27, అక్టోబర్ 2023, శుక్రవారం

Tamilnadu truck


 

హైదరాబాద్‌లోని

 హైదరాబాద్‌లోని ప్రాంతాలు- వాటి వెనుక చరిత్ర.

(చాలామందికి తెలియని ఈ విషయాలను అందరితో పంచుకోవాలనుకుని పోస్ట్ చేస్తున్నాను.)


ఆరో నిజాం కాలంలో అల్‌ బర్ట్ అబిద్ అనే యూదుడు ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.


గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ఖానాకాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.


చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.


 ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు.కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.


 ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.


 దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.


ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.


హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.


ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది.

ఏడవ నిజామ్ పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హిమాయత్ నగర్ గా స్థిరపడింది.

మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.

గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో మలక్ పేట్ గా మారింది.


తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె.. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.


శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు..కాలక్రమంలో అది శాలిబండగా మారింది.


నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను హబ్సిగూడ పిలుస్తున్నారు.


ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.


చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.


అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.


నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్

పహాడ్ అని పేరొచ్చింది.


గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.


సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్!


నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్అని పిలుస్తున్నారు.


 తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్‌ బండ్‌గా మారిపోయింది.


ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్‌ గా స్థిరపడింది. ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.


కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది


మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్‌ బజార్ లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.


హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.


ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు. ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.


పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడుబాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు: బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్స్ అని పిలుస్తున్నారు.


మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.


1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్  పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది.


నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.


గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.


రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది. 


1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.


రెండో అసఫ్ జాహీ తన కూతురు బషీర్- ఉల్- నిసా బేగంకు కట్నం కింద 1796లో కొంత జాగీర్ రాసిచ్చాడు. బేగంపేట ఏరియా ఆమె పేరుమీదనే స్థిరపడింది. 


1853లో నవాబ్ నసీరుద్దౌలా హయాంలో పండిట్ సోనాజీ అనే రెవెన్యూ ఉద్యోగి ఉండేవాడు. ఆయన ఇల్లు ఆ రాజప్రాసాదాన్ని తలపించేది! లాండ్ మార్కుగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని మొదట్లో సోనాజీగూడ అని పిలిచేవారు. తర్వాత సోమాజీగూడ అయింది.


రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.


రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.


నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.


అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్‌ పేటగా స్థిరపడిపోయింది.


చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.


చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకలగూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!


మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.


నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్  అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.


1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరుమీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.


టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.


లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు. ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.


హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు.

Trams


 

NetTew Tata truck


 

Peddamma talli Temple


 

Kachory shop


 

Vizag beach


 

Drinking water in kuwait


 

Afghanistan biriyani


 

Driver in kuwait


 

Pune to bombay train


 

Complaint on ride


 

Tirumala brahmmotsav


 

Flight to dubai


 

Guardian in Canada


 

Safe seat in flight


 

Maa


 

శ్రీ బిర్లా రాధా కృష్ణ ఆలయం

 🕉 మన గుడి : నెం 221


⚜ గోవా  : BITS పిలానీ, గోవా






⚜ శ్రీ బిర్లా రాధా కృష్ణ ఆలయం


💠 ఇది గోవాలోని అతిపెద్ద మరియు అందమైన దేవాలయాలలో ఒకటి మరియు ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.

గోవాలోని బిర్లా రాధా కృష్ణ దేవాలయం ఇటీవల పర్యాటకులు మరియు భక్తులలో ఆదరణ పొందింది.


💠 బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, సాన్‌కోలేలోని పిలానీలోని ప్రశాంతమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయంలోని  అందమైన రాధా కృష్ణ దేవాలయం గోవా నడిబొడ్డున ఉంది, ఇది ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను ఆకర్షించే నిర్మాణ అద్భుతం కూడా


⚜ చరిత్ర ⚜


💠 బిర్లా రాధా కృష్ణ దేవాలయాన్ని భారతదేశంలోని ప్రముఖ వ్యాపార దిగ్గజాలలో ఒకటైన బిర్లా గ్రూప్ 3 మే 2023న ప్రారంభించింది. 

బిర్లా కుటుంబం భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి, మరియు వారికి దాతృత్వం మరియు మతపరమైన ప్రోత్సాహం యొక్క సుదీర్ఘ చరిత్ర ఉంది. 

బిర్లా రాధా కృష్ణ మందిర నిర్మాణం హిందూ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడంలో వారి నిబద్ధతకు నిదర్శనం.

బిర్లా గ్రూప్ హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బిర్లా మందిర్‌తో సహా భారతదేశం అంతటా అనేక ఇతర దేవాలయాలను నిర్మించింది.



💠 శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన కృష్ణుడు మరియు అతని ప్రియమైన రాధ గౌరవార్థం ఈ ఆలయం నిర్మించబడింది. 


💠 గోవా వాస్కోలోని బిర్లా రాధా కృష్ణ దేవాలయం సాంప్రదాయ భారతీయ డిజైన్‌తో మిళితమైన ఆధునిక వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ.

 ఆలయం తెల్లని పాలరాయితో నిర్మించబడింది, ఇది గొప్ప మరియు గంభీరమైన రూపాన్ని ఇస్తుంది. 


💠 ఆలయ ప్రవేశ ద్వారం హిందూ దేవతల యొక్క క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడి ఉంది, ఇవి కళా ప్రేమికులకు విందుగా ఉంటాయి.

 శ్రీకృష్ణుడు మరియు రాధల జీవితాన్ని వర్ణించే అందమైన కుడ్యచిత్రాలతో ఆలయం లోపలి భాగం కూడా అంతే ఉత్కంఠభరితంగా ఉంటుంది. 

ఈ ఆలయంలో హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు, సీత, శివుడు, పార్వతి మరియు నంది వంటి దేవతలు కూడా ఉన్నారు. 

ఈ ఆలయంలో పెద్ద ప్రార్థనా మందిరం కూడా ఉంది.



💠 ఈ ఆలయం ఏడాది పొడవునా వివిధ సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంది, దీనికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హాజరవుతారు.



💠 బిర్లా టెంపుల్ వాస్కో అన్ని ప్రధాన హిందూ పండుగలను ఎంతో ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకుంటుంది. 

కృష్ణజన్మాష్టమి, హోలీ, దీపావళి మరియు నవరాత్రి వంటి కొన్ని ప్రసిద్ధ పండుగలు ఈ ఆలయంలో జరుపుకుంటారు.

 ఈ పండుగల సందర్భంగా ఆలయాన్ని దీపాలతో, పూలతో అందంగా అలంకరించి, దేవతలకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు.



💠 బిర్లా రాధా కృష్ణ ఆలయాన్ని ఏడాది పొడవునా సందర్శించవచ్చు, అయితే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో సందర్శించడానికి ఉత్తమ సమయం.

ఈ సమయంలో గోవాలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది



💠 ప్రతిరోజూ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు , 

మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు



💠 బిర్లా రాధా కృష్ణ దేవాలయం గోవా రాజధాని నగరం పనాజీ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాన్‌కోలేలో ఉంది.


 

Panchang


 

ఉలిపికట్టె

 ఉలిపికట్టె:


 తెలుగుసామెతల్లో ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరోదారి. 

ఈ మాటకు ఉలిపికట్టె, ఉలిపిగొట్టు, ఉలిపిరిగొట్టు అనే రూపాంతరాలున్నాయి.


 ఈ పదం చివరి కట్టె మొండికట్టె, కష్టాలన్నీ ఈ కట్టెతోగాని పోవు వగైరా పదబంధాల్లో వాక్యాల్లో వినిపించే శరీరార్ధకమైన పదమేగాని కేవలం కర్ర అనే అర్థమిచ్చేదికాదు. శరీరాన్ని కట్టెతో పోల్చి, కట్టెగా భావించి చెప్పేమాటలివి. ఉలిపి శబ్దాన్ని నామవాచకంగానూ విశేషణంగాను వాడ్తారు. నామవాచకంగా వాడినప్పుడు దానికి పొగరుబోతు, దుర్మార్గుడు, పెడమనిషి, కోపదారి మొదలైన అర్థాలున్నాయి.అదో చెట్టుపేరు కూడా. బాణాసంచా తయారీలో ఆ కట్టెముక్కల నుపయోగిస్తారు. ఉలిపిచెట్టు కర్రను కాల్చినప్పుడు చిటపటలాడుతుంది. ఆ కట్టెముక్కలాగానే మటమటలాడే వ్యక్తిని ఉలిపి (కట్టె/గొట్టు) అని వ్యవహరిస్తారు. దీని రూపాంతరమైన ఉలిపిరిని చాలా నిఘంటువులు ఆరోపంగా చేర్చలేదు. కానీ ఉలిపిరి కాగితం వంటి సమాసాల్లో తేలికైన, పల్చని, తిన్నగా చినగని మొదలైన అర్థాల్లో వాడుకలో ఉంది. ఉలిపిరికి ఉలిమిరి/ఉలిమిడి అనే చెట్టుపేరు రూపాంతరమైనా కావచ్చు. కారణం అది ఉలిపిచెట్టులాగ తేలికైన కట్టెమొక్క. వృక్షశాస్త్రంలో ఈ చెట్టుకు మూడువిథాల పేర్లున్నాయి. సాంకేతికంగా పూర్వం చీకటి పడ్డ తరువాత ప్రయాణించే బాటసారులు ఈ కట్టెలను ముట్టించి వాటిని కాగడాలుగా వాడి కౄరమృగాలను బెదిరించడానికీ వెలుతురువల్ల దారులను గుర్తించటానికి వాడేవారు. ఉలిపిరిని కాగడాకర్ర/కట్టె అని పిలవటం కద్దు. ఆ కట్టెలాగ మండిపడే వ్యక్తిని ఉలిపి(రి)కట్టె అంటారు. చిర్రుబుర్రులాడే, చిటచిటలాడే కోపదారి మనిషిని ఈ పేరుతో తక్కువచేసి వ్యవహరించేవారు. ఎర్రడాలున్న తెల్లమచ్చలనూ,తెలుపుమీద మసరగా ఉండే మచ్చలున్న మబ్బురంగునూ ఉలిపిరి అంటారు. కొందరు దీన్ని గాడిదరంగని వ్యవహరిస్తారు. జిల, మంట, చికాకు, బాధ పుట్టించే రోగాన్ని ఉలిపితెగులు అంటారు. గాడిదలాగ ప్రవర్తించేవ్యకిని ఉలిపిగొట్టంటారన్నమాట.

రేపు శరత్ పూర్ణిమ

 _*రేపు శరత్ పూర్ణిమ , కోజాగిరి వ్రతం విశిష్టత*(28/10/2023)

శరత్ పూర్ణిమ  ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు.. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు.


మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే , దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. 


ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్ర కిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది... అవి శారీరక , మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి.  అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్ర నామ పారాయణ చేయడం , ఆవు పాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి , ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. 


చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్ర కిరణాలలో ఉన్న ఔషధీ తత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేధ్యంగా స్వీకరించాలి.


*ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది.*   కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.


*కోజాగిరి పౌర్ణమి*


*లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం ఈ  "కోజాగిరి వ్రతం''.... "కోజాగిరి వ్రతం'' గురించి తెలుసుకొందాము...?*


సంపదలను , సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ లక్ష్మీదేవి ని పూజిస్తాము

లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వ్రతం , దారిద్ర్య వినాశక వ్రతం *"కోజాగిరి వ్రతం''*.


దారిద్ర్యం తొలగిపోయి , లక్ష్మీదేవి ప్రసన్నం  లభించే వ్రతాన్ని వివరించమని మహర్షులు వాలిఖిల్య మహర్షిని కోరగా , వాలిఖిల్య కోజాగిరి వ్రతాన్ని వివరించినట్లు పురాణాలలో ఆధారం ఉంది.


పూర్వం మగధదేశంలో  *"వలితుడు''* అనే బ్రాహ్మణుడు నివశిస్తూ ఉండేవాడట , అతను గొప్ప పండితుడు , భక్తుడు... కానీ అతను కటిక పేదవాడు.. , ఆయన భార్య అయిన చండి పరమ గయ్యాళి.. , తనకు బంగారం , పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది.


వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధ చూసి. , ఆలోచించి *" నీవు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నావో  దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు.. , అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పని చేస్తుంది.. , కాబట్టి నీ పని జరుగుతుంది''* అని సలహా ఇచ్చాడు...


కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్ధికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగా వలితుడు *"రేపు మా తండ్రిగారి ఆబ్ధికం.. , అయినా నేను ఆబ్ధికం పెట్టదలచుకోలేదు''* అని భార్య చండితో అన్నాడు.


భర్త మాటలు విన్న చండి మామ గారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో  *"పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి''* రమ్మన్నాడు.

వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది.


ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందడంతో  ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు.. 


కొంతకాలం తరువాత ఆశ్వీయుజ పౌర్ణమి వచ్చింది.. , సాయంకాలం అయింది.. , నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు...


పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కలా గాలించారు. 

వారికి వలితుడు కనిపించాడు...


వలితుడిని పాచికలు ఆడడానికి రమ్మని కోరారు.  అది జూదం కాబట్టి తాను ఆడనని వారికీ వివరించాడు... ఈ రోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడిని ఒప్పించి పాచికలు ఆడడానికి ఒప్పించారు.


లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని వున్నారో చూడడానికి రాగా , వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు పాచికలు ఆడుతూ కనిపించారు. 


దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలు ప్రసాదించారని వాలిఖిల్య  మహర్షి వివరించాడట..

 

కాబట్టి ఆశ్వీయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి , ఆ రాత్రి జాగరణ చేస్తూ , పాచికలు ఆడేవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలూ చెబుతున్నాయి.

దేశ భక్తులను జాతీయ వాదులను

 *R.S.S  అంటే ఏంటి ?*

60,000 వేల శాఖలు.

60 లక్షల మంది స్వయం సేవకులు.

30,000 విద్య మందిరాలు.

3,00,000 మంది ఉపాధ్యాయులు.

50,00,000 మంది విద్యార్థులు.

90,00,000 BMS కార్మిక సభ్యులు.

50,00,000 లక్షల మంది ABVP కార్యకర్తలు.

10 కోట్ల మంది భాజపా కార్యకర్తలు.

500 వందల అనుబంధ సంస్థలు.

1లక్ష మంది మాజీ  సైనికుల సంఘం.

4 వేల మంది దుర్గ వాహినీలు.

70,00,000 లక్షల మంది విశ్వహిందూ పరిషత్ సభ్యులు.

3,00,000 లక్షల మంది బజరంగ్ దల్ కార్యకర్తలు.

21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు.

283 పార్లమెంట్ సభ్యులు.

1,460 మంది ఎమ్మెల్యేలు.

17 మంది ముఖ్యమంత్రులు.

1 రాష్ట్రపతి.

1ఉపరాష్ట్రపతి

1ప్రధానమంత్రి

ఇంతే.. ఇంతే.. ఆర్.ఎస్.ఎస్ అంటే..

టచ్ చేసే మగాడు ఎవడైనా ఉన్నాడా??

RSS.. దేశ భక్తులను జాతీయ వాదులను తయారు       చేసే ప్రపంచంలో నే అతి పెద్ద కర్మాగారం..

జై హింద్.. జై భారత్.. 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩

Maa baap bhagawan hi


 माँ बाप भगवान हाय

అష్టవిధ బ్రాహ్మణులు

 *అష్టవిధ బ్రాహ్మణులు*


ధర్మశాస్త్రాలు బ్రాహ్మణుని స్థాయిని బట్టి 8 విధాలుగా వర్ణించాయి. అవి:


1 మాత్రుడు: బ్రాహ్మణకులంలో జన్మించినా, ఉపనయనము, అనుష్ఠానమూ లేని 

   వాడు.

2 బ్రహ్మణుడు: వేదాలను కొంతమేరకే అధ్యయనం చేసినవాడు. అయితే, 

   ఆచారమూ, శాంతి, సత్యము, దయ కల వాడు, ఆ బుద్ధి కలిగినవాడు.

3 శ్రోత్రియుడు: కనీసం ఒక వేదం శాఖను, కల్పసూత్రాలతో, షడంగములతో, 

   అధ్యయనం చేసి, యజ్ఞాది షట్కర్మలను చేసేవాడు. 

4 అనుశాసనుడు: వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసి అర్థం 

   చేసుకున్నవాడు; నిర్మలమైన చిత్తం కలిగి శ్రోత్రియుడి లక్షణాలు కలవాడు.

5 బ్రూణుడు: యజ్ఞయాగాదులు, వేదాధ్యయనము, వ్రతాలు చేస్తూ, ఇంద్రియాలను 

   జయించినవాడు; అనుశాసనుడి లక్షణాలు కలవాడు.  

6 ఋషికల్పుడు: వైదిక, లౌకిక వ్యవహారములు తెలిసి, గృహస్థుగా వున్నవాడు; 

   బ్రూణుడి లక్షణాలు కలవాడు. 

7 ఋషి: తపస్వి; కామమూనూ, ఆకలినీ జయించినవాడు, సత్యసంధత 

   కలిగినవాడు; వరములను, శాపములను ఇవ్వగలిగినవాడు.

8 ముని: అరిషడ్వర్గములను, ఇంద్రియములను, జయించినవాడు; 

   వస్తుసంపదలపై మోహము లేనివాడు; మౌనియై సమాధి స్థితి పొందినవాడు.

దక్కని వాటి ని తలచుకుంటూ

 *1973*

*కం*

దక్కని వాటిని తలచుచు

మిక్కిలి రోదించుకన్న మేదిని యందున్

దక్కిన వాటికి తృప్తిని

చక్కగనొందుట సతతము సౌఖ్యము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! దక్కని వాటి ని తలచుకుంటూ అతి గా బాధపడటం కన్నా ఈ భూలోకంలో దక్కినవాటితో సంతృప్తి ని పొందటం ఎల్లప్పుడూ సుఖదాయకమగును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సమయస్పూర్తి

 యన్.టి.రామారావు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు దాశరథి గారు ఆస్థాన కవి. 


ఒకసారి సచివాలయంలో ఇద్దరు కలిసి పోతున్నప్పుడు Chief Secretary  నేమ్ ప్లేట్ కింద ప్రధాన కార్యదర్శి అని ఉంది.  రామారావు గారికి ఒక సందేహం వచ్చి దాశరథి గారిని అడిగారు చీఫ్ సెక్రటరీని ప్రధాన కార్యదర్శి అన్పప్పుడు, చీఫ్ మినిస్టర్ ను ప్రధాన మంత్రి అని ఎందుకనగూడదని. 

  

అందుకు దాశరథి గారు 'అట్ల కుదరదండి. దొరగారి భార్య దొరసాని అయినంత మాత్రాన మంత్రి భార్య మంత్రసాని కాదు కదా ' అన్నారు.

😀😀😀

తెల్లబట్ట

 స్త్రీలలో కలుగు తెల్లబట్ట ( white discharge ) నివారణ కొరకు సులభ ఔషదం - 


  

    నూరువరహాల పూవులు 40 తీసుకుని ఒక గ్లాసు నీటిలో మరిగించి వడకట్టుకొని ఆ కషాయంలో ఒక స్పూన్ తాటి కలకండ , అర స్పూన్ జీలకర్ర  పొడి కలుపుకుని తాగితే తెల్లబట్ట నివారణ అగును. రోజుకి రెండు సార్లు .2 నుంచి 3 రోజుల్లో నివారణ అగును. 


           వాము , జీలకర్ర కలిపి ఒక స్పూన్ తీసుకుని రసం మింగుతూ చివరికి పిప్పిని కూడా లొపలికి తీసికొనవలెను. ఈ విధంగా కూడా తెల్లబట్ట నివారణ అగును.


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

          9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


సుకన్యా చ్యవనుల కథ

వ్యాసుడు చిన్నగా నవ్వి వివరాలు చెప్పాడు. జనమేజయా! నీ సందేహం సమంజసమే

శర్యాతికి నాలుగువందలమంది భార్యలున్నారు. అందరూ అందగత్తెలే రాజపుత్రికలే. వారందరికీ

ఒకేఒక్క గారాల కూతురు ఈ సుకన్య.

ఒకరోజున ఈ అమ్మాయి రాజధానికి చేరువలోనే ఉన్న ఒక సరోవరానికి వెళ్ళింది. అది

మానససరోవరానికి అన్నింటా సాటివచ్చే సరోవరం. రేవుల్లోకి దిగేందుకు వీలుగా మెట్లు ఉన్నాయి.

స్వచ్ఛమైన నీళ్ళు. నీటిపక్షుల కలకూజితాలు. రకరకాల కమలాలు. తుమ్మెదలు. నాలుగు వైపులా

గట్లమీద ఎత్తుగా ఒత్తుగా పెరిగిన చెట్లు. వాటికి అల్లుకొని పుష్పించిన లతలు, శుకపికాలాపాలు,

చెట్లమధ్యన ఒక శుభప్రదేశంలో భార్గవుడైన చ్యవనుడు తపస్సు చేసుకుంటున్నాడు. పరమ శాంతుడు.

విజనప్రదేశంకదా అని అక్కడికి చేరి తపోదీక్ష స్వీకరించాడు. ఇంద్రియాలను నిగ్రహించుకొని, నిరాహారుడై

మంచినీళ్ళయినా ముట్టకుండా, కూచున్న చోటనుంచి కదలకుండా మహాదేవిని ఉపాసిస్తున్నాడు. అతని

చుట్టూ తీగెలూ లతలూ పెరిగి పుట్ట ఏర్పడింది. పిపీలికాలు చేరాయి. అందులో ఒక మహర్షి తపసు

చేసుకుంటున్నాడని ఎవరూ అనుకోరు. పైకి కనిపించడు. అంతా ఒక మట్టిపుట్ట.

ఆ ప్రాంతానికి వెళ్ళింది ఈ సుకన్య. శర్యాతి తనభార్యలతో కలిసి సరోవరంలో జలక్రీడలు

ఆడుతున్నాడు. సుకన్యయేమో తన చెలికత్తెలతో వనవిహారం చేస్తోంది. ఆ పువ్వులూ ఈ కాయలూ

తుంపుతూ అంతా కోలాహలంగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. వారి అందెల సవ్వడులు అడవిలో

సుకుమారంగా మారుమ్రోగుతున్నాయి. సుకన్య రవ్వంత అలిసిపోయి ఆ పుట్టదగ్గర చతికిలబడింది. దాని

రంధ్రాలలోకి చూపులు నిగుడించింది. లోపల ఏవో రెండు మిడుగురులు మెరుస్తున్నట్టు కనిపించింది.

ఏమిటో తెలుసుకోవాలనిపించింది. ఒక పొడవాటి సన్నని పుల్లను తీసుకుని పాడవబోయింది.

అందులో ఉన్న చ్యవనుడు సుకన్యను చూశాడు. రతిదేవిలా కనిపించింది. ఎండిపోయిన

గొంతును పెగల్చుకుని కల్యాణీ! ఏమిటది? విశాలాక్షీ! దూరం జరుగు. చంద్రవదనా! నేను తపశ్విని

కృశోదరీ! ఈ పుట్టను నాశనం చెయ్యకు- అని సన్నగా హెచ్చరించాడు. అయినా సుకన్య ఆగలేదు. ఇదేదో

వింత, తెలుసుకుందామని చాపల్యంకొద్దీ ఆ రంధ్రాల్లో పొడిచింది. చ్యవనుడికి కళ్ళు పోయాయి. ఏమి

జరిగిందో తెలుసుకోలేని సుకన్య తన చెలికత్తెలతో మళ్ళీ ఆటల్లో పడింది. లోలోపల ఏదో శంకగానే ఉన్నా

క్రీడల్లో మునిగిపోయింది

కృత త్రేతా ద్వాపర కలియుగాలనే పేర్లకు

*!!ప్రశ్న!!* కృత త్రేతా ద్వాపర కలియుగాలనే పేర్లకు అర్థం ఏమిటి?!! 


*!!జవాబు!!* వాటి లక్షణాల ననుసరించి ఆ పేర్లు పెట్టబడ్డాయి.!!!! 


1... 'క్రియత ఇతి - కృతం' - యత్కృత్యం వర్తతే కృత యుగః.!! 

2... త్రీన్ ధర్మ పాదాన్ ఇతా (ప్రాప్తా) త్రేతా -!! 

3... ద్వాఖ్యాం కృతత్రేతాభ్యాం పరః!! 

4... కల్యతే (కలహం కుర్వంతీ త్యస్మిన్) ఇతి కలిః!! 


1.... 'చేయబడినది కృతం'. ఆ యుగంలో 'ఇది చేయి' అని బోధించవలసిన అవసరం లేదు. ఎవరూ చెప్పనవసరం లేకుండానే ధర్మాలను ఆచరిస్తారు. అక్కడ ధర్మం 'కర్తవ్యం' కాదు. కృతం - సహజంగా ఆచరింపబడుతుంది. మహాత్ములకు ధర్మం సహజం. అందుకే అది కృతం. ఆ మహాత్ములున్న యుగమే కృతయుగం.!! 


2.... మూడు పాదములతో ధర్మములను పొందినది - త్రేతాయుగం. ఈ యుగంలో మూడు పాదములు మాత్రమే ధర్మం పూర్ణంగా ఉంటుంది కనుక త్రేతాయుగం.!! 


3.... కృత త్రేతాలనే రెండు యుగాల తరువాత వచ్చినది కనుక ద్వాపరం... ఈ యుగంలో రెండు పాదాలు మాత్రమే ధర్మం.!! 


4.... ఏ యుగంలో కలహం వ్యాపించి ఉంటుందో అది కలి యుగం... ఒకరంటే ఒకరికి పడకపోవడమే ఈ యుగ లక్షణం.!!

LPG వినియోగదారులందరూ

 LPG వినియోగదారులందరూ ఈ పోస్ట్‌పై శ్రద్ధ వహించాలి...




     ఒక గృహిణి గ్యాస్ సిలిండర్‌ను మార్చవలసి వచ్చింది, ఆమె ఖాళీ సిలిండర్‌ను తీసివేసి, కొత్త సిలిండర్‌ను ఇన్‌స్టాల్ చేసింది,

నాబ్‌ని ఆన్ చేసిన వెంటనే, గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనిపించి, భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే నాబ్‌ను ఆఫ్ చేసి గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి సహాయం కోసం అర్థించింది.

    ఆదివారం కావడంతో ఏజెన్సీ మూసి ఉంది, మేము మీ సమస్యని రేపు మాత్రమే పరిష్కరించ గలము అని సమాధానమిచ్చాడు.


    ఆ గృహిణి వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేయగా గ్యాస్ ఎమర్జెన్సీ నంబర్ 1906 అని కనిపించింది.

 ఆ నంబర్‌కు కాల్ చేయగానే, ట్రూ కాలర్‌లో *గ్యాస్ లీకేజ్ ఎమర్జెన్సీ* కనిపించింది.

     కాల్ చేయగానే అటువైపు ఒక మహిళ ఫోన్ తీసింది, ఆమెకు సమస్య చెప్పగానే 1 గంటలోపు సర్వీస్ మాన్ మీ చిరునామాకు చేరుకుంటాడు, మీ పైపు లీక్ అయితే మీరు కొత్త పైపుకి ఛార్జీ చెల్లించాలి, అని సమాధానం ఇచ్చింది.

   అరగంటలో ఒక అబ్బాయి వచ్చి చెక్ చేసి సిలిండర్ లోపల ఉన్న వాషర్‌ని మార్చి గ్యాస్ ఆన్ చేసాడు,

   గృహిణి ఆ అబ్బాయికి కొంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు, అతను దానిని తీసుకోవడానికి సున్నితంగా తిరస్కరించి కేంద్ర ప్రభు

రాశి ఫలితాలు*27-10-2023

 *27-10-2023*

 *భృగు వాసరః* *శుక్ర వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు  అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

*వృషభం*

కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగమున వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ విషయంలో అవరోధాలు తప్పవు. నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం.

*మిధునం*

నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో  ప్రముఖులతో  చర్చలకు అనుకూలస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

*కర్కాటకం*

గృహమున సంతాన శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగపరంగా ఒత్తిడిని అధిగమించి పనులను పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక అనుకూలత పెరుగుతుంది.

*సింహం*

ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచడం మంచిది. వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి. కొన్ని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఉద్యోగమున స్వల్ప ఇబ్బందు లుంటాయి. 

*కన్య*

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో  ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. 

*తుల*

వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ధన మార్గాలు పెరుగుతాయి . దీర్ఘకాలిక   సమస్యలలో విజయం సాధిస్తారు. ఋణ సమస్యలు  నుండి  ఊరట కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. సంతాన వివాహ విషయాలలో  శుభవార్తలు అందుకుంటారు. 

*వృశ్చికం*

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల  వారికి అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పునరాలోచన చెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులలో సొంత ఆలోచనలు చేయటం మంచిది. క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

*ధనస్సు*

ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. గృహమున శుభాకార్యములు  నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

*మకరం*

వాహన ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు  చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. విలువైన  వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

*కుంభం*

ఇంటాబయట అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సోదరులతో స్థిరాస్తి  వివాదాలలో విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

*మీనం*

చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్న మిత్రులు సహాయ సహకారాలతో  పూర్తిచేస్తారు. భూ  వివాదాలు పరిష్కారంతో ఊరట పొందుతారు. వాహన క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి.

🕉️

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 75*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 75*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


నరేంద్రుడు ఒక రోజు శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్లి. "అందరికీ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతున్నాయి. నాకు మటుకు ఎందుకు ఏదీ లభించడం లేదు? నాకు కూడా ఏదైనా లభించాలి" అన్నాడు. "సరే, నీకు ఏం కావాలి?" అని శ్రీరామకృష్ణులు అడిగారు. అందుకు నరేంద్రుడు, "మూడు నాలుగు రోజులు అవిచ్ఛిన్నంగా సమాధి స్థితిలోనే లీనమై ఉండిపోవాలి.  ఏదో ఆహారం నిమిత్తం అప్పుడప్పుడు మనస్సు క్రిందికి దిగి రావాలి" అన్నాడు. 

 

ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు, "నువ్వొక అవివేకివి. ఇదా ఉన్నత స్థితి? ఇంతకన్నా అత్యున్నత స్థితి ఉంది. 'ఉన్నవన్నీ నువ్వే' అని నువ్వే పాడతావు కదా! ఆ స్థితిని నువ్వు అనుభవించవచ్చు. కాని అంతకు ముందు నీ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసి రా" అన్నారు.


మర్నాడు నరేంద్రుడు ఇంటికి వెళ్లాడు. చదువు, తిండి విషయాలలో ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నందుకు తల్లి అతణ్ణి గట్టిగా మందలించింది. కుటుంబానికి ఏమైనా చేయాలని మళ్లీ చదువు మీదకు దృష్టి సారించాలనుకొన్నాడు. నరేంద్రుడు. కనుక అమ్మమ్మ ఇంటికి వెళ్లి చదువుకోనారంభించాడు. పుస్తకం చేతిలోకి తీసుకోవడమే తరువాయి ఎక్కణ్ణుందో భయోద్వేగం వచ్చి అతణ్ణి ఆవహించింది. తాను ఏదో తప్పు చేస్తున్నట్లుగా అతడికి అనిపించింది. ఏమను కొన్నాడో ఏమో హఠాత్తుగా పుస్తకాలను అట్లే విసిరివేసి పరుగెత్తసాగాడు. 


ఏదో ఒక శక్తి అలా పరుగెత్తించినట్లుగా ఆవేశంలో అతడు పరిగెత్తాడు. పరుగు వేగంలో చెప్పులు, ఇతర వస్తువులు దారిలో చెల్లాచెదరుగా అక్కడక్కడా పడి పోయాయి. దారిలో ఉన్న గడ్డివామును మోదుకోవడంతో ఒళ్లంతా గడ్డిపరకలే! అందుకు తోడు జోరున వాన! పిచ్చిపట్టిన వాడిలా అతడు పరుగెత్తాడు. చివరికి ఆగింది కాశీపూర్ లో. 


నరేంద్రుడు తిన్నగా మేడ మీద ఉన్న శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లాడు. అప్పుడు ఆయన నిద్రపోతున్నారు. భరించరానంత గొంతు నొప్పితో బాధపడుతున్నారు. రాత్రి దాదాపు తొమ్మిది గంటలకు ఆయన నిద్రలేచారు. లేవ గానే నరేంద్రుణ్ణి గురించే మాట్లాడారు: “నరేంద్రుని పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంది. ఒకప్పుడు అతడు సాకార భగవంతుణ్ణి విశ్వసించేవాడు కాడు. ప్రస్తుతం చూడు, భగవదనుభూతి కోసం ఎంత తల్లడిల్లిపోతున్నాడో!".🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 65*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 65*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*రణే జిత్వాదైత్యా నసహృతశిరస్త్రెః కవచిభిః*

   *నివృత్తై శ్చండాఽంశ త్రిపురహరనిర్మాల్యవిముఖైః |*

*విశాఖేంద్రోపేంద్త్రె శ్శశివిదకర్పూరశకలాః*

*విలీయంతే మాత స్తవ వదనతాంబూలకబళాః ||*



అమ్మా 

రణేజిత్వా దైత్యా = యుద్ధములో అసురులను జయించి,


విశాఖేంద్రోపేంద్త్రెః = దేవ  సేనానాయకుడు కుమారస్వామి,ఆయనకు సహకరించిన ఇంద్రుడు, విష్ణువు

(వామనావతారంలో అదితి, కశ్యపులకు పుత్రుడుగా, ఇంద్రునికి సోదరుడిగా జన్మించిన వాడు ఉపేంద్రుడు)

ఆ విజయ వార్త అమ్మవారికి చెప్పటానికి ఉత్సాహంగా వస్తున్నారుట.ఏ విధంగా?


నసహృతశిరస్త్రెః కవచిభిః = ఆమె సర్వసైన్యాధ్యక్షురాలు కనుక ఆమెకు గౌరవ భావంతో వినయంగా శిరస్త్రాణములు, కవచములు తొలగించి వచ్చారుట.


చండాంశ త్రిపురహర నిర్మాల్యవిముఖైః = శివుని నిర్మాల్యము చండీశ్వరునికే చెందుతుంది.

ఈయన ప్రమధగణాల్లో ముఖ్యుడు.

మనము శివ ప్రసాదము తీసుకునే ముందు ఆలయానికి ఆలయానికి ఉత్తర భాగంలో ఉండే చండీశ్వరుని వద్దకు వెళ్ళి ఆయన అనుమతి అడిగి ప్రసాదం స్వీకరించాలిట.అయితే పానవట్టములోని అభిషేక జలము అందరూ తీసుకోవచ్చు.కొన్ని ఆలయాల్లో చండీశ్వర స్థానం ఉండదు.

స్వయంభూ, జ్యోతిర్లింగ క్షేత్రములలోను, బాణ, స్ఫటిక లింగములు కల చోట్ల పరమహంస పరివ్రాజకులు(కంచి, శృంగేరి మహాస్వాముల వంటివారు)లింగ ప్రతిష్ఠాపన చేసిన చోట్ల ఈ చండీశ్వర స్ధానము ఉండదు.


ఇప్పుడు వీరు సాక్షాత్తు జగన్మత వద్దకు వెళుతున్నారు కనుక ప్రసాదము కొరకు శివుని వద్దకు వెళ్ళకుండా అమ్మవారి వద్దకే వచ్చారుట.అమ్మవారు సర్వలోకవశంకరి కాబట్టి ఆమెకు ఈ వార్త ముందే తెలిసి ఆనందముగా తాంబూల సేవనం చేస్తున్నారుట.ఆ తాంబూలము ఎలా ఉంది ?


శశివిశద కర్పూరశకలా విలీయంతే = ఇతర సుగంధ ద్రవ్యములతో పాటు చంద్ర శకలములే పచ్చ కర్పూరముగా కలిగిన తాంబూలము అది. అసలు దశదిశలా వ్యాపించిన ఆ సుగంధ పరిమళముల వల్లనే కుమారస్వామి సేనలు అసురులను జయించాయిట.


మాతః తవ వదన తాంబూల కబళాః = వారు ప్రసాదమును కోరగా అమ్మవారు సేవిస్తున్న ఆ తాంబూల కబళమును ప్రసాదంగా ఇచ్చారుట.

అమ్మవారి నోరు సర్వ శాస్త్ర జ్ఞానమైన వాగ్భవ కూటము. ముందు శ్లోకములో చెప్పుకున్నట్లు తెల్లని సరస్వతీదేవి యెర్రని అమ్మవారి నాలుకపై కూర్చొనగానే ఆమె రూపం కూడా ఎర్రబడిందిట.

మనలోని అసురీ శక్తులను జయించాక అమ్మవారు సర్వ శాస్త్రజ్ఞానమును మనకు ప్రసాదిస్తున్నారని ఈ శ్లోక భావము.

లలితా సహస్రనామాల్లోని *తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా* *కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా* నామాలు ఇక్కడ స్మరణీయాలు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నిత్యశుద్ధుడవై

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


॥శ్లో॥

*ఓం నమ: ప్రణవార్ధాయ*

*శుద్ధజ్ఞానైక మూర్తయే !*

*నిర్మలాయ ప్రశాంతాయ*

*దక్షిణామూర్తయే నమ: !!*


_- *శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - ధ్యాన శ్లోకము* _- 05


॥భా॥

నిత్యశుద్ధుడవై, ప్రశాంతస్వరూపుడై, శుద్ధజ్ఞానమే మూర్తిగా, ప్రణవనాదమైన ఓంకారానికి లక్ష్యార్ధంగా భాసిస్తూ, నిర్మలుడైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కృతులు.

మాలకొండ లో తపస్సాధన..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*మాలకొండ లో తపస్సాధన..*


*(తొమ్మిదవ రోజు)*


"ఏకేన చక్రమపరేణ కరేన శంఖం

అన్యేన సింధు తనయా మవలంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ హస్తముద్రాం

శ్రీ లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం౹౹"


"ఒకచేత సుదర్శన చక్రము, వేరొకచేత పాంచజన్య శంఖము, ఇంకొక చేత లక్ష్మీదేవిని చుట్టి, తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని, తన కుడిచేతితో అశేష భక్తకోటికి అభయం ఇస్తూ దర్శనం ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహా!..నాకు చేయూత నివ్వు!!" 


అని శ్రీ ఆదిశంకరాచార్యులు చేసిన స్తోత్రం లోని శ్లోకాన్ని గుర్తుచేసుకుంటూ..శ్రీ స్వామివారు మాలకొండ కు చేరి, ముందుగా ఆ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో కొంత సేపు గడిపారు..మాలకొండ లో ఉగ్రరూపంతో వుండే ఆ లక్ష్మీ నరసింహుడు..ఈ యువక యోగి పట్ల ప్రసన్నుడై..తన అక్కున చేర్చుకున్నాడు..


శ్రీ స్వామివారు మాలకొండలోనే ఉత్తరంగా కొద్దిగా దిగువున, రెండు పెద్ద బండరాళ్లు చీలి ఏర్పడిన దారితో, ఒకే పెద్ద గొడుగు లాటి రాతి కింద వున్న శివాలయం వద్దకు వచ్చారు..ఆ శివాలయానికి మరికొద్ది దిగువున ఉన్న పార్వతీదేవి మఠం చూసారు..తన ఆవాసానికి ఆ అమ్మవారు కొలువైయున్న మఠం సరైనదని నిర్ణయానికి వచ్చారు..శివాలయం..దానిపైన వున్న రాతి గుహలు తన తపస్సుకు అనువైన ప్రాంతాలని నిర్ధారించుకున్నారు..


ఒకవైపు సాక్షాత్తూ వైష్ణవావతారం నృసింహుడు..మరో ప్రక్క  ఆది దంపతులైన శివ పార్వతులు..తనకు ఇంతకంటే రక్షణ ఇచ్చే ప్రదేశం మరోటి ఎక్కడుంది?..ఇది తన మోక్షమార్గాన్వేషణలో మరో మజిలీ..ఇప్పటిదాకా తాను చేసిన సాధన ఒక ఎత్తు..ఇక చేయబోయేది మరో ఎత్తు!..గురువు బాలబ్రహ్మం చెప్పినట్లు, ప్రకృతి అనుక్షణం మాయను ప్రదర్శిస్తుంది..అందులో చిక్కకుండా ఏకాగ్రచిత్తంతో సాధన చేయాలి..ఎల్లవేళలా జాగురూకత తో ఉండాలి..దేహాభిమానాన్ని త్యజించాలి..మమకారాన్ని మనసులోంచి తుడిచివేయాలి..తానింతకాలం ఏ మోక్షం కోసం తపించి సాధన చేస్తున్నాడో అందుకు అనువైన ప్రదేశం కూడా లభించిందని సంతోషపడ్డారు..


పార్వతీదేవి మఠం లో నివాసం ఏర్పరుచుకున్నారు..మితాహారం భుజించడం..సాధన చేసుకోవడం..ఇవి రెండే కార్యక్రమాలు..మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల కొరకు తెరచి ఉంటుంది..ఆ ఒక్కరోజు శ్రీ స్వామివారు శివాలయం పైనున్న గుహలలోకి వెళ్లిపోయేవారు..అక్కడ ఏకాంతంలో తపోసాధన చేసుకునేవారు..మిగిలిన ఆరు రోజులూ నరసంచారం వుండదు కాబట్టి, ఎక్కువభాగం శివాలయం లోనే తన తపస్సు కొనసాగించేవారు..


కానీ..కుతూహలం తో కూడిన మానవులున్న లోకం ఇది..ఎవరో యువక యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని..మాలకొండ క్రింద ఉన్న గ్రామస్థులు పసిగట్టేశారు..వాళ్ళు కొండపైనున్న అడవి కర్రలు ఏరుకొచ్చి అమ్ముకునే వాళ్ళు..శ్రీ స్వామివారు శివాలయానికి వెళ్ళేటప్పుడు..తిరిగి పార్వతీదేవి మఠానికి వచ్చేటప్పుడు గమనించడం మొదలెట్టారు..వాళ్లలో వాళ్ళు శ్రీ స్వామివారి గురించి చర్చించుకోవడం కూడా జరుగుతోంది..శ్రీ స్వామివారిని చూసినప్పుడు పలకరించడం చేయసాగారు..తాను మౌనం లో వున్నప్పుడు చిరునవ్వే వారికి సమాధానం!..మౌనం వీడినప్పుడు..ముక్తసరిగా సమాధానం చెప్పి, వారిని పంపించివేసేవారు..ఇలా కాలం గడచిపోతోంది..


మాలకొండకు పశ్చిమంగా కొంత దూరం లో కంబాలదిన్నె అనే గ్రామం ఉంది..ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ చెక్కా కేశవులు గారు వైశ్య కులస్థుడు.. ఆయన మాలకొండ లక్ష్మీనృసింహ స్వామి వారి భక్తుడు..విజయవాడ లో వ్యాపారం చేస్తున్నారు..తన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకు వచ్చి, శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం చేసుకొని వెళుతూవుండేవారు..అదొక నియమం తో కూడిన ప్రక్రియ వారికి..అలా వస్తూ పోతున్న సమయం లో ఒకసారి శ్రీ స్వామివారిని చూడటం తటస్థించింది..శ్రీ స్వామివారిలో ఉన్న తేజస్సు, చెక్కా కేశవులు గారిని కట్టిపడేసింది..క్రమంగా శ్రీ స్వామివారిని తరచూ చూడటం..మెల్లిగా పలకరించడమూ చేశారు..శ్రీ స్వామివారు సైతం చెక్కా కేశవులు గారితో మాట్లాడారు..కేశవులు గారికి నమ్మకం కలిగింది..శ్రీ స్వామివారు, ఇలా ఎటువంటి సరంజామా లేకుండా..భూశయనం చేయడం..కేశవులు గారికి నచ్చలేదు..శ్రీ స్వామివారు నెత్తి నోరు కొట్టుకొని వారిస్తున్నా వినకుండా..ఒక ఇనుప మంచాన్ని, దోమతెరను..కప్పుకోవడానికి దుప్పట్లు వగైరా అంతా పార్వతీదేవి మఠం కు చేర్చారు..


"నాయనా!..ఇవన్నీ నాకు వద్దు..నేను సర్వసంగపరిత్యాగిని..అన్నీ వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను..నన్ను మళ్లీ సంసారబంధం లోకి లాగకు..నీ కోరిక ఏమిటి?.." అని లాలనగా అడిగారు..


చెక్కా కేశవులు గారు చాలాసేపు తటపటాయించి..ఎట్టకేలకు తన మనసులోని కోరికను బయటపెట్టారు..విన్న స్వామివారు ఫక్కున నవ్వారు..


చెక్కా కేశవులు గారి అనుభవం..రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా.. పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - త్రయోదశి ఉపరి చతుర్ధశి -  ఉత్తరాభాద్ర - భృగు వాసరే* (27.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/G3xgRQQhBas?si=cj7L_tLpyRlI8Jot



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వేదాంతం శాస్త్రాలలో

 *సుభాషితం*

---------------

🌺 *నిష్ణాతోsపి చ వేదాంతే* 

*సాధుత్వం                          నైతి దుర్జనః ౹*

     *చిరం జలనిధౌ మగ్నః:*

*మైనాక ఇవ మార్దవమ్ ౹౹*.  🌺

        

*భా. వేదాంతం శాస్త్రాలలో ఎంత నిపుణులైనా చెడ్డ స్వభావున్నవాడు మంచివాడుకాలేడు.చాలా కాలం నుంచి సముద్రంలో మునిగినా మైనాక పర్వతం మృదువుగా అవ్వదు.*

🌺✍🏽

నవగ్రహా పురాణం🪐* . *65వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *65వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*చంద్రగ్రహ చరిత్ర - 3*


చంద్రుడు , రోహిణీ భోజనం చేసి రాత్రి వాహ్యాళికి వెళ్ళిపోయాక - అశ్వినీ , ఆమె ఇరవై అయిదుగురు చెల్లెళ్ళూ మౌనంగా , స్వల్పంగా ఆరగించారు.


అందరూ గుంపుగా తోటలోకి వెళ్ళారు. తోటంతా కలియదిరిగారు. కానీ రోహిణీ చంద్రులు లేరు !


*"మనం భోజనాలలో ఉన్నప్పుడే ఉద్యానవనంలోంచి మందిరంలోకి వచ్చేశారేమో ! అంది అశ్విని.


*"అంతే జరిగి ఉంటుందే ! పదండి... పతి దేవులు ఆగ్రహిస్తారు !”* భరణి ఆదుర్దాగా అంది.


అందరూ మందిరం వైపు వేగంగా నడిచారు.


భర్త ఏకాంత శయనాగారం వైపు వెళ్తున్న అశ్వినీ , ఆమె చెల్లెళ్ళూ తటాలున ఆగారు. శయనాగారం లోంచి రోహిణీ చంద్రుల స్వరాలు వినిపిస్తున్నాయి.


*"అక్కయ్యలు ఏమైనా అనుకుంటే ?”* రోహిణి నవ్వుతూ అడుగుతోంది. *"అనుకోవడానికి ఏముంది ? ఒక విషయం చెప్పు ! ఇవాళ విస్తరిలో వడ్డించిన పదార్థాలన్నీ తిన్నావా ? ఇష్టమైనవే తిన్నావా ?"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు.


*"ఇష్టమైనవే”* రోహిణి నవ్వింది.


*"విస్తరిలో ఉన్నాయని అన్నీ ఆరగించలేం. మందిరంలో ఉన్నారని అందరితోనూ విహరించలేం. ఇష్టమైనదాన్ని ఆరగిస్తాం ; ఇష్టమైన వాళ్ళతో విహరిస్తాం !"* చంద్రుడు నవ్వుతూ అంటున్నాడు.


రోహిణీ , చంద్రుడూ - ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. కాదు - నవ్వుకుంటున్నారు.


అశ్విని బలహీనంగా వెనక్కి తిరిగింది. దూరంగా ఉన్న కక్ష్య వైపు అడుగులు వేసింది. ఆమె సోదరీమణులు మౌనంగా ఆమెనే అనుసరిస్తున్నారు.


అశ్విని నుండి రేవతి దాకా - రోహిణిని తప్పించి - ఇరవై ఆరుగురు దక్షపుత్రికలు , నవ వధువులు భర్త మందిరానికి వచ్చి చేరిన మొదటి రోజు ... మొదటి రాత్రి... నేల మీద ఒకరి పక్కన ఒకరు అలా పడి ఉన్నారు.


*"అశ్వినీ ! అల్లుడికి నువ్వు జ్యేష్ఠ పత్నివి ! పట్టమహిషివి ! మొదట చంద్రుడు నిన్నే చేరదీస్తాడు. ఆయనకు అనుకూలంగా ప్రవర్తించి , అలరించు. అలాగే నీ చెల్లెళ్ళు కూడా భర్తను అలరించేలా చూడు !"* తల్లి ప్రసూతీదేవి మాటలు అశ్విని చెవుల్లో గింగురుమంటూ , తమ సమీపంలోనే ఉన్న ఆమె కళ్ళలోంచి అశ్రువులు కారేలా చేశాయి.


*"అక్కా...ఏమిటిలా జరిగింది ?"* కృత్తిక దీనంగా ప్రశ్నించింది అశ్వినిని. *"మన పతిదేవుడు మొదట నిన్ను ఆదరించి , చేరదీస్తారని అమ్మ చెప్పిందే!!* 


*"బహుశా , ఆయన ... రోహిణి మనందరికన్నా పెద్ద వధువుగా అనుకున్నారేమో ! బాధపడకండి ! అన్నీ సర్దుకుంటాయి !"* చెల్లెళ్ళను ఓదార్చే తన మాటలతో తనకు కూడా ఓదార్పును వెదుక్కుంది అశ్విని..


ఆ నవ వధువుల నిట్టూర్పులతో ఆ కక్ష్యలో గాలి వేడెక్కుతోంది.


అశ్విని ఆశ నిరాశగా , రోజులు గడిచే కొద్దీ పేరాశగా మారిపోయింది.


రోహిణి తప్పించి మిగిలిన దక్షపుత్రికలను చంద్రుడు కన్నెత్తి చూడడం లేదు. పన్నెత్తి పలకరించడం లేదు. భర్త దృష్టిని ఆకర్షించాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


అంటిపెట్టుకుని ఉన్న మిగతా చెల్లెళ్ళనూ పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టి వేశాయి.


వాళ్ళెవరికీ ఇప్పుడు భర్తకు ఆహారం అందించే అవకాశం కూడా లేదు. ఆయనకు రోహిణి మాత్రమే వడ్డించాలి. ఆయనతో బాటు , ఆయన పళ్ళెంలోనే ఆరగించాలి ! చంద్రుడి ప్రవర్తన కన్నా , రోహిణి ప్రవర్తన దక్షపుత్రికలను నిర్ఘాంతపోయేలా చేస్తోంది.


పుట్టినప్పట్నుంచీ కలిసి మెలిసి ఆడి , పాడి వాళ్ళలో ఒక్కతెగా పెరిగిన రోహిణి , ఇప్పుడు వాళ్ళెవరో తనకి తెలియనట్టు ప్రవర్తిస్తోంది. ముగ్గురు అక్కలనూ , ఇరవై ముగ్గురు చెల్లెళ్ళనూ రోహిణి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. వాళ్ళందరూ ఇప్పుడామెకు అపరిచిత యువతులు !


చంద్రుడి దృష్టిలో లాగే , ఆమె దృష్టిలో కూడా వాళ్లు మందిరంలో పరిచారికలు ! 


రోజులు వారాలుగా , వారాలు నెలలుగా ఎదుగుతున్నాయి. రోహిణి సోదరీ మణులకూ , 'ఆమె' భర్తకు మధ్య దూరం కూడా ఎదుగుతూనే ఉంది...


*“ఈ రోజు ఏమైనా సరే ఆయనా రోహిణి జలక్రీడకూ , ఉద్యానవన విహారానికి వెళ్ళేటప్పుడు మనందరమూ వెళ్ళాలి ! వాళ్ళతో బాటు జలక్రీడలో పాల్గొనాలి"* మృగశిర ఉద్రేకంగా అంది.


*"ఆయన వద్దన్నా వినకుండా సరస్సులో దూకాలి"* ఆర్ధ్ర ఆవేశంగా అంది. అందరూ మౌనంతో తమ అంగీకారం తెలిపారు.


చంద్రుడూ , రోహిణి చేతులు కలుపుకుని ఉల్లాసంగా మందిరంలోంచి ఉద్యానవన ద్వారం దాటి వచ్చారు. అక్కడే నిరీక్షిస్తున్న ఇతర చంద్ర పత్నులు వెంట అడుగులు వేశారు.


ద్వారం దాటి సోపానాలు దిగుతున్న చంద్రుడు ఆగి విసుగ్గా చూశాడు.


*"ఆగండి ! మీరెక్కడికి ? వెళ్ళి మందిరంలో పనులు చూసుకోండి",* చంద్రుడు ఆజ్ఞాపించాడు.


మృగశిరా , ఆర్ధ్ర వినిపించుకోనట్టు మరొక మెట్టు దిగారు. 


*"ఆగు"* చంద్రుడు అరిచాడు.


*"నీ పేరేమిటి”*


*"మృగశిర..."*


*"మృగ... శిర... - అందుకే మృగంలాగా ప్రవర్తిస్తున్నావు. వెళ్ళండి మందిరంలోకి"* 


మృగశిర ముఖం చిన్నబుచ్చుకుని , వెనుదిరిగింది. ఆర్ద్ర ఆమెను అనుసరించింది. అందరూ తలలు వాల్చుకుని మందిరంలోకి నడుస్తున్నారు.


వెనక నుండి రోహిణీ చంద్రుల నవ్వులు వాళ్ళను వెంటాడి తరుముతున్నాయి..


అశ్విని ఆమె చెల్లెళ్ళు ఇరవై ఐదుగురూ ఒకే రకమైన మానసిక స్థితిలో ఉన్నారు...

పుట్టినింటికి దూరమయ్యారు. తల్లిదండ్రుల అనురాగానికి దూరమయ్యారు. తమ సర్వస్వంగా రూపొందుతాడనుకున్న భర్తకు దగ్గర కాలేక పోయారు. చేరువలో దూరాన్ని అనుభవిస్తున్నారు. భర్తను కొంగున ముడివేసుకున్న సోదరి మూలంగా నిరంతరావమానాన్ని చవిచూస్తున్నారు.


భర్త నిరాదరణా , రోహిణి నిర్లక్ష్య ప్రవర్తనా వాళ్ళందరినీ ఒక్కటిగా దగ్గర చేశాయి. వాళ్ళ విచారం సామూహిక విచారంగా మారింది. నిస్సహాయత సామూహిక నిస్సహాయతగా మారింది. అందరిలోనూ ఒకే విధమైన నిర్లిప్తత. ఒకే విధమైన నిరాసక్తత. ఒకే విధమైన నిస్సహాయత.


మౌనంగా గుంపుగా కూర్చున్న ఇరవై ఆరుగురు దక్షపుత్రికల ఆలోచనా ప్రవాహాలకు నారదుడి రాకా , ఆయన చేసే నారాయణ నామస్మరణ ఆనకట్ట వేశాయి.


దక్షపుత్రికలు లేచి , మౌనంగా ఆయనకు చేతులు జోడించారు. నారదుడు వాళ్ళను ఎగాదిగా చూశాడు. ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం ప్రతిఫలిస్తోంది. *"అశ్వినీ ! ఏమిటిలా విచారంగా ఉన్నారు ? మీ పతిదేవుడు చంద్రుడు లేడా ?"*


*"ఉన్నారు... ఎక్కడున్నారో తెలీదు స్వామీ"* అశ్విని మెల్లగా అంది. 


*"అంటే...?"*


*"మా సోదరి రోహిణీ , ఆయనా ఎప్పుడు ఎక్కడ ఉంటారో మాకు తెలీదు..."* భరణి సన్నని కంఠంతో దీనంగా అంది. 


నారదుడు విచారంతో నిండిన వాళ్ళందరి ముఖాలనూ కలయజూశాడు. అలంకరణ లేని శరీరాలు... అలంకరణ లేని శిరోజాలు... చెంపల మీద కరిగిన కాటుక చారికలు... కళ్ళల్లో దైన్యం... అందరి ముఖాల మీదా ఒకే రకమైన విచార ముద్ర.


*"అశ్వినీ... మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభను మీ ముఖదర్పణాలు చూపిస్తున్నాయి. మీరందరూ చంద్రపత్నులై ఈ మందిరంలో ప్రవేశించిన శుభకార్యానికి సూత్రధారి నేనే ! మీ విచారానికి కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ,”* నారదుడు చెప్పి ఆగాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

important message

 🙏Very important message - pl read carefully, forward & follow this ....  🙏HIGH ALERT - 

All Brothers & Sisters,


Please ```Pass to all your contacts.


Dr. Anjali Mathur, 

Chairman & CMO, 

Indo American Hospital (IAH),

South Dakota (United States)... 


This message is from a group of doctors in India (forwarded in public interest).


1) Do not drink APPY FIZZ. It contains Cancer causing agent..


2) Don't eat Mentos before or after drinking Coke or Pepsi because the Person will die immediately as the mixture becomes CYANIDE..


3) Don't eat Kurkure because it contains high amount of Plastic.

If you don't believe burn Kurkure and you can see Plastic melting.!


4) Avoid these Tablets, they are very dangerous:

* D-cold

* Vicks Action-500

* Actifed

* Coldarin

* Cosome

* Nice

* Nimulid

* Cetrizet-D

They contain Phenyl Propanol-Amide PPA. Which causes Strokes & are banned in USA! 


Please, before deleting, HELP your friends by passing it..!


Let it reach to every one


It might help some one.  Forward to as many as you can. 


Please read and forward:


Doctor of the INDO AMERICAN HOSPITAL has found a new cancer in human beings, caused by Silver Nitro Oxide. Whenever you buy recharge cards, don’t scratch with your nails, as it contains Silver Nitro Oxide coating and can cause skin cancer. Share this message with your loved ones. 


Important Health Tips:


○Answer phone calls with the left ear.


○Don't take your medicine with cold water.... 


○Don't eat heavy meals after 5pm.


○Drink more water in the morning, less at night.


○Best sleeping time is from 10:00pm to 4:00am.


○Don’t lie down immediately after taking medicine or after meals.


○When phone's battery is low to last bar, don't answer the phone, because the radiation is 1000 times stronger. 


○Can you forward this to people you care about? 


I just did!

Kindness costs nothing 

But 

Knowledge is power...


 IMPORTANT


U.S.A. CHEMICAL Research Center Gives New Result: 


Don't Drink Tea in Plastic Cups and Dont Eat Any Food on Polythene Paper. The plastic reacts to heat and It Will Cause 52 Types of Cancers. So, This Good sms is Equal to 100 Waste sms. Pls Forward to All   U care.


Plz frwrd....



🙏Frwrds take a second........!```

కన్నులకాటుక

 కన్నులకాటుక చమత్కారం!


 శ్రీ బులుసు వేమకటేశ్వర్లు గారి "నీలమోహనం"యెడనెడ చమత్కార భాసురం!ఆచమత్కారం స్వభావసుందరం! అదిగోఆపద్యాన్ని రసజ్ఞులు

చిత్తగింతురుగాక!


"స్వామీ!కజ్జలరేఖలా కనుల? వహ్వా!! ప్రేయసుల్ గోపికా

భామల్,ముచ్చట లిట్లు దీర్చికొనిరే! వాదేలనీతోడ? మీ

ప్రేమల్ లోకమెఱుంగ ఱేపకడ గోపీ గండభాగమ్ములన్

గోమై కాటుక చుక్కలై మెఱసి నీకున్ కీర్తులందెచ్చులే!          14:ప.

    ఓస్వామీ!నీవిశాలనేత్రాలకు అందంగా అలంకరించిన యీకాటుకరేఖలు యెంతసొగసుగా ఉన్నాయో?ఈవిధంగా నీప్రియతమగోపికామణులు తమముచ్చటను దీర్చికొన్నారాయేమి,?వహ్వా!!బాగుబాగు!!

        ఎందుకయ్యా!అలాకోపంగా నావైపుచూస్తావు.?ఓహో?నీప్రేయసీమణుల నెకసెక్కమాడితిననియా?

          నీతో నాకు వాదములేల!మీ మీప్రేమలను ప్రపంచమెరుగదా?అందరకూ విదితమే?

ఎట్లందువా?

         రేయి రాసక్రీడలలో నీకన్నులకాటుక వారి గండభాగములకలంకృతమయి తెల్లవారుసరకి అందరకూ తేటతెల్లము జేయునుగదా!

    అవినీకీర్తిపతాకములై భాసించునులెమ్ము.

        ఇదీ దీని భావము.

నీవుగోపికాలోలుడవని కంఠోక్తిగా కవిచెప్పడు.వారికంఠభాగములందలముకొన్న కాటుక రేఖలే ,మీలౌల్యమునకు నిదర్శనమలంటాడు.

 ఎంతచమత్కారం!

నేనన్నాననికోపపడకయ్యో!నీచేతలే నిన్నుబయటపెడతాయిలే!యంటాడు.

       పైగా ఆకాటుక మరకలు (తెల్లనివికాదు-నల్లనివి) ఆయనకీర్తికిగుర్తులట!

జరిగినది జారత్వము.అందువలన వచ్చుకీర్తి యపనిందయే అందువలలననే ఆకీర్తికి నలుపురంగునాపాదించినాడుకవి!

   ఆహా!ఏమిభావుకత!!

కీలెరిగి వాతబెట్టుటయా?

పొగడుటయా?

నిందాస్తుతియే!!!


ఈతీరుగా ననిదంపూర్వకములైన చమత్కారములు పద్యాలలో కోకొల్లలు.ప్రతీపద్యంలోనూ ఏమున్నాదా ?యనురిరంసతో పద్యాలు చదువుకోవాలి.పుటలుత్రిప్పితే ప్రయోజనంలేదు.భావుకులైన రసజ్ఙభారతి పండితులారా!మంచికావ్యాలను చదవండి!

చదివించండి!కవినిప్రోత్సహించండి! కవికోరేదదే!

"ఆపరితోషాద్విదుషాం నసాధుమన్యే ప్రయోగవిజ్ఙానం"-

అన్నాడు కాళిదాసు.ఆమాట త్రైకాలిక సత్యం!!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Brahmmam


 

⚜ శ్రీ దత్తాత్రేయ ఆలయం

 🕉 మన గుడి : నెం 220





⚜ గోవా  : సాంకొలిమ్ 


⚜ శ్రీ దత్తాత్రేయ ఆలయం



💠 శ్రీ దత్తాత్రేయ దేవాలయం ఉత్తర గోవాలో ఉంది. 

 శ్రీ దత్తా మందిర్ అని కూడా పిలువబడే శ్రీ దత్తాత్రేయ ఆలయం దత్తవాడి, సాంక్వెలిమ్ వద్ద ఉంది.  

శ్రీ దత్త మందిరం విదేశీ పాలకుల నాశనం నుండి చెక్కుచెదరకుండా ఉండిపోయిన ఆలయాలలో ఒకటి మరియు ఇప్పుడు గోవాలోని పురాతన దేవాలయాలలో ఒకటి.  

ఇది చాలా ప్రసిద్ధి చెందిన శ్రీ దత్తాత్రేయ దేవాలయం.



💠 ఈ దేవాలయం దత్తాత్రేయ భగవానుడికి అంకితం చేయబడింది - ఇది బ్రహ్మ, విష్ణు మరియు మహేషుల మిశ్రమ రూపమైన త్రిమూర్తి స్వరూపం.  

ఈ ముగ్గురు దేవుళ్లను పవిత్ర మూర్తులుగా భావిస్తారు.  

ఈ ముగ్గురు దేవుళ్ళు సంరక్షణ, సృష్టి మరియు విధ్వంసానికి ప్రతీక. 


💠  ఈ ఆలయ నిర్మాణం సాంప్రదాయ స్థానిక భవనం మరియు దృఢమైన నిర్మాణ శైలి కలయికతో ఉంటుంది.  

ఈ ప్రత్యేకమైన కలయిక ఆలయానికి ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చింది.  

ఆలయం లోపలి భాగం తెల్లని పాలరాయితో నిర్మితమైంది.  

ఈ ఆలయం క్లిష్టమైన శిల్పాలు మరియు విస్తృతమైన చెక్క  పని కలిగి ఉంది.  

దత్తరేయ భగవానుని విగ్రహాన్ని సురక్షితమైన ఆవరణలో ఉంచడానికి ఆలయం రూపంలో నిర్మించబడింది.  


💠 దేవతా విగ్రహం చాలా బాగుంది మరియు ప్రవేశద్వారం వద్ద ఆవు (భూమిని వర్ణిస్తుంది), 

4 కుక్కలు (4 వేదాలను వర్ణిస్తాయి) విగ్రహాలు ఉన్నాయి.  

ఆలయ స్థానం చాలా సుందరమైనది.


💠 ఇక్కడి దైవం  చాలా శక్తివంతమైనదని నమ్ముతారు.  

ఆలయానికి అద్వితీయమైన వైద్యం చేసే శక్తి ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.  బలహీనమైన మెదడు లేదా మానసిక ఇబ్బందులు ఉన్న వ్యక్తులు దేవతకు చేసే ప్రార్థనల ద్వారా స్వస్థత పొందుతారని చెబుతారు.  


💠 ఆలయ ప్రధాన ఆకర్షణ దేవతలే కాదు, అందమైన సహజ పరిసరాలు, తాటి తోటల పచ్చదనం, కొండ యొక్క అందమైన దృశ్యం మరియు చుట్టూ ఉన్న తాజాదనం ఆలయ పర్యటకులకి  కొన్ని మనోహర  దృశ్యాలను అందిస్తుంది.


 💠.ఇక్కడ జరుపుకునే ముఖ్యమైన పండుగ డిసెంబర్ నెలలో వచ్చే దత్త జయంతి. 


💠 పంజిం కదంబ బస్ స్టాండ్ నుండి 29 కి.మీ దూరంలో, వాస్కోడగామా రైల్వే స్టేషన్ నుండి 46 కి.మీ మరియు మపుసా నుండి 25.6 కి.మీ దూరం