9, ఆగస్టు 2021, సోమవారం

తే జన్మభాజః ఖలు

 తే జన్మభాజః ఖలు

జీవలోకే యే వై సదా 

ధ్యాయంతి విశ్వనాథం | 

వాణీ గుణాన్ సౌతి కథాం 

శృణోతి శ్రోతద్వయం తే భవముత్తరంతి |

శివ పురాణం

సదా శివుని ధ్యానించుచూ,

వాక్కు చేత శంకరుని

కీకీర్తిస్తూర్తిస్తూ, రెండు

చెవులతో తనివితీర

ఆ స్వామి కథలను

వినువారు ధన్యులు.

అట్టి వారే ఈ సంసార సాగరమును దాటుతారు.

ఆధ్యాత్మికప్రపంచం

 ఆధ్యాత్మికప్రపంచం


ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాః ఋణ క్షయే క్షయం యాంతి కాతత్రపరివేదనా


భావం


పశువులు ,భార్యలు కొడుకులు ,ఇల్లు ,మన పూర్వజన్మ సుకృతాలను బట్టి కలుగుతాయి. రుణం తీరి పోగానే వారు లేక అవి దూరం అవుతాయి. కనుక మంచి కానీ, చెడు కానీ అంతా రుణానుబంధమే. ఈ విషయాన్ని గ్రహిస్తే ఇక భాధ, దుఃఖం కలగవు

సుశీలో మాతృ పుణ్యేన

 శ్లో|| సుశీలో మాతృ పుణ్యేన, పితృపుణ్యేన బుద్ధిమాన్ | ధార్మికో పూర్వపుణ్యేన, స్వీయపుణ్యేన భాగ్యవాన్ |


భావము:


ఏ వ్యక్తియైనా తన తల్లి చేసిన పుణ్యం వలన మంచి శీల సంపద కలవాడవుతాడు. తండ్రి చేసిన పుణ్యం వలన బుద్ధిమంతుడవుతాడు. తమ వంశపూర్వికులు చేసిన పుణ్యం వలన ధర్మాత్ముడవుతాడు. తాను స్వయంగా చేసిన పుణ్యం వలన ధనవంతు డవుతాడు.


పిల్లలు మంచి శీలవంతులు, బుద్ధిమంతులు, ధర్మపరులు, కావాలంటే మనం పుణ్యకార్యాలు చేయాలి. మంచివాళ్లం కావాలి. కనుక మనమందరమూ మంచి మార్గంలో నడుద్దాం

శ్రావణమాసం వచ్చిందంటే,

 శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి 🌺🙏


🌺ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షర్తువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.🌺  


🌺స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు. 🌺  


🌺పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.🌺    


🌺ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు కృష్యాది కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుంది.

గోపి గాడు -- గొప్పవాడు

 *


     *మా ఆవిడ సినిమాకి వెళదామంటే.. సరే అని వెళ్ళాం.టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే..*

*ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు.* *పలకరించుకున్నాక, మా ఆవిడకి పరిచయం చేశాను. ఇంటర్లో క్లాస్ మేట్ అని..!*


         హాల్లో కూర్చున్నాక అడిగింది.. "అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు.....ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం.." అంది.


      *"ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది" అన్నాను.వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే...చాలా అల్లరి వెధవ....సినిమాల పిచ్చి ఎక్కువ...ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం, ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో చూడటం...*


                ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం... సినిమా హాల్స్ కేబిన్ దగ్గరకి వెళ్ళి తెగి పోయిన ఫిల్మ్ ముక్కలు ఏరు కోవటం..ఇదే పని.

         అప్పుడప్పుడు వాడి డబ్బులుతో నేల టిక్కెట్ కి నన్ను కూడా తీసుకెళ్లేవాడు...

           *"ఎందుకురా" అంటే.. "ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని.. నువ్వూ వస్తే 2నేల టికెట్స్.. అంతే గదరా.." అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా...!*


            *"మా పెద్దోళ్ళు, వాడితో తిరిగితే ఎక్కడ చెడి పోతామో అని వాడితో ఆడనిచ్చే వారు కాదు.చివరకు వాళ్ళు చెప్పినట్టే, వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు" అన్నాను.*


        "మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు....లేపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకి ఎందుకు తీసుకెళుతాడు..

అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద కలక్టర్ ఉద్యోగమా ఏంటి....ఇప్పటి వరకు స్కూటర్ దాటి మరేం కొనలేదు" అంటూ భార్య దెప్పింది.


       నాకు ఉక్రోషం వచ్చి "ఎలా చూసినా వాడికంటే బెటరే కదే" అన్నాను.


        ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన..ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే.. "వద్దు సార్" మీ ప్రెండ్ పంపాడు అని చెప్పి వెళ్లి పోయాడు.


         ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ.. "నిజంగా మీ ఫ్రెండ్ మంచోడు అండీ..మీరే సరిగ్గా పలకరించ లేదు..పోజు కొడుతూ మాట్లాడారు." అన్నది.


         *"కాదులేవే...వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదేమో కదా.. నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో...రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే...అదో తలనొప్పి మళ్లీ నాకు...!" అన్నాను సాలోచనగా.*


           "అతను ఏ పొజిషన్ లో ఉన్నా.. స్నేహితుడు స్నేహితుడే..! "కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి" అంది నా శ్రీమతీ నిశ్చయంగా..


 సినిమా అయిపోయింది......


              మా ఆవిడ పోరు పడలేక.. ఎంట్రన్స్ దగ్గర సిబ్బందితో, వాడి గురించి వాకబు చేస్తే...

అతను పై ఫ్లోర్ లోని ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు.


          పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్...ఒక సోఫాలో గోపి గాడు కూర్చుని ఉంటే....హాల్ మేనేజర్ ఆరోజు కలెక్షన్స్ లెక్కలు చెబుతున్నాడు... ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంట...మేము లోపలికి వెళ్లగానే...లేచి బయటకు వెళ్లిపోయారు.


            గోపి గాడు మమ్మల్ని చూడగానే రారా.. రా.. అంటూ ఇద్దర్ని కూర్చో బెట్టి, కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని.!


       *మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలాడించి, ఈ స్టేజీకి ఎదిగాడుట. ఇంకా ఆంద్రా, తెలంగాణాలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారిగా కొంటాడుట..! అలా తను ఎదిగిన క్రమాన్ని చెపుతూ... ఈ రోజు టికట్ చింపే పనివాడు రాక పోతే తానే ఆపని చేసాడని చెప్పుకొచ్చాడు.*


       *నా స్నేహితుడు"ఎలా వచ్చార్రా.." అని నన్ను అడిగితే.."రిక్షాలో" అని చెప్పా తలవంచు కొంటూ.*


        డ్రైవర్ని పిలిచి, వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు.


               *అప్పుడు దారిలో మా ఆవిడ.. "ఇలా ఇంకెప్పుడూ, ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి....*

*స్నేహితుడు ముఖ్యం. అతడి స్టేటస్ కాదు..*

*ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు..." అంది ఒకింత కోపంగా...!!*

     *"ఎదుటివారిని చూడంగానే ఒక అంచనా వేయకండి." మనిషి చూడానికి ఎలా వున్నా.... మీ కన్నా గొప్పవాడు కావచ్చేమో కదా....!!*

         *"మనిషి ముఖ్యం.....స్టేటస్ కాదు"*

                   💐🙏🤝🤝🤝🙏💐 

*Friend ship is great not their position*👍

శ్రావణమాసం

 #శ్రావణమాసం

                         పౌర్ణమి శ్రవణా నక్షత్రముతో కూడుకొని వున్న మాసమే శ్రావణ మాసము. ఈ మాసము లక్ష్మి దేవికి అత్యంత ప్రీతి పాత్రము గా పూర్వ శాస్త్రముల నిర్వచనము. దేవదానవులు సముద్రాన్ని చిలికినపుడు ఉద్భవించిన గరళాన్ని మహా శివుడు తన ఖంఠం లో బందించిన సమయము గా తెలుస్తోంది,  

 


మంగళగౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించుతారు, నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతాన్ని గురించి తెలిపినట్లు పురాణాలు వివరించుతునాయి, ఈ మాసంలో అన్ని మంగళవారల్లో శ్రావణ మంగళవార వ్రతం చేయడం ప్రారంభించి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండుటయేకాక అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.


ఈమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారంమున వరలక్ష్మీ వ్రతం గా చెపుతారు. శ్రావణమాసంలో వచ్చే అన్ని శుక్రవారములు లక్ష్మీదేవిని పూజించుట శుభము . పెరంటాల్లను పిలిచి తాంబూలం ఇచ్చుట వలన సౌభాగ్యం ధన దాన్యములతో వర్ధిల్లుతాఋ అని శివుడు పార్వతీదేవికి వివరించినట్లు తెలుస్తోంది.


పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకొంటారు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రాఖి పండగ. రక్షాబంధనం జరుపుకుంటాం. ఇంకా

 శ్రావణ పూర్ణిమ. జంధ్యాల పూర్ణిమ, రాఖి పండగ ,శ్రీకృష్ణ జన్మష్టామి, స్వాతంత్ర్య దినోత్సవం, నాలుగు శుక్రవారములు, అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ అమ్మ వారి పూజకు ముఖ్యమైన దినములుగాఈ మాసం లో లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు మరియు శ్రావణ సోమవారములు శివునికి జరుపు అభిషేకముల వల్ల అనేక శుభములు చేకూరుతాయి అని జ్యోతిష్య శాస్త్రరీత్యా తెలుస్తోంది.  

                                       

                                                                                                         ఇట్లు

                                                                                                శ్రీ భువనేశ్వరి పీఠం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*963వ నామ మంత్రము* 9.8.2021


*ఓం శమాత్మికాయై నమః*


సకల ప్రపంచ లయ స్వరూపురాలైన జగదాంబకు నమస్కారము.


ఇంద్రియ నిగ్రహము ఆత్మస్వరూపంగా గలిగిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శమాత్మికా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం శమాత్మికాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కరుణచే శాంతస్వభావులై, జనరంజకమైన సంభాషణలతో పలువురి హృదయాలను గెలిచినవారై, భౌతికపరముగా శాంతిసౌఖ్యములు, ఆముష్మికపరముగా కైవల్యసాధనా పటిమయు సంప్రాప్తింపజేసికొందురు.


శమము అనగా ప్రపంచములు ఉపశమించుట. సృష్టి అనేది సమస్తజీవకోటి ఏర్పడడం, ఊపశమించుటయనగా కల్పాంతమందు లయం కావడం. అమ్మవారు లయస్వరూపిణి. గనుక *శమాత్మికా* యని అనబడినది. నృశింహతాపనీయోపనిషత్తునందు *ప్రపంచోపశమము, శివము, శాంతము, అద్వైతము మరియు తురీయముగా తలచుచున్నారని గలదు. ఇంకొకవిధంగా చూస్తే *శమ్* సుఖము, *ఆత్మికా* అనగా స్వరూపము. పరమేశ్వరి సుఖస్వరూపురాలు. సాధకుడు మూలానారంలోని కుండలినీ శక్తిని మేల్కలిపి, సుషుమ్నా మార్గముద్వారా పయనింపజేయును. గ్రంథిత్రయ ఛేదనము, షట్చక్రములు దాటట జరిగిన తరువాత, ఆ కుండలినీ శక్తి సహస్రారంలో చంద్రమండలము చేరుతుంది. మూడున్నర చుట్టలుగా , సర్పాకృతిలో ఉన్న కుండలినీ శక్తి సహస్రారంలో చంద్రమండలం చేరగానే, అక్కడఉన్న ఆహ్లాదతకు సుధాధారలు వర్షింపజేస్తుంది. ఆ సుధాధారలు సాధకుని డెబ్బది రెండువేల నాడీమండలము తడిసి ముద్దచేయడంతో, సాధకునికి కలిగే సుఖానుభూతి వర్ణనాతీతమ. ఇక మళ్ళీ జన్మలు అవసరంలేని బ్రహ్మానందస్థితిని పొందుతాడు. అంతటి సుఖమును తన భక్తునికి పరమేశ్వరి సంప్రాప్తింపజేస్తుంది. ఆవిధముగా అమ్మవారు సుఖమును చేకూర్చే సుఖస్వరూపురాలు గనుకనే ఆ తల్లి *శమాత్మికా* యని అనబడినది.


కామక్రోధాదులు లేని (అరిషడ్వర్గములు లేని) అమ్మవారు శాంతస్వరూపురాలు. అరిషడ్వర్గములకు అతీతమైనది. గనుకనే *శమాత్మికా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శమాత్మికాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం*

 *


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఏడవ అధ్యాయము*


*శ్రుతిగీతలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*పరీక్షిదువాచ*


*87.1 (ప్రథమ శ్లోకము)*


*బ్రహ్మన్ బ్రహ్మణ్యనిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయః|*


*కథం చరంతి శ్రుతయః సాక్షాత్సదసతః పరే॥11961॥*


*పరీక్షిన్మహారాజు పలికెను* బ్రాహ్మణోత్తమా! శుకయోగీ! పరబ్రహ్మము కార్యకారణములకు సర్వధా అతీతము. సత్త్వరజస్తమోగుణములు ఆయనయందు లేవు. అనగా ఆయన త్రిగుణములకు అతీతుడు. నిర్గుణుడు. మనస్సుగాని, వాక్కుగాని సంకేతరూపమునగూడ బ్రహ్మనుగూర్ఛి నిర్దేశింపజాలవు. ఇదమిత్థముగా తెలుపజాలవు. అతడు అవాఙ్మానసగోచరుడు. వేదములు మాత్రము విషయములయొక్క గుణము, జాతి, క్రియా, రూఢి మున్నగు విషయములను నిర్దేశించును *(త్రైగుణ్యవిషయా వేదాః)* ఇట్టి స్థితిలో శ్రుతులు నిర్గుణ పరబ్రహ్మనుగూర్చి ఎట్లు ప్రతిపాదించును? ఏలయన నిర్గుణ వస్తుస్వరూపము వరకు అవి చేరజాలవుగదా!


*శ్రీశుక ఉవాచ*


*87.2 (రెండవ శ్లోకము)*


*బుద్ధీంద్రియమనఃప్రాణాన్ జనానామసృజత్ప్రభుః|*

.

*మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనేఽకల్పనాయ చ॥11962॥*


*శ్రీశుకుడు వచించెను* భగవంతుడు నానావిధ ప్రాణులను సృష్టించెను. వారితోపాటుగా బుద్ధిని, ఇంధ్రియములను, మనస్సుసు, ప్రాణములను నిర్మించెను. ఇందులో బుద్ధిద్వారా జ్ఞాపకశక్తిని, ఇంద్రియములద్వారా క్రియాశక్తిని, మనస్సుతో సంకల్పశక్తిని, ప్రాణధారణద్వారా చైతన్యశక్తిని ప్రసాదించెను. మాత్రార్థమ్ అనగా - విషయములను అన్నింటినీ సృజించెను. భవార్థం అనగా - తమ జీవనయాత్ర కొనసాగించుటకై కావలసిన వాటినన్నిటిని సమకూర్చెను. ఉచితానుచిత వివేకముతో వీటినన్నింటిని ఉపయోగించుకొనుచు ఆత్మస్వరూపమును తెలిసికొని తురీయమగు మోక్షమును పొందవచ్చును.


*87.3 (మూడవ శ్లోకము)*


*సైషా హ్యుపనిషద్బ్రాహ్మీ పూర్వేషాం పూర్వజైర్ధృతా|*


*శ్రద్ధయా ధారయేద్యస్తాం క్షేమం గచ్ఛేదకించనః॥11963॥*


ఉపనిషత్తు బ్రహ్మను ప్రతిపాదించును. ఈ ఉపనిషత్తులను పూర్వీకులకంటే పూర్వమునందు జన్మించిన సనకాది మహర్షులు తమ బుద్ధినందు ధరించిరి. ఎవరైతే దీనిని శ్రధ్ధగా తమ బుద్ధినందు ధరించెదరో, వారికి ఎటువంటి సంసారికమైన కోరికలు లేకుండా సమసిపోవును. అంతట క్షేమముగా సంసారసాగరమును దాటి శ్రేయస్సును పొందగలరు.


*87.4 (నాలుగవ శ్లోకము)*


*అత్ర తే వర్ణయిష్యామి గాథాం నారాయణాన్వితామ్|*


*నారదస్య చ సంవాదమృషేర్నారాయణస్య చ॥11964॥*


ఈ విషయమున శ్రీమన్నారాయణునకు సంబంధించిన ఒక వృత్తాంతమును తెలిపెదను. ఇది దేవర్షి నారదునకును, నారాయణ ఋషీశ్వరునకును మధ్య జరిగిన సంవాదము.


*87.5 (ఐదవ శ్లోకము)*


*ఏకదా నారదో లోకాన్ పర్యటన్ భగవత్ప్రియః|*


*సనాతనమృషిం ద్రష్టుం యయౌ నారాయణాశ్రమమ్॥11965॥*


ఒకానొకప్పుడు పరమభక్తుడైన నారదమహర్షి సకలలోకములలో పర్యటించుచు సనాతనుడైన నారాయణ మహర్షిని దర్శించుటకై బదరికాశ్రమమునకు వెళ్ళెను.


*87.6 (ఆరవ శ్లోకము)*


*యో వై భారతవర్షేఽస్మిన్ క్షేమాయ స్వస్తయే నృణామ్|*


*ధర్మజ్ఞానశమోపేతమాకల్పాదాస్థితస్తపః॥11966॥*


పూజ్యుడైన నారాయణమహర్షి మానవాళియొక్క అభ్యుదయమునకై (లౌకిక శుభములకై), మోక్షప్రాప్తికై ఈ భారతదేశమున కల్పాదినుండి ధర్మము, జ్ఞానము, ఇంద్రియనిగ్రహములతో కూడిన మహాతపస్సును ఆచరించెను (నారాయణమహర్షి వర్ణాశ్రమ ధర్మములకు అనుగుణముగా,ప్రకృతి పురుషుల విలక్షణత్వము వెల్లడించెడి జ్ఞానశోభితముగా, రాగద్వేషరహితముగా తపమాచరించెను).


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

T

 💩 నాగ పూజ మూఢనమ్మకమా? 💩 👀


పూజించవలసింది నాగులనా? దేవతాసర్పాలనా? పాములనా?

నాగపంచమి, నాగుల చవితి వస్తోందంటే చాలు, హిందూ సంప్రదాయాలు మూఢనమ్మకాలు, పాములు పాలు త్రాగుతాయ? వీళ్ళు పాములను హింసిస్తున్నారు, ఆదిమానవుడి కాలపు అలవాట్లను పాటిస్తున్నారు అంటూ మీడియా ఎంతసేపు దాడి చేసి, ధర్మాన్ని కించపరచాలని చూస్తోందే కానీ, నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఆచరణలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంప్రదాయాన్ని తప్పుగా అర్దం చేసుకున్నారా? ఒకవేళ పొరబడి ఉంటే, దాన్ని ఎలా సరిజేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయదు.


💩ఆంగ్లేయులు భారత్ మీదకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావం బాగా పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే ఎంతో విశాలమైన భాష అయిన సంస్కృతాన్ని, దాని నుండి వచ్చిన భారతీయ భాషలలోని పదాలకు ఇంగ్లీష్‌లో అర్దం వెతుక్కునే స్థితికి చేరుపోయాము. అది ఇంకా దిగజారి ఏకంగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తూ, దాని అర్ధాలనే సంస్కృతపదాలకు అంటగడుతున్నాము.


💩విషయంలోకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళకు Snake అనే పదం ఒక్కటే ఉంది. కానీ మన ధర్మంలో నాగులు, సర్పాలని రెండు ఉన్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు. భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి.

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|

ప్రజనశ్చాస్మి కన్దర్పః 

సర్పాణామస్మి వాసుకిః|| 10-28 ||

నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మధుడిని, సర్పాలలో వాసుకిని. అంటూ సర్పాలలో తాను వాసుకి అని చెబుతున్నాడు.


💩వాసుకి శివుని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేసారు దేవదానవులు. శ్లో. వాసుకి కద్రువ తనయుడు.

అనన్తశ్చాస్మి నాగానాం 

వరుణో యాదసామహమ్|

పితౄణామర్యమా చాస్మి 

యమః సంయమతామహమ్|| 10-29 ||

నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పీత్రులలో ఆర్యముడిని, సంయమవంతులలో నిగ్రహాన్ని. అంటూ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగులలో అనంతుడనని చెబుతున్నాడు. అనంతుడు అనగా ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, రెండవ వాడు వాసుకి. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు. బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారం లో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా, శ్రీ మనవాళమామునులుగా అవతరించాడు.


💩ఇప్పుడు మనకు ఒక సందేహం రాక మానదు. పైన సర్పాలలో వాసుకి తానన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడనంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి తేడా? కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహరం, అనగా అవి గాలిని స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలకు కప్పలు మొదలైన జీవరాశులు ఆహారం.

నాగుల్లో మళ్ళీ 9 జాతులు ఉంటాయి. 


💩అట్లాగే సర్పాల్లో కూడా దేవతాసర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది. కానీ ఇవి మానవసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు. అలా చిక్కుతాయి అనుకోవడం సినిమాల ప్రభావం మాత్రమే.


💩పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కనుక వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నం. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటారు, ఆరోగ్యాన్ని, సంతనాన్ని అనుగ్రహిస్తారు. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయి. అవి కూడా పాలు త్రాగుతాయి.


💩ఈ నాగపంచమి మొదలైన నాగదేవతారాధన తిధులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవారు. అప్పటి మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. ఆ రోజులు వేరు. కనుక అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందు వలే మర్త్యలోకంలో సశరీరంతో సంచరించడం మానేశారు. విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి, పూజించినవారికి సత్ఫలితాలను ఇస్తున్నారు.


💩అలాగే దేవతాసర్పాలు కూడా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగడం మానేశాయి. ఒక 75 ఏళ్ళ క్రితం వరకు దేవతసర్పాలను చూసి, పూజించి, వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబసభ్యులకు ఇప్పటికి ఆ విషయాలు స్మరణలో ఉంటాయి. కానీ ఇప్పుడు సదాచారం, శౌచం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారు, ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉన్నా, సక్రమంగా పాటించడం తక్కువ. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. ఆలయాల్లో వాటికి జరిగిన అపరాధం కారణంగా కొన్ని శరీరం విడిచిపెట్టాయి.


💩ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేము. చాలామటుకు ఏదో మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. #నాగపంచమి, #నాగులచవితి కి నాగదేవతలకు పూజలు చేయాలి. కానీ పైన చెప్పుకున్న విషయాలు అర్దంకాక ప్రజలందరూ మాములు పాములకు పాలు పోస్తున్నారు, పసుపు కుంకుమలు వేస్తున్నారు. మామూలు పాములు పాలు త్రాగవు, వాటికి పసుపుకుంకుమలు పడవు. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.


💩ఇప్పటి ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. నాగపంచమి, నాగులు చవితి మూఢనమ్మకలు కాదు, నాగదేవతలను పూజించి, సంతానం పొందిన దంపతులు కోకొల్లలు. ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవాతానుగ్రహంతో కలిగిన సంతానంలో నాగదేవతల యొక్క వరప్రభావం, అంశను తల్లిదండ్రులు పసిగట్టగలుగుతారు. కానీ అలా సంతానం కోసం పూజించవలసింది నాగులనే కానీ మామూలు పాములను కాదు.

ఈశ్వర సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది. సాధారణ సర్పాలు జీవవైవిధ్యంలో, ఆహారచక్రంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. వాటి మనుగడతోనే మానవమనుగడ సాధ్యమవుతుంది. 


💩మామూలు పాముల జోలికి వెళ్ళకుండా ఉండడం, వాటి మానాన వాటిని వదిలేయడం, వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చు. సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు. 


💩కనీసం ఇప్పటికైనా హిందూసమాజం సంప్రదాయంలోని అసలు విషయాన్ని గమనించాలి. విషయాన్ని సగం సగం చెప్పి, మూఢనమ్మకమంటూ కొట్టిపారేయకుండా, అసలు విషయాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పేందుకు మీడియా కూడా ముందురావాలి.

---------------------------

ఈ విషయాన్ని ఎక్కువగా షేర్ చేసి, అందరికి తెలియపరచండి, హిందూసమాజాన్ని జాగృతం చేయండి.

💐💐💐🍀🍀🍀🌷🌷🌷

క్యాన్సర్‌కు ఔషధం


బ్లడ్ క్యాన్సర్

మెదడు క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్

పెద్దప్రేగు కాన్సర్

కాలేయ క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్

ప్రోస్టేట్ క్యాన్సర్

అండాశయ క్యాన్సర్


ప్రియమైన మిత్రులారా

అనేక క్యాన్సర్‌కు ఔషధం కనుగొనబడింది! ఫార్వార్డ్ చేయకుండా దయచేసి దీన్ని తొలగించవద్దు. నేను దానిని నేను గరిష్టంగా ఫార్వార్డ్ చేస్తున్నాను. ఇది 110 కోట్ల భారతీయులకు, మిగిలినవి ఏమైనా ఉంటే చేరనివ్వండి.


*"కర్కుమినాయిడ్స్"* అనేది అనేక క్యాన్సర్లను నయం చేసే ఔషధం. ఇది *"బెంగళూరులోని క్యాన్సర్ హెర్బలిస్ట్"* వద్ద సహేతుకమైన ఖర్చుతో లభిస్తుంది. అవగాహనను సృష్టించండి. ఇది ఎవరికైనా సహాయపడవచ్చు. మీకు వీలైనన్నింటికి ఫార్వార్డ్ చేయండి, దయకు ఏమీ ఖర్చవుతుంది.


*క్యాన్సర్* *హెర్బలిస్ట్*

*చిరునామా*: 6, డివిజి రోడ్,

గాంధీ బజార్, బసవనగుడి,

బెంగళూరు - 560004.

మైలురాయి: విద్యార్తి భవన్ హోటల్ దగ్గర


ఫోన్:

080-41218877

080-26601127

8884588835

Mail ID:

cancerherbalist@gmail.com


Request *అభ్యర్థన*: *వీలైనన్నింటికి ఫార్వార్డ్ చేయండి*

కొడుకుకు నేర్పిన పాఠం

 ఒక తండ్రి కొడుకుకు నేర్పిన పాఠం 

మనం కూడా నేర్చేసుకుందాం రండి 


మొదటిరోజు భోజనానికి పిలిచాడు కొడుకును 

రెండు తట్టలో అన్నం పెట్టుకుని ఒక తట్టలో కోడిగుడ్డు ఇంకో తట్టలో ఏమీ లేదు 


నువ్వే ఏది కావాలో తీసుకో అన్నాడు నాన్న 

కోడిగుడ్డు ఉన్న తట్టను ఎంచుకున్నాడు కొడుకు 

తెలివైన నిర్ణయం తనదని 

తనను తానే పొగుడుకున్నాడు అంతలో నాన్నకు ఇచ్చిన తట్టలో అన్నం లోపల రెండు కోడిగుడ్లు కనిపించింది 


నాన్న చెప్పారు 

పైకి కనిపించేదంతా నిజమని నమ్మి మోసపోవద్దని 


మరుసటి రోజు మళ్ళీ ఇదే విధంగా భోజనానికి కూర్చున్నారు 

ఈసారి కూడా నాన్న నువ్వే మొదట తీసుకో అన్నారు 

మోసపోరాదని ఈసారి గుడ్డు కనిపించని ఆ తట్టను తీసుకున్నాడు కొడుకు 

ఆశ్చర్యం ఏంటంటే నిజంగానే ఇప్పుడు ఒక్క గుడ్డు కూడా లేదు అన్నం లోపల 


నాన్న చెప్పారు ఒక్క అనుభవాన్ని చూసి అలాగే ప్రతిదీ ఉంటుంది అని పొరబడకూడదు అన్నారు 


మూడో రోజు మళ్ళీ అదే విధంగా భోజనానికి కూర్చున్నారు 

నాన్న ఈసారి అలోచించి నిర్ణయం తీసుకోమన్నారు 


నాన్న ఈ ఇంటికి కష్టపడుతున్నది పెద్దవారు మీరే కనుక మీరే ముందుగా తీసుకోండి తరువాత నేను తీసుకుంటా అన్నాడు కొడుకు 


నాన్న అన్నం పైన గుడ్డుతో ఉన్న తట్టను తీసుకున్నారు 

కొడుకుకు ఆశ్చర్యం ఇప్పుడు తన తట్టలో దాగి ఉన్న రెండు కోడిగుడ్లు ఉన్నాయి 


నాన్న చెప్పారు 

ఒకరికి నువ్వు ముందుగా మంచి చేసి చూడు నిన్ను మంచి వెతుక్కుంటూ వస్తుంది అన్నారు 


కోడిగుడ్డు పెట్టి నాన్న మంచి పాఠమే నేర్పారు మరి మీరూ నేర్చుకున్నారా 

పాటిస్తారా చెప్పండి....

మొగలిచెర్ల అవధూత

  శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*మల్లెబోయిన సుబ్బమ్మ..*


"స్వామికి బియ్యం తీసుకొచ్చాను..వండి నలుగురికీ పెట్టండి.." అంటూ ఒక ఇరవై ఐదు కేజీల బియ్యపు మూటను పక్కన పెట్టించింది..వయసులో బాగా పెద్దావిడ..మల్లెబోయిన సుబ్బమ్మ అని ఆవిడ పేరు.. ప్రస్తుతం లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం లో ఉంటున్నది..


ఎన్నో ఏళ్ల నుంచీ ఆవిడ శ్రీ స్వామివారి మందిరానికి వస్తున్నది..వచ్చినప్పుడల్లా తన శక్తి మేరకు బియ్యం లేదా ఇతర వెచ్చాలు కానీ తీసుకొచ్చి అన్నదానానికి ఇవ్వడం జరుగుతున్నది..ఒక సాధారణ భక్తురాలిగానే అనుకుంటూ వున్నాము..కానీ మొన్న ఆదివారం నాడు వచ్చినప్పుడు మాత్రం..నా దగ్గరకు వచ్చి.."అయ్యా..స్వామిని రెండు మూడు నెలల కొకసారన్నా చూడకపోతే వుండలేనయ్యా..నా చిన్నతనం నుంచే ఈ స్వామి తెలుసు..అసలు మా పుట్టిల్లు ఎర్రబల్లె గ్రామమే.. స్వామి వారి ఊరే..నా చిన్నప్పుడు అంటే నాలుగైదేళ్ల వయసులో స్వామివారితో కలిసి ఆడుకునేదాన్ని..ఆయనది నాదీ ఇంచుమించు ఒకే వయసు..మేము యాదవులము.. స్వామి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మా ఇల్లు కూడా ఉండేది.." అన్నది..


శ్రీ స్వామివారి బాల్యం గురించి తనకు తెలిసినంతవరకూ చెప్పింది..అలా చెప్పుకుంటూ మధ్యలో.."స్వామివారు మాలకొండ నుంచి ఇక్కడకు వచ్చి ఈ ఆశ్రమం కట్టించుకునే రోజుల్లో..నేనూ మా నాన్నా ఇటు వైపుగా వెళుతున్నాము..మమ్మల్ని చూసి దగ్గరకు రమ్మనమని పిలిచారు..మా నాన్నతో.."బాగున్నావా కొండయ్యా..." అని ఆప్యాయంగా పలకరించి..నా వైపు చూసి, మా నాన్నతో.."అమ్మాయికి పెళ్లి చేసావా?.." అని అడిగారు..మా నాన్న "చేసాను స్వామీ..పెళ్లి చేసి కూడా దాదాపు ఆరేళ్ళు అవుతున్నది..ఇంకా పిల్లలు పుట్టలేదు.." అని చెప్పాడు..శ్రీ స్వామివారు కొద్దిసేపు గంభీరంగా వున్నారు..తరువాత "కొండయ్యా..ఈ అమ్మాయికి పెళ్లి చేసావు..నీ బాధ్యత తీరింది..కానీ ఈ పిల్లకు సంతాన యోగం లేదు..పిల్లలు పుట్టరు.." అని ఖచ్చితంగా చెప్పారయ్యా..ఆ మాటే నిజం అయింది..నాకు సంతానం లేదు..కానీ..మొదటినుంచీ ఆ స్వామిని పూర్తిగా నమ్ముకొని వున్నాను..మాట చెప్పాడంటే అది జరిగితీరేది..ఆశ్రమం కట్టుకున్న తరువాత..నాలుగైదు సార్లు మా ఊరు వెళుతూ స్వామి వారిని కలిశాను..మౌనంగా వున్నప్పుడు చేయెత్తి ఆశీర్వదించేవాడు..స్వామి సమాధి చెందిన తరువాత ప్రతియేటా మూడు నాలుగు సార్లు ఇక్కడకు వచ్చిపోతున్నాను.."


"పాతికేళ్ల కిందట నాకు జబ్బు చేసింది..ఎంతకూ తగ్గలేదు..మొగలిచెర్ల కు తీసుకెళ్లి స్వామి వారి మందిరం వద్ద పడుకోబెట్టండి..తగ్గిపోతుంది అని నేను మా వాళ్లకు చెప్పాను..సరే అని ఇక్కడకు తీసుకొచ్చారు..ఇక్కడకు వచ్చేసరికి నాకు స్పృహ తప్పి పోయింది..నేను చచ్చిపోయానని అనుకున్నారు..ఈ మంటపం లోపలికి కూడా తీసుకురావొద్దని పూజారులు చెప్పారు..మా వాళ్ళు కూడా నేను చచ్చిపోయానని నమ్మారు..అదిగో ఉత్తరంగా ఆ చివర ఖాళీ స్థలంలో పడుకోబెట్టారు.. అయ్యా..నువ్వు నమ్ము నమ్మకపో..ఆ సమయం లో నా శరీరం పై నుంచి..ఈ స్వామి రెండు అంగల్లో అటునుంచి ఇటు..ఇటునుంచి అటు దాటి నట్టు భ్రమ కలిగింది..వెంటనే స్పృహ వచ్చింది..మా వాళ్ళు ఏడుస్తూ వున్నారు..నేను లేచి కూర్చున్నాను..అందరూ ఆశ్చర్యపోయారు..స్వామి దయవల్ల చచ్చిపోయిన దాన్ని బ్రతికాను..ఎప్పుడు కష్టం వచ్చినా ఆ స్వామిని తలుచుకుంటే..వెంటనే గట్టున పడేస్తున్నాడు..సాక్షాత్తూ నా ముందే వుంటాడయ్యా.." అని కళ్ళకు నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చింది..


ఎన్నో ఏళ్ల నుంచి సుబ్బమ్మ శ్రీ స్వామివారి మందిరానికి వస్తూ పోతూ వుంటే చూస్తూనే వున్నాము కానీ..ఆవిడ శ్రీ స్వామివారి సమకాలీనురాలని మాకు తెలియదు..ఎన్నడూ ఆ మాట ఆమె చెప్పుకోలేదు కూడా..తన చిన్నతనం నుండే శ్రీ స్వామివారిని మనసారా నమ్మిన సుబ్బమ్మ గారు ఇప్పటికీ ఆ నమ్మకం తోనే జీవిస్తున్నారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).