పరమాచార్య వారు గొప్ప పరిశోధకులు...1
పరమాచార్య వారి జ్ఞానం అనంతం. వారికీ అన్ని శాస్త్రాలపై సునిసిత అవగాహన ఉన్నది.
ఒకసారి రష్యా నుంచి స్వామి దర్శనానికి వచ్చిన ఒక ప్రొఫెసర్ భారతదేశ ఋషుల గురించి వారితో చర్చించటం ప్రారంభించారు.
స్వామి "రష్యా కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకు?"
ప్రొఫెసర్ "మీరు చెబితే తెలుసుకుంటాను."
స్వామి "హిమాలయాలకు దక్షిణ భాగాన్ని భరత వర్షం అన్నట్లే ఉత్తర భాగాన్ని ఋషి వర్షం అని పిలిచేవారు. అదే ప్రజల నోట పడి రష్యా గా మారింది.దీనికి ఋజువు కావాలంటే ఆ ప్రదేశంలో ఇప్పటికి కొందరు స్త్రీలు
అగస్త్య మహాముని భార్య అయిన లోపాముద్ర పేరు పెట్టుకోవడం గమనించవచ్చు. వారి ఉచ్చారణ వల్ల అది లోపాముట్రా వియా గా మారింది."
ఆశ్చర్యం తో నోరు తెరవడం ప్రొఫెసర్ వంతు అయ్యింది.
వారు చరిత్ర లో కూడా గొప్ప పరిశోధకులు..
ఉత్తర మెరూరు ప్రాంతం లో కనుగొన్న ఒక శిలా శాసనం లో గుడ్ వొలై అనే ఎన్నికల విధానం అమలులో ఉన్నట్లు చెక్కబడి ఉన్నది. స్వామి వారు దీనిని వివరిస్తూ
"రాజారాజచోళుని కాలంలో రాజరిక వ్యవస్థ అమలులో ఉండేది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం ప్రజాస్వామ్య పధ్ధతిలో జరిగేవి. అవే గుడ్ వొలై విధాన ఎన్నికలు " అని వివరించారు.
***ఈశ్వరునుకి ఉండే అనంత విభూతులలో ఒకటి సర్వజ్ఞత్వం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి