27, అక్టోబర్ 2023, శుక్రవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 65*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 65*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*రణే జిత్వాదైత్యా నసహృతశిరస్త్రెః కవచిభిః*

   *నివృత్తై శ్చండాఽంశ త్రిపురహరనిర్మాల్యవిముఖైః |*

*విశాఖేంద్రోపేంద్త్రె శ్శశివిదకర్పూరశకలాః*

*విలీయంతే మాత స్తవ వదనతాంబూలకబళాః ||*



అమ్మా 

రణేజిత్వా దైత్యా = యుద్ధములో అసురులను జయించి,


విశాఖేంద్రోపేంద్త్రెః = దేవ  సేనానాయకుడు కుమారస్వామి,ఆయనకు సహకరించిన ఇంద్రుడు, విష్ణువు

(వామనావతారంలో అదితి, కశ్యపులకు పుత్రుడుగా, ఇంద్రునికి సోదరుడిగా జన్మించిన వాడు ఉపేంద్రుడు)

ఆ విజయ వార్త అమ్మవారికి చెప్పటానికి ఉత్సాహంగా వస్తున్నారుట.ఏ విధంగా?


నసహృతశిరస్త్రెః కవచిభిః = ఆమె సర్వసైన్యాధ్యక్షురాలు కనుక ఆమెకు గౌరవ భావంతో వినయంగా శిరస్త్రాణములు, కవచములు తొలగించి వచ్చారుట.


చండాంశ త్రిపురహర నిర్మాల్యవిముఖైః = శివుని నిర్మాల్యము చండీశ్వరునికే చెందుతుంది.

ఈయన ప్రమధగణాల్లో ముఖ్యుడు.

మనము శివ ప్రసాదము తీసుకునే ముందు ఆలయానికి ఆలయానికి ఉత్తర భాగంలో ఉండే చండీశ్వరుని వద్దకు వెళ్ళి ఆయన అనుమతి అడిగి ప్రసాదం స్వీకరించాలిట.అయితే పానవట్టములోని అభిషేక జలము అందరూ తీసుకోవచ్చు.కొన్ని ఆలయాల్లో చండీశ్వర స్థానం ఉండదు.

స్వయంభూ, జ్యోతిర్లింగ క్షేత్రములలోను, బాణ, స్ఫటిక లింగములు కల చోట్ల పరమహంస పరివ్రాజకులు(కంచి, శృంగేరి మహాస్వాముల వంటివారు)లింగ ప్రతిష్ఠాపన చేసిన చోట్ల ఈ చండీశ్వర స్ధానము ఉండదు.


ఇప్పుడు వీరు సాక్షాత్తు జగన్మత వద్దకు వెళుతున్నారు కనుక ప్రసాదము కొరకు శివుని వద్దకు వెళ్ళకుండా అమ్మవారి వద్దకే వచ్చారుట.అమ్మవారు సర్వలోకవశంకరి కాబట్టి ఆమెకు ఈ వార్త ముందే తెలిసి ఆనందముగా తాంబూల సేవనం చేస్తున్నారుట.ఆ తాంబూలము ఎలా ఉంది ?


శశివిశద కర్పూరశకలా విలీయంతే = ఇతర సుగంధ ద్రవ్యములతో పాటు చంద్ర శకలములే పచ్చ కర్పూరముగా కలిగిన తాంబూలము అది. అసలు దశదిశలా వ్యాపించిన ఆ సుగంధ పరిమళముల వల్లనే కుమారస్వామి సేనలు అసురులను జయించాయిట.


మాతః తవ వదన తాంబూల కబళాః = వారు ప్రసాదమును కోరగా అమ్మవారు సేవిస్తున్న ఆ తాంబూల కబళమును ప్రసాదంగా ఇచ్చారుట.

అమ్మవారి నోరు సర్వ శాస్త్ర జ్ఞానమైన వాగ్భవ కూటము. ముందు శ్లోకములో చెప్పుకున్నట్లు తెల్లని సరస్వతీదేవి యెర్రని అమ్మవారి నాలుకపై కూర్చొనగానే ఆమె రూపం కూడా ఎర్రబడిందిట.

మనలోని అసురీ శక్తులను జయించాక అమ్మవారు సర్వ శాస్త్రజ్ఞానమును మనకు ప్రసాదిస్తున్నారని ఈ శ్లోక భావము.

లలితా సహస్రనామాల్లోని *తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా* *కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా* నామాలు ఇక్కడ స్మరణీయాలు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: