13, నవంబర్ 2023, సోమవారం

Uppu tayaari

 


సత్యభామ

 https://youtu.be/GiEY4rbC0d0?si=VXOMIuxbu8MVr89Z


శ్రీభారత్ వీక్షకులకు దివ్య దీపావళి శుభాకాంక్షలు 🌹 దీపావళి అంటే వెంటనే గుర్తుకు వచ్చేవి ప్రమిదలు, దీపాలు. ఆ వెంటనే గుర్తుకు వచ్చేది సత్యభామ చేసిన నరకాసుర వధ కథ. ఆనాడు ఒక నరకాసురుని వధించడానికి ఒక సత్యభామ ఉంది. కానీ ఇప్పటి సమాజంలో అడుగడుగునా నరకాసురులే. వారిని అణచివేయాలంటే ప్రతి మహిళ ఓ సత్యభామ కావాలని అంటున్నారు  ప్రముఖ రచయిత్రి ( అమెరికా నుంచి )డా. కొండపల్లి నీహారిణి గారు. ఈ దీపావళి స్పెషల్ వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

Panchaag


 

శ్రీ సూర్య దేవాలయం

 🕉 మన గుడి : నెం 238


⚜ గుజరాత్ : మోధేరా






⚜ శ్రీ సూర్య దేవాలయం


💠 ఈ సృష్టిలో సకల జలాచర జీవాలకు మూలం ఆదిత్య భగవానుడే.

సూర్యుడంటే ఒక మండుతున్న గోళమే కాదు... మానవాళి మనుగడకు ప్రతిరూపం. అనునిత్యం మనకు ఆ వెచ్చదనం తగలకపోతే అనేక రుగ్మతల బారిన పడవలసి వస్తుంది మన దేహం. అందుకనే  ప్రపంచంలోని వివిధ దేశాలలో దేవునిలాగే స్తుతిస్తున్నారు. తరతరాల భారత సంప్రదాయం ప్రకారం తొలితరం మానవులు సూర్యుడినే తమ అధిదేవునిగా కొలిచేవారు. ఉదయం లేవగానే సూర్యనమస్కారాలు చేయడం వలన కలిగే ఉపయోగాలను వేల సంవత్సరాల క్రితమే మన వాళ్లు తెలుసుకోగలిగారు. శాస్త్ర పరిశోధనలు కూడా ఉదయం సూర్యుని నులివెచ్చని కిరణాలలో ప్రసరించే వెలుగులో ఎన్నో ఆయురారోగ్యదాయకాలున్నాయని చెబుతున్నారు. 


💠 అహ్మదాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న 'పుష్పవతి' నది ఒడ్డున ఈ మోడేరా దేవాలయం ఉంది. 

ఈ ఆలయాన్ని 1022-1063లో చక్రవర్తి భీమ్ రావ్ సోలంకి-నిర్మించారు. 

1025-1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుపక్కలనున్న ప్రాంతాలను విదేశీ అక్రమణదారుడైన మహమ్మద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది.

గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. సోలంకీ సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే 'అహిల్వాడ్ పాటణ్ కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది. తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 


💠 సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. 

ఈ విధంగా మోడేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో 3 సూర్యదేవుని ఆలయాలున్నాయి. 

వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ మందిరం, రెండవది జమ్మూలోనున్న మార్తాండ్ ఆలయం మరియు మూడవది మనం చెప్పుకుంటున్న గుజరాత్ లోని మోడేరాకు చెందిన సూర్య మందిరం. 


💠 ఈ ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశేషం ఒకటుంది. అదేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఉపయోగించకపోవడం విశేషం. ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమ్ రావ్ నిర్మించారు. ఇందులో తొలిభాగం గర్భగుడి కాగా రెండవది భూ మండపం. మందిరం గర్భగుడి లోపల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు. అలాగే వెడల్పు 25 అడుగులు 8 అంగుళాలుగా నిర్మించడం జరిగింది. మందిరంలోని సభా మండపంలో 52 స్తంభాలున్నాయి. 

ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు చెక్కారు.


💠 రామాయణం,. భారతంలోని ప్రధానమైన విషయాలను కూడా చెక్కారు. 

స్తంభాల కింది. భాగంలో చూస్తే అష్టకోణాకారంలోను అదే పైభాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి. తొలి సూర్యకిరణం ఈ ఆలయ గర్భ గుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. 

సభామండపానికి ఎదురుగా విశాలమైన మడుగు ఉంది. దీనిని ప్రజలు సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారు. 


💠 అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునాతునకలు చేసేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.


🔅 పౌరాణిక చరిత్ర 🔅


💠 స్కందపురాణం మరియు బ్రహ్మపురాణాల ననుసరించి ప్రాచీనకాలంలో మోఢరా చుట్టు ప్రక్కలనున్న ప్రాంతాలను 'ధర్మారణ్య' అని పిలిచేవారు. 

శ్రీరామ చంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు, బ్రహ్మ హత్యాపాపం నుంచి బయట పడేందుకు పవిత్రమైన స్థానం చూపించమని వశిష్టుడిని అడిగాడని పురాణాలు చెబుతున్నాయి. 

అప్పుడు వశిష్ట మహర్షి 'ధర్మారణ్య’ వెళ్ళమని శ్రీరామచంద్రునికి సలహా ఇచ్చాడు. 

ఆ క్షేత్రమే మోధేరా పేరుతో పిలవబడుతోంది.


💠 రోడ్డు మార్గం : 

మోఢరా సూర్యదేవుని ఆలయం అహ్మదాబాద్ నుండి  102 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది.

ప్రథమాధ్యాయము

 

Kartika Puranam - 1


ప్రథమాధ్యాయము


శ్లో!! వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాముపక్రమే!

యన్నత్వా కృతకృత్యాస్స్యుః తం నమామి గజాననమ్!!

ఋషయ ఊచుః


శ్లో!! వశిష్ఠేన విదేహాయ కథితం బ్రూహినో మునే!

శ్రోతుకామావయంత్వత్తః కార్తీకవ్రతముత్తమమ్!!


తా!! నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహామునులు సూతుని ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమని అడిగిరి.

సూతుడు శౌనకాది సమస్తమునీశ్వరులారా! వినుడు. ఈ కార్తీకమహాత్మ్యమును వశిష్ఠమహాముని జనకమహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపదలు ప్రాప్తించును. దీనిని విన్నవారు జననమరణ రూప సంసార బంధనమును త్రెంచుకుని మోక్షము పొందుదురని ఈ విధముగా చెప్పాను.

ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠ మహాముని జనకమహారాజు గృహమునకు చేరెను. అంత జనకమహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనమునుండి దిగి సాష్టాంగ దండ ప్రణామము చేసి సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనము ఇచ్చి వికసించిన తామరపువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త జంతువులయందు దయగలవాడును, బాలసూర్య సమాన కాంతిగలవాడును, సమస్త సుగుణ సంపన్నుడు అగు మునికి భక్తి భావముతో ఇట్లని విన్నవించెను.

బ్రాహ్మణోత్తమా! మీదర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యమింకేమియు లేదు. ఇప్పుడు మా పితరులందరును తృప్తినొందినారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకు దుర్లభము. ఇప్పుడు మీరాక నాకు శుభములకు కారణమైనది అనగా వశిష్ఠమహర్షి వికసించిన ముఖముగలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో రాజోత్తమా! నీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రమమునకు బోవుచున్నాను. రేపు మా ఇంటివద్ద యజ్ఞము జరుగును. దానికి తగిన ద్రవ్యము ఇవ్వవలసినదిగా అడిగాడు.

ఆ రాజు మునీశ్వరా! యజ్ఞమునకు కావలసిన ద్రవ్యమును ఇచ్చెదను. కాని వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీవలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చెడి సూక్ష్మధర్మములను నాకు చెప్పుము. మునీశ్వరా! ధర్మజ్ఞా కార్తీకమాసము సమస్త మాసములకంటెను, సమస్త ధర్మములకంటె ఎట్లు అధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుమని అడగగా

వశిష్ఠుడు ఇట్లు పల్కెను. రాజా! పూర్వ పుణ్యమువలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాషగలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్త్వగుణము కలుగును. రాజా! సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీకవ్రతమును తులాసంక్రమణము = సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని, కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని, ఆరంభించి నెలరోజులు చేయవలెను. ఆరంభమందు ఓ దామోదరా! నేను కార్తీకవ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తిచేయుము అని సంకల్పము చేసి కార్తీకస్నానమారంభించ వలెను. కార్తీకమాసమునందు సూర్యోదయ సమయమున కావేరీనదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగుతుంది. సూర్యుడు తులారాశిని ప్రవేశించినతోడనే మూడులోకములను పవిత్రముజేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త జలములయందును ప్రవేశించును. తులారాశియందు కార్తీకమున చెరువులందును, దిగుడు బావులందును, నూతులందును, చిన్నకాలువలందును హరి నివసించియుండును. కార్తీకమందు వ్రతము అన్ని వర్ణముల వారు చేయవచ్చును.

బ్రాహ్మణుడు కార్తీకమాసమందు గంగకుబోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళుచేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రములచేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షిపితృతర్పణ మాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచికట్టుకొని ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సును వదలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలెను. తరువాత గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనముచేసి గాయత్రీజపము చేయవలెను. స్త్రీలు గౌరీజపము చేయవలెను. తరువాత ఔపాసనముగావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలోనుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రమమందు షోడశోపచారములతో పూజించవలెను. తరువాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వేదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనముగావించి, తరువాత పురాణకాలక్షేపమును చేయవలయును. సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి, విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని, తన శక్తి కొలది దీపములుబెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణుస్తోత్రమును గాని శివస్తోత్రమునుగాని పఠించి నమస్కారములాచరించవలయును. ఎవడు కార్తీకవ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తివర్జితమైన వైకుంఠమును బొందుచున్నాడు. పూర్వజన్మార్జితములున్ను ఈ జన్మార్జితములున్ను అయిన సమస్త పాపములు కార్తీకవ్రతమాచరించిన యెడల నశించును. బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, ఋషీశ్వరుడుగాని, స్త్రీలుగాని భక్తి శ్రద్ధలతో కార్తీకవ్రతమును జేసిన యెడల వానికి పునరావృత్తిలేని వైకుంఠమునొందుదురు. ఎవ్వడు కార్తీకవ్రతమాచరించు వానిని చూచి సంతోషించునో వానియొక్క పగటికాలమందు ఆచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు.


ఇతి స్కాందపురాణ కార్తీకమహాత్మ్యే ప్రథమాధ్యాయ సమాప్తః

పన్నులు మనకు సక్రమంగా ఉపయోగపడేలా చేసేవారిని ఎన్నుకుందాం

 *మూడు ప్రధాన రాజకీయ పార్టీల హామీలలో గ్యాస్ సిలిండర్ అనేది ప్రధాన అంశంగా కనిపిస్తోంది....* *అసలు గ్యాస్ సిలిండర్ తోనే మన బ్రతుకులు మొత్తం ముడిపడి ఉన్నాయా....?*

*ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఒక్కరోజు లోనే కొన్ని వేల రూపాయలు ఆసుపత్రులలో ఖర్చవుతున్నాయి.*

*ప్రభుత్వ విద్య మీద నమ్మకం లేక లక్షలాది మంది పిల్లలు ప్రైవేటు స్కూల్ లలో చదువును....కొంటున్నారు.*

*ఇంకా అనేక ప్రధాన సమస్యలు వదిలేసి సిలిండర్లు అని ఫించన్లు పెంచుతాం అని ఇంకెన్నాళ్లు మనతో ఈ రాజకీయాలు ....*

