24, జనవరి 2024, బుధవారం

Panchang


 

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 8*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥 వేమన పద్యాలు-- 19*


*అండజముల బుట్టు నలరు ప్రాణులు కొన్ని*

*బుద్భుధముల బుట్టు పురుగు లెల్ల*

*స్వేదమునను బుట్టు జీవులు కొన్నిరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

కొన్ని ప్రాణులు గుడ్డు నుండి పుట్టును.

నీటి బుడగల నుండి పురుగులు పుడతాయి.

చమట నుండి కొన్ని జీవులు పుట్టును.


*💥వేమన పద్యాలు -- 20*


*అండం దప్పిన నరు డతి ధార్మికుని ఇల్లు*

*చేర వలయు బ్రదుక జేయు నతండు*

*యా విభీషణునకు నతి గారవంబున*

*భూతలమున రాము రీతి వేమ*


*🌹తాత్పర్యము ---*

విభీషణుని శ్రీరాముడు ఆదరించి గౌరవించినట్లు అండదండలు లేని మనిషి ధార్మికుని ఇంటికి వెళ్లవలెను.


*💥వేమన పద్యాలు -- 21*


*అండపిండము నడి బిందు వాత్మ జ్యోతి*

*యర్కు జ్యోతి సరసి జాండమందు*

*నాదబిందువులకు నడుమ నద్భుత జ్యోతి*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

ఓంకార నాదం , ఆత్మ జ్యోతి అధ్భుత జ్యోతిగా మానవుని అంతరాత్మ పరిశుద్ధము కావలెను.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 

*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అంతరార్థం

 🌸  *ఖాళీ .. అంతరార్థం*  🌸


వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు.

అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.

అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.

రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.


ఒకరు గురువుగారిని అడిగారు ....దైవీశక్తిని నేను చవి చూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి  ఇలా చెప్పారు


500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.... నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు....అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది.


ప్రత్యక్షానుభవం కలుగుతుంది..

కోటి ఆధ్యాత్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని చేయడం వలన కలుగుతుంది...అన్నారు.

అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడేగానీ,

ప్రాక్టికల్ గా సాహసం చేయలేకపోయాడు.


ఈ ఘట్టం విని ఓ గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు.

అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్ష చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా ప్రాక్టికల్ గా చేసి దైవీశక్తిని అనుభవించాడు.


తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు.....

కొందరు "అతడు పిచ్చివాడైపోయాడు" అని దూరమైపోయారు...

కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు.

అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక.

* * *

 వాస్తవానికి ప్రతి ఒక్కడు ఈ భూమ్మీదకు దిగంబరంగానే వచ్చాడు."ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు...


తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను, అనుభవాలను ఉచితంగానే పొందాడు..తిరిగి అందరినీ, అన్నిటినీ, చివరకు తనువును కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతాడు.


"ఖాళీ" అవడం తథ్యం....

కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా "ఖాళీ"గా ఉండడమే

"మెలకువలో నిద్ర".

భగవద్గీతలో చెప్పినట్టు- "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."

నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.

"ఖాళీ"గా ఉండడం. అదే యోగనిద్ర.


భగవద్గీత చరమశ్లోకంలో-

సర్వధర్మాన్ పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు.

సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నాడు.


ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి.

"ఖాళీ" అనేది పరానికి సంబంధించినది

* * *

"నేను లేని స్థితి సర్వసమ్మతము"

"తాను ఆహారమగుటయే"

అని భగవాన్ ఉన్నది నలుబదిలో ప్రస్తావించిన వాక్యాలు ఈ "ఖాళీ" ని ఉద్దేశించినవే.

* * *

శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత.

కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు,


అర్థరాత్రి...

ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని(మౌనాన్ని) అంధకారాన్ని(అభేదాన్ని)

ఆస్వాదించడమే కాళీమాత దర్శనం.


పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.


రాత్రయినా, పగలయినా వారిలో స్థితిభేదం ఉండదు.

వారు సదా "ఖాళీ"గానే ఉంటారు.


కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.

వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.

అహమిక "ఖాళీ" అయిపోవడమే జ్ఞానయోగం.


మాట్లాడుతూ వున్నా సరే

మౌనంగా ఉండగలిగే స్థితికి ఎదగాలి.


కరచరణాదులతో పని చేస్తూ వున్నా సరే

అచలంగా ఉండగలిగే స్థితిని అలవరచు కావాలి


నిజానికి తాను "ఖాళీ" అయిపోతే....

ఆ ఖాళీ ఖాళీగా ఉండదు...

ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది.

ఇదే "ఖాళీతత్త్వరహస్యం".


అదే ఇది....

ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం.

ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం.

ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.

శివానందలహరీ

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 68*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*అమితముదమృతం ముహుర్దుహంతీమ్*

*విమలభవద్పదగోష్ఠ మావసంతీమ్*

*సదయ పశుపతే సుపుణ్యపాకాం*

*మమ పరిపాలయ భక్తిధేనుమేకామ్ !!*



*తాత్పర్యము:*

 దయామయా! పశుపతీ అమితమైన ఆనందమనే పాలను మరల మరల ఇచ్చేదీ, నిర్మలమైన నీ పాదమనే పశువుల చావడి యందు నివసించుచున్నదీ, మంచి పుణ్యముల యొక్క పంటయైనదీ, భక్తి యనే ఒక గోవు నాకు వుంది. ఆ గోవును నీవు రక్షింపుము.


*వివరణ:*

శంకరుల వద్ద ఒక గోవు వుంది. అది భక్తి అనే గోవు. దానికి మూడు లక్షణాలు వున్నాయి.

1. అమితమైన ఆనందమనే పాలను పుష్కలంగా ఇస్తుంది.

2. నిర్మలమైన ఈశ్వరుని పాదములనే గోశాలలో నివసిస్తూ ఉంటుంది.

3. సుపుణ్యపాకము. అంటే పూర్వజన్మలలో చేసుకొన్న పుణ్యాలకు ఫలితంగా లభిస్తుంది.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

⚜ శ్రీ రఘునాథాలయం

 🕉 మన గుడి : నెం 307


⚜ హిమాచల్ ప్రదేశ్  : కులూ వ్యాలీ


⚜ శ్రీ రఘునాథాలయం



💠 కులు వ్యాలీలో అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి, అందుకే ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు.  

దసరా, శివరాత్రి, నవరాత్రి మొదలైన పండుగలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. 

కులు వ్యాలీ యొక్క ప్రధాన దేవత రఘునాథ్ లేదా శ్రీ రాముడు. 


💠 కులు లోయలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఇది ఒకటి.

రఘునాథ్ ఆలయం మొత్తం లోయకు అభిముఖంగా అద్భుతమైన కొండపై ఉంది. 

ఈ ఆలయంలో ప్రతిష్టించిన రఘునాథ్‌ విగ్రహం ఏ విధమైన చెడు నుండి లోయ మొత్తాన్ని కాపాడుతుందని నమ్ముతారు.  


💠 ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా ఇక్కడకు వచ్చే ప్రజల విశ్వాసం మరియు భక్తికి ఈ ఆలయం ప్రతిరూపం. 

ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు మరియు భారతదేశ సంస్కృతి మరియు విశ్వాసాల సమ్మేళనం అయిన ఈ పండుగలో భాగం కావడానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు మరియు సాధారణ పర్యాటకులు ఇక్కడకు వస్తారు. 


💠 ఈ ఆలయాన్ని 1651లో అప్పటి కులు లోయ రాజు రాజాజగత్ సింగ్ నిర్మించారు.  ఆలయ వాస్తుశిల్పం పహారీ మరియు పిరమిడ్ శైలిని మిళితం చేస్తుంది.  

ఈ ఆలయం సగటు సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎత్తులో ఉంది. 

ఆలయం తెల్లని పాలరాతితో నిర్మించబడింది.  ప్రధాన ప్రార్థనా మందిరం పైన, " విమానం" ఏర్పాటు చేయబడింది.  

ఈ ఆలయంలోని తెల్లని స్తంభాలు అందంగా చెక్కబడ్డాయి.


⚜ స్థల పురాణం ⚜


💠 త్రేతాయుగంలో, శ్రీరాముడు అశ్వమేధ యాగం కోసం తన చేతులతో ఈ రఘునాథుని విగ్రహాన్ని తయారు చేశాడు. 

యాగం పూర్తయిన తరువాత, శ్రీరాముడు దానిని తన రాజ్యంలో స్థాపించాడు. 

కానీ కుళ్లవి రాజు తన పాపాలను కడుక్కోవడానికి హిమాచల్‌కు తీసుకువచ్చాడు.


💠 ఈ కథ తన అహంకారంలో పెద్ద పాపం చేసిన రాజా జగత్ సింగ్‌కి సంబంధించినది. ప్రతిఫలంగా, అతను అలాంటి భయంకరమైన శాపం పొందాడు, అతను జీవించడం కష్టంగా మారింది.


💠 17వ శతాబ్దంలో కులు రాజాజగత్ సింగ్ పాలనలో ఉండేవారని చెబుతారు. 

ఒకరోజు గ్రామంలోని పండిట్ దుర్గాదత్ లోయలో పని చేస్తున్నప్పుడు కొన్ని వజ్రాలు మరియు ముత్యాలు దొరికాయని అతనికి సమాచారం వచ్చింది. 

రాజు అతన్ని పొందాలనుకున్నాడు. అహంకారంతో వాటిని పొందాలని నిర్ణయించుకున్నాడు.


💠 రాజు దుర్గాదుత్ నుండి ముత్యాలన్నింటినీ లాక్కొని ఖజానాలో వేయమని సైనికులను ఆదేశించాడు. సైనికులు కూడా వెళ్లి దుర్గాదత్తుని చాలా కొట్టారు కానీ వజ్రాలు, ముత్యాలు కనిపించలేదు. 


💠 రాజు దౌర్జన్యాలు హద్దులు మీరడంతో, దుర్గాదుత్త తన కుటుంబంతో సహా తన ఇంటికి తాళం వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి నిప్పంటించుకుని కుటుంబంతో సహా కాలిపోయాడు.


💠 చనిపోయే ముందు, రాజు ఎప్పుడు అన్నం తింటే, అతనికి బియ్యం గింజలకు బదులుగా కీటకాలు కనిపిస్తాయని దుర్గాదుత్త రాజును శపించాడు. తాగే నీరు రక్తంగా మారుతుంది అని. 

తర్వాత శాప ప్రభావం కనిపించి రాజుకు తినడానికి, తాగడానికి ఇబ్బందిగా మారింది.

రాజు చాలా బాధపడ్డాడు. 

అతని అహం చెదిరిపోయింది. 


💠 శాపానికి భయపడి,ఆ తర్వాత అతను కిసాన్ దాస్ జీ అని పిలవబడే ఫుహ్రీ బాబా ఆశ్రయం పొందాడు.  అయోధ్యలోని త్రేత్‌నాథ్ ఆలయం నుండి శ్రీరాముని విగ్రహాన్ని తీసుకురావాలని బాబా రాజుకు సలహా ఇచ్చారు.  బాబా సూచన మేరకు, త్రేత్ నాథ్ ఆలయ విగ్రహాన్ని దామోదర్ దాస్ దొంగిలించి 1651 లో కులూకి తీసుకువచ్చారు.


💠 రఘునాథ్‌జీ కోసం నిర్మించిన ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు మరియు రాజా జగత్ సింగ్ శాప విమోచనం మరియు వ్యాధిని నయం చేయడానికి చాలా రోజులు చరణామృతాన్ని సేవించారు.  అప్పటి నుండి అతను రఘునాథ్ జీ పాదాల వద్ద తన జీవితాన్ని అర్పించాడు మరియు 1651 నుండి ప్రతి సంవత్సరం దసరా వేడుకలు నిర్వహించబడుతున్నాయి.


💠 రఘునాథ్ టెంపుల్ కులులో దసరా వేడుకలు :

భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కాకుండా కులులో దసరా పండుగ జరుపుకుంటారు.  భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో, రాక్షస రాజు రావణుడు, అతని కుమారుడు మేఘనాథ్ మరియు రావణుడి తమ్ముడు కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.


💠 కులు వ్యాలీలో దసరా పండుగ వేడుకలు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ముగిసే రోజు ప్రారంభమవుతాయి.  శ్రీరాముడు రావణులను సంహరించిన విజయదశమి రోజున ఇది ప్రారంభమవుతుంది.  

ఈ సందర్భంగా జాతరలు నిర్వహిస్తారు మరియు ఈ సమయంలో అంతర్జాతీయ జానపద ఉత్సవాలు నిర్వహిస్తారు.  గృహోపకరణాలు, అలాగే ఉన్ని వస్త్రాలు, చెక్క హస్తకళలు మరియు ఈ ప్రాంతంలోని సాంప్రదాయ ఆభరణాల వస్తువులతో సహా స్థానిక వస్తువులను విక్రయించడానికి అనేక స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి.


💠 రఘునాథ్ ఆలయానికి ఎలా చేరుకోవాలి: 

కులు సిటీ సెంటర్ నుండి భుంతర్ విమానాశ్రయం సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఈ విమానాశ్రయానికి సిమ్లా, ఢిల్లీ మరియు చండీగఢ్ నుండి విమానాలు ఉన్నాయి. అదనంగా, మీరు కులు పట్టణం నుండి రఘునాథ్‌జీ ఆలయానికి చేరుకోవడానికి టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*24-01-2024 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది. సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.

---------------------------------------

మిధునం


నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది.

---------------------------------------

కర్కాటకం


 వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. సంఘంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

---------------------------------------

సింహం


 ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

కన్య


బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు  సత్ఫలితాలు ఇస్తాయి. గృహమున  శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.

---------------------------------------

తుల


ఇంటాబయట అనుకూల వాతావరణం  ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు  ఆశాజనకంగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం


కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది.

---------------------------------------

ధనస్సు


నిరుద్యోగులకు అధిక కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  ఉద్యోగాలలో  బాధ్యతలు మరింత అధికమౌతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. సంతాన  వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------

మకరం


నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

కుంభం


వ్యాపారాలలో  శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక  ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది.

---------------------------------------

మీనం


ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

రాశి ఫలితాలు

 *శుభోదయం*

16.2291923113

*****

24-01-2024

సౌమ్య వాసరః (బుధవారం )

రాశి ఫలితాలు

XXXXX

మేషం

ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం

వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది. సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.

---------------------------------------

మిధునం

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది.

---------------------------------------

కర్కాటకం

 వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. సంఘంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

---------------------------------------

సింహం

 ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

కన్య

బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు  సత్ఫలితాలు ఇస్తాయి. గృహమున  శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.

---------------------------------------

తుల

ఇంటాబయట అనుకూల వాతావరణం  ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు  ఆశాజనకంగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది.

---------------------------------------

ధనస్సు

నిరుద్యోగులకు అధిక కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  ఉద్యోగాలలో  బాధ్యతలు మరింత అధికమౌతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. సంతాన  వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

-------------------------------------

మకరం

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

-------------------------------------

కుంభం

వ్యాపారాలలో  శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక  ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది.

---------------------------------------

మీనం

ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలు*

 *టీఎస్‌ఆర్టీసీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలు* 


 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల(డిపో/ యూనిట్‌)లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులు నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది._ 


 *రీజియన్‌, ఖాళీల వివరాలు…* 


1. హైదరాబాద్ రీజియన్‌- 26

2. సికింద్రాబాద్ రీజియన్‌- 18

3. మహబూబ్ నగర్ రీజియన్‌- 14

4. మెదక్ రీజియన్‌- 12

5. నల్గొండ రీజియన్- 12

6. రంగారెడ్డి రీజియన్‌- 12

7. ఆదిలాబాద్ రీజియన్- 09

8. కరీంనగర్ రీజియన్- 15

9. ఖమ్మం రీజియన్- 09

10. నిజామాబాద్ రీజియన్- 09

11. వరంగల్ రీజియన్‌- 14


 *మొత్తం ఖాళీల సంఖ్య: 150* 


 *అర్హత* : బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి. 


 *వయోపరిమితి:* 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


 *శిక్షణ వ్యవధి:* మూడేళ్లు.


 *స్టైపెండ్:* మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000 చెల్లిస్తారు.


 *ఎంపిక విధానం* : విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


 *దరఖాస్తు విధానం:* 

దరఖాస్తు సమర్పణకు ముందు 

www.nats.education.gov.in  వెబ్‌సైట్‌లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాలి. 


 *ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది:* 16-02-2024.

 

బుద్ధిమంతుడైనవాడు

 🪷🕉️   *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪷

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


// *శ్లోకం* //  

*పరేషాం చాతి నిందాయాం*                       

*పరవిత్తే  పరస్త్రీయాం౹*

*సంసర్గే ఖల నీచాభ్యాం*

*నకుర్యా దీప్సితం సుధీః॥*


 - *_సంస్కృత సూక్తి సుధ_*


భావము -  *బుద్ధిమంతుడైనవాడు ఇతరులను నిందించకూడదు... ఇతరుల సొమ్ము కోసం ఆశ పడకూడదు....ప‌ర స్త్రీ తోను, దుష్టునితోను సహవాసం చెయ్యకూడదు*.....

స్ఫూర్తిదాయకమైన సందేశం

 *ॐ   అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం - బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ*


    శ్రీరామమందిరం ద్వారా, జాతికి శాశ్వతంగా స్ఫూర్తిదాయకమైన సందేశం అందితే, 

    రామరాజ్య స్థాపనకి మార్గం సుగమమం అవుతుంది. 

   "రామమందిరం" చిహ్నంగా, దాన్ని భావితరాలు, కాపాడుకొంటాయి. 

    రామరాజ్యం రావాలంటే, అయోధ్య కేంద్రంగా శ్రీరాముని రాజ్యానికి సంబంధించిన వాటిపై, మనకి అవగాహన కలగాలి. 

    మనం తెలుసుకొంటున్న విషయాలలో కొన్ని 

      

*రామరాజ్యం - విషయ అవగాహన -8*


*అయోధ్య - మంత్రుల సమర్థత* 


    అయోధ్యలో దశరథ మహారాజు పరిపాలనలో ఎనిమిది మంది మంత్రులు ఉండేవారు. 

ధృష్టి, 

జయంతుడు, 

విజయుడు, 

సిద్ధార్థుడు, 

అర్థసాధకుడు, 

అశోకుడు, 

మంత్రపాలుడు, 

సుమంత్రుడు. 


          *"ధృష్టి ర్జయంతో విజయ* 

           *స్సిద్ధార్థో హ్యర్థసాధకః I* 

           *అశోకో మంత్రపాలశ్చ* 

           *సుమంత్రశ్చాష్టమోఽభవత్ ॥"* 


* వారు తరువాత కూడా కొనసాగారు. రాజకీయ మార్పులు ఎలా ఉన్నా, వారు కొనసాగేవారు. 

   (ఇప్పటి IAS, IP, IFS, ... కార్యదర్శుల వ్యవస్థ అదే!) 


ఆ మంత్రులు (Secretaries), 


  - సమస్త వ్యవహారాలయందును సమర్థులు, 

  - తమ ప్రవర్తనకు సంబంధించి, రాజపరీక్షలలో నెగ్గినవారు, 


  - కోశాగారాన్ని నింపడానికై ధనాన్ని సమకుర్చడమందూ,

  - యోగ్యతలనుబట్టి వేతనాలను ఒసంగుచూ చతురంగ బలాలని సంరక్షించడమందూ 

    జాగరూకులై ఉండేవారు. 

 - జ్ఞానులకూ, రక్షణ వ్యవస్థ సిబ్బందికీ బాధ కలుగకుండా ధనాగారం నింపేవారు. 


  - శత్రువులనూ ఎదుర్కొనే వీరులు, 

  - సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండువారు, 

  - అయినా, శత్రువు నిరపరాధియయితే అతనిని దండించేవారు కాదు. 

  - అపరాధం చేసినవారు తమ కుమారులైనా కూడా, నిష్పక్షపాతంగా దండించేవారు. 


  - అపరాధుల యొక్క దోషాల తారతమ్యాలనుబట్టీ, 

    వారి శక్తి సామర్థ్యములను బట్టీ, 

    అపరాధరుసుములను, దండనలను విధించేవారు. 


  - రాజనీతిని అనుసరించి, శాసనాలను ఆచరణలో ఉంచేవారు.  


    మంత్రులందరూ త్రికరణశుద్ధితో ఏకగ్రీవంగా రాజవ్యవహారాలను నడుపుచుండేవారు. 

*("శుచీనామ్ ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతామ్")* 


    అర్హులై, నిజాయితీతో, స్వార్థరహితంగా, నిష్పక్షపాతంగా, పరిపాలనకు అందించే మంత్రాంగం, 

    ఏ దేశానికైనా, ఏ కాలంలోనైనా, అత్యంత ఆవశ్యకం కదా! 


    అయోధ్య కేంద్రంగా ఇక్ష్వాకు వంశీయుల ఆదర్శపాలనలో, 

    మంత్రుల భాగస్వామ్యం, 

    ఎంత ఆదర్శమైందో తెలియజేస్తూ, 


    మనం కూడా, ఆ విధంగా పొందవలసిన ఆవశ్యకత, ఎప్పటికీ గుర్తెరిగిస్తుంది కదా! 


                    జై శ్రీరామ్ 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి (24.01.2024) వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఆపత్కాలం..అన్నదానం..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఆపత్కాలం..అన్నదానం..*


"ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందీ?.." పోయిన సంవత్సరం మార్చి నెల మధ్యలో..

ఎటువంటి ఉపోద్ఘాతమూ లేకుండా..నేరుగా నేను కూర్చున్న చోటికి వచ్చి అడిగాడు మధ్యవయసులో ఉన్న ఆ వ్యక్తి..ఆ వచ్చినతన్ని ముందు కూర్చోమని చెప్పి..కుర్చీ చూపించాను..


"మీ పేరు?.." అన్నాను..


"నా పేరు చంద్రశేఖర్..నెల్లూరు దగ్గర మా ఊరు.." అన్నాడు.."ఒకప్పుడు బాగా సంపాదించానండీ..రొయ్యల సాగు చేసి మంచి లాభాలే గడించాను..కానీ గత మూడేళ్ళుగా కలిసి రాలేదు..సంపాదించిందంతా నష్టపోవడమే కాకుండా..పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాను..ఈ మధ్యనే మళ్లీ అప్పుచేసి చెరువుల్లో సీడ్ వేసాను..ఈ పంట చేతికొస్తే నేను నిలబడతాను..లేకుంటే మరణమే శరణ్యం..అంత ఇబ్బందుల్లో వున్నాను.." అన్నాడు..


అంత కష్టం లో వుండి కూడా అన్నదానం చేయిస్తానంటున్నాడు..అదే అర్ధం కాక.."మీరు స్వామివారికి మ్రొక్కుకొని వెళ్ళండి..మీ కష్టాలు తీరిన తర్వాత వచ్చి అన్నదానం చేయించవచ్చు..ఇప్పుడు ఎందుకు?.."అన్నాను..


"గత ఐదు వారాలుగా నేను ఈ మందిరానికి వస్తున్నాను..శ్రీ స్వామివారికి నా కష్టం చెప్పుకున్నాను..ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరగడం చూస్తున్నాను..నేనుకూడా ఒకవారం అన్నదానం చేయిస్తే..నా కష్టాలు తీరుతాయేమోనని ఒక భావన నిన్నరాత్రి కలిగింది..ఇంట్లో మా ఆవిడ కూడా ఒక వారం అలా చేయించండి..మంచి జరగొచ్చు అని చెప్పింది..అందుకోసం అడుగుతున్నాను..ఎంత ఖర్చు అవుతుందీ?.."అన్నాడు..


మళ్లీ కూడా చెప్పి చూసాను..తన కున్న కష్టాలు తొలిగిన తర్వాతే అన్నదానం చేయించమని..అంతవరకూ శ్రీ స్వామివారిని నమ్మకంతో కొలవమని కూడా చెప్పాను..కానీ చంద్రశేఖర్ పట్టు బట్టాడు..వచ్చే ఆదివారం నాడు తాను ఆ ఖర్చు భరిస్తాననీ..చెప్పడమే కాకుండా ఆ ప్రక్క ఆదివారం నాటి అన్నదానపు ఖర్చంతా తానే భరించాడు..


సరిగ్గా మూడు నెలల అనంతరం ఆ చంద్రశేఖర్ సంతోషం తో మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..వనామీ సాగులో మంచి లాభాలే వచ్చాయనీ..తనకున్న అప్పుల్లో ఎనభై శాతం తీరిపోయాయని..చెప్పుకొచ్చాడు..


అన్నదానం చేయించినందువల్ల చంద్రశేఖర్ కష్టాలనుంచి గట్టెక్కాడా?.. శ్రీ స్వామివారిని నమ్మినందుకు లబ్ది పొందాడా?..ఏమీ అర్ధం కాలేదు నాకు..అదే మాట అడిగాను..


"నా కష్టాలు తీరాలంటే..నా చేత అన్నదానం చేయించాలని శ్రీ స్వామివారే నాకు ఆ బుద్ధి పుట్టించాడని మీరెందుకు ఆలోచన చేయలేదు?.." అని ఎదురు ప్రశ్నించాడు..


నిజమే..ఎవరికి ఏది ఎప్పుడు ఎలా నిర్దేశించాలో శ్రీ స్వామివారికే తెలుసు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).