*మంత్రార్థం తెలుసుకొని* *ఆమంత్ర జపంచేయండి*
గాయత్రి వంటి మంత్రాన్ని జపించినా, దాని అర్థాన్ని తెలుసుకొని అనుసంధానం చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది.
భగవత్పాదులు మనకు చేసిన గొప్ప ఉపకారం అయిన శ్లోకాల విషయంలో కూడా ఇదే. ఆయన ఎన్నో ఉపకారాలు చేసినా వాటన్నింటినీ మరిచిపోయి బాహ్యమైన విషయాల్లో నిమగ్నమైపోతాం. ఇలా ఉండకూడదు. ఆయన తత్త్వాన్ని తెలిపే గ్రంథాలలోని విషయాలతో అనుసంధానం సాధ్యమైనంత వరకు కావాలి.
*దేహాపిక్రమణసోఽస్తి ప్రత్యవాయో న విద్యతే*
*స్వల్పమభ్యస్యధర్మస్య*
*ద్రయతే మహతో పాయత్ II*
“ఇందులో (కర్మయోగం) చేసిన కృషి వ్యర్థం కాదు; ఇది వ్యతిరేక ప్రభావాన్ని ఉత్పత్తి చేయదు. ఈ ధర్మంలో కొంచెం అయినా నిన్ను భయం నుండి కాపాడుతుంది” అని కృష్ణుడు గీతలో చెప్పాడు.
దీనికోసం మనం నిత్య జీవితంలో కొంత సమయం కేటాయించాలి. ఎన్నో పనికిమాలిన పనుల్లో కాలక్షేపం చేస్తున్నాం. భగవత్ - స్తోత్రాల గురించి ఆలోచించడం, ఆయా భగవత్ సంబంధమైన పుస్తకాలు చదవడం వంటి ఉపయోగకరమైన పనులు చేయకుండా, మనం జీవితంలో గొప్ప విజయాన్ని ఎలా సాధిస్తాము?
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి