24, ఫిబ్రవరి 2025, సోమవారం

అర్జునుని పాశుపత వ్రతదీక్ష!

 శు భో ద యం 🙏


అర్జునుని  పాశుపత వ్రతదీక్ష!


              శా: " పంచ బ్రహ్మ షడంగ  బీజసహిత  ప్రాసాద  పంచాక్షరీ


                      చంచ  న్మంత్ర  పరంపరా పరమ  నిష్ఠా తత్పరత్వంబునన్ 


                      మంచుంగొండ  యనుంగుఁ  బెండ్లికొడుకున్  మధ్యాహ్న కాలంబు  సే


                      వించున్  నిర్జర రాజ సూనుఁడు  మనోవీధీ  సదాధ్యాసియై ;


                                హరవిలాసము--5 ఆ: 33పద్యం: శ్రీనాథ కవిసార్వభౌముడు!


                        

                             శైవాగమ మంత్ర రహస్యావ  బోధకమైన యీపద్యం  శ్రీనాధ హరవిలాస గ్రంధములోనిది. అర్జునిని  పాశుపత వ్రతదీక్షా విధానమును  యిది నిరూపించు చున్నద


                          

:-               అర్ధములు:- పంచబ్రహ్మ  షడంగ  బీజసహిత-- పంచాక్షరీ మంత్రమునకు గల 11అనుబంధమంత్రములతోగూడిన;

(అంగన్యాస కరన్యాస సమయమున నుచ్చరింపబడు1  ఓంహ్రీం హృదయాయనమః 2 ఓంహ్రీం శిరసేస్వాహా 3 ఓంహ్రీం శిఖాయైవషట్;

ఇత్యాదిగానున్న11 మంత్రములు)వీటితోకూడీన; ప్రాసాద పంచాక్షరీ చంచన్మంత్ర పరంపరా పరమ నిష్ఠాతత్పరత్వంబునన్; శివానుగ్ర కారియైన యొప్పు మంత్రముయొక్క జపవిధానరీతితో కూడిన గొప్ప నిష్ఠాపరాయణత్వమున: మధ్యాహ్న కాలంబునన్--మధ్యాహ్న సమయమున; మంచుంగొండ యనుంగు బెండ్లికొడుకున్: హిమగిరి ప్రియ జామాతను ;నిర్జరరాజసూనుడు--దేవేంద్ర కుమారుడు;మనోవీధిన్--మనస్సులో ;సదాధ్యాసియై  --నిరంతర జపరీతిలో  సేవించున్; పూజించును;


                           భావము: పంచాక్షరీ మంత్రమునకు  గల అంగన్యాస కరన్యాసములయందలి  11 మంత్రములను కలిపి శివానుగ్రహ కారకమైన పంచాక్షరీ మంత్రమును జపించుచుచు. హిమగిరి జామాతను అర్జనుడు చక్కని నిష్ఠతో  మధ్యాహ్న సమయమున  పూజించుచుండును. 


                      శ్రీనాధుని ఈశ్వరార్చనా శీలమున కీపద్యము చక్కనిప్రతీక! 


                శైవము  1కాలాముఖము  2 వీరభద్రము 3 పాశుపతము  -అనిప్రధానముగా మూడువిధములు. కాపాలికాదులు మరికొన్నియున్నను అవిక్షుద్రములగుట  ఆర్యులుపరిగణింపరు.  పైమూడును వీర శైవ శాఖలు. పాశుపతశైవము యించుక తీవ్రమైనది. దానిని అర్జనుడేవిధముగా పాటించు చున్నడో యీపద్యం సూచించుచున్నది. 


                          అభిషేక సమయంలో  మనంసాధారణంగా  అంగన్యాస కరన్యాసాలు  చెప్పుకుంటూ ఉంటాం.కానీ పాశుపతశైవులు పంచాక్షరీ మంత్రజపానికి ఉపక్రమించిన ప్రతిమారు యివిచెప్పుకుంటారన్నమాట.


                     మంచుంకొండ యనుంగు పెండ్లికొడుకున్- అని యీపద్యంలో  శివునిపేర్కొనటం  గమనించదగినది. శివుడు ఉగ్రుడే, కానీ

భక్తలయెడ చల్లనివాడు. నివాసం శ్వశురగృహం హిమాలయంగదా! అదిగో అందులవన నన్నమాట!


                         మొత్తంమీద పద్యమంతా శైవ మత తత్వావబోధనకు పట్టుఁగొమ్మ!!!


                                                                        స్వస్తి!🙏🙏🌷🌷🌷🕉️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️🌷🕉️🕉️🕉️

యమునానందము

 శు  భో  ద  యం 🙏


యమునానందము 


           మ:  ముదితా!  యేతటినీ  పయఃకణములన్  మున్   వేణువింతయ్యె   నా


                    నది,  సత్పుత్రునిఁ  గన్నతల్లి  పగిదిన్   నందంబుతో   నేఁడు     స


                   మ్మద   హంసధ్వని  పాటగా   వికచ  పద్మశ్రేణి   రోమాంచమై


                  యొదవన్  తుంగ తరంగ హస్త   నటనోద్యోగంబుఁ   గావింపదే.


                     

                    భాగవతము-  దశమస్కం-  778 పద్యం.  బమ్మెఱపోతన మహాకవి!


            

              అర్ధములు:  తటిని- నది; పయఃకణములు-నీటితుంపురులు;  వేణువు- వెదురు  (కృష్ణుని చేతిలోని మురళి ) పద్మశ్రేణి-తామరపూల సముదాయము; రోమాంచము-పులకలు; తుంగ-ఎత్తయిన; తరంగములు-కెరటములు;  నటనోద్యోగంబు- నాట్యమాడు ప్రయత్నము;


                      భావము: కృష్ణయ్య  బృందావనంలో  యమునాతీరంలో  భువన  మోహనంగా  వేణువు  నూదుతున్నాడు. అదిచూచి యమునానది  ఆనంద నాట్యం  చేసేందుకు  ప్రయత్నిస్తున్నట్టు  ఉన్నదట! ఇంతకూ  యెందుకా ఆనందం? ఆకన్నయ్య  చేతిలో  ధరించిన  ఆవెదురు గొట్టము ,( అదే  ఆవేణువు  ) చిన్న మొలకగా  తన నదీతీరంలో మొలచి , తన నిరు త్రాగి , పెరిగి పెద్దదైనది. దానియదృష్టము యెంతగొప్పదో!  చెప్పరానిది. అదికన్నయ్య  హస్తమునలంకరించు  భాగ్యమును పొందినది. అందువలన యమునకు  సత్పుత్రుని  గన్నతల్లివలె  మనమందు ఆ నందము  నిండిపోయినది. (ఆనందవశమున శరీరమున పులకలు మొలచుట యును

నాట్యమాడుకోరికయును గలుగుట సహజము.) యమునానదికిగూడ  పద్మ  సముదాయములను పులకలు గలిగినవి. నదిలో కెరటములుగాలికి పైకెగసిపడుచున్నవి.

అవి యామెకు  హస్తములవలెనైనవి. ఆ యానంద సమయమున  నీప్రయత్నములతో  యమున  నాట్యమాడ  ప్రత్నంచు

వనితవలెఁ  గన్పడుచున్నదట!


                        చూచితిరా?  పోతన చిత్రించిన  యమునానందమును 


                      చైతన్య రహితమైన  ప్రకృతియంతయు  సచేతనమై  పరవశించుచున్న దన్నమాట!


                       ఆహా!  కన్నయ్యా!  యెంత భువన మోహనముగా  మురళిని  మ్రోగించినావయ్యా.!   నీమురళీ రవళి  పోతనగారి  చెవిని బడినది గాబోలును. ఆయన పరవశించి  భాగవత పాఠకుల  నెల్లరను  పరవశింపఁ జేసినాడు. నమోస్తు పోతన కవీంద్రా  నీకీర్తి యజరామర మగుఁగాక!


                                            స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

విశ్వనాథ సీత*

 *విశ్వనాథ సీత*


కల్పవృక్షంలో విశ్వనాథ వర్ణించిన అశోక వనంలో సీత  సీతారామాద్వైతానికి ప్రతీక! 


*అశోక వనంలో సీత*!! 

             

                  

కల్పన అంటే ఊహ. ఒక కొత్త ఆలోచన, కొత్త దృక్కోణం. మనందరికీ తెలిసున్న విషయాల గురించి మనకి తెలీని ఒక కొత్త అంశాన్ని ఆవిష్కరించ గలగడమే కల్పనా చాతుర్యం. ఉదాహరణకి అశోకవనంలో సీతాదేవిని వర్ణించే యీ పద్యం చూడండి :


ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా

పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే

హాకృతి, సర్వ దేహమున యందును రాఘవవంశమౌళి ధ

ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ మూర్తియై


సీతాదేవి ఎలా ఉందీ అంటే, ఆమె ఆకారం రామచంద్రుని విరహానికి రూపంలా ఉందట. కనుబొమలేమో రాముని విల్లులా ఉన్నాయి. రాముని కరుణ కన్నులలో మూర్తికట్టింది. జడేమో రాముని శరీరకాంతితో మెఱుస్తోంది.


రామాయణ కల్పవృక్షం

సీతాదేవి శరీరమంతా కూడా రఘువంశ చంద్రుడైన రాముని ధర్మం రూపుకట్టినట్టుగా ఉంది. ఆ కూర్చున్న విధానమేమో రాముని ప్రతిజ్ఞ మూర్తీభవించినట్టుగా ఉందట! ఎంత ఉదాత్తమైన ఊహ యిది! అంత ఎడబాటులో కూడా ఎప్పుడూ ఆ సీతారాములు కలిసే ఉన్నారన్న ఆలోచన గొప్పది. కనుబొమలని ధనుస్సుతో పోల్చడం మామూలే. అలాగే కురుల సౌందర్యాన్ని చెప్పడానికి వాటి నల్లని నిగనిగలు వర్ణించడమూ సామాన్యమే. కాని వాటిని సీత విషయంలో రాముని విల్లుగా, రాముని శరీర కాంతిగా అభివర్ణించడం అసామాన్యం. బాహ్య రూపంతో మొదలుపెట్టి, చివరికి ఆమె శరీరమంతా రాముని ధర్మానికి ప్రతిరూపంలా ఉందనడం, ఆమె కూర్చున్న తీరులో రాముని ప్రతిజ్ఞ కనిపిస్తోందనడం సాధారణ కవులు చెయ్యలేని ఊహ. ఇది సీతారాముల అద్వైతాన్ని నిరూపించే పద్యం. కల్పవృక్షం నిండా ఇలాంటి ఊహలే. అవి ఎంత విచిత్రంగా ఉంటాయో అంత సముచితంగా ఉంటాయి. అంత ఉదాత్తంగా ఉంటాయి.

                    స్వస్తి!

ఔషధాలు లేని జీవితం

 *`ఔషధాలు లేని జీవితం`*


*1.త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం.*


*2. ఓం జపించడం ఔషధం.*


*3.యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం.*


*4. ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం.*


*5.ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం.*


*6. సూర్యకాంతి కూడా ఒక ఔషధం.*


*7.కుండ నీరు తాగడం కూడా ఔషధమే.*


*8.చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే.*


*9.ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే.*


*10. ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం.*


*11.ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం.*


*12.సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం.*


*13.కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం.*


*14.నవ్వు మరియు జోకులు ఔషధం.*


*15. సంతృప్తి కూడా ఔషధం.*


*16.మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం.*


*17.నిజాయితీ మరియు సానుకూలత ఔషధం.*


*18. నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం.*


*19.అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే.*


*20.ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం.*


*21.అందరితో కలిసి జీవించడం ఔషధం.*


*22.తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే.*


*23.మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్.*


*24.సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం.*


*25.ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే.*


*26.చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.*


*ప్రకృతి యొక్క "గొప్పతనం"ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.*


*`ఈ  ఔషధాలు అన్ని మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.`*

శివైక్యం

 శుభోదయం🙏

        చొప్పకట్ల.


శివైక్యం!


ఒకపుష్పంబు భవత్పద ద్వయముపై నొప్పంగ సద్భక్తి రం/

జకుఁడై పెట్టిన, పుణ్యమూర్తికి పునర్జన్మంబులేదన్న, పా/

యక కాల త్రితయోపచారముల నిన్నర్చించున్ పెద్ద నై/

ష్ఠికుడై యుండెడువాడు,నీవగుట తాచిత్రంబె ! సర్వేశ్వరా!


సర్వేశ్వర శతకం:- చిమ్మపూడి అమరేశ్వరుడు.

స్వామీ! సర్వేశ్వరా!

నీపాదాలపై భక్తితో ఒకపువ్వుంచి,ప్రార్ధించిన వాడికి మళ్ళాజన్మంటూ ఉండదటే! రోజూత్రి సంధ్యలా మహానిష్ఠతో నిన్నర్చించేవాడు నీలో ఐక్యమైపోతే ఆశ్చర్యమేమున్నది?అనిభావం.

       ఈశ్వరార్చనకు ఫలితం జన్మరాహిత్యమనీ, యీశ్వరసాయుజ్యమనీ చెప్పే యిపద్యం అపురూపమైనదిగదా!

పవిత్రమైన 

శివనామస్మరణ, శివపూజన మరువకండి!🙏🙏🙏🙏🙏🙏🙏

నీళ్ళు

 నీళ్ళు

నీళ్ళకు, మోకాళ్ళ నొప్పులకు ఏమి సంబంధం? 

నీళ్ళు, నీరు, అంబువులు, సలిలము, జలము, తోయము, ఉదకము--వీటిలో కొన్ని సంస్కృత పదాలు.  ఆపః అంటే కూడా సంస్కృతం లో నీరే. ఈ ఆపః అనే పదం వేదంలో ఎక్కువగా కనబడుతుంది. 

[ పంజాబ్ అంటే పంచ ఆపః  అని --జీలమ్ , చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్  ఐదు నదులు ప్రవహించే ప్రదేశము కాబట్టి పంజాబ్ అయింది ఇది విషయాంతరము...]  

సాధారణముగా నీరు అనేది మన దప్పిక తీర్చుటకు ఉంది ---అని మనం అనుకుంటాము.  నీరు తప్పకుండా దాహము తీరుస్తుంది, అంతేకాదు, శరీరానికి అలసట పోగొట్టి సుఖాన్ని ఇస్తుంది, ఆకలి కూడా తీరుస్తుంది.  కొన్ని ప్రదేశాలలో, ముఖ్యంగా హిమాలయాలలోని ఊటలలో దొరికే నీరు రోజుకు ఒకసారి తాగితే చాలు, ఆకలి దప్పులు ఉండవు,  స్వచ్చమైన నీరు రోగాలను రానివ్వదు, ఉన్నవాటిని పోగొడుతుంది కూడా. 

శరీరానికి శక్తిని ఇస్తుంది, ఆహారాన్ని జీర్ణము గావిస్తుంది,  మనో వ్యాకులతను పోగొడుతుంది.  అందుకే కొన్ని నదుల జలాలను అమృతమయము అని పిలుస్తారు. 

తియ్యటి నూతి నీళ్ళు, త్రిదోషాలను హరిస్తాయి, అగ్ని దీప్తిని [ ఆకలిని  కానపుడు ] ఆరోగ్యాన్ని ఇచ్చును.  అన్నిరోగాలకూ పథ్యమైనవి మంచినీళ్ళు. 

సరే, ఇవన్నీ అందరికీ తెలిసే ఉండును... ఇంకా తెలియనివి యేమంటే, శుద్ధమైన జలానికి జ్ఞాపక శక్తి ఉంటుంది.  అది భావాలను కలిగించగలదు, ఒకరి నుండీ ఇంకొకరికి అనుభూతులను, భావాలను, ఉద్దేశాలను కూడా పంచగలదు. 

నీరు ,తనలో సమాచారాన్ని నిలువ ఉంచుకుంటుంది. ఆ సమాచారాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎవరికి పంచాలో , తెలిసిన తెలివి ఉంది. 

నీటిలో స్నానము చేసినపుడు, శుద్ధిపరచుట మాత్రమేకాక, మనసుకు ఆహ్లాదాన్ని, శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది.  మనసును తేలిక పరుస్తుంది. భయము, విహ్వలత, ఆందోళన వంటివి ఉంటే పోగొడుతుంది.

సంధ్యావందనములో నీటిని అనేకరకాలుగా ఉపయోగిస్తాము.

మొదట ఆచమనము చేసినపుడు, అంతఃశ్శుద్ధి కోసము, మార్జనము చేసినపుడు బాహ్యశుద్ధి తోపాటు చిత్తశుద్ధి కోసము, అర్ఘ్యము వదలినపుడు చెప్పే ,మంత్రము వలన మన సందేశాన్ని సూర్యుడికి అందజేస్తుంది. మన సందేశము నీటికి చేరి, నీటి నుండీ సూర్య కిరణాలకు చేరుతుంది. 

తర్పణాలు వదిలేటప్పుడు, ఆయా దేవతలకు హవ్య కవ్యాలు గామారి, వారి సూక్ష్మ శరీరాలకు క్షుత్పిపాసలు తీరుస్తుంది. మంత్రించిన నీటిని శరీరభాగాలకు తాకిస్తే, ఆయా భాగాలలోని చెడు తత్వాలు[ గుణాలు, లేక చెడు శక్తి ] వదలి  స్వఛ్ఛంగా చేస్తుంది. 

పూజలలో దేవతలకు ఏ ఉపచారము చేసినా, దానితోపాటు ఉద్దరిణె నీరు వదలి, ’ సమర్పయామి ’ అంటాము. అప్పుడే అది ఆయా దేవతలకు చెందుతుంది. నైవేద్యములో నీటిని  ప్రోక్షణకు, ఆచమనీయానికి, పరిషేచన కు వాడుతాము. మనము చేసే నివేదన అమృతమయము అవనీ--అని [ అమృతోపస్తరణమసి ] భావిస్తే అది అమృతమే అవుతుంది.

పుణ్యాహ వాచనము చేసిన నీరు అతి శ్రేష్టమైనది. అది గంగ వలె సర్వ పాపాలనూ పొగొడుతుంది, అందుకే ఆ నీటిని గృహ,  భూ, భాండ, పాక శుద్ధికి ఉపయోగిస్తారు. 

శ్రాద్ధాలలో నీరు లేకపోతే ఆ కార్యమే లేదు. ఆచమనాలు, తర్పణాలు, దానాలు, ఔపోశనాలు, పరిషేచనాలు, హోమాలలో హోమకుండాన్ని పరిస్తరణ చేసేదానికి, చివరికి అగ్నిని శుద్ధి చేయడానికి కూడా నీరే వాడుతాము. 

ఏదైనా దానము ఇచ్చినపుడు, మన ఉద్దేశాన్ని నీటిలోకి ప్రవేశింపజేసి, ఆ నీటిధారతో అవతలివారికి ఆ దానము అందేలా చేస్తాము. అంతేకాదు, నీటిని దానము చేయడము వలన కూడా ఎంతో గొప్ప ఫలము లభిస్తుంది. అందుకే ఎండాకాలంలో చలివేంద్రాలు కట్టిస్తారు. భావులు, చెరువులు తవ్వించుట [ దీన్ని ఇష్టాపూర్తం అంటారు ] గొప్ప పుణ్య కార్యము . వసంత నవరాత్రుల్లో బ్రాహ్మడికి ఉదక కుంభము దానము చేస్తే విశేష ఫలితము.

 ఋషులు, మునులు శాపాలు ఇచ్చేటప్పుడు కూడా నీటికి ఆ శాపోద్దేశాన్ని ఆపాదించి, మంత్రించి పైన చల్లుతారు

మైల పోగొట్టుకొని పవిత్రులు కావడానికి కూడా మంత్రోచ్చారణతో సంప్రోక్షణ చేస్తారు. 

దేవుడికి అభిషేకించిన నీరు ఎంతో పవిత్రమైన శక్తిని పొంది ఉంటుంది. అందుకే ఆనీటిని తీర్థముగా ఇస్తారు. ప్రోక్షణ కు కూడా వాడుతారు. 

ఇక పుష్కరాలు వంటి సమయాల్లో నదుల నీరు కొత్త శక్తిని కలిగి ఉంటాయి.  ప్రకృతిలోని సకారాత్మక శక్తులన్నీ ఆ నీటిలో చేరుతాయి.  అందుకే పుష్కరాల్లో నదీస్నానం ఎంతో పాపహరము, కొత్త శక్తిని కూడా ఇస్తుంది.

నీళ్ళు అనేక రకాలు. అన్ని నీళ్ళ కన్నా గంగానది నీరు ఎంతో పవిత్రమైనది. గంగ పేరు విన్నా, తలచుకున్నా, పలికినా, పవిత్రతను ఇస్తుంది. గంగా స్తోత్రము చేసేవారు, ఎక్కడున్నా గంగా సమీపములో ఉన్నవారే.  వేదపారాయణము, యజ్ఞయాగాదులు ,క్రతువులు చేసిన ఫలము గంగా స్తోత్రముతో వస్తుంది. శ్రాద్ధాలలో అభిశ్రవణ మంత్రాలతో పాటూ గంగా స్తోత్రము చదివితే ఆ పుణ్యము మనకు అనేక జన్మలలో ఫలాన్ని ఇస్తుంది. 

సన్యాస స్వీకార సందర్భం లో, ఉత్తరాధికారి/ లేదా శిష్య స్వీకార సందర్భంలో నదీస్నానము తప్పనిసరి.  కొన్ని కొన్ని ప్రత్యేక  సందర్భాల్లో  చెరువు, తటాకము వంటివి ఉంటేనే కార్యాలు సిద్ధిస్తాయి... సర్పసంస్కారము వంటివి.

శ్రాద్ధాలలో పిండాలను నీటిలో కలిపే ఆచారము కూడా ఉంది. 

కొన్ని సాంప్రదాయాలలో యతులు మరణిస్తే, జలసమాధి మాత్రమే చేస్తారు 

అలాగే, కొన్ని ఋతువుల్లో, సందర్భాల్లో, గ్రహణాల్లో నీటికి, ముఖ్యంగా నదీజలాలకు రజోగుణము ఆవరిస్తుంది. అప్పుడు ఆ నీటిలో స్నానము చేయరాదు. 

చెడు గుణాలు, చెడు తలపులు ఉన్నవారు ఇచ్చిన నీరు తాగితే మనకు ఆ చెడు ఆవరిస్తుంది. 

అన్నిటికన్నా విశేషము, 

నీటిని ఎప్పుడూ కూడా నిలుచుకొని త్రాగకూడదు. నేల మీదో, కుర్చీ మీదో కూర్చొని మాత్రమే తాగాలి. నిలుచొని తాగితే శరీరములోని వాయువు కీళ్ళ మధ్య చేరి,  మోకాళ్ళ నొప్పులు వస్తాయి.  ఆచమనాలు కూడా ఎప్పుడూ నిలుచుకొని చేయరాదు. మామూలుగా బాసింపట్టు వేసుకొనో, సుఖాసనం లోనో, గొంతుక్కూర్చొనో చేయాలి, తాగాలి. 

తీర్థం తీసుకున్నా, కూర్చొనిమాత్రమే తీసుకోవాలి.

మనిషి నీరు లేకున్నా చనిపోతాడు, నీరు ఎక్కువైనా చనిపోతాడు. 

నీటికి ఇన్ని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. నీరే కదా..అని అలసత వద్దు. 

-- Vibhatha Mitra

అఘోరీ_నాలుగవ_చివరి_భాగము_4

 #అఘోరీ_నాలుగవ_చివరి_భాగము_4

ఇంతవరకూ చదివినది 

[ దహనమా? ఏ దహనము? అని ఆశ్చర్యముతో అడిగాను.

వారు నవ్వి అన్నారు... ’ అదే నీ గొప్పతనము. నీకిచ్చిన కార్యాన్నీ మొక్కవోని ఏకాగ్రతతో ముగించావు, పక్కన ఏమి జరుగుతున్నదో కూడా తెలీఅంత ఏకాగ్రత!. ఈ తెల్లవారుజామున, మీరు జపములో ఉండగానే, మహా అఘోరాచార్యాణి తనువు చాలించింది. నీ ఎదురుగానే!. కానీ నువ్వు ఎరుగవు.  ఈ ఉదయమే ఆమె శవ  దహనం  ఉంటుంది"

నాకు కళ్ళు తిరుగుతున్నట్టైంది.. మహాచార్యాణి చనిపోయిందా? నా ఎదురుగనే? నాకు తెలీకుండానే?  విద్యుఘాతము తగిలినట్టైంది.  అయోమయంగా చూస్తున్నాను. ]

రెండు రోజులు గడిచాయి ఇంకా మహా కుంభమేళా  జరుగుతోంది.  మహాచార్యాణి చనిపోయిన రోజు వచ్చి  ఆశీర్వదించిన వృద్ధ అఘోరా మళ్ళీ వచ్చారు. పక్కనే ఇంకో ఇద్దరు. 

" వైశ్వానరీ, నీవల్ల భారత దేశానికి, హిందూ సమాజానికి ఎంతో ఉపకారమైనది. మొన్న నువ్వుగనక జపం మధ్యలో ఆపి ఉంటే, అంతా వ్యర్థమయ్యేది. బూడిద మిగిలేది. మళ్ళీ ఇంకో నూట నలభై నాలుగు యేళ్ళ తర్వాత వచ్చే మహా కుంభ మేళా కోసము ఎదురుచూడవలసి వచ్చేది. అప్పటికి భారత దేశము సర్వ నాశనము అయి ఉండేది. అప్పుడు ఒకవేళ దేశం నిలబడినా, అప్పటికి మళ్ళీ ఒకే కుటుంబము వారు ఇద్దరు అఘోరాలు లేక అఘోరీలుగా మారేవారని ఎలా చెప్పగలము?  ఇదిగో,  ఈ లోలాకు తీసుకో. ఇది మహా ఆచార్యాణి నీకు ఇవ్వాలని ముందే చెప్పింది.  ఆమె కుడి చెవికి మాత్రము ఇది ఒకటే ఉండేది.  దీన్ని నువ్వు పెట్టుకో..."

నాకేమీ అర్థము కాలేదు.  లోలాకు ఆమెకు నాలాగే ఒకటే ఉండిందా? అదే అడిగింది.. " మాహాచార్యా, ఆచార్యాణి ఒకటే లోలాకు పెట్టుకొనేదా?  

అవును, ఆమె దగ్గర అది ఒకటే ఉండేది. రెండోది తెచ్చుకోలేదు అని చెప్పేది. బహుశః ఇంటి గుర్తుగా తెచ్చుకుందేమో... ఆరాత్రి గుర్తుందా? ఆచీకట్లో మొదట నిన్ను వెళ్ళిపొమ్మంది. నువ్వు ఎవరో గుర్తుపట్టక!  తర్వాత మెరుపు వెలుగులో నీ చెవికిఉన్న లోలాకు చూసి నిన్ను గుర్తుపట్టి, దగ్గరకు రమ్మని పిలిచింది... వైజయంతి మహాచార్యాణి నీ జేజెమ్మ కుముద్వతి కి జేజెమ్మ అవుతుంది. తెలుసా?  ఆమె వద్ద, నీవద్ద ఉన్న లోలాకులు రెండూ ఒక జత. 

తాను నిర్ఘాంత పోయింది... అంటే,  కుముద్వతి జేజెమ్మ ఈ మహాచార్యాణికి తెలుసు, తెలుసేమిటి, మనవరాలు కదా... తాను కూడా మునిముని మనవరాలు అవుతుంది. మరి, ఆమాట నాకు ఎందుకు చెప్పలేదు?  ఆచార్యులను అడిగింది

" ఆచార్యా, మేమిద్దరం ఒకే కుటుంబము వారము అని మహా ఆచార్యాణి నాకు ఎందుకు చెప్పలేదు?  ఇందాక తమరు, ఒకే కుటుంబములో ఇద్దరు అఘోరాలు గా మారేవారా? అన్నారు.. నాకది అర్థము కాలేదు.. దయచేసి చెప్పగలరా?"

అంతలో శంఖనాదాలు, బూరలు, డమరుకాలు, డప్పులు మోగిస్తూ ఒక యాభై మంది దాకా అఘోరాలు వచ్చారు. ’ హర్ హర్ మహా దేవ్"  నినాదాలు మిన్నంటుతున్నాయి. అందరూ నృత్యం చేస్తున్నారు. అది చూసి ఆచార్యులు కూడా చేతులు గాలిలోకి విసరుతూ, ’ హరహర మహాదేవ్’ అని అరుస్తూ వారితోపాటు నృత్యం మొదలుపెట్టారు. తాను చేష్టలుడిగి చూస్తోంది. 

అందరూ అందరికీ మిఠాయిలు పంచారు.  " మొత్తం నూట ఇరవై మందీ సమసి పోయారా? " అడిగారు ఆచార్యులు ఆ వచ్చిన వారిని.  

" అవును ఆచార్యా.. మొత్తం అందరూ పోయారు. చివరివాడు పోయేదాకా ఉండి, చూసి మరీ వచ్చాము. " 

హరహర మహాదేవ..అంటూ ఆచార్యులు కళ్ళుమూసుకొని చేతులు పైకెత్తి ఆకాశంలోకి చేస్తున్నట్టు నమస్కరించారు. 

’ వైశ్వానరీ, ఇలా రా. నువ్వు చేసిన ఆ మహత్కార్యము ఎంతగొప్పదో నీకు తెలీదు.  వివరిస్తాను, రా " అన్నారు ఆచార్యులు.

ఆచార్యులు కూచోగానే అందరూ కూచున్నారు. తానూ కూర్చుంది

" మొదట, ఇప్పుడు జరిగిందేమిటో వివరించి చెప్పు.. " అని ఆచార్యులు తమ పక్కనున్న ఒక అఘోరాను అడిగారు

" ఆచార్యా, మీ ఆదేశానుసారమే ప్రయాగకు వంద కిలో మీటర్ల దూరములో వేచి ఉన్నాము. ఆకాశంలో తెల్లటి పొగ ఇక్కడనుండీ అక్కడకు వచ్చింది.  కాసేపట్లోనే ఒక అరవై మంది సాధారణ పౌరులు, ఇంకో అరవై మంది కాషాయధారులు అక్కడికి వచ్చారు.  ఆ పొగ ,వారందరినీ చుట్టుముట్టింది.  వెంటనే వారు ఒకరినొకరు కొట్టుకోవడము మొదలుపెట్టారు.  ఆ పోట్లాట యుద్ధములా మారింది...."

అతణ్ణి ఆగమని చెపుతూ ఆచార్యులు వైశ్వానరితో అన్నారు " చూశావా? మీరు మహా మాఘి రాత్రి చేసిన హోమపు ధూమము ప్రయాణించి వందకిలోమీటర్లు దాటి వెళ్ళింది, దానికి ఆకర్షితులై ఆ నూట ఇరవై మంది దుండగులూ అక్కడికి వచ్చారు.."

దుండగులా? ఎవరు వారు? అందామె.

పోయినవారము తొక్కిసలాట జరిగింది కదా? ఆ తొక్కిసలాటకు కారణమైన వారే ఈ నూటా ఇరవై మంది. చచ్చారు, పీడ వదిలింది..

వారు అక్కడికి ఎందుకు వచ్చారు? పొగ, వారిని ఆకర్షించడమేమిటి? అందామె ఆశ్చర్యపోతూ. 

ఆరోజు రాత్రి మీరు చేసిన హోమము వద్ద నూట ఇరవై ఇసుక కుప్పలు పెట్టించిందిగా, వైజయంతి మహా ఆచార్యాణి?  ఆ ఇసుకలో వీరి పాదరేణువులు ఉన్నాయి. ఆ ఇసుక నుండీ బయలువెడలిన పొగ కు వీరు ఆకర్షితులయ్యేలా ఆ ప్రేతాత్మలు చేశాయి. 

ఏ ప్రేతాత్మలు? 

చనిపోయిన భక్తులు, ఆ ముప్పై మంది ప్రేతాత్మలు. వాటికి సంవత్సరం అయ్యేవరకూ ప్రేత రూపము తప్పదు. అటుతర్వాతే, అన్ని కర్మలూ అయ్యాక మోక్షము.  ప్రేత రూపం లో ఉన్నందున, తాము పరమాత్మ స్వరూపాలే అని తెలుసుకోలేక, తమ చావుకు కారణమైన ఆ నూట ఇరవైమంది మీద కోపముతో,  ఆకర్షింపబడి అక్కడికి వచ్చేలా, వారిని గుర్తించి, ఆవహించి, వారిలోవారు కొట్టుకొని చచ్చిపోయేలా చేశాయి ఆ ప్రేతాత్మలు. 

మరి, అందులో కొందరు కాషాయధారులు అన్నారు? వారూ దుండగులేనా? 

వారందరూ దుండగులే.  కాషాయం ముసుగులో తిరిగేవారు వారు. 

కానీ ఆచార్యా, ఇంత అవసరము ఎందుకుంది? జరిగిన తొక్కిసలాటకు కారణమేమో విచారణ జరుగుతోంది కదా, ప్రభుత్వము తగిన చర్య తీసుకునేది కదా? దానికోసము మనము ఇదంతా చేయడము అవసరమా,  నాది అజ్ఞానమైతే మన్నించండి.

అడగవలసిన ప్రశ్ననే అడిగావు. ప్రభుత్వం వారిని ఎప్పుడో గుర్తించింది.  కుంభమేళా ముగిసేదాకా వారిని ఏమీ చేయదు. ఆ తరువాత వారిని విచారించి జైల్లో పెట్టించడమో, ఎన్‌కౌంటర్ చేయడమో జరుగుతుంది.  సనాతన ధర్మాన్ని ఇంత తీవ్రంగా అవమానించి, అపశ్రుతి కలిగించి, కోట్లమంది మనోభావాలను దెబ్బతీసి, ధర్మగ్లాని కలిగించాలని చూసిన వారిని 

ఒక అఘోరీగా నువ్వైనా క్షమిస్తావా? లేదు కదా? ప్రభుత్వ చర్యలు రెండూ కూడా సరి కాదు. వారు జైల్లో ఉంటే మనకు అది సమ్మతము కాదు, అసలు ఈ లోకం లోనే ఉండకూడదు... వారిని ప్రభుత్వము రహస్యంగా ఎన్‌కౌంటర్ చేయడము కూడా మాకు సమ్మతము కాదు. ఎందుకంటే దానివల్ల యోగీ ఆదిత్యనాథ్ జీ కీర్తి పెరగదు సరి కదా, ఒక కళంకముగా ప్రతిపక్షాలు ప్రచారము చేస్తాయి. అలాగని మనము వారిని చంపలేము, మన నియమాలకు అది విరుద్ధము. అఘోరాలము అంటే పరమ శాంతులము. హింసకు మనలో చోటులేదు. కానీ హింసలేకుండా వారిని చంపలేము. కాబట్టి, మన చేతికి గానీ, ప్రభుత్వ చేతికి గానీ మట్టి అంటకుండా వారిలోవారే పోట్లాడుకుని చంపుకునేలా చేశాము. 

ఇది ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసా, ఆచార్యా?  ఈ వార్త బయటికి పొక్కిపోయి అప్పుడే వచ్చిన మీడియా వారు ఆచార్యులను చుట్టుముట్టి అడుగుతున్నారు.. " ఇది మీకు ముందే తెలుసా?" 

ఆచార్యులు మందహాసము చేసి, " ఇలా చేయొచ్చని తెలుసు. ఇప్పుడు లోకం దృష్టిలో , వారి చావుకు వారే కారణము. మేము చేసిన హోమాలు అంటే హేతువాదులు, సనాతన వ్యతిరేకులు నమ్ముతారా? ఎన్నటికీ నమ్మరు. ఆ అపనమ్మకాన్నే మేము ఆయుధంగా మార్చుకున్నాము. మా అఘోరాల పద్దతులే అంత "

" మీరు చెప్పింది నమ్ముతారే అనుకుందాము ఆచార్యా,  కానీ ఇలా చేయచ్చు అని తెలిస్తే రేపు ప్రతిఒక్కరూ తమ శత్రువులను చట్టానికి దొరక్కుండా సులభంగా చంపే ఈ మార్గాన్ని ఎంచుకుంటే, దానికి బాధ్యులు మీరే అవుతారు కదా? అది అఘోరాల నియమావళి కిందకు వస్తుందా?"

ఇలాంటివి జరగడము ఇదే ఆఖరుసారి. ఇకపై జరిగే సంభవత లేదనే చెప్పచ్చు. 

ఏ ఆధారముతో అనగలరు, ఇవి పునరావృతము కావు అని?

మొదటిది, ఎవరైనా ధర్మానికి విపరీతమైన గ్లాని కలిగించినపుడే మేము ఇలాంటి పద్దతులు ఎంచుకుంటాము. ఇటువంటి గ్లాని ఇకపై జరగబోదు. ఎందుకంటే భారత దేశము హిందూరాష్ట్రముగా అవతరించింది. ఇది ఇంకా సంధికాలమే కాబట్టి ఇదైనా జరిగింది. ఇకపై ఈ దేశములో దేశద్రోహులు ఉండే ప్రసక్తే లేదు. అందరూ సనాతన సార్వభౌమత్వానికి లోబడి ఉండవలసినదే, చట్టాలు మారబోతున్నాయి. రాజ్యాంగమే మారబోతోంది. 

రెండోది, మరలా ఇలాంటి పద్దతి ప్రయోగించాలంటే ఇటువంటి ప్రత్యేక హోమాన్ని చేసేవారు కనీసం ఇద్దరు, ఒకే కుటుంబానికి చెందినవారు అయి ఉండాలి.  వారి జాతకాలు ఒక్కలాగే ఉండాలి, అంటే, ఏడు గ్రహాలు ఒకే రాశిలో చేరి, పన్నెండో రాశిలో కేతువు ఉండి, కనీసం నాలుగు గ్రహాలు ఉఛ్ఛ స్థితిలో ఉండాలి. ఇది దాదాపు దుర్లభము, అసాధ్యము.  ఇప్పుడు హోమము చేసిన ఇద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అఘోరీలు. వీరిద్దరి జాతకాలూ నేను చెప్పినట్టు అచ్చంగా ఒకేలా ఉన్నాయి. ఇవి రెండూ కుదరడము ఇకపై అసాధ్యము. జాతకాలు ఒకేలా ఉన్నా, ఇద్దరూ ఒకే కుటుంబము వారైనా కూడా, ఇద్దరూ అఘోరీ/లేక అఘోరా దీక్ష తీసుకొని ఉండాలి. ఇలాంటిది ఇకపై జరగదు అనే చెప్పవచ్చు. 

ఈ వార్త ప్రత్యక్షంగా చుస్తున్న జనాలు విస్తుపోతున్నారు. సనాతనులు జయజయ ధ్వానాలు చేస్తుంటే, పరులు నమ్మలేక, జరిగినదాన్ని కాదనలేక, మింగలేక కక్కలేక ఉన్నారు

మళ్ళీ మీడియావారు అడిగారు.." ఇలాగ ఇంతకు ముందు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? "

ఆచార్యులు  సాలోచనగా అన్నారు"  నిజానికి గతంలో కూడా ఇది జరిగే సాధ్యత, సంభవత అతి తక్కువగా ఉండింది. సనాతన ధర్మము ఎంత ప్రాచీనమైనదో, అఘోరా తెగ కూడా అంత ప్రాచీనమైనది. శివుడే మొట్టమొదటి అఘోరా. మొగలులు, ఆంగ్లేయులు భారత్ మీద దండెత్తి రానంత వరకూ ఈ స్థాయిలో మహా కుంభమేళాలో అపశ్రుతులు కానీ, ధర్మ గ్లాని కానీ జరిగే ప్రసక్తే లేకుండింది. ఎందుకంటే అప్పుడు భారత ఖండమంతా సనాతనమే. పర ధర్మాలు ఎప్పుడైతే ప్రవేశించాయో అప్పుడు ధర్మగ్లాని మొదలైంది.  నేను చెబుతున్నది తొక్కిసలాటలు జరగలేదని కాదు. తొక్కిసలాటలు అనుకోకుండా జరిగి ఉండవచ్చు. కానీ ఈసారిలాగా పర ధర్మీయులు ఎన్నడూ ఘాతుకము చేయలేదు. కానీ ఇటువంటి హోమము ఒకసారి    జరిగింది. చేయవలసి వచ్చింది అంటే ఎక్కువ సరైనమాట.  అప్పుడు కూడా వైజయంతి మహా అఘోరాచార్యాణి హోమము చేశారు. అయితే అప్పుడు ఆమెతోపాటు హోమములో కూర్చున్నది, అప్పటి అఘోరీ యోగీశ్వరి కుముద్వతి మాత. ఆమె కూడా వీరి కుటుంబానికి చెందినదే. ఆమె జాతకము కూడా వీరిద్దరి జాతకాలకు ఏమాత్రము తేడా లేకుండా ఉండింది. "

" అది యే సందర్భములో జరిగింది?"

అది, మొగలు సామ్రాజ్య పతనము తర్వాత, ఆంగ్లేయ సామ్రాజ్యము స్థాపనప్రారంభములో.. అంటే సంధికాలము లోజరిగింది. ఇప్పుడు కూడా సనాతన ధర్మము పునర్వైభవాన్ని విస్తరించబోయే కాలము. భారత్ లో పర ధర్మాలు నశించే సంధి కాలము. "

అప్పుడు జరిగిన గ్లాని ఏమిటి? ఎవరు చేశారు?"

అప్పటికి వివేకానంద స్వామి సనాతన ధర్మము వైపుకు ప్రజలను జాగృతము చేసే బృహత్కార్యములో ఉన్నారు  ఇస్లామిస్టులు, క్రైస్తవ మిషనరీలకు వారంటే విరోధము. పంతొమ్మిదవ శతాబ్దము చివరలో వారిపై హత్యా ప్రయత్నము జరిగింది, నీకు తెలుసా?  ఆ కాలములో  స్వామి చేస్తున్న సనాతన ధర్మ ప్రచారము సహించలేక ఆంగ్లేయులు కూడా వారిని రకరకాలుగా హింసించాలని చూశారు. చివరికి చంపాలని కూడా ప్రయత్నించారు. వారు దశమహా విద్యలు తెలిసిన రామకృష్ణుల శిష్యులు. ఎన్నెన్నో గుప్తవిద్యలు తెలిసినవారు కూడా. వారిని ఎవరూ ఏమీ చేయలేరు.. కానీ, ఆ విద్యలను వారు తమ స్వార్థము కోసము ఎప్పుడూ ఉపయోగించలేదు.  ఉగ్రవాదుల  నుండీ తప్పించుకోవాలంటే వారికి అదొక లెక్క కాదు, కానీ తమ విద్యలను తమను కాపాడుకోవడము కోసము ఉపయోగించుట వారికి ఆమోదయోగ్యము కాదు. కాబట్టి వారిని చంపడము ఆంగ్లేయులకు సులభము అయ్యేది. కానీ అప్పుడు ఆర్ ఎస్ ఎస్ వారి ప్రోద్బలముతో,  మాలో కొందరు ముందుకు వచ్చి, ఆ దుండగులు తమలోతాము కొట్టుకొని చచ్చేలా ఈ హోమము చేశాము. అప్పుడు నేను కూడా యోగీశ్వర్ గా ఉన్నాను. అయితే అప్పటి ఆ సంఘటనలో చనిపోయినవారు పది మంది కూడా లేరు. ఈ స్థాయిలో జరగలేదు.  హోమము చేసి తమవారిని మేము చంపాము అని ఒప్పుకొని ప్రకటించే స్థాయిలో లేరు బ్రిటిష్ వారు. అసలు ఈ వార్త పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.  అప్పుడు చేసిన హోమములో, ఇప్పుడు వైజయంతి ఆచార్యాణి చనిపోయినట్టే, కుముద్వతీ యోగేశ్వరి చనిపోయింది.  తనకన్నా చిన్నదిఅయిన కుముద్వతి చనిపోవడము వైజయంతి మాతకు  జీర్ణము కాలేదు. కానీ అది శివుడాజ్ఞ గా భావించి సమాధాన పడింది. కుముద్వతి చెవికి ఉన్న శంఖాకారములోని ఆ లోలాకును ఆమె తీసుకొని ధరించింది. ఇప్పుడు దాన్నే నీకు ఇచ్చాము.  "

మరి నన్ను ప్రత్యేక ఉద్దేశముతో రప్పించాను అని చెప్పిన మహాచార్యాణి, నన్ను గుర్తించనట్టు మొదట్లో ఎందుకు మాట్లాడింది?

నువ్వు వస్తావని ఆమెకు తెలుసు కానీ, వచ్చింది నువ్వేనా కాదా.. అని పరీక్ష అన్నమాట. 

నాది ఇంకో ప్రశ్న, ఆచార్యా,  హోమము జరిగాక ఇప్పటిలా అప్పుడూ ఒకరు చనిపోవడము ఏమిటి? ఇలా హోమము చేస్తే ఆ చేసిన వారిలో ఒకరు చనిపోతారా?

అవును. హోమము అయ్యాక, స్నానము కూడా అయ్యాక జపము చేసేటప్పుడు  ఎవరు ముందుగా జపము ముగించి కనులు తెరిస్తే వారు వెంటనే తనువు చాలిస్తారు. ఇది అప్పుడూ ఋజువైంది, ఇప్పుడూ ఋజువైంది.  జపము చేయడానికి ఒక వేగము, ఒక సంఖ్య ఉంటాయి. ఆ సంఖ్య ఎంతో అంత జపము మాత్రమే చేయాలి, నిర్ణీత వేగములో మాత్రమే చేయాలి.  చేశాక మనసులో దేవతకు పంచపూజలు చేసి అనుగ్రహాన్ని పొంది కనులు తెరవాలి.  కనులు తెరవడములో అరక్షణం తేడా ఉన్నా కూడా మొదట తెరచినవారే విగత జీవులు అవుతారు. 

వింటున్న అందరూ మాటలురానట్టు ఉండిపోయారు.

వైశ్వానరి దిగ్భ్రాంతికి లోనై, అంతలోనే తమాయించుకొని, ఇద్దరు జేజెమ్మలకు నమస్కరించి వైజయంతి దహన కార్యానికి వెళ్ళింది.

/ శుభం భూయాత్ /

// సమాప్తమ్//


By Vibhatha Mitra

Panchaang


 

108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు::


      80వ దివ్యదేశము 🕉


🙏 శ్రీ తిరునిలాత్తింగళ్ తుండత్తాన్

 పెరుమాళ్ ఆలయం, 


 ( ఏకామ్రేశ్వర ఆలయంలో ) 


కాంచీపురం 🙏


🔅 ప్రధాన దైవం: నిలాత్తిజ్గళ్ తుండత్తాన్ పెరుమాళ్

🔅 ప్రధాన దేవత: వేరొరు వన్ఱిల్లా తాయార్

🔅 పుష్కరిణి: చంద్రపుష్కరిణి

🔅విమానం: పురుష సూక్త విమానము

🔅ప్రత్యక్షం: రుద్రుడు


🔔 స్థలపురాణం 🔔


💠 ఒకప్పుడు సహస్రాధిక ఆలయాలతో అలరారిన కాంచీపురం లో ప్రస్తుతం కొద్ది మాత్రమే మిగిలాయి.

 వాటిల్లో ప్రముఖమైనవి శ్రీ ఏకాంబరేశ్వర, శ్రీ కైలాసనాధ, శ్రీ కామాక్షి అమ్మన్, 

శ్రీ వరదరాజ పెరుమాళ్ ఇలా ఉన్నది జాబితా!  


💠 నగరంలో ఉన్న శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులలో ఒకటి ప్రసిద్ధ శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఉండటం విశేషం. 

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


💠ఒకనాడు కైలాసంలో సరస సల్లాపాల మధ్య పార్వతీదేవి త్రినేత్రుని నేత్రాలను తన కోమల హస్తాలతో క్షణకాలం మూసిందట. జగత్తుకు వెలుగును ప్రసాదించే సూర్య చంద్రులు ఆ నేత్రాలు. క్షణకాలం అయినా లోకాలన్నీ తల్లడిల్లిపోయాయట. తెలియక చేసినా తప్పు తప్పే కనుక పరిహరం చెల్లించుకోడానికి అర్దనారీశ్వరుని అనుమతితో కాంచీపురం చేరుకొన్నదట గౌరీదేవి.

 ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో లింగాన్ని చేసి భక్తి శ్రద్దలతో సేవించసాగిందట. శివుడు కొంతకాలానికి ఆమె పరీక్షింపనెంచారట.


💠తన జటాజూటాల నుండి గంగను వదిలారట. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి ప్రవాహవేగానికి సైకతలింగం ఎక్కడ మునిగి పోతుందో అని భయపడిందట. ఆందోళనతో కామాక్షి దేవి శ్రీ మహవిష్ణువు ను శరణు కోరిందట. 

ఆయన ఆమెను లింగాన్ని ఆలింగనము చేసుకోమని చెప్పి తాను విశ్వరూపాన్ని ధరించి ప్రవాహనికి అడ్డుగా శయనించారట. ముల్లోకాలకు విస్తరించిన శ్రీహరి ని దేవతలు, మహర్షులు స్థుతించసాగారట.


💠 ఆ సమయంలో చంద్రుని కిరణాలు సోకి శ్రీ వారి కంఠం నీలంగా మారిందట. 

అందుకే స్వామిని "శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్ "అని పిలుస్తారు.


💠 శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ని అమ్మవారు కౌగలించుకోవడం వలన లింగం పైన ఆమె కరకంకళాల మరియు వక్షోజాల ముద్రలు పడినాయట. వాటిని నేటికీ లింగం మీద చూడవచ్చని చెబుతారు. ఉమా దేవి తపమాచరించిన మామిడి చెట్టు కూడా ప్రాంగణంలో ఉన్నది. 


💠ప్రదక్షిణా మార్గంలో ఉన్న 

గర్భాలయానికి ఎదురుగా చిన్న మందిరంలో దర్శనమిస్తారు పెరుమాళ్. 

దేవేరులు, ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడుడు ఏమీ ఉండవు. 

శైవార్చకులే పూజలు చేసే ఈ మందిరంలో ఆదిశేషుని పడగ ను ఛత్రం చేసుకుని చతుర్భుజాలతో స్తానక భంగిమలో రమణీయ పుష్పాలంకరణతో కనిపిస్తారు

 శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్. 


💠శ్రీ నీలతింగళ్ తుండతాన్ పెరుమాళ్ ఆలయం శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయం ఆవరణలో ఉంది; 

శివుని పంచ బూత స్థలాలలో ఈ క్షేత్రం భూమికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 

ఈ ఆలయం తమిళనాడులోని కాంచీపురం లో ఉంది. 


💠 శైవ పూజారులు పూజలు చేస్తున్న ఏకైక వైష్ణవ దివ్యదేశం ఇది. ఈ స్థలాన్ని తిరునేడుతంగడం అంటారు.


💠 మూలవర్ తన అభయ హస్తంతో పురుష సూత్రం విమానం కింద పడమర ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో "నిలతిథింగ్‌తుల్తాథన్" మరియు "చంద్రసూదప్ పెరుమాళ్" గా పూజలు అందుకుంటున్నారు. థాయర్ నేర్ ఒరువర్ ఇల్లా వల్లి నాచియర్ (నీలాతింగళ్ తుండం థాయర్)


🙏 జై శ్రీమన్నారాయణ 🙏

రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య

 రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయినప్పుడు 

నేను ప్రయోగించిన సిద్ధయోగం  -

    


మొదట ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనే కరిగేలా చేసి దానిలో ఒకస్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి వెంటనే రోగికి తాగించాలి. కొంతసేపట్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఒక గంట తరువాత ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఒక బొప్పాయి ఆకు మొత్తం చిన్నచిన్న ముక్కలుగా చేసి పొయ్యి మీద పెట్టి అందులొ తాటిబెల్లం వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేలా కాచి దానిని కూడా తాగించడం వలన వేగంగా ప్లేట్లెట్స్ సంఖ్య పెరిగి రోగి ప్రాణాయాపాయ స్థితి నుంచి బయటపడతాడు.


 

    ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

గమనిక  ~ 


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

అభిజ్ఞానశాకుంతలమ్

 🙏అభిజ్ఞానశాకుంతలమ్ నామౌచిత్యం 🙏

                  మొదటి భాగం 

( అందరు చదవడానికి వీలుగా కొన్ని భాగాలుగా అందిస్తాను. . )


సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ట స్థానం ఉంది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతంహి సాహిత్యం’ అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. నాటకం, బాణ, ప్రకరణ, ప్రహసన, డిమ, వ్యాయోగ, సమవాకార, వీథి, అంక, ఈహామృగ వంటి దశ రూపకాలలో నాటకం ఉత్తమమైనది.

.అభిజ్ఞానశాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. వసంత ఋతు వర్ణన చేయబడింది.శాకుంతలము ఒక గొప్ప శృంగార రస భరిత నాటకము

అభిజ్ఞానశాకుంతలమ్ అనేది సంస్కృతం పేరు. తెలుగులో అభిజ్ఞానశాకుంతలము అవుతుంది. దీనిని ఒక్క పదంగానే వ్రాయాలి. విడదీసి రెండు పదాలుగా (అభిజ్ఞాన శాకుంతలము అని వ్రాయకూడదు).

కవికుల గురువు కాళిదాసు తన నాటకానికి శాకుంతలం అని పేరు పెట్టవచ్చు కదా అభిజ్ఞానశాకుంతలమ్ అని ఎందుకు పేరు పెట్టినారు 

అభి అంటే మొగ్గు చూపడం అని అర్థం 

అభిమానం అంటే మానం మీద మొగ్గు చూపడం

అభిజ్ఞానం అంటే జ్ఞానం మీద మొగ్గు చూపడం


శకుంతలకు సంబంధించిన ఈ నాటకానికి కీలకమైన అంశం అంగుళీయము (అంగులీయకము / అంగుళీయకము) రూపంలో ఉన్న గుర్తింపు ముద్ర ద్వారా మరచిపోయినది గుర్తుకురావడం.


దుష్యంతమహారాజు దుర్వాసుని శాపంతో మరచిపోయిన శకుంతలను అంగుళీయము ద్వారా గుర్తుతెచ్చుకుంటాడు. అంగుళీయము ద్వారా గుర్తింపబడి స్వీకరింపబడిన శకుంతలకు సంబంధించిన (శంకుంతల వృత్తాంతాన్ని వర్ణించే) నాటకం కాబట్టి అభిజ్ఞానశాకుంతలమ్ అని పేరు పెట్టబడినది.

శాకుంతలం అంటే శకుంతలకు సంబంధించినది.

ఇది పాణిని రచించిన అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణంలో "తస్యేదమ్"’ అనే సూత్రం ద్వారా ‘సంబంధించిన’ అనే అర్థాన్ని సూచించడానికి శ-మీద ఉన్న హ్రస్వ అకారమునకు దీర్ఘం వచ్చి శా .అయింది ఎలాగంటే, గంగ యొక్క పుత్రుడు గాంగేయుడు అయినట్లుగా.


‘జ్ఞాపకం’ అనే అర్థాన్నిసూచించే ‘జ్ఞా’ అనే ధాతువుకు ‘చెయ్యడం’ అనే అర్థంలో ‘అభి’ అనే ప్రత్యయం చేరి ‘అభిజ్ఞానం’ అనే పదం ఏర్పడింది. అభిజ్ఞాన ప్రధానమైన శకుంతల విషయకమైనది కథ కాబట్టి ‘అభిజ్ఞానశాకుంతలమ్’ అని పేరు పెట్టడం జరిగింది.

దేవలోకములో నర్తకి అయిన మేనక, విశ్వామిత్రుడు చేయుచున్న ఘోర తపస్సును భగ్నము చేయుటకు దేవేంద్రునిచే పంపబడి, ఆ కార్యము సాధించు క్రమములో విశ్వామిత్రుని వలన ఒక బాలికకు జన్మనిచ్చి, ఆ బాలికను అడవిలో వదలి దేవలోకమునకు వెడలిపోవును. ఆ బాలిక అడవిలోని ఆకులపై పడిన నీటి బిందువులను ఆహారముగా ఒక హంస ద్వారా గ్రహించి ప్రాణము నిలుపుకొనును. అటుపై, ఆ బాలికను మహర్షి కణ్వుడు మార్గమధ్యమున చూసి జాలితో పెంచుకొనుటకు తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి, ఆమెకు శకుంతల అని నామకరణము చేయును. శాకుంతలములచే కాపాడబడి, పెంచబడినది కావున శకుంతల అయినది

.

భరతుడి జననానికి సంబంధించిన కథ అత్యంత ప్రాచుర్యం పొందింది.నాటక లక్షణాలలో ఇతివృత్తం ప్రసిద్ధమైయుండాలి. మహాభారతంలోని కథ. ఈ ఇతివృత్తం వ్యాసుడు మహాభారతంలో వ్రాయగా, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలములో మరింత విపులీకరించి దృశ్య కావ్యంగా రచించారు.

దుర్వాస శాప వృత్తాంతం ఎందుకు కల్పించాడో అనకూడదు. ఆయన ఋషి కనుక.ఎందుకు ప్రవేశ పెట్టేడో అనాలి. దానికి కారణం తెలుసుకునే ముందు 

మహాభారతంలోని కథను పరిశీలించాలి. కథ పరిశీలిద్దాం. చూడండి 


 విశ్వామిత్రుడు మేనక వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారాలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుని రాజ్యానికి పంపుతాడు. మొదట శకుంతల తన భార్య కాదు భరతుడు తన కుమారుడు కాదు అని అన్న దుష్యంతుడు, ఆకాశవాణి పలుకులతో జరిగిన వృత్తంతం గుర్తు తెచ్చుకొని భరతుడిని కుమారుడిగా అంగీకరిస్తాడు.

మహాభారతంలోని ఆది పర్వము-చతుర్థాశ్వాసము

ఒక్కసారి పరిశీలిద్దాము.

కణ్వ మహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట 

అనఘుఁడు వంశకరు డై , పెనుపున నీ సుతుఁడు వాజపెయంబులు నూ

ఱొనరించు నని సరస్వతి, వినిచె మునులు వినఁగ నాకు వినువీది దెసన్. 


యీ నీ కొడుకు పుణ్యాత్ము ఢై వంశోద్దరకుడు అగునని, నూఱశ్వమేధాల్ని చేస్తాడనీ సరస్వతి మునుపు మునులందరూ వింటూండగా నాకు ఆకాశవాణి ద్వారా చెప్పినది.

గొప్ప గుణవంతుడు, కులాన్ని విస్తరించేవాడూ, బాలుడూ, ఉదారుడు, ధర్మప్రియుడు ఐన ఈ బాలుడిని ఆనాటి నీ సత్యవాక్యమును పాటించకుండా తప్పచూడటం , ఓ సారమతీ! నీకు చెల్లునా?

చ.

నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.


తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్ని గురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణన చేసి చెబుతుంది 

వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.

అన్ని తీర్థాలను సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో.

క్షత్త్రియు డైన విశ్వామిత్త్రునకు పవిత్రమైన మేనకకు పుట్టినదానను, అలాంటి దానిని - ఓ రాజా! అబద్ధమాడటానికి అంత ధర్మేతరనా? అని అంటపొడుస్తుంది.


అనిన శకుంతలపలుకులు అంగీకరించక దుష్యంతుం డిట్లనియెను 

ఏ నెట నీ వెటసుతుఁ డెట, యే నెన్నఁడుఁ దొల్లి చూచియెఱుఁగను నిన్నున్

మానిను లసత్యవచనలు, నా నిట్టు లసత్యభాషణం బుచితంబే. 


నే నెక్కడ? నీ వెక్కడ? సుతు డెక్కడ? నే నెప్పుడూ నిన్ను చూడనే లేదు. ఆడవారు అబద్ధాలాడేవారు అనేలా ఈ విధంగా నీ వబద్ధం చెప్పటం న్యాయమేనా?

క.

వనకన్యకయఁట నే నఁట; వనమున గాంధర్వమున వివాహంబఁట నం,

దనుఁ గనెనఁట మఱచితినఁట; వినఁగూడునె యిట్టి భంగి విపరీతోక్తుల్ --(పాఠాంతరము)


ఈవిడ వనకన్యక యట! నేనట వనంలో కలిసానట! గాంధర్వ వివాహం కూడా చేసుకొన్నానట!! కొడుకును కూడా కన్నానట! మఱచిపోయానట! ఇలాంటి విపరీతములైన మాటలు వినతగినవేనా?


పొడవుగా వయసులో ఉండి బలవంతు డైన వానిని నీ కొడుకని వ్యత్యాసముగ యిందరూ నవ్వేట్లుగా చూపించటానికి తీసుకువచ్చావా?


ఇటువంటి లోకవిరుద్ధమైన పలుకులకు మేమెలా అంగీకరిస్తాం. అందుచేత యుక్తంకాని పలుకులు పలుకక నీ ఆశ్రమమునకు పొమ్మనిన శకుంతల అత్యంత దుఃఖితయై

తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ

బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ

నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి

కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున. 


పుట్టినప్పుడే తల్లి చేతను తండ్రి చేతను విడిచిపెట్ట బడ్డాను. ఇప్పుడు భర్త చేతను కూడా విడిచిపెట్ట బడ్డానుకదా ఇంక వేయి మాటలనుకోనేల యీపాటి నోములే తొల్లిటి జన్మలో నోచుకొన్నానేమో లేకపొతే ఇలా గెందుకవుతుంది అంటూ ఆ మహా సాధ్వి హృదయంలో తల్లడిల్లిపోయింది.

ఈ మధ్యాక్కర పద్యాన్ని చదువుతున్నా వ్రాస్తున్నా కండ్లనుంచి ధారాపాతంగా ఆగకుండా కన్నీళ్ళు కారుతూనే ఉంటున్నాయి. ఆడకూతురికి ఎంత రాకూడని కష్టం. ఈ ఘట్టాన్ని ఇంత బాగా వ్రాసిన నన్నయ్య గారికి శత సహస్ర కోటి వందనాలందించకుండా వుండలేము కదా. నన్నయ్యగారు స్త్రీ మనస్సును ఆవాహన చేసుకొన్నవారై ఆమె దుఃఖాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. ఇటువంచి రమ్యాతి రమ్యమైన కథలకోసం మనందరం భారతాన్ని పఠించాలి.

వ.

ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁ దొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు నింక దైవంబ కాని యొండు శరణంబు లే దని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱి పోవ నున్న యవసరంబున. 

చ.

గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే

కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స

ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా

వినిచె ధరాధినాధునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్. 

ఆకాశవాణి భరతుడు శకుంతలకూ దుష్యంతునకు కలిగిన సంతానమని శకుంతల మహా సాధ్వి అని సభాసదులందరూ వినుచుండగా పలికి కథకు ముగింపును పలుకుతుంది. ఇది భారతములోని కథ. దీనిని యథాతథముగా నాటకంగా వ్రాస్తే నాటక లక్షణాలకు విరుద్ధం.నాయకుడు అసత్యవాది అవుతాడు. సత్యమునే నాయకుడు పలకాలి.

                        సశేషం

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

తెలుసా

 *ఇది మీకు తెలుసా ..🤔😡😳*


బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు!


ఫ్రాన్స్‌లో 109 మంది వీఐపీలు ఉన్నారు!


జపాన్‌లో 125 మంది వీఐపీలు ఉన్నారు!


జర్మనీలో 142 మంది వీఐపీ లు ఉన్నారు!


USAలో  252!


రష్యాలో  312!


*చైనాలో మొత్తం వీఐపీల సంఖ్య 435!


**భారతదేశంలో మొత్తం VIP ల సంఖ్య 1,79,092!*


*భారత ప్రభుత్వం వీరందరికీ 4 చొప్పున సెక్యూరిటీ గార్డ్స్ మరియు గన్ మెన్స్ ను ఫ్లైట్ బిల్లులను, విదేశీ ప్రయాణం, జల్సాల కోసం వెకేషన్, ఉచిత రవాణా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత ఫోన్, ఉచిత గ్యాస్, అధికార నివాసానికి ఒక క్వార్టర్ మరియు ఆఫీస్ నిర్వాహణకు ఒక క్వార్టర్ PS ఒక్కరు, PA ఒక్కరు, OSD ఒక్కరు, COOK ఒక్కరు, ఇద్దరు అటెండర్స్,  క్యాంటీన్లలో రాయితీతో కూడిన అధిక నాణ్యత గల ఆహారం కోసం ప్రభుత్వం చెల్లించే బిల్లులను ఊహించుకోండి! ఈ సొమ్ము అంతా ఎవరిది? ఎవరి సొమ్మును ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు?*


*ఈ సంఖ్యను దేశంలోని 29 రాష్ట్రాలలో కలిపి 290 కంటే తక్కువకు తగ్గించడం అత్యవసరం మరియు ఇది మన దేశానికి ఉత్తమమైన సంస్కరణ!*


*ఈ దేశంలోని సామాన్య ప్రజల కోసం ఖర్చు చేయవలసిన విలువైన జాతీయ వనరులను వృథా చేస్తున్న రాజకీయ నాయకుల నైజాన్ని ఎండగట్టండి!*


ఈ హాస్యాస్పదమైన అసంబద్ధతకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని రూపొందించడానికి షేర్ చేయండి!


*ఈ వాస్తవాన్ని వ్యాప్తి చేసి మీ నైతిక బాధ్యతను నిర్వర్తించలేరా?*

Copied

యద్దనపూడి

 1991 April 5న ‘స్వాతి’ వీక్లీ వాళ్ళు ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. అందులో ఒక ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెప్పారావిడ. గొప్ప ఫిలాసఫీ కనిపించింది ఆ జవాబులో 👏👏🙏🙏 🙏


👉 ఎంతో జీవితాన్ని చూసిన మీరు, రచయిత్రిగా, ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా, తోటివారికి మీ అనుభవం నుంచి ఇచ్చే సలహా ఏమిటి?


యద్దనపూడి :


————————


ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి! మనిషికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం! వంద సంవత్సరాల వెనక మనం లేం! వంద సంవత్సరాల ముందు వుండం. యోగ నిద్రలో క్షణంలో వెయ్యో వంతు, కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడటానికి మనకి దక్కిన ఈ అపురూపమై న అవకాశాన్ని, ఈర్ష్యాసూయలతో, వ్యర్థ పంతాలతో చేయి జార్చుకోవద్దు!


ప్రతిరోజూ ప్రతి నిముషం, ప్రతి సెకనూ, మన చేతిలోంచి జారిపోయి ఇక తిరిగిరాదు. మనది అనుకున్న మన ఈ శరీరం కూడా మనది కాదు!


మన తాత ముత్తాతల రక్తంతో మనకి ఈ శరీరం వచ్చింది. ఈ జీవనధారని మన పిల్లలకి అందించి మనం వెళ్లిపోవాల్సినవాళ్ళం. మనకెందుకు ఈ కొట్లాటలు! మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు!


వాటిని వదిలేసి, మనం సుఖంగా బ్రతకటానికి ప్రయత్నంచేసి, ఎదుటివారిని సుఖంగా బ్రతకనిద్దాం. మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం “జీవిస్తున్నాం” అనే స్పృహతో, ఆనందంగా బ్రతుకుదాం!


మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్ లో కూర్చున్న ప్రయాణీకులం. ఎవరి రైలు వస్తే వారు వెళ్ళిపోతాం. ఈ కుర్చీలు, బెంచీలు, కర్టెన్లు మనవి కావు అని తెలుసుకుంటే నిజంగా ఆనందంగా బ్రతకగలుగుతాం! ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సినవాళ్లకి, ఈ ప్రపంచంతో ఎందుకు గొడవ!


మనశ్శాంతిగా, వున్నంతలో బ్రతకటమే ధ్యేయం చేసుకుంటే మీకు, మీ ఇంట్లోవారికి, మీ పక్కింటి వారికీ, మీ సాటి సంఘంలో అందరికీ సుఖశాంతులు, సంతోషం లభిస్తాయి.


YaddanapudiSulochana Rani


Collection stories... సేకరణ

తెలుగు మన భాష

 తెలుగు మన భాష

తెలుగు మన సంస్కృతి

తెలుగు మన గుర్తింపు

తెలుగు మన అస్తిత్వం


ఇట్టి తెలుగు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటుంది. పాఠశాలల నుండి తెలుగు మాధ్యమం తరిమివేయ బడింది. కార్పరేట్ కళాశాలల ప్రభావం వలన ఇంటర్మీడియట్ లో తెలుగుకు బదులు మార్కుల కొరకు సంస్కృతం వచ్చి చేరింది. డిగ్రీ కళాశాలలో కూడా అదే పరిస్థితి. కొన్ని కళాశాలల్లో మాత్రమే తెలుగు అంశం బోధించబడుతుంది.


ఇక యువకులు చాలా వరకు తెలుగు వార్తాపత్రిక కూడా చదవలేని పరిస్థితి, వ్రాయడం ఇంకా కష్టమైన అంశం. తెలుగు మాట్లాడ గలుగుతారు. అదీ ఎన్నో ఉచ్ఛారణ దోషాలతో. ఇక పద్యమైతే మరచిపోవాలి. ఇప్పుడు యువత పరిస్థితి ఏమిటంటే తెలుగును ఆంగ్ల అక్షరాలలో వ్రాసుకొని చదువుకుంటారు. సినిమా పాటలు లిరిక్ ఎడిషన్ ఆంగ్ల అక్షరాలతో వస్తుంది గమనించండి. ఈ పరిస్థితులలో ఒక రెండు తరాల తరువాత తెలుగు అక్షరం కనుమరుగై పోతుందని భయంగా వుంది. 


ఈ పరిస్థితి ఎదుర్కొని తెలుగును ఫరిడవిల్లేలా చూసే బాధ్యత మనందరిపై ఎంతైనా ఉంది. అందరు కలిసి తెలుగు భాషకై ప్రజలను చైతన్య పరచి కృషి చేయడం ఎంతైనా అవసరం.

భోజనం, టిఫిన్స్ అందజేస్తాం.

 దూరప్రాంతాలు ప్రయాణం చేసే ప్రయాణికులకు కూడ భోజనం, టిఫిన్స్ అందజేస్తాం.

మీరు చేయవలసిందల్ల ఒక రోజు ముందు తప్పక తెలియ చేయండి

విజయవాడ: 9346021045

సికింద్రాబాద్: 9346747694

వరంగల్: 9703100005

రాజమండ్రీ: 6304049434

ఒరిస్సా: 7008179751

విజయనగరం: 7675883368

అనంతపూర్: 8374392377

రేణిగుంట: 9441218771

వైజాగ్: 8008390978

గుంటూరు: 6300070049

షిరిడి: 9511111585

తిరుపతి; 9949189087

వారణాసి: 8985667737

బెంగుళూరు 9448605879

కర్నూల్ 9885777077

నాగపూర్: 9403302715

వారణాసి: 7318366814

Housur( తమిళనాడు)

Mallur (కర్ణాటక) బోర్డర్

9944799931

మాఘ మాసంలోనే శివరాత్రి

 మాఘ మాసంలోనే శివరాత్రి ఎందుకు చేసుకోవాలి.?


🌷🕉🌷


అమవాస్య ముందురోజైన కృష్ణపక్ష చతుర్దశి అంటేనే శివునికి మాహా ప్రీతికరమైన రోజు. అందుకే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాసశివరాత్రి అని పిలుచుకుంటారు. ఆ రోజున శివుని భక్తితో కొలుచుకుంటారు. ఏడాది పొడవునా వచ్చే శివరాత్రులలో మాఘమాసంలో వచ్చేది మహిమాన్వితమైనది కాబట్టి, దీన్ని మహాశివరాత్రి అంటూ ఓ పెద్ద పండుగలా భావిస్తారు. పండుగ అన్న మాట వినగానే మనకు పిండివంటనే గుర్తుకువస్తాయి. కానీ శివరాత్రి మాత్రం శరీరానికి కాదు, మనసుకే పండుగ! ఉపవాసజాగరణలతో శివసాయుజ్యానికై తపించే వేడుక! అలాంటి శివరాత్రితో ముడిపడి ఉన్న కొన్ని అంశాలు... వాటి వెనుక ఉన్న విశేషాలు...


చతుర్దశి విశేషం!


పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంటాం. ఈ తిథులలో ఒకో రోజూ గడిచేకొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. అందుకే ఆయనను క్షీణ చంద్రుడు అని కూడా పిలుస్తారు. జ్యోతిషశాస్త్ర ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. అమావాస్య నాటికి, ఆయన మనసుని నిస్తేజంగా మార్చేస్తాడని ఒక నమ్మకం. తద్వారా మనుషుల ఆలోచనా తీరు, వారిలోని ఉత్సాహం మందగిస్తాయట. ఇలాంటి సