🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 10*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*సుధాధారసారైః చరణ యుగళాన్తః విగళితైః*
*ప్రపచం సిఞ్చన్తీ పునరపి రసామ్నాయ మహసః |*
*అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయం*
*స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ||*
సాధకుడు గత శ్లోకంలో చెప్పినట్లు సహస్రా పద్మాన్ని కుండలినీ శక్తితో చేరగలిగినప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతాడు?
చరణయుగళాన్తః విగళితైః = అమ్మవారి పాదాల నుండి వెలువడుతున్న
సుధాధారాసారైః = అమృతప్రవాహం
ప్రపంచం సిన్ఞంతీం = శరీరంలోని 72వేల నాడులను తడుపుతూ ఉంటుంది.
పునరపి రసామ్నాయ మహసః = మళ్ళీ మళ్ళీ ఆ ఆనందామృత ప్రవాహం శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది.
రసః = ఆర్ద్రత,తడి, ఆనందానుభవము
మహసః = మహత్
కాంతి = జ్ఞాన కాంతి
అవాప్య స్వాం ... కులకుండే కుహరిణి = ఆ విధంగా షట్చక్రములను ఛేదించి సహస్రార పద్మమునందు శివసాయుజ్య స్థానమైన, అమృత కాంతి తుల్యమైన చంద్రుడిని వీడి కుండలినీ శక్తి స్వస్థానమైన మూలాధార చక్రాన్ని మరల చేరుకుని, స్వస్వరూప జ్ఞానముతో సర్పము వలే చుట్ట చుట్టకుని నిద్రిస్తుంది.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి