మాతృభాష దినోత్సవ శుభాభివందనాలతో🌾🌻🌱🌾🌻🌱🌾
తెలుగు భాష పై ఇకనైనా కళ్ళు తెరవండి..!!
అమ్మ నేర్పేను మాతృభాష తెలుగు
నోట జాలువారే మొదటి పదమై వెలుగు
జానపదుని నోట రాగల గీతాలు శ్రావ్యమై సాగే
యాబై ఆరు అక్షరాలు సువర్ణ మాలగా కూర్బబడె...
శిల్పాల తోటలో అందమైన ఆకృతి పొంది
అలతి అలతి పదాలతో సుమధురముగా వినిపించే
సుందరమైన తెలుగనుచూ కొనియాడ బడే
పాటలై పరవళ్ళు తొక్కుతూ చెవుల నల్లా ఊరించే..
సాహిత్య సమరాంగణ లో విందు భోజనం చేసి
ఆంధ్రభోజుడికి ఆత్మ తృప్తి కలిగించే
తెలుగు పల్లకిలో రాజ్యమంతా విస్తరించే
భాషల్లో లెస్సగా విను వీధుల్లో పొలికేక వేసే..
కీర్తించి తరించిన కవులను ఎందరినో
కనకాభిషేకాలతో ఆలింగనము చేసుకొని ఆదరించే
తరగని అమృత మథనలో కావ్యాలెన్నో ఉద్భవించే
రాజ ఠీవిగా సాహిత్య వీధుల్లో సమర శంఖం పూరించే..
ప్రాచీన లిపిగా పరిఢవిల్లిన తెలుగు
కావ్య భాష ఘన కీర్తి నేలపై పొందుతూ
కూడలిగా అన్ని భాషలను కలుపుకొని పోతూ
అన్ని భాషలకు తోడు నీడగా నా భాషే నిలిచే..
ఇబ్బంది పడుతోంది నేడు విధిలేని పరిస్థితులు
వ్యామోహముతో పతనం వైపుకు జరుగుతుంది
ప్రాథమిక దశలోనే పిల్లలకు దూరమవుతూ
పర భాషలా కనిపిస్తుంది నా కన్నతల్లి నేడు పిల్లలకు..
నేడు నామమాత్రపు తెలుగు బోధనలు
మొక్కుబడిగా సాగుతున్న భాషా ఉద్యమాలు
అడుగడుగునా జరుగుతున్నాయి దుశ్చర్యలు
పాలించే ప్రభుత్వమే కిరాతక చర్యలు..
నా తెలుగు పట్టిన తెగులుకు కారకులు ఎవరు??
మారుతున్న పరదేశి పోకడలలో నలుగుతూ
తల్లిదండ్రుల వ్యామోహము రోజు రోజుకు పెరుగుతూ
ర్యాంకుల చదువుల్లో నానా అవస్థలు పడుతుంది..
విదేశాలలో నా తెలుగు విర్రవీగుతుంటే
స్వస్థలములో దిగజారి అవస్థలు పడుతుంది
మన భాషను మనం కాపాడుకునే బాధ్యత వచ్చింది..!!
మాతృభాష దినోత్సవ శుభాభివందనాలతో...
🌹🌹🌹🌹🌹🌹 💐💐🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి