17, అక్టోబర్ 2024, గురువారం

వాంతులు తగ్గుటకు సులభ ఔషధ యోగాలు -

 వాంతులు తగ్గుటకు సులభ ఔషధ యోగాలు  -


 *  వాంతులు బాగా అయ్యేప్పుడు లేత కొబ్బరినీరు త్రాగితే అవి నిశ్చయముగా ఆగిపోవును .


 *  తుంగముస్తలు , శృంగి , పిప్పళ్లు సమభాగాలుగా తెచ్చి చూర్ణము చేసుకుని తేనెతో సేవించుచున్న వాంతులు కట్టును .


 *  నిమ్మకాయ రసంలో తినేసోడా వేసి పొంగువచ్చిన వెంటనే త్రాగిన వాంతులు కట్టును .


 *  వెలగాకు రసం తాగిన వాంతి కట్టును .


 *  శొంఠి , నేలతాడి సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి కలుపుకుని ఆ చూర్ణం లోపలికి తీసుకొనుచున్న వాంతులు కట్టును .


 *  వాము , ధనియాలు , జీలకర్ర సమాన భాగాలుగా తీసుకుని వేయించి ఆ చూర్ణం కషాయంలా కాచి తీసుకొనుచున్న వాంతులు తగ్గును.


 *  పుదీనా ఆకులు పచ్చడిగా చేసి తింటున్నా వాంతులు తగ్గును. వాంతి వస్తున్న సమయంలో కొంచం నోటిలో వేసుకొనుచున్న వాంతి తగ్గును.


 *  నోట్లొ కొంచం దాల్చినచెక్క ముక్క వేసుకొని రసం మింగుచున్న వాంతులు తగ్గును.


 *  జీలకర్ర నమిలి మింగుచున్న వాంతులు తగ్గును.


 *  పూటకి ఒక మారేడు పండు తినుచున్న వాంతులు త్వరగా తగ్గును.


       పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా ఉన్నదో చూసుకుని దానిని పాటించండి.


    గమనిక  - 


  ప్రతిరోజూ ఈ ఔషదం తో పాటు బార్లీ గింజల నీటిని కూడా తాగడం వలన ఇంకా తొందరంగా మీ సమస్య నుంచి బయటపడతారు.

 


 మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కర్త భగవంతుడా

 *♿కర్త భగవంతుడా ? నేనా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి?* 


ఈ ప్రశ్నకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా తీసుకోవచ్చు.


*కర్తను నేను అని తలిస్తే...*


శరీరంతో నామంతో ఉన్న "నేను" కర్తను అని తలిస్తే  అన్నిటికీ మూలకారణం "నేనే.",  "నేనే" చేస్తున్నాను, నేను లేకపోతే ఏమి ఉండదు, నా వల్లే ఇదంతా జరుగుతుంది. మొదలగు భావాలు కలిగి నేను కర్తను అని తలిస్తే...నేను సుఖాన్ని అనుభవిస్తాను, కష్టాన్నీ కూడా నేనే అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ భగవంతుని ప్రమేయం ఉండదు.నాకు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు ఏ విధంగాను సహాయ పడడు. అదేవిధంగా నాకు సుఖాలు వచ్చినప్పుడు భగవంతుడు అడ్డుపెట్టడు. 


*నేను కర్తను కాను, కర్త ఆ భగవంతుడే అన్నప్పుడు...*


ఇక్కడ సాక్షిత్వం, శరణాగతి వస్తాయి. చేసేది అంతా ఆయనే, నాచే చేయిస్తున్నాడు ఈ కార్యంతో లేదా ఈ వ్యవహారంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు అంటే, మంచి జరిగినా చెడు జరిగిన ఆ ఫలితాలు అన్ని ఆయనవే... ఇక్కడ కేవలం సాక్షి భూతంగా మాత్రమే ఉంటాను. ఇంకా చెప్పాలి అంటే భగవంతుని యొక్క ఉపకరణంగా ఉంటే నేను దేహ పరంగా ఏ విధమైన ఆలోచన చేయకుండా ప్రతీ వ్యవహారం ఆయనే చేయిస్తున్నాడు, అన్న ఆలోచనతో లేదా భావంతో చేస్తే ఫలితం నేను పొందవలసిన అవసరం ఉండదు.  ఇక్కడ కూడా సుఖదుఃఖాలు వస్తాయి కానీ ఆ ఫలితాలు భగవంతుడికి వెళతాయి. 


నేను అనగా శరీరంతో ఉన్న నేను ఎప్పుడైతే మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధితో భగవంతునికి శరణాగతి చెందుతానో నా బాగోగులు అన్ని ఆయనే చూసుకుంటాడు ఇక్కడ కష్టం అనేది రాకుండా భగవంతుడు చూసుకుంటాడు ఎలా అంటే, ఏమి చేసినా ఆయనకు చెప్పి ఆయన అంగీకారం తీసుకుని ఆయన చెప్పిన విధంగా నడిచినప్పుడు. 


మరి భగవంతుడు మనకు కనబడుడు కదా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు, ఆ భగవంతుని స్థానంలో నీ గురువుని లేదా నీ తండ్రిని చూసుకో అప్పుడు వారు చెప్పినప్పుడు వారు చెప్పినట్లు నీవు ఆచరించినప్పుడు నీకు సుఖం వస్తే నీవే అనుభవిస్తావు. నీకు కష్టం వస్తే ఆ భగవంతుడు లేదా ఆ భగవంతుడు రూపంలో ఉన్న గురువు లేదా తండ్రి అడ్డుపడతాడు. ఇది సూత్రం.  దీని అర్థం చేసుకొని ముందుకు వెళుతూ జీవితం సాగిస్తే,జీవితం  ఆనందదాయకం లేకపోతే దుఃఖకరమైన జీవితంగా ఉంటుంది.


*నాకు తెలిసినంతవరకు అర్థం చేసుకుంటున్నాను. నా అన్నవారు మీ అందరికీ అందిస్తున్నాను. ఆనందంగా జీవిద్దాం.*


         - SHREE SWAMI NARAYAN


  (Source: Manasasarovaram Group)


     🙏 *సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు*


                 Sharing is Caring

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

171024-2.    నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀016. పరమాచార్య పావన గాధలు…



           *వైదిక యజ్ఞం - జీవహింస*

                      ➖➖➖✍️


1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. అడయార్ థియోసొఫికల్ సొసైటి ఆధ్వర్యంలో శాకాహార సదస్సు జరిగింది. 


ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. 


కారణమేదైనప్పటికి జంతువులను చంపడం పాపం అని తీర్మానించారు. 


కాబట్టి మాంసాహారాన్ని వదలి అందరూ శాకాహారులుగా మారాలి అని చెప్పారు. అహింస, శాఖాహార ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. 


ఆ సదస్సు ముగిసిన తరువాత థియోసొఫికల్ సొసైటి అధ్యక్షుడు 

శ్రీ శంకర మీనన్ కొంతమంది పాశ్చాత్యులని పరమాచార్య స్వామివారి  అనుమతితో వారి దర్శనానికి తీసుకుని వచ్చారు. 


స్వామి వారిని కలవాలని 

ఆ ప్రతినిధులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. 


శంకర మీనన్ అందరిని పేరు ఊరుతో సహా స్వామి వారికి పరిచయం చేసారు. 


వారిని పరిచయం చేసిన తరువాత స్వామివారి గురించి వారికి చెప్పబోతుండగా మహాస్వామి వారు వారించి, “నా గురించి నువ్వు ఏమి చెప్పనవసరం లేదు. నా గురించి వాళ్ళకు తెలిసింది చాలు!” అని అన్నారు. 


కొంతమంది ప్రతినిధులు స్వామి వారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నారు. 


స్వామి వారు దానికి అంగీకరించగానే మొదటగా వచ్చిన ప్రశ్న “వైదిక యజ్ఞాలలో ఇచ్చే జంతుబలి ఎలా సమర్థిస్తారు? అది పాపం కాదా?”


అందుకు మహాస్వామి వారు “అవును అది చేయతగినదే. అది పాపం కాదు!” అని బదులిచ్చారు. 


ఇది వినగానే వారందరూ ఫక్కున నవ్వారు. స్వామివారిని అవమానపరిచారు అని మీనన్ గారికి కోపం వచ్చింది. వారివైపు తిరిగి ఆవేశంతో, “నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చింది స్వామి వారి ఆశీస్సులకోసం! 

మీరు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తారు అని తెలిసుంటే నేను ఈ పనికి పూనుకునేవాణ్ణి కాదు!” అని అరిచారు. 


స్వామివారు మీనన్ ను శాంతపరిచారు. “వాళ్ళపై కోప పడవద్దు. వారు ఒక స్పష్టతతో ఇక్కడికి వచ్చారు. జీవహింస పాపం అని అది ఏ కారణానికి అమోదయోగ్యం కాదని నిర్ధారణకు వచ్చారు. కాని నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వలన వాళ్ళు నవ్వారు. నన్ను అవమాన పరచాలని వాళ్ళకు ఆలోచన లేదు. మనం వారికి అర్థం అయ్యే లాగా సమాధానం చెప్పాలి” అని శాంతంగా చెప్పారు. 


మీనన్ కోపం తగ్గిన తరువాత మళ్ళా స్వామి వారు ఇలా చెప్పారు “ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు. కోర్టు ఆ విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణ శిక్ష విధిస్తుంది. ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంలో ఒకణ్ణి చంపాడు. మరి అతణ్ణి కోర్టు ఉరితీయడం జీవహింస కాదా? మరి న్యాయమూర్తి చేసినది పాపం కాదా?”


స్వామి వారి మాటలు వారిని ఆలోచనల్లో పడేసాయి. వారు చాలా విద్యావంతులు. సత్యప్రమాణములైన మాటలు స్వామి వారు చెప్తున్నారని అర్థం చేసుకుని వారి మాటలు వినడానికి ఉత్సాహం చూపారు. 


మరలా మహాస్వామి వారు “నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఆంబులెన్స్ వస్తే, అందరిని ఆపి ప్రాణాలు నిలబెట్టే ఆంబులెన్సును ముందు పంపిస్తాము. అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది. 


వేరొక సందర్భంలో ఒక ఆంబులెన్సు, ఒక అగ్నిమాపక వాహనం వచ్చాయనుకుందాం. అప్పుడు ముందు అగ్నిమాపక యంత్రాన్ని పంపిస్తాం. అంటే ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు గొప్పవి. 


మరొక్క సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనం, అత్యవసరంలో ఉన్న మిలటరి వ్యాను వస్తే ముందు మిలటరి వ్యానును పంపిస్తాం. కొంతమంది ప్రాణాల కంటే దేశ రక్షణ గొప్పది. కాబట్టి అలాంటి సందర్భంలో దేశరక్షణ కోసం కొంతమంది ప్రాణాలను లెక్కచెయ్యము.

 

రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమందిని చంపుతాడు. ఒకర్ని చంపితేనే మరణదండన విధిస్తే, మరి ఆ రాజుకు ఎన్ని మరణ దండనలు విధించాలి? కాని యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటారు. ఈ అన్ని సంఘటనల్లో మనం జీవహింసను అమోదిస్తాం. 


ఇలాంటి నియమాలన్నీ మనం ఏర్పరుచుకున్నవే. అలాగే యజ్ఞాలలో ఇచ్చే జంతుబలులు పాపం కాదు. ప్రపంచశాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం కాదని వేదాలు ఘోషిస్తున్నాయి.


వేదం అపౌరుషేయం. అది పరమాత్ముని ఊపిరి కాబట్టి ఈశ్వరునకు వేదాలకు అభేదం లేదు. 


వేదము శాశ్వతము, సత్య ప్రమాణము. ‘శాస్త్రాయ చ సుఖాయ చ’. వేదాలు, శాస్త్రాలు మంచినే బోధిస్తాయి. జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు. 


దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః।

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ॥


మనం యజ్ఞ యాగాదులను చేసి దేవతలను సంతృప్తి పరిస్తే, దేవతలు మనకు సకాల వర్షమును మంచి జీవితాన్ని ఇస్తారు. 


కాబట్టి వైదిక యజ్ఞములలో చేసే జీవహింస సరిఅయినదే. దాని వల్ల పాపము లేదు. అంతేకాదు. సనాతన ధర్మంలో యజ్ఞము చేయుట హింస, పాపము అని కూడా చెప్పబడింది కాబట్టి చేయకూడదు. కాని ఎవరు చేయకూడదు అనే విషయం మనం తెలుసుకొని ఉండాలి. 


వ్యాస భగవానుడు రచించిన భాగవతంలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానము ఉంది. 


‘ప్రాచీన బర్హి’ అను ఒక రాజు ఉండేవాడు. అతనికి ఆచార్యకాండ యందు విపరీతమైన అభిమానం మక్కువ. కాబట్టి లోకక్షేమం కోసం తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు. తరువాత అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయాడు. అటువంటి స్థితి పొందిన వాడు ఆ స్థాయిలో ఉన్న సన్యాసి యజ్ఞయాగాదులు చెయ్యరాదు. కాని అతనికి వాటిపైన ఉన్న ఇష్టం వల్ల చేస్తున్నాడు. నారదమహర్షి వచ్చి అతనికి  జ్ఞానోదయం కలిగించాడు. అప్పటినుండి అతను యజ్ఞయాగాదులు మానేసాడు. 


కాబట్టి, “ఏది హింస, ఏది కాదు, ఎవరు ఏమి చెయ్యాలి?, ఏమి చెయ్యకూడదు” అని చెప్పవలసినవి వేదాలు మాత్రమే, నువ్వు నేను కాదు. 


మనకు వేదమే ప్రమాణం. చెట్లకు కూడా ప్రాణం ఉందని ఈరోజు అందరికి తెలుసు. విత్తనం నుండి మొలకెత్తి చెట్టుగా మారి మళ్ళా ఎన్నో విత్తనాలను ఇస్తుంది. కాబట్టి విత్తనాలు తినడం కూడా హింసే. 


కాయగూరలు, ఆకుకూరలు కూడా జీవహింస కదా. అందుకే సన్యాసులు కూరగాయలు కూడా తీసుకోరు. జ్ఞానులు ఎండుటాకులు, నీరు, గాలి తీసుకుని బ్రతికేవారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. 


కాబట్టి వీటన్నిటి వల్ల మనకు తెలిసేదేమంటే కేవలం ఋషులు, సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరూ పాటించలేరు. 


కాబట్టి అహింస అనేది వారి వారి ఆశ్రమాన్ని బట్టి పాటించాలి. కాబట్టి గృహస్తు చేసే యజ్ఞయాగాదుల వల్ల జరిగే హింస పాపం కాదు. ఇది వేదప్రమాణం. కాబట్టి ఈ నియమాలను మనం ఉల్లంఘించరాదు.✍️

--- థిల్లైనాథన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥


#KanchiParamacharyaVaibhavam #

 "కంచిపరమాచార్యవైభవం"!!!🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

కాశీ క్షేత్రంలో మరియు కార్తీక మాసం

  మహాదేవ హర హర మహాదేవ జై శ్రీ రామ్ అందరికీ ఒక చిన్న విన్నపము కాశీ క్షేత్రంలో మరియు కార్తీక మాసం అనగా రేపు మొదలవుతుంది మళ్ళీ వచ్చే వారం వరకు కార్తీకమాసం ఇక్కడ కాశీ క్షేత్రంలో విశేషమైనటువంటి పూజలు మరియు అభిషేకాలు వ్రతములు మరియు దీక్ష ప్రయాణం ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నదానంలో మరియు గంగా స్థానం పిండ ప్రధాన అస్తికలు నిమర్జనం ఇవన్నీ కూడా జరుగుతాయి మరియు రూమ్ అకామిడేషన్ ఫుడ్ మరియు యాత్రికులు తీసుకువెళ్లి తీసుకురావడం దర్శనాలు ఇవన్నీ కూడా సదుపాయం చేయడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వారు మాకు మా నెంబర్ కి సంప్రదించగలరు హర హర మహాదేవ జై శ్రీరామ్ అరుణాచలేశ్వర శర్మ కాశీ పురోహితులు కాంటాక్ట్ నెంబర్ 9989183846🙏🙏🙏🙏🙏🙏🙏🙏

వాల్మీకి మహాఋషిం

 ఓం శ్రీ మాత్రేనమః

ఓం శ్రీ గురుభ్యో నమః

17-10-24


కవి వాల్మీకి మహాఋషిం దలచెదన్  క్రాంతి ప్రద స్ఫూర్తితో

స్తవనీయమ్మగు రీతి రామచరితన్ శ్రావ్యప్రధానమ్ముగా

నవచైతన్యము విశ్వమందునను నందంజేయగా ధర్మమున్

ఛవితో గూర్చిన స్రష్టకే నిడుదునిచ్ఛా శక్తి కైమోడ్పులన్


వల్మీకమ్మున పుట్టినట్టి కవిరాడ్ వాల్మీకికి న్భక్తితో

కల్మింజాటగ నెంచి రామచరితన్ క్రాంతిప్రద స్ఫూర్తితో 

తాల్మిన్ గూర్చిన యట్టి ఆది కవి నే ధ్యానించి చిత్తమ్మునన్

కేల్మోడ్పుల్ వినుతించి చేసెదను నా గీర్వాణికిన్ సన్నుతుల్ ౹౹


రామాయణ కావ్యమ్మును

ధీమతి రచియించినట్టి ధీపతికిసదా

నామానసమున ప్రార్థన

లామహనీయుని దలచుచు నర్పింతు నతుల్



వాల్మీకి జయంతి సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలతో


డా.రఘుపతి శాస్త్రుల

రామాయణం

 భారత సంస్కృతి లో రామాయణం పాత్ర ఎంతో ఉంది.  రామాయణం అధ్యయనం చేసినవారి మనోనిశ్చలత అసాధారణమైనది. ఎందరో కవులు వివిధభాషలలో రామాయణాన్ని తమదైన భాణిలో రచించినప్పటికి వాటన్నిటిలో వాల్మీకి రామాయణానిదే పెద్దపీట. వాల్మీకి రామాయణం ఆమూలగ్రం పఠిస్తే కలిగే మానసిక ప్రశాంతతను ప్రత్యక్షంగ అనుభవిస్తే కానీ తెలియదు.  


మన దురదృష్టవశాత్తు రామాయణం పై మంచి అభిప్రాయంతో పాటు అపోహలు కూడ బలంగానే ప్రచారంలో ఉన్నాయి. అసలు రామాయణంలో ఉన్నదేమిటో తెలియకపోవటంతో చెప్పినవన్నీ లేక చదివినవన్నీ నమ్మే స్థితిలో ఈ తరంవారు తప్పుదారి పడుతున్నారు.


నిత్యం పరుగులతో నిండిపోయిన ఈ జీవితశైలిలో సుమారు 24 వేల శ్లోకాలను చదవటమంటే మాటలు కాదు.  పైగ అది సంస్కృతంలో ఉన్నవాయె.  రామాయణం పై సరైన అవగాహన లేకపోవటానికి ఇదికూడ ఓ కారణం కావొచ్చు. వీటన్నిటికి పరిష్కారంగ వాల్మీకి రామాయణం ఆధారంగ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పరచబడినది. 


రోజుకో సందేశమనే నిబద్ధతతో, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ల గొడవలు ఏమాత్రంలేకుండ కేవలం వాల్మీకి రామాయణం ఆధారంగ క్రమపద్దతిలో సందేశాలు పంపబడుతాయి.  సరళమైన తెలుగులో ఈ సందేశాలు ఉండటం ఓ ప్రత్యేకత. ఉదయమే సందేశాలు పంపబడుతాయి కాబట్థీ మీ వీలును బట్టి రోజులో ఏ సమయంలోనైన చదువుకోవచ్చు. అంతే కాక నిత్యరామాయణ పారాయణ చేసే మరెందరో పెద్దలు వారు అనుభవంతో చేసే వ్యాఖ్యలు కూడ చాలా ఉపయోగకరంగ ఉంటాయి.


ఆసక్తి ఉన్నవారు చేరటానికి లింకు  ఇవ్వబడింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది.  పూర్తి స్థాయి సందేశాలు మొదలవటానికి మరో 2 లేక 3 రోజులు పట్టొచ్చు. మీ స్నేహితలను, కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించొచ్చు.


జై శ్రీరామ్.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం - పూర్ణిమ - రేవతి -‌‌ గురు వాసరే* (17.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వానలు వచ్చునప్పు

 ఉ॥

వానలు వచ్చునప్పు డొకభంగి తుఫానులు వచ్చి గూల్చు నా 

వానలు వోవుచున్ మరొకభంగిని గూల్చు నెమ్మెయిన్ 

వానలు మేలుసేయు నొక పద్ధతి వచ్చిన వేళ నా 

వానలె కీడుసేయు మన పద్ధతి తప్పిన వేళ తప్పకన్ 

*~శ్రీశర్మద*


కం.వర్షములు గురియ సతతము

కర్షకులకు మేలొదవును కలిమి యొనర్చున్

హర్షము జనములు గన ప్రతి

వర్షము వర్షములు గురియ వర్ధిల్లగనౌ


కం.జలమున సంపద లెసగును

కలవరమును బాపు జనుల కాంక్షలు దీరున్

పలు విధముల నిల నెలవగు

కలిమికి మాగాణి జలము కలుగుటయ కవీ🙏🙏🙏🙏🙏