ఓం శ్రీ మాత్రేనమః
ఓం శ్రీ గురుభ్యో నమః
17-10-24
కవి వాల్మీకి మహాఋషిం దలచెదన్ క్రాంతి ప్రద స్ఫూర్తితో
స్తవనీయమ్మగు రీతి రామచరితన్ శ్రావ్యప్రధానమ్ముగా
నవచైతన్యము విశ్వమందునను నందంజేయగా ధర్మమున్
ఛవితో గూర్చిన స్రష్టకే నిడుదునిచ్ఛా శక్తి కైమోడ్పులన్
వల్మీకమ్మున పుట్టినట్టి కవిరాడ్ వాల్మీకికి న్భక్తితో
కల్మింజాటగ నెంచి రామచరితన్ క్రాంతిప్రద స్ఫూర్తితో
తాల్మిన్ గూర్చిన యట్టి ఆది కవి నే ధ్యానించి చిత్తమ్మునన్
కేల్మోడ్పుల్ వినుతించి చేసెదను నా గీర్వాణికిన్ సన్నుతుల్ ౹౹
రామాయణ కావ్యమ్మును
ధీమతి రచియించినట్టి ధీపతికిసదా
నామానసమున ప్రార్థన
లామహనీయుని దలచుచు నర్పింతు నతుల్
వాల్మీకి జయంతి సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలతో
డా.రఘుపతి శాస్త్రుల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి