25, ఏప్రిల్ 2024, గురువారం

గురువు అష్టకం

 *🙏💐 గురువు అష్టకం💐🙏*

తెలియనంతవరకు దూరమే! తెలిస్తే దగ్గరే!

🪴🍀🪴🍀🪴🍀🪴🍀

భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే అని చెప్తారు కదా! 


"దూరాత్‌ దూరే అంతికే చ!'' అంటుంది వేదం. అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది. అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది.


పెళ్లీడుకొచ్చిన పిల్లకి తల్లిదండ్రులు సంప్రదాయాననుసరించి సన్నిహిత బంధువుల పిల్లవాడిని పెళ్ళికి ఎంపిక చేస్తారు. కాని ఆ పిల్ల ఒప్పుకోక అందరి కన్నా శ్రేష్ఠుడినే వరిస్తానంటుంది. తల్లిదండ్రులు ప్రక్కకి తప్పుకొంటారు.


అందరి కన్నా ఉన్నతుడు రాజే కాబట్టి తాను రాజుని తప్ప ఇంకెవరినీ పెళ్లాడనంది ఆ పిల్ల. అప్పట్నుంచి రాజుని వెంబడింపసాగింది. ఒకనాడు పల్లకిలో పోతున్న రాజుకి దారిలో సన్న్యాసి కనబడితే, దిగి ఆయనకి ప్రణామాలు చెప్పి తన ప్రయాణం కొనసాగించాడు. దీనినంతా గమనించిన ఆ పిల్ల ''అందరి కంటే రాజే గొప్పవాడను కొన్నాను, పొరబడ్డాను. ఆయన కంటే సన్న్యాసి ఎంతో గొప్పవాడు. కాబట్టి నేను సన్న్యాసినే పెళ్లాడుతాను'' అనుకొని సన్న్యాసి వెంటపడింది.


ఒకనాడు సన్న్యాసి ఒక రావిచెట్టు క్రింద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కారం పెట్టటం చూచింది. ఆ పిల్ల, తన అభిప్రాయాన్ని మళ్లీ మార్చుకొంది. సన్న్యాసి కంటె ఉత్తముడు వినాయకుడని ఆయననే వివాహమాడటానికి నిశ్చయించుకొంది. సన్న్యాసిని విడిచి, వినాయకుని ఎదుట కూర్చొంది.


చెట్టుక్రింద ఉన్న విగ్రహం కావటం వల్ల అక్కడ గుడి లేదు. ఎవ్వరూ వచ్చేవారు కారు. ఒకనాడు అటుపోతున్న ఒక కుక్క ఆ విగ్రహం పై కాలెత్తి అది చేసే పని అది చేసింది. ఆ విగ్రహం కంటె గొప్పదనుకొని ఆ పిల్ల కుక్క వెంటబడింది. ఆదారిన పోతున్న ఒక పిల్లవాడు ఆ కుక్కపై రాయిని విసిరి గాయపరచాడు. ఆ బాధకి అది ఇంకా వేగంగా పరుగెత్తటం మొదలు పెట్టింది. దీనినంతా గమనిస్తున్న ఒక యువకుడు ఆ మూగజీవిని ఊరికే కొట్టిన పిల్లవాడిని చివాట్లు వేశాడు. ఆ పిల్లవాడిని మందలించిన యువకుడే అందరికంటె గొప్పవాడనుకొంది ఆ పిల్ల. అతనినే వివాహమాడుతానంది. ఇంతకూ, ఆ యువకుడు ఎవరో కాదు - తల్లిదండ్రులు ఎంపిక చేసిన వాడే! ఎక్కడో ఉన్నాడనుకొన్నవాడు సమీపానే ఉన్నాడు. అదీ కథ.


''ఈశ్వరుడెక్కడో ఉన్నాడని దేశమంతా వెతుకుతున్నావు. ఎరుగనంత వరకు నీకు ఆయన దూరస్థుడే. ఎంత వెతికినా కనబడడు. నీకు దగ్గరే ఉంటాడు. అన్నిటి కంటే దూరంగా, అన్నిటి కంటే దగ్గరగా ఉంటాడు'' అంటుంది వేదం.🙏


🙏💐🌹🌴🌹💐🙏

ఒకప్పుడు

 ❤️*మన బాల్యం*❤️


ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు..!

ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు. 

నిద్రలోనూ భగవంతునికి మొక్కులే! 


ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.


ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు 

అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే.. వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.


ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..!కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..!


రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు. వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు. 

ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ.. మొదట అపనమ్మకంతో థర్డ్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ ..!


నెంబర్ లేకపోయే సరికి , సెకండ్ క్లాస్ ఆపై మనకు అంత సీను లేదులే అనుకుని ఫస్ట్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..


హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.


ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..


ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం.


ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.


ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..


ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..


స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల పంపకం..

ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..!


కట్ చేస్తే..!


ఇప్పుడు..! ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..?? 


ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!


అంతా నిర్లిప్తత..పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న


ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?


ప్చ్..!


చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.


చదివే యంత్రాలవుతున్నారు..ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..


విద్యార్థులు మాయం అవుతున్నారు..


మిషన్లులా మిగులుతున్నారు..  


ఈనాటి పరిస్థితులు తప్పక మారాలి..!


ఒకసారి కాలం వెనక్కి వెళిపోతే ఎంత బాగుణ్ణు . చిన్న అత్యాశ 😍😍😍

నలుగురు పతివ్రతా మూర్తుల గురించి

 అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా

పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌.


అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి ఈ ఐదుగురు పుణ్య మాత మూర్తులను రోజూ స్మరించినట్లయితే మహాపాతకాలు కూడా నాశనమవుతాయని ఈ శ్లోక భావం.


. ఈ నలుగురు పతివ్రతా మూర్తుల గురించి తెలుసుకుందాం.


అహల్య గౌతమ మహర్షి భార్య..!

ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. 

ద్రౌపదీ..పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య

 ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు.


 మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. 


సీతాదేవి!


వాల్మీకి మహర్షే శ్రీ రామాయణాన్ని ''సీతాయాశ్చరితం మహత్‌''

అని వెల్లడిచేశారు.

క్షమ..దయ...ధైర్యం...వివేకం...ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర 'సీత'. ఆమె లేనిదే రామాయణం లేదు.

ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గ హిణిగా మెలిగిన మహాసాధ్వి 'సీతాదేవీ'. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పడు భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. రావణ చరలో బందీ అయినప్పటికీ కూడా తన భర్తపై కల వాత్సల్యాన్ని ప్రేమను వదులుకోలేదు. రావణ వినాశనానికి, ధర్మ స్థాపనకు కారణం అయింది. దయాశాలి, అభిమానవతి, క్షమాగుణి, ధైర్యశాలి అయిన సీతామాత గుణగణాలను రామాయణంలో అడుగడుగునా వాల్మీకి మహర్షి ఎన్నో సందరాÄలేలో చెప్పారు.


తారాదేవి!


వాలి భార్య తారాదేవి. సుగ్రీవుడి భార్యను వాలి చెరబట్టి, అతన్ని రాజ్యబహిష్క్రుతున్ని చేసినప్పుడు అది తప్పని వాలికి చెప్పింది. అన్నదమ్ములు కలహించుకుంటే రాజ్యానికి చేటని హితవు చెప్పింది. కానీ వాలి వినలేదు. దాంతో రామబాణానికి నేలకొరిగాడు. మరణించిన పతిదేవుని చూసి తాను కూడా చనిపోతానని తన పతిభక్తిని చాటుకుంది. ధర్మం ప్రకారం సుగ్రీవున్ని రాజ్యానికి రాజును చేసింది. కిష్కింధ రాజ్య పాలనకు మహారాణిగా తన సలహాలను చెప్పింది. రామకార్యానికి సుగ్రీవున్ని సమాయిత్తం చేసింది. మాటలు ఆచితూచి ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుంది అంటారు. కొన్ని ఘట్టాలు ఉదాహరణలు గా చూసి చాలా నేర్చుకోవాలి అని అనిపించక మానదు. ముఖ్యం గా సుందరకాండలో హను మంతుల వారు మాట్లాడిన తీరు, వాలి భార్య తార మాట్లాడే తీరు చదివితే తెలుస్తుంది. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలుతిని పోయినవాడు మరల తిరిగి వచ్చి, సింహనాదం చేస్తూ వుంటే వాలిని వెళ్ళవద్దని, బలమైన కారణం వున్నది కనకే సుగ్రీవుడు తిరిగి వచ్చాడని నిశిత పరిశీలనతో చెబుతుంది. హెచ్చ రిస్తుంది. వాలి వినడు చని పోతాడు. ఆతర్వాత కూడా రామకార్యం మరిచి పోయాడని సుగ్రీవుడిపై కోపగించిన లక్ష్మణుడిని తన సంభాషణా చాతు ర్యంతో చల్లపరుస్తుంది. ఆమె ఆ సమ యంలో చెప్పిన మాటలు చూడండి. చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమా, నేనూ దక్కాము. భోగాలనుభవిస్తున్నా, రాముని పని మానలేదు సుమా' అంటూ మాటాడగల్గిన చతుర తార . ఇలా తారాదేవి ప్రస్తావన రామాయణంలోని సుందరకాండలో అదుÄతేంగా వివరించబడి ఉంది.


మండోదరి దేవి!!


రామాయణం జరగడానికి కీలకమైన వ్యక్తులలో ఒకరు రావణాసురుడు. అతడు ఎంతటి శివభక్తుడైనా సరే పరస్త్రీని వాంఛించడం అనే ఒకే ఒక్క దుర్గుణం వల్ల నాశనమైనాడు. అతడి భార్యే మండోదరి దేవి. రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత. మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఈమెకు పుట్టిన కొడుకు పేరు ఇంద్రజిత్తు. మండోదరి దేవి మిక్కిలి సౌందర్య రాశి. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమేగాదు అంతస్సౌందర్యం కూడా కలిగింది. అందుకే సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు రావణుడితో కూడి ఉన్న ఈ స్త్రీరత్నాన్ని చూసి ఆమే సీతాదేవి అనుకున్నాడు కూడా. రావణాసురుడు సీతమ్మని అపహరించి తెచ్చినప్పుడు పరస్త్రీ వ్యామోహం వద్దని, నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని రావణాసురునికి బోధించింది. రావణాసుర వధానంతరం భర్తతో పాటు ప్రాణత్యాగం చేయ డానికి సాహసించింది

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.25.04.2024

బృహస్పతివాసరే( గురువారము)

 *********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ చైత్ర మాసే కృష్ణ పక్షే 

ద్వితీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే( గురువారము)

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

చైత్ర మాసే కృష్ణ పక్షే ద్వితీయాయాం

గురు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.42

సూ.అ.6.13

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

చైత్ర మాసం 

కృష్ణ (బహుళ)పక్షం విదియ పూర్తి. 

 బృహస్పతివాసరే( గురువారము)

నక్షత్రం విశాఖ

రా.1.22 వరకు. 

అమృతం సా.4.03 ల 5.45 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 9.52 ల 10.42 వరకు.

దుర్ముహూర్తం మ. 2.53 ల 3.43 వరకు. 

వర్జ్యం ఉ. 5.49 ల 7.31 వరకు. 

వర్జ్యం రా. తె. 5.33 ల మరునాడు ఉ. 7.12 వరకు. 

యోగం వ్యతీపాత రా.తె.4.06 వరకు. 

కరణం తైతుల మ. 6.02 వరకు.   

కరణం గరజి మరునాడు ఉ. 6.22 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు.  

*********** 

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ విదియ. 

 **************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

మలబద్ధకం

 మలబద్ధకం గురించి వివరణ  - నివారణా యోగాలు . 


   మలబద్దకం అనేది సమస్తరోగాలకు మొదటి మెట్టు . మలం గాని ఆమం ( సరిగ్గా జీర్ణం కాని పదార్ధం ) వాతం వలన శుష్కించి ఉండలుగా గట్టి మలమార్గము నుండి సునాయాసంగా బైటకు వెడలకున్న యెడల ఆ వ్యాధిని మలబద్దకం అంటారు. ఆయుర్వేదం నందు ఈ వ్యాదికి            "ఆనాహము" అని పిలుస్తారు . 


           మలబద్దకం సమస్య వలన నడుము , వీపు నందు పట్టుకొని ఉండటం , కడుపునొప్పి , ఆయాసము , వాంతి వంటి లక్షణాలు వస్తాయి. దప్పిక , జలుబు , శిరస్సు నందు మంట , రొమ్ము పట్టినట్లు ఉండటం , తేన్పులు పైకి రాకుండా ఉండటం వంటి లక్షణాలు కొందరిలో కనపడతాయి. మలబద్దకం సమస్య పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలు వస్తాయి. 


         ఇప్పుడు మీకు మలబద్దకం నివారణాయోగాలు వివరిస్తాను . 


  నివారణాయోగాలు  - 


 * రాచ ఉశిరికాయ తినుచున్న సుఖవిరేచనం అగును. 


 *  కాకరకాయ కూరను తరచుగా తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. 


 *  ఎండిన ఎర్రరేగుపళ్ళు తినుచుండవలెను . 


 *  చింతపండు చారు అద్బుతముగా పనిచేయును . అతిగా తీసుకున్న విరేచనాలు కలుగచేయును . 


 *  బాగా పండిన అరటిపండు తినుచుండవలెను . 


 *  నాగజెముడు , బొంతజెముడు , ఆకుజెముడు రసము 10 చుక్కలు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. శరీర బలమును అనుసరించి 5 నుంచి 10 చుక్కలు తీసికొనవలెను . 


 *  విరేచనం ఇబ్బందిగా ఉన్నప్పుడు 4 చెంచాల ఆముదం కొంచం వేడిచేసి లోపలికి తీసికొనవలెను . ఆముదం తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నచో ఒక కప్పు గొరువెచ్చని పాలలో ఆముదం కలిపి తీసికొనవలెను . 


 *  రోజూ నిద్రపోయే ముందు రాత్రి సమయములో రెండు గ్లాసుల నీరు తాగుచున్న ఉదయం సుఖవిరేచనం అగును. ఇలా తాగడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే అవ్వొచ్చు లేదా రోజూ తాగుచున్న 4 రోజుల తరవాతి నుంచి వరస క్రమంలోకి వచ్చి సాఫీగా జరుగుతుంది. 


 *  సునాముఖి చూర్ణం చెంచాడు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. 


       మలబద్దకం సమస్య అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది.  ప్రస్తుత కాలంలో జంక్ పుడ్ తీసుకోవడం ఎక్కువ అయ్యింది . ఇది అత్యంత ప్రమాదకరమైన ఆహారం . వీలైనంత వరకు అటువంటి వాటి దూరంగా ఉండవలెను . ఋతువు మారినప్పుడల్లా కడుపును శుభ్రం చేసుకొనుటకు విరేచనం కలిగించే ఔషధాలు తీసుకొనుట అత్యంత ప్రధానం అయింది. 


           చాలా మంది ఉదయాన్నే విరేచనముకు వెళ్ళి తమకు సుఖవిరేచనం అవుతుంది . అనే అపోహలో ఉంటారు. రోజుకి రెండుసార్లు విరేచనమునకు వెళ్ళినప్పుడే ఆరోగ్యకరమైన మనిషిగా భావించవలెను .  మనం తీసుకునే ఆహారం కూడా మలబద్దకం సమస్య రాకుండా ప్రధానపాత్ర పోషిస్తుంది.  ముఖ్యముగా నీరుని తీసుకోవడం , లేత ముల్లంగి , మునగ ఆకులు , మునగకాయ  , కాకరకాయ , పొన్నగంటి కూర , ద్రాక్ష , వెల్లుల్లి , ఆవుపాలు , ఆముదము , ఉలవకట్టు , పాతబియ్యం , నెయ్యి , వెన్న తరచుగా ఆహారం నందు తీసుకోవాలి. పీచుపదార్ధాలు అధికముగా తీసికొనవలెను . పళ్లరసాలు కంటే పళ్లు తినటం మంచిది .  


        శరీరము నుండి వ్యర్థపదార్థాలు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లినప్పుడే శరీరం నందు టాక్సిన్స్ పోగుపడవు . శరీరం ఆరోగ్యకరంగా ఉండును.  


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

లక్షణాలని బట్టి మన శరీరతత్వం

 లక్షణాలని బట్టి మన శరీరతత్వం తెలుసుకునే ప్రాచీన వైద్య విధానం -


 * శరీరపు లక్షణం -


      వాతరోగి శరీరం నల్లగా ఉండును. పైత్యరోగి శరీరం పచ్చగా కాని , ఎర్రగాకాని ఉండును. శ్లేష్మరోగి శరీరం తెల్లగా ఉండును. ఏవైనా రెండురకాల తత్వాలు కలిగినటువంటి వారియొక్క శరీరం మిశ్రమ వర్ణంగా ఉండును.సన్నిపాత రోగి ( Typhoid ) శరీరం పాలిపోయినట్లు ఉండును.


 * శబ్ద లక్షణం - (నాడి లక్షణం ).


       వాత నాడి కలిగినవాడు నెమ్మదిగా మాట్లాడును . పైత్యనాడి కలిగినవాడు నవ్వుచూ 

తుళ్ళుతూ ఉండును. శ్లేష్మ నాడి కలిగినవాడు సన్నటి , వినివినపడనట్టు గా మాట్లాడును . 


 * నేత్ర లక్షణం -


        వాతరోగి కనులు నల్లగా కాని మబ్బుగా ఉండి నీరు కారుచుండును. పైత్యరోగి కన్నులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి కనులు పుసిగట్టి తెల్లగా ఉండును. సన్నిపాత రోగి కనులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. కామెర్ల రోగి కనులు పచ్చగా ఉండును.


 * మల లక్షణం - 


       వాతరోగి మలము నల్లగా గట్టిగా మేక పెంటికలు వలే ఉండును. పైత్య రోగి మలము పచ్చగా కాని , ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి మలము తెల్లగా , బంకగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు కలిసి ఉన్న రోగి మలము మిశ్రమ వర్ణంగా ఉండును.


 * ముత్ర లక్షణం -


         వాతరోగి మూత్రం తెల్లగా ఉండును. పైత్యరోగి మూత్రం కొంచం ఎరుపుగా ఉండును. కామెర్ల రోగి మూత్రం పచ్చగా ఉండును. శ్లేష్మరోగి 

మూత్రం తెల్లగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు పెరుగుట వలన రోగం కలిగిన రోగి మూత్రం మిశ్రమంగా ఉండును.


                  ఉదయాన్నే నిదుర లేచిన వెంటనే వెడల్పాటి తెల్లని పాత్రలో రోగి మూత్రమును పట్టి అందు నూనెచుక్క వేసిన అది వేగముగా మూత్రం అంతా పాకిన వాతరోగం అనియు , మూత్రం రక్తవర్ణంతో ఉండి మూత్రం వేచిన కదలక ఉండిన పైత్యరోగం అనియు , నూనెవేసిన వెంటనే ఆ నూనె చుక్క యందు బుడగలు లేచి మూత్రం పచ్చగా ఉండిన శ్లేష్మరోగం అనియు , మూత్రంలో వేసిన నూనె చుక్క తెల్లటి నురుగు కట్టిన సన్నిపాతరోగి అనియు , నూనె చుక్క వేసిన వెంటనే ఆ నూనె చుక్క ఏనుగు ఆకారంలో రావడం లేదా మనిషి ఆకారం వలేగాని తమలపాకు ఆకారం రావటం కాని లేక వేసిన వెంటనే మునిగిపోవడం గాని జరగడం లేదా మూత్రం నల్లగానో , ఎర్రగానో , పచ్చగానో ఉండిన ఆ రోగి యొక్క రోగం నయంచేయుట అసాధ్యం .


                నూనెబొట్టు పద్మాకారం గాని , శంఖచక్రాకారం గాని , వీణ ఆకారంగాని , సింహాసన ఆకారం కాని మల్లెమొగ్గ వలే ఉండిన ఆ రోగి యొక్క రోగం నయం చేయుటకు సాధ్యం అగును.


 * నాలిక యొక్క లక్షణం -


          నాలిక పగిలి పైన పోర పచ్చగా ఉండిన వాతరోగం అనియు నాలిక పైన ద్రవం కలిగి తెల్లగా ఉండిన శ్లేష్మరోగి అనియు నాలిక పైపొర రేగి నల్లగా ఉండి అసలు తడి లేకుండా ఉన్నచో సన్నిపాత రోగి అనియు మిశ్రమవర్ణం కలిగి ఉన్న రెండురకాల తత్వాలు ప్రకోపించుట వలన కలిగిన లక్షణం అని తెలుసుకొని చికిత్స చేయవలెను .


             పైన చెప్పిన లక్షణములు అన్నియు గమనించవలెను. ఒక్క నాడిని పట్టుకొని మాత్రమే రోగ నిర్థారణ చేయడమే కాకుండా రోగి యొక్క లక్షణాన్ని బట్టి వైద్యం చేయడం ప్రతి వైద్యుడు నేర్చుకోవలసిన ప్రధమ లక్షణం . నేను మీకు వివరించిన ప్రతిలక్షణాన్ని జాగ్రత్తగా పరిశీలించి గుర్తుపెట్టుకొన్న యెడల సమస్య ఉత్పన్నం కాకుండా మునుపే తగినజాగ్రత్తలు తీసుకొనచ్చు.


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కర్మఫలం

 శ్లోకం:☝️

*అవశ్యమనుభోక్తవ్యం*

  *కృతం కర్మ శుభాశుభమ్ ।*

*నాభుక్తం క్షీయతే కర్మ*

  *కల్పకోటిశతైరపి ॥*


భావం: చేసిన మంచి చెడు కర్మల యొక్క ఫలితాలను అనుభవించి తీరాలి. కోట్లాది యుగాలు గడిచినా కర్మఫలం అనుభవించక తప్పదు.

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 25.04.2024 Thursday 


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస కృష్ణ పక్ష: ప్రతిపత్తి తిధి బృహస్పతి వాసర: విశాఖ నక్షత్రం వ్యతీపాత యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పాడ్యమి ఉదయం 06:45 వరకు .

విశాఖ రాత్రి 02:21 వరకు. 

సూర్యోదయం : 05:57

సూర్యాస్తమయం : 06:31


వర్జ్యం : ఉదయం 06:38 నుండి ఉదయం 08:21 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:08 నుండి 10:59 వరకు తిరిగి మధ్యాహ్నం 03:10 నుండి 04:00 వరకు



అమృతఘడియలు : సాయంత్రం 04:56 నుండి 06:38 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార: