29, ఆగస్టు 2023, మంగళవారం

Panchaag


 

⚜ శ్రీ బంబ్లేశ్వరి ఆలయం

 🕉 మన గుడి : 






⚜ ఛత్తీస్‌గఢ్ : డోంగర్‌ఘర్


⚜ శ్రీ బంబ్లేశ్వరి ఆలయం


💠 బమలేశ్వరి మాత ఆలయం లేదా బంబ్లేశ్వరి మాత హిందూ తాత్విక విశ్వాసాలను కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం.

ఇది పూర్వపు మధ్యప్రదేశ్ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని డోంగర్‌ఘర్‌లో ఉంది, ఇది ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుండి అలాగే రాష్ట్రంలోని భిల్లై, దుర్గ్ వంటి ఇతర ప్రముఖ ప్రదేశాల నుండి ప్రజా రవాణాకు బాగా అనుసంధానించబడి ఉంది. 


💠 అయితే, బమలేశ్వరి ఆలయంలో  దేవతకు రెండు ఆలయాలు ఉన్నాయి.

ప్రధాన మందిరం లేదా బడి బమలేశ్వరి ఆలయం, అక్షరాలా పెద్ద బమలేశ్వరి దేవాలయం అని 1600 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై నిర్మించబడింది.

దాని పాదాల కింద దాదాపు 12 కిమీ దూరంలో అదే దేవతకు అంకితం చేయబడిన మరొక మందిరం ఉంది. 

అదే చోటి బమలేశ్వరి ఆలయం లేదా చిన్న బమలేశ్వరి ఆలయం.


💠 ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ఈ మందిరంతో అనేక ఇతిహాసాలు కూడా ఉన్నాయి. 

నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయాలకు భక్తులు పోటెటుత్తారు. ఇక్కడ శివాలయం మరియు హనుమంతుని దేవాలయాలు కూడా ఉన్నాయి. 

రోప్‌వే అదనపు ఆకర్షణ మరియు ఛత్తీస్‌గఢ్‌లోని ఏకైక ప్రయాణీకుల రోప్‌వే. 2016లో రోప్‌వే తెగి కిందపడిపోవడంతో ఘోర ప్రమాదం సంభవించి పలువురు మృతి చెందారు. 


💠 ఈ ఆలయాలను ఛత్తీస్‌గఢ్‌లోని లక్షలాది మంది ప్రజలు పూజిస్తారు, వారు నవరాత్రులలో (దసరా సమయంలో) మరియు చైత్ర (రామ నవమి సమయంలో) ఈ పుణ్యక్షేత్రం  చేరుకుంటారు.  

ఇక్కడ నవరాత్రులలో జ్యోతి కలశాన్ని వెలిగించే సంప్రదాయం ఉంది.


💠 డోంగర్ అంటే మరాఠీ భాషలో పర్వతాలు, గర్ అంటే. కోట. 

పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని కమావతి నగర్ అని పిలిచేవారు.  

సుమారు రెండున్నర వేల సంవత్సరాల క్రితం దీనిని కామాఖ్య నగరంగా కూడా

 పిలిచేవారు. 

 

💠 పురాణాల ప్రకారం, సుమారు 2200 సంవత్సరాల క్రితం, రాజా వీర్సేన్ అనే స్థానిక రాజు సంతానం లేనివాడు మరియు అతని రాజ పూజారుల సూచనల మేరకు దేవతలకు పూజలు చేసాడు. 

 ఒక సంవత్సరంలో, రాణి ఒక కొడుకుకు జన్మనిచ్చింది, అతనికి వారు మదన్‌సేన్ అని పేరు పెట్టారు.  

రాజా వీర్సేన్ దీనిని శివుడు మరియు పార్వతి యొక్క ఆశీర్వాదంగా భావించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు.


💠 కాలక్రమేణా, ఛత్తీస్‌గఢ్‌లోని బామలేశ్వరి దేవాలయం డోంగర్‌ఘర్ దేవతగా రూపాంతరం చెందింది.  

మొదట్లో మా బగులాముఖి అని గుర్తించబడింది, ఇది మా బామ్లై అని పిలువబడింది.  

చివరగా, ప్రస్తుతం ఈ ఆలయం బమలేశ్వరి మందిరంగా ప్రసిద్ధి చెందింది.  


💠 ఆలయానికి సంబంధించిన ప్రధాన ఆసక్తికరమైన అంశాలలో ఒకటి దాని హారతులు మరియు హోమాలు.

పూజారులు పూజలు చేస్తున్నప్పుడు ఆలయం ప్రార్థనలు మరియు మంత్రాల , శ్లోకాలతో ప్రతిధ్వనిస్తుంది.  

అంతేకాకుండా, హోమాలు అత్యంత అంకితభావంతో నిర్వహించడం వలన అన్ని దుష్ట శక్తులను నిర్మూలిస్తుంది మరియు భక్తుల శ్రేయస్సును కలిగిస్తుంది.  


💠 ఆదివారం నాడు ఇక్కడి బమలేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శిస్తే, ప్రత్యేక హోమానికి హాజరయ్యే అవకాశం మీకు లభిస్తుంది.  

బడీ బమలేశ్వరి ఆలయంలో ఈ ప్రత్యేక హోమం ద్వారా అగ్ని దేవుడికి  నైవేద్యాలు సమర్పించబడతాయి.  

నవరాత్రి ఉత్సవాల సమయంలో ప్రత్యేక ఉత్సవాలు, హోమాలు విశేషంగా జరుగుతాయి.


💠 మా బమలేశ్వరి దేవతను దర్శించేటప్పుడు చోటి బమలేశ్వరి ఆలయానికి సమీపంలో ఉన్న హనుమంజీ ఆలయాన్ని కూడా సంక్షిప్తంగా సందర్శించవచ్చు.  


💠 ఈ ప్రదేశంలోని పర్యాటక ప్రదేశాలే కాకుండా, చంద్రగిరి కొండ ప్రాంతంలో జైనులకు ఆలయం ఉంది.  

అంతేకాకుండా, తీర్థంకర దేవత అయిన చంద్రప్రభూజీ యొక్క గొప్ప విగ్రహం ఉండటం ఆలయానికి చారిత్రక శోభను చేకూరుస్తుంది.  

    

💠 ఆలయ సమయాలు : 

వారాంతపు రోజులలో ఉదయం 4:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

వారాంతాల్లో ఉదయం 5:00 నుండి రాత్రి 10:00 వరకు


💠హరతి సమయం : 

ఉదయం 7 AM మరియు సాయంత్రం 7 PM


💠 రోప్‌వే సమయాలు :

ఉదయం 07:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు మరియు మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 7:00 వరకు తెరిచి ఉంటుంది.

రోప్‌వే ఎంట్రీ ఫీజు

ఒక వ్యక్తికి 50 INR (పైకి & క్రిందికి) మరియు వ్యక్తికి 30 INR (ఒక వైపు: పైకి లేదా క్రిందికి)


💠 దాదాపు 1100 మెట్లు ఎక్కాలి

 (సుమారు 30 నిమిషాల నడక) బమలేశ్వరి దేవి ఆలయాన్ని చేరుకోవడానికి.


💠 ఆలయం ఉన్న కొండపై ఉన్న రోప్-వే నగరంలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన ఏకైక రోప్-వే అయినందున ఇది పర్యాటకులకు బాగా ప్రసిద్ధి చెందింది.


💠 ఈ నగరం రాజ్‌నంద్‌గావ్‌కు పశ్చిమాన 35 కిమీ, దుర్గ్ నుండి  67 కిమీ దూరంలో జాతీయ రహదారి 6 లో ఉంది

తెలుగు మాస్టారా

 చాలా బాగుంది ఇంటి పేర్ల పురాణం 


*తెలుగు మాస్టారా? మజాకా?*


తెలుగు మాస్టారు వచ్చీ రాగానే హాజరు పట్టీ అందుకున్నారు. కలం తీసి దానిమూత తీసి దాన్ని ఓ సారి అలవోకగా విదలించి, ఊఁ.....

ఓనమాల ఓంకారం, అచ్చుతప్పుల అప్పలాచారి, ఆటవెలది ఆనందరావ్, ఉత్పల ఉమాదేవి, చంపకమాల చంచలమ్మ, శార్దూలం శాంతమ్మ, మత్తేభుల మరకతమణి, మత్తకోకిల మహేశ్వరి, కందపద్యం కామేశ్వరి, తేటగీతుల దేవయాని, యతిప్రాసల యాచేంద్ర, అనుప్రాసల అనంతయ్య, అంత్య ప్రాసల అప్పన్న, విభక్తుల వినాయకరావు, సీసాల చినరామయ్య ఎత్తుగీతుల ఎంకటయ్య, శ్లేషల శేషాచలం, కూని రాగం కుటుంబరావు, వ్యాకరణం వసంతయ్య, ఛందస్సుల చంటి బాబు, వచనకవితల వంగపండు, హైకూల హైమవతి, ఆరుద్రపదాల ఆరుముగం, గ్రాంథికం గరుడాచలం, వ్య్వవహారాల వాసుదేవరావ్, పరుషాల పాపయ్యశాస్త్రి, సరళాక్షరం సంపత్కుమార్, అరసున్నల ఆదిలక్ష్మి, నిండు సున్ననిత్యానందం, అనునాసికం అప్పారావ్, శకట ఱేఫల శంకరయ్య, గురువుల గుండూరావు, లఘువుల లక్ష్మణరావు, ప్రకృతుల ప్రభాకరరావు, వికృతుల వీరాస్వామి, నామవాచకం నందకుమార్, విశేషణాల వీరభద్రయ్య, సర్వనామాల సంగీతరావు, భగణం భాస్కరయ్య సగణం సారయ్య, తగణం తాయారమ్మ

రగణం రంగాచారి, మగణం మావుళ్లయ్య, యగణం యాద్గిరి, నగణం నాగేంద్రుడు, జగణం జానకమ్మ, పద్యరచన పరమానందం, చివరగా ముక్తాయింపు మూర్తి రాజు. అమ్మయ్య,

అందరూ వచ్చారా, కూర్చోండి కూర్చోండి. ఏదోనర్రా ఈ రోజు మీకు వ్యాకరణం పాఠం చెబుదామనుకున్నాను. ఇదిగో ఇలా సరిపోయింది. సర్లే, రేపు చూసుకుందాం. ఈ రోజుకు ఇలా ......అదిగో గంట కూడా కొట్టారు.

శుభమ్.

...

సేకరణ

Bhuvana vijayam


 

*నా తెలుగుభాష! రతనాల భాష*

 *నా తెలుగుభాష! రతనాల భాష*


సంస్కృతామృతమ్ము నాపోశనంబట్టి 

నన్నయ్య చిన్నయ్య సంస్కరించిన భాష 

తీయతేనెలకన్న కమ్మనై యలరారి 

నయగారములనొలుకు నా తెలుగుభాష 


అల కందుకూరి గురజాడ జాడలన్ 

చిలకమర్తి వారి పల్కులందున కులికి 

పిడుగు వంటి గిగుడు గొడుగు ఛాయన జేరి 

కడిగిన ముత్యమైన భాష నా తెలుగుభాష


రాజుల కాలన రాజసమ్మొలికించి 

చట్టభాషగ తాను మెలగి చెలగి 

చుట్టమై ప్రజకెల్ల అలరారిన భాష 

కమ్మతేనెల మాధురి నా తెలుగుభాష 


భాషోద్యమమునందు వ్యావహారికస్థాయి 

నందిబుచ్చుకొని వచ్చి అందివచ్చిన భాష 

నా తెలుగుభాష నాదరింపగ రారె!

అధికార వ్యవహార డోలలూపగ రారె! 

అందివచ్చును భాష అందగించును భాష 

నిర్లక్ష్యమిక వద్దు లక్ష్యమే ఇక ముద్దు 


జై తెలుగుభాష! జై తెలుగుభాష! 

----------------------------------------------------------

ఈ కవిత నా స్వీయరచన అని, ఇప్పుడే రచించబడినది హామీ ఇస్తున్నాను. 

----------------------------------------------------------

రచన:

*కవితాభారతి*

*~శ్రీశర్మద*

8333844664 

తెనాలి.

Teeyani


 

Talaninda pudanda


 

అయోధ్య రామమందిరం



*జనవరి 22 వతేదీ, 2024 నాడు* అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జగజ్జాయమానంగా జరుగబోతోంది:


1) ప్రారంభోత్సవానికి ఒక నెల ముందుగానే... *రామ్ ధుని* (శ్రీరామ నామ భజన) దేశవ్యాప్తంగా లక్షకుపైగా దేవాలయాల్లో మారుమ్రోగుతుంది.


2) ఈ అపురూప ఘట్టం అంతర్జాతీయ స్థాయిలో విరాజిల్లనుంది.


3) దాదాపు 160 దేశాలనుండి ప్రజలు ప్రారంభోత్సవాన్ని తిలకించటానికి రాబోతున్నారు.


4) 6500 మీడియా విలేకరులు ప్రపంచం నలుమూలల నుండి ఈసందర్భంగా రిజిస్టర్ చేయించుకున్నారు.


5) అయోధ్య ప్రముఖమైన అతిపెద్ద పుణ్యక్షేత్రంగా, పర్యాటకస్థలంగా అవతరించబోతుంది.


6) మొదటి సంవత్సరం 5 కోట్లమంది సందర్శిస్తారని అంచనా.


7) విరివిగా త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణం చురుకుగా సాగుతోంది.


8) దేశంలోని పలు ఎయిర్ పోర్ట్ లనుండి విమానాలు చేరుకోవటానికి అయోధ్య విమానాశ్రయ నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది.


9) అయోధ్య రైల్వే స్టేషన్ కొత్తకొత్త హంగులతో సిద్ధమవుతోంది.


10) విశాలమైన సరయూ నదీతీరం పరిశుభ్రతతో, రంగవల్లుల అలంకరణలతోవేడుకకు అతిసుందరంగా ముస్తాబవుతోంది.


11) అయోధ్య, పరిసరాలు పదిలక్షల దీపాలతో ప్రకాశించనున్నాయి.

శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం భాగం 4/12



ॐ    శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

                    భాగం 4/12

                    

(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                ----------------------- 


      3. శ్రీమద్రామాయణం - భూగోళ శాస్త్రం 


    భూమిమీద నదులు, పర్వతాలు, జనావాసాలుగా గ్రామ/పట్టణ/నగరాలు, అరణ్యాలు, గనులు, సముద్రాలు వంటి అన్నిటి వివరాలనీ తెలిపేదే "భూగోళ శాస్త్రం". 


ప్రస్తుత భూగోళశాస్త్ర నిర్మాణం


    పాహియాన్, హ్యుయనా సాంగ్ వంటి విదేశీ యాత్రికులు పేర్కొన్న భారతమూ, 

    మెగస్తనీసు వ్రాసిన ఇండికా అనే గ్రంథంలోని భారతదేశ విషయాలవంటివీ, 

    మన గొప్పదనాన్ని చెబుతాయి. 

    అది మరుగునపడిన ప్రాచీనతను వెలికితీస్తూ, 

    ఆధునిక భౌగోళిక అన్వేషణకు దారితీసింది.


    అందులో భాగంగానే, కొలంబస్ భారతదేశాన్వేషణకై బయలుదేరి, త్రోవ మారి, అమెరికా చేరుకున్నాడు. 

    అదే ఇండియా అనుకుని భ్రమపడ్డాడు. అది భారతదేశం కాదనుకున్నాక, అక్కడి ప్రజలు రెడ్ ఇండియన్స్ అయ్యారు. 

    అనంతరం వాస్కోడిగామా భారతదేశానికి మార్గం కనుగొన్నాడు.   

    ఈ విధానంలో వెతుకుతూ వెతుకుతూ చిత్రపటాన్ని తయారుచేయడం జరిగింది. 


రామాయణం ప్రత్యేకత 


      రామాయణం మనకి ఎటువంటి పరిశోధనగానీ -  అన్వేషణగానీ అవసరంలేకనే, సమగ్రమైనదీ -  పరిపూర్ణమైనదీ అయిన  భూగోళశాస్త్రాన్ని చక్కగా  అందించింది. 


భూగోళ శాస్త్రం - కిష్కింధకాండ 


    శ్రీమద్రామాయణంలో కిష్కింధ కాండలో 

  - నలుదిశల వ్యాపించిన భూగోళ వివరాలు అత్యంత విపులంగా వివరించబడ్డాయి. 


    సీతాన్వేషణకై వానరులను నలుదిక్కులకీ పంపుతూ సుగ్రీవుడు, ఒక్కొక్క దిశలోనూ ఏ ఏ ప్రాంతాలు ఉంటాయో చక్కగా వివరించాడు. 

    అందులో కొన్ని భాగాలని ఇప్పుడు చూద్దాం. 


తూర్పు దిక్కు 


    గంగా సరయు కౌశిక యమున మొదలైన నదులూ, 

    యామునగిరి సరస్వతి సింధు శోణ నదీ తీరాలూ, 

    బ్రహ్మమాల విదేహ మాళవ కాశి కోసల మగధ మొదలైన దేశాలూ, 

    వెండి గనులు గల భూములూ, సముద్రాలూ, వాటిలోని పర్వతాలూ, వాటిమధ్య ద్వీపాలయందలి నగరాలూ, 

    ఆవలి తీరంలో ఘృత దధి క్షీర మధురజల సముద్రాలూ, 

    అతినీలలోహిత కిరణరశ్మి ప్రదేశం, లయముఖమనే బడబాగ్ని, 

    ఊర్ధ్వలోకవాసులు భూలోకానికి ప్రవేశించే ద్వారంగా ఉదయాద్రి, 

    ఆ పైన అగమ్యంగా ఉండే విషయాలు వివరంగా తెలిపాడు. 


దక్షిణ దిక్కు 


    నర్మద గోదావరి మహానది కృష్ణవేణి వరద మహాభాగ నదీ తీరాలూ, 

    మేఖల ఉత్కళ దశార్ణ విదర్భ ఋషిక మాహిషిక వంగ కళింగ కౌశిక మొదలగు దేశాలూ, 

    దండకారణ్యం, 

    ఆంధ్ర పుండ్ర చోళ పాండ్య కేరళ మొదలైన దేశాలూ, 

    మలయ పర్వతమూ, కావేరి నదీ, అగస్త్య నివాసం, తామ్రపర్ణి నది, 

    సముద్రం - దాని మధ్యలో అంగారక నీడ, 

    కుంజర పర్వతం, భోగవతీ పురం, వృషభ పర్వతం, పితృలోకం, చిమ్మచీకటి అని ఆ దిశలోనివాటి వివరాలు తెలిపాడు. 


పశ్చిమ దిక్కు 


    సౌరాష్ట్ర ప్రాంతాలూ, బాహ్లిక దేశాలూ, శూర భీమ ప్రదేశాలూ, 

    మురచీ పట్టణం, 

    సింధునదం సముద్రాన కలిసే ప్రదేశాన హిమగిరీ, దాని విషయాలూ, 

    సముద్ర మధ్యన 24 కోట్ల గంధర్వుల నివాస స్థానమూ, 

    పారియాత్ర పర్వతమూ, 

    సుదర్శన చక్రంగా "చక్రవంత" పర్వతం, 

     60 వేల బంగారు కొండలూ, వాటి మధ్య పర్వతాలకి రాజైన మేరుగిరి, 

     విశ్వకర్మ నిర్మిత వరుణ నివాస స్థానం, 

     ఆపైన సూర్యప్రకాశంగానీ, ఏ దేశపు సరిహద్దుగానీ కనబడని ప్రదేశమూ అని ఆ దిశలో ఉన్నవాటిని వివరించాడు. 


ఉత్తర దిక్కు 


    మ్లేచ్ఛదేశాలూ, పుళిందుల భూములూ, శూరసేనుల రాజ్యాలూ, 

    ఇంద్రప్రస్థం, కురుక్షేత్రం, మద్రక దేశం, కాంభోజ రాజ్యం, టంకణదేశ ప్రదేశాలూ, చీన పరమచీన భూములూ, 

    హిమవత్పర్వత ప్రాంతాలూ, ఆపైన వంద యోజనాలు కొండలుగానీ - నదులుగానీ - వృక్షాలుగానీ లేని, ఏ ప్రాణీ నివసింపని శూన్యమూ, తరువాత దుర్గమారుణ్యమూ, 

    కైలాస శిఖరం, విశ్వకర్మ నిర్మిత కుబేర భవనమూ, క్రౌంచగిరి, వైఖానసం సరస్సూ  

    ఆపైన సూర్య చంద్ర - నక్షత్ర దర్శనం లేని - మేఘాలు కనబడని - మెఱుపులు వినబడని - కేవలం శూన్యమైన ఆకాశ ప్రదేశమూ, 

    శైలోదకమనే నదీ, ఉత్తర కురు భూములూ - లవణ సముద్రం - దాని మధ్యలో సోమగిరి అనే మహాపర్వతం, 

    దేవతలకు సైతం అసాధ్యమైన బ్రహ్మ - విష్ణు - శంకరుల నివాస స్థానాలూ తెలుపుతాడు. 


దిశా పరిమితులు 


    తూర్పు దిక్కున ఇంద్రుని స్వర్గలోక/ఊర్థ్వలోక మార్గం వరకూ, 

    దక్షిణ దిక్కకు అధిపతి అయిన యముని పితృలోకం వరకూ, 

    పశ్చిమ దిక్కున ఆ దిక్కుకు అధిపతియైన వరుణుని నివాస స్థానం వరకూ, 

    ఉత్తరాన ఉత్తరదిక్కుకు పాలకుడైన కుబేరుని భవనంతోపాటు, త్రిమూర్తుల నివాస స్థానాల వరకూ ఇచ్చిన విశ్లేషణాత్మక వివరణ ఎంతో సమగ్రంగాఅద్భుతమైనదిగా తెలుస్తుంది. 

    నదుల వివరణ భూగోళంలో నీటి వనరులగూర్చి అవగాహన కలిగించేదిగా తెలుస్తోంది కదా! 


    ఆ కాలంలో తెలిపిన వివరాలు, అత్యధిక కాలవ్యవధిలో, కాలక్రమేణ కొన్న మార్పులకు గురవుతాయి. 

    ఆనాటికీ ఈనాటీకీ కాలంలో వ్యత్యాసం అత్యధికం కావడం వల్ల ఈ మార్పులను గణిస్తే, ఆ వివరాలన్నీ చక్కగా సరిపోతాయి. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

God's photo




































 

Cartoon




 

యజ్ఞోపవీతం

 *యజ్ఞోపవీతం ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి? అలా మార్చుకునేటప్పుడు ఎలాంటి విధి, విధానాలు ఆచరించాలి?*



యజ్ఞోపవీతము మార్చుకోవాల్సిన సందర్భాలు ఒకటి కంటే ఎక్కువే ఉంటాయి. అందరికీ తెలిసినట్లుగా జాతాశౌచం, మృతాశౌచం తీరిన  తరువాత మార్చుకోవాలి. గ్రహణ మోక్షం తరువాత మార్చుకోవాలని కూడా చాలా మంది చెబుతారు. యజ్ఞోపవీతము జీర్ణమయితే మార్చుకోవాలి. శవ స్పర్శ చేస్తే మార్చుకోవాలి. శవ వాహకులుగా ఉన్నవారూ మార్చుకోవాలి , మోయక పోయాయినా స్మశాన సందర్శనం చేస్తే కూడా మార్చుకోవలసి ఉంటుంది. యజ్ఞోపవీతమునకు అశుద్ధ మయిన పదార్థములు తగిలితే ( చీము,రక్తము వగైరా ) మార్చుకోవలసి ఉంటుంది. ఏ అశుచీ లేకపోయినా 3 నెలలకు మార్చుకోవాలని కొంతమంది పెద్దలు, 6 నెలలకు ఒకసారి సరిపోతుందని కొంత మంది పెద్దలూ చెబుతారు. శ్రాద్ధ కార్య క్రమాలకు ముందు, శుభ కార్యాలకు ముందు ( పెళ్ళి మొ.) మార్చుకుంటారు. ఇక శ్రావణ పౌర్ణమికి అందరికీ తెలిసిందే. ఋగ్వేద సంప్రదాయులు వినాయక చవితికి మార్చుకుంటారు.

బాగా సంప్రదాయ వాదులు అయితే మల మూత్ర విసర్జన సమయంలో యజ్ఞోపవీతమును నీవీతి చేసి, కుడి చెవికి చుట్టుకోకపోతే మార్చుకుంటారు. క్షుర కర్మ చేసుకున్నప్పుడు కూడా మార్చు కుంటారు. తగల కూడని వారిని తాకితే కూడా మార్చుకుంటారు.

ఇక యజ్ఞోపవీతము మార్చేటప్పుడు విధి విధానాలు అంటే జాతా, మృతా అశౌచం తీరిన తరువాత స్నానానంతరం శుభ్రమైన మడి వస్త్రాలను ధరించాలి. ధోవతి కచ్చపోసి ధరించాలి. మా పెద్దలు బ్రహ్మచారులు కచ్చ పోసి కట్టనవసరము లేదని చెప్పారు. పుండ్ర/భస్మ ధారణ తరువాత వారి వారి మతానుసారముగా యజ్ఞోపవీత ధారణ విధిని అనుసరించి నూతన యజ్ఞోపవీతాలను ధరించి, పాతవి త్యజించాలి. సంప్రదాయం పాటించే వారి ఇండ్లలో 'ఎలా మార్చుకోవాలి' అన్నది వ్రాయబడిన పుస్తకాలు ఉంటాయి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే పాత యజ్ఞోపవీతమును శిరస్సు పై ఉండే తీసివేయాలి. దానిని ఎవ్వరూ త్రొక్కని చోట వేయాలి. కొంతమంది విసర్జించిన యజ్ఞోపవీతములను 'తాడు' లాగా వాడడం నేను చూసాను. ఇది బాధాకరం. సంకల్పం, మంత్రం చెప్పకుండా ఈ కార్యక్రమము చేయరాదు. యజ్ఞోపవీతము చాలా పవిత్రమైనది. దర్భ పవిత్రం ధరించే చేయాలి. ఆచమనము చేసేప్పుడు పవిత్రం కుడి చెవికి పెట్టు కోవాలి. కొంత మంది బంగారు అంగుళీయకము వేసుకుని ఉంటారు. చాలా మంది పెద్దలననుసరించి ఇది కూడా ఆమోదయోగ్యమే.

అక్షరయాణ్

 అక్షరయాణ్ కవి సమ్మేలన్

అంశం :  భాష

*కవి పేరు    : తుమ్మ జనార్దన్ (కలం పేరు: జ్ఞాన్)*

---------------------------------------------------

*శీర్షిక : నా భాష నా యాస*


తెలుగు భాష యెంత అందంగా ఉందో

తెలంగాణ యాస అంత చందంగా ఉంది

వరసలతో పిలిచి వయ్యారంగా ఉంటది

పరాచకాలతో పరమాన్నం లాగుంటది

సామెతలతో గలిసి సభ్యంగా ఉంటది

తెలుగు భాషకు తెలంగాణ యాస సొగసు

ప్రాంతానీకో యాస, ఆత్మీయతల కోశం

ఎన్ని యాసలైనా తెలుగు భాష ఘనం.


అందమైన భాష శ్రీకరమైన యాస

ఆదరించి చూడ ఆకళింపు 

ఆంద్ర తెలంగాణ అమ్మ భాష తెలుగు

అందరి ఆత్మకూ హత్తుకున్న యాస

అక్షరాల సొగసు చందమామను బోలు

అప్సరస నాట్యం చందాన చేవ్రాలు

అపురూపమైనదని కీర్తిగాంచిన భాష

ఆకర్షణీయమై అలరారిన యాస.


గిడుగు పట్టిన గొడుగు 

వ్యవహారిక భాష తొడుగు

అడుగు అడుగున అమ్మ భాష

బుడి బుడి మాటల యాస

పండితుల భాష, పామరుల ఘోష

కాదు కారాదు అవమానమే యాస.


ఎందరో పంచిరి పద్య పరమాన్నాలు

ఎందరో మించిరి సహస్రావధానాలు

ఎందరో వెలిగిరి తెలుగు వెలుగు దివిటీలై

ఎందేందో పారింది తెలుగు మకరందమై

ఎచటెచటో ఎగిరింది భాషా విహంగమై

ఇంకెందరో పెంచిరి భాషాభిమానాలు


అందరికీ వందనాలు

తెలుగు భాషాభి వందనాలు, నా యాసాభి వందనాలు.

-------------------------------------------------------------- 30 లైన్స్


హామీ పత్రం: పై కవిత నా స్వీయరచన.  భాష కవితా సంకలనం నిమిత్తమే రచించాను.  ఏ ఇతర మాధ్యమంలోనూ ప్రసారం/ప్రచురితం కాలేదు మరియు ఎక్కడా పరిశీలనలోను లేదని హామీ ఇస్తున్నాను.


*కవి పేరు    : తుమ్మ జనార్దన్ (కలం పేరు: జ్ఞాన్)*

చిరునామా : 4-116, దుర్గానగర్, దిల్ సుఖ్ నగర్, హైదరాబాదు-500060 

చరవాణి సంఖ్య : 9440710501

ఇమెయిల్ ఐడి : tjfnardhan@gmail.com

హిందువులను

 హరిః ఓం, ఒడ్డే శివకేశవం. హరిః ఓం. హరిః ఓం.


[సౌజన్యం: SVK స్వామి; ఇంగ్లీష్ /తెలుగు అనువాదం: సతీష్ కుమార్ బండారు]


♦️  *చరిత్ర తెలుసుకోవాలి* -: కాంగ్రెస్‌ను విచక్షణారహితంగా విమర్శిస్తూ వెళ్లడం సరికాదు. *కాంగ్రెస్ సాధించిన విజయాలు కూడా తెలుసుకోవాలి👇:*.


▪️ ❌గత 65 ఏళ్లలో కాంగ్రెస్ ఏ పని చేయలేదని ఎవరు చెప్పారు❌❓❓ ✅ *కాంగ్రెస్ వాళ్ళు చాలాచాలా చేసారు, కానీ అవన్నీ ముస్లింల కోసం?*✅


 •  *ముస్లింల కోసం* పాకిస్తాన్ సృష్టించబడింది, ,బంగ్లాదేశ్ *ముస్లింల కోసం* తయారు చేయబడింది.


• ఆర్టికల్ 370 అమల్లోకి వచ్చింది, *ముస్లింల కోసం*.


• మైనారిటీల బిల్లు *ముస్లింల కోసం వచ్చింది*.


•  *ముస్లింల కోసం* ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏర్పడింది.


•  *ముస్లింల కోసం* మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడింది. *ముస్లింల కోసం* వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారు.


 • మైనారిటీ విశ్వవిద్యాలయం *ముస్లింల కోసం* తయారు చేయబడింది.


 • దేశ విభజన మత ప్రాతిపదికన, *ముస్లింల కోసం* జరిగింది. • ప్రార్థనా స్థలాల చట్టం తీసుకొచ్చారు, *ముస్లింలుకోసం*.


♦️ •  *మతహింస వ్యతిరేక బిల్లును* పార్లమెంటులో రెండుసార్లు ప్రవేశపెట్టారు, కానీ బిజెపి దానిని ఆమోదించడానికి అనుమతించలేదు.  *ఆ బిల్లు కూడా ముస్లింలకు సంబంధించి నదే* మరియు ఈ బిల్లుగనుక ఆమోదించబడివుండి వుంటే , హిందువుల్ని ఈ దేశం లో లేకుండా చేయడానికి కేవలం 10 సంవత్స రాలు కూడా పట్టదు ?  *ఎవరికైనా ఏదైనా ఈ విషయం లోసందేహం ఉంటే, అతను గూగుల్* కి వెళ్లి చదవవచ్చు.


 • దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేసింది, *హిందూ సమాజం ఎప్పుడూ పరస్పరం పోరాడు కునేలా హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చింది*. మరియు ఘజ్వా-ఎ-హింద్‌ను హిందువులు ఎప్పటికీ అర్థంచేసు కోలేదు, చేసుకోలేకపోయారు, *చేసుకోనివ్వ లేదు*. హిందువుల్ని నమ్మకం మీద మోసం చేశారు. *గాంధీ - నెహ్రూ లు, ముస్లిమ్స్ జన్మతః ముస్లిమ్స్ అయివుండి - వారు హిందువులు గా పైకి నటిస్తూ, అన్నీ హిందూ వ్యతిరేకంగా చేస్తూ వచ్చారు*.


▪️ *హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడానికి* - హిందూ కోడ్ బిల్లుతీసుకు రాబడిం ది , అది కూడా ముస్లింలకు మేలు చేయడానికి మాత్రమే.


 ▪️ కొన్నిసార్లు నాకు దీన్ని పోస్ట్ చేయకూడదని అనిపిస్తుంది. కానీ పోస్ట్ చేసినప్పుడే భారతదేశం దీన్ని చదువుకుంటుంది అనే ఆలోచన వస్తుంది. అప్పుడే భారతదేశం కాంగ్రెసోళ్ల ఛాతీ పైకి ఎక్కుతుంది.


▪️ ఈ పోస్ట్ చదివిన తర్వాత మీకు ఏమైనా అర్థమైతే, ఆ పోస్ట్ గరిష్ట సంఖ్యలో వ్యక్తులకు చేరుకోవ డానికి ఇది సహాయపడాలి.


♦️జై శ్రీ రామ్ రాధే రాధేగోవిందా ❣️🙏🚩🕉️ హరిః ఓం. హరిః ఓమ్.

S


 

Monkey


 

online banking transactions


 Simple but important points to be remembered and practised while doing online banking transactions. Sh. V. Rangarao, Former General Manager, Reserve Bank of India

Temple property

 *దేవాలయాలపై మద్రాస్ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది.*


*ఆలయ భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయని... వాటి మీద వచ్చే ఆదాయం దేవాలయాల అభివృద్ధి, హిందువుల కోసమే ఉపయోగించాలంది.*


*ప్రభుత్వాలు దొంగల మాదిరిగా దోచుకొని ఇతర కార్యక్రమాలు ఇతర మతాలకు ఇవ్వకూడదని చెప్పింది. ఆలయాలకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను తెలిపింది మద్రాస్ హైకోర్టు’*


*1985లో తమిళనాడులో 5 లక్షల ఎకరాలు దేవాలయాల భూములను ఉండేవి... ప్రస్తుతం 4 లక్షల 50 వేలు మాత్రమే లెక్క చూపిస్తున్నారు... మరి 50 వేల ఎకరాలు ఏమయ్యాయి లెక్క తీయండి, ఆక్రమంలో ఉంటె తొక్క తీయండి కేసులు పెట్టండి, మళ్లీ 50 వేల ఎకరాలను దేవాలయాలకు అప్ప చెప్పండి... ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలి, దేవాలయ అధికారులు ఆధీనంలో దేవాలయం ఆధీనంలో మాత్రమే ఉండాలి...*


*ప్రభుత్వాలు పనికిరాని చెత్త పెత్తనం చేయకూడదు... హిందువుల కోసం, హిందూ ఆలయాలు అభివృద్ధి హిందూ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అంతేకాదు... దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి, ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, దొంగల మాదిరిగా దోచుకొని మరి ఇతర మతాల కోసం క్రైస్తవులు, ISLAMIC కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ప్రభుత్వాల రోజు వారి పరిపాలన కోసం మీ యొక్క భోగాల కోసం హిందువుల దేవాలయాల ఆదాయాన్ని ఎందుకు వాడుతున్నారు...*


*దాతలు హిందూ దేవాలయాలకు హిందూ దేవుడికి భూములు ఇచ్చారు... దాతలు మీ భోగాల కోసం ఇవ్వలేదు హిందూ ధర్మం కోసం ఇచ్చారు... హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి... దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు, పోస్టులు భర్తీ చేయండి హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వండి అన్యమతస్తులకు కాదు... సెక్యూలరిజం బొంగు భోషాణం దొంగ ముచ్చట్లు అన్ని మీరు చూసుకోండి కానీ అది హిందూ దేవాలయాలు వాటిని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి... దేశంలో చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవు అందులో ఎంత ఆదాయం వస్తుందో ఎవరికీ తెలియదు కానీ హిందూ దేవాలయాలను మాత్రం దొంగల మాదిరిగా దోచుకుంటున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవాలయాల భూములు దేవుళ్ళ యొక్క సంక్షేమం కోసం కృషి ఇచ్చింది ఎస్సార్ మహదేవన్ అనే జడ్జిగారు... కొన్ని రోజుల క్రితమే మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది... హిందూ ధర్మం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు తీసుకొని క్రైస్తవం ఇతర మతాలలో ఉద్యోగాలు తొలగించండి, జీతాన్ని రికవరీ చేయండి కేసులు పెట్టండి అని జడ్జి గారు తీర్పు ఇచ్చారు ఇప్పుడు అదే జడ్జిగారు మళ్లీ హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ కోసం గొప్ప చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది త్వరలో హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వాధీనంలో నుండి బయటకి రావాలి, ఆక్రమణకు గురైన హిందూ దేవాలయాల భూములన్నీ మళ్ళీ దేవాలయాలకు చెందాలి. ఆలయాలు దేవుడి సాక్షిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడవాలి... హిందూ దేవాలయాల ఆదాయంతో హిందువులకు మాత్రమే విద్య, వైద్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి కార్యక్రమాలు జరగాలి. SAVE టెంపుల్స్ అని ఒక గొప్ప ఉద్యమం తమిళనాడులో జరుగుతుంది. భారతదేశ చరిత్ర మొత్తం మలుపుతిప్పే విధంగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.*

రక్షాబంధన్ నిర్ణయం

 📿 _*రక్షాబంధన్ నిర్ణయం*_📿

🚩 ® *జ్ఞాన సింధు* ®🚩

✍️ బ్రహ్మశ్రీ పరమాత్ముని రామచంద్రమూర్తి, ఒంగోలు

(ప్రామాణిక సూర్య సిద్ధాంత పంచాంగమును అనుసరించి..)

🕉️🌻🌻🌻🌻✡️🌹🌹🌹🌹🕉️


📿 ఈ ఏడాది భద్రా కాలం నాటి నీడ కారణంగా ఆగస్టు 30న రాఖీ కట్టాలా.. లేక 31న రాఖీ కట్టాలా అనే సంధిగ్ధత  నెలకొంది.... 


📿👉 2023 సంవత్సరంలో, సావన్ మాసం చివరి రోజున అంటే పౌర్ణమి రోజున రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. 


📿 ఈ సంవత్సరం, పౌర్ణమి... 


✅👉 _*ఆగస్టు 30న ఉదయం 10:58 గంటలకు ప్రారంభమవుతుంది, ఇది ఆగస్టు 31, 2023 ఉదయం 07:05 వరకు కొనసాగుతుంది.*_


📿 కానీ భద్రకాళ పౌర్ణమితో కూడా ప్రారంభం అవుతుంది. భద్రకాళికలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. రాత్రి 9:02 గంటలకు భద్రకల్లు ప్రారంభమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో భద్రకాళీ ముగిసిన తర్వాతే రాఖీ కట్టమన్నారు.


📿✅👉 _*రక్షా బంధన్ యొక్క శుభ సమయం*_ 


✅👉 _*30 ఆగస్టు 2023 రాత్రి 09:01 నుండి ఆగస్టు 31 ఉదయం 07:05 వరకు ఉంటుంది.*_


📿 కానీ ఆగస్ట్ 31, సావన్ పూర్ణిమ ఉదయం 07:05 వరకు ఉంది, ఈ సమయంలో భద్ర కాళం లేదు.


✅👉📿 _*అందుకే ఆగస్టు 31న సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఈ విధంగా, 2023 సంవత్సరంలో, రక్షా బంధన్ పండుగను ఆగస్టు 30 మరియు 31 రెండు తేదీలలో జరుపుకుంటారు. అయితే భద్ర కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాఖీ కట్టండి.*_


   ☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆


      🪴 శుభం భూయాత్ 🪴


📞 *వాట్సాప్ సంప్రదింపులకు.* 

@96403 00507


🚩 *®Gnaana Sindhu®* 🚩


🕉️🌹🌹🌹🌹✡️🌻🌻🌻🌻🕉️

రాశి ఫలాలు మంగళవారం, ఆగస్టు 29, 2023*

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*మంగళవారం, ఆగస్టు 29, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం*

*తిధి*      :  *త్రయోదశి మ12.52* వరకు 


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

మేషం


ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల సహాయంతో  నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

---------------------------------------

వృషభం


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు. నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది. 

---------------------------------------

మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. 

---------------------------------------

కర్కాటకం


ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.  వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

---------------------------------------

సింహం


ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. 

---------------------------------------

కన్య


దూరప్రయాణ సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. 

---------------------------------------

తుల


పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.  అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం


చేపట్టిన  పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

---------------------------------------

ధనస్సు


ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి.  నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులు అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. 

---------------------------------------

మకరం


ఇంటాబయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొండి  బకాయిలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత  కలుగుతుంది. 

---------------------------------------

కుంభం


కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

మీనం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ కార్యక్రమాలలో నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 



*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

ఉచితంగా యజ్ఞోపవీతం*

 *ఉచితంగా యజ్ఞోపవీతం*


 ప్రతీ సంవత్సరం లాగానే  కల్యాణ కల్పతరువు , KC Das Trust వారి సోజన్యం తో  యజ్ఞోపవీతములు (శ్రావణ పౌర్ణిమ / జంధ్యాల పౌర్ణిమ సందర్భంగా ) ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది.  


కావలసినవారు నేరుగా  వచ్చి నా దగ్గర నుంచి తీసుకోగలరు.


*రాయప్రోలు వెంకట సుబ్రహ్మణ్యం*

Plot No.724, Road No.13

Prashanthi Hills, Meerpet

Mobile : 8008579012

మాతృభాష దినోత్సవ

 మాతృభాష దినోత్సవ శుభాభివందనాలతో🌾🌻🌱🌾🌻🌱🌾



తెలుగు భాష పై ఇకనైనా కళ్ళు తెరవండి..!!


అమ్మ నేర్పేను మాతృభాష తెలుగు

నోట జాలువారే మొదటి పదమై వెలుగు

జానపదుని నోట రాగల గీతాలు శ్రావ్యమై సాగే

యాబై ఆరు అక్షరాలు సువర్ణ మాలగా కూర్బబడె...


శిల్పాల తోటలో అందమైన ఆకృతి పొంది

అలతి అలతి పదాలతో సుమధురముగా వినిపించే

సుందరమైన తెలుగనుచూ కొనియాడ బడే

పాటలై పరవళ్ళు తొక్కుతూ చెవుల నల్లా ఊరించే..


సాహిత్య సమరాంగణ లో విందు భోజనం చేసి

ఆంధ్రభోజుడికి ఆత్మ తృప్తి కలిగించే

తెలుగు పల్లకిలో రాజ్యమంతా విస్తరించే

భాషల్లో లెస్సగా విను వీధుల్లో పొలికేక వేసే..


కీర్తించి తరించిన కవులను ఎందరినో

కనకాభిషేకాలతో ఆలింగనము చేసుకొని ఆదరించే

తరగని అమృత మథనలో కావ్యాలెన్నో ఉద్భవించే

రాజ ఠీవిగా సాహిత్య వీధుల్లో సమర శంఖం పూరించే..


ప్రాచీన లిపిగా పరిఢవిల్లిన  తెలుగు

కావ్య భాష ఘన కీర్తి నేలపై పొందుతూ

కూడలిగా అన్ని భాషలను కలుపుకొని పోతూ

అన్ని భాషలకు తోడు నీడగా నా భాషే నిలిచే..


ఇబ్బంది పడుతోంది నేడు విధిలేని పరిస్థితులు

వ్యామోహముతో పతనం వైపుకు జరుగుతుంది

ప్రాథమిక దశలోనే పిల్లలకు దూరమవుతూ

పర భాషలా కనిపిస్తుంది నా కన్నతల్లి నేడు పిల్లలకు..


నేడు నామమాత్రపు తెలుగు బోధనలు

మొక్కుబడిగా సాగుతున్న భాషా ఉద్యమాలు

అడుగడుగునా జరుగుతున్నాయి దుశ్చర్యలు

పాలించే ప్రభుత్వమే కిరాతక చర్యలు..


నా తెలుగు పట్టిన తెగులుకు కారకులు ఎవరు??

మారుతున్న పరదేశి పోకడలలో నలుగుతూ

తల్లిదండ్రుల వ్యామోహము రోజు రోజుకు పెరుగుతూ

ర్యాంకుల చదువుల్లో నానా అవస్థలు పడుతుంది..


విదేశాలలో నా తెలుగు విర్రవీగుతుంటే

స్వస్థలములో  దిగజారి అవస్థలు పడుతుంది


మన భాషను మనం కాపాడుకునే బాధ్యత వచ్చింది..!!


మాతృభాష దినోత్సవ శుభాభివందనాలతో...


🌹🌹🌹🌹🌹🌹 💐💐🙏🙏

రామాయణమ్ 308

 రామాయణమ్ 308

...

ఆశ్చర్యము ! అద్భుతము ! అక్ష కుమారుని వధ అనితరసాధ్యము ఒక్క హనుమంతుని వలననే అది సాధ్యపడినది.అని దేవతలందరూ కూడా ఆ అనిలసుతుని పరాక్రమాన్ని వేనోళ్ళపొగడగా అవి ఏవీ పట్టనట్లుగా ప్రజలను సంహరించడానికి తీరిక చేసుకొని కూర్చున్న యముడివలే రాబోయే యోధులకొరకు స్వామి నిరీక్షిస్తూ ఉన్నాడు.

.

అక్షకుమారుని మరణవార్త తక్షణమే రాక్షసరాజు చెవినబడ్డది.ఒక్కసారిగా ధిగ్గుమనిలేచాడు కాసేపటికి మనస్సు కుదుట పరచుకొన్నాడు  తీవ్రమైన కోపము తో ఇంద్రజిత్తు కేసి చూసి వెంటనే యుద్ధరంగానికి బయలు దేరమని ఆదేశించాడు.

.

కుమారా ! నీవు శస్త్రాస్త్రకోవిదుడవు నీ రణకౌశలాన్ని దేవతలుకూడా ఎరిగియున్నారు.

.

భుజబలములో,తపోబలములోనీకు సాటి రాగలవాడు ముల్లోకాలలో ఎవ్వడూ లేడు ,ఏ దేశములో ,ఏకాలములో ఏ పని చేయవలెనో ఎరిగిన వాడవు.

.

కింకరులు పోయినారు తిరిగిరాలేదు 

జంబుమాలి జాడలేకుండా పోయినాడు

అమాత్యపుత్రులు రణమందు అణగిపోయినారు

నీ సోదరుడు అక్షుడు ఇప్పుడు యముడికి అతిథిగా పోయినాడు.

.

వారెవరికీ నీకున్న బలము లేదు , నా వారసుడవు నీవే!

.

నాయనా ఆ వానరుని బలాన్ని అంచనా వేయుటలో పొరపడకుము! నీ బలము అతని బలము బేరీజువేసుకొని మరీ యుద్ధము కొనసాగించు ...విజయుడవై తిరిగిరా అని తండ్రి పంపగా మహోత్సాహంతో ఉత్సవము చేసుకుంటూ హనుమంతుడిని పట్టుకోవడానికి బయలుదేరాడు ఇంద్రజిత్తు..

.

వూటుకూరు జానకిరామారావు

🪷 శ్రీ మద్భగవద్గీత

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️* 

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 11వ శ్లోకం* 


 *శ్రీ భగవానువాచ:* 

 *అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే |* 

 *గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండుతాః ||* 


 *ప్రతి పదార్థం* 


త్వ మ్ = నీవు; అశోచ్యాన్ = శోకింపదగని వారి గూర్చి ; అన్వశోచః = శోకించుచున్నావు ; చ= మరియు; ప్రజ్ఞా వాదాన్ = ప్రజ్ఞావంతులవలే ; భాషసే = పలుకుంచున్నావు (కాని ); గతాసూన్ = ప్రాణములు పోయిన వారినిగూర్చియు ;చ = మరియు; అగతాసూన్ = ప్రాణములు పోనివారినిగూర్చియు ; పండితాః = పండితులు ; న అనుశోచంతి  = శోకింపరు.


 *తాత్పర్యము* 


 శ్రీ భగవానుడు పలికేను :

 ఓ అర్జునా ! శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు . పైగా పండితుని (జ్ఞాని )వలె మాట్లాడుచున్నావు . పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని ప్రాణములు పోని వారిని గురించిగాని శోకింపరు.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

నవగ్రహ పురాణం - 39 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 39 వ అధ్యాయం*


*బుధగ్రహ జననం - 2*


చల్లటి గాలి ఒక్కసారిగా తార ముంగురుల్ని పలకరించింది. ఒక్కసారిగా ఆమె పైటను లాగి , దానితో ఆడుకుంటూ ఉండిపోయింది.


తార చేతులు కదలలేదు. వక్షభాగం మీంచి జారిపోయి , పతాకంలా ఎగురుతున్న పైటని పట్టుకుని , ఆమె కప్పుకో లేదు ! పైట అలా వదిలేసి , తార నెమ్మదిగా అడుగులు వేస్తోంది. కొంగు లాగుతూ కవ్వించే ప్రణయ నాయకుడిలా గాలి ఆమె పైటను విచ్చలవిడిగా ఊపుతోంది. దుస్తుల్ని ఆమె శరీరానికి రెండవ చర్మంలా తాపడం చేస్తోంది.


తోటలో నడయాడుతున్న తారలో ఏవో ఆలోచనలు నిశాకుసుమాలలాగా వికసిస్తున్నాయి. ఏవేవో వాంఛా సుగంధాల్ని వెదజల్లుతున్నాయి. ఎందుకో నిద్ర రావడం లేదంది భర్తతో ఆమె.


అయితే తనకు ఎందుకు నిద్ర పట్టడం లేదో తారకు తెలుసు ! నూతన శిష్యుడిగా వచ్చిన ఆ అందాల చంద్రుడు - అతనికీ , తనకు తెలియకుండానే తనకు దగ్గరవుతూ , నిద్రను దూరం చేస్తున్నాడు.


*"నీకు కోరిన పురుషుడు భర్తగా లభిస్తాడు !"* అంటూ వరమిచ్చినాడు బ్రహ్మ. ఆ పురుషుడు బృహస్పతే అని కూడా చెప్పాడు. కానీ , తనకు భర్తగా రావాలని కోరుకున్న పురుషుడు బృహస్పతి కాదనీ , చంద్రుడనీ అనిపిస్తోంది తారకు. బ్రహ్మ అనుశాసనాన్ని నమ్మి బృహస్పతి కోసం అన్వేషిస్తూ తిరిగి తను తప్పు చేసిందా ?


ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న తార తటాలున ఆగింది. ఎవరో వెనక నుంచి తన పైటను పట్టి లాగుతున్నారు ! ఒక వేళ... అతనా ? తార తలతిప్పి , ఆశగా , సిగ్గుగా చూసింది. ఆమె పైటను రెమ్మ చేతుల్తో పట్టుకున్న పూలమొక్క గాలికి కదుల్తోంది. ఆమెను రమ్మని సైగ చేస్తున్నట్లు. తార విసుగ్గా పైటను లాగి , అయిష్టంగా యధాస్థానంలో వేసుకుంది.


తనలో అర్థం లేకుండా పుట్టుకొస్తూ , కల్లోల పరుస్తున్న ఆలోచనల దాడిని తప్పించుకునే ప్రయత్నంలో తార చకచకా అడుగులు వేసి , మలుపు తిరిగి అప్రయత్నంగా ఆగింది.


ఎదురుగా విద్యార్థుల విడిది , పర్ణశాలలు కనిపిస్తున్నాయి. ఆ పర్ణశాలల్లో ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు చంద్రుడు ! తార అప్రయత్నంగా నిట్టూర్చి , వెనుదిరిగి ఆశ్రమం వైపు అడుగులు వేయసాగింది.


తన చుట్టూ వ్యాపిస్తూ , తన మీద దండయాత్ర సాగిస్తున్న పిల్లగాలుల్నీ , మత్తెక్కిస్తున్న పూల వాసనల్నీ తట్టుకుని , భరించే శక్తి లేని తార ఆశ్రమంలోకి వెళ్లి తలుపు మూసింది. శయనాగారం వైపు మెల్లగా అడుగులు వేసింది. లోపల్నుంచి బృహస్పతి గురక ఆమెని రమ్మని పిలుస్తోంది.


విద్యార్థులందరూ రెండు వరుసలుగా భోజనాలకు కూర్చున్నారు. ఎదురెదురుగా ఉన్న విద్యార్థుల వరుసలకు అభిముఖంగా బృహస్పతి కూర్చున్నాడు. అందరి ముందూ అరిటాకులు ఉన్నాయి. బృహస్పతి విద్యార్థుల్ని పరిశీలనగా చూస్తున్నాడు. తార వడ్డన ప్రారంభించబోతూ , బృహస్పతి వద్దకు వచ్చింది.


*"సనాతనా ! చంద్రుడేడీ ?"* బృహస్పతి ఒక విద్యార్థిని అడిగాడు.


*"ఇంకా రాలేదు గురువుగారూ..."* సనాతనుడు అన్నాడు.


*"ఎవరూ ? చంద్రుడా ?"* అందరి ముందూ ఉన్న పాత్రల్లో నీళ్ళు పోస్తున్న తార అంది. *“ఇందాకా , నీళ్ళు వొలికి పోయాయి. నదికి వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మన్నాను..."* 


*"భోజన సమయం కదా..."* బృహస్పతి విద్యార్థుల పాత్రల్లో నీళ్ళు పోస్తూ ఆ చివరికి వెళుతున్న తారతో అన్నాడు.


*"భోజనం చేసి వెళ్ళమన్నాను స్వామీ ! అయితే , నీళ్ళు తెచ్చాక , నెమ్మదిగా భోజనం చేస్తానన్నాడు ! మీరు కానివ్వండి ! వచ్చాక. చంద్రుడూ , నేనూ భోజనం చేస్తాం !"* అంది. తార...


భోజనశాల గుమ్మంలో ఆగి , చంద్రుడు తటపటాయిస్తూ చూశాడు. ఎదురెదురుగా , దగ్గరగా రెండు విస్తర్లు వేసి ఉన్నాయి. ఒక విస్తరిలో పదార్థాలున్నాయి. *"రా ! చంద్రా ! ఆ విస్తరి నీదే ! నీ కోసమే వడ్డించి ఉంచాను !"*


గురుపత్ని కంఠం వినిపించి , చంద్రుడు తల తిప్పి చూశాడు. ఒక చేత్తో పాత్రా , మరో చేత్తో గరిటా పట్టుకుని వస్తోంది తార. విస్తర్ల దగ్గర ఆగి , తార తలతిప్పి చూసింది. చంద్రుడు గుమ్మం వద్దే ఉన్నాడు.


తార నవ్వు అతని చెవుల్ని తాకింది. *“ఏమిటి అలా చూస్తున్నావ్ ? నన్నా ! విస్తరినా !”*


*"మీరు... మీరు...మొదట..."* చంద్రుడు విస్తర్ల వైపు చూస్తూ అన్నాడు. *“మనిద్దరం కలిసి భోజనం చేస్తున్నట్టు మీ గురువుగారికి చెప్పాను. రా ! చంద్రా !”* తార కంఠంలో ఆజ్ఞ ధ్వనించింది.


చంద్రుడు విస్తర్ల వద్దకు అడుగులు వేశాడు. తార అతని వైపు చిరునవ్వుతో చూసింది. 


*"ఏమిటి చంద్రా , అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నావు ? అకలిగా లేదా ? నేనెంత ఆకలిగా ఉన్నానో తెలుసా ?"* తార నవ్వుతూ అడిగింది. *"కూర్చో”* చంద్రుడు కూర్చున్నాడు. తార అతని వైపే చూస్తోంది. *"ఒక్కక్షణం ! నేను కూడా వడ్డించుకుంటానేం ?"* అంటూ విస్తరి వైపు వంగింది.


ఎవరో లాగినట్లు ఆమె పైట భుజం మీంచి జారి ఆమె విస్తర్లో పడింది.


చంద్రుడు అప్రయత్నంగా తల ఎత్తి చూశాడు.


*"అరెరె... చూశావా... పైట ఎలా జారిపోయిందో. కొంచెం తీసి భుజం మీద వేయ్ చంద్రా !"* రెండు చేతుల్లోనూ ఉన్న పాత్రల్ని చూపుతూ అంది తార చిరునవ్వుతో.

శ్రీ కాళహస్తీశ్వర శతకం - 78



శ్రీ కాళహస్తీశ్వర శతకం - 78




మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే

సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ

జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!*హ




తాత్పర్యం:



శ్రీ కాళహస్తీశ్వరా! 

నేనింతవరకు ఎంతయో కొంత సేవించియున్నాను కదా. ఆ సేవను తలచియైనా  నాయందు దయ చూపుటకు ఆసక్తుడవు కమ్ము. 


నేను ఏమాత్రము శక్తి లేని దుర్బల మనస్కుడను. నేను ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టితినో తెలియదు. అజ్ఞానముచేత ఆ జన్మములలో చేసిన దుష్కర్మముల రాసులెన్ని కలవో భావన చేయలేను. 


ఇన్ని ఆలోచించని నేను ఈ జన్మము గూర్చి మాత్రమే ఆలోచించుచున్నాను. ఈ జన్మములో కూడ అజ్ఞానముతో ఎన్నియో దుష్కర్మములు చేసియున్నాను. 


జీవితమందు నాకు ఏవగింపు భయము కలుగుతున్నవి. నీవు కరుణతో ఈ జన్మము ఇంతలోనే ముగియునట్లు చేసి నాకు ముక్తి ప్రసాదించుము.



ఓం నమః శివాయ


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

వినాయక చవితి

 *వినాయక చవితి నిర్ణయం:-*

*18.9.2023 సోమవారం రోజునే వినాయక చవితి*


వినాయక చవితికి మధ్యాహ్నానికి చవితి తిథి వ్యాప్తి వుండాలి.  18.9.2023 సోమవారం రోజున ఉదయం గంటలు 9.58 ని.కు చవితి ఆరంభమై 19.9.2023 మంగళవారం రోజున ఉదయం గంటలు 10.28 ని.కు ముగుస్తున్నది.( మధ్యాహ్న కాలము- ఉదయం గంటలు 10.57 నుండి పగలు గం.1.23 వరకు ఉంటుంది). కనుక

 

*" శ్లో. చతుర్థీ గణనాథస్య , మాతృవిద్దా ప్రశస్యతే, మధ్యాహ్న వ్యాపినీ చేతస్యాత్పరతశ్చేత్పరేహని || "*

 అను ప్రమాణము రీత్యా మధ్యాహ్న వ్యాపినీ కర్మకాలము, తృతీయతో కలిసిన చవితి ప్రశస్తము కావున  తేదీ 18.9.2023 సోమవారం రోజుననే వినాయక చవితి పండుగను ఆచరించాలి


*- తెలంగాణ విద్వత్సభ*

Jantikalu


 

పంచాంగం 29.08.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 29.08.2023 Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల  పక్ష: త్రయోదశి తిధి భౌమ వాసర: శ్రవణా నక్షత్రం యోగ: తైతుల తదుపరి గరజి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


త్రయోదశి మధ్యాహ్నం 02:45 వరకు.

శ్రవణం రాత్రి 11:47 వరకు.

సూర్యోదయం : 06:05

సూర్యాస్తమయం : 06:28

వర్జ్యం : ఉదయం 06:12 నుండి 07:36 వరకు తిరిగి రాత్రి 03:17 నుండి 04:41 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:34 నుండి 09:23 వరకు తిరిగి రాత్రి  11:07 నుండి 11:53 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

Sree Gayatri Aug 23 magazine

https://drive.google.com/file/d/1KSDJbAdhwzo0KFevp_c84WbcyybY5Lki/view?usp=drivesdk 

Mantraalaya kshetra darsani

Mantralaya kshetra darsani 

అనుసరించవలసిన మార్గమని

 దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ। రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ॥ 1.1.97

 ఇదం పవిత్రం పాపఘ్నమ్ పుణ్యం వేదైశ్చ సమ్మితమ్। యః పఠేద్రామచరితమ్ సర్వపాపైః ప్రముచ్యతే ॥ 1.1.98 


 పై రెండు శ్లోకాలు అధ్యయనం చేస్తే.. స్పష్టమైన విషయం బయటపడుతుంది. శ్రీరాముడు కూడా దేవుడి పాత్ర ధారణ చేసి సాధారణమైన మానవుడిలా ధర్మ, భక్తి మార్గాన్ని సాధన చేసి నిరంతర బ్రహ్మైక స్థితిని పొంది, ఆ స్థితిలోనే సర్వ కార్య నిర్వహణ చేసి తన స్వస్థానానికి చేరాడు. ఈ మార్గాన్నే మనము అనుసరించవలసిన మార్గమని పెద్దలు చెబుతారు.🙏

అమ్మకడుపునుండి

 *సీసము*

అమ్మకడుపునుండి కమ్మంగనేర్చిన

   యమ్మవంటి కలిమి యాంధ్రభాష

ఆనందమందైన నావేశమందైన

  నావేదనందైన ననుగునైన

ఉత్సాహమందైన నుద్వేగమందైన

  కూర్మికైననుగాని పేర్మినైన

అంధులైననుగాని బంధుజనంబైన

   వితతమ్ము వాడెడి వెలుగు తెలుగు.

*ఆ.వె.*

ఎల్లవేళలందు నుల్లంబునందుండ

తెగడుచుండు జనుల తెగులు గాంచి

భావి చెరచ బడెడి బాలుర మదినెంచి

తల్లి వంటి తెలుగు తల్లడిల్లు.


*అందరికీ ప్రపంచ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు.*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మాయమైన మొండితనం

 *మాయమైన మొండితనం..*


ఒక శనివారం ఉదయం ఆరు గంటల వేళ..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు మా దంపతులము చేరాము..ఇది మాకు ఎప్పుడూ ఉన్న అలవాటే..ఆ సరికే అర్చకస్వాములు మందిరం లోకి వచ్చి, గణపతి పూజ, శివ పూజ, లక్ష్మీ నరసింహస్వామి పీఠం వద్ద పూజ పూర్తి చేసుకొని వున్నారు..ఒక్కొక్క అర్చకస్వామి తనకు నిర్దేశించిన దేవీ దేవతల మందిరాలకు వెళుతున్నారు..మరో గంట తరువాత కానీ..భక్తుల రాక మొదలుకాదు..ఎందుకంటే..మాలకొండలో ఉదయాన్నే ఆ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని మొగలిచెర్ల రావడానికి కనీసం ఆ సమయం పడుతున్నది..శనివారం కనుక, మా దంపతులము కూడా శ్రీ స్వామివారి సమాధిని కటకటాల ఇవతలి నుంచే చూసి నమస్కారం చేసుకొని వచ్చేసాము..


మరి కొద్ది సేపటిలోనే..ఒక కారు వచ్చి మందిరం ముందు ఆగింది..అందులోంచి ముగ్గురు వ్యక్తులు దిగారు..దంపతులిద్దరూ..వాళ్ళ కుమార్తె..మొత్తం ముగ్గురు దిగి..స్వామివారి మందిరం లోపలికి వచ్చి.."ఈరోజు స్వామివారి సమాధి వద్దకు పోవడానికి కుదరదు కదా..?" అని మా సిబ్బందిని అడిగారు.."అవునండీ...కుదరదు..కానీ శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద మీ గోత్రనామాలతో అర్చన చేస్తారు..కటకటాల నుంచి మీరు సమాధిని చూడొచ్చు.." అని మా సిబ్బంది చెప్పారు..వాళ్ళు అర్చన కొఱకు టికెట్ కొనుక్కొని..కొబ్బరి కాయ తీసుకురమ్మని బైట ఉన్న అంగడి వద్దకు తమ కారు డ్రైవర్ ను పురమాయించి..మేము కూర్చున్న చోటుకి వచ్చి కొద్దీ దూరం లో నిలుచున్నారు..ఆ దంపతులిద్దరూ చక్కగా సంప్రదాయానుసారంగా దుస్తులు ధరించి వున్నారు..ఎటొచ్చీ వాళ్ల కుమార్తె మాత్రం..ఆధునిక వస్త్రధారణ లో ఉన్నది.."ఏమండీ..వీళ్ళిద్దరూ చక్కగా బట్టలు కట్టుకున్నారు..ఆ అమ్మాయి వస్త్రధారణ కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నది..సరి చేసుకోమని చెపుదామని అనుకుంటున్నాను.." అని మా ఆవిడ అన్నది..నిజానికి వయసులో ఉన్న ఆ అమ్మాయి అటువంటి దుస్తులు వేసుకొని..అందునా పవిత్రమైన ఆలయాలకు రావడం చేయకూడదు..నా అభిప్రాయం నేను చెప్పేలోపలే..


"మీరు ఎక్కడినుంచి వచ్చారు..?" అని నా భార్య వాళ్ళను అడిగింది.."నెల్లూరు నుంచి వస్తున్నాము..మాలకొండ కు వెళ్లాలని ప్రయాణం అయ్యాము..మొగిలిచెర్ల ఊర్లో ఈ మందిరం తాలూకు బోర్డ్ చూసి..దగ్గరే కదా..ముందుగా చూసి పోదామని అనుకున్నాము..మా డ్రైవర్ ఈరోజు స్వామివారి సమాధి దర్శనం ఉండదు అని చెప్పాడు..పర్లేదు కనీసం చూడొచ్చు కదా అని వచ్చాము.." అని చెప్పారు..


"మీరేమీ అనుకోనంటే..ఒక మాట చెపుతాను..మేమిద్దరమూ మీకన్నా వయసులో పెద్దవాళ్ళం..మీరేమీ అనుకోవద్దు..మీరిద్దరూ సంప్రదాయబద్ధంగా వున్నారు..అమ్మాయి వేసుకున్న దుస్తులు బాగాలేవు..అమ్మాయి డ్రస్సు మార్చుకోమని చెప్పండి..చీర కానీ..పంజాబీ డ్రస్సు కానీ ధరించమనండి..ఈ పాంట్ షర్ట్ వద్దు..అందరూ అమ్మాయినే చూస్తున్నారు..డ్రస్సు మార్చుకోవడానికి మా రూముకు తీసుకువెళతాను..వేరే విధంగా భావించవద్దు.." అని నిర్మొహమాటంగా చెప్పేసింది..ఆ దంపతులు ఒకరినొకరు చూసుకున్నారు..అమ్మాయి వైపు చూసి.."విన్నావా..ఇంటి దగ్గర మేము మొత్తుకున్నాము..నువ్వు మొండి పట్టు పట్టావు..కనీసం ఇప్పుడన్నా కార్లో నుంచి డ్రస్సు తెచ్చుకొని ఆంటీ తో పాటు రూముకు వెళ్లి మార్చుకొని రా..మేము ఇక్కడే కూర్చుని ఉంటాము.." అన్నారు.."మీరే దర్శనం చేసుకోండి..నేను కార్లో ఉంటాను.."అని ఆ అమ్మాయి  చివ్వున వెనక్కు తిరిగి కోపంగా వెళ్ళిపోయింది.."మహా మొండితనం అండీ..ఒక్కటే కూతురు..తన మాటే నెగ్గాలనే పంతం..ఏ దేవుడు దాని మనసు మారుస్తాడో చూడాలి.." అని ఆ దంపతులు మాతో చెప్పి..పూజకు వెళ్లారు..పూజ చేయించుకొని..స్వామివారి సమాధి కి నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చారు.."మా అమ్మాయికి ఈ మొండితనం తగ్గిపోయి..మంచి దానిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము.." అన్నారు..


"అన్యధాభావించకండి..పెద్దదాన్ని కదా..అమ్మాయిని అలా చూసేసరికి వుండబట్టలేక మీతో అలా చెప్పాను.." అని మా ఆవిడ అన్నది..ఇద్దరూ తలా ఊపి వెళ్లిపోయారు..ఆ అమ్మాయి మాత్రం కారులోనే ఉండిపోయింది..


ఆరోజు సాయంత్రం నాలుగు గంటల వేళ..ఆ దంపతులు మళ్లీ మందిరానికి వచ్చారు..నేరుగా మేము కూర్చున్న చోటుకి వచ్చి.."మాలకొండ లో కూడా..ఆ లక్ష్మీనరసింహ స్వామిని  మేమిద్దరమే దర్శించుకొన్నాము..అమ్మాయి రాలేదు..కానీ తిరిగి వెళ్ళేటప్పుడు..మొగిలిచెర్ల దగ్గరకు రాగానే..అమ్మాయి ఈ స్వామివారి మందిరానికి పోదామని పట్టుబట్టింది..మీరు ఒప్పుకుంటే..మీ రూములో డ్రస్సు మార్చుకొని లోపలికి వస్తానని చెప్పింది..మాకే ఆశ్చర్యంగా ఉంది.."అన్నారు.."కారు తీసుకొని..మందిరం వెనుకాల ఉన్న మారూముకు రండి.." అని మా ఆవిడ వాళ్ళతో చెప్పింది..మరో పది నిమిషాల్లో..ఆ అమ్మాయి చక్కగా పంజాబీ డ్రస్సులో మందిరానికి వచ్చింది..బుద్దిగా తల్లిదండ్రుల తో కలిసి స్వామివారి విగ్రహం వద్ద ఆశీర్వచనం తీసుకొని..సమాధికి నమస్కారం చేసుకొని వచ్చింది.."ఏ దేవుడు దీని మనస్సు మారుస్తాడో అని ఉదయం వేదన పడ్డాము..సాయంత్రానికే మార్పు వచ్చింది..ఇదే మార్పు ఇలాగే కొనసాగాలని..స్వామిని వేడుకున్నాము..వెళ్లిస్తామండీ.." అని చెప్పి వెళ్లారు..


మరో ఆరు నెలలకు ఆ దంపతులు, వాళ్ళ అమ్మాయి ఒక గురువారం నాడు వచ్చారు.."అమ్మాయి పూర్తిగా మారిందండీ..మొండితనమే లేదు..మొన్న సంబంధాలు చూసాము..ఒకటి కుదిరింది..వచ్చేనెలలో వివాహం..ఒకసారి ఈ స్వామివారిని దర్శించుకొని వద్దామని అమ్మాయి చెప్పింది..అందుకే వచ్చాము.." అన్నారు.."చక్కగా కుందనపు బొమ్మలా ..లక్ష్మీ కళ తో ఉన్నావు..మొండితనం తగ్గిందా?.."అన్నది మా ఆవిడ..నవ్వుతూ తలవూపింది..


నిజానికి సమస్య చిన్నదే కానీ..ఆ దంపతుల కు అదే పెద్ద మనోవేదనగా ఉన్నది..స్వామివారి సమాధి వద్ద శాశ్వత పరిష్కారం లభించింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

సుగుణ రూపనగుడి

 సుగుణ రూపనగుడి 


ఇస్కాన్ సంస్ధ మీద కేసు పెట్టిన కిరస్థాని నన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇస్కాన్ సంస్థ


ఎన్నో దేశాలలో తమ కార్యక్రమాల ద్వారా #శ్రీకృష్ణతత్త్వా"న్ని ప్రచారం చేస్తోన్న "ఇస్కాన్" INTERNATIONAL SRI KRISHNA CONSCIOUSNESS సంస్థ యొక్క ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికని పోలాండ్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ నన్ అచ్చటి "వార్సా"  కోర్టులో జూలై 2011లో ఫిర్యాదు చేసింది. 


"కృష్ణుడు పదహారు వేల మంది గోపికలను పెళ్ళి చేసుకున్నాడు"

అలాంటి కృష్ణుని గురించి ప్రచారం చేయడం ద్వారా "ఇస్కాన్" సంస్థ బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తోంది, కాబట్టి ఆ సంస్థను నిషేధించాలి" అంటూ ఆ నన్ తన ఫిర్యాదులో పేర్కొంది.


న్యాయాస్తానంలో హాజరైన "ఇస్కాన్" ప్రతినిధి 


గౌరవనీయులైన మెజిస్ట్రేటు గారూ, క్రైస్తవంలో ఒక మహిళను నన్ గా నియమిస్తున్నప్పుడు ఆమెచేత ఏమని ప్రమాణం చేయిస్తారో ఒకసారి ఆ నన్ తో చెప్పించగలరా ? 

అని కోరగా అందుకు తిరస్కరించింది.


అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి న్యాయాధికారి అనుమతితో ఆ ప్రమాణాన్ని పైకి బిగ్గరగా చదివి వినిపించాడు.


క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఒక మహిళ నన్ గా మారుతున్నప్పుడు చేసే ప్రమాణం ఏమిటో తెలుసా ? 


"ఈమెను జీసస్ క్రీస్తుతో వివాహం జరిపించడ మైనది (The Nun is married to Jesus Christ)" అని.


అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి, "గౌరవనీయులైన మేజిస్ట్రేటుగారూ! 

శ్రీ కృష్ణుడు పదహారు వేలమందినే పెళ్ళి చేసుకున్నట్లు చెబుతారు.


కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది నన్ లు క్రీస్తును వివాహం చేసుకున్నవారిగా ప్రకటింపబడుతున్నారు గదా!


అంతే కాదు, వివాహమైన క్రైస్తవ స్త్రీ ధరించే ఉంగరం వంటిదే నన్ లు కూడా ధరిస్తారు గదా!

మరి క్రైస్తవ మతం పుట్టినప్పటి నుంచి చూస్తే ఇలాంటి నన్ ల సంఖ్యకి లెక్కేలేదు. 


మరి జీసస్ క్రీస్తుకు ఎంతమంది భార్యలు ? 


ఎవరు బహు భార్యాత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ? 


శ్రీ కృష్ణుడు, జీసస్ క్రీస్తు - వీరిలో ఎవరు శీలభ్రష్టుడు ? 


 "ప్రపంచంలోని నన్ ల పరిస్థితి ఏమిటి ?" అని ప్రశ్నించాడు.


దెబ్బకు  న్యాయాస్థానంలో "ఇస్కాన్" కు వ్యతిరేకంగా న్యాయస్థానములొ నన్ వేసిన కేసు కొట్టివేయడమైనది.

పదిమందికీ పంపండి వాస్తవాలను అందరికీ తెలియనీయండి.

జై హిందూ!


                                -------------------  శుభరాత్రి   ---------------------

బర్బరీకుడు

 "బర్బరీకుడు"


బర్బరీకుడు..! మహాభారతంలోని ఓ వింత పాత్ర… ఇదీ కృష్ణుడి మాయకే బలి..!!

ఎన్నిరకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు… మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక 

పాత్రలు దర్శనమిస్తాయి… కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి… 

కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భ్రమలో పడేస్తాయి… దాదాపు అన్ని 

ఉద్వేగాలకూ మహాభారతమే… మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ 

ఒకటి ఉంది… అతను పేరు బర్బరీకుడు..!


 బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన 

పేరు విని ఉంటారేమో… కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి… కృష్ణుడు తన 

కృష్ణ మాయ తో బలిగొన్న మరో మహాభారత పాత్ర ఇది…


నిజానికి భాగవతం 

అంటేనే కృష్ణుడి చరిత్ర అనుకుంటాం గానీ, నిజానికి భారతం నిండా కూడా కృష్ణుడే… 

తను లేనిదే భారతం లేదు… భారతం లేనిదే కృష్ణుడూ లేడు…


ఇంతకీ ఈ బర్బరీకుడు 

ఎవరు అంటారా..? అతను ఘటోత్కచుడి కొడుకు.

లక్క  ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ  అడవుల్లో హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు.

వాళ్ల కొడుకే ఘటోత్కచుడు… ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు 

మురు బిడ్డ మౌర్వి (అహిలావతి) ని పెళ్లాడతాడు… వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు… 

నిజానికి తను ఓ యక్షుడు… ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు…


రాజస్థాన్‌లో 

ఖటుశ్యామ్‌జీ పేరిట, గుజరాత్‌లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని… 

అక్కడి జానపదులు  ఈ పాత్రను గొప్పగా జనంలోకి తీసుకెళ్లారు…


 అతను  చిన్నప్పటి 

నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు… దేవీ ఉపాసకుడు కూడా… దేవి 

ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది… ఆ మూడు బాణాల్నే 

బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు… అందుకే తనను ‘త్రిబాణధారి’ అంటారు…

పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక… భారత చరిత్రలో 

ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ… బర్బరీకుడు ఆ 

యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు… వెళ్లే ముందు తల్లికి ఓ మాటఇస్తాడు… ‘‘ఒకవేళ 

నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే మాత్రం… నేను బలహీనుల పక్షాన 

నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను… ఓడిపోయేవారిని గెలిపిస్తాను’’… ధనుస్సు, నీలి 

గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు…


యుద్ధం ప్రారంభం కావటానికి 

ముందు ప్రతి యోధుడినీ కృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు… ‘నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని 

ఎన్నిరోజులలో ముగించగలవు..?’ ఇదీ ప్రశ్న… 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 

25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు… 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 

రోజులు పడుతుందని అర్జునుడు… ఇలా తలాఓరకంగా చెబుతారు… దూరంగా ఉండి 

ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు కృష్ణుడు… ఒంటరిగా తనను ఓ 

బ్రాహ్మణవేషంలో సమీపించి… ‘కృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ 

ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా..? అని అడుగుతాడు… నిజంగా నేను బరిలోకి 

దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు… కృష్ణుడు 

ఒక్కక్షణం దిగ్భ్రాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు… తన దగ్గర ఉన్న 3 

బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు… వాటి శక్తి వివరిస్తాడు…


నేను ఒక బాణాన్ని వేస్తే 

ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని, వాళ్లందరినీ గుర్తించి 

పెడుతుంది… (టార్గెట్స్‌ను ఐడెంటిఫై చేస్తుంది)… రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని 

రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది… మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను 

విడిచిపెట్టి, మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది… ఆ బాణాలు 

మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు… నేను నమ్మను, నేనే కాదు, ఈ 

సృష్టిలో ఎవడూ దీన్ని నమ్మడు… నమ్మలేడు అంటాడు కృష్ణుడు… బర్బరీకుడిలో 

క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది… ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి 

రాల్చేయగలవా అంటాడు కృష్ణుడు… చాలా సులభం అంటాడు బర్బరీకుడు… చేసి 

చూపించు అంటాడు కృష్ణుడు…


బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం 

కళ్లుమూసుకుంటాడు బర్బరీకుడు… ఈలోపు కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద 

దాచిపెడతాడు… ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది… చివరకు 

కృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది… ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా కృష్ణుడు…

 

నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది… అందుకే అదక్కడకు వచ్చింది, నీ పాదం 

తీసివేయి, లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది 

అంటాడు బర్బరీకుడు… తప్పనిసరై పాదం తీసేస్తాడు… మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న 

పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది… (రక్షింపబడాల్సినవి)… తరువాత బాణం 

ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది… ఆశ్చర్యంగా చూస్తాడు 

కృష్ణుడు… ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది… 

అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు… 

బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే, కౌరవపక్షాన చేరితే పాండవుల్నితాను 

కాపాడలేననీ గుర్తిస్తాడు… కలవరపడతాడు… ఒకవేళ భీముడి మనమడు కాబట్టి, 

పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది..? అందుకే దివ్యదృష్టిని సారించి, కొన్ని 

నిజాలు తెలుసుకుని, ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు…

ఏమోయీ, నువ్వు 

ఎవరు..? నువ్వు కూడా యుద్ధం చేస్తావా..?

నేను ఘటోత్కచుడి కుమారుడిని, యుద్ధం 

చూడాలని వచ్చాను, చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన 

నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను…

పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల 

సైన్యం మాత్రమే ఉంది… కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు… అంటే పాండవులే 

బలహీనులు కదా…

అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది…

అదే జరిగితే, వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు 

బలోపేతమవుతారు, కౌరవులు బలహీనులు అవుతారు కదా…

అవునవును, తిరిగి నేను 

కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది… కానీ దానివల్ల కౌరవులు బలోపేతులై తిరిగి 

పాండవులు బలహీనులు అవుతారు కదా… మరేం చేయుట..?


ఇక్కడే తను తీసుకున్న 

వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది… తన కారణంగానే మారిపోయే 

బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని, అటూఇటూ మారితే చివరకు 

ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి, ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే 

అనీ, విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది… కృష్ణుడి వైపు చూస్తూ 

ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా…


ముందు నాకు ఓ వాగ్దానం 

చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు కృష్ణుడు… 

అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు… అప్పుడు కృష్ణుడు తన 

నిజరూపాన్ని చూపిస్తాడు… తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు…

సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు… ‘‘యుద్ధాన్ని 

చూడాలనేది నీ కోరిక కదా… ఇంత భారీ జనహనన యుద్ధాన్ని ఓ అత్యంత సాహస 

వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం, నిన్ను మించిన యోధుడు లేడిక్కడ, 

నిన్నెవరూ హతమార్చలేరు, అందుకే నువ్వే నీ తలను తీసి, నాకివ్వు…’ అంటాడు 

కృష్ణుడు… నన్నే ఎందుకు బలి ఇవ్వాలి, ఇంతమంది యోధులు ఉండగా.., పైగా 

వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని ప్రశ్నిస్తాడు… అప్పుడు కృష్ణుడు 

ఇలా చెబుతాడు…


‘‘బర్బరీకా… నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి… భూమి మీద 

అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని 

ఓసారి దేవతలందరూ నా దగ్గరకు వచ్చారు… దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో 

మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను… ఇదంతా వింటున్న నువ్వు ‘ఈమాత్రం 

దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి..? నేనొక్కడిని చాలనా’ అని ఒకింత 

పొగరుగా మాట్లాడావు… దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు… 


‘ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు, 

మొట్టమొదట బలయ్యేది నువ్వే’ అని శపించాడు… అందుకే నీ బలి… అంతేకాదు, నీ 

శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు కృష్ణుడు… కానీ నాకు యుద్ధానికి చూడాలని 

ఉంది అంటాడు బర్బరీకుడు… ముందు నీ తలను ఇవ్వు అంటాడు కృష్ణుడు… 

అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు… కృష్ణుడు ఆ 

తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు…


యుద్ధం ముగిసింది… విజయగర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే 

కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు… వారిని బర్బరీకుడి తల దగ్గరకు 

తీసుకెళ్తాడు కృష్ణుడు… తన కథ చెబుతాడు… భీముడు విలపిస్తాడు…


 తరువాత 

కృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు… ‘‘వత్సా, ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణమేం 

జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే… నువ్వు చెప్పు, ఏం గమనించావో..?’’ స్వామీ, 

ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను 

హతమార్చడాన్ని చూశాను… మహాకాళి వేల నాలుకలతో పాపులను 

బలితీసుకోవటాన్ని చూశాను… ఆ మహాశక్తి, నువ్వు మాత్రమే యుద్ధ కారకులు, 

యుద్ధకర్తలు… మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే… అని 

సమాధానమిచ్చి, తన శాపం ముగిసిపోయి, తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ద్వలోకాలకు 

వెళ్లిపోతాడు… ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ..!

తెలుగు పద్య సౌరభం ****౦. *****

 *** తెలుగు పద్య సౌరభం ******* 


1* లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెఁ, బ్రాణంబులున్ /

 ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చెఁ, శ్రమంబయ్యెడిన్ /

 నీవేతప్ప నితఃపరం బెఱుఁగ, మన్నింపందగున్ దీనునిన్ / రావే యీశ్వర ! కావవే వరద ! సంరంక్షించు భద్రాత్మకా ! 

( బమ్మెర పోతనామాత్యులు , గజేంద్ర మోక్షణం, ఆంధ్ర మహా భాగవతం) ***** 


2* దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర / ద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ / గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం / ధర్వుల్ మానముఁ బ్రాణముంగొనుట తథ్యం బెమ్మెయిన్ గీచకా ! (

 విరాట పర్వము, ఆంధ్ర మహా భారతము, తిక్కనామాత్యులు) ***** 


3* ఎఱుకగలవారి చరితలు 

/ గఱచుచు సజ్జనుల గోష్ఠిఁ గదలక ధర్మం

 / బెఱుఁగుచు నెఱిఁగినదానిని / 

మఱవ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్.

 ( ఆంధ్ర మహా భారతము,నన్నయ) *****


4* దీనారటంకాల దీర్థమాడించితి. దక్షిణాధీశు ముత్యాలశాల. పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య. నైషధగ్రంధ సందర్భమునకు, పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి. గౌడడిండిమభట్టు కంచుఢక్క. చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ధ. పాదుకొల్పితి సార్వభౌమ బిరుద. మెటుల మెప్పించదో నన్ను నింకమీద. రావు సింగ మహీపాలు ధీవిశాలు. నిండుకొలువున నెలకొనియుండినీవు. సకల సద్గుణ నికురంబ ! శారదాంబ! ( శ్రీనాథ కవి చాటు పద్యం) ***** 


5* ఎక్కడి రాజ్యవైభవము లెక్కడి భోగము లేటి సంభ్రమం / బక్కట! బుద్బుదప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం / జిక్కి గణింపకుంటి, యుగసంధుల నిల్చియుఁగాలుచేతి బల్ / 

త్రొక్కుల నమ్మను ప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే! ( శ్రీ కృష్ణ దేవరాయలు, ఆముక్తమాల్యద) *****

 6* ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ! యొంటి జరించె దోటలే / కివ్వనభూమి , భూసురుఁడ, నేఁ బ్రవరాఖ్యుఁడఁ ద్రోవ తప్పితిన్ 

/ గ్రొవ్వున నిన్నగాగ్రమమునకుం జనుదెంచి, పురంబుఁ జేర నిం / 

కెవ్విధిఁగాంతుఁ, దెల్పఁగదవే తెరువెద్ది, శుభంబు నీ కగున్. ( అల్లసాని పెద్దన, మను చరిత్రము) *****

 7* జలజాతాసనవాసవాది సురపూజాభాజనంబై తన/ ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్ /

 దొలగం ద్రోచె లతాంగి, యట్లయగు, నాథుల్ నేరముల్సేయఁ బే / 

రలుకం జెందినయట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే

!( నంది తిమ్మన, పారిజాతాపరణ కావ్యం) ***** 

8* గోంగూర పచ్చడి పై కమ్మని చమత్కార పద్యం;---

 వెల్లుల్లి బెట్టి పొగిచిన 

/ పుల్లని గోంగూర రుచిని పొగడగ వశమా! 

 మొల్లముగ నూనె వేసుకు / 

కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా!

 ( గువ్వల చెన్న శతకం) తేది 29--8--2023, మంగళవారం, శుభోదయం.

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 10*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 10*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*సుధాధారసారైః చరణ యుగళాన్తః విగళితైః*

*ప్రపచం  సిఞ్చన్తీ పునరపి రసామ్నాయ మహసః |*

*అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయం*

*స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ||*



సాధకుడు గత శ్లోకంలో చెప్పినట్లు సహస్రా పద్మాన్ని కుండలినీ శక్తితో చేరగలిగినప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతాడు?


చరణయుగళాన్తః విగళితైః = అమ్మవారి పాదాల నుండి వెలువడుతున్న


 సుధాధారాసారైః = అమృతప్రవాహం


ప్రపంచం సిన్ఞంతీం = శరీరంలోని 72వేల నాడులను తడుపుతూ ఉంటుంది.


పునరపి రసామ్నాయ మహసః =  మళ్ళీ మళ్ళీ ఆ ఆనందామృత ప్రవాహం శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది.


రసః = ఆర్ద్రత,తడి, ఆనందానుభవము


మహసః = మహత్


కాంతి = జ్ఞాన కాంతి 


అవాప్య స్వాం ... కులకుండే కుహరిణి = ఆ విధంగా షట్చక్రములను ఛేదించి సహస్రార పద్మమునందు శివసాయుజ్య స్థానమైన, అమృత కాంతి తుల్యమైన చంద్రుడిని వీడి కుండలినీ శక్తి స్వస్థానమైన మూలాధార చక్రాన్ని మరల చేరుకుని, స్వస్వరూప జ్ఞానముతో సర్పము వలే చుట్ట చుట్టకుని నిద్రిస్తుంది.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