5, అక్టోబర్ 2022, బుధవారం

విజయం పొందుదాం

 ॐ          విజయ దశమి శుభాకాంక్షలు. 


జమ్మి ప్రాధాన్యత 


శమీ శమయతే పాపం 

శమీ శత్రు వినాశినీ I 

అర్జునస్య ధనుర్ధారీ

రామస్య ప్రియదర్శినీ ॥ 


పాండవులు ఆయుధాలు జమ్మిచెట్టు (శమీవృక్షం) పైనే ఎందుకు దాచారు?


బహ్రెయిన్ జమ్మిచెట్టు 


    ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది.   

    ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. 

    దీని వయసు 400 ఏళ్ల పై మాటే. 

    ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. 

    వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. 

    అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు.

    జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది.

    జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. 

    అరబ్బు ఎమిరేట్ల దేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. 

    రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే. 


ఆంధ్రవ్యాసుల వివరణ 


    ఆంధ్రవ్యాసుల వారిని ఒకసారి ఒకభక్తుడు జమ్మిచెట్టు గురించి ప్రశ్నించాడు.   

    పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలు ఉన్నాయి కదా! అని అడిగాడు.

    దానికి వారు ఇచ్చిన సమాధానం : 


    జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరే చెట్టుకూ లేదు. 

    ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. 

    ఇది స్త్రీ తత్త్వానికి చెందింది. 

    రావి చెట్టు పురుషతత్త్వాని చెందిన అగ్నితత్త్వ వృక్షం. 

    పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు. 

    రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. 

    పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. 


వీరుడు - ఆయుధం 


    వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం.   

    నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. 

    దానికి అనేక కారణాలు ఉంటాయి. 

    వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. 

    ఒకసారి ఆయుధాన్ని చేత పట్టాక, దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. 

    అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా.    

    కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు అంతే! 

    ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. 

    ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే, వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. 

    కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి? అనే ప్రశ్న వచ్చింది. 


అర్జునిడి నిర్ణయం 


    దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టును ఎంచుకుంటాడు. 

    దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.

    నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. 

    శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. 

    కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.


వృక్షంపై ఉంచడానికి కారణం 


    సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? 

    దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలోనైనా ఒకవేళ భూమి మీద ఆయుధాలు ఉంచవలసివస్తే,  పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది కూడా! 

    వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది. 


జమ్మిచెట్టు ప్రత్యేకత 


    జమ్మిచెట్టులో అగ్ని తత్త్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్త్వానికీ మిత్రత్త్త్వం కుదురుతుంది. 

    జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు. వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది. 

    మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్లు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. 

    ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది. 

    అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. 

    అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చూసిన జమ్మిచెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతికష్టమైనది అని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు (భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః). 


స్మశానంలోని వృక్ష విశేషం 


    జమ్మి అందరికీ పూజనీయమైన చెట్టే అయినా, శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. 

    బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు.     

    ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. 

    నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. 

    చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. 

    నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.

    ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.

(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,

అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః | 

కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)

    పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. 

    కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు

(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం, 

యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి | 

తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).


జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం : 


    ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. 

    మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. 

    నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు. అంతగా దాన్ని ఆరాధిస్తారు. 


    అటువంటి జమ్మివృక్షాన్ని ఈరోజు పూజించి, 

  - పాపాలని పోగొట్టుకొని, 

  - శత్రువులను తొలగించుకొని, 

  - అర్జునుడిలాగా శ్రీరామునిలాగా విజయం పొందుదాం. 


శమీ శమయతే పాపం 

శమీ శత్రు వినాశినీ I 

అర్జునస్య ధనుర్ధారీ

రామస్య ప్రియదర్శినీ ॥ 


Curtecy.చివుకుల రవీంద్రనాథ్ గారు. 


కాశీ విశ్వనాథ్ గారి ముఖపుస్తక విషయం సౌకర్యవంతంగా మార్చబడి.

 *అందరికీ విజయదశమీపర్వదిన శుభాకాంక్షలతో.....*



శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి-10 

*విజయదశమి*

19.

శ్రీకామేశహృదబ్జమందిరగతాం కామేశ్వరీభ్రామరీమ్ 

విశ్వత్రాణపరాయణైకసుమతీం వాత్సల్యభూషోజ్జ్వలామ్ 

చిద్రూపాం చిదచిద్వివేకకరణాం శ్రీచక్రసింహాసినీమ్ 

కల్యాణీం కరుణార్ద్రచిత్తగుణినీం స్తోష్యామహే మాతరమ్ 


*~శ్రీశర్మద*

కుటుంబ వ్యవస్థ

 👤కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు👤


అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది.ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు. 

👨🏻‍⚖️

 ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు.నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు  అలెర్జీ పుడుతుంది .దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు.

🐃

కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణాలు: 

1.అతి తెలివి

2.చిన్న తప్పును కూడా భరించే శక్తి , సహనం లేవు.

3.అందరూ సమానమే అనే వింత భావన పెరగటం ( డెమాక్రసి).

4.పెద్దలూ,పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక  పోవడం.

5.ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాం ల లో మునిగి పోవడం.ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈ రోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ,ఇంట్లోని వారు ఎప్పుడు  ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది .

6.చిన్న దానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.

🌴

7.ఎవరో ఒకరి నోటి దురుసు తనం కుటుంబం మొత్తం చిన్నా భిన్నం కావడానికి కారణం అవుతుంది.

8.ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా ,దృఢంగా ,బలంగా మేనేజ్ చేయలేకపోవడం కూడా ఒక కారణం.

9.ఇంట్లో భార్యా భర్తలు (తల్లి దండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు.

😔

అన్ని ఫ్యామిలీ లల్లో గొడవలు,కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు.అన్యోన్యంగా ,ప్రేమతో,అవగాహనతో ఉన్న ఫ్యామిలీ స్ కనబడక పోవడం తో ఆ వ్యవస్థ పై నమ్మకం పోయింది.

😣

అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు.31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే  లేదు.గత 30  ,40 ఏళ్ళల్లో  మనస్ఫర్థలు,గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగా నే చెబుతున్నారు.

🌻

10.ఆర్థిక అవసరాలు,వ్యత్యాసాలు ,పోల్చుకోవడం తదితర కారణాల  వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండా పోతుంది.

11.మనుష్యులు అంటేనే విలువ లేదు.మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది.అధిక జనాభా,సుఖ లాలస,సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.

12.మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు.దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.

13.కుటుంబ నిర్వహణ ఒక కళ.ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.

14.మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది.మొరటుగా ప్రవర్తిస్తున్నారు.

☘️

నేను నా భార్య/ భర్త 

అనే సిద్దాంతం పోయి

 "నేనే నేను "" నేను నేనే"

పాలసీ వచ్చింది.పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది.ఇంట్లో ఉంచు కోవాలంటే భయ పడుతున్నారు.

అంత్య నిష్టూరంగా కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు.

☘️

కుటుంబ విలువలు,కట్టు బాట్లు ఇక ఉండవు.ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి.

👤

అన్నా దమ్ములు,అక్కా చెల్లెళ్ళు,అన్నా చెల్లెళ్ల,అక్కా తమ్ముళ్ళ ,భార్యా భర్తల మధ్య  బలమైన బంధాలు ఇప్పుడు లేనే  లేవు.

🤓

సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది.

ప్రస్తుతం నడుస్తుందంతా  ఒక షో.ఒక నాటకం.

ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది.ఇంకా పచ్చిగా అవుతారు.

దీనికి అందరూ ,అన్నీ కారణములే.

🙆🏻‍♂️

ఇక్కడ ఎవ్వరూ శ్రీ రామ చంద్రులు లేరు.ఎక్కడా సీతమ్మలు లేరు.

ఉన్నవారంతా అటు ఇటు గానీ వింత జాతి.

😟

ఇది ఇంతే.అది అంతే.ఎవ్వరూ ఏమీ చేయ లేరు.

🙃

ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము.

Bhargava sarma 2


Click here
 

శుభాకాంక్షలు

 *ॐ            విజయ దశమి శుభాకాంక్షలు* 


*అమ్మలగన్నయమ్మ ముగురమ్మల* 

          *మూలపుటమ్మ చాల బె* 

*ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి* 

          *పుచ్చినయమ్మ దన్ను లో I* 

*నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల* 

          *నుండెడియమ్మ దుర్గ, మా*  

*యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ* 

          *కవిత్వ పటుత్వ సంపదల్ ॥* 


    విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో, ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం వ్రాయబడి ఉంటుంది. 

    ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. 

    తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితాలని ఇస్తాయి. 

    అందరు కొన్ని  చదవకూడదు. కొన్ని  చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. బీజాక్షరములను ఉపాసన చెయ్యడము కష్టం. 

    పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు. 


    అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో, అటువంటి అమ్మకు "మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్" - ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు. 

    మనం  చెయ్యలేని చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా ప్రమాదము లేని రీతిలో మనతో చేయించేయడానికి  ఇటువంటి ప్రయోగము  చేశారు.


*'అమ్మలగన్నయమ్మ’* 

 

    లలితాసహస్రము  'శ్రీమాతా’ అనే నామముతో ప్రారంభమవుతుంది. 

   'శ్రీమాతా’ అంటే ’శ’ కార 'ర’ కార ’ఈ’ కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ  ఆయమ్మ  'లలితాపరాభట్టారికా స్వరూపం’. 

    ఆ అమ్మవారికి,  దుర్గాస్వరూపానికీ భేదం లేదు. 


*'అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ’* 


    ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. 


*'చాల పెద్దమ్మ’* 


    ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతములోకి తీసుకువెడితే మహాశక్తి అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన శక్తిస్వరూపము. 

    ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదము లేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉన్నది. అలా ఉండడము  అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

    అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి, ఈ భూమినీ లోకములనన్నిటినీ తిప్పుతూ, ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ "చాల పెద్దమ్మ". 


*'సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’* 


    సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ దితి. దితి ఏడిచేలా కడుపుశోకాన్ని మిగిల్చింది. 

    అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


*'తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’* 


    ఇదొక గొప్పమాట. 

    మనకి సంప్రదాయములో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూంటాము. కొలుస్తూంటాం.

    అవి "బ్రాహ్మీ, మహేశ్వరీ, వైష్ణవీ, మహేంద్రీ, చాముండా, కౌమారీ, వారాహీ, మహాలక్ష్మీ. 

    వారి మనస్సులలో నిండియుండే అమ్మ. 


*’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’* 


    ఆవిడ దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను, "అర్హత ఉన్నదని" ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చెయ్యాలి.


    అమ్మవారికి 'శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములని పిలుస్తారు. 

    బీజాక్షరము అంటే “Letter Pregnant with sound” అంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామివారు.  

    బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చెయ్యకూడదు, చేయలేము. 

    ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగము చేశారు. 

  - మహత్వానికి బీజాక్షరము 'ఓం’, 

  - కవిత్వానికి బీజాక్షరము 'ఐం’, 

  - పటుత్వానికీ భువనేశ్వరీ బీజాక్షరము 'హ్రీం”, 

  - సంపదలకు లక్ష్మీదేవి 'శ్రీం’. 

    ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రం ద్వారా, "మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపద"లని పొందుతాం. 

    కాని, 'ఓం ఐం హ్రీం శ్రీం’ అనే బీజాక్షరాలతో ’శ్రీమాత్రే నమః’  అని అస్తమానము అలా అనడానికి వీలులేదు. 

    మనం రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, స్నానం చేసినా,  చెయ్యక పోయినా,  ఎక్కడ ఉన్నా  అమ్మలగన్నయమ్మ "ముగురమ్మల మూలపుటమ్మ" అనుకుంటుంటే, 

   మనం మరోరూపంలో 'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః’  'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః’ అంటూ ఎప్పుడూ అమ్మను తలచుకున్నట్లే అవుతుంది. అమ్మవారు చాలా తొందరగా మనకు పలుకుతుంది. 

    అందుకే లలితా సహస్రం 'శ్రీమాతా’ అంటూ అమ్మతనముతో ప్రారంభమవుతుంది. 

    అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అయినా, ఆవిడముందు "అమ్మా! అమ్మా!" అనేసరికి ఆవిడ పొంగిపోతుంది. 

    ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మనం పిలుస్తుంటే, 

   "విసుక్కోవడము చేతకాని" దయాస్వరూపిణి అయిన అమ్మ మన కోరికను తీరుస్తుంది. 

   'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు. 

   'అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఉండదు. 


    ఈవిధముగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి, ఆంధ్రదేశమునకు ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు. 

    ఆయన ఒక ఋషి కనుక ఆ పద్యమును ఇచ్చారు. 


          సర్వేజనాః సుఖినోభవంతు

                      శుభమస్తు.

ప్రజ్ఞ

 

దశోపనిషత్తులలో ఋగ్వేదానికి సంబంధించిన 'ఐతరేయోపనిషత్తు'లో బోధింపబడిన సాధనా 'ప్రజ్ఞానం బ్రహ్మ' అనే మహావాక్యాన్ని 'సాధనావాక్యం' అని అంటారు.

ఈ సృష్టిలోని అన్ని ప్రాణులలో మానవుడు శ్రేష్ఠుడు ఎందుకు అయ్యాడంటే దానికి కారణం అతనిలోని ప్రజ్ఞయే. మానవులందరిలోని ప్రజ్ఞ భగవంతుని ప్రసాదమే. ఈ విషయాన్ని ఎవరు మరచిపోతారో వారిలో గర్వం మొలకెత్తి అది అహంకారానికి దారితీస్తుంది.

మనందరిలోని తెలివితేటలకు మూలకారణం భగవంతుడు మనకు ప్రసాదించిన 'ప్రజ్ఞయే'. భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రజ్ఞతో మనలోని భగవంతుని తెలుసుకుంటేనే మనకు శాంతి. అలా కాక మనలోని ప్రజ్ఞ బహిర్ముఖమై ఎంత ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా మనిషికి శాంతి లేదు.

మానవ శరీరంలో ఎన్ని భాగాలున్నా అన్నింటికి మించినది ప్రజ్ఞ. అసలీ ప్రపంచం నడుస్తున్నది ప్రజ్ఞతోనే. ప్రజ్ఞావంతుడే బలవంతుడు, ఉన్నతుడు. ప్రజ్ఞను దుర్వినియోగం చేస్తే చేజేతులా మన మనుగడను మనమే ప్రశ్నార్థకం చేసుకున్నవారమౌతాము. గనుక గొప్పదైన, శక్తివంతమైన ప్రజ్ఞతో భగవంతుని తెలుసుకొనమని మన ఋషులు ఉపనిషత్తులద్వారా మనకు ప్రబోధం చేస్తున్నారు.

స్వామి సత్యాత్మానంద,

చిన్మయమిషన్, ఒంగోలు.

శుభాకాంక్షలు

 శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని ||


మీ అందరికీ దసరా  పండుగ శుభాకాంక్షలు. 

భార్గవ శర్మ*

గిరిజా కళ్యాణ ప్రవర

 శ్లోకం:☝️గిరిజా కళ్యాణ ప్రవర

శివ ప్రవర:🙏

   _చతుస్సాగర పర్యంతం_

_గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు_

*నిర్గుణ నిరంజన నిర్వికల్ప*

 *నిరామయ నిరాఖ్యాత*

*పంచార్షేయ ప్రవరాన్విత*

  *పరమశివ సగోత్రస్య*

 *పరమశివ శర్మణో నప్త్రే*

*సదాశివ శర్మణః పౌత్రాయ*

*మహా నటేశ్వర శర్మణః పుత్రాయ*

*శ్రీ ఉమామహేశ్వర శర్మణే వరాయ*


పార్వతీ ప్రవర :🙏

   _చతుస్సాగర పర్యంతం_

_గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు_

*కాస్యప ఆవత్సార నైధృవ*

  *త్రయార్షేయ ప్రవరాన్విత*

       *కాస్యప సగోత్రస్య*

  *మహామేరు శర్మణో నప్త్రీం*

 *మందరాచల శర్మణః పౌత్రీం*

   *హిమాచల శర్మణః పుత్రీం*

      *కాస్యప సగోత్రోద్భవాం*

   *శ్రీ పార్వతీ నామ్నీం కన్యాం*

         🙏🙏🙏🙏🙏

Let's get educated

 Can you name One king from any of these Indian kingdoms? 


Mauryas

Satavahanas

Guptas 

Pandyas 

Cholas

Pallavas 

Chalukyas 

Cheras

Ahoms

Marathas

Kakathiyas

Vijayanagara


Can you name the capital of these kingdoms? How long do you think they ruled? How vast were there empires? Had you even heard all these names? 


Ask any average educated Indian to name the kings of Mughal period (ONLY 250 years). 99 out of 100 will name them in the sequence - Babar, Humayun, Akbar, Jahangir, Shah Jahan and Aurangzeb.


Now, ask them to name the kings of the dynasties which ruled India for much larger period of time and during whose period(s) India was the most prosperous country in the world. For instance-

Mauryas (ruled for 550 years)

Satavahanas (ruled for 500 years)

Guptas (ruled for 400 years)

Pandyas (ruled for 800 years)

Cholas (ruled for 1000 years)

Pallavas (ruled for 600 years)

Chalukyas (ruled for 600 years)

Ahom Dynasty of Northeast (ruled for 650 years).


Most cant tell you the name of even 1 great king from each dynasty.... Forget the entire list of kings in chronological order.


That is how ill-informed almost everyone is on India. Someone said Hindus created the present day caste system. Someone said the British got us civilisation, industry, unification. Someone said India did not have scientific thinking. Some say India may have been rich in parts more then a millennia ago, but was the poorest country for over a millennia. 


And, isn't it strange we want to solve India's problems without even understanding India one bit? 


 The entire class 7 history book consisted only of Mughals and had one chapter on each of the Mughals from Babar to Aurangzeb - sometimes even multiple chapters on Mughal kings, Khilji, Tippu Sultan, Lodhis, Bhahamani Sultans,Nizam's all glorifying them.... Thereafter Robert Clive, Dalhousie, Warren Hastings, Curzon, Macaulay etc etc..

Post 1947 during Congress Rule..1947 to 1977 for 30 consecutive years India 🇮🇳 Education Ministers were kattar Muslims ☪️..Abul Kalam Azad, Nurul Hassan,Fakrudin Ahmed etc etc..Hence, Native Kingdoms Belittled &Muslim Rulers Glorified.


Such is the total skewness in our understanding of India. Let's get educated about our rich heritage and also educate our children so that they can be the proud ambassadors of this great nation INDIA..