*** తెలుగు పద్య సౌరభం *******
1* లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెఁ, బ్రాణంబులున్ /
ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చెఁ, శ్రమంబయ్యెడిన్ /
నీవేతప్ప నితఃపరం బెఱుఁగ, మన్నింపందగున్ దీనునిన్ / రావే యీశ్వర ! కావవే వరద ! సంరంక్షించు భద్రాత్మకా !
( బమ్మెర పోతనామాత్యులు , గజేంద్ర మోక్షణం, ఆంధ్ర మహా భాగవతం) *****
2* దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర / ద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ / గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం / ధర్వుల్ మానముఁ బ్రాణముంగొనుట తథ్యం బెమ్మెయిన్ గీచకా ! (
విరాట పర్వము, ఆంధ్ర మహా భారతము, తిక్కనామాత్యులు) *****
3* ఎఱుకగలవారి చరితలు
/ గఱచుచు సజ్జనుల గోష్ఠిఁ గదలక ధర్మం
/ బెఱుఁగుచు నెఱిఁగినదానిని /
మఱవ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్.
( ఆంధ్ర మహా భారతము,నన్నయ) *****
4* దీనారటంకాల దీర్థమాడించితి. దక్షిణాధీశు ముత్యాలశాల. పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య. నైషధగ్రంధ సందర్భమునకు, పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి. గౌడడిండిమభట్టు కంచుఢక్క. చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ధ. పాదుకొల్పితి సార్వభౌమ బిరుద. మెటుల మెప్పించదో నన్ను నింకమీద. రావు సింగ మహీపాలు ధీవిశాలు. నిండుకొలువున నెలకొనియుండినీవు. సకల సద్గుణ నికురంబ ! శారదాంబ! ( శ్రీనాథ కవి చాటు పద్యం) *****
5* ఎక్కడి రాజ్యవైభవము లెక్కడి భోగము లేటి సంభ్రమం / బక్కట! బుద్బుదప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం / జిక్కి గణింపకుంటి, యుగసంధుల నిల్చియుఁగాలుచేతి బల్ /
త్రొక్కుల నమ్మను ప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే! ( శ్రీ కృష్ణ దేవరాయలు, ఆముక్తమాల్యద) *****
6* ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ! యొంటి జరించె దోటలే / కివ్వనభూమి , భూసురుఁడ, నేఁ బ్రవరాఖ్యుఁడఁ ద్రోవ తప్పితిన్
/ గ్రొవ్వున నిన్నగాగ్రమమునకుం జనుదెంచి, పురంబుఁ జేర నిం /
కెవ్విధిఁగాంతుఁ, దెల్పఁగదవే తెరువెద్ది, శుభంబు నీ కగున్. ( అల్లసాని పెద్దన, మను చరిత్రము) *****
7* జలజాతాసనవాసవాది సురపూజాభాజనంబై తన/ ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్ /
దొలగం ద్రోచె లతాంగి, యట్లయగు, నాథుల్ నేరముల్సేయఁ బే /
రలుకం జెందినయట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే
!( నంది తిమ్మన, పారిజాతాపరణ కావ్యం) *****
8* గోంగూర పచ్చడి పై కమ్మని చమత్కార పద్యం;---
వెల్లుల్లి బెట్టి పొగిచిన
/ పుల్లని గోంగూర రుచిని పొగడగ వశమా!
మొల్లముగ నూనె వేసుకు /
కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా!
( గువ్వల చెన్న శతకం) తేది 29--8--2023, మంగళవారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి