6, డిసెంబర్ 2022, మంగళవారం

వేదవిహితధర్మమే శ్రేయఃప్రాప్తిహేతువు

 వేదవిహితధర్మమే శ్రేయఃప్రాప్తిహేతువు

ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మ ద్వైతవాసనా, 

దుర్లభం త్రయ మేవైతత్ దైవాను గ్రహహేతుకమ్ || 

మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః, 

స్వవర్ణా శ్రమధర్మేణ తపసా హరితోషణాత్ || 

జ్ఞానముత్పద్యతే పుంసాంవైరాగ్యాది చతుష్టయం, 

తథాప్యనుగ్రహాదేవ తరుణేందు శిఖామణేః | 

అద్వైతవాసనా పుంసా మావిర్భవతి నాన్యథా|| 

మనుష్యత్వమూ, ముముక్షుత్వమూ, మహాపురుషుల సంశ్రయమూ యీ మూడూ దుర్లభములు, దైవానుగ్రహమే వీటికి హేతువు పరుషుల స్వవర్ణాశ్రమధర్మాల నాచరించడం వల్లా, తపోనిష్ఠచేతా, పరమేశ్వరుని ప్రీతుని చేయడంవల్లనూ, ఇహాముత్రఫలభోగ విరాగరూపమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు. 

''తరుణేందు శేఖరుడైన స్వామి అనుగ్రహం లేకుంటే అద్వైతవాసన పట్టుబడుదు.'' 

ఈశ్వరానుగ్రహంవల్లనే పురుషునకు పరమశ్రేయం దొరుకుతుందనియీవిధంగా ఆచార్యపురుషుల ఉపదేశములు, ఆప్తవాక్యములు భోధిస్తున్నవి. కనుక మనమందరం ఆ ఈశ్వరానుగ్రహంకోసం తీవ్రమైన యత్నం చేయవలసివుంది. సకల శ్రేయఃప్రాప్తికి ఆ యనుగ్రహమే కారణం. ఈశ్వరుడు మనకిచ్చిన ఆయుస్సంతటిని తదనుగ్రహ సంపాదనకోసమేవ్యయిస్తే సార్ధకమవుతుంది. ఇతర విధాల గడపిన ఆయువంతా వ్యర్థమే అవుతుంది. 

కాబట్టి, నీబ్రతుకు ఫలవంతం కావాలంటే స్వామిఅనుగ్రహంమీదనే దృష్టిని నిలిపివుంచు. ఈశ్వరానుగ్రహ సంపాదనాన్ని ఏమరి ఒక్కక్షణం గడపినా నీ బ్రతుకంతా నిరర్ధకమైవూరుకుంటుంది. మావనులందరు ఈశ్వరభక్తియం దోలలాడ వలెననీ, ఈశ్వరానుగ్రహం అందరిమీదా ప్రసరింపచేయవలెననీ సర్వదా స్వామి చరణకమల సన్నిధిని చేరి వేడుకో. ప్రతి మానవునియందు ఈశ్వరపదార్థం ఉండనేవుంది. కనుక భక్తులైనవారు సకలమానవులను ఒక్కరీతిగానే భావించవలసివుంటుంది. 

శ్రీ కామకోటిపీఠాన్ని ఏబదేండ్లుగా మేము సేవించితిమి. ఈ ఏబదేండ్లలో మేము చేసిన కార్యములను సింహావలోకనం చేయడంవల్ల అంతగా ప్రయోజనంలేదు. ఇకముందు కూడా పరమేశ్వరుడు మాకు ఏ కొంచెమో ఆయువు అనుగ్రహిస్తే దాని నెలా వినియోగించాలి? మాకు కర్తవ్యమేమిటి? అని విచారించుకోగా, నైష్కర్మ్య సంపాదనమే కర్తవ్యమని తేలుతున్నది. మరి భగవంతుడు గీతాశాస్త్రంలో నైష్కర్మ్యమంటే చేతులు ముడుచుకొని కూరుచుండటం కాదని పదేపదే సెలవిస్తూవచ్చారు. మీదుమక్కిలి కర్మాచరణంవల్లనే నైష్కర్మ్యం సిద్ధిస్తుందన్నారు. ఆకర్మ ఎంత తీవ్రమైనదో! ఏకర్మను ఆచరించడంవల్ల నైష్కర్మ్యసిద్ధి కలుగుతుందో? అని విచారించగా భగవత్పాదుల ఆజ్ఞయే గుర్తుకువస్తుంది. అందరికీ ఉపదేశిస్తున్న ఆయాజ్ఞనే మేమూ స్మరిస్తున్నాము. ''కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్యవిధియతా మపచితిః'' 'నీవంతుకు వచ్చిన కర్మను లెస్సగా ఆచరించు. అదే ఈశ్వరునకుతుష్టికూరుస్తుంది, అనేదే ఆ యాజ్ఞ. 

కాబట్టి ఎవరివంతుకు వచ్చినపని వారువారు లెస్సగా ఆచరించాలి. స్వస్వకర్మాను ష్ఠానమును మించిన ఈశ్వరపూజా, ఈశ్వరారాధనమూ లేదు. భగవదనుగ్రహ సంపాదన కదే మార్గము. ఎవరివంతునకువచ్చిన కర్మలనువారువారు అనుష్ఠించుతూ తద్వారా ఈశ్వరార్చనపరులమై శ్రేయమును సంపాదించు కొందాము. 

ఇతరులకు, మనకుకూడా శ్రేయంగూర్చే కర్మలనాచరించుట వల్లనే జన్మము చరితార్ధమగును. కడచిన ఏబదేండ్లలో మేము చేసిన పనులను అందలి లోపములను ఒకతూరి వెనుకకు పారజూచుకొన్నచో అది భావిజీవితానికి మార్గదర్శకం కాగలదు. కడచిపోయినదానిని గూర్చి వ్యర్ధముగా చింతించుచు గూర్చుండుటకంటె పాపపుణ్య వివేచనం చేసుకోగలిగితే అది దోషములనుండి కాపాడుతుంది. 

ఏపనియైనా ఇతరులను కూడగట్టుకొని చేస్తే ఫలప్రదమవుతుంది. అలా యితరుల సహాయముతో మే మీ చరమ జీవితమున ఏమి చేయవలసిఉంటుందో ఆలోచించుకోవాలి. లోకంలో ఎవ్వరికీ దుఃఖము, లోపము లేకుండా అందరూ సుఖం పొందవలెననే విషయం సకల దేశాలవారు, సమస్త మతములవారు అంగీకరించి, అందుకై ఎంతో కృషిచేస్తున్నారు. బహుజనులకు అత్యధికసుఖం చేకూర్చడమే మాకు ధ్యేయమని అన్ని పార్టీలవారూ చెబుతున్నారు. 

వేదవిహితమైన ధర్మాచరణంవల్లనే బహుజనులకు సుఖం లభిస్తుందని కనిపిస్తున్నది. శ్రేయఃప్రాప్తికి వేదవిహిత ధర్మమొక్కటే మార్గము. 

ఎందరో మహనీయులు శ్రేయఃప్రాప్తికి మార్గములు చెప్పియున్నారుకదా! అట్టి వారిని కాదని, ఒక్క వైదికధర్మమునే ఎందుకు ఆశ్రయించాలి అని కొందరు ఆక్షేపించవచ్చును. ఇందుల కొక్కటే సమాధానము. ఇతర మత కర్తలు చెప్పిన ధర్మాలన్నీ వేదములందే పరిశీలించిచూస్తేకనిపించుతవి. ఇతర ధర్మగ్రంధములన్నీ వేదములకు పిమ్మటనేపుట్టినట్లు చరిత్రవల్ల ఏర్పడుతున్నది. వేదములు చెప్పని ధర్మమూసత్యమూ అంటూలేదు. వేదము లెప్పుడు పుట్టినవో మనము నిర్ణయింపలేము. వేదకాల నిర్ణయము చేయబూనడం నష్టజాతకాన్ని గణించడంవంటిది. 

ఉదారము, నిర్మలమునైన మన వైదికధర్మమును అనుసరించకపోవడంవల్లనే మన మతము దుర్బలమై మనము కష్టనష్టముల పాలగుట తటస్థించినది. వైదిక ధర్మము తదనుయాయులను పరిశుద్ధులనుచేసి, ఈశ్వరానుగ్రహపాత్రులను గావింపగలదనీ, ఇతరమతములు పుట్టకమున్నే వైదికధర్మం లోకమంతటికీ మేలుగూర్చే మార్గం ఉపదేశించిందనీ మనం గ్రహించి ఇతరులకు తెలియచెప్పవలసివుంది. వేదములయం దేమాత్రమోభక్తిగల మన కందరకు ఇది విహితమైన పని. సమస్తమునకు మూలకందమైన వేదముల నాశ్రయించినచో శాఖలయందు వినవచ్చే భేదమర్మములన్నీ సమసిపోగలవు. వైదిక ధర్మావలంబులు ఇతరమతస్థులను రండని చేరబిలుచుట మన పనికాదు. అనాదియైన వేదమే సకల శ్రేయములకు మూలమని మనము గ్రహించినచో చాలును. ఇంతకంటే మనకిపుడు పరమధర్మము లేదు. 

లోకమున భిన్న మతయలకు విరోధములు కొరగావని వేదము చెపుతూవుంది. ఎవరేమార్గ మనుసరించినను అందరు ఏకగమ్యమునేచేరుదురని వేదమొక్కటే చెప్పుచున్నది. ఇతర మతములు తమమార్గమేసత్యమని, తక్కినవినరకహేతువులనీ చెప్పుచున్నవి. ఒక గమ్యమునకే పెక్కుమార్గములున్నవని వేదముతప్ప ఇతరమతము లంగీకరింపవు. ఈ పరమార్ధమును గ్రహించు భారముమనపై నున్నది. కాని వేదవిహితానుష్ఠానముపై శ్రధ్ధలేక ధర్మాచరణమున ఇతర మతస్థులకంటె వెనుక బడియున్నచో యీ పరమార్ధమునుపదేశించే అర్హత మనకు కలుగదు. 

సకల జగద్ధాత్రియైన పరమేశ్వరి, ఆపరాసక్తిని మనసారా భజించినచో లోకాని కేకొంచెమోక్షేమం చేకూర్చటంవల్ల మనం విశ్వాన్ని జయిచగలుగుతాం. జయించుట అంటే ఇతరుల కపజయం కూరుస్తామని కాదు. వారు, మనం ఎల్లరం శ్రేయస్సౌఖ్యములం దోలలాడగలుగుతాము. ఈ సత్యాన్ని గ్రహించి మాకు మిగిలియున్న జీవితమందు దీనిని సమస్త లోకానికి చాటిచెప్పి తోడిమానవులను సేవించుకునే శక్తిని పరమేశ్వరుడు మా కనుగ్రహించుకాక! 

నమః పార్వతీపతయే 

హరహర మహాదేవ.                        

--- “జగద్గురు బోధలు” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

పరమాచార్య వారు

 పరమాచార్య వారు గొప్ప పరిశోధకులు...1

పరమాచార్య వారి జ్ఞానం అనంతం. వారికీ అన్ని శాస్త్రాలపై సునిసిత అవగాహన ఉన్నది.

ఒకసారి రష్యా నుంచి స్వామి దర్శనానికి వచ్చిన ఒక ప్రొఫెసర్ భారతదేశ ఋషుల గురించి వారితో చర్చించటం ప్రారంభించారు.

స్వామి "రష్యా కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకు?"

ప్రొఫెసర్ "మీరు చెబితే తెలుసుకుంటాను."

స్వామి "హిమాలయాలకు దక్షిణ భాగాన్ని భరత వర్షం అన్నట్లే ఉత్తర భాగాన్ని ఋషి వర్షం అని పిలిచేవారు. అదే ప్రజల నోట పడి రష్యా గా మారింది.దీనికి ఋజువు కావాలంటే ఆ ప్రదేశంలో ఇప్పటికి కొందరు స్త్రీలు

అగస్త్య మహాముని భార్య అయిన లోపాముద్ర పేరు పెట్టుకోవడం గమనించవచ్చు. వారి ఉచ్చారణ వల్ల అది లోపాముట్రా వియా గా మారింది."

ఆశ్చర్యం తో నోరు తెరవడం ప్రొఫెసర్ వంతు అయ్యింది.

వారు చరిత్ర లో కూడా గొప్ప పరిశోధకులు..

 ఉత్తర మెరూరు ప్రాంతం లో కనుగొన్న ఒక శిలా శాసనం లో గుడ్ వొలై అనే ఎన్నికల విధానం అమలులో ఉన్నట్లు చెక్కబడి ఉన్నది. స్వామి వారు దీనిని వివరిస్తూ

"రాజారాజచోళుని కాలంలో రాజరిక వ్యవస్థ అమలులో ఉండేది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం ప్రజాస్వామ్య పధ్ధతిలో జరిగేవి. అవే గుడ్ వొలై విధాన ఎన్నికలు " అని వివరించారు.

***ఈశ్వరునుకి ఉండే అనంత విభూతులలో ఒకటి సర్వజ్ఞత్వం.

అనసూయాదేవి పాతివ్రత్య మాహాత్మ్యం

 అత్రిమహర్షి భార్య అనసూయాదేవి. తన పాతివ్రత్య మాహాత్మ్యం చేత ఆ మాత బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శిశువులుగా చేసి ఆడించింది, పాలిచ్చింది. ముగ్గురుమూర్తులూ ఆ దంపతులకు కొడుకులయ్యారు.త్రిమూర్తుల సమిష్టిరూపంగా అత్రి, అనసూయల బిడ్డడైన శ్రీదత్తాత్రేయుడు అనాదిగా హైందవ జాతీయుల పూజలందుకుంటున్నాడు. విష్ణువు దత్తాత్రేయుడని శివుడే దుర్వాస మహర్షి అని, బ్రహ్మదేవుడు చంద్రుడనీ భావించడం కూడా సనాతన సంప్రదాయం. శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించడం త్రిమూర్తులను పూజించడమే. తెల్లవారు ఝామున స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకృత్యాలను ఆచరించిన తరువాత శ్రీ దత్తాత్రేయుడిని షోడశోపచారాలలో అర్చించడం సంప్రదాయం.

