21, మే 2024, మంగళవారం

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది ఐదవ అధ్యాయము*


*బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*45.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*తయోర్ద్విజవరస్తుష్టః శుద్ధభావానువృత్తిభిః|*


*ప్రోవాచ వేదానఖిలాన్ సాంగోపనిషదో గురుః॥10031॥*


*45.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*సరహస్యం ధనుర్వేదం ధర్మాన్ న్యాయపథాంస్తథా|*


*తథా చాన్వీక్షికీం విద్యాం రాజనీతిం చ షడ్విధామ్॥10032॥*


అంతట గురూత్తముడైన ఆ బ్రాహ్మణుడు (సాందీపని) ఆ సోదరుల యొక్క నిర్మల సేవాభావములకును, సముచిత ప్రవర్తనలకును మిగుల ప్రసన్నుడయ్యెను. అందువలన అతడు వారికి చతుర్వేదములను, షడంగములను, ఉపనిషత్తులను వాత్సల్యపూర్వకముగా నేర్పెను. ఇంకను వారికి ధనుర్వేదమును, మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములను, న్యాయవైశేషికాది శాస్త్రములను, సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, ఆశ్రయము - అను ఆఱు భేదములతో గూడిన రాజనీతి శాస్త్రమును మెలకువలతోగూడ అధ్యయనము చేయించెను.


*45.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*సర్వం నరవరశ్రేష్ఠౌ సర్వవిద్యాప్రవర్తకౌ|*


*సకృన్నిగదమాత్రేణ తౌ సంజగృహతుర్నృప॥10033॥*


మహారాజా! పురుషులలో శ్రేష్ఠులైన ఆ బలరామకృష్ణులు సకలవిద్యలకును ప్రవర్తకులు. అందువలన గురువుగారు ఒక్కసారి చెప్పినంత మాత్రమున ఆ ఇరువురును ఆయా విద్యలను సంపూర్ణముగా గ్రహించుచుండిరి.


*45.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*అహోరాత్రైశ్చతుఃషష్ట్యా సంయత్తౌ తావతీః కలాః|*


*గురుదక్షిణయాఽఽచార్యం ఛందయామాసతుర్నృప॥10034॥*


మహారాజా! ప్రజ్ఞానిధులైన ఆ సోదరులు ఇరువురును పూనిక వహించి, అఱువది నాలుగు దినములలో అఱువది నాలుగు కళలను పుక్కిటబట్టిరి. పిమ్మట వారు సాందీపనితో 'గురువర్యా! మేము గురుదక్షిణను సమర్పింతుము. మీ అభీష్టమును తెలుపుడు' అని ప్రార్థించిరి.


*45.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం సంలక్ష్య రాజన్నతిమానుషీం మతిమ్|*


*సమ్మంత్ర్య పత్న్యా స మహార్ణవే మృతం బాలం ప్రభాసే వరయాంబభూవ హ॥10035॥*


మహారాజా! సాందీపని బలరామకృష్ణుల యొక్క అద్భుత మహిమను, మానవాతీతమైన (అసాధారణ) బుద్ధిబలమును గాంచి అచ్చెరువందెను. పిదప ఆ మహాత్ముడు తన భార్యతో సంప్రదించి ఇట్లు తెలిపెను- "శిష్యులారా! ప్రభాసతీర్థమున మా కుమారుడు సముద్రమున మునిగి మృతిచెందెను. ఆ బాలుని తీసికొనివచ్చి మా దంపతులకు అప్పగింపుడు. ఇదియే మాకు గురుదక్షిణ".


*45.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*తేథేత్యథారుహ్య మహారథౌ రథం ప్రభాసమాసాద్య దురంతవిక్రమౌ|*


*వేలాముపవ్రజ్య నిషీదతుః క్షణం సింధుర్విదిత్వార్హణమాహరత్తయోః|॥10036॥*


అపార బలపరాక్రమములుగల ఆ బలరామకృష్ణులు అందులకు మిగుల సంతసించిరి. అంతట ఆ మహాత్ములు రథమును అధిరోహించి, ప్రభాసతీర్థమునకు చేరి, సముద్రతీరమున క్షణకాలముపాటు అచట కూర్చుండిరి. అప్పుడు సముద్రుడు వారిని దివ్యపురుషులుగా గుర్తించి, సముచితరీతిలో వారిని పూజించెను.


*45.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*తమాహ భగవానాశు గురుపుత్రః ప్రదీయతామ్|*


*యోఽసావిహ త్వయా గ్రస్తో బాలకో మహతోర్మిణా॥10037॥*


పిమ్మట కృష్ణభగవానుడు అతనితో ఇట్లనెను. 'సాగరా! నీ ఉత్తుంగ తరంగములద్వారా మా గురుపుత్రుని నీలో చేర్చుకొంటివి. వెంటనే ఆ బాలకుని తీసుకొని వచ్చి మాకు అప్పగింపుము'.


*సముద్ర ఉవాచ*


*45.40 (నలుబదియవ శ్లోకము)*


*నైవాహార్షమహం దేవ దైత్యః పంచజనో మహాన్|*


*అంతర్జలచరః కృష్ణ శంఖరూపధరోఽసురః॥10038॥*


*45.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ఆస్తే తేనాహృతో నూనం తచ్ఛ్రుత్వా సత్వరం ప్రభుః|*


*జలమావిశ్య తం హత్వా నాపశ్యదుదరేఽర్భకమ్॥10039॥*


*అప్పుడు సముద్రుడు ఇట్లనెను* "దేవాదిదేవా! శ్రీకృష్ణా! మీ గురుపుత్రుని నేను అపహరించలేదు. శంఖరూపధరుడైన *పంచజనుడు* అను మహాదైత్యుడు నా జలములలో సంచరించుచున్నాడు. ఆ దుష్టుడే మీ గురు తనయుని అపహరించియుండవచ్చును'. ఆ మాటలను విన్నంతనే కృష్ణపరమాత్మ వెంటనే సముద్రజలములలో ప్రవేశించి, ఆ దైత్యుని హతమార్చెను. కాని, అతని ఉదరములో గురుసుతుడు కనబడలేదు.


*45.42 (నలుబది రెండవ శ్లోకము)*


*తదంగప్రభవం శంఖమాదాయ రథమాగమత్|*


*తతః సంయమనీం నామ యమస్య దయితాం పురీమ్॥10040॥*


*45.43 (నలుబది మూడవ శ్లోకము)*


*గత్వా జనార్దనః శంఖం ప్రదధ్మౌ సహలాయుధః|*


*శంఖనిర్హ్రాదమాకర్ణ్య ప్రజాసంయమనో యమః॥10041॥*


*45.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*తయోః సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితామ్|*


*ఉవాచావనతః కృష్ణం సర్వభూతాశయాలయమ్|*


*లీలామనుష్య హే విష్ణో యువయోః కరవామ కిమ్॥10042॥*


అంతట ఆ దైత్యుని శరీరమునుండి పుట్టిన శంఖము (పాంచజన్యము) ను తీసికొని, రథమువద్దకు వచ్చెను. పిమ్మట ఆ ప్రభువు హలాయుధధారియగు బలరామునితోగూడి, యమునకు అత్యంత ప్రీతిపాత్రమైన సంయమనీపురమునకు చేరి, శంఖమును పూరించెను. ప్రాణులను శాసించువాడైన యముడు ఆ శంఖముయొక్క మహాధ్వని విన్నంతనే ఆ మహాపురుషులకు ఎదురేగి, చక్కని స్వాగత సత్కారములతో భక్తిశ్రద్ధాపూర్వకముగా వారిని సేవించెను. పిమ్మట యమధర్మరాజు సకలప్రాణుల హృదయములలో అంతర్యామియై విరాజిల్లుచుండునట్టి శ్రీకృష్ణుని యెదుట వినమ్రుడై నిలిచి, ఇట్లు విన్నవించెను. 'లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణా! నేను మీ ఇరువురకును ఎట్టి సేవలొనర్పవలయునో తెలుపుము!


*శ్రీభగవానువాచ*


*45.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*గురుపుత్రమిహానీతం నిజకర్మనిబంధనమ్|*


*ఆనయస్వ మహారాజ మచ్ఛాసనపురస్కృతః॥10043॥*


*అంతట కృష్ణభగవానుడు ఇట్లు నుడివెను* "యమధర్మరాజా! మా గురుసుతుడు చేసికొనిన కర్మలను అనుసరించి, మీ కింకరులు అతనిని ఇచటికి తీసికొనివచ్చిరి. అతనిని మాకు అప్పగింపుము. ఇది నా ఆజ్ఞ".


*45.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*తథేతి తేనోపానీతం గురుపుత్రం యదూత్తమౌ|*


*దత్త్వా స్వగురవే భూయో వృణీష్వేతి తమూచతుః॥10044॥*


వెంటనే శ్రీకృష్ణుని ఆదేశమును అనుసరించి, యముడు ఆ బాలకుని తీసికొనివచ్చి వారియెదుట నిలిపెను. పిదప ఆ యదువంశ శిరోమణులు ఆ బాలకునితో సాందీపని సన్నిధికి చేరి, తమ గురువునకు అతనిని అప్పగించి, 'ఇంకను ఏమి కావలయునో తెలుపుడు' అని ప్రార్థించిరి.


*గురురువాచ*


*45.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*సమ్యక్సంపాదితో వత్స భవద్భ్యాం గురునిష్క్రయః|*


*కో ను యుష్మద్విధగురోః కామానామవశిష్యతే॥10045॥*


*45.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*గచ్ఛతం స్వగృహం వీరౌ కీర్తిర్వామస్తు పావనీ|*


*ఛందాంస్యయాతయామాని భవంత్విహ పరత్ర చ॥10046॥*


*పిమ్మట సాందీపని ఇట్లనెను* "నాయనలారా! మీరు చక్కని గురుదక్షిణను సమర్పించి, మమ్ము ఆనందింపజేసితిరి. మీ వంటి పురుషోత్తములకు గురువునైన నాకు ఇంక కోరుకొనదగినది ఏమి ఉండును? వీరులారా! మీరు మీ ఇండ్లకు వెళ్ళుడు, మీకు అజరామరమైన కీర్తి లభించును. అదీ సకలలోకములను పునీతమొనర్చును (మీరు దక్షిణ సమర్పించినరీతి, దాని వలన మీకు లభించిన కీర్తిప్రతిష్ఠలు లోకమునకే ఆదర్శప్రాయములు) మీరు అభ్యసించిన ఈ వేదశాస్త్రములును ఈ లోకమునందును, పరలోకము నందును నిత్యనూతనములై వర్ధిల్లుగాక!"


*45.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*గురుణైవమనుజ్ఞాతౌ రథేనానిలరంహసా|*


*ఆయాతౌ స్వపురం తాత పర్జన్యనినదేన వై॥10047॥*


ప్రియమైన పరీక్షిత్తూ! ఈ విధముగా బలరామకృష్ణులు గురుననుజ్ఞను పొంది, రథమునందు ఆసీనులైరి. పిదప వారు మేఘగర్జనవలె ధ్వనించుచు, వాయువేగమున సాగిపోగల ఆ రథముపై పయనించి, తమ మథురానగరమునకు చేరిరి.


*45.50 (యాబదియవ శ్లోకము)*


*సమనందన్ ప్రజాః సర్వా దృష్ట్వా రామజనార్దనౌ|*


*అపశ్యంత్యో బహ్వహాని నష్టలబ్ధధనా ఇవ॥10048॥*


వారి శుభాగమనమునకు సంతోషించుచు, పురప్రజలు ఎల్లరును వారిని జూచి, తాము కోల్పోయిన సంపదలను చాలాకాలమునకు మఱల పొందినంతగా పరమానందబరితులైరి.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే గురుపుత్రానయనం నామ పంచచత్వారింశోఽధ్యాయః (45)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట* యను నలుబది ఐదవ అధ్యాయము (45)

 

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

. *శ్రీ మంగళాదేవి ఆలయం*

🕉 *మన గుడి : నెం 324*


⚜ *కర్నాటక  :- మెంగళూరు*


⚜. *శ్రీ మంగళాదేవి ఆలయం* 



💠 మంగళాదేవి కొలువైన మంగళూరు

కర్ణాటక రాష్ట్రంలో అతి ముఖ్యమైన రేవు పట్టణం. బెంగళూరుకు పశ్చిమంగా 350 కిమీ విస్తీర్ణంలో అలరారే సుందర నగరం ఈ మంగళూరు. అదీకాక ఇక్కడ ఇలవేల్పుగా నిలిచిన మంగళాదేవి పేరు మీద వెలిసినదే ఈ పట్టణం. అలాగే ఇది భారతదేశంలోనే అతి పెద్ద రేవు పట్టణం.


💠 పురాణాల ప్రకారం.. మంగళా దేవి ఆలయాన్ని మహా విష్ణు దశావతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు ఈ ప్రదేశం స్థాపించినట్టుగా తెలుస్తుంది.


💠 నేపాల్ నుంచి వచ్చిన కొందరు సాధువుల సూచన మేరకు 9వ శతాబ్దంలో తులునాడును పరిపాలించిన అలుపా రాజవంశస్థుడు కుందవర్మన్ అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. కుందవర్మన్ ఈ ఆలయాన్ని కేరళ శిల్ప కళా నైపుణ్యంలో కట్టించడం విశేషం.


🔆 ఆలయ చరిత్ర


💠 కుందవర్మ తుళునాడులో ప్రసిద్ధి చెందిన రాజు. అతని పాలనలో, గోరకనాథ మరియు మచేంద్రనాథ అనే ఇద్దరు పవిత్ర సాధువులు నేపాల్ నుండి ఈ ప్రాంతానికి వచ్చారు. నేత్రావతి నది దాటి మంగళపురానికి చేరుకున్నారు. ఈ ఇద్దరు సాధువులు దాటిన ప్రదేశాన్ని గోరకదండి అని పిలుస్తారు.


💠 ఇద్దరు సాధువుల రాక గురించి విన్న రాజు, వారిని ప్రత్యక్షంగా సందర్శించాడు.

తమ వారసత్వాన్ని నిర్మించడానికి మరియు వివిధ మతపరమైన కార్యకలాపాలతో కూడిన కేంద్రంగా మార్చడానికి తమకు భూమిని మంజూరు చేయాలని వారు రాజును అభ్యర్థించారు.


💠 కుందవర్మ తన భూములలో మంగళాదేవికి అంకితం చేయబడిన ఆలయం ఉందని సాధువుల నుండి అతను తెలుసుకున్నాడు.

సాధువులు రాజును గతంలో అన్ని చారిత్రక సంఘటనలు జరిగిన ప్రదేశాలకు తీసుకెళ్లారు. సాధువులు రాజును ఒక ప్రదేశంలో త్రవ్వి, మంగళాదేవికి ప్రతీకగా ఉన్న లింగాన్ని తొలగించమని కోరారు మరియు దానిని రక్షించడానికి నాగరాజు ఉన్న మందిరంలో ప్రతిష్టించమని కోరారు.

పవిత్రమైన స్థలంలో గొప్ప శ్రీ మంగళాదేవి కోసం ఒక గొప్ప మందిరం నిర్మించారు..


💠 ఇక ఈ నగరానికి మంగళూరు అనే పేరు రావడానికి వెనుక చిన్న కథనం కూడా ఉంది.


ఇక్కడ కొలువైవున్న మంగళాదేవి దేవాలయాన్ని నాథ వంశీయుడైన మత్స్యేంద్రనాథుడు నిర్మించాడు. 

ఈ మత్స్యేంద్రనాథుడు, కేరళ రాజకుమారి అయిన పరిమళ అనే ఆమెతో కలిసి ఇక్కడకి వచ్చాడు. ఈమెను ప్రేమలాదేవి అని కూడా పిలిచేవారు. ఆ తరువాత ఈమె నాథమతాన్ని స్వీకరించి మత్స్యేంద్రునితోనే ఉండిపోయింది. మతం మారిన తర్వాత మత్స్యేంద్రుడు ఈమెకు మంగళాదేవి అని పేరు మార్చాడు. 

ఆమె చనిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకార్ధం ఇక్కడ బోలార్ అనే ప్రాంతంలో మంగళాదేవి ఆలయాన్ని నిర్మించాడు. 

టూకీగా ఈ మంగళూరు పూర్వ చరిత్ర ఇదే.


💠 ఇక హిందూ చరిత్రలో ఇది చాలా పురాతన, పౌరాణిక ప్రాశస్త్యం గల నగరం, రామాయణ ' కాలంలో శ్రీరాముడు ఈ నగరాన్ని ఏలినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. 

అలాగే మహాభారత కాలంలో పాండవుల్లో చివరివాడైన సహదేవుడు ఈ నగరాన్ని పరిపాలించాడు. 


💠 ఈ నగరాన్ని ఆనుకొని ఉన్న అనేక ప్రాంతాల్లో ఇప్పటికి చారిత్రక శిధిలాలు, వాటి అవశేషాలు, కధాగమనాలు అనేకం మనకి ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని నింపుతాయి. 

సుందర వనాలకి పెట్టిన కోటగా పేరుపొందిన కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు, చుట్టు పక్కల ఉన్న అటవీ ప్రాంతం చాలా మనోహరంగా ఉంటుంది.


💠 ఈ ఆలయం కేరళ శైలిలో నిర్మించబడింది , ఇది దక్షిణ భారతదేశంలోని కేరళ మరియు పశ్చిమ కనుమలలోని అన్ని దేవాలయాలలో సాధారణం , దీని నిర్మాణం చాలావరకు చెక్కతో తయారు చేయబడింది. 

ప్రధాన దేవత, మధ్య మందిరంలో మంగళాదేవి కూర్చున్న భంగిమలో ఉంది. 

గర్భగుడి చుట్టూ ఇతర దేవతలకు ఆలయాలు ఉన్నాయి.


💠 ఆలయం ప్రతిరోజూ  ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు  మరియు  సాయంత్రం 4 నుండి  రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది.


💠 ఈ ఆలయంలో వేద బ్రాహ్మణులు ప్రతిరోజూ అనేక పూజలు మరియు ఇతర ఆచారాలు నిర్వహిస్తారు


💠 నవరాత్రి (దసరా) తొమ్మిది రోజులూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ఏడవ రోజున, మంగళాదేవిని చండికా (లేదా మరికామాబా) గా పూజిస్తారు, 

ఎనిమిదవ రోజున దేవతను మహా సరస్వతిగా పూజిస్తారు. 

మహానవమి అని కూడా పిలువబడే తొమ్మిదవ రోజున అమ్మవారిని వాగ్దేవిగా, వాక్కుకు దేవతగా పూజిస్తారు, ఆయుధ పూజ నిర్వహిస్తారు. 


💠 దుర్గా దేవి క్రూరమైన రాక్షసులను సంహరించిన రోజుగా అన్ని ఆయుధాలు మరియు సాధనాలను పూజిస్తారు మరియు చండికా యాగాన్ని కూడా ఈ రోజు నిర్వహిస్తారు. 

దసరాగా జరుపుకునే పదవ రోజు రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు . అలంకరించబడిన దేవతను గొప్ప రథంపై అధిరోహించి, మందపాటి తాడులతో లాగి నట్టు ఊరేగింపుగా మర్నామికట్టెకి వెళుతుంది.

diploma job

 

Need 30 Mechanical diploma candidates with or  without experience for BOSCH 

Pune location. 

Pls inform anybody if u know. 

Salary 35 to  45 k (take home). 

2 years bond. Confirmation based on work efficiency after 2 years. 

Immediate requirement.  


praveen.ks@in.bosch.com


If it is not useful to you...

Share this in your circle, this may help  in someone's career.


Disclaimer. Blogger is not responsible for the content. Know better before proceed

వివాహం కుదరని* *యువతీ యువకులకు…*

 *చిరకాలంగా వివాహం కుదరని* 

*యువతీ యువకులకు…*


          *తిరుప్పరంకుండ్రం:*

               ➖➖➖


తమిళనాడు రాష్ట్రంలో మదురైనుండి 8 కిలోమీటర్ల దూరంలో ఈ సుబ్రమణ్యేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం ఉంది.


కార్తికేయుని 6 దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి.


ఈఆలయం చిన్న కొండ శిఖరము పై ఉంది. ఆలయం ఎత్తైనగోపురాలతో; విశాలమైన మండపాలతో ఉంటుంది. విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు అని చెబుతారు.


ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనతో స్వామికి వివాహం అయిన స్ధలంగా ఈక్షేత్రం ప్రసిద్దిచెందింది.


ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహం కార్తికేయ-దేవసేన వివాహసన్నివేశాన్ని చూపిస్తుంది.


ఇంద్రుడు కలశంతో నీళ్ళుపోస్తుఉండగా స్వామి కుడి చేతిని చాచి వుంటాడు. ఎడమవైపున దేవసేన సిగ్గుతో నిలబడి ఉంటుంది. చూడటానికి రెండు కళ్ళు చాలవు. అంత అందంగా వుంటారు.


*చిరకాలంగా వివాహం కుదరని యువతీ యువకులు ఇచ్చట స్వామివారిని దర్శంచి మ్రెుక్కుకుని వివాహం కుదిరిన తర్వాత స్వామి సన్నిధిలో మ్రెుక్కుబడిగా వివాహం చేసుకుంటారు.*


ఈ ఆలయంలో మహావిష్ణువు, పరమేశ్వరుడు ఎదురెదురుగా వుంటారు.


కార్తీక పౌర్ణమి రోజున కొండపైన కార్తీక దీపం వెలిగిస్తారు.కొండచుట్టు ప్రదక్షిణ చేసి కార్తీక దీపాన్ని స్వామి వారిని దర్శించుకుని తరిస్తారు. ఊరంతా దీపాలతో కళకళలాడుతూ వుంటుంది. మనకు చూడటానికి రెండు కళ్ళు చాలవు. 


మరో విశేషం ఏమిటంటే, మిగిలిన అయిదు ఆలయాల్లో స్వామి నిలబడి ఉంటారు. 


తిరుప్పరన్‌కుణ్రమ్ గుహాలయంలో మాత్రం ఆయన ఆసీనుడై ఉంటారు. ఒకవైపు దేవసేన, మరోవైపు నారద మహర్షి విగ్రహాలు ఉంటాయి. 


ఈ ఆలయంలో స్వామి విగ్రహానికి బదులు ఆయన శూలానికి (వేలాయుధం) అభిషేకాలు నిర్వహిస్తారు. 


ఒకానొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శపింపబడతారు.


వారి యొక్క శాప విమోచనం కొఱకు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది.


తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత, మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు. 


స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాపవిమోచనం కలిగి, స్వస్వరూపం వచ్చి, వారు స్వామిని ఆ క్షేత్రములో కొలువుండమని ప్రార్ధిస్తారు. 


వారి ప్రార్ధనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా, అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు.

అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు. అక్కడే ఉన్న చతుర్ముఖబ్రహ్మ గారికి,శ్రీమహావిష్ణువుకి తన ఈ కోర్కెని తెలియజేస్తాడు ఇంద్రుడు.బ్రహ్మ గారు, నారాయణుడు కూడా చాలా సంతోషించి, సుబ్రహ్మణ్యునికి తెలుపగా, స్వామి అంగీకరిస్తారు.


సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది. 


శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది. ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరగడం వల్లనే ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. 


రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.


ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది.

ఆలయంలోకి ప్రవేశించగానే, అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్తంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మ వారు ఉంటారు. 

అక్కడ అందరూ వెన్న ముద్దలతో అమ్మ వారికి పూజ చేస్తారు. 

మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న 

శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది. చాలా బాగుంటుంది.


ఇంకా లోపలికి వెడితే, ముందుగా స్వామి వారి యొక్క వాహనం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు.


అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు “కర్పగ వినాయగర్” అనే పేరుతో ఉంటారు. పెద్ద విగ్రహం చాలా బాగుంటారు. ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మ వారు మధ్యలో ఉంటారు. దుర్గ అమ్మకి ఎడమవైపు వినాయకుడు, కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు.

శివలింగం ఎదురుగా పెరుమాళ్, అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు.


      *ఓం శరవణ భవ*

బుధవారం, మే 22, 2024*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*బుధవారం, మే 22, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

        *వైశాఖ మాసం - శుక్ల పక్షం*   

🔔తిథి : *చతుర్దశి* సా5.51 వరకు

🔯వారం : *బుధవారం* (సౌమ్యవాసరే )

⭐నక్షత్రం : *స్వాతి* ఉ7.15 వరకు

✳️యోగం : *వరీయాన్* మ12.24 వరకు

🖐️కరణం : *వణిజ* సా5.51 వరకు

😈వర్జ్యం : *మ1.14 - 2.56*

💀దుర్ముహూర్తము : *ఉ11.30 - 12.21*

🥛అమృతకాలం : *రా11.28 - 1.11*  

👽రాహుకాలం : *మ12.00 - 1.30*

👺యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00*

🌞సూర్యరాశి: *వృషభం* || 🌝చంద్రరాశి: *తుల*

🌄సూర్యోదయం: *5.30* || 🌅సూర్యాస్తమయం:*6.22*

  👉 *శ్రీ నృసింహ జయంతి*

సర్వేజనా సుఖినో భవంతు 

ఇరగవరపు రాధాకృష్ణ🙏

విరాళాలు ఇవ్వగలరు

 విరాళాలు ఇవ్వగలరు 


రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 


 


ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 


9848647145

Panchaag


 

ఉన్నత భవిష్యత్తు

 ▪️ తల్లి తండ్రులు లేని పిల్లలు  ఎవరయినా  ఉంటే వారికి ప్రముఖ సంస్థ అయిన Hyderabad *Amma Jyothi Foundation* వారు 1వ తరగతి నుండి వారు ఎంత చదివితే అంత చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు ఇచ్చే వరకు వారి పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది వారికి అన్ని ఉచితం 


* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం


1.నో హాస్టల్ ఫీజు

2.నో స్కూల్ ఫీజు

3 నో కాలేజ్ ఫీజు.

4.నో బిల్డింగ్ ఫీజ్. 


📘 *ముఖ్య గమనిక:* 

తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేకపోయినా, లేదా పేదపిల్లలు ఎవరైనా ఉంటే ఇదే *Amma Jyothi Foundation*  సంస్థ వారికి మంచి భవిష్యత్తు ఇస్తుంది.


*హాస్టల్ ఫీజు ఉచితం

*మెస్ ఫీజు ఉచితం

* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం


📞 వివరాలకు సెల్:

*9490043272*

9573411887


ఇతర గ్రూపులకు పంపండి

పేద విద్యార్దులకు  సహాయంచేయండి.

మనకు అవసరము లేకపోవచ్చు, 

కానీ అనాధ పిల్లలకు చాలా అవసరం ఉండవచ్చు. పేద విద్యార్థులకు సహాయం చేద్దాం!🙏


Disclaimer.

This blogger is not responsible for above coment

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము*


*బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*45.17 (పదిహేడవ శ్లోకము)*


*కృష్ణసంకర్షణభుజైర్గుప్తా లబ్ధమనోరథాః|*


*గృహేషు రేమిరే సిద్ధాః కృష్ణరామగతజ్వరాః॥10015॥*


శ్రీకృష్ణబలరాముల అనుగ్రహముతో వారి మనస్తాపములు తీఱిపోయెను. మనోరథము లన్నియును ఈడేఱెను. ఆ నందకుమారుల బాహు బలచ్ఛాయలో వారు సురక్షితులై యుండిరి. అందువలన ఆ యదు ప్రముఖ వంశీయులందఱును తమ తమ గృహములలో హాయిగా నుండిరి.


*45.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*వీక్షంతోఽహరహః ప్రీతా ముకుందవదనాంబుజమ్|*


*నిత్యం ప్రముదితం శ్రీమత్సదయస్మితవీక్షణమ్॥10016॥*


శ్రీకృష్ణుని ముఖారవిందము చిఱునవ్వుల శోభలతో కలకలలాడుచుండెను. ఆ స్వామి చూపులలో కనికరము తొణికిసలాడుచుండును. అట్టి ఆహ్లాదకరమైన శ్రీకృష్ణుని ముఖకమలమును అనుదినము దర్శించుచు యదువంశీయులు ఎల్లరును ఉల్లాసముతో ఉండిరి.


*45.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*తత్ర ప్రవయసోఽప్యాసన్ యువానోఽతిబలౌజసః|*


*పిబంతోఽక్షైర్ముకుందస్య ముఖాంబుజసుధాం ముహుః॥10017॥*


ఆ మథురానగరమునందలి వృద్ధులు సైతము తమ నేత్రముల ద్వారా శ్రీకృష్ణుని వదనమనెడి పద్మమునందలి మకరందా మృతమును పదేపదే తనివిదీర ఆస్వాదించుచు, తత్ప్రభావమున యువకులవలె జవసత్త్వములు గలిగి తేజరిల్లుచుండిరి.


*45.20 (ఇరువదియవ శ్లోకము)*


*అథ నందం సమాసాద్య భగవాన్ దేవకీసుతః|*


*సంకర్షణశ్చ రాజేంద్ర పరిష్వజ్యేదమూచతుః॥10018॥*


పరీక్షిన్మహారాజా! పిమ్మట కృష్ణభగవానుడు , బలరాముడు నందగోపునిజేరి, ఆయనను కౌగలించుకొని, ఇట్లునుడివిరి.


*45.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*పితర్యువాభ్యాం స్నిగ్ధాభ్యాం పోషితౌ లాలితౌ భృశమ్|*


*పిత్రోరభ్యధికా ప్రీతిరాత్మజేష్వాత్మనోఽపి హి॥10019॥*


*45.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*స పితా సా చ జననీ యౌ పుష్ణీతాం స్వపుత్రవత్|*


*శిశూన్ బంధుభిరుత్సృష్టానకల్పైః పోషరక్షణే॥10020॥*


*45.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*యాత యూయం వ్రజం తాత వయం చ స్నేహదుఃఖితాన్|*


*జ్ఞాతీన్ వో ద్రష్టుమేష్యామో విధాయ సుహృదాం సుఖమ్॥10021॥*


"తండ్రీ! నీవును, తల్లి యశోదయు, మిగుల ప్రేమ వాత్సల్యములతో మమ్ము లాలించి, పోషించితిరి. మాతాపితలు తమ సంతానమును ప్రాణములకంటెను మిన్నగా చూచుకొందురు. అందు ఏమాత్రమూ సందేహము లేదు. కన్న తల్లిదండ్రులను, తదితర బంధువులును తమ శిశువులను పోషించుటకును, రక్షించుటకును (లాలన, పాలనలకు) వీలుకాని పరిస్థితులలో వదలివేసినప్పుడు, వారిని చేరదీసి ప్రేమాదరములతో పెంచి పోషించినవారే, నిజమైన తల్లిదండ్రులు. నాయనా! ఇక మీరు వ్రజభూమికి వెళ్ళిరండు. మేము మీ యెడల లేనందున మీరు మిక్కిలి బెంగపడుదురను మాట వాస్తవమే. అందువలన మేమును ఇక్కడి బంధుమిత్రులకు ఆత్మీయతతో సుఖసంతోషములను గూర్చిన పిదప, మారాకకై అనుక్షణము నిరీక్షించుచు తపనపడుచుండెడి మీ అందఱిని చూచుటకై అక్కడికి మేము తప్పక వత్తుము".


*45.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*ఏవం సాంత్వయ్య భగవాన్ నందం సవ్రజమచ్యుతః|*


*వాసోఽలంకారకుప్యాద్యైరర్హయామాస సాదరమ్॥10022॥*


కృష్ణభగవానుడు నందునకును, తదితర వ్రజవాసులకును ఈ విధముగా ఊఱటగూర్చి, వస్త్రాభరణములను, కంచుపాత్రలను సమర్పించి, వారిని సాదరముగా పూజించెను.


ఈ శ్లోకములో *కుప్యము* అనగా బంగారము, వెండి తప్ప కంచు మొదలగు ఇతర లోహములు అని తెలియగలము.


*45.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*ఇత్యుక్తస్తౌ పరిష్వజ్య నందః ప్రణయవిహ్వలః|*


*పూరయన్నశ్రుభిర్నేత్రే సహ గోపైర్వ్రజం యయౌ॥10023॥*


శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట నందుడు బలరామకృష్ణులను ఆత్మీయతతో అక్కున జేర్చుకొని, వారిని మథురలో విడిచిపెట్టి వెళ్ళుటకు మనస్సొప్పక మిగుల బాధతో కంటతడిబెట్టెను. ఎట్టకేలకు వారిని వీడ్కొని, తోడి గోపాలురతో గూడి వ్రజభూమికి బయలుదేఱెను.


*45.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*అథ శూరసుతో రాజన్ పుత్రయోః సమకారయత్|*


*పురోధసా బ్రాహ్మణైశ్చ యథావద్ద్విజసంస్కృతిమ్॥10024॥*


పరీక్షిన్మహారాజా! అనంతరము వసుదేవుడు గర్గమహర్షి మొదలగు బ్రాహ్మణులచేత బలరామకృష్ణులకు యథావిధిగా ఉపనయన సంస్కారములను జరిపించెను.


*45.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*తేభ్యోఽదాద్దక్షిణా గావో రుక్మమాలాః స్వలంకృతాః|*


*స్వలంకృతేభ్యః సంపూజ్య సవత్సాః క్షౌమమాలినీః॥10025॥*


అనంతరము వసుదేవుడు గర్గాది విప్రోత్తములను గంధపుష్పాక్షతలతోడను, వస్త్రాభరణములతోడను అలంకరించి, వారికి దూడలతోగూడిన పాడియావులను, దక్షిణలను సమర్పించెను. ముందుగా ఆ గోవులు పట్టువస్త్రములతోడను, సముచితమైన బంగారు హారములతోను అలంకరింపబడినవి.


*45.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*యాః కృష్ణరామజన్మర్క్షే మనోదత్తా మహామతిః|*


*తాశ్చాదదాదనుస్మృత్య కంసేనాధర్మతో హృతాః॥10026॥*


ఇదివఱలో కంసుడు వసుదేవుని గోసంపదను అన్యాయముగా లాగుకొనియుండెను. బలరామకృష్ణులు జన్మించినప్పుడు ప్రజ్ఞాశాలియైన (ధర్మబుద్ధిగల) వసుదేవుడు బ్రాహ్మణులకు గోదానములను చేయుటకు సంకల్పించి యుండెను. ఆ సంకల్పమును అనుసరించి, కంసుని మరణముతో తనకు స్వాధీనమైన ఆ గోవులను ఇప్పుడు భూసురోత్తములకు దానము చేసెను.


*45.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*తతశ్చ లబ్ధసంస్కారౌ ద్విజత్వం ప్రాప్య సువ్రతౌ|*


*గర్గాద్యదుకులాచార్యాద్గాయత్రం వ్రతమాస్థితౌ॥10027॥*


యదువంశమునకు ఆచార్యుడైన (పురోహితుడైన) గర్గమహర్షిచే జరిపింపబడిన ఉపనయన సంస్కారముల ద్వారా బలరామకృష్ణులకు ద్విజత్వము ప్రాప్తించెను. ఆ మహామునినుండి గాయత్రీ మంత్రోపదేశమును పొందిన పిమ్మట ఆ సోదరులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింపదొడగిరి.


*45.30 (ముప్పదియవ శ్లోకము)*


*ప్రభవౌ సర్వవిద్యానాం సర్వజ్ఞౌ జగదీశ్వరౌ|*


*నాన్యసిద్ధామలజ్ఞానం గూహమానౌ నరేహితైః॥10028॥*


*45.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*అథో గురుకులే వాసమిచ్ఛంతావుపజగ్మతుః|*


*కాశ్యం సాందీపనిం నామ హ్యవంతిపురవాసినమ్॥10029॥*


బలరామకృష్ణులు సకల విద్యలకును నిధానములు. వారు జగద్గురువులు, సర్వజ్ఞులు. వారి జ్ఞానము స్వతస్సిద్ధమైనది, లోకోత్తరమైనది. ఐనను, వారు లోకమర్యాదను అనుసరించి, సామాన్యులవలె ప్రవర్తించుచు తమ దివ్యలక్షణములను బయటపడనీయకుండిరి. అంతట వారు గురుకులమునందు విద్యాభ్యాసము చేయుటకై ఇష్టపడిరి. అందువలన ఆ సోదరులు అవంతీపుర (ఉజ్జయిని) వాసియు, కాశ్యప గోత్రజుడును అగు *సాందీపని* అను గురువు కడకు చేరిరి.


*45.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యథోపసాద్య తౌ దాంతౌ గురౌ వృత్తిమనిందితామ్|*


*గ్రాహయంతావుపేతౌ స్మ భక్త్యా దేవమివాదృతౌ॥10030॥*


పిదప ఆ రామకృష్ణులు సంప్రదాయప్రకారము గురువును ఆశ్రయించిరి. జితేంద్రియులై, లోకమునకు ఆదర్శప్రాయముగా ప్రవర్తించుచుండిరి. వారు గురువును దైవసమానునిగా భక్తిశ్రద్ధలతో సేవించుచు, గురువుయొక్క ఆదరాభిమానములకు పాత్రులైరి.

 

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*377వ నామ మంత్రము* 


*ఓం జయాయై నమః*


వరాహపర్వతంపై జయ అను దేవతాస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జయా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం జయాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి తలచిన కార్యములు శుభప్రదముగాను, జయప్రదముగాను నెరవేరునట్లు అనుగ్రహించును.


శ్రీమాత వరాహగిరియందు నెలకొనియున్న జయ యను దేవతాస్వరూపిణి యని పద్మపురాణమందు వివరించబడినది.


పరమేశ్వరి సర్వత్ర జయముగలిగినది. అలాగేభక్తులను కూడా సర్వత్ర జయము కలిగినవారిగా అనుగ్రహము చూపును. మహిషాసుర, భండాసురాది రాక్షస సంహారమునందు జయము తప్ప అపజయము లేనిది. తనను సేవించు భక్తులకు తలచిన కార్యములను జయప్రద మొనరించునది గనుక పరమేశ్వరి *జయా* యని అనబడినది.


పాండవులు అరణ్యవాసము ముగించుకొని అజ్ఞాతవాసమునకు వెళ్ళునప్పుడు అమ్మవారిని సేవించుకున్నారు. విరాటరాజు కొలువులో వివిధ మారు వేషములతో ప్రవేశించారు. సంవత్సరం అజ్ఞాతవాసదీక్షను భంగపరచడానికి దుర్యోధనుని అనేక కుతంత్రాలను అధిగమించినది ఆ పరమేశ్వరి కరుణచేతనే. మహాబలుడు కీచకుడు భీముని చేతిలో సంహరింపబడడం, ద్రౌపది మానరక్షణ కలగడం - అంతటికి ఆ పరమేశ్వరి చల్లని చూపులే కారణము. పాండవులు తమ సంవత్సరం అజ్ఞాతవాసాన్ని ఆ పరమేశ్వరి కరుణచేతనే దిగ్విజయంగా ముగించుకున్నారు. పరమేశ్వరి కరుణ ఉంటే మృత్యువుకూడ భయపడి పారిపోతుంది. ప్రతీ ఊరికీ పొలిమేరలలో గ్రామదేవతగా విరాజిల్లుతూ గ్రామప్రజల వ్యవసాయ కార్యక్రమముల యందును, గృహములో వివాహాది శుభకార్యములయందును జయము కలుగజేయునది పరమేశ్వరియే. గనుకనే పరమేశ్వరి *జయా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం జయాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[

*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*837వ నామ మంత్రము* 


*ఓం వియత్ప్రసవే నమః* 


ఆకాశమును పుట్టించిన లేక ప్రసవించిన శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వియత్ప్రసూః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం వియత్ప్రసవే నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిప్రపత్తులతో సేవించు భక్తులకు ఆ జగన్మాత ఆయురారోగ్యములు, సిరిసంపదలు, పాడిపంటలు, శాంతిసౌఖ్యములు ప్రసాదించి సర్వదా ఆపదలనుండి రక్షించుచూ ఉండును.


*వియతః ఆకాశస్య ప్రసూఃజనికా*


*ఆత్మన ఆకాశః సంభూతః* (సౌభాగ్యభాస్కరం, 943వ పుట)


'పరమాత్మనుండి ఆకాశము సంభవించినది' అని వేదమునందు చెప్పబడినది.


*సృష్టికి ముందునుంచి ఉన్నది ఆకాశము. అలాగే ఆత్మనుండే అన్నీ సంభవించాయి* అని వేదములు అన్నవి. ఆత్మనుండి అన్నీ అంటే ఆకాశం కూడా వేదమునుండి సంభవించినదే.


పరమాత్మయే మూలప్రకృతి. అనగా సృష్టికి ఆది పరమాత్మ. అట్టి మూలప్రకృతి నుండియే మహత్తత్త్వము, అహంకారము పంచభూతాలు ఉద్భవించాయి. అందులో ఆకాశంకూడా ఉన్నది. గనుక పరమేశ్వరి *వియత్ప్రసూః* అని యనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వియత్ప్రసవే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

మహాభాగవతం


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము*


*బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*45.1 (ప్రథమ శ్లోకము)*


*పితరావుపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమః|*


*మా భూదితి నిజాం మాయాం తతాన జనమోహినీమ్॥9999॥*

*శ్రీశుకుడు వచించెను* శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీవసుదేవులు తనను పరమేశ్వరునిగా భావించుచున్నట్లు గుర్తించెను. వారు అట్లు తలపోసినచో పుత్రవాత్సల్యానందములకు దూరమగుదురని తలంచి, ఆ ప్రభువు వారిపై జనులను మోహములో ముంచునట్టి తన యోగమాయను ప్రసరింపజేసెను.


*45.2 (రెండవ శ్లోకము)*


*ఉవాచ పితరావేత్య సాగ్రజః సాత్వతర్షభః|*


*ప్రశ్రయావనతః ప్రీణన్నంబ తాతేతి సాదరమ్॥10000॥*


యదువంశ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణభగవానుడు బలరామునితో గూడి తల్లిదండ్రుల చెంతకు చేరెను. పిమ్మట ఆ స్వామి వినమ్రుడై సాదరముగా 'అమ్మా', 'నాన్నా' అని సంబోధించి, వారిని సంతోషపఱచుచు ఇట్లు నుడివెను-


*45.3 (మూడవ శ్లోకము)*


*నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠితయోరపి*


*బాల్యపౌగండకైశోరాః పుత్రాభ్యామభవన్ క్వచిత్॥10001॥*


*45.4 (నాలుగవ శ్లోకము)*


*న లబ్ధో దైవహతయోర్వాసో నౌ భవదంతికే|*


*యాం బాలాః పితృగేహస్థా విందంతే లాలితా ముదమ్॥10002॥*


"తల్లిదండ్రులారా! మీ పుత్రులమైన మమ్ము మీ యుత్సంగములలో చేర్చుకొని, ఆనందించుచు, మమకారములను పంచి యిచ్చుటకై మీరు ఇంతవఱకును ఎంతో ఉత్కంఠితులై యుంటిరి. కాని మీరు మమ్ము ఎత్తుకొనుచు, దించుచు, లాలించుచు, పాలించుచు సంతోషపడెడి భాగ్యమునకు నోచుకొనరైతిరి. అట్లే దైవోపహతులమైన కారణముగా మేమును ఒకవిధముగా భాగ్యహీనులమే. ఏలయన, లోకములోని బాలురు తమ తల్లిదండ్రులయెదుట తారాడుచు, వారి ఒడులలో చేరి, నిండు ప్రేమాదరములతో ఆడుచు, పాడుచు హాయిగా పెఱిగి పెద్దవారగుచుందురు. ఆ అదృష్టమునకు మేము దూరమైతిమి.


*45.5 (ఐదవ శ్లోకము)*


*సర్వార్థసంభవో దేహో జనితః పోషితో యతః|*


*న తయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్యః శతాయుషా॥10003॥*


*45.6 (ఆరవ శ్లోకము)*


*యస్తయోరాత్మజః కల్ప ఆత్మనా చ ధనేన చ|*


*వృత్తిం న దద్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి హి॥10004॥*


ధర్మార్థకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్థములకు సాధనమైన దేహమును ప్రసాదించు వారును, పోషించువారును తల్లిదండ్రులే. అట్టి మాతాపితరుల ఋణమును తీర్చుకొనుటకై మానవునకు యథార్థముగా నూఱేండ్లైనను చాలవు. శక్తియుండియు తన దేహముద్వారా, ధనాదులద్వారా తల్లిదండ్రులను సాదరముగా సేవింపనివాడు ఎంతయు నికృష్టుడు (నీచుడు). అట్టి దుష్టుడు మృతుడైన పిమ్మట యమదూతలు వాని శరీరమాంసమును వానిచేతనే తినిపింతురు.


*45.7 (ఏడవ శ్లోకము)*


*మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుమ్|*


*గురుం విప్రం ప్రపన్నం చ కల్పోఽబిభ్రచ్ఛ్వసన్ మృతః॥10005॥*


పూజ్యులైన తలిదండ్రులను, వృద్ధులను, సాధ్వియైన భార్యను, బాల్యావస్థలో నున్న కుమారులను, కుమార్తెలను, ఆరాధ్యుడైన గురువును, సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుని, తనను ఆశ్రయించినవారిని, యథోచితముగా పోషింప సమర్థుడయ్యెను, ఆ విధముగా చేయనివాడు, ఈ లోకములో బ్రతికియుండియు, చచ్చినవానితో సమానుడే.


*45.8 (ఎనిమిదవ శ్లోకము)*


*తన్నావకల్పయోః కంసాన్నిత్యముద్విగ్నచేతసోః|*


*మోఘమేతే వ్యతిక్రాంతా దివసా వామనర్చతోః॥10006॥*

జననీ జనకులారా! దుష్ప్రవృత్తిగల కంసుని ఆగడముల కారణముగా మేము ఉద్విగ్నమనస్కులమై మీకు దూరముగా ఉండవలసి వచ్చుటచే మిమ్ము సేవింపలేకపోయితిమి. అందువలన ఇంతకాలము వ్యర్థముగా గడచిపోయినది.


*45.9 (తొమ్మిదవ శ్లోకము)*


*తత్క్షంతుమర్హథస్తాత మాతర్నౌ పరతంత్రయోః|*


*అకుర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్టయోర్దుర్హృదా భృశమ్॥10007॥*


"అమ్మా! నాన్నా! దుష్టుడైన కంసుడు మిమ్ములను మిగుల ఇడుములపాలు చేసెను. ఐనను మేము పరతంత్రులమై యున్నందున కష్టస్థితిలో ఉన్న మిమ్ము ఆదుకొనలేక పోయితిమి. అందువలన మమ్ము క్షమింపుడు".


*శ్రీశుక ఉవాచ*


*45.10 (తొమ్మిదవ శ్లోకము)*


*ఇతి మాయామనుష్యస్య హరేర్విశ్వాత్మనో గిరా|*


*మోహితావంకమారోప్య పరిష్వజ్యాపతుర్ముదమ్॥10008॥*


*శ్రీశుకుడు వచించెను* విశ్వాత్ముడైనను, స్వసంకల్పముచే లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణునియొక్క మృదుమధుర వచనములకు మోహితులైన దేవకీవసుదేవులు తమ కుమారులను ఒడిలోనికి తీసికొని, అక్కున చేర్చుకొని పరమానందభరితులైరి.


*45.10 (పదకొండవ శ్లోకము)*


*సించంతావశ్రుధారాభిః స్నేహపాశేన చావృతౌ|*


*న కించిదూచతూ రాజన్ బాష్పకంఠౌ విమోహితౌ॥10009॥*


పరీక్షిన్మహారాజా! పుత్రప్రేమ కారణముగా వారు మోహితులై, ఆ మమకారములలో మునిగిపోయిరి. వారు ఆనందాశ్రువులచే తమ కుమారులను అభిషేకించిరి. ఆనందాతిరేకములో గద్గదకంఠులైన  ఆ దేవకీవసుదేవులు గొంతు పెగలక ఏమియు మాటాడలేకపోయిరి.


*45.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఏవమాశ్వాస్య పితరౌ భగవాన్ దేవకీసుతః|*


*మాతామహం తూగ్రసేనం యదూనామకరోన్నృపమ్॥16010॥*


కృష్ణభగవానుడు తల్లిదండ్రులను ఈ విధముగా ఓదార్చిన పిమ్మట మాతామహుడైన ఉగ్రసేనుని యదువంశీయులకు రాజుగా జేసెను.


*45.13 (పదమూడవ శ్లోకము)*


*ఆహ చాస్మాన్ మహారాజ ప్రజాశ్చాజ్ఞప్తుమర్హసి|*


*యయాతిశాపాద్యదుభిర్నాసితవ్యం నృపాసనే॥10011॥*


*45.14 (పదునాలుగవ శ్లోకము)*


*మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయః|*


*బలిం హరంత్యవనతాః కిముతాన్యే నరాధిపాః॥10012॥*


పిమ్మట శ్రీకృష్ణుడు తన మాతామహునితో ఇట్లనెను - 'ఉగ్రసేనమహారాజా! మేము మీ ప్రజలము. మమ్ము నీవు ఆజ్ఞాపింపుము. యయాతి శాపకారణముగా యదువంశీయులు రాజసింహాసనముపై కూర్చుండుటకు (రాజ్యపరిపాలన చేయుటకు) అర్హులు కారు. ఐనను నేను కోరుచున్నాను గనుక, నీవు ఈ  సింహాసనమును అధిష్ఠించుటలో దోషములేదు. నేను భృత్యుడనై నిన్ను సేవించుచుందును గాన, ప్రముఖ దేవతలును వినమ్రులై నీకు కానుకలను సమర్పింతురు. ఇంక ఇతర రాజుల విషయము చెప్పనేల?


*45.15 (పదునైదవ శ్లోకము)*


*సర్వాన్ స్వాన్ జ్ఞాతిసంబంధాన్ దిగ్భ్యః కంసభయాకులాన్|*


*యదువృష్ణ్యంధకమధుదాశార్హకుకురాదికాన్॥10013॥*


*45.16 (పదహారవ శ్లోకము)*


*సభాజితాన్ సమాశ్వాస్య విదేశావాసకర్శితాన్|*


*న్యవాసయత్స్వగేహేషు విత్తైః సంతర్ప్య విశ్వకృత్॥10014॥*


పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు (శ్రీహరి) విశ్వసృష్టికి కారకుడు. కంసుని దురాగతములకు భయపడి నలుదిక్కులకు పాఱిపోయిన యదు, వృష్ణి, అంధక, మధు, దాశార్హ, కుకురాది వంశీయులైన తన బంధువులను అందఱిని ఆ ప్రభువు మథురకు పిలిపించెను. ఇంతవఱకును కాందిశీకులై విదేశములలో బిక్కుబిక్కుమనుచు తలదాచుకొనుచున్న వారినందఱిని సగౌరవముగా ఆహ్వానించి, ఆ స్వామి ఆత్మీయతతో ఓదార్చెను. పిమ్మట వారిని ధనాది సంపదలచే తృప్తిపఱచి, వారివారి గృహములలో నివసింపజేసెను.

 

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

తస్మాత్ జాగ్రత్త

 మోసపోయిన 11 మంది పాలమూరు న్యాయవాదులు...


పుణ్యం కోసం పోతే... పాపం వచ్చింది , పాపం...


ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 11 మంది న్యాయవాదులు చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. అయితే వీరు ముందస్తుగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేయించుకున్నారు. 


పవన్ హాండ్స్ అనే సంస్థ ద్వారా రూ.5,500 చెల్లించి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించుకుని పాట్నాలో దిగారు. తీరా పాట్నాలో టికెట్లు ఫేక్ టికెట్లుగా అధికారులు చెప్పడంతో వీరంతా తమకు జరిగిన అన్యాయాన్ని గళమెత్తి ప్రశ్నించారు.


ఫేక్ ప్రచారాన్ని నమ్మి.. ఫేక్ టికెట్లను అమ్మిన ఫేక్ గాళ్లపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.

బ్రతుకంతా మార్చును

 *2021*

*కం*

పతియను రెండక్షరములు

నతివల బ్రతుకెల్ల మార్చు నవనిన నెపుడున్.

పతిమెచ్చెడి గతి నాకము

పతిధిక్కృతినరకమిలను పడతికి సుజనా!

*భావం*:-- ఓ సుజనా! పతి అనే రెండక్షరములు భూలోకంలో ఆడవారి బ్రతుకంతా మార్చును. ఆడదాని కి తన భర్తకు నచ్చెడి నడవడిక స్వర్గమును,భర్తను ఎదిరించుట వలన నరకమును  ఇచ్చును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శంకర జయంతి ప్రత్యేకం

 ॐ          శంకర జయంతి ప్రత్యేకం 

          ( ఈ నెల 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )


                       భాగం 9/10 

                        

8.అద్వైత సిద్ధాన్తమ్ 


        వేద ప్రామాణికమైన అద్వైత సిద్ధాన్తాన్ని ఆదిశంకరులు పునః ప్రతిపాదించారు. 

       వేదాలతోపాటు విష్ణు పురాణం, పాంచరాత్ర - వైఖానస ఆగమాలవంటి వైష్ణవ గ్రంథాలతో సహా అన్నీ పేర్కొన్న ఈ సిద్ధాన్తంలో, 

       అద్వైతంలోని  ఎనిమిది ప్రధాన విషయాలు వెలికి తీశారు. అవి 

అ) బ్రహ్మమే అందరికీ ఆత్మ, 

ఆ) బ్రహ్మ నిర్గుణము, 

ఇ) జీవాత్మ పరమాత్మ ఒక్కటే, 

ఈ) ప్రపంచం పైకి కనబడుతున్నది; కానీ వాస్తవంలో అది మిథ్య, 

ఉ) మోక్షం జ్ఞానం వలననే లభిస్తుంది, 

ఊ) జీవించియుండగానే ముక్తి పొందవచ్చు. అదే జీవన్ముక్తి, 

ఋ) సత్యం 

      ప్రాతిభాసిక,వ్యావహారిక,పారమార్థిక సత్యాలని మూడు విధాలు, 

ౠ) శివకేశవులకు భేదం లేదు. 


      పరమాత్మని సేవిస్తూ, తత్త్వాన్ని తెలుసుకుంటూ, 

      పెద్దవృత్తమైన పరమాత్మలో చిన్నవృత్తంగా ఉంటాడు జీవుడు. ఆ చిన్నవృత్తం క్రమక్రమంగా పెరిగి పెద్దవృత్తంతో ఐక్యమైనట్లు, తాను పరబ్రహ్మయే అని అనుభూతి స్థితికి చేరుకోవడమే (రెండు కాని) ఒకటే అయిన అద్వైతం. 


*ప్రత్యేక గమనిక 


    అద్వైత సిద్ధాన్తంలో  "జీవాత్మ - పరమాత్మ ఒక్కటే!" అనే  ఒక ప్రముఖమైన విషయం,  

    వైష్ణవాగమాలలోని పాంచరాత్రాగమంలో, 

    సాక్షాత్తు నారాయణుడే బ్రహ్మతో చెప్పిన ప్రామాణిక విధానాలలో ఒకటి. 👇  


           పాంచరాత్రాగమము - అద్వైత భావము  


    పాద్మ సంహిత ఎనిమిదవ అధ్యాయములో బ్రహ్మ-నారాయణ సంవాదములో, 

    నారాయణుడు అన్నది.    


ఓ చతుర్ముఖా (ఓ బ్రహ్మా)!  

    మోక్షము అనేది భేదముక్తి, అభేదముక్తి, మిశ్రముక్తి అని మూడు విధాలుగా ఉంది.  


1.భేదముక్తి: 

      ఇది కైంకర్య లక్షణమైనది (సేవ). 

      ఈ లోకంలో పరిచర్యచేయు మనుష్యులున్నట్లే, 

      ముక్తులైనవారు పరమాత్మలోకమైన వైకుంఠమునందు, ఆ పరమాత్మకు దగ్గఱగా ఉండి, కింకరులై (సేవచేయుచు) భగవంతుని అనుగ్రహము మాత్రమే కోరుదురు. 

      ఇది భేదముక్తికి లక్షణము. 

2.అభేదముక్తి: 

      పరమాత్మకు జీవాత్మకు అత్యన్తమైన ఐక్యమునే అభేద ముక్తి అంటారు. 

     "సోఽహమ్"- ఆ బ్రహ్మను నేను - అనే భావననే ఐక్యం అంటారు. 

3.మిశ్రముక్తి: 

      మిశ్రముక్తిలో జీవుడు విడిగా ఉంటాడు. 

      భగవంతుని అర్చనాదులతో సంతోషపెట్టి, ఏకాగ్రచిత్తుడై, బ్రహ్మాత్మైక్యజ్ఞానంతో, చిద్ఘనుడైన పరమాత్మతో ఐక్యము నందుతాడు. 

      దీనిని సాయుజ్యముక్తి అంటారు. 


      దీని వలన సామాన్యముగ పొందుటకు సాధ్యముకాని ఐశ్వర్యము, అణిమాద్యష్టసిద్ధులు కలుగును. 

                       లేదా 

     పరమానందప్రాప్తిరూపమైన ముక్తియైనను కలుగవచ్చును. 

                       లేదా 

      జీవాత్మ పరమాత్మల ఐక్యరూప ముక్తిని పొందవచ్చు. 


భేదేన చాప్యభేదేన మిశ్రేణ చ చతుర్ముఖ!  

త్రిధైవ ముక్తి రుదితా భేదే కైంకర్యలక్షణా 


ముక్తిర్యథేహ లోకేషు పరిచర్యాపరా నరాః 

దేవస్య తద్వదేవైతే వైకుంఠే పరమాత్మనః 

లోకే తస్య సమీపస్థాః తత్ప్రసాదపరా స్సదా 


అభేదముక్తిరత్యన్తమ్ ఐక్యం స్యాత్పరజీవయోః 

ఆత్మనో భావనాచైక్యం సోహమిత్యేవమాత్మికా 


సిద్ధాన్తే మిశ్రరూపేతు భేదే స్థిత్వార్చనాదిభిః 

తోషయిత్వా పరందేవం తతోముక్త స్సమాహితః 

విజ్ఞానేనేకతానేన పరమాత్మని చిద్ఘనే 

ఐక్యంప్రాప్నోతి సాముక్తి రుక్తా సాయుజ్యలక్షణా 


ఐశ్వర్యమణిమాద్యష్టగుణావాప్తి స్సుదుర్లభా 

ముక్తిర్వా పరమానందప్రాప్తిరూపా యదీప్సితమ్ 

ముక్తిర్వాస్త్యేకతాపత్తి ర్జీవాత్మపలమాత్మనోః 


ముక్తాయింపు    


    వైష్ణవుల పాంచరాత్రగ్రంథంలో పైన తెలిపిన విధంగా,  

    సాక్షాత్తు నారాయణుడే బ్రహ్మకు బోధించడంతో,   

    ఆది శంకరాచార్యులవారు వెలికి తెచ్చిన,వేద ప్రతిపాదిత అద్వైత సిద్ధాన్తం, 

    కేవలం శంకరుల అనుయాయులకీ, వారి పరంపరకే కాక, 

    మానవులందరికీ వర్తించే భగవదుపదేశమే కదా! 


                    కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయంణం శర్మ 

              భద్రాచలం

వైశాఖ పురాణం - 13

 వైశాఖ పురాణం - 13


13 వ అధ్యాయము - కుమారజననము


మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి యేమి చేయవలెనో తెలియనిస్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను జూచిన హిమవంతుడును భయపడి యామెను యింటికి జేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును, ఔదార్యాదిగుణములను జూచి నాకితడే భర్త కావలయునని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లితండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వలదని వారించినను ఆమె మానలేదు.


పార్వతి గంగాతీరమును జేరి మహాలింగస్వరూపము నేర్పరచి నిరాహారియై జటాధారిణియై కొన్నివేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలిసికొని శివుని పరిహసించెను. నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము నిచ్చి యంతర్ధానమందెను.


శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని యెదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని యడుగుడని చెప్పెను. సప్తర్షులు శివుని యాజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు నాకాశమార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారి కెదురువెళ్ళి నమస్కరించి గృహములోనికి దీసికొని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులగావించి మీరు నాయింటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీవంటి తపోధనులు నాయింటికి వచ్చుట నా తపఃఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములగు మీకు నా వలన కాదగిన కార్యము నాజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై యున్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగ జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరును ముల్లోకములయందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునకిచ్చి వివాహము చేయవలయును. వేలకొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికి నీకిట్లు ఫలించినది అని పలికిరి.


హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు నిష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునకిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు బోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు యీయబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగ పరమానందముతో బలికెను. సప్తర్షులును హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్లిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి.


లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు, మునులు అందరును శివపార్వతుల కల్యాణ మహోత్సవమును జూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించియుండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను.


హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో గలసి లోక ధర్మాను సారముగ సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సంపన్నమగు హిమవంతుని యింటను, రాత్రులయందు సరస్తీరముల యందు, పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్చావిహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగ కొన్ని వేల సంవత్సరములు గడచినవి.


ఇంద్రుని శాసనముననుసరించి ఆ కాలమున సంయోగమున నేర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించెడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికేర్పడిన గర్భము శివపార్వతుల పునస్సమాగమముచే పోయెడిది. ఈ విధముగ గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున బుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యెను.


వారందరు నొకచోట కలిసికొని పరమేశ్వరుడు నిత్యము రతాసక్తుడై యున్నాడు. ఇందువలన గర్భములు నిలుచుట లేదు. కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా! నీవు దేవతలకు ముఖము వంటివాడవు. దేవతలకు బంధువువు. నీవు యిప్పుడు శివపార్వతులు విహరించుచోటకు పొమ్ము. రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము. వారికి పునస్సంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రతాంతమున నిన్ను జూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునస్సంగమముండదు. శివపార్వతుల రతాంతమున నీవు శివునకెదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగనైనచో గర్భవతియగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థన నంగీకరించి సివపార్వతులున్నచోటకు బోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యెను. వస్త్ర విహీనయై యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు బోయెను.


శివుడును పార్వతి తన దగ్గరనుండి దూరముగ వెళ్లుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున కాటంకము చేసితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి యిచ్చట లేకుండుటకు నీవే కారణము. నా యీ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచెను.


అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు యెట్లో దేవతల యొద్దక బోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలును అగ్నిమాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును, ఆ వీర్యమునుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండిరూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుటయెట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో గలసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహు విధములుగ స్తుతించిరి. నీవు మా అందరికిని తల్లివి. అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన నంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమునుపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులోపడిన శివ వీర్యము ఆరు విధములయ్యెను.


బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తికా దేవతలు ఆరు విధములుగ నున్న ఆ రుద్ర తేజస్సు నొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై యుండెను. ఆరు ముఖములు కల ఆ రూపమచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగు చుండెను.


ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీస్తనములనుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతియు తన స్తనముల నుండి నిష్కారణముగ క్షీరస్రావము జరిగినందుల కాశ్చర్యపడి విశ్వాత్మకా! నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగ స్రవించుటకు కారణమేమని యడిగెను. అప్పుడు శివుడు పార్వతీ వినుము, పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతనిని జూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమునగ్నియందుంచితిని. అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు ఆరు ముఖములు కల పురుష రూపమయ్యెను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడగుచేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే నితడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను.


పార్వతియు శివుని మాటలను విని యా బాలుని తనయుడి యందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వానియందు పుత్రస్నేహమునంది యుండెను. ఈ విధముగా నా బాలుని దీసికొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు నామె మిక్కిలి ఆనందమునందుచుండెను.


రాజా! పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించితిని. దీనిని చదివినను, వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు. సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖవ్రతమును చేసి పూర్వము కంటె గొప్పవాడయ్యెను. కావున వైశాఖమాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును, మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్తలేకపోవుటను, పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను యే వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతడు సర్వోత్తముడు, భార్యా ద్వితీయుడు అయ్యెనో ఆ వైశాఖవ్రతము నాచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయనివారికి వారెన్ని ధర్మముల నాచరించిన వారైనను కష్టపరంపరలనందుదురు. ఏ ధర్మముల నాచరింపని వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో వారికి అన్ని ధర్మముల నాచరించినంత పుణ్యలాభము కలుగును.


వైశాఖ పురాణం 13 వ అధ్యాయం సంపూర్ణం.

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు

మంగళవారం, మే 21, 2024

 🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻

మంగళవారం, మే 21, 2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

 వైశాఖ మాసం - శుక్ల పక్షం

తిథి:త్రయోదశి సా4.38 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే )

నక్షత్రం:స్వాతి పూర్తి

యోగం:వ్యతీపాతం మ12.21 వరకు

కరణం:తైతుల సా4.38 వరకు తదుపరి గరజి తె5.15 వరకు

వర్జ్యం:ఉ11.14 - 12.58

దుర్ముహూర్తము:ఉ8.04 - 8.55

మరల రా10.49 - 11.33

అమృతకాలం:రా9.41 - 11.25

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:వృషభం

చంద్రరాశి: తుల

సూర్యోదయం:5.30

సూర్యాస్తమయం:6.22

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు 

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

విశ్వనాథ సత్యనారాయణగారి

 విశ్వనాథ సత్యనారాయణగారి ఇల్లు



విజయవాడ మారుతీనగర్ లో ఉన్న విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు ఫొటోలో చూడవచ్చు. ఆ ఇల్లు అయన 1959 లో కట్టుకున్నారని సమాచారం. ఆయన 1976లో మరణించేవరకూ ఈ ఇంట్లోనే ఉన్నారు.


వారి కుటుంబ సభ్యులు ఈ ఇంటిని "విశ్వనాథ మ్యూజియం" గా తీర్చిదిద్దారని, నిర్ధారిత రోజుల/సమయాలలో సందర్శకులను అనుమతిస్తున్నారని తెలిసింది. 


నా చిన్నతనాలలో, సంవత్సరం సరిగ్గా గుర్తు లేదు, 7-8 తరగతులు చదువుతుండగా అనుకుంటాను, వారి శిష్యుడు అయిన మా మేనమామగారితో వాళ్ళింటికి వెళ్ళిన జ్ఞాపకం. అప్పుడప్పుడే పుస్తకాలు చదవటం మొదలు పెట్టిన రోజులవి. ఆయన "వేయిపడగలు" నవల వ్రాసినట్టు తెలుసు. అందుకని, సాహసించి ఆయన్ను మీ వేయిపడగలు నవల ఎక్కడ దొరుకుతుంది అని అడిగాను. దానికి ఆయన నా తలమీద చిన్నగా కొట్టి, ఆ నవల చదవగలవురా నువ్వు, మరికొన్నాళ్ళు ఆగి చదువు అన్నారు. అలా ఆయన చెప్పినట్టే, దాదాపుగా ఒక దశాబ్దం తరువాత, 1978లో ఆ నవల చదివాను. అప్పటికి ఆయన కీర్తిశేషులు అయ్యారు.


ఈ జ్ఞాపకం ఎందుకు వ్రాశాను అంటే, వారి ఇల్లు అప్పుడు ఎలా ఉన్నదో, ఇప్పటికీ అలాగే ఉన్నది.


విశ్వనాథవారు 18 నవంబరు, 1976న గుంటూరులో మరణించారు. మరునాడు వారి భౌతికకాయం వారింటికి తీసుకువచ్చారని తెలిసి, కొంతమంది విద్యార్ధులం వారింటికి వెళ్ళి వారి అంతిమయాత్రలో పాల్గొన్నాము. 


ఇక్కడ మరొక జ్ఞాపకం పంచుకోవాలి. విశ్వనాథ వారు మరణించారన్న సమాచారం తెలిసి, మా కాలేజీ ప్రిన్సిపాల్ గారి వద్దకు కొందరం విద్యార్ధులం వెళ్ళి, అంత పెద్దాయన వెళ్ళిపొయ్యారు, వారి గౌరవార్ధం కాలేజి శలవ ప్రకటించమని అడిగాము. అప్పట్లో ఎమర్జెన్సీ అమలులో ఉన్నది, పైగా మా ప్రిన్సిపాల్ గారు కట్టర్ ఆర్ ఎస్ ఎస్, ఆయన మీద నిఘా ఉండే అవకాశం ఉన్నది. అందుకనో మరేమో తెలియదు, ఆయన అంతా విని, ఒరే అబ్బాయిలూ (అప్పటికి మాది కేవలం బాయ్స్ కాలేజి), నాకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం. కాకపోతే, ఇప్పుడు కాలేజి శలవ ప్రకటించాలి అంటే ఎమర్జెన్సీ కాబట్టి, కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. కారణం మీరందరూ వచ్చి అడిగారని చెప్పాలి. వాళ్ళు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో తెలియదు. కాబట్టి, ఒక పని చేస్తాను, వారి అంతిమ దర్శనం చేసుకోవాలి అనుకునేవారికి మొదటి పిరియడ్ అవ్వంగానే (మాది షిఫ్ట్ కాలెజి కాబట్టి మొదటి అవర్ ఉదయం 8:10 కి అయ్యేది)అనుమతి ఇస్తున్నాను అన్నారు. ఈ వార్త క్షణాల్లో కాలేజీ అంతా పాకి, అందరూ ఆ సాకుతో వెళ్ళిపొయ్యారు. నిజంగా విశ్వనాథ వారిని చూద్దామనుకున్న ఒక 20-30 మంది(నాతో కలిపి) వారింటికి వెళ్ళి వారి అంతిమ యాత్రలో పాల్గొన్నాము.  


అప్పుడు వారి ఇల్లు చూడటమే, ఇక ఆ తరువాత మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు అదే ఇంటిని వారి మ్యూజియం గా మార్చారని తెలిసి, ఒకసారి చూసి రావాలని ఉన్నది.


మారుతీనగర్ లో లెదా ఆ దగ్గరలో ఉన్న మన గ్రూపు సభ్యులు "విశ్వనాథ మ్యూజియం" సందర్శించి లోపలి ఫొటొలు, మ్యూజియం సందర్శనా సమయాలు వగైరా వివరాలతో ఒక సమగ్ర వ్యాసం వ్రాసి పోష్ట్ చేస్తే ఎంతయినా బాగుంటుంది. ఇది ఒక ఆశ. మన గ్రూపు సభ్యులు ఎవరన్నా ఈ ఇనిషియేటివ్ తీసుకుని, చక్కటి వ్యాసం ఫొటోలతో సహా త్వరలో వ్రాస్తారని ఆశిస్తూ ముగిస్తాను.


(ఫొటో సాక్షి పత్రిక వారి సౌజన్యం)

వినిపించని రాగం...

 *వినిపించని రాగం...

రచన: గౌరి !


*(*సిరి కోన మహిళా సాహిత్యోత్సవం  లో చదివిన కథ*)

     కంప్యూటర్ లో ఆఖరి ఈ మెయిల్ కూడా చూసుకుని అవసరమైన వాటికి రిప్లై చేసి కుర్చీలో వెనక్కి వాలి బద్ధక

 గా వేళ్ళు విరుచుకుంది అరుణ.

          అరుణ ప్రభుత్వ ఉద్యోగంచేసి మొన్ననే రిటైర్ అయింది. ఊరికే ఉండటానికి   మనస్కరించక ఒంటరితనం పోగొట్టుకోవటానికి ఒక ప్రైవేటు కంపెనీలో పెద్ద హోదా లోనే ఉంది. ఆమెకి ఉన్నదల్లా ఒక్క చెల్లెలే.

    " అమ్మగారూ... ఏసీ ఏ సేను ఇంక పడుకోండి. నేను పోతున్నాను" అంటూ తలుపు తాళం వేసి వెళ్ళిపోయింది ))పనమ్మాయి.

       చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని ఫ్రెష్ గా ఉండటానికి దూ మెరుగ్గా పౌడర్ ఒత్తుకుని బెడ్రూం లోకి అడుగుపెట్టింది..  చల్లని వాతావరణం.. మంద్రం గ  ఏసీ శబ్దం.. సాయిబాబా ఫోటో కి వేసిన మల్లె పూల గుబాళింపు....  గదిలోకి అడుగు పెట్టగానే అద్భుతంగా హాయిగా అనిపించింది,

      పక్క మీద పడుకుని పాటలు విందాము అనుకునే లోపల మొబైల్ మోగింది. అబ్బా., అనుకుంటూ చూసింది

       "రావు గారు "

 రావు గారు అరుణ చేరిన   కొత్త ఆఫీస్ లో కొలీగ్.అందరికీ తలలో  నాలుకలా మెలగుతూ ఎవర్నీ నొప్పించకుండా చమత్కారంగా మాట్లాడుతారు. ఐదు వాక్యాలు మాట్లాడితే అందులో నాలుగు పంచ్ లు  ఉంటాయి. ఉత్సాహంగా ఫోన్ రిసీవ్ చేసుకుంది .

     "హలో అరుణ గారు ఏంటి డిస్టబ్ చేశానా "అవతల్నుంచి రావు గారి గొంతు  ఉత్సాహంగా...

    లేదు లేదు చెప్పండి అంది స్నేహ పూర్వకంగా

   

     "ఏం లేదండీ ఈరోజు మిత్రుడు బలవంతం మీద ఒక  సంగీత విభావరి కి వెళ్లాను అక్కడ సంగీతం మీద మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి.

    వెంటనే మీరు జ్ఞాపకం వచ్చారు. మీ కోసం పుస్తకాలు కొన్నాను. రేపు తెచ్చి ఇస్తాను. ఎప్పుడు తీరికగా వుంటారు." గొంతులో ఎంతో ఆప్యాయత.

     " అవునా.. చాలా చాలా సంతోషం అండి. నాకు సంగీతం ఇష్టం అని మీకెలా తెలుసు."

    "ఎలా తెలిసిందో మీరే చెప్పుకోండి" అన్నాడు సరదాగా.

      చిన్న చిలిపితనంతో కూడిన ఆ ఆ ప్రశ్నకి ముచ్చటేసింది.

      ఒక నాలుగైదు జవాబులు చెప్పి కాదు అనిపించుకున్నాక 


"మీరే చెప్పారండి మొన్న మన ఆఫీస్  న్యూ ఇయర్ గెట్ టుగెదర్ లో" అన్నాడు.


" ఓహో... మతిమతిమరుపు వచ్చేసిందండోయ్".. సరదాగా నవ్వుతూ అనేసినా,  న్యూ ఇయర్ ఫంక్షన్  సందడిలో హడావిడిలో చెప్పినా తన ఇష్టాలను జ్ఞాపకం  పెట్టుకున్నందుకు మురిసి  పోయింది..

    

     ఈ మధ్య "నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న " అనే పాట బాగా వైరల్ అయింది చూశారా..


 అవునండి కొంచెం సంగీతపరంగా కూడా బానే ఉంది....


సంభాషణ సంగీతం మీద నుండి సినిమా సంగీతo మీదకి  మళ్ళింది.

      అలా అలా సంభాషణ అనేక విషయాల మీద సాగుతూనే ఉంది.

     రావుగారి పంచులకు నవ్వుతూ...  సంభాషణ ఎంజాయ్ చేస్తోంది అరుణ

   

0 ఇంతలో మరొక కాల్  వస్తున్నట్టు సిగ్నల్... అటువైపు  చూసింది అరుణ.

  

చిట్టి తల్లి...

 తన చిన్నారి చెల్లి.


 ఒక్క క్షణం "అబ్బా ఇంత మంచి సంభాషణ ఆపాలా" అనిపించింది.

    మరు  నిమిషం తేరుకుని రావు గారికి విషయం చెప్పి ఫోన్ కట్ చేసింది.

  

     చిట్టీతల్లి తన ప్రాణం.అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో చిట్టి తల్లిని తన దగ్గరికి తెచ్చుకుంది.

   పిల్లలు లేక పోవడంతో తన  సొంత పిల్లగా పెంచుకుంది.


    ఆరు నెలల క్రితమే పెళ్లి అయ్యి భర్త వెంట అమెరికా కి వెళ్ళిపోయింది చిట్టితల్లి 

       పట్టణంలోనే పెరిగినా  అమెరికా అంతా కొత్తగా అనిపించింది చిట్టితల్లికి.

    అక్కడ చలి వాతావరణం షాపింగ్ విధానం, ఎలక్ట్రికల్ పొయ్యి..,, బాత్ టాబ్బు  అన్నీ వింతలే...ఆ ముచ్చట్లు చెప్పటానికి 

     రోజు భర్త ఆఫీస్ కి వెళ్ళి పోగానే అరుణ కి ఫోన్ చేసేది. అరుణ కి కూడా అ టైము తీరికే  అవటంతో ఇద్దరూ చాలాసేపు హస్క్ వేసేవారు.


      ఈ మధ్య రావు గారు తరచూ ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడుతూ ఉండటం వల్ల కొన్ని కాల్స్ మిస్సయింది.


     

.   "ఎలా ఉన్నావ్ రా చిట్టితల్లి" ఆప్యాయంగా పలకరించింది

      బావున్నానక్కా..

 అయినా ఏంటమ్మా ఈమధ్య నీ ఫోను తరుచూ ఎంగేజ్డ్  వస్తుంది. గుడ్ న్యూస్ చెబ్దామని  ఫోన్ చేస్తే అరగంట నుంచి ఎంగేజ్డ్..... నా మాటలు అంత బోర్ కొడుతున్నాయా   నీకు 

    

     కినుక..

చిట్టి తల్లి  మాటల్లో

   

       లే దు లేదు  ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా! అయినా ఆ ఫోన్కాల్స్ అయ్యాక నీతో మాట్లాడితే మనం ఎంతసేపైన మాట్లాడుకోవచ్చు.. అవునా.. గారంగా చెల్లెల్ని ఓదార్చింది.

  

     సరే లే...నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళానక్కా..

మూడో నెల... కన్ఫామ్ చేశారు.

  ,

     ఓ ఎంత మంచి వార్త చెప్పావు. అయితే మరి నువ్వు   డెలివరీ కి ఎలాగో ఇక్కడికి రావాలి కదా కొంచెం ముందుగా నువ్వు మీ ఆయన వచ్చేయండి అంది ఆనందంగా.

    

     లేదక్కా నువ్వే రావాలి ఆయన మరీమరీ చెప్పమన్నారు.. అందరం కలిసి సరదాగా గడపచ్చ్చు.  నువ్వు అమెరికా చూసినట్టు ఉంటుంది

  

  అయినా అన్ని రోజులు నేను అక్కడికి వస్తే ఆయనకు తోడు ఎవరుంటారు  అక్కా


...  ఇవాల్టికి ఇంక  ఉంటాను. అలసిపోయాను. నువ్వు కూడా పడుకో!!చాలా లేట్ అయింది. Ph కట్ చేసింది

    

      ఎంత శుభ వార్త చెప్పింది చిట్టి తల్లి? తన కళ్ళెదుట పెరిగింది అప్పుడే దానికి  పాప..... పెద్ద ఆరింద లాగా మాట్లాడుతోంది.

     మొన్న మొన్నటి దాకా తను తోడు వస్తేగానీ ఎక్కడికి వెళ్లని పిల్ల ఇవాళ తనే భర్తకి తోడుగా ఉండాలి అని అనుకుంటుంది. పిచ్చి పిల్ల 


 సడన్  గా చిట్టితల్లి ఫోన్ కి తన చిరాకు పడిన విషయం జ్ఞాపకం వచ్చింది...

     చిన్న పశ్చాత్తాపం లాంటిది కలిగింది.

   ఎందుకు.. ఎందుకు తనకి చికాకు కలిగింది

      చిట్టి తల్లి తన ప్రాణం... అయినా రావు గారు కాల్ ఎందుకు కట్ చేయలేకపోయింది

మొబైల్ లో నుండి 

 ఏదో మెసేజ్ వచ్చినట్లు రింగ్ వచ్చింది. అప్రయత్నంగానే చూసింది 


      రావు గారి దగ్గర నుంచి మెసేజ్  " రేపు ఎన్ని గంటలకి రమ్మంటారు అని"


    ఎందుకో ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఉన్న ఉత్సాహం లేదు.. జవాబు ఇవ్వాలనిపించలేదు.

 

     కళ్ళు మూసుకుని నిద్ర కి ప్రయత్నించింది.


ఏదో చెప్పలేని అలజడి మనసులో


 ఎప్పటికో నిద్ర పోయింది.

 *      *     *     *

   మర్నాడు  8:30 నుంచి ఏదో ఎదురుచూపు


ఇవాళ రావు గారు వస్తానన్నారే.  రాలేదే..


 ఫోనయినా  చేయొచ్చుగా 

 

    నిన్న నేను మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వ లేదని బాధపడ్డా రా


   రావు గారు ఫోన్ చేస్తే బావుండు అని ఆశ


      ఫోన్ మోగింది ఒక్క ఉదుటున తీసుకుంది.


ఎవరో అనాధాశ్రమం వారు అతి ప్రయత్నం మీద  శాంతంగా  జవాబు చెప్పి పెట్టేసింది.

  

మనసు  మళ్లించు కోవాలని పుస్తకం తీసింది.

 

  కళ్ళు పుస్తకం మీద ఉన్నాయి గానీ చెవులు మాత్రం  గేటు చప్పుడు మీదే ఉన్నాయి.


 

    "మేడం మీరు ఏమి రిప్లై ఇవ్వలేదు. నేనే వచ్చేసాను." గేటు దగ్గర నుండి రావు గారి పలకరింపు.

 

"అయ్యో పర్వాలేదండి. రండి రండి "ఉత్సాహంగా ఎదురు వెళ్ళింది


" కూర్చోండి కాఫీ తెస్తాను" అంటూ లోపలి వెళ్ళిపోయింది

 "కాఫీ చాలా బాగుందండి" తాగుతూ సంభాషణ ప్రారంభించారు రావు గారు.


షరా మామూలుగా

 గంటసేపు ఎలా గడిచిందో తెలియకుండా గడిచిపోయింది.


నేను  వస్తానండి మరి అంటూ బయలుదేరారు రావు గారు.

*        *      *       *

 భోజనం చేసి నడుo వాల్చింది


 ఎదురుగా షోకేస్ లో చిట్టితల్లి పెయింట్ చేసిన చిత్రాలు టెడ్డీబేర్ లు అన్నీ ఉన్నాయి


    వాటిని చూడగానే ఎందుకో గిల్టీ గా అనిపించింది

  

  నేనెందుకు చిట్టి తల్లి తో ఇంతకు ముందoత క్లోజ్ గా   మాట్లాడ లేకపో పోతున్నాను.

 రాత్రి మెసేజ్ కూడా ఇవ్వ దలచ్చుకోని   తాను

    రావు గారు రాంగానే ఎందుకు అంత ఉత్సాహంగా మాట్లాడింది.


 ఇది అసలు పద్ధతేనా


ఏమిటి ఈ డ్యూ యల్ వైఖరి 

    చాలా చాలా అసంతృప్తిగా చికాకుగా అనిపించింది.


    కొన్ని రోజులుగా తన లో జరుగుతున్న సంఘర్షణ ఆ రోజు మరింత ఎక్కువ అయినట్టు అనిపించింది


సన్నగా ప్రారంభమైన తలనొప్పి మరింత ఎక్కువైంది


మెల్లగా గుండె దడ....

 *    *     *     *

 అరుణ చెప్పినదంతా శ్రద్ధగా విన్న సైకియాట్రిస్ట్ దీర్ఘంగా నిట్టూర్చి ప్రారంభించారు 


ఇది నీ ఒక్కర్తి సమస్య కాదమ్మా...


   ఇప్పుడు అరవై దాటి ఒంటరిగా ఉంటున్న.  చాలామంది ఆడవాళ్ల సమస్య.


     చూడమ్మా అరుణ... మనిషికి  తనను గురించి తనకు తెలిసేదిపావు

 వంతు మాత్రమే. వీటిలో వుండే ఐస్బెర్గ్ లాగా అన్నమాట.. 


    మనకు తెలుసు అనుకున్నవన్నీ చాలా కొద్ది మాత్రమే.


     లోపలి పొరల్లో దాగి ఉన్న విషయాలు మనకి అంతగా తెలియదు. 

    మనిషిలో రెండు విభిన్న పరిస్థితులు ఉంటాయి


     ఒకటి తనలో తాను ఉండేది.

 బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్

[05/04, 21:45] Gowri: రెండోది తనకోసం తాను ఉండేది బీ ఇంగ్  ఫర్ ఇట్ సెల్ఫ్ .

    మొదటిది అచేతన స్థితి

 రెండోది చైతన్యవంతమైనది

 మనిషి తనలో తాను ఉండలేడు.

     తన నుంచి తాను విడిపించుకుని చైతన్యంతో ముందుకు పోదాం అనుకుంటాడు.

      అది సాధారణమైన స్వభావం కాదు కాబట్టి సంఘర్షణ తప్పదు.

     

     చిన్నప్పటి నుంచి నువ్వు నీకోసం బతకలేదు.


 నీ  కా ఆలోచన వచ్చే అవకాశమే లేదు


మీ అమ్మ పోయిన తర్వాత ఆ లోటు లేకుండా చిట్టి తల్లిని పెంచటంలోమునిగిపోయావు.


చిట్టి తల్లికి పెళ్లయ్యాక తనదంటూ ఒక లోకం ఏర్పడింది. ఆమె నీ పరిధిలో నుంచి మరొకరి పరిధిలోకి వెళ్ళిపోయింది.


    ఆమె కొత్తదైన జీవితం గురించి నీతో చెప్పటంతో నీ అచేతనలో....

      మనసు లోపలి పొరలలో  సంఘర్షణ ప్రారంభమైంది.


     నీకు తెలియకుండానే ఒంటరితనం నిన్ను ఆవహించింది...


అందులోనూ నువ్వు  ఇప్పుడు పని చేస్తున్న రంగం అలాంటివాటికి అనుగుణమైనది.


    ఒకరితో ఒకరు కలివిడిగా ..

సరదాగా    ఉంటూ పనులు సాధించే రంగం. ఇది నీకు కొత్త. కానీ కావాలి బాగుంది  అనిపిస్తోంది.


      చూడమ్మా ఒక్క విషయం అర్థం చేసుకో... మనిషికి చిన్నప్పుడు ఎలాగ ఒక తోడు అవసరమో ఒక వయసు వచ్చాక పెద్దవారు అయిపోయాక తోడు అవసరం. అందుకే పెద్దవాళ్ళు *తోడు-నీడ *అన్నారు.


  ఎంత బాగా గడిపేస్తున్నా ము అనుకున్నా తోడు లేదనే భావన మనిషిని ఆవరిస్తూ నే ఉంటుంది.


ఆ తోడు లభించినప్పుడు 

  

ఆ లభించిన తోడు   విజాతి అయినప్పుడు ఎంతలేదన్నా కొంత ఆకర్షణ మనసులో నిలుస్తుంది.


    స్నేహ భావం లో ఎటువంటి కల్మషం లేక పోయి నా అది స్త్రీ పురుషుల మధ్య ఉన్నప్పుడు సమాజం ఏమంటుందో అనే సంకోచం ఉంటుంది.


*ఇది ఒక విచిత్రమైన స్థితి*

 వివేకంతో ఆలోచించు


       నీ మనసుని నువ్వు తరచి       చూసుకో...

 ఇప్పటికైనా నీ కోసం నువ్వు బతుకు.

 మీ అమ్మానాన్నల పెంపకం,

      నువ్వు చిన్నప్పుడు గడిపిన ఒద్దికైన బాల్యం, భారతీయ ధర్మం మీద నీ నమ్మకం   నీ మనసుకు వ్యతిరేకంగా నిన్ను కచ్చితంగా నడవనివ్వదు. 


      మ్యాన్ ఈజ్ నథింగ్ బట్  విచ్ హి మేక్స్ ఆఫ్ హిమ్ సెల్ఫ్ .. అన్నారు ప్రముఖ నవలాకారుడు sarth


 అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు.


   మనకు తెలియనిది ఏది మన ను బాధించదు. అంటాడు  సైకాలజీ కి ఆద్యుడు ఫ్రాయిడ్.


 వర్తమానంలో జీవించు

 నీ పరిధిలో నువ్వు చక్కగా ఉండు.


    ప్రముఖ సైకాలజిస్ట్ సాహిత్య    మాటలు వివేకం కలిగిన అరుణకి బాగానే అర్థం అయ్యాయి.

 తేలిక పడ్డ మనసుతో బయటపడింది.... ఇంటి ముఖం పట్టింది  .


సిరికోన సౌజన్యంతో-

చేమకూర భావనా ప్రతిభ!!

 చేమకూర భావనా ప్రతిభ!! 


       ఉ:-పున్నెమిరేల దత్పురము పొంతనఁబోన్ శిఖరాళి దాకి వి 

             ఛ్ఛిన్న గతిన్ సుధారసముజింది పయింబడ నంతనుం 

               డిన్నెల సన్నగిల్లు నదినిక్కమ కాదనిరేనియా పదా 

                 ర్వన్నె పసిండిమేడలకు రాబనియేమిల సౌధనామముల్ ; 

         

                  చామకూరవేంకటకవి- విజయవిలాసము; 


           చామకూర పద చమత్కారముననేగాక,భావచమత్కారమునగూడదిట్ట. విజయవిలాసమున పురవర్ణన 

            చేయుచు ఇంద్రప్రస్ధమునందలి మేడలను వర్ణించుచు అచటిపైడిమేడలకు సౌధములను పేరువచ్చుటకు 

              కారణమేమి?అనిప్రశ్నించుచు, దానికిసమాధానముగా నీకధనువివరించుచున్నాడు. "చందమామ 

               పున్నమిరాత్రులలోనీమేడలమీదుగాపయనించుటచే,ఈమేడలకున్నపొడవైన శిఖరములు కడపులోనికి 

                దిగబడి చందమామలోని'అమృత'మంతయు చంద్రునిపై బడియుండును, లేకున్ననీబంగరుమేడలకు 

                 సౌధము లనుపేరేలవచ్చును? అనిసమాధానమొసంగుచున్నాడు. 

                           ఇక్కడ "సుధ- శబ్దమునకు- అమృతము,సున్నము,అనురెండర్ధములుఉండుటచే కవియీ 

                     చనత్కారమునుసాధించినాడు.

నిరుక్తి అలంకారము!💄

శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ సూత్రములు

 *🙏\|/శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ సూత్రములు🙏*

🙏🌹🪷\|/🪷🌹\|/🌹🪷\|/🪷🌹🙏



🙏⚜️ఒక పురుగు  దేహంలో ప్రవేశించినపుడు​, రోగము మొదలవుతుంది.  డాక్టరు దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని, ఆ భాగం తీసివేస్తాడు•


🙏⚜️అలాగే చెడు చస్తేనే మంచి వస్తుంది. ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది.. కాలధర్మము ప్రకారం వీళ్ళను చంపాలి.. నీవు నిమిత్త మాత్రం.. పుట్టిన వానికి చావు తప్పదు ​ యుద్దము చేస్తే ధర్మ ప్రతిష్ట , కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది... మమకారం వదిలి పెట్టు, అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీ కృష్ణుడు•


🙏⚜️కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు.. 


*ఇది ధర్మమా కృష్ణా!*  అని..., 


🙏⚜️నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను.. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము. సింహము మాంసాహారము తింటుంది. ఆవు శాఖాహారము తింటుంది.., మాంసాహారము తినదు...... కనుక భగవంతుడు చెప్పేదీ, చేసేదీ ధర్మము.

                 

🙏⚜️యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే.. రామాయణంలో రావణుని కిరీటం క్రింద పడితే  రాముడు యుద్దం  చేయలేదు.. , వెళ్ళిపోయాడు.. ఆ రోజు రాత్రి రావణుడు శివుణ్ణి దూషిస్తాడు... నీవు భక్తుణ్ణి రక్షించలేదని... ఎఫ్ఫుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్దంలో రావణుడు సంహరించబడినాడు.


🙏⚜️అలాగే ద్రోణాచార్యుడు (గురువు) యుద్ధం చేయరాదు.. బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి... కత్తి పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం... మన ఇంట్లో దొంగలు పడ్డారు.., సామానంతా మూట కట్టుకుని పారిపోతున్నారు...  వారిని చూచి నీవు తరుముకుని వెళ్ళావు .. దొంగలు ముళ్ళల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు.., నీవు కారు వేసుకుని  తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి...  


🙏⚜️అందువలనే ధర్మరాజు చేత శ్రీ కృష్ణుడు  *"అశ్వత్థామ హతః"* అని పెద్దగా చెప్పి *"కుంజరహః"* అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతో జయించాలి. అందువలన భగవంతుడు​ ఏకార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి...


🙏⚜️పిల్లలకి  గీత  చిన్న వయసులో ఎందుకు నేర్పాలో యీ విధంగా చెప్పారు...


🙏⚜️పొట్టకూటికి ప్రపంచ విద్యలు ఏ విధంగా అవసరమో, మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి...  ప్రతి దేశం లోనూ యుద్ధం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంచుతుంది... ఎప్పుడో రాబోయే యుద్ధానికి యిప్పటి నుండి ఎందుకు తొందర..? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా...


🙏⚜️కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో​ ఎవరికీ తెలియదు.   అప్పటికప్పుడు సిద్ధం అయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు... అప్పుడు మనం ఏమి చేయగలము... వారికి బానిసలు కావాలి...


🙏⚜️అదే విధంగా నిత్యజీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి.. ఏ సమస్య ఎపుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు... దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి  గీత యిస్తుంది... దీనుడైన అర్జునుని ధీరుని వలె భగవద్గీత మార్చివేసినది.


🙏⚜️అదేవిధముగా... చిన్నతనం నుండి భగవద్గీత చదవడం, ఆచరించడం ప్రారంభం చేసిన వారు  ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు.

    

🙏⚜️భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే.  అందుకే...  *గీతా పారాయణ కన్నా  గీతాచరణ ముఖ్యం* అన్నారు... భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అట్లే వంట చేయడానికి అగ్గిపెట్టె అంతా అవసరంలేదు... ఒక్క పుల్ల చాలు..  

         ​

🙏⚜️బెంగుళూరు, బెంగుళూరు అని మనము ఎన్ని సార్లు జపించినా బెంగుళూరు చేరలేము.. ప్రయాణం మొదలుపెడితే గమ్యం చేరగలము. 


🙏⚜️చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు... గరుడ పక్షి యైనా ఎగురకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు..  కృష్ణుడు చెప్పిన విషయములు మనం ఆచరించడం మొదలుపెడితే కృష్ణుడు యిచ్చే ఫలితం అందుకోగలము..


🙏🌴🌹🪔🌹🌴🙏

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 


ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు. మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి. దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 


ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   


ఇట్లు 


మీ బ్లాగరు

నామ రామాయణం*


 *నామరామాయణం* అంటారు. 108 పాదాల్లో గేయరూపంగా రామాయణం అంతటినీ వర్ణిస్తుంది. దీనిని పారాయణ చేస్తే రామాయణ పారాయణ చేసిన ఫలం లభిస్తుంది.




నామ రామాయణం




॥ బాలకాండః ॥




శుద్ధబ్రహ్మపరాత్పర రామ ।


కాలాత్మకపరమేశ్వర రామ ।


శేషతల్పసుఖనిద్రిత రామ ।


బ్రహ్మాద్యమరప్రార్థిత రామ ।


చండకిరణకులమండన రామ ।


శ్రీమద్దశరథనందన రామ ।


కౌసల్యాసుఖవర్ధన రామ ।


విశ్వామిత్రప్రియధన రామ ।


ఘోరతాటకాఘాతక రామ ।


మారీచాదినిపాతక రామ । 10 ।


కౌశికమఖసంరక్షక రామ ।


శ్రీమదహల్యోద్ధారక రామ ।


గౌతమమునిసంపూజిత రామ ।


సురమునివరగణసంస్తుత రామ ।


నావికధావికమృదుపద రామ ।


మిథిలాపురజనమోహక రామ ।


విదేహమానసరంజక రామ ।


త్ర్యంబకకార్ముఖభంజక రామ ।


సీతార్పితవరమాలిక రామ ।


కృతవైవాహికకౌతుక రామ । 20 ।


భార్గవదర్పవినాశక రామ ।


శ్రీమదయోధ్యాపాలక రామ ॥




రామ రామ జయ రాజా రామ ।


రామ రామ జయ సీతా రామ ॥




॥ అయోధ్యాకాండః ॥




అగణితగుణగణభూషిత రామ ।


అవనీతనయాకామిత రామ ।


రాకాచంద్రసమానన రామ ।


పితృవాక్యాశ్రితకానన రామ ।


ప్రియగుహవినివేదితపద రామ ।


తత్క్షాలితనిజమృదుపద రామ ।


భరద్వాజముఖానందక రామ ।


చిత్రకూటాద్రినికేతన రామ । 30 ।


దశరథసంతతచింతిత రామ ।


కైకేయీతనయార్పిత రామ । (తనయార్థిత)


విరచితనిజపితృకర్మక రామ ।


భరతార్పితనిజపాదుక రామ ॥




రామ రామ జయ రాజా రామ ।


రామ రామ జయ సీతా రామ ॥




॥ అరణ్యకాండః ॥




దండకావనజనపావన రామ ।


దుష్టవిరాధవినాశన రామ ।


శరభంగసుతీక్ష్ణార్చిత రామ ।


అగస్త్యానుగ్రహవర్దిత రామ ।


గృధ్రాధిపసంసేవిత రామ ।


పంచవటీతటసుస్థిత రామ । 40 ।


శూర్పణఖార్త్తివిధాయక రామ ।


ఖరదూషణముఖసూదక రామ ।


సీతాప్రియహరిణానుగ రామ ।


మారీచార్తికృతాశుగ రామ ।


వినష్టసీతాన్వేషక రామ ।


గృధ్రాధిపగతిదాయక రామ ।


శబరీదత్తఫలాశన రామ ।


కబంధబాహుచ్ఛేదన రామ ॥




రామ రామ జయ రాజా రామ ।


రామ రామ జయ సీతా రామ ॥




॥ కిష్కింధాకాండః ॥




హనుమత్సేవితనిజపద రామ ।


నతసుగ్రీవాభీష్టద రామ । 50 ।


గర్వితవాలిసంహారక రామ ।


వానరదూతప్రేషక రామ ।


హితకరలక్ష్మణసంయుత రామ ।




రామ రామ జయ రాజా రామ ।


రామ రామ జయ సీతా రామ ।




॥ సుందరకాండః ॥




కపివరసంతతసంస్మృత రామ ।


తద్గతివిఘ్నధ్వంసక రామ ।


సీతాప్రాణాధారక రామ ।


దుష్టదశాననదూషిత రామ ।


శిష్టహనూమద్భూషిత రామ ।


సీతావేదితకాకావన రామ ।


కృతచూడామణిదర్శన రామ । 60 ।


కపివరవచనాశ్వాసిత రామ ॥




రామ రామ జయ రాజా రామ ।


రామ రామ జయ సీతా రామ ॥




॥ యుద్ధకాండః ॥




రావణనిధనప్రస్థిత రామ ।


వానరసైన్యసమావృత రామ ।


శోషితశరదీశార్త్తిత రామ ।


విభీష్ణాభయదాయక రామ ।


పర్వతసేతునిబంధక రామ ।


కుంభకర్ణశిరశ్ఛేదక రామ ।


రాక్షససంఘవిమర్ధక రామ ।


అహిమహిరావణచారణ రామ ।


సంహృతదశముఖరావణ రామ । 70 ।


విధిభవముఖసురసంస్తుత రామ ।


ఖఃస్థితదశరథవీక్షిత రామ ।


సీతాదర్శనమోదిత రామ ।


అభిషిక్తవిభీషణనుత రామ । (నత)


పుష్పకయానారోహణ రామ ।


భరద్వాజాదినిషేవణ రామ ।


భరతప్రాణప్రియకర రామ ।


సాకేతపురీభూషణ రామ ।


సకలస్వీయసమానత రామ ।


రత్నలసత్పీఠాస్థిత రామ । 80 ।


పట్టాభిషేకాలంకృత రామ ।


పార్థివకులసమ్మానిత రామ ।


విభీషణార్పితరంగక రామ ।


కీశకులానుగ్రహకర రామ ।


సకలజీవసంరక్షక రామ ।


సమస్తలోకోద్ధారక రామ ॥ (లోకాధారక)




రామ రామ జయ రాజా రామ ।


రామ రామ జయ సీతా రామ ॥




॥ ఉత్తరకాండః ॥




ఆగత మునిగణ సంస్తుత రామ ।


విశ్రుతదశకంఠోద్భవ రామ ।


సీతాలింగననిర్వృత రామ ।


నీతిసురక్షితజనపద రామ । 90 ।


విపినత్యాజితజనకజ రామ ।


కారితలవణాసురవధ రామ ।


స్వర్గతశంబుక సంస్తుత రామ ।


స్వతనయకుశలవనందిత రామ ।


అశ్వమేధక్రతుదీక్షిత రామ ।


కాలావేదితసురపద రామ ।


ఆయోధ్యకజనముక్తిత రామ ।


విధిముఖవిభుదానందక రామ ।


తేజోమయనిజరూపక రామ ।


సంసృతిబంధవిమోచక రామ । 100 ।


ధర్మస్థాపనతత్పర రామ ।


భక్తిపరాయణముక్తిద రామ ।


సర్వచరాచరపాలక రామ ।


సర్వభవామయవారక రామ ।


వైకుంఠాలయసంస్తిత రామ ।


నిత్యనందపదస్తిత రామ ॥




రామ రామ జయ రాజా రామ ॥


రామ రామ జయ సీతా రామ ॥ 108 ॥




ఇతి శ్రీలక్ష్మణాచార్యవిరచితం నామరామాయణం సంపూర్ణమ్ ।

రాముడు

  *రాముడు ముగ్గురి ముందు మాట్లాడడు ...*


1. గురువుగారి దగ్గర ఉన్నప్పుడు నోరు విప్పి మాట్లాడడు.


ఎంతో అవసరము అయితే అద్భుతమైన ప్రశ్న ఒకటి వేస్తాడు గురువుగారు అదేపనిగా మాట్లాడేటట్లు చేసి చెవులు దొప్పలు చేసుకుని తాను వింటాడు. 


2. తండ్రి దగ్గర మాట్లాడడు. తండ్రి కూడా గురువే. ఎలా అనగా గాయత్రి ఇచ్చేవాడు. తండ్రే. కనక తండ్రి వద్ద చాలా తక్కువ ఆలోచించి మాట్లాడతాడు. 


3. స్త్రీలు ఉన్నచోట మాట్లాడడు. పురుష బలహీనత ఆడవాళ్ళు ఉన్న చోట మాట్లాడితే చాలా గొప్పవాడు అనుకోవాలి అని ఒకటికి రెండు మాటలు మాట్లాడటము ప్రారంభము అవుతుంది.


అందుకని ప్రయత్నపూర్వకముగా మౌనము.


మాట్లాడవలసిన అవసరము లేకుండా చూసుకుంటాడు.


మాట్లాడవలసి వస్తే ఒకటి రెండు మాటలతో సరి పుచ్చుతాడు..

తిరుమల తిరుపతి

 తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల.*




1.తిరుమల పూర్వ నామధేయమేమిటి?                         


Ans.: వరహాపర్వతం.




2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? 


Ans. : *ఉగ్రాణం.* 




3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?


Ans. : *నడిమిపడివాకిలి.*




4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? 


Ans.: *పరిమళపు అర.* 




5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?


Ans.: *పోటు.* 




6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?


Ans. : *30 అడుగులు.* 




7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?


Ans.: *అంగప్రదక్షణ.* 




8. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?


Ans.: *మహామణిమండపం.* 




9. బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు?


Ans.: *కొలువు మండపం.*




10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?


Ans. : *శయన మండపం.* 




11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?


Ans.: *అద్దాల మండపం.* 




12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి? 


Ans.: *డోలా మండపం.*




13. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?


Ans. : *రంగనాయకుల మండపం.*




14. తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది?


Ans.: *రాజా తొడరమల్లు.* 




15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?


Ans.: *బలి పీఠం.*




16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?


Ans. : *కోయిల్ తిరుమంజనం.*




17. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?


Ans. : *4 సార్లు.*




18. విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?


Ans.: *2 సార్లు* 




19. సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?


Ans. : *29*




20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?


Ans. : *7 సార్లు...*




🙏🙏

⚜ శ్రీ మహాలింగేశ్వర దేవాలయం

 🕉 *మన గుడి : నెం 323*


⚜ *కర్నాటక  :- కావూరు - మెంగళూరు*


⚜ శ్రీ మహాలింగేశ్వర దేవాలయం



💠 శ్రీ మహాలింగేశ్వర దేవాలయం భారతదేశంలోని కర్ణాటకలోని మంగళూరులోని కావూరు ప్రాంతంలో ఉంది . 

ఇది శివుని రూపమైన మహాలింగేశ్వరునికి అంకితం చేయబడింది . 


💠 13 లేదా 14వ శతాబ్దంలో పరమేశ్వరుడిని ఆరాధించడానికి వచ్చిన మహర్షి కావేరచే ఈ ఆలయాన్ని స్థాపించారు. 

లింగాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించాడు.

ఆ విగ్రహాన్ని ఋషి ప్రతిష్ఠించి పూజిస్తారు. 

ఇది అభిషేకప్రియుడైన శివాలయం.



🔆 పురాణం


💠 ఈ ప్రదేశాన్ని సందర్శించిన "కువేర మహర్షి" కారణంగా ఈ ప్రాంతానికి "కావూరు" అని పేరు వచ్చింది. 

ప్రస్తుతం ఆలయంలో పూజలందుకుంటున్న దేవత ఆయన తపస్సు ఫలితంగా దర్శనమిచ్చిందని ప్రతీతి.

ఆ తర్వాత ఈ ప్రాంతం చాలా మంది రాజుల పాలనకు లోనైంది. అయితే చుట్టుపక్కల గ్రామాలకు కూడా ప్రధాన దైవం అయిన మహాలింగేశ్వర స్వామికి కుంటవర్మ అనే రాజు ఆలయాన్ని నిర్మించాడని శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు.


💠 ఈ ఆలయం మొదట్లో ఒక చిన్న మందిరం వలె నిర్మించబడింది, కానీ తరువాత శతాబ్దాలుగా వివిధ పాలకులచే విస్తరించబడింది మరియు పునరుద్ధరించబడింది. 

ఈ ఆలయం ఒకప్పుడు గౌడ సారస్వత్ బ్రాహ్మణ సంఘంలో భాగంగా ఉండేది . అయితే, 16వ శతాబ్దంలో, ఇది బంట్ కమ్యూనిటీ నియంత్రణలోకి వచ్చింది . 

అప్పటి నుంచి బంట్ వర్గీయులు ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నారు. 


💠 17వ శతాబ్దంలో, ఈ ఆలయాన్ని కేలాడి నాయకులు పునరుద్ధరించారు . వారు ఒక అందమైన చెక్క రథాన్ని జోడించారు, ఇది ఇప్పటికీ వార్షిక రథయాత్ర సమయంలో ఉపయోగించబడుతుంది . 

ఈ ఆలయాన్ని 19వ శతాబ్దంలో ధర్మస్థల ఆలయ పాలకులు హెగ్గాడే పునరుద్ధరించారు . 


💠 కావూర్ మహాలింగేశ్వర దేవాలయం యొక్క వాస్తుశిల్పం ద్రావిడ మరియు హొయసల శైలుల సమ్మేళనం . 

ఈ దేవాలయం ప్రత్యేకమైన డిజైన్ మరియు లేఅవుట్‌ను కలిగి ఉంది, ఇది ఈ ప్రాంతంలోని ఇతర దేవాలయాల నుండి వేరుగా ఉంటుంది. ఇది దీర్ఘచతురస్రాకార ఆకారాన్ని కలిగి ఉంది, ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉంటుంది.


💠 ఆలయ సముదాయంలో ప్రధాన మందిరం , అనేక చిన్న మందిరాలు మరియు ప్రధాన మందిరం ముందు పెద్ద బహిరంగ స్థలం ఉన్నాయి.

ఆలయ గోడలు వివిధ హిందూ దేవతలను మరియు పౌరాణిక దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన  శిల్పాలతో అలంకరించబడ్డాయి. 


💠 ఆలయం యొక్క ప్రధాన మందిరం 3 అంచెల నిర్మాణం, ఇందులో ప్రధాన దేవత మహాలింగేశ్వరుడు నిలబడి ఉన్న భంగిమలో చిత్రీకరించబడ్డాడు.

నాలుగు చేతులతో త్రిశూలం , డమరుడు , సర్పం మరియు కమండలం పట్టుకున్నారు. మందిరం పైభాగంలో  దేవతల చిత్రాలతో అలంకరించబడిన చెక్కబడిన రాతి శిఖరంతో అలంకరించబడింది.


💠 ఉత్సవాలు :

కావూరు మహాలింగేశ్వర ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగలు మహాశివరాత్రి, శ్రీ కృష్ణ జయంతి మరియు వార్షిక ఆలయ పండుగ.


💠 ఈ క్షేత్రంలో వార్షిక ఉత్సవం ఐదు రోజుల పాటు జరుపుకుంటారు, ఇది మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. 

దీని తర్వాత రెండవ రోజు మూడు సవారి, మూడవ రోజు పాడు సవారి, మధ్యాహ్నం రథోత్సవం & నాల్గవ రోజు అన్నసంతర్పణ జరుగుతుంది. 

ఉదయం కవథోద్ఘటనే ఐదవ రోజు సాయంత్రం మారులు ధూమావతి యొక్క భండారాన్ని అనుసరిస్తుంది. ఈ రోజు కూడా నేమ మరియు బలి సేవలు జరుగుతాయి. ఆ తర్వాత సంప్రదాయ పద్ధతుల ప్రకారం జరుపుకునే వార్షిక పండుగ ముగింపుకు గుర్తుగా జెండాను అవనతం చేస్తారు.


💠 శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించే మహాశివరాత్రి రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవలు, జాగరణ, బహజనలు జరుగుతాయి.

డొనెషన్లు

 

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, పేటియం లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

తొమ్మిదింటినీ

 శ్లో II

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం ,

మంత్రమౌషధసంగమౌ ,

దానమానావమానాశ్చ ,

నవ గోప్యా మనీషిభిః II


ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము , అవమానము - ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను .


పెద్దల మాట చద్ది మూట .

ఎల్లరకూ ఎప్పుడూ శిరోధార్యం .

పంచాంగం 21.05.2024 Tuesday

 ఈ రోజు పంచాంగం 21.05.2024 Tuesday.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల పక్ష: త్రయోదశి తిధి భౌమ వాసర: స్వాతి నక్షత్రం వ్యతీపాత యోగ: తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి సాయంత్రం05:35 వరకు.

స్వాతి ఈ రోజు పూర్తిగా ఉంది. 

సూర్యోదయం : 05:46

సూర్యాస్తమయం : 06:39


వర్జ్యం : పగలు 11:49 నుండి మధ్యాహ్నం 01:33 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:21 నుండి 09:12 వరకు తిరిగి పగలు 11:06 నుండి 11:50 వరకు.


అమృతఘడియలు : రాత్రి 10:13 నుండి 11:57 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

శ్రీ గురుభ్యోనమః

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*21-05-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


విద్యార్థుల ఫలితాలు  నిరుత్సాహపరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. మిత్రులతో కలహాలు సూచనలున్నవి.

---------------------------------------

వృషభం


ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణదాతల  నుండి ఋణ  వత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

---------------------------------------

మిధునం


దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ విషయమై  కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం  ఉంటుంది.

---------------------------------------

కర్కాటకం


బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో  యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత  ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

సింహం


అవసరానికి ధన సహాయం అందుతుంది. అనారోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన  పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

---------------------------------------

కన్య


ఇంటా బయట  అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------

తుల


బంధు మిత్రుల నుండి  శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. విద్యార్దులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారమున కీలక  నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు. ఉద్యోగమున  అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


ముఖ్యమైన  పనులు వాయిదా పడుతాయి. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.  ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన చికాకులు తప్పవు. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

---------------------------------------

ధనస్సు


ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు  ఫలిస్తాయి.  వృత్తి  ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మకరం


వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన  వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

కుంభం


నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు.  చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి  శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

మీనం


ఉద్యోగమున మీ పని తీరుకు  అధికారుల నుండి తగిన గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో  కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున  ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారాలు  ఆశించిన విధంగా రాణిస్తాయి ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో  నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

మంత్రార్థం తెలుసుకొని

 *మంత్రార్థం తెలుసుకొని* *ఆమంత్ర జపంచేయండి* 


గాయత్రి వంటి మంత్రాన్ని జపించినా, దాని అర్థాన్ని తెలుసుకొని అనుసంధానం చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది.

భగవత్పాదులు మనకు చేసిన గొప్ప ఉపకారం అయిన శ్లోకాల విషయంలో కూడా ఇదే.  ఆయన ఎన్నో ఉపకారాలు చేసినా వాటన్నింటినీ మరిచిపోయి బాహ్యమైన విషయాల్లో నిమగ్నమైపోతాం.  ఇలా ఉండకూడదు.  ఆయన తత్త్వాన్ని తెలిపే గ్రంథాలలోని విషయాలతో అనుసంధానం సాధ్యమైనంత వరకు కావాలి.

 *దేహాపిక్రమణసోఽస్తి                                              ప్రత్యవాయో న విద్యతే* 

*స్వల్పమభ్యస్యధర్మస్య* 

*ద్రయతే మహతో పాయత్ II* 


 “ఇందులో (కర్మయోగం) చేసిన కృషి వ్యర్థం కాదు;  ఇది వ్యతిరేక ప్రభావాన్ని ఉత్పత్తి చేయదు.  ఈ ధర్మంలో కొంచెం అయినా నిన్ను భయం నుండి కాపాడుతుంది” అని కృష్ణుడు గీతలో చెప్పాడు.

 దీనికోసం మనం నిత్య జీవితంలో కొంత సమయం కేటాయించాలి.   ఎన్నో పనికిమాలిన పనుల్లో కాలక్షేపం చేస్తున్నాం.  భగవత్ - స్తోత్రాల గురించి ఆలోచించడం, ఆయా భగవత్ సంబంధమైన పుస్తకాలు చదవడం వంటి ఉపయోగకరమైన పనులు చేయకుండా, మనం జీవితంలో గొప్ప విజయాన్ని ఎలా సాధిస్తాము?


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

కరువులో అన్నమును

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో॥ *దుర్భిక్షేచాన్న దాతారం సుభిక్షే ధనదాయినమ్* ౹

*హేమంతే వస్త్రదాతారం గ్రీష్మేంబువ్యజనంపరమ్*॥

*ఆతపే ఛత్రదాతారం పాదుకాదానమేవచ*

*ఆర్తత్రాణ విధాతారం దానకాండం ప్రచక్ష్యతే* ౹

*తద్యోగకాలేయద్దత్తం కించిదవ్యధికం భవేత్* ॥


తా॥ కరువులో అన్నమును, సుభిక్షకాలమున ధనంబు, చలి కాలంబున వస్త్రమును, గ్రీష్మకాలంబున నీరు విసనకఱ్ఱలును మొదలైనవాటిని ఎండ కాలంబున గొడుగును పాదరక్షలును భయార్తి సమయంబున అభయ రక్షణంబును కొంచెమయినను ఉపయోగించునటుల చేసినవాడు గొప్ప దాతయని పేరు చెందగలడు అన్నట్లు *యేద్రవ్యమే కాలంబున నెవ్వనికి ధర్మముగ నుపయోగార్హగునో దానిని వానికప్పుడే యిచ్చుట మంచిది*.


   👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


శ్లో𝕝𝕝 

*గేయం గీతా నామ సహస్రం*

*ధ్యేయం శ్రీపతి రూపమజస్రం* ౹

*నేయం సజ్జన సంగే చిత్తం*

*దేయం దీనజనాయ చ విత్తం* ॥27॥


భావం: భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. *సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి*.