మీరు హిందువు ఎందుకు కాకూడదు?  మీరు మేము దేవునిగా కొలిచే ఈ హిందు భూమి యొక్క ఆహారం రోజు తింటున్నారు, గాలి పిలుస్తున్నారు మరియు నీటిని తాగుతున్నారు, అప్పుడు మీరు ఈ తర్కం ద్వారా చాలా కాలం క్రితం హిందువు అయ్యారు అనే సారికి పాస్టర్ ఎమ్ మాట్లాడాలో తెలియక బిక్కమొహం వేసాడు. "


అమ్మమ్మ అయినా గొప్ప మహిళ తన కుటుంబాన్ని దేశాన్ని తప్పుదారి పట్టించకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషించింది మరియు చాలా మంది అస్సామీలను దారితప్పకుండా నిరోధించింది.  ఆమె పేరు # కమలా_దేవి_హజారికా ", అస్సాం యొక్క ప్రసిద్ధ విప్లవకారిని మరియు రచయిత

సంచలన తీర్పు

 *🚩🕉️మద్రాస్ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది.. దేవాలయాల భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయి, వాటి మీద ఆదాయం దేవాలయాల అభివృద్ధి హిందువుల కోసమే వాడాలి.. ప్రభుత్వాలు దొంగల మాదిరిగా దోచుకొని ఇతర కార్యక్రమాలు ఇతర మతాలకు ఇవ్వకూడదు..అలాగే 1985లో తమిళనాడులో 5 లక్షల ఎకరాలు దేవాలయాల భూములను ఉండేవి.. ప్రస్తుతం 4 లక్షల 50 వేలు మాత్రమే లెక్క చూపిస్తున్నారు.. మరి 50 వేల ఎకరాలు ఏమయ్యాయి లెక్క తీయండి, ఆక్రమంలో  ఉంటె తొక్క తీయండి కేసులు పెట్టండి ,మళ్లీ 50 వేల ఎకరాలను దేవాలయాలకు అప్ప చెప్పండి... ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలి, దేవాలయ అధికారులు ఆధీనంలో దేవాలయం ఆధీనంలో మాత్రమే ఉండాలి..ప్రభుత్వాలు పనికిరాని చెత్త పెత్తనం చేయకూడదు... హిందువుల కోసం, హిందూ ఆలయాలు అభివృద్ధి హిందూ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది..SAVE టెంపుల్స్ అని ఒక గొప్ప ఉద్యమం తమిళనాడులో జరుగుతుంది.. భారతదేశ చరిత్ర మొత్తం మలుపుతిప్పే విధంగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది..🛕🔱*


*🚩దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి, ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, దొంగల మాదిరిగా దోచుకొని మరి ఇతర మతాల కోసం క్రైస్తవులు,ISLAMIC కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ప్రభుత్వాల రోజు వారి పరిపాలన కోసం మీ యొక్క భోగాల కోసం హిందువుల దేవాలయాల ఆదాయాన్ని ఎందుకు వాడుతున్నారు..దాతలు హిందూ దేవాలయాలకు హిందూ దేవుడికి భూములు ఇచ్చారు.. దాతలు మీ భోగాల కోసం ఇవ్వలేదు హిందూ ధర్మం కోసం ఇచ్చారు..హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి..దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు, పోస్టులు భర్తీ చేయండి హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వండి అన్యమతస్తులకు కాదు.. సెక్యూలరిజం బొంగు భోషాణం దొంగ ముచ్చట్లు అన్ని మీరు చూసుకోండి కానీ అది హిందూ దేవాలయాలు వాటిని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి..దేశంలో చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవు అందులో ఎంత ఆదాయం వస్తుందో ఎవరికీ తెలియదు కానీ హిందూ దేవాలయాలను మాత్రం దొంగల మాదిరిగా దోచుకుంటున్నారు అని ఘాటుగా వ్యాఖ్యానించింది..*


*🚩దేవాలయాల భూములు దేవుళ్ళ యొక్క సంక్షేమం కోసం కృషి ఇచ్చింది ఎస్సార్ మహదేవన్ అనే జడ్జిగారు.. కొన్ని రోజుల క్రితమే మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది.. హిందూ ధర్మం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు తీసుకొని క్రైస్తవం ఇతర మతాలలో ఉద్యోగాలు తొలగించండి, జీతాన్ని రికవరీ చేయండి కేసులు పెట్టండి అని జడ్జి గారు తీర్పు ఇచ్చారు ఇప్పుడు అదే జడ్జిగారు మళ్లీ హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ కోసం గొప్ప చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది*


*🔥తమిళనాడులోని DMK ప్రభుత్వము..STALIN వాస్తవానికి నాస్తికవాదం క్రైస్తవ మాఫియా కరుణానిధి..రాముడు దేవుడు కాదు,ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడని మాటలు మాట్లాడిన డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మాత్రం హిందువుల కాళ్లు మొక్కి నేను హిందువులకు మంచి చేస్తాను అని హిందూ దేవాలయాలను దర్శించి మరియు ఒంటి నిండా విభూతి, బొట్టు పెట్టుకుని..హిందువుల కాళ్లు మొక్కి మరీ హిందువుల ఓట్లు పొంది గెలవడం జరిగింది.. హిందూ దేవాలయాల అభివృద్ధికి లక్ష కోట్లు ఇస్తాను, ఏదైనా పుణ్యక్షేత్రం తీర్థయాత్రలు చేయడానికి ప్రతి హిందూ కుటుంబానికి 20 వేల రూపాయలు ఇస్తాను,నాస్తికవాదం బొంగు ఏమీ లేదు నేను హిందువులకు అనుకూలమని హిందువుల కాళ్లు మొక్కి మరి DMK తమిళనాడులో గెలవడం జరిగింది.. తమిళనాడులో GOVT LOGO మ్మీద కూడా హిందూ దేవాలయ గోపురం మాత్రమే ఉంటుంది*


 *🔥కేరళలోని కమ్యూనిస్టు ఎర్ర నక్కల ప్రభుత్వం ప్రభుత్వం అన్ని దొంగ ఉద్దెర ముచ్చట్లు చెబుతుంది, పూర్తిగా హిందూ దేవాలయాల ఆదాయం మీదనే నడుస్తుంది, శబరిమల అయ్యప్ప టెంపుల్ కు ఎనలేని ఆదాయం వస్తుంది, అలాగే లక్షలాది ఎకరాలు హిందూ దేవాలయాల భూములను కమ్యూనిస్టు ఎర్ర ముండాకొడుకులు ఆక్రమించుకొని దర్జాగా బతుకుతారు, దేవాలయాల భూములు ఆదాయము, దేవాలయాల ఆదాయంతో మాత్రమే కమ్యూనిస్టు ప్రభుత్వం నడుస్తోంది.. గుడిలో దీపాలు కూడా అమ్ముకున్న దొంగా పినరయి విజయన్ గాడు.. హిందూ దేవాలయాల ఆదాయంతో  ఇస్లామిక్ జిహాద్ ఖర్చు పెడతాడు, మదర్సా లకు నిధులు ఇచ్చి జిహాదీ ముండాకొడుకులు కోసం ఖర్చు పెడతాడు.. మద్రాస్ హైకోర్టు తీర్పు కూడా కేరళకు అర్పిస్తే కమ్యూనిస్టు ఎర్రనKను బొంద పెట్టినట్లే లెక్క.. కమ్యూనిస్టు గాళ్ళను నడిరోడ్డు మీద బొంద పెట్టాలి,దేశద్రోహ కాంగ్రెస్ కమ్యూనిస్టు ఎర్ర నక్కల దొంగ రాజకీయాల వల్ల దేవాలయాలు మాత్రమే ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి కానీ చర్చిలు మసీదులు ఉండవు. వేల లక్షల కోట్ల రూపాయలు. రూపాయలు చర్చిలకు అక్రమ నిధులు వస్తాయి, లెక్కా పత్రం బొంగు భోషాణం ఏమీ ఉండదు.. అలాగే మసీదులకు ఇస్లామిక్ దేశాల నుండి అక్రమ నిధులు వస్తాయి.. క్రైస్తవ మాఫియా ఇస్లామిక్ జిహాదీ దొంగలకు దేవాలయాల ఆదాయాన్ని పెడతారు.. తిరుపతి ఆదాయాన్ని ఏసు రెడ్డి జగన్ దోచుకుని మరియు చర్చీలు కట్టిస్తాడు సన్నాసి వెధవ.. ఇలా హిందూ దేవాలయాలను దోచుకున్న దొంగలు వీళ్లంతా..*


*🚩త్వరలో హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వాధీనంలో నుండి బయటకి రావాలి, ఆక్రమణకు గురైన హిందూ దేవాలయాల భూములన్నీ మళ్ళీ దేవాలయాలకు చెందాల. ఆలయాలు దేవుడి సాక్షిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడవాలి.. దేవాలయాలను GOVT మొక్కడం తాకితే పీకడం ఏమీ ఉండదు..GOVT కంటే పది రెట్లు ఆదాయం హిందూ దేవాలయాల దగ్గర ఉంటుంది అంత RICH హిందువులు ఉంటారు.. హిందూ దేవాలయాల ఆదాయంతో ద్వారా హిందువులకు మాత్రమే విద్య, వైద్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి కార్యక్రమాలు జరగాలి హిందువులు మాత్రమే అనుభవించాలి.. దాని కోసం ప్రతి ఒక్క హిందువు పోరాడాలి అది బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది.. హిందూ దేవాలయాల ధర్మరక్షణకు ప్రతి హిందువు కృషి చేయండి భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్, వందేమాతరం*

# *సదా మీ సేవలో...*

# *భారత్ మాతా కి జై...*🙏

                          *మీ* 

                    *రాథోడ్ సందీప్* 

    *బిజెపి ఐటి & సోషల్ మీడియా కన్వీనర్* 

               *దిలావార్పూర్ మండలం*

                        *నిర్మల్ జిల్లా*...

                          🚩🚩🚩

*BJP IT CELL DILAWERPUR MANDAL*

పిల్లలు అప్పుడు- ఇప్పుడు


*పిల్లలు అప్పుడు- ఇప్పుడు!* #కొత్తకథ

              🌷🌷🌷

మధ్యాహ్నం ఇంటిపనంతా పూర్తవగానే ,ఒక చిన్న కునుకు తీయడం లతకు అలవాటు! పిల్లలకు వేసవి సెలవులు అవ్వడం వలన , ఎండలో బయటకు వెళ్లకుండా,తలుపులేసి ,హాల్లో ఆడుకోమని చెప్పి ,అక్కడే సోఫాలో పడకకు ఉపక్రమించింది లత! 


         పడుకుంది కానీ ఓ పక్కన పిల్లల కబుర్లు ,ఆటపాటలు చెవిన పడుతూనే ఉన్నాయి! నిద్రలోనే నవ్వుకుంటూ, వారి మాటలు వింటోంది లత! 

         

పిల్లలిద్దరూ బొమ్మరిల్లు కట్టుకుని , లక్క పిడతలు సర్దుకుంటున్నారు!  ఇంతలో హఠాత్తుగా లతకూతురు వెన్నెల ...తమ్ముడితో అంటోంది....


" ఒరేయ్ తమ్ముడు! ఈ టీవీని నేను చెప్తేనే ...నాన్న కొన్నారు !కనక పెద్దయ్యాక ఈటీవీ నాదే సుమా!"


" సరేనే అక్కా! టీవీ నువ్వు తీసుకో ! నాన్న కంప్యూటర్ నేను తీసుకుంటాను! నేను కూడా నాన్నలా కంప్యూటర్ ఉద్యోగం చేయాలి కదా పెద్దయ్యాక!"


" తమ్ముడూ! నేను పెళ్లి చేసుకున్నాకా...అమ్మలా వంటలు అవి చేస్తాను కదా! అందుకనే ఈ గ్యాస్ స్టవ్, గ్రైండర్ ,ఈ ఫ్రిజ్ నేను తీసుకుంటానే! "


"పోవే అక్కా! నాకెందుకు ఆ పిచ్చి వంటింటి సామానంతా! నేను ఏమైనా వంట చేస్తానా ఏంటి పెద్దయ్యాక! నువ్వే తీసుకో! కానీ ఈ ఫ్రిడ్జ్ మాత్రం నాదే సుమా! నేను పెద్దయ్యాక చాలా ఐస్క్రీమ్లు కొనుక్కుని, ఫ్రిజ్లో పెట్టుకోవాలి!"


ఆ విధంగా పిల్లలిద్దరూ గాడ్రెజ్ బీరువా, డైనింగ్ టేబుల్, సోఫాలు, వాళ్ళ నాన్న స్కూటరు ,వాళ్ళ అమ్మ నగలు ,బట్టలు ..‌ఆఖరికి కుక్కపిల్ల తో సహా అన్ని పంచేసుకున్నారు! 


లతకు వాళ్ల మాటలు వింటుంటే మతిపోయింది! ఒక్కసారిగా దిగులు కూడా వేసింది!  "పట్టుమని పదేళ్లు కూడా లేవు ఇద్దరికీ! ఎవరో మప్పినట్టు ఎలా మాట్లాడుకుంటున్నారో".... అనుకుంది!


"అమ్మానాన్నల తదనంతరం అంటూ ....అప్పుడే ఎన్ని పంపకాలు చేసేసుకుంటున్నారు! రేపు పొద్దున్న... అమ్మ నాది నాన్న నీది అంటూ కూడా... తమను పంచేసుకుంటారో ఏమో ఈ గడుగ్గాయలు!"... తను ఇంకా పడుకునే ఉంటే... ఇంకా ఏమి వినాల్సి వస్తుందో ...అని గబగబా నిద్రలేచింది లత! 


తల్లి ని చూస్తూనే ,మాటలు ఆపేసి , ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ,ఏమీ ఎరగనట్టు ఎవరి ఆటల్లోకి వాళ్ళు దూరి పోయారు అక్కా తమ్ముడు! ఎందుకు కొడుతోందో చెప్పకుండానే ...ఇద్దరివీపుల మీద రెండు దబదబా బాది, వంటింట్లోకి వెళ్ళిపోయింది లత, పిల్లలకు తినడానికేమైనా చేయాలని! 


ఆ తర్వాత కూడా తన పరోక్షంలో పిల్లలు రెండు మూడు సార్లు ఇదే ఆట ఆడడం లత గమనించింది! ఎవరి ప్రమేయం లేకుండానే ...పిల్లలలో కనిపిస్తున్న ఈ సంకుచిత మనస్తత్వం లతను...విపరీతమైన అసహనానికి గురి చేసింది! ఈ విషయమై భర్త తో చర్చించినప్పుడు ,అతను ఫెళ్ళున నవ్వుతూ.. పిల్లల ఆట అంటూ తీసి పడేసాడు! 


         ఒకరి కోసం ఒకరు ఆగని ఈ కాలంలో... కాలం మాత్రం ఎవరి కోసం ఆగుతుంది?. దాని పరుగులు అది పెట్టేస్తోంది!

         

 పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు! కష్టపడే పెంచారో.. ఇష్టపడే పెంచారో కానీ... మొత్తానికి ఏ లోటు లేకుండా పెంచారు!  ఇద్దరికీ  మంచి చదువులు చెప్పించారు! ఆడపిల్ల ,మగ పిల్లవాడు మంచి ఉద్యోగాల్లో కుదురుగానే.... తలకు మించి ఖర్చుపెట్టి ...సవ్యమైన సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా చేశారు లతా,ఆమె భర్త రాజారావు! 


      చిన్నతనంలోనే పిల్లలిద్దరూ ఇచ్చిన ఝలక్ చవిచూసింది కనుక ...లతకు పిల్లల మీద పెద్దగా ఆశలు అయితే ఏమీ లేవు! కానీ ఆమె భర్త రాజారావు ఆశావాది! తన రిటైర్మెంట్ తర్వాత ...తన పిల్లలు తప్పకుండా తనను ,భార్యను బాగా చూసుకుంటారు అని అతనికి విపరీతమైన ధీమా! అందుకే పాపం ఉద్యోగంలో  ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ,ఇతర  పొదుపులు అన్నీ ...పిల్లల భవిష్యత్తు కోసమే ఖర్చు పెట్టేశాడు ఆయన! 

      

ఆలస్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం వలన, ఉద్యోగ విరమణ అనంతరం... రాబోయే పెన్షన్ కూడా అతనికి తక్కువే! ఇరు వైపుల నుండి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు! అందుకే లతకు తమ భవిష్యత్తు తలచుకుంటే విపరీతమైన బెంగ! ఉండడానికి చిన్న ఇల్లు కూడా కనుక్కోలేకపోయారు... పిల్లల భవిష్యత్తుల రంధిలో పడి! 


           ఇంతలో...భగవంతుడు వీళ్ళకు కాస్త మేలు చేద్దాం అనుకున్నాడో ఏమో, అమెరికాలో లో ఏభైఏళ్ల క్రితమే సెటిల్ అయిన లత పెద్దన్న గారు... ఎప్పుడో నగర శివార్లలో కొని ,మర్చిపోయిన ఒక మూడు వందల గజాల స్థలాన్ని ...లత పేరట రిజిస్టర్ చేయించారు! 

           

విషయం తెలియగానే కూతురు, కొడుకు వెంటనే వచ్చి వాలిపోయారు! ఆ స్థలం హైటెక్ సిటీకి దగ్గరగా ఉండడంతో... అక్కడ ఇద్దరూ కలిసి, ఇల్లు కట్టుకుంటామని ప్రతిపాదించారు! పిల్లలిద్దరి స్వార్థానికి విస్తుపోయింది లత! 


చిన్నప్పటి నుండి వారు కోరినవి ఏవీ కాదనకుండా అమర్చడం రాజారావుకు బలహీనత! ఆ స్థలంలో తాము ఎలాగూ ఇల్లు కట్టలేని పరిస్థితి గనుక ,పిల్లలు ఎంజాయ్ చేయడమే సబబని ,రాజారావు భార్యను ఒప్పించడంతో ,పిల్లలకు ఇల్లు కట్టుకోవడానికి అనుమతిచ్చింది లత! 


            ఏడాదిలో రాజారావు రిటైర్ అయిపోవడం ,  ఇంటి పని పూర్తవడం ఒకేసారి అయింది! పిల్లలు, వారి  జీవన సహచరులు మంచి ఉద్యోగాల్లో ఉండడం వలన, లోన్లు తీసుకొని , ఆధునికమైన హంగులతో...చక్కని రెండంతస్తుల ఇల్లు కట్టుకున్నారు! క్రింద అక్కగారు, పైన తమ్ముడు ఉండేటట్టు! రెండు అంతస్తులను కలుపుతూ లిఫ్ట్ సౌకర్యంతో సహా ఏర్పరుచుకున్నారు! 


       గృహ ప్రవేశం చాలా ఘనంగా తలపెట్టారు ఇరువురు!! ఆ రోజే అనుకోకుండా... రాజారావుకు అరవై ఏళ్ళు నిండుతాయి! తమ జీవితంలో పెద్దగా వినోదాలు , సంబరాలకు తావు లేకపోయినా....తమ కుటుంబం కోసం అంతగా కష్టపడిన భర్తకు... షష్టిపూర్తి ఘనంగా జరిగితే బాగుండునని లత కు ఎంతో ఆశ ఉండేది! పాతికేళ్లకే పెళ్లి ,సంసారబాధ్యతల్లో మునిగిపోయిన రాజారావు ...ఎప్పుడూ తనకై తాను ఎలాంటి ప్రత్యేకత ఆశించేవాడు కాదు! తన జీవితం కుటుంబానికే అంకితం అనుకునేవాడు! భార్యా పిల్లలు ఆనందంగా ఉంటే, అదే పదివేలు అనుకునే అల్పసంతోషి అతను! 


పిల్లలు తమకు ఉద్యోగాలు వచ్చాక ఎడ్యుకేషన్ లోన్ తీర్చుకుంటామన్నా కూడా... వారికి ఆ బాధ్యత అప్ప చెప్పని ఔన్నత్యం అతనిది! ఆ విషయంలో లతకు అతని చాదస్తం మీద కోపం కూడా వస్తూ ఉంటుంది! " పిల్లలు సంపాదించుకుంటున్నారు కదా ఇప్పుడు! వాళ్ల లోన్ వాళ్ళకు అప్పచెప్పేయండి"... అంటూ వాదిస్తూ ఉంటుంది! వాళ్లకు బంధాలు తప్ప, బాధ్యతలు అప్పచెప్పనని అతని జవాబు! 


ఎగువ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన లతకు , మిగిలిన వారి కన్నా తన కుటుంబం ఆర్థికంగా ఎదగనందున, అసంతృప్తి అయితే లేదు కానీ... ఎక్కడో అంతర్లీనంగా కొంత ఆత్మన్యూనత ఉంది! అందుకే  ఎక్కడయితే అంతస్తుల తారతమ్యాలు చూపిస్తారో... అక్కడ  ఎక్కువగా కలవడానికి ఇష్టపడదు! అంతర్ముఖురాలై ఉంటుంది చాలా వరకు! పిల్లలపై రాజారావు చూపించేంతటి ప్రేమ కూడా, లత చూపించడానికి జంకుతూ ఉంటుంది! పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో కి వెళ్లారు ! సంపన్నులైన తమ అత్తమామలతో, తల్లిదండ్రులను ఎక్కడ పోల్చి చూస్తారో అన్న ఆత్మన్యూనత లత లో అధికం! పిల్లలకు సంపదలు పోగేసి ఇవ్వనప్పుడు ,వారి నుండి ఏమీ ఆశించడం కూడా తప్పే అనుకుంటుంది ఆమె!


అందుకే భర్త షష్టిపూర్తి గురించి తన మనసులోని భావాలు, కోరికలు బయటకు చెప్పలేకపోయింది! ఎవ్వరినీ ... "ఇది చెయ్యండి... "....అని ఆదేశించడం ఆమెకు రాదు! 


పిల్లలిద్దరూ ప్రేమగానే ఉంటారు! పెళ్లయి ,సంసారాలు ఏర్పడ్డాక ,తల్లితండ్రులను ఏ విషయంలోనూ "ఇది కావాలి ,అది కావాలి 'అని బాధించలేదు! అమెరికాలో ఉన్న అయిదేళ్ళు... పురుళ్ళకు, పుణ్యాలకు అత్తవారినే ఆశ్రయించారు ,కానీ తల్లిదండ్రులను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు! తల్లిదండ్రులను అమెరికా రమ్మన్నా కూడా ...రాజారావు ఉద్యోగ బాధ్యతల వలన, ఇద్దరూ వెళ్ళలేకపోయారు! 


                       ************


       గృహప్రవేశం రోజు ఉదయమే..‌ కూతురు ,అల్లుడు కొడుకు ,కోడలు రాజారావు ఇంటికి వచ్చి , తల్లిదండ్రులకు...నూతన వస్త్రాలను ఇచ్చి , పాదాలకు నమస్కరించి ,దంపతుల నిద్దరిని కారులో కొత్త ఇంటికి తీసుకెళ్లారు! 

       

తమకు అసాధ్యమైన పనిని పిల్లలిద్దరూ సాధించడంతో రాజారావు లతకు చాలా సంతోషం కలిగింది! కొడుకు... తండ్రి చేతిలో సత్యనారాయణ స్వామి చిత్రపటం పెట్టాడు! కూతురు తల్లి చేతిలో  లక్ష్మిదేవి విగ్రహం ఉన్న ...వెండి సింహాసనాన్ని ఉంచింది! ఆశ్చర్యంగా చూస్తున్న వారిద్దరితో పిల్లలు.... "మీరే  గృహప్రవేశం పీటలమీద కూర్చోబోతున్నారు"...అని చెప్పారు!


         ఆవు దూడ,తల్లిదండ్రులు ,వారి వెనుక నీళ్ళ బిందె తో ఆడపడుచు ,ఆ వెనుక కొడుకు అనుసరించగా... శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు! 

         

వాస్తు హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతో ఘనంగా... లతా ,రాజారావు లు పీటలమీద కూర్చుని పూర్తిచేశారు! లతకు మనసులో ఎంతో సంభ్రమంగా ,సంబరంగా ఉంది... కనీసం ఆ మాత్రమైనా తమకు గౌరవం దక్కించినందుకు! గృహప్రవేశం భోజనాలకు ఎక్కువమంది అతిధులను పిలుచుకో లేదు! ఒంటిగంటకల్లా కార్యక్రమం అంతా ముగిసిపోయింది! 


      సాయంత్రం అయ్యే సరికి కొత్త ఇల్లంతా విద్యుద్దీపాలతో, పూలమాలలతో, తోరణాలతో అలంకరించారు! ముందంతా షామియానా, కుర్చీలు వేయించారు!  కేటటర్స్ వచ్చారు! "ఓహో రిసెప్షన్ పెట్టుకున్నారు ఏమో పిల్లలు!"... అనుకున్నారు రాజారావు దంపతులు! 

      

కొడుకు, అల్లుడు తండ్రిని గదిలోకి తీసుకెళ్లి చక్కని పట్టుపంచ ,లాల్చీ వేయించారు! నుదుట తిలకం తో చిన్న నిలువు బొట్టు దిద్దారు, బుగ్గన దిష్టిచుక్క పెట్టారు! మెడలో సన్నని బంగారు గొలుసు వేశారు! "ఏంట్రా !ఈ హడావుడి ?"...అని అడ్డుచెప్తున్న తండ్రితో..‌ "ఊరుకో నాన్నా! ఇన్నాళ్లు మీ మాట మేము విన్నాం!  ఇప్పుడు మా మాట మీరు వినాలి!" అన్నాడు కొడుకు! 


     అలాగే కూతురు, కోడలు లతను చక్కగా ముస్తాబు చేశారు! కొన్నేళ్లుగా పుస్తులతాడు ,సన్నని నల్లపూసల గొలుసు,జతగాజులు తప్పా మారు ఆభరణం ఎరుగని లత మెడలో ,కూతురు రెండు పేటల చంద్రహారాలు వేసింది! చేతులకు రెండు జతల గాజులు ఎక్కించింది! 

     

" ఏంటి ఇదంతా వెన్నెల?  నాకు ఇవన్నీ అలవాటు లేదు ! పరుల సొమ్ము బరువు చేటు!"...అంటూ సున్నితంగా తిరస్కరిస్తున్న తల్లితో...." ఎందుకు అలవాటు లేదమ్మా! నీ పుట్టింటి బంగారం పదిహేను తులాలు మా కోసమే కదా... కరిగించావు! అయినా పరాయి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నీకు ఈ మాత్రమైనా చేసే హక్కు, అధికారం మాకు లేదా? "... అంటూ తల్లిని ప్రేమగా కావలించుకుని, బుగ్గ మీద ముద్దుపెట్టుకుంది కూతురు! 


       ఆ సాయంత్రం ఫంక్షన్ కు వచ్చిన వారంతా రాజారావు ఆఫీస్ కొలీగ్స్, లతా రాజారావుల బంధుమిత్రులు! వారందరి సమక్షంలో తల్లిదండ్రులతో దండలు మార్పించి,తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకుని... పెద్ద కేక్ కట్ చేయించి, షడ్రసోపేతమైన విందు తో అతిథులను అలరించారు పిల్లలు!

       

 పిల్లలిద్దరూ ఆహుతుల సమక్షంలో మాట్లాడుతూ.... వాళ్ళ అమ్మానాన్నలు ఎంత గొప్పవారో, తమనెంత ప్రేమగా ,గారంగా పెంచారో, తమ ప్రగతికి వారెంత కృషి చేశారో... చెప్తూ ఉంటే... లత కళ్ళల్లో నీరు తిరిగింది! తన పిల్లలను తను సరిగ్గా అర్థం చేసుకోలేదేమోననుకుంది! బాల్య చాంచల్యంతో... చిన్నతనంలో...వారు మాట్లాడుకున్న మాటలు ,తన మనసులో ,అంతర్లీనంగా వారి మీద ఒక అభిప్రాయాన్ని సృష్టించడం వలన....వాళ్లు ఏం చేసినా ...స్వార్థంతో చేస్తున్నారనే....ఒక దురభిప్రాయం ఏర్పడింది ఏమో తనలో! తమ కుటుంబాల్లో కొందరు పిల్లలు ...తమ తల్లిదండ్రుల పట్ల చూపిస్తున్న నిరాదరణ చూసాకా...తన పిల్లలు కూడా, అదే దారిలో నడుస్తారన్న నమ్మకం తన మనసులో దృఢంగా పాతుకుపోయిందేమో! మాతృత్వ మమకారాన్ని కూడా ఒకలాంటి మాయతో కప్పేసుకుని ...పిల్లలకు ,తనకు మానసికంగా దూరం పెంచుకుంది ఇన్నాళ్ళు!.... లత లో అంతర్మధనం మొదలైంది!పిల్లలతో మనసువిప్పి మెసలుకోవాలని నిర్ణయించుకుంది.

 

ఆ రాత్రి...అతిథులంతా.. రాజారావు దంపతుల అదృష్టాన్ని కొనియాడి... సెలవు తీసుకున్నాకా .... లతకు రాజారావుకు తమచుట్టూ ఏమవుతుందో కూడా తెలియనంత పరవశత్వం కలిగింది!! ఏదో స్వప్న లోకంలో ఉన్నట్టుంది! పిల్లలు చేసిన ఆ సన్మానం... వారి మనసులను ఎనలేని ఆనందంతో నింపేసింది! 


ఆ మర్నాడు అల్లుడు, కొడుకు వచ్చి లతను,రాజారావును రిజిస్ట్రార్ ఆఫీస్ కి తీసుకెళ్లారు!! వారు కట్టిన ఆ యింటిని ...తల్లిదండ్రుల పేరిట రిజిస్టర్ చేయించారు అక్కా, తమ్ముడూ! ఆ దంపతులు ఎంత వ్యతిరేకించినా పిల్లలు వినలేదు! ఆ ఇంటి మీద సంపూర్ణ హక్కు తల్లిదండ్రులదే అన్నారు! తల్లిదండ్రుల తోనే వారిద్దరూ తమ కుటుంబాలతో..ఇకపై, ఉండబోతున్నామని కూడా ప్రకటించారు! 


           ఇప్పుడు లతా, రాజారావు పిల్లలతోనే ఉంటున్నారు! లత మనసులో మునపటి బిడియం, ఆత్మన్యూనతా లేవు! తన పిల్లల విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తోంది ఆమె! తను వేరు ,వారు వేరు అన్న భావం ఆమె మనసులో చెరిగిపోయింది! తన పిల్లల గురించి , వారి బాల్యంలోనే తాను ఏర్పరుచుకున్న ఊహలు, అంచనాలన్నీ తారుమారు అయినందుకు లత ఎంతో సంతోషిస్తుంది ఇప్పుడు! 


           

అయితే...ఇప్పటికీ అక్కా, తమ్ముడూ పంపకాలు వేసుకుంటూనే ఉంటారు! ఎటొచ్చి అమ్మానాన్న" నా దగ్గర ఉండాలి" అంటే..." నా దగ్గర ఉండాలి.." అని! 


*ధన్యవాదాలతో ఓలేటి శశికళ*

వాతావరణ కాలుష్యం -అనారోగ్యమని

 యేనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం, యేన యజ్ఞం స్రాయతే సప్తహోతా తన్మేనః శివసంకల్పం. అని యజ్ఞం సప్త వ్యాహృతులతో కూడి వకే శక్తిగా విశ్వ వ్యాప్తంగా జీవులకు నీటిరూపమున అమృతత్వము అగును. యజ్ఞం ఏవక్కరి ప్రయోజనం కాదు అది సర్వ జనీనమైనది. ప్రకృతిని పర్యావరణం నుండి కాపాడి వృష్టి కారణము. వర్షం వలననే జీవ ఆధారము. వాతావరణ కాలుష్యం వలననే అనారోగ్యమని మనకు అనుభవమే. వాయుకాలుష్యం నీటి కాలుష్యం అన్నింటికన్నా ప్రమాదభరితమైనవి.మానవ జీవికి రెండునూ మూలమే.ఏదో కొందరికి ఉపాధి గురించి కర్మ కాండయని అసమర్ధల పనియనుట పొరపాటు. అజ్ఞానం కూడా. మానవ జీవనమునకు ఆహారము దాని జీర్ణమగుటకు ఏవిధమైన శక్తి కారణమెూ వాతావరణ కాలుష్య నివారణకు అదియును వకే కారణము.సృష్టి ఆదినుండి ప్రకృతి తనంత తాను యజ్ఞం చేయుచున్నది. మానవ మనుగడకు

ఏ స్వార్ధం లేకుండా పుష్పించి ఫసవంతమగుచువ్నవి. 

కొన్ని విష వాయువులను గాలిలో స్వఛ్చతకు ఓషధులు కారణము ఓషధులు యన్నియు వృక్ష రూపముగా కలిగియున్నవి. సమస్త వృక్ష సంపదను ప్రయెూగ శాలలో నిర్ణయించుట ఎప్పటికీ సాధ్యం కాదు. యింకను చాలా ఓషదులు వాటి లక్షణము నిర్ణయం కాలేదు. అది తెలుసుకొనుటకు యజ్ఞం. క్రతువు యనగా ఓషధులను వృత్తి చేయుట వర్షము కారణంగా సర్వ జనీనమైనది. క్రతువు మానవ జీవనమునకు సంబంధించినది. ఊరకనే సమిధలను మండించిన అది వాయు కాలుష్య మును నివారణ చేయదు. విష వాయువులను అనేకమైనవి వాతావరణంలో సమ్మిళితమై యువ్నవి. ఏది విష వాయువో తెలియకుండా మనం శ్వాస ద్వారా తీసుకొనుట జరుగుచున్నది. స్వచ్చమైన గాలి లేనియెడల మానవ వునికికి ప్రమాదం. తస్మాత్ జాగృత జాగృతః.జాతి నిర్వీర్యమైన మానవ వునికి కోల్పోయి మనుగడకు ప్రమాద భరితముగా మారును. మానవ వనరులను వృధా చేయకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడుటకై యజ్ఞం మూలము. ఎన్నో వేల సంవత్సారాల మానవ జీవన పరి ణామమునకు యజ్ఞము మూలం.మనం తీసుకొనే ఆహారము కూడా జీవ యఙ్ఞం. దానివలన మానవ వునికి కాపాడుటకు గాని జీవ వి నాశనమునకు కాదని తెలియవలెను.యఙ్ఞం సమిష్టి అవసరము. ఏ వక్కరి గురించి కాదు. తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూనే వుందాం.

భారతదేశంలో గొప్ప తపస్వి

 🙏🌺 ఇది ఒక 300ఏళ్ల క్రితం జరిగింది. 🌺🙏   


🌺దక్షిణ కర్ణాటకలో ఒక భక్తుడుండేవాడు. అతని తల్లికి వృద్ధాప్యంవల్ల అంత్యకాలం సమీపించడంతో, కాశీకి వెళ్లి విశ్వనాథుడైన పరమశివుని సన్నిధిలో శరీరం విడిచిపెట్టాలని భావించింది. ఆమె తన జీవిత కాలంలో కోరిన కోరిక అదొక్కటే. తన కొడుకుతో “నన్ను కాశీకి తీసుకువెళ్ళు. నాకు ముసలితనం వచ్చింది.నేను అక్కడకెళ్లి శరీరం వదులుతానుఅని చెప్పింది.🌺


🌺 అతను తన తల్లితోపాటు కాశీకి ప్రయాణమై, వారు దక్షిణ కర్ణాటక అడవులగుండా నడిచి వెళ్ళడం ప్రారంభించారు. సుదీర్ఘ ప్రయాణం, పైగా వృద్ధురాలు కావడంతో ఆమెకు సుస్తీ చేసింది. అప్పుడతను ఆమెను తన భుజాలపై వేసుకుని నడవసాగాడు. కొద్ది సమయంలోనే అతని శక్తీకూడా క్షీణించసాగింది. 


 ఇప్పుడు ఈయాత్ర ముందుకుసాగాలంటే శివుడ్ని వేడుకోవడంతప్ప మరో మార్గంలేదని భావించి అతను “శివయ్య! నాప్రయత్నం వృధా కాకుండాచూడు తండ్రీ! నాతల్లి కోరుకున్న ఒక్కగా నొక్క కోరికను తీర్చనివ్వు. నేను ఆమెను కాశీకి తీసుకుళ్ళాలి. నీకోసమే మేము అక్కడకొస్తున్నాం. నాకు శక్తినియ్యవా పరమేశ్వరా..” అంటూ వేడుకోసాగాడు.🌺


🌺 అతను అలా నడుస్తూపోతున్నప్పుడు, ఎడ్లబండి వెనుకగా వచ్చేటప్పుడు మోగే గంటల శబ్దం వినబడింది. పొగమంచులో నుండి ఒక ఒంటెద్దుబండి అతనివైపు రావడం గమనించాడు. ఇదో వింత. ఎందుకంటే ఆప్రాంతంలో ఒంటెద్దు బండి కేవలం తక్కువ దూరం ప్రయాణించడానికే వాడుతారు. అడవులగుండా దూరప్రయాణం చేయాలంటే రెండెడ్లు కావాలి. కానీవారు అప్పటికే బాగా అలసిపోవడంతో ఇవేమీ పట్టించుకోలేదు. 


 బండి దగ్గరకొచ్చినా, దాన్ని నడిపే అతను ముసుగులాంటి బట్టకప్పుకుని ఉన్నందున ఇంకా పొగమంచువల్ల అతని మొహం సరిగ్గా కనిపించలేదు. అప్పుడతను “నా తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఈ ఖాళీ బండిలో మేము ప్రయాణం చేయవచ్చా?” అని అడిగాడు. బండి నడిపే అతను సైగ చేస్తున్నట్టు తలూపాడు. ఆ ఇద్దరూ బండెక్కి ప్రయాణించసాగారు.🌺 


🌺 కొంత సమయానికి అతను అడవి మార్గంలోకూడా బండి అంతటి సునాయాసంగా కదలడాన్ని గమనించాడు. అప్పుడు అతడు కిందకు చూస్తే, బండి చక్రాలేమీ తిరగకుండా, స్థిరంగా ఉన్నాయి. కానీ బండిమాత్రం పోతూనే ఉంది. అప్పుడతను ఎద్దువైపు చూసాడు, అది కూర్చుని ఉంది. కానీ, బండిమాత్రం పోతూనే ఉంది. 


 అప్పుడతను బండినడిపే అతన్ని పరిశీలిస్తే, కేవలం ముసుగుబట్ట మాత్రమే కనిపిస్తుంది. కానీ ముసుగులో ఎవరూలేరు. తల్లివైపు చూశాడు. అప్పుడు ఆమె “ఇంకా అర్ధం కాలేదా? మనం గమ్యానికి చేరిపోయాం. ఇంకెక్కడికీ వెళ్ళనవసరంలేదు. ఇక్కడే నన్ను వెళ్లనివ్వు.” అని చెప్పి ఆ తల్లి శరీరం విడిచింది. ఎద్దు, బండి, ఆ బండిని నడిపేవాడు అందరూ మాయమయ్యారు!🌺


🌺 అతను తిరిగి అతని స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడివారు “అతను చాలా త్వరగా వచ్చాడంటే.. ఖచ్చితంగా తల్లిని కాశీకి తీసుకుపోకుండా మధ్యలోనే ఎక్కడో వదిలేసి ఉంటాడు.” అని భావించారు. అతనిని “నీ తల్లిని ఎక్కడ వదిలేసావ్?” అన్నారు. అతను “లేదు, మేము కాశీకి వెళ్ళే పనిలేకుండానే శివయ్యే మా కోసమొచ్చారు” అని బదులిచ్చాడు. వాళ్ళు “ఇదంతా ఒట్టి బూటకం!” అన్నారు. 


 అతను “మీరేమైనా అనుకోండి. శివుడు మాకోసమొచ్చాడు. అంతే. నా జీవితం ధన్యమైంది. నాకు నాలో అది తెలుస్తుంది. మీకు తెలియకపోతే.. నేను చేసేదేమీలేదు.” అన్నాడు. వాళ్లప్పుడు “సరే, అయితే నువ్వు శివుడ్ని చూశావనడానికి గుర్తుగా మాకు ఏమైనా చూపించు” అన్నారు. అతను “నాకు తెలీదు. ఎందుకంటే నేనతన్ని చూడలేదు. నేను ముసుగున్న బట్టనే చూశాను".🌺


🌺  "అందులో ముఖం కనబడలేదు. అక్కడ ఏమీలేదు, అంతాఖాళీ” అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఉన్నట్టుండి అతను కనుమరుగైపోవడం గమనించారు. కేవలం అతని దుస్తులు మాత్రమే కనిపించాయి. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప తపస్వి అయ్యారు.🌺

*మూక పంచ శతి.*

 *మూక పంచ శతి.*


మూకం కరోతి వాచాలం. ఈ శ్లోకం భగవద్గీత పుస్తకా లన్నింటిలో  మొదటే ఉంటుంది. దీని తాత్పర్యానికి సరిగా సరిపోయే ఉదాహరణ మూక కవి జీవితం. మూక కవి పేరుకు తగి నట్టుగా పుట్టుకతో మూగ వాడు. కంచి కామాక్షి అమ్మవారి కటాక్షం వల్ల మాటలే కాదు కవిత్వం కూడా వచ్చింది. అలావచ్చిన కవితాశక్తి ని మళ్ళీ అమ్మవారి స్తుతి లో నే వినియోగించి ఆయన మొక్షానికి వెళ్ళాడు.


మూక కవి  కామాక్షి అమ్మవారి  పైన వ్రాసిన కావ్యం మూక పంచశతి. ఇందులో 5 అధ్యాయాలు  అంటే 5 శతకాలు గా మొత్తం 500 శ్లోకాలు ఉంటాయి.  ఆ శతకాల కూర్పు వాటి పేర్ల లో ఒక చమత్కారం ఉంటుంది. మొదటిది ఆర్యా శతకం. రెండవది పాదారావింద శతకం. మూడవది స్తుతి శతకం. నాలుగవాది కటాక్ష శతకం. ఐదవది మందస్మిత శతకం.


మూకకవికి పాండిత్యం కలగగానే మొదటగా గుర్తొచ్చింది అమ్మ నే. అది *ఆర్యా శతకం* గా రూపుదిద్దుకుంది. (ఆర్యా అంటే అమ్మవారు అనీ ఒక అర్ధం. అది ఒక చందస్సు పేరుకూడా. మొదటి 100 శ్లోకాలు ఆర్యా చందస్సులో అమ్మవారి మీద వ్రాసినవి.) తరవాత ఆయన బుద్ధి ఆవిడ పాదాల వైపు మళ్ళింది. అది *పాదారావింద శతకం* గా రూపుదిద్దుకుంది. అయనకు భక్తి కుదిరి అమ్మను ధ్యానం చేద్దా మను కున్నాడు. అది *స్తుతి శతకం* గా రూపుదిద్దుకుంది. ఆవిడ కరుణను కోరుకున్నాడు. అది *కటాక్ష శతకం* గా రూపుదిద్దుకుంది. ఆవిడ సంతోషించి అనుగ్రహించింది. ఆ అనుభూతి లోనుంచి వచ్చినది *మందస్మిత శతకం.*


మూక కవికి అమ్మ కరుణవల్ల పాండిత్యం రాగానే మొట్టమొదట వ్రాసిన కావ్యం ఇదే. ఈ కావ్యం రాసిన తర్వాత ఆయన మరి ఇంకొక కావ్యము ఏదీ కూడా రాయలేదు. అమ్మ అనుగ్రహించిన కవిత్వాన్ని ఆమెకే ఒప్పగించాడు.


పుష్పదంతుడు వ్రాసిన శివమహిమ్నస్తోత్రము రావణాసురుడి శివ తాండవ స్తోత్రము ఆదిశంకరుల కనకధారా స్తోత్రము లాగా ఇది చాలా ప్రసిద్ధికెక్కిన స్తోత్రము. కంచి కామకోటి పీఠం లోని ఆచార్యులు అందరికీ  పరంపరగా చాలా ఇష్టమైన స్తోత్రం ఇది. 500 శ్లోకాలు ఉన్నందువల్ల కంఠతా పెట్టడానికి అనువుగా ఉండదు.  సాధారణంగా  శుక్రవారాలు ఒక్కొక్క శతకం చొప్పున కానీ రోజూ ఇన్ని శ్లోకాలని గాని పారాయణ చేస్తారు. 


మూక కవి వ్రాసిన శ్లోకాలు చాలా ప్రౌఢంగా ఉంటాయి.  మామూలు గా పైకి చూస్తే అందమైన వర్ణనలు, పురాణ విషయాలు అమ్మవారి వివిధ రూపలు కనిపిస్తాయి. లోపల వెతికితే శ్రీవిద్య,  శ్రీచక్రం, అమ్మవారి పూజా సంప్రదాయాలు, కుండలిని ఉపాసన మొదలయిన వాటికి సంబంధించిన  మంత్ర,  తంత్ర శాస్త్ర సంబంధ మైన విషయాలు ఉంటాయి.


మూక కవి సంస్కృత పదాలను చిత్రంగా వాడతాడు.  అమ్మవారిని వర్ణిస్తూ ఒక చోట "ఏవం పద దూరా" అంటాడు. ఒక పట్టాన అర్థం కాదు. ఏదైనా పదార్ధాన్ని వర్ణించడానికి ఏవం అనే పదాన్ని సంస్కృతంలో ఉపయోగిస్తారు. "ఇట్లా గా, ఇట్లాటిది" అని ఆ పదానికి అర్థం. భగవంతుడు అవాగ్మానసగోచరుడు. అంటే వాక్కు కు మనసుకు అందనివాడు. వర్ణించ డానికి వీలు లేని వాడు. పరాశక్తి లక్షణం కూడా అదే. అందువల్లనే కామాక్షి అమ్మవారిని "ఏవంపద దూరా"  అని సంబోధించాడు. ఇంకొక చోట అమ్మవారిని శివుని "అతఃపురము" అని వార్ణిస్తాడు.  అతఃపురము అంటే భార్య అని అర్థం రాస్తారు. గృహం  అనే మాటకు భార్య అని అర్థం ఉన్నది. కానీ అతఃపురము అనే పదానికి భార్య అని ప్రియురాలు అని ఎక్కడా అర్థాలు లేవు. మరి ఈ అర్థం ఎలా పొసుగుతుంది. శివుడికి ఇల్లే లేదు. ఇక అతఃపురము ఎక్కడ? అన్వయం సాధించాలంటే కాస్త మూక కవి ఉద్దేశ్యం ఏమై ఉంటుందో మనం ఊహ చేయాలి. శివుడికి ఆకలి వేస్తే అమ్మవారు అన్నపూర్ణ రూపంలో ఆయనకు kitchen cum dining room గా మారితుంది. ఆయనకు సలహా కావాలిసి వస్తే ఆవిడ జ్ఞానప్రసూనాంబ రూపంలో కాన్ఫరెన్స్ హాల్ గా మారిపోతుంది. శివునికి కోరిక కలిగితే ఆవిడ కామాక్షి రూపంలో అతఃపురం గా మారి పోతుంది. ఇలా భావిస్తేనే ఆ సంబోధన కు అన్వయం వస్తుంది. ఇంకో రకంగా అర్థము పోసగదు.


*మూక కవి ఊహను మామూలు గా అందు కోవడం చాలా కష్టం. ఈయన శ్లోకాలను కనుక అర్థం చేసుకోగలిగితే సంస్కృత భాషలో ఇంకెవరి కవిత్వాన్ని అయినా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం 500 శ్లోకాలలో కనీసం 350 శ్లోకాలు ఇలాగే భాషా సంబంధమైన చమత్కారాలు గానీ మంత్రార్ధాలు గాని వేదాంత అర్థాలు శ్రీవిద్య,  శ్రీచక్ర రహస్యాలు మొదలైనవి కలిగి ఉంటాయి..*


"సుకవితా యది రాజ్యేన కిం" అని సంస్కృత భాషలో ఒక నానుడి ఉంది. దాని అర్థం మంచి కవిత్వం ఉంటే రాజ్యం కూడా అక్కరలేదు అని. మూక పంచ శతి స్తోత్రం లో ఉన్న కవిత్వం ఆ స్థాయికి చెందినది. 


*చాలా చాలా మంత్రాలూ, బీజాక్షరాలూ ఈ స్తోత్రం లో నిక్షిప్తం అయి ఉన్నాయి కాబట్టి, మూక పంచ శతిని ఊరికే స్తోత్రం లాగా (పారాయణగా) చదివినా మంచిదే.  వ్యాఖ్యానం తో చదివి తే ఇంకా మంచిది...*



*పవని నాగ ప్రదీప్.*

ఓర్పులేన సాధకుడ

 *సుఖినోభవంతు:🙏


🌸*శుభోదయం*🌸


ఓర్పు*


*కొద్దిగంటలు వేచిఉంటే, జీవితకాలం నిరీక్షించినట్లు అనిపిస్తుంది చాలామందికి...*


*ఒక కొత్త శిశువును చూడాలంటే తొమ్మిది నెలలు ఆగాలి...*


*కొన్ని రకాల కాయల కోసం ఆ చెట్లను పెంచి, వృద్ధిచేసి, కాపుదశ రప్పించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది...*


*అవధుల్లేని ఓర్పుతో ఎన్నో పనులూ సాధ్యమవుతాయి...*


*ఓర్పులేని మనిషి మనిషే కాడు.. అజ్ఞానం వల్ల సహనం కోల్పోయి, తన స్థితిని మరింతగా దిగజార్చుకుంటాడు మనిషి.. అందరూ పారిపోయేచోట ధీరుడు నిలబడతాడు.. అతడి జెండా ఓర్పు.. సహనంతో ఉండగలిగితే అన్ని పనులూ ఒకటొకటిగా సానుకూలమవుతాయి...*


*రాత్రి చీకటిలో గడిపితేనే సూర్యోదయం చూడగలం.. మనసులో ఆలోచనలు లేస్తాయి..  ఉన్నచోటున ఉండనివ్వవు...*


*రాయిలాంటి స్థిరమైన మనిషినీ కదపాలని చూస్తాయి.. కదలకూడదు...*


*సహనమే మనిషిని రుషిని చేస్తుంది.. సహనం కలిగినవాణ్ని చూసి ఎంతటివారైనా భయపడతారు.. సహనం మనిషిని చరిత్రలో నిలబెడుతుంది..  సహనమే సత్యాన్ని చూపిస్తుంది...*


*సహనంలేని వ్యక్తి నాయకత్వం వహించలేడు.. సహనంలేని వ్యక్తి నాయకుణ్ని అనుసరించలేడు.. సహనంలేని వ్యక్తి కలిసి జీవించలేడు.. సహనంలేని వ్యక్తి ప్రకృతికి అనుకూలంగా బతకలేడు..*


*ఎదురుచూసి ఎదురుచూసి సంవత్సరాలు గడిచిపోయాయి.. ఓర్పు మహావృక్షమైంది.. కారడవిలో సహనమే ధైర్యంగా శబరి ఎదురుచూసింది.. ఆమె నిరీక్షణ ఫలించింది.. శ్రీరాముడొచ్చాడు.. జన్మజన్మల ఓర్పు విజయశిఖరం చేరుకుంది...*


*ఎదురు చూసేవాళ్లను నిరాశపరచడు భగవంతుడు.. పడవ నడిపే గుహుణ్ని.. రాయిగా పడి ఉన్న అహల్యను అనుగ్రహించాడు..*


*తపస్సుకే తమ జీవితాలను అంకితం చేసిన మహారుషుల కోసమే శ్రీరాముడు భూమ్మీద అవతరించాడు...*


*మేఘజలం తప్ప మరే నీటినీ తాగని చాతకపక్షి కారుమబ్బు కోసం ఎదురుచూస్తుంది..*


*కోకిల రాకకోసం వసంతం వేచిఉంటుంది..*


*ఓర్పు మనకు హృదయానందాన్ని కలిగిస్తుంది...*


*ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తల జీవితాలు గడిచిపోతాయి.. వారి సహనం, అంకితభావమే మానవాళికి ఎన్నో శుభాలను చేకూరుస్తుంది...*


*చుట్టూ పుట్టలు ఏర్పడి.. తపస్సులో సుదీర్ఘకాలం నిమగ్నమైన సాధారణ నరుడు వాల్మీకిగా అవతరించాడు...*


*మహాకావ్యాన్ని లోకానికి అందించాడు...*


*అన్ని సుగుణాలూ ఉండి.. సహనం ఒక్కటే లేకుంటే- లాభం లేదు...*


*ప్రతిభా పాటవాలు తక్కువైనా ఓర్పుతో నేర్పుతో ప్రవర్తించే వ్యక్తికి తిరుగుండదు...*


*సరైన సాంగత్యంలో నిజమైన ఓర్పు బయటపడుతుంది...*


*నిండు సభలో శ్రీకృష్ణుణ్ని నానా దుర్భాషలాడాడు శిశుపాలుడు...*


*విన్నవాళ్ల రక్తం మరిగిపోయినా.. శ్రీకృష్ణుడు తరగని చిరునవ్వుతో ఓర్చుకున్నాడు... అంతిమంగా ఏం జరిగిందో తెలిసిందే...*


*ఎదుగుతున్నకొద్దీ ఒదిగే గుణం ఓర్పుగా ఉంటే వస్తుంది...*


*ఒక చిన్న మొక్క వందల ఏళ్లు ఎదిగి చరిత్రకు సాక్ష్యంగా నిలిచే వృక్షంగా మారుతుంది...*


*ఓర్పు చరిత్రను తిరగరాస్తుంది...*


*ధర్మరాజు లాంటి మనిషి అంటారు.. దుర్యోధనుడి లాంటి మనిషి అనరు.*


*ఓపిక వహించు... అన్నీ సర్దుకుంటాయి అని మన పెద్దలు ఎన్నోసార్లు చెబుతుంటారు...*


*ఓపిగ్గా మనం నిరీక్షించలేకపోవడానికి కారణం- ప్రకృతి పనిచేసే విధానం...*


*అది మనమీద చూపించే ప్రభావం.. చంచల స్వభావం కలిగిన మనసు మన బతుకును నడిపించడం.. మనకు తెలియకుండానే దానికి వశమైపోయి మనం ఓడిపోతుంటాం...*


*గెలవాలంటే ఓర్పు కావాలి.. సహనంలేని ఏ వీరుడూ చరిత్రలో గెలిచిన దాఖలాలు లేవు...*


*ఓర్పులేని ఏ సాధకుడూ సత్యానుభూతి పొందిన సన్నివేశాలు లేవు..

సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు

కాకర గురించి

 కాకర గురించి సంపూర్ణ వివరణ - 


     

      కాకరని సంస్కృతంలో కారవేల్లం అంటారు. కాకర చెట్టుకు బొత్తిగా ఇసుక నేల కాని బంకమట్టి నేల కాని పనికిరాదు. కాకర గింజలు నాటిన వారం రోజుల్లొ మొలకెత్తుతాయి. కాకరచెట్టు ఒకసారి నాటిన తరువాత మరలా మొలకెత్తిన తరువాత వేరే ప్రదేశములో నాటకూడదు. మంచి బలంగా ఉంటే పాదుపెట్టిన 45 రోజుల నుంచి 60 రోజుల్లొ కాపుకి వస్తుంది. కాకరపాదుకి చన్నీటి కంటే వేడినీరు దాని పాదులో పోస్తుంటే బాగా ఎదిగి కాపు కాయును . 


                 కాకర చెట్టు సంవత్సరం అంతా కాపు కాయించవచ్చు. కాకరలో పెద్ద కాకర , పొట్టి కాకర అని రెండు రకాలు ఉండును. పెద్దకాకర అనగా పొడుగు కాకరకాయలు దీనిలో రంగుని బట్టి రెండు రకాలు ఆకుపచ్చ కాయల రకం ఒకటి , తెల్ల కాయల రకం ఒకటి . వంకాయలో తెల్ల వంకాయ ఎక్కువ తినకూడదు కాని కాకరకాయలో తెల్లగా ఉండునవి అత్యంత శ్రేష్టం . 


                        కాకరకాయ స్వస్థకరం అయినది. రసాయనిక గుణం కలది. జీర్ణశక్తిని కలిగిస్తుంది . కాకరకాయలు పైత్యశాంతిని కలిగిస్తాయి . ఎముకలోని మూలుగను శక్తివంతం చేయు శక్తి కాకరకి కలదు. క్రిములను హరించును . నేత్రములకు బలం చేయును . ఇది శరీరం నందలి గట్టిపడిన మలాన్ని బేధించి లఘువుగా ఉండి వాతాన్ని చేయకుండా ఉంటుంది. పెద్ద కాకర కొంచం వేడి చేస్తుంది . రుచిని పుట్టించి సర్వరోగాలను పోగొట్టును . కుక్క , నక్క మొదలగు జంతువులు కరిచినప్పుడు పైన కట్టడానికి , లోపలికి సేవించడానికి కాకర ఆకు , కాకర కాయ , పండు మంచి ఉపయోగకారులై ఉండును. కాకర కాయలు సాలెపురుగు విషాన్ని కూడా విరిచేస్తాయి . 


               కాకరకి ఉన్న చేదు గుణం వలన రక్తశుద్ది జరుగును. వీర్యస్తంభన చేయును . చర్మవ్యాధుల్లో మంచి గుణాన్ని ఇచ్చును. పొడుగు కాకర కాయలు అగ్నిదీప్తి ఇచ్చును . లేత కాకర కాయల కూర త్రిదోషాలను హరించును . ముదురు కాకరకాయల కూర విరేచనకారి . పొట్టి కాకరకాయలు కూడా ఇవే లక్షణాలని కలిగి ఉండి ఆకలిని పుట్టించి , చర్మవ్యాధులలో హితకరం అయి ఉండును. 



               వేడి శరీరం కలిగినవారు కాకరకాయలు తరచుగా వాడరాదు. శరీర బలం పెంచుకోవడానికి ఔషధాలు వాడువారు కాకర వాడరాదు . కాకరకు విరుగుడు పులుసు . అందువల్ల కాకర పులుసు కాని పులుసు పచ్చడి దోషరహితం అయ్యి ఉండును. పులుసుతో పాటు నెయ్యి , ఆవాలు , దోసకాయలు కూడా విరుగుడుగా పనిచేయును . 


    గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శ్రీ స్వామివారి బోధ..ఊరట చెందిన దంపతులు..*


*(యాభై ఐదవ రోజు)*


సత్యనారాయణమ్మ గారిని కనిగిరి లో వదిలిపెట్టి వచ్చిన తరువాత శ్రీ స్వామివారిని శ్రీధరరావు దంపతులు కలిసారనీ..మాట్లాడదాము రమ్మని ఆ దంపతులను ఆశ్రమం లోకి తీసుకువెళ్లారు శ్రీ స్వామివారు..శ్రీ స్వామివారి కెదురుగా కూర్చున్నారు ప్రభావతి శ్రీధరరావు గార్లు..


"అమ్మా..ఏదో దుష్ట శక్తి మీ బంధువు రూపంలో వచ్చి మీ అత్తగారి మనసంతా విరిచేసి..ఆవిడను మీకు కాకుండా చేసిందని మీరు భావిస్తున్నారు కదా..ఎంత వెఱ్ఱి తల్లివమ్మా!..ఆ వచ్చినావిడ మీ పాలిట దుష్ట శక్తి కాదు..మీకు అయాచితంగా.. పరోక్షంగా మేలు చేయడానికి వచ్చిన దేవత అని భావించండి..శ్రీధరరావు గారూ నేను మొదటిసారి మొగలిచెర్ల లోని మీ ఇంటికి వచ్చిన రోజే మీతో ఒక మాట చెప్పాను గుర్తుందా..మీ అమ్మగారికి మృత్యువు పొంచివుంది..ఆమెను రామనామం విడవకుండా చేసుకోమని చెప్పండి అన్నాను..నేను కూడా ఆమెతో మీ ఇంటిలో ఉన్న కాలంలో చెప్పి వున్నాను..ఆమె బాధ్యతను మీనుంచి తొలగించడానికే దైవం ఆ "బంధువు" ను   ఇక్కడికి పంపాడు..ఈ అవసాన కాలంలో మీ తల్లిగారు పడే బాధను మీరు చూడలేరు..పడలేరు..ఎక్కువ సమయం లేదామెకు..కొద్దిరోజుల్లోనే వైద్యులు కూడా ఇదే నిర్ధారిస్తారు..


"ఇక మీరిద్దరూ ఆమెకు చేసిన సేవ ఫలితం ఎక్కడికీ పోదు..మిమ్మల్ని ఇప్పుడు విమర్శించిన వ్యక్తులందరూ..మళ్లీ మిమ్మల్ని కీర్తించే రోజు వస్తుంది..ఇక్కడి నుంచి మీ బంధాలన్నీ ఒకటొకటిగా విడిపోతూ ఉంటాయి..ఇది మీకు మరో జన్మ గా అనుకోండి!..మీకు  దైవం కొన్ని బృహత్తర బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడు..అవి మీరు నెరవేర్చాలి..అందుకు ముందుగా ఈ ప్రతిబంధకాలు తొలగి పోవాలి..ఆ ఏర్పాట్లలో భాగమే ఆ బంధువు మీ వద్దకు రావడం..ఒక కష్టం..ఒక సుఖం..ఒక దుఃఖం..ఒక సంతోషం..వీటన్నింటినీ తట్టుకొని ఒక స్థిరచిత్తం మీకు కలగాలి..వీటన్నిటి కి ప్రేరణే ఈనాడు ఆ  భగవంతుడు చేసిన ఏర్పాటు.."


"మరో ముఖ్య విషయం..త్వరలో నా పరంగా మీమీద పెద్ద భారం పడబోతోంది..అందుకూ మీరు సన్నద్ధులు కావాల్సిన అవసరం ఉంది..ఇక మనసు గట్టి చేసుకోండి..నిశ్చింతగా వుండండి.. ఏ బాధా.. ఏ సంతోషం..మీ మార్గం నుంచి వేరు చేయలేవు..ఈ ఆశ్రమం కూడా క్షేత్రంగా మారుతుంది..అప్పుడు అందరూ మీ గురించి ముచ్చటించుకుంటారు.." 


"అమ్మా..నువ్వు రచయిత్రివి..నా చరిత్ర వ్రాసే రోజులు వస్తాయి..ఇక ఎక్కువ ఆలోచించకండి..శుభం జరుగుతుంది.." అన్నారు..


శ్రీ స్వామివారి బోధ ఆ దంపతులకు ఎనలేని మానసిక స్తైర్యాన్ని ఇచ్చింది..మన వంతు కర్తవ్యం మనం చక్కగా నెరవేర్చాలి..ఫలితాన్ని ఆ దైవానికి వదిలేద్దాము..అనే భావనలోకి వచ్చేసారు..ఆరోజు నుంచి వారి జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది..పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు వారి జీవనయానం సాగడానికి తోడ్పడింది..శ్రీ స్వామివారి సేవ అనేది తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది..


ఎందరో సాధకులు..ముముక్షువులు..పండితులు..శ్రీ స్వామివారిని దర్శించడానికి మొగలిచెర్ల రా సాగారు..వారిని ఆదరించడం..సత్సంగ గోష్ఠులు..ఇలా నిత్యం ఒక దైవిక వాతావరణం ఆ దంపతుల చుట్టూ ఏర్పడిపోయింది..వారూ అందులో ఇమిడిపోయారు.


ప్రభావతి గారిని తేలు కుట్టటం..అహంకార నిర్మూలనం..రేపు.. 


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).