పవిత్ర నదులలో ఈ రోజున స్నానం చేసి ఆతరిని అనసూయను శ్రీదత్తాత్రేయుడిని పూజించడం విశేష వ్రాత. శ్రీ దత్తాత్రేయుని చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక. ఆయనను పరివేష్టించి ఉండే శునక చతుష్టం - నాలుగు కుక్కలు - నాలుగు వేదాలకు ప్రతిరూపాలు. శునకం కాలభైరవుడు.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

బెంగుళూరులో 

బెంగుళూరులో 

గతవారం నేను బెంగుళూరు వెళ్లి వచ్చాను.  అక్కడి నా అనుభవాలను ఇక్కడ మీతో పంచుకోవాలని ఈ పోస్టు వ్రాస్తున్నాను. 

లోకల్ బస్సు: 

బెంగుళూరులో లోకల్ బస్ రోజువారీ పాసు 70 రూపాయలకు లభిస్తుంది. అది చిన్నగా ఉంటుంది.  దానిమీద మనం మన సంతకం చేసి మన ID కార్డులోని చివరి నాలుగు అంకెలను వ్రాయాలి.  అప్పుడే పాసు పనిచేస్తుంది.  పాసుతో మనం ఒకరోజులో ఏ ప్రాంతనినుండి ఏ ప్రాతానికికైనా ప్రయాణించవచ్చు. కాగా ఇక్కడ మనకు పి వి నరసింహారావు ఎక్స్ప్రెస్ wey లాగా అక్కడ ఒక ఫ్లయోవర్ నగర మధ్యన  వున్నది. దానిమీదినుంచి వెళితే ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. కొన్ని బస్సులు మాత్రమే దానిమీదినుంచి వెలుతాయి.  ఆ బస్సుల టికెట్ ధరతోపాటు 10 రూ ఎక్కువగా చెల్లించాలి. 

ఇంకా వుంది.

మత్స్యయంత్రం విశిష్టత -

 మత్స్యయంత్రం విశిష్టత  - 

        వేదసముద్ధరణ కొరకు అవతరించిన శ్రీ మహావిష్ణు స్వరూపమే " మత్స్యముర్తి" గా ఖ్యాతి వహించింది. విష్ణుదేవుని పది అవతారాలలో ఇది మొదటిది. మత్స్యయంత్రం అన్ని యంత్రాల కన్నా విశిష్టమైనది. ఈ యంత్రప్రస్తారము నందు గల ఏడు ఆవరణాలలోను అతి ప్రధానమైన బీజాక్షరాలు లిఖించబడినవి. శైవ , శాక్త, వైష్ణవ , గాణాపత్య , సౌర సాంప్రదాయములకు సంబంధించిన ముఖ్యతిముఖ్యములైన బీజాప్రస్ధారము గల ఈ యంత్రం వాస్తు సంబంధముగాను , సాధారణ గృహస్తు జీవితము నందు అత్యంత ఉపయుక్తముగా ఉన్నది. 

                గృహ మరియు స్థల సంబంధ ఏ దిశలయందైనను సంభవించు వివిధ దోషములను , తూర్పు సింహద్వార  గృహములకు కలుగు పలు దోషములను , అదేవిధముగా దక్షిణ , పశ్చిమ , ఉత్తర సింహద్వార గృహముల  దోషములను , ద్వారావేదలచే సంభవించు దోషములను , స్తంభ , కుడ్య , గవాక్ష వేదలచే కలుగు దోషములను , పిశాచ స్థాన , పైశాచిక వేధా దోషములను , దైవదృష్టి , గ్రహదృష్టి , విప్రదృష్టి మొదలగు దృష్టిదోషములను , వృక్షముల వలన సంభవించు అనేకానేక దోషములను , స్థలాంతర్గత , వర్గరాహిత్యము , ముఖ్యముగా ఈశాన్య స్థానము నుండి సంభవించే దోషములను ఈ యంత్రం పరిహరించి , వాస్తుశుభత్వం చేకూర్చును. శాస్త్రవిహితము కాని మరియు అనేకవిధములైన వాస్తుదోషములను కూడా ఈ మత్స్యయంత్రం తొలిగించును. 

             జీవితము నందు వృద్ది , కీర్తి , జయము , సంపద , సుఖము , ఆనందములను కోరు గృహస్తులుకు ఈ మత్స్యయంత్రం కోరికలు తీర్చు కామధేనువు వంటిది. స్వగృహమైన, పరగృహమైన లేదా ఎచ్చట నివసించుచున్నను మత్స్యయంత్రం ఉంచుకొనుట వలన విశేష లాభములు పొందగలరు. ఈ యంత్రం కేవలం గృహముల యందే కాక దేవాలయాలు , ధర్మశాలలు , హోటల్స్ , గవర్నమెంట్ ఆఫీసులు , భారీ మరియు చిన్న తరహా మెషినరీ స్థలములు , కర్మాగారములు , వ్యాపార స్థానములు మొదలగు ప్రదేశముల యందు కూడా ఈ మత్స్యయంత్రం ఉంచుట వలన సత్ఫలితాలు కలుగగలవు. 

                    వాహనముల యందు ఈ యంత్రం ఉంచిన ప్రమాద రహితమైన గమనమును కొనసాగించుతూ యజమానికి క్షేమాన్ని కలిగించును. విద్యాలయాల మూల యందు ప్రతిష్టించిన అఖండాభివృద్ధి కలుగును. దేవాలయ ప్రాకారముల యందు స్థాపించిన విశేష జనాకర్షణ కలిగించి అభివృద్ధిదాయకముగా ఉండగలదు. వైద్యశాలల యందు స్థాపించిన అచ్చటిరోగులకు శీఘ్రముగా ఆరోగ్యాన్ని చేకూర్చి దీర్ఘాయుష్షుని పెంపొందించును. గ్రామమధ్యమున స్థాపించిన ఆ గ్రామము అన్ని రకాలుగా అభివృద్ధి చెందును . అభివృద్ధిని చేకూర్చడంలో దీనికి సాటియగు యంత్రం ఇంకొటిలేదు . 

            మత్స్య యంత్రం రాగిరేకుపైన చెక్కించుట కొన్ని శాస్త్రాలు నిషేదించినవి. 5 * 5 అంగుళముల సమచతురస్రాకారం కలిగిన రేకుపైన ఈ యంత్రము చెక్కించి దశవిధ సంస్కారములు , ప్రాణప్రతిష్ట , జీవకళాన్యాసములు జరిపిన పిమ్మట ఒక లక్ష పర్యాయాలు గాయత్రి మహామంత్రమును , ఒక లక్షపర్యాయాలు మత్స్యగాయత్రి మంత్రమును కనీసముగా పదివేల పర్యాయాలు దీక్షానియమాలతోటి జపించి ఆ జపమును యంత్రమునకు ధారపోసి తారాబల , చంద్రబలములతో కూడిన శుభముహుర్తము నందు యంత్రమును ప్రతిష్టావిధిని అనుసరించి గృహము లేదా వ్యాపారస్థలము నందలి మధ్యభాగమున గాని లేదా ఈశాన్య దిశయందు గాని స్థాపించిన యెడల సర్వారిష్టములను , సమస్తదోషములను పరిహారము గావించి ఆ గృహవాసులకు దీర్గాయుష్షుని , సర్వశుభాలను కలుగచేయును . 

        మత్స్యయంత్రంను కొంతమంది భూమి యందుగాని , మరికొంతమంది ఈశాన్యములో తూర్పుగోడ లోపల స్థాపించు ఆచారం కలదు. కొన్ని సందర్భాలలో సాధన లేకుండా పూజామందిరము నందు కూడా పెట్టుకొని పూజించవచ్చు. 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

భగవద్గీత

🌹భగవద్గీత🌹

మొదటి అధ్యాయము. అర్జునవిషాదయోగము నుండి 47 వ శ్లోకము. పదచ్ఛేద ,టీకా ,తాత్పర్య సహితముగా.

సంజయ ఉవాచ     

ఏవముక్త్వార్జునః సంఖ్యే 

రథోపస్థ  ఉపావిశత్  ౹    

విసృజ్య  సశరం చాపం

శోకసంవిగ్నమానసః ౹౹ (47)

ఏవమ్ , ఉక్త్వా , అర్జునః , సంఖ్యే ,

రథోపస్థే , ఉపావిశత్  ౹

విసృజ్య , సశరమ్ , చాపమ్ ,

శోకసంవిగ్నమానసః ౹౹ (47)    

సంఖ్యే = రణభూమియందు ;

శోకసంవిగ్నమానసః = శోకాకులమనస్కుడైన ;

అర్జునః = అర్జునుడు ;

ఏవమ్ = ఇట్లు ;

ఉక్త్వా = పలికి ;

సశరమ్ = బాణములతోగూడిన ;

చాపమ్ = ధనస్సును ;

విసృజ్య = విసర్జించి ;

రథోపస్థే = రథముయొక్క వెనుకభాగమున ;

ఉపావిశత్ = చతికిలబడెను .

తాత్పర్యము :- సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోకసంవిగ్నమానసుడై , యుద్ధభూమియందు ధనుర్భాణములనu త్యజించి , రథము వెనుకభాగమున చతికిలబడెను. (47)

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోఽధ్యాయః  ౹౹౧౹౹

      ఆత్మీయులందరికి  శుభ శుభోదయం

               Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy

Advocate AP High Court Amaravathi

విశ్వనాథవారి కొబ్బరి పచ్చడి!*

 .       *విశ్వనాథవారి కొబ్బరి పచ్చడి!*

                    పేరాల బాలకృష్ణ.

నాన్నగారు, గురువుగారు, నాన్నగారి తోకలా నేను ఒకసారి బెజవాడలో కాళేశ్వరరావు మార్కెట్ కు వెళ్ళాం. నాన్న గారితో కూరల మార్కెట్కుకి వెళ్ళటం చాలా సరదాగా ఉంటుంది. ఆ కూరలమ్మే పల్లె పడుచులతో కబుర్లు, వాళ్ళ అమాయకపు మాటలకు నాన్నగారి వ్యాఖ్యానాలు....... నేటి తరానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నాన్నగారితో *కూరల షాపింగ్* చాలా సరదాగా, ఆటవిడుపుగా ఉండేది.   అలాంటిది గురువుగారితో కూడా మార్కెట్కి అనేసరికి ఇంకా ఉత్సాహం!  ఇద్దరి చేతుల్లోనూ  పాత పడక్కుర్చీ పట్టాలతో కుట్టించిన చారల చారల కూరల సంచీలు. పాత పడక్కుర్చీ పట్టాలతో సంచీలేంటని ఆలోచిస్తున్నారా? కుర్చీ పట్టాలకు పైన కింద రూళ్ళ కర్రల్లాంటివి ఎక్కించి కుర్చీకి రెండు వైపులా ఖానాల్లో ఎక్కిస్తే కూర్చోవటానికి కుదురుతుంది కదా!  కొంత కాలానికి పట్టా నెమ్మదిగా కుర్చీ చెక్కకు ఒరుచుకుని, నలిగి చినుగుతుందిగా. అట్లా చినగటం వల్ల ఇహ తప్పదుగా పట్టా మార్చ వలసి వస్తుంది.  ఆ పట్టాలన్నమాట.  రూపాంతరం చెంది మరో జన్మ ఎత్తి, పాపం ఇలా కూరల సంచీలై మన సేవ చేసుకుంటాయి. అప్పటికీ ఆ పట్టాకు ఋణ విముక్తి కాదు.  మరికొంత కాలానికి ఆ సంచీ హాండిల్స్ నలిగి చినిగి పనికిరాకుండా పోతుంది.  అప్పటికి సంచీ కూడా మోత బరువుకి, చిరగటం మొదలవుతుంది.  పాపం అప్పటికీ ఆ సంచీకి విముక్తి రాదు. అప్పుడు ఆ సంచీ తన హాండిల్స్ కోల్పోయి పూర్తిగా వికలాంగియై, సింహద్వారం దగ్గర కాళ్ళు తుడుచుకునే పట్టాగా మారుతుంది. అప్పుడుకూడా పూర్తిగా శిధిలమై చివరకు మన కాలి వేళ్ళు ఆ చినుగుల్లో చిక్కుకుని మొహం పగిలేలా పడబోయి తప్పించుకున్న ఏ నాన్నగారో, లక్షుడు పెదనాన్నగారో గట్టిగా అరిచి, చీవాట్లు పెట్టి రోడ్డుమీదకు విసిరెస్తే తప్ప ఆ పట్టాకు జన్మ రాహిత్యం రాదు.

రాజ భంగ నీచ యోగం ( నీచ భంగ రాజ యోగం లాగానే --- పెద్దవాళ్ళ కుర్చీ పట్టాగా పుట్టి, కూరల సంచీఅయి, కాళ్ళు తుడుచుకునే పట్టాగా మారటమే రాజభంగ నీచ యోగ మన్న మాట ) పట్టిన  అలాంటి చరిత్ర ఉన్న కుర్చీ పట్టాతో చేసిన కూరల సంచీలతో మార్కెట్ అంతా కలియతిరిగి నెమ్మదిగా ఓ కొట్టుదగ్గర ఆగి నాన్నగారు గొంతుక్కూర్చుని ఏరటం మొదలుపెట్టారు.  మాంఛి నిగనిగలాడే వంకాయలు ఓ సవాసేరు తూకం వేయించి, దానిపైన ఓ కాయ కొసరు వేయించుకుని మళ్లీ ఇంకో సవాసేరు తీసుకున్నారు, ఆ అమ్మి మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ఇంకో కాయ కొసరు వేయించుకుని మరీ. అవధానాలకు 116/- అడగటం చేతకాదు కానీ దీనిదగ్గర కొసరు బాగానే  దబాయించావ్ పాత ఖాతా కాబోలు! అంటూ కొంటెగా గాల్లోకి చూస్తూ ఓ నవ్వు నవ్వారు గురువుగారు!   మాష్టారి మాటలకు పగలబడి నవ్వుతూ, కూరలమ్మాయి వంక చూసారు నవ్వాపుకునే ప్రయత్నం చేస్తూ!  అదే చేత్తో నా మొహాన ఓ రెండు సవాసేర్లు పడేయి  అన్నారు నవ్వుతూ. వంకాయలకి డబ్బులిచ్చి ఇంకో కొట్టు వైపు కదిలారు. ఎవరి డబ్బులు వాళ్లే !  గురువుగారు ఆ విషయంలో ...... తగ్గేదేలే ! ఓ పది గజాలు నడిచారో లేదో పంతులుగారూ నమస్కారం! ప్రసాదం తీసుకెళ్లండి అంటూ ఓ పిలుపు వినపడింది!  నాన్నగారు అటు చూసేసరికి కిరాణా షాప్ లో నుంచి శెట్టి గారు నాన్నగారిని పిలుస్తున్నారు.  నాన్నగారు మాష్టారు ఇద్దరూ  అటుగా కదిలారు  ఆ కొట్టాయన చెరో కొబ్బరి ముక్క ప్రసాదం పెట్టాడు. నాక్కూడా.  ఆనాడు శుక్రవారం.  మార్కెట్లో అందరూ సాయంత్రం పూజ చేయించుకుని కొబ్బరికాయ కొట్టి, తమ కొట్టుకొచ్చిన వాళ్లకు తలా ఓ ముక్క ప్రసాదం పెట్టటం రివాజు. 

ఈ శెట్టి గారు నాన్నగారికి ఎలా పరిచయం అనుకుంటున్నారా?  అంతకు వారం రోజులు ముందే ఆవకాయ సామాన్లు కొనడానికి మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఈ శెట్టి గారి కొట్లోనే ఎండు మిరపకాయలు నమిలి, పెద్దగా కారం లేవోయి అని కొనకుండా వదలి శెట్టి గారిని అవాక్కయ్యేలా చేసి వెళ్ళిపోయింది.

అలా తీసుకున్న కొబ్బరి ముక్కలు  గుప్పెట్లో పట్టుకొని గురువుగారు ముందడుగు వేశారు.  నాన్నగారు ముక్క కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో బోయి గురువుగారు ఇంకా తినకపోవడంతో ముక్కను అలాగే చేత్తో పట్టుకుని ఆయన వెనకే ముందుకు నడిచారు.  ఆ తర్వాత ఇంకేవో కొన్ని  కూరలు కొని ఆ కూరల వాడి దగ్గర కొన్న కూరల్లోంచి  ఓ పచ్చిమిరపకాయ తీసుకుని  వెనక ఉన్న కిరాణా కొట్టు దగ్గర బయటపెట్టిన ఉప్పు మూటలోంచి నాలుగు ఉప్పు రాళ్లు తీసుకుని ( బెజవాడ కాళేశ్వర రావు మార్కెట్టులో కింద పాత గోనె సంచులు పరిచి కూరలు కుప్పలు పోసి అమ్ముతారు.  ఈ కూరల కొట్ల వెనక వరసగా కిరాణా దుకాణాలు ఉంటాయి) ఆ కొబ్బరి ముక్క, ఈ పచ్చిమిరపకాయ,  ఉప్పు రాళ్లు కలిపి నమలటం మొదలుపెట్టారు.  భరత శర్మా నువ్వు కూడా ఇలా తిని చూడు ! బాగుంది. అని నాన్నగారి చేత కూడా ఆ కొబ్బరి ముక్కని నోటి పచ్చడి చేయించారు. కారానికి దడిచి సాహసం చేయలేదు కానీ నాకు నోరూరి పోయింది. ఇప్పటికీ నోరూరుతునే ఉంది! 

*తన రుచి బ్రతుకులు తనవి గాన* అంటే ఇదేనేమో ! ఉన్నదానిని తృప్తిగా అనుభవించటం, ఆస్వాదించటం, ఆ ఆనందాన్ని నలుగురికి అందించటం అనేది మనిషికి ఎంత సంతోషాన్నిస్తుందో  కదా! ఈ గురు శిష్యుల బాంధవ్యం, బోధన , సాహిత్యంలోనే కాదు, నిజ జీవితంలో కూడా! గుర్తుకొస్తే చాలు శరీరమూ,  మనసూ పులకరిస్తాయి! అలాంటి గురువులు విశ్వనాథ వారు. అలాంటి గురువును పొందిన శిష్యులు నాన్నగారు భరత శర్మ గారు ధన్యులు. అంతటి మహానుభావుడికి  నాన్నగారు శిష్యులయ్యేందుకు పునాదివేసిన మా లక్షుడు పెద్దనాన్నగారు  ప్రాతః స్మరణీయులు.

మొన్నొక రోజు ఇంట్లో మా ఆవిడ నైవేద్యం పెట్టిచ్చిన కొబ్బరిముక్క చూడగానే గురువుగారు గుర్తొచ్చి ఓ పచ్చిమిరపకాయ, కొద్దిగా ఉప్పు  ( ఈ నవ నాగరిక ప్రపంచం కల్ల ఉప్పును మరిచిపోయిందిగా ) కలిపి నమిలి ఆనాడు గురువుగారు తింటున్నప్పుడు కారానికి జడిసి కోల్పోయిన గురువుగారి ఆ కొబ్బరి పచ్చడి ఆనందాన్ని, అనుభూతిని ఇంట్లో నెమరువేసుకున్నాను!

అందరమూ ఆ రుచిని అనుభవించి తీరవలసిందే!

                       పేరాల బాలకృష్ణ

హైదరాబాదు

15-09-2022.

రసజ్ఞభారతి సౌజన్యంతో-

ఘంటసాల జయంతి

 అతడు ప్రసన్న మధుర

 భావార్ర్ద మూర్తి. సరస సంగీత

 సామ్రాజ్య చక్రవర్తి. లలిత

 గంధర్వ దేవత కొలువుదీరు...

 కలికి ముత్యాలశాల మా

 ఘంటసాల అన్నారు జంధ్యాల పాపయ్యశాస్త్రి.

 *నేడు ఘంటసాల జయంతి*

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 93 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

నృగమహారాజు చరిత్రము:

కృష్ణ పరమాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతయిన నుయ్యి ఉన్నది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులయిన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలయిన వారందరూ విహరిస్తున్నారు. వాళ్లకి అలసట కలిగింది. అలసట తీర్చుకోవడం కోసమని కాసిని నీళ్ళు త్రాగాలని అనుకున్నారు. అక్కడ ఉన్న నూతి దగ్గరకు వచ్చి నూతిలోకి చూశారు. అందులో పెద్ద ఊసరవెల్లి పడి ఉన్నది. దానిని చూసి వాళ్ళు తెల్లపోయారు. దానిని పైకి తీద్దామనుకున్నారు. పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దానిని పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ పైకి తీయలేకపోయారు. వారు పరుగుపరుగున లోపలికి వెళ్ళి కృష్ణపరమాత్మకు చెప్పారు. కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసరవెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డిపరకను పైకెత్తినట్లు నూతిలోంచి తీసి బయట పడేశాడు. సర్వజ్ఞుడయిన పరమాత్మ సాంబుడు మొదలయిన వారిని అడ్డుపెట్టి లోకమునకు ఒక గొప్ప ధర్మమును ఉపదేశం చెయ్యాలని అనుకుని ఊసరవెల్లిని ‘నీవు ఎందుకు ఎంత పెద్ద ఊసరవెల్లి స్వరూపమును పొందావు? ఎందువలన నీకీ జన్మ వచ్చింది?’ అని అడిగారు. ఊసరవెల్లి ఆయనకు నమస్కారం చేసి ‘మహానుభావా! నేను ఇక్ష్వాకువంశంలో జన్మించిన నృగ మహారాజుని’ అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించిన వాడు.

నృగ మహారాజుగారు రాజ్యమును పరిపాలిస్తున్న రోజులలో పరమ ధర్మాత్ముడు. ఆయన చేయని పుణ్యకార్యం లేదు. ఆయన ఒకచోట భాగవతంలో చెప్పుకున్నారు ‘నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది. కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ, కృష్ణా ఈ భూమి మీద రేణువులను లెక్కపెట్టవచ్చునేమో కానీ, నేను చేసిన దానములు లెక్కపెట్టలేరు. నేను చెయ్యని దానములు లేవు. ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణునకు దానం ఇచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్ళి తన పెరటిలో కట్టుకున్నాడు. మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకుని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజుగారి ఆలమందలోకి వెళ్ళిపోయింది. రాజు తాను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయిందనే విషయమును గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవును తోలుకుని వెళ్ళిపోతున్నాడు. కశ్యపుడికి తాను దానం పుచ్చుకున్న ఆవు ఒకేఒక జీవనాధారమై ఉన్నది ఆ ఆవు కనపడడం లేదు. ఆ ఆవుకోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్నాడు. కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్లి ‘అది నా ఆవు. నృగ మహారాజు గారు దానిని నాకు దానం చేశారు’ అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు ‘నేను ఇప్పుడే పుచ్చుకున్నాను. నేను గోచౌర్యం చేసిన వాడిని కాదు. నేను ఇప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకుని తీసుకువెడుతున్నాను’ అన్నాడు. ‘లేదు ఈ గోవు నాది’ అన్నాడు కశ్యపుడు. ‘కాదు ఈ గోవు నాది’ అన్నాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది. ఇద్దరు కలిసి నృగ మహారాజు దగ్గరికి వెళ్ళారు. ‘అయ్యా, ఈ గోవును యింతకు పూర్వం నాకు దానం ఇచ్చావు. అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నీవు మరల ఈ ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం ఇచ్చావు. నా ఆవును నాకు యిప్పించు’ అని రాజును కశ్యపుడు అడిగాడు. రాజుగారు రెండవ బ్రాహ్మణునితో ‘నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం ఇచ్చిన గోవు ఇంతకు పూర్వం కశ్యపునకు దానం ఇచ్చేసిన గోవు. ఆ గోవును నీవు ఇచ్చేసినట్లయితే ఆ గోవును కశ్యపునకు ఇస్తాను. అన్నాడు. రెండవ బ్రాహ్మణుడు తనకు ‘ఆ ఆవే కావాలి’ అని తన దగ్గర ఉన్న ఆవును తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు. రాజుగారు ‘నీకు లక్ష గోవులను ఇస్తాను. ఈ గోవును విడిచిపెట్టు’ అన్నాడు. ‘నాకు ఎన్ని గోవులు ఇచ్చినా అక్కర్లేదు. నాకు ఈ గోవే కావాలి’ అని రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు.

రాజు కశ్యపుని చూసి ‘నీకు నా రాజ్యంలోని భాగమును ఇమ్మంటే ఇస్తాను. నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులను ఇస్తాను. తీసుకువెళ్ళు’ అన్నాడు. కశ్యపుడు ‘నేను అడిగిన గోవును ఇవ్వలేక పోయావు. ఇంక నాకు ఇవ్వవలసినది ఏమీ లేదు’ అని వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. నృగ మహారాజుగారి శరీరం కూడా పతనం అయిపోయింది. ఈయనను స్వర్గలోకమునకు తీసుకువెళ్ళబోతున్నారు. అపుడు దూతలు మీరు అనుభవించవలసిన చిన్న పాపఫలితం ఒకటి ఉన్నది. అది అయిపోయిన తరువాత మిమ్ములను స్వర్గ లోకమునకు తీసుకు వెళతాము. ఆ పాపఫలితం పూర్తి అయిపోయే వరకు పెద్ద ఊసరవెల్లియై నూతిలో పడి ఉండండి’ అన్నారు. నృగ మహారాజు తాను చేసిన పాపమేమిటని వారిని ప్రశ్నించగా వారు ‘నీవు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునకు దానం ఇచ్చావు. ఊసరవెల్లివై పడి ఉండు’ అన్నారు.

ఈమాటలు నృగ మహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఆ ఊసరవెల్లి తాను చేసిన పాపమును పోగొట్టుకొని ఊర్ధ్వలోకముల నుండి వచ్చిన రథమును ఎక్కి నృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ ‘బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కాని, తెలియక గాని ఎవరయినా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటివెంట నీటిబిందువు కిందపడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములను అనుభవిస్తాడు. నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలులేదు. ఎవరు బ్రాహ్మణ ద్రవ్యము మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని ఎప్పటికీ నా భక్తునిగా నేను చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకు ఉన్న భక్తి అటువంటిది’ అన్నారు.

ఇక్కడ మనకి కొన్ని సందేహములు కలుగుతాయి. నృగుడు బ్రాహ్మణునకు లక్ష గోవులను ఇస్తానన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కశ్యపునకు వదిలివేయవచ్చు కదా! ఆ బ్రాహ్మణునకు అంత మౌడ్యమేమిటి? పోనీ బ్రాహ్మణుడు మూఢుడై ఉండవచ్చు. కశ్యపునకు గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు. కశ్యపుడు తనకి ఆ గోవే కావాలని రాజ్యం, ఇతర గోవులు అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఏదయినా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడయిన వాడు ఇతరులు చేసిన తప్పు దిద్ది దానివలన అవతలి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. అది అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవీ ఇక్కడ కలిగే సందేహములు. వీటికి సమాధానములను కొందరు పెద్దలు వివరణ ఇచ్చారు. బ్రాహ్మణుడు అనగా ఎవరు?

ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్న దానిచేత ఎప్పుడూ తృప్తిపడిపోయి ఎవరు పరిపూర్ణమయిన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకు ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప దొరికిన దానిని అడ్డుపెట్టుకుని చాలా సంపాదించెయ్యాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది. కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదయినా ఇస్తానన్నా ఆయన ఆశ పొందలేదు. దానిని అంగీకరించలేదు. రాజు నావలన మహాపరాధం జరిగింది నన్ను మన్నించండని ఒక మాట అని బ్రాహ్మణుల పాదములు పట్టుకుని ఉండాలి. రాజు అవతలి వారియందు ఉన్న తృప్తిని గమనించలేకపోయాడు. బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ తమకి అక్కరలేదని తమ బ్రాహ్మణ్యమును నిలుపుకున్నారు. బ్రాహ్మణ్యము అనేది అపారమయిన తృప్తితో పొందవలసిన లక్షణము. దానము చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు ఏమరుపాటు పొందాడు. తప్పును రాజు ఖాతాలో వేశారు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాపఫలితమును అనుభవించడమే. కృష్ణ పరమాత్మ ఇంకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు.

ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్నకధలా ఉంటుంది. కానీ ఇందులో మనకి గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు ఈ కధ నేర్పుతుంది. దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానమునకు ఫలితమును ఇస్తాడు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోవడం వలననే రాజును పాపం అనుభవింప చేసింది. నేనిస్తున్నాననే అహంకారం ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకుని అనంతమయిన ఫలితమును ఇచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించ గలిగిన శుభ ఫలితములను ఇవ్వడానికి దానం పుచ్చుకున్నాడు నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి. ఈ కథ అంత విశేషమయిన స్థితిని అవిష్కరిస్తుంది.

పూర్వం కరూషదేశమును పౌండ్రక వాసుదేవుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పెరిగి పెద్దవాడయిన తరువాత ఆయనకు ఎవరో ‘ మీపేరు ఉన్నవాడు మరొక ఆయన ఉన్నాడు. ఆయన వసుదేవుని కుమారుడు. అసలు వాసుదేవుడు ఆయనేని లోకం నమ్ముతున్నది’ అని చెప్పారు. ఈ విషయం చెప్పగానే ఈయన కూడా తెల్లటి శంఖం ఒకదానిని కొనుక్కున్నాడు. ఒక చక్రమును, గదను, ధనుస్సు చేయించుకున్నాడు. ఎప్పుడూ పట్టు పీతాంబరము కట్టుకోవడం ప్రారంభించాడు. ఆవిధంగా అతను వాసుదేవుని అనుకరిస్తూ తాను పౌండ్రక వాసుదేవుడనని మురిసిపోయేవాడు. ఒక రాయబారిని పిలిచి నీవు వెళ్లి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అని ఒక లేఖ రాసి ఇచ్చి పంపించాడు. ఆ రాయబారి కృష్ణ భగవానుని దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు నిండుసభలో కూర్చుని ఉన్నాడు. ఈ రాయబారి వెళ్లి ‘ పౌండ్రక వాసుదేవుడు మీకీ రాయబారం పంపించాడు’ అని చెప్పాడు. ఆ పత్రికలో 'నేను ఎటువంటి అలంకారములను ధరించి ఉంటానో, అలా నీవు కూడా పెట్టుకుంటావని తెలిసింది. నాకు అర్థం కానిది ఒకటే. నాకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. నీకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. దీనివలన ఇబ్బంది వస్తోంది. నీ అంతట నీవు మర్యాదగా ఈ చిహ్నములన్నిటిని వదిలి పెట్టెయ్యాలి. వాసుదేవుడన్న పేరును వదిలి పెట్టెయ్యాలి. లేకపోతే యుద్ధమునకు వచ్చి నీ శరీరమును మట్టుపెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు’ ఇదీ రాయబారం లోని సారాంశం.

కృష్ణుడు 'ఈ చిహ్నములు నాకు సహజములు. నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు. అతడు కోరుకున్న రెండవ కోరికను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పు. యుద్ధభూమిలో కలుసుకుందాం’ అని పంపించివేశాడు. పౌండ్రక వాసుదేవునకు కాశీరాజు మద్దతు పలికాడు. ఇద్దరు కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో పౌండ్రక వాసుదేవుడు అలాగే ఉన్నాడు. కృష్ణుడు వానిని రథం మీద చూసి ఆశ్చర్యపోయి పకపకా నవ్వి యుద్ధం ప్రారంభించాడు. కొంతసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. చిత్రమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వానిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఇది వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ‘ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది' అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు అతనికి సందేహం తీరేలా సమాధానం చెప్పాడు. పౌండ్రక వాసుదేవుడు ఏ పని చేసినా అచ్చం కృష్ణుడిలా ఉన్నానా లేనా అని ఎల్లవేళలా కృష్ణుడినే తలచుకుంటూ ఉండడం వలన మనస్సునందు కృష్ణ ధ్యానమును పొంది ఉన్నాడు. కాబట్టి వాడు ఏ కారణం చేత తలచినా సంతతము తలచిన వస్తువులోనే కలిసిపోయాడు. పౌండ్రక వాసుదేవుని వృత్తాంతం నుంచి మనం ఒక్కటి తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుని పేరుతోటి ఆయన లీలల తోటి ఈశ్వరుని అనుకరించే ప్రయత్నములు చేయకూడదు. అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి. అక్కడ యుద్ధం జరిగినపుడు కాశీరాజు తల కూడా తెగిపడిపోయింది. కానీ కాశీరాజు తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు.

కాశీరాజు కొడుకు కృష్ణుడి మీద అభిచారిక హోమం చేశాడు. కృష్ణుడు దానిని ఒక చక్రంతో తోసి అవతలకి పారేశాడు. ఇది అనవసర విషయముల జోలికి వెళ్ళి మద్దతులు ప్రకటించడం, తిరగడం మొదలయిన ఇబ్బందులు తీసుకువస్తాయని భగవంతుని సాత్త్వికమయిన మూర్తులను ఆరాధన చేసి మనస్సును సత్త్వ గుణంతో ఉంచుకుని, భగవంతుని చేరే ప్రయత్నం చేయాలి తప్ప, లేని పోని భేషజములు అంత మంచివి కావని హెచ్చరిక చేసే అద్భుతమయిన లీల.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

గర్భాశయం పుండు

రోజుల్లో  గర్భాశయం పుండు హరించుటకు రహస్య యోగం  - 

     కలబంద రసం , పాలు మరియు నీరు సమానంగా తీసుకుని కలిపి ఉదయం పరగడుపున సాయంత్రం ఆహారానికి 2 గంటల ముందు సేవిస్తున్నచో 40 రోజుల్లొ  గర్భాశయం పుండు హరించును . కడుపులో పుండు అనగా అల్సర్ ని కూడా నివారించును.

 గమనిక  -  కాఫీ , టీ లు , మసాలా , కారం , పులుపు నిషిద్ధం . వంకాయ , గోంగూర నిషిద్దం . 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

 గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            కాళహస్తి వేంకటేశ్వరరావు 

         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                        9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

[05/12, 3:59 am] +91 98850 30034: మత్స్యయంత్రం విశిష్టత  - 

        వేదసముద్ధరణ కొరకు అవతరించిన శ్రీ మహావిష్ణు స్వరూపమే " మత్స్యముర్తి" గా ఖ్యాతి వహించింది. విష్ణుదేవుని పది అవతారాలలో ఇది మొదటిది. మత్స్యయంత్రం అన్ని యంత్రాల కన్నా విశిష్టమైనది. ఈ యంత్రప్రస్తారము నందు గల ఏడు ఆవరణాలలోను అతి ప్రధానమైన బీజాక్షరాలు లిఖించబడినవి. శైవ , శాక్త, వైష్ణవ , గాణాపత్య , సౌర సాంప్రదాయములకు సంబంధించిన ముఖ్యతిముఖ్యములైన బీజాప్రస్ధారము గల ఈ యంత్రం వాస్తు సంబంధముగాను , సాధారణ గృహస్తు జీవితము నందు అత్యంత ఉపయుక్తముగా ఉన్నది. 

                గృహ మరియు స్థల సంబంధ ఏ దిశలయందైనను సంభవించు వివిధ దోషములను , తూర్పు సింహద్వార  గృహములకు కలుగు పలు దోషములను , అదేవిధముగా దక్షిణ , పశ్చిమ , ఉత్తర సింహద్వార గృహముల  దోషములను , ద్వారావేదలచే సంభవించు దోషములను , స్తంభ , కుడ్య , గవాక్ష వేదలచే కలుగు దోషములను , పిశాచ స్థాన , పైశాచిక వేధా దోషములను , దైవదృష్టి , గ్రహదృష్టి , విప్రదృష్టి మొదలగు దృష్టిదోషములను , వృక్షముల వలన సంభవించు అనేకానేక దోషములను , స్థలాంతర్గత , వర్గరాహిత్యము , ముఖ్యముగా ఈశాన్య స్థానము నుండి సంభవించే దోషములను ఈ యంత్రం పరిహరించి , వాస్తుశుభత్వం చేకూర్చును. శాస్త్రవిహితము కాని మరియు అనేకవిధములైన వాస్తుదోషములను కూడా ఈ మత్స్యయంత్రం తొలిగించును. 

             జీవితము నందు వృద్ది , కీర్తి , జయము , సంపద , సుఖము , ఆనందములను కోరు గృహస్తులుకు ఈ మత్స్యయంత్రం కోరికలు తీర్చు కామధేనువు వంటిది. స్వగృహమైన, పరగృహమైన లేదా ఎచ్చట నివసించుచున్నను మత్స్యయంత్రం ఉంచుకొనుట వలన విశేష లాభములు పొందగలరు. ఈ యంత్రం కేవలం గృహముల యందే కాక దేవాలయాలు , ధర్మశాలలు , హోటల్స్ , గవర్నమెంట్ ఆఫీసులు , భారీ మరియు చిన్న తరహా మెషినరీ స్థలములు , కర్మాగారములు , వ్యాపార స్థానములు మొదలగు ప్రదేశముల యందు కూడా ఈ మత్స్యయంత్రం ఉంచుట వలన సత్ఫలితాలు కలుగగలవు. 

                    వాహనముల యందు ఈ యంత్రం ఉంచిన ప్రమాద రహితమైన గమనమును కొనసాగించుతూ యజమానికి క్షేమాన్ని కలిగించును. విద్యాలయాల మూల యందు ప్రతిష్టించిన అఖండాభివృద్ధి కలుగును. దేవాలయ ప్రాకారముల యందు స్థాపించిన విశేష జనాకర్షణ కలిగించి అభివృద్ధిదాయకముగా ఉండగలదు. వైద్యశాలల యందు స్థాపించిన అచ్చటిరోగులకు శీఘ్రముగా ఆరోగ్యాన్ని చేకూర్చి దీర్ఘాయుష్షుని పెంపొందించును. గ్రామమధ్యమున స్థాపించిన ఆ గ్రామము అన్ని రకాలుగా అభివృద్ధి చెందును . అభివృద్ధిని చేకూర్చడంలో దీనికి సాటియగు యంత్రం ఇంకొటిలేదు . 

            మత్స్య యంత్రం రాగిరేకుపైన చెక్కించుట కొన్ని శాస్త్రాలు నిషేదించినవి. 5 * 5 అంగుళముల సమచతురస్రాకారం కలిగిన రేకుపైన ఈ యంత్రము చెక్కించి దశవిధ సంస్కారములు , ప్రాణప్రతిష్ట , జీవకళాన్యాసములు జరిపిన పిమ్మట ఒక లక్ష పర్యాయాలు గాయత్రి మహామంత్రమును , ఒక లక్షపర్యాయాలు మత్స్యగాయత్రి మంత్రమును కనీసముగా పదివేల పర్యాయాలు దీక్షానియమాలతోటి జపించి ఆ జపమును యంత్రమునకు ధారపోసి తారాబల , చంద్రబలములతో కూడిన శుభముహుర్తము నందు యంత్రమును ప్రతిష్టావిధిని అనుసరించి గృహము లేదా వ్యాపారస్థలము నందలి మధ్యభాగమున గాని లేదా ఈశాన్య దిశయందు గాని స్థాపించిన యెడల సర్వారిష్టములను , సమస్తదోషములను పరిహారము గావించి ఆ గృహవాసులకు దీర్గాయుష్షుని , సర్వశుభాలను కలుగచేయును . 

        మత్స్యయంత్రంను కొంతమంది భూమి యందుగాని , మరికొంతమంది ఈశాన్యములో తూర్పుగోడ లోపల స్థాపించు ఆచారం కలదు. కొన్ని సందర్భాలలో సాధన లేకుండా పూజామందిరము నందు కూడా పెట్టుకొని పూజించవచ్చు. 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

 గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            కాళహస్తి వేంకటేశ్వరరావు 

         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                        9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

[06/12, 5:10 am] +91 98850 30034: అజీర్ణవ్యాధి నివారణా యోగాలు  -

 *  వస, సైన్ధవ లవణములను నీటిలో కలిపి తాగి తరువాత ధనియాలు , శొంటి కషాయం తాగుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.

 *  ఇంగువ, శొంటి, పిప్పళ్లు, మిరియాలు , సైన్ధవ లవణం వీటిని నీటితో నూరి పొట్ట మీద పట్టు వేయుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.

 *  సైన్ధవ లవణం, కరక్కాయ పైపెచ్చుల చూర్ణం , పిప్పళ్లు, చిత్రమూలం వీటి పొడిని ఆహారం తీసుకున్న అర్ధగంట తరువాత ఉదయం , సాయంత్రం వేడినీటితో తీసుకొనుచున్న అజీర్ణవ్యాది నశించును.

 *  శొంటి, పిప్పళ్లు, మిరియాలు , వాము , సైన్ధవ లవణం , నల్లజీలకర్ర, జీలకర్ర, పొంగించిన ఇంగువ సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి భోజనంలో మొదటి ముద్ద తో ఒక స్పూన్ చూర్ణం , కొంచం నెయ్యి వేసుకొని కలుపుకొని తినవలెను . 40 రొజుల పాటు ఉదయం , సాయంత్రం తీసుకున్నచో అజీర్ణరోగం మాయం అగును. ఇక్కడ పొంగించిన ఇంగువ అనగా ఇంగువని ఒక గుంట గంటె లో వేసి వేడిచేస్తే పొంగును.

 *  ద్రాక్షాను చక్కర , తేనెతో కలిపి గాని ఎండించిన కరక్కాయ చూర్ణంను చక్కెర , తేనెతో గాని కలిపి తీసుకొనుచున్న కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన వచ్చు పుల్లటి తేపులు , అజీర్ణదోషాలు నివారణ అగును.

 *  చిత్రమూలం, చవ్యము, శొంఠి , పిప్పళ్లు, వాము వీటితో తయారుచేయబడిన గంజిని తాగుచున్న అజీర్తిని , శరీరంలోని వాతాన్ని నివారిస్తుంది. పొట్టని శుద్ది చేస్తుంది.

        అజీర్ణరోగమునకు ఔషదాలు తీసుకొనే ముందు ఉదరమును శుద్ది చేయు ఔషదాలను ముందుగా సేవించి ఉదరమును శుద్ది చేసుకుని అటు పిమ్మట అజీర్ణాన్ని పోగొట్టే  ఔషధాలను మొదలుపెట్టవలెను.