*వాళ్ళు మాత్రం ఖరీదైన*

*వాహనాల్లో తిరుగుతారు*

*వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తారు*

*మంచి జీవితాన్ని అనుభవిస్తారు*

*మనం మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉండాలి*

*చిన్న చితకా తాయిలాలకు పడిపోవాలి*

*ఒ ఓటరు మహశయ జర ఆలోచించె...*


*👉పిల్లల ఫీజులు వేలకు వేలు పెంచితే అడిగేటోడు లేడు*


*👉 కరెంట్ చార్జీలు పెంచితే ఆడిగేటోడు లేడు*


*👉 ఆర్టీసీ చార్జీలు పెరిగితే ఆడిగేటోడు లేడు*


*👉 రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే ఆడిగేటోడు లేడు*


*👉 ఇంటి పన్నులు పెంచితే ఆడిగేటోడు లేడు*


*👉 మద్యం తాగి బయటకొస్తుంటే పట్టుకుని కేసులు రాస్తుంటే ఆడిగేటోడు లేడు*


*👉 రోడ్ల పక్కన బండ్లు పెడితే పోలీసులు ఫొటోలు తీసి వేల రూపాయలు ఫైన్ లు నొక్కుతుంటే ఆడిగేటోడు లేడు*


*👉 రోడ్ల పక్కన పండ్లు కూరకాయలు అమ్ముకుంటుంటే ఫొటోలు తీసి ఫైన్లు వేస్తుంటే ఆడిగేటోడు లేడు*


*👉 హరితహారం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క చెట్టును పెంచకపోయినా అడిగేటోడు లేడు*


*👉 కోట్ల కొద్దీ కోతులు పెరిగి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకునేవాడు లేడు*


*👉పాతిక వేల రూపాయలు న్న మద్యం టెండర్ ఫీజును రెండు లక్షలకు పెంచితే ఆడిగేటోడు లేడు*


*👉 నీళ్లతో తయారయ్యే మద్యం వేల రూపాయలకు అమ్ముకుంటుంటే  ఆడిగేటోడు లేడు.*


*👉 గోదావరి లో పుక్యా నికి కొట్టకొచ్చే ఇసుకను కూడా వేల రూపాయలకు అమ్ముకుంటుంటే ఆడిగేటోడు లేడు..కానీ*

*మనం కరోనా మహమ్మారి నుండి బతికి బట్ట కట్టడానికి వేల కోట్లు గుమ్మరిస్తే అవి ఎక్కడ నుంచి వచ్చాయని ఆడిగినోడు లేడు.*


*కరోనా కష్ట కాలం లో రెండున్నర సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తుంటే ఎక్కడినుండి వచ్చాయని ఆడిగినోడు లేడు..*


*👉 కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ కి ప్రతి నెలా వేల కోట్ల రూపాయలు పంపిస్తున్నా అవి ఎలా ఖర్చు చేస్తున్నారు అని పట్టించుకున్నోడు లేడు*


*👉ఇవన్నీ ఎక్కడనుండి వస్తున్నాయని తెలుసుకున్నోడు లేడు*


*👉 కానీ...*

*విదేశాలనుండి కొనుక్కొచ్చే పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ల రేట్లు పెరిగితే మాత్రం ఒక్కొక్కడు ఎగేసుకుని ఎగిరెగిరి పడుతున్నారు..*


*👉  మనం కట్టే పన్నులు మనకు సక్రమంగా ఉపయోగపడేలా చేసేవారిని ఎన్నుకుందాం..భావితరాలకు భవిష్యత్తు నిద్దాం......*

 శు భో ద యం🙏


వేణుగానం!


"ఏది మరొక్కసారి,హృదయేశ్వర!,గుండెలు పుల్కరింపఁగా/

ఊదగదోయి!ఊదగదవోయి!సుధామయ యుష్మదీయ వే /

ణూదయ రాగడోలికల నూయలలూగుచు విస్మృతిలో విలీనమై /

పోదును; నాదుక్రొవ్వలపుపువ్వుల ముగ్ధపరీమళమ్ముతో;


కరణామయి-ఉదయశ్రీ-

జంధ్యాలపాపయ్యశాస్త్రి.


        ఈపద్యంవింటే రాధికయేగాదు మనంగూడా తన్మయులమైపోతాం.శాస్త్రిగారి కవితాశక్తియలాంటిది!

         హే హృదయేశ్వరా! కృష్ణా! మరోసారి వేణువూదవా! మరోసారి,ఆఁహః కాదుకాదు మరోసారి,బృందావనిలోనీవు వేణువూదుతుంటే,ఆవలపుగానంలో నాతనువూ మనసూ మరచి తన్మయస్ధితిలోలీనమై, నాతొలివలపుల తీయనియూహలు మదిలో నూగుచుండగా,నీకోసంఈ రాధపరవసిపోతుంది.నీకోసం పలవరిస్తుంది.

మరొక్కసారి వేణువు నూదవయ్యా!కృష్ణా! నాకోసం,కాదుకాదు, మనకోసం;

          ఇదీ ఈపద్యంలోని రాధపిలుపు.శాస్త్రిగారి పద్యంలో వలపు రవంతైనా మీకు అందించగలిగానా నాజన్మధన్యమే!

                             స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీ ద్వారకాధీశ్ / ద్వారకానాద్ మందిర్

 🕉 మన గుడి : నెం 237


⚜ గుజరాత్ : ద్వారక






⚜ శ్రీ ద్వారకాధీశ్ / ద్వారకానాద్ మందిర్



జగమేలే పరమాత్ముడు పూరీలో జలభద్ర సుభద్రలతో కూడి ప్రపంచాన్ని భద్రంగా చూస్తుంటే, పశ్చిమ సముద్రతీరంలో ద్వారకాధీశుడు స్వర్గానికి, మోక్షానికీ ద్వారం చూపిస్తూ ఆత్మవతి అయిన రుక్ష్మిణీ దేవికి తన అంతర్యం చెప్పుకుంటూ ఉంటాడు. ఇలా పశ్చిమ సముద్ర తీరాలలో శ్రీ కృష్ణ దివ్యక్షేత్రాలు నెలకొని ఉండటం ఈ పుణ్య భూమి విశేషం.



ద్వార (తలుపు) మరియు కా (బ్రహ్మ) అనే రెండు పదాల నుండి వచ్చిన 'ద్వారక' అనే పేరు 'బ్రహ్మతో ఆధ్యాత్మిక కలయికకు ప్రవేశ ద్వారం'.  


🔔 స్థలపురాణం 🔔


💠ప్రస్తుత ఆలయం 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. నిజమైన ద్వారక సముద్రంలో మునిగిపోయింది.

శ్రీకృష్ణుని ద్వారకా  సముద్ర గర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం


💠ద్వారక శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది. గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైందిగా విశ్వసిస్తారు. జరాసంధుని బారినుండి తప్పింకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది.


💠మోక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక"  భారతదేశములో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామము ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.

భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్ర క్షేత్రాలలో ద్వారకాపురి ఒకటి.


💠మధుర పురజనుల యోగ క్షేమములు దృష్టిలో నుంచుకొని , జన నష్టము , ధన నష్టము మధురలో కలుగ నీయకుండుటకై గొప్ప యోచన చేసి శ్రీకృష్ణుడు దుర్భేద్యమగు రీతిలో పశ్చిమ సముద్రమున ఒక గొప్ప నగరమును దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత నిర్మింపజేశాడు.

 అదే ఈనాటి " ద్వారక "


💠ద్వారక చేరిన కొన్ని నాళ్లకు బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి రైవతుడు అను రాజు తన కుమార్తె రేవతిని బలరామునకిచ్చి వివాహము చేసెను .

 తరువాత శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు కుమార్తె అయిన రుక్మిణీ దేవిని రాక్షస వివాహ రీతిలో వివాహము చేసికొని ద్వారకకు కొనిపోయెను . 

 రుక్మిణి శ్రీమహాలక్ష్మిlvv0v అంశము , శ్రీకృష్ణుని పట్టపురాణి అయినది . 


💠తదుపరి సత్యభామ , జాంబవతి , కాళింది , భద్ర ,లక్షణ ,మిత్రవింద , నాగ్నజితి అనువారిని శ్రీకృష్ణుడు వివాహము చేసికొనెను . 

 ఆ విధముగా అష్ట భార్యలతో ద్వారకలో శ్రీకృష్ణుడు యాదవులతో గొప్ప జీవితమును గడపుచుండెను . 


💠ద్వారక లో ఉన్నప్పుడే  సత్యభామా సమేతుడై నరకాసురునితో యుద్ధమున వధించి,  నరకుని మందిరములో ఉన్న 16,000 మంది అందగత్తెలు అయిన రాజకన్యలను అంతఃపురమునకు చేర్పించుకొని, తరువాత శాస్తోక్తముగా వివాహము చేసికొనెను.


💠ద్వారక లోనే పారిజాత వృక్షమును స్వర్గము నుండి తెచ్చుట .ఆ దేవతలందరితో యుద్ధము చేసి దేవేంద్రుని తరిమిగొట్టుట , ద్వారక లోనే  పరమ భాగవతోత్తముడైన బాల్యమిత్రుడు సుదాముడు ( కుచేలుడు ) దారిద్ర్య బాధవలన భార్య పంపున రాగా అతని నుండి పిడికెడు అటుకులు అతి ప్రీతితో ఆరగించి సకల సంపదలను మోక్షమును అనుగ్రహించుట .


💠ద్వారక లోనే అర్జునునిచే ఖాండవ దహనము చేయించి గాండీవమును అక్షయ తూణీరములను సంపాదించి పెట్టుట , మహాభారత యుద్ధమున సర్వము తానే అయి ధర్మ సంస్థాపనార్థము పాండవుల పక్షమున ఉండి కౌరవులను నిర్జింపచేసి భూభారమును తగ్గించి ధర్మరాజును రాజ్యాభిషిక్తుని చేయుట . ఇంకను ఎన్నియో కలాపముల రచన ఈ ద్వారకా నగరమున ఉండియే కావించి నిర్వహించెను . 


💠 ద్వారక లోనే తన అవతార సమాప్తి సమయమున   నిర్వికారుడై ప్రభాస తీర్థమునకు పోయి ఒక చెట్టు క్రింద కూర్చుని యుండి తన పాదము ఒక కిరాతకునికి  పక్షి వలె కనిపించునట్లు ఉంచి ఆ కిరాతకుడు బాణము వేయగా దేహమును వీడి అవతార సమాప్తి గావించుకొని శ్రీవైకుంఠమునకు పోయెను .

ఈ మహోత్తర ఘట్టం కూడా ద్వారక లోనే.


💠 శ్రీకృష్ణ నిర్యాణము తరువాత ద్వారక సముద్ర గర్భములో కలిసి పోయెను .

ఆ సముద్ర మధ్యమమును బేట్ ద్వారక అని ప్రస్తుతము వ్యవహరించుచున్నారు . లాంచిలో దర్శించ వచ్చును . సముద్రాంతరమైన ద్వారక మనకు కనిపించదు . ఒక చిన్న ద్వీప భాగమున బేట్ ద్వారకలో శ్రీకృష్ణ మందిరము ఉన్నది


💠 ఈ ఆలయం తెల్లవారుజామున 5 గంటల నుండి  తెరవబడుతుంది.

ఉదయం చిన్నపిల్లవాడిగా, మద్యాహ్నం  రాజుగా ఆ తరువాత పురాతన వృద్ధ మహర్షిగా దర్శనం ఇస్తారు.


💠 స్వర్గద్వారం, మోక్షద్వారం రెండు ద్వారాలలో ఆలయంలోకి ప్రవేశమార్గం ఉంది. గర్భ గుడిలో 4 భుజాలతో విలసిల్లే త్రివిక్రమమూర్తి  ఉన్నారు. 

ఆలయం సమీపంలో బలరాముడికి,ప్రద్యుమ్న, అనిరుద్దలకూ, శివ కేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలు ఉన్నాయి. 

దేవకి, రాధ, బాంబవతి, సత్యభామా,శంఖ చక్రములను ధరించిన శ్రీకృష్ణుడు , కళ్యాణ కృష్ణ సన్నిధి, లక్ష్మీనారాయణ సన్నిధి ,దేవకి సన్నిధి , జాంబవతి సన్నిధి కలవు .


💠 రుక్ష్మిణీ దేవికి మాత్రం ద్వారకాధీశ మందిరానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. 

గోమతి సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంటే దానికి 2 కి.మీ. దూరంలో రుక్ష్మిణి ఆలయం ఉంది.

చన్ద్రశేఖరుడిని పాహి అన్నాను

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*_మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం_*

*_పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం_*

*_దేవసింధు తరంగశీకర సిక్తశుభ్ర జటాధరం_*

*_చన్ద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః_.....*


_ *_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -03_* _


భావము:

ఏనుగు చర్మము ధరించి లోకాలను  ముగ్ధులను చేసే, పద్మముల వంటి పాదములు కలిగి, బ్రహ్మ విష్ణువులచే  పూజింపబడే, గంగా తరంగములతో తడిసిన జటా ఝూటం కలిగిన,  శిరమును చన్ద్రుని ధరించిన ఆ చన్ద్రశేఖరుడిని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?

*సోమవారం, నవంబరు 13, 2023*

 శుభోదయం,. నేటి పంచాంగం         卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*సోమవారం, నవంబరు 13, 2023*

  *శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

    *దక్షిణాయనం - శరదృతువు*

*ఆశ్వయుజ మాసం - బహళ పక్షం*

తిథి  : 🌚 *అమావాస్య* మ2.19 వరకు

వారం  : *సోమవారం* (ఇందువాసరే)

నక్షత్రం : *విశాఖ* తె3.49 వరకు  

యోగం: *సౌభాగ్యం* సా4.30 వరకు

కరణం : *నాగవం* మ2.19 తదుపరి *కింస్తుఘ్నం* రా2.16 వరకు

వర్జ్యం               : *ఉ8.48 - 10.27*

దుర్ముహూర్తము : *మ12.06 - 12.51* మ2.21 - 3.06*

అమృతకాలం    : *సా6.43 - 8.22*                     

రాహుకాలం : *ఉ7.30 - 9.00*

యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*

సూర్యరాశి: *తుల* || చంద్రరాశి: *తుల*

సూర్యోదయం: *6.07 సూర్యాస్తమయం: *5.21* *కేదారగౌరీవ్రతము*

 ఆకాశదీప ప్రారంభము

*సర్వేజనా సుఖినో భవంతు *

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



శచీపతీ! వీరూ దేవతలేకదా! సూర్యనందనులు. సోమరసానికి అర్హులు కాకపోవడమేమిటి?

సంకర్తులు కారు. సూర్యుడికి ధర్మపత్నియందు జన్మించినవారే! ఏ తప్పు చేశారని ఈ పంక్తి బహిష్కారం? ఈ విషయంలో నువ్వూ దేవతలూ అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం ప్రకటించండి. వీరికి

సోమరపం ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఇందుకోసమే శర్యాతిని ప్రోత్సహించి ఈ వితతయజ్ఞం

జరిపించాను. అంచేత మాట నిలబెట్టుకోవలసిన అవసరం నాకుంది. దేవేంద్రా! ఈ ఇద్దరూ నాకు మహోపకారం చేశారు. ఈ రూపూ ఈ చూపూ ఈ వయసూ అన్నీ వారి వరప్రసాదమే. దానికి ప్రత్యుపకారం

చెయ్యడం నా ధర్మం నా కర్తవ్యం. దయచేసి నువ్వు ఇప్పుడు అడ్డుచెప్పకు. అంగీకరించు అన్నాడు చ్యవనుడు. చ్యవనమహర్షీ! వీరు దేవవైద్యులు. సోమరసాన్ని వీరు పుచ్చుకోకూడదు. ఇది దేవతల నిర్ణయం -ఇంద్రుడు కొంచెం కోపంగానే అన్నాడు అహల్యాజారా! నిగ్రహించుకో. కోపం నిరర్ధకం. వృత్రమా! దేవవైద్యులైనంతమాత్రాన

సోమసురాపానం చెయ్యకూడదని ఎలా అంటావు ? సరియైన కారణం లేకుండా నిషేధించడం

సమంజసం కాదుగదా! అని చ్యవనుడు గట్టిగా వాదించాడు. దేవతలలో ఒక్కరుఉలకలేదు.

పలకలేదు. సూర్యసమతేజస్కుడైన చ్యవనభార్గవుడు తన తపోబలంతో అశ్వినులకు సోమపానం చేయించాడు

కార్తీక మాస* పర్వదినాలు.

 *కార్తీక మాస* పర్వదినాలు...iii


14/11/2023 మంగళవారం 

*కార్తీక మాస ప్రారంభము* 

15/11/2023 బుధవారం 

*యమ విదియ, భగినీ హస్త భోజనం* అన్నాచెల్లుల పండుగ

17/11/2023 శుక్రవారం 

*నాగుల చవితి* (భక్తులు స్వయంగా పాలు పోసుకోవచ్చు)

20/11/2023  సోమవారం 

*కార్తీక సోమవారం - 1* 

23/11/2023 గురువారం.              

 *ఏకాదశి* 

24/11/2023 శుక్రవారం 

*క్షీరాబ్ది ద్వాదశి* 

25/11/2023 స్థిరవారం.                

 *శని త్రయోదశి* 

26/11/2023 ఆదివారం 

*కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం* 

27/11/2023 సోమవారం 

*కార్తీక సోమవారం 2* 

30/11/2023 గురువారం 

*ఆరుద్ర నక్షత్రము* 

04/12/2023 సోమవారం

*కార్తీక సోమవారం - 3* 

10/12/2023 ఆదివారం *త్రయోదశి నందీశ్వర అభిషేకం*

11/12/2023  *కార్తీక సోమవారం - 4,మాస శివరాత్రి |* 

12/12/2023 మంగళవారం.           

 *అమావాస్య* 

13/12/2023 బుధవారం.       

 *పోలిస్వర్గం*

*13-11-2023* *ఇందు వాసరః సోమవారం* *రాశి ఫలితాలు

 *13-11-2023*

*ఇందు వాసరః సోమవారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

*వృషభం*

చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరస్తి  వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు. 

*మిధునం*

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికామౌతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.

*కర్కాటకం*

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

*సింహం*

ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

*కన్య*

చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. దీర్ఘకాలిక  వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. 

*తుల*

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన  రుణయత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన  పనుల్లో ఆటంకాలు. తప్పవు దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.  వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

*వృశ్చికం*

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల  ఆరోగ్య  విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాణాచలనాలు తప్పవు.

*ధనస్సు*

 నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

*మకరం*

కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

*కుంభం*

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

*మీనం*

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.  కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక  నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేరుతాయి.

🕉️

అనంతగిరి కొండల అందాలు

 M


 అనంతగిరి కొండల అందాలు ట్రెక్కింగ్ ద్వారా ఈ వీడియోలో ఎలాంటి విషయ విశేషాలు తెలుసుకుందాం👆👆