9, ఆగస్టు 2021, సోమవారం

కొడుకుకు నేర్పిన పాఠం

 ఒక తండ్రి కొడుకుకు నేర్పిన పాఠం 

మనం కూడా నేర్చేసుకుందాం రండి 


మొదటిరోజు భోజనానికి పిలిచాడు కొడుకును 

రెండు తట్టలో అన్నం పెట్టుకుని ఒక తట్టలో కోడిగుడ్డు ఇంకో తట్టలో ఏమీ లేదు 


నువ్వే ఏది కావాలో తీసుకో అన్నాడు నాన్న 

కోడిగుడ్డు ఉన్న తట్టను ఎంచుకున్నాడు కొడుకు 

తెలివైన నిర్ణయం తనదని 

తనను తానే పొగుడుకున్నాడు అంతలో నాన్నకు ఇచ్చిన తట్టలో అన్నం లోపల రెండు కోడిగుడ్లు కనిపించింది 


నాన్న చెప్పారు 

పైకి కనిపించేదంతా నిజమని నమ్మి మోసపోవద్దని 


మరుసటి రోజు మళ్ళీ ఇదే విధంగా భోజనానికి కూర్చున్నారు 

ఈసారి కూడా నాన్న నువ్వే మొదట తీసుకో అన్నారు 

మోసపోరాదని ఈసారి గుడ్డు కనిపించని ఆ తట్టను తీసుకున్నాడు కొడుకు 

ఆశ్చర్యం ఏంటంటే నిజంగానే ఇప్పుడు ఒక్క గుడ్డు కూడా లేదు అన్నం లోపల 


నాన్న చెప్పారు ఒక్క అనుభవాన్ని చూసి అలాగే ప్రతిదీ ఉంటుంది అని పొరబడకూడదు అన్నారు 


మూడో రోజు మళ్ళీ అదే విధంగా భోజనానికి కూర్చున్నారు 

నాన్న ఈసారి అలోచించి నిర్ణయం తీసుకోమన్నారు 


నాన్న ఈ ఇంటికి కష్టపడుతున్నది పెద్దవారు మీరే కనుక మీరే ముందుగా తీసుకోండి తరువాత నేను తీసుకుంటా అన్నాడు కొడుకు 


నాన్న అన్నం పైన గుడ్డుతో ఉన్న తట్టను తీసుకున్నారు 

కొడుకుకు ఆశ్చర్యం ఇప్పుడు తన తట్టలో దాగి ఉన్న రెండు కోడిగుడ్లు ఉన్నాయి 


నాన్న చెప్పారు 

ఒకరికి నువ్వు ముందుగా మంచి చేసి చూడు నిన్ను మంచి వెతుక్కుంటూ వస్తుంది అన్నారు 


కోడిగుడ్డు పెట్టి నాన్న మంచి పాఠమే నేర్పారు మరి మీరూ నేర్చుకున్నారా 

పాటిస్తారా చెప్పండి....

కామెంట్‌లు లేవు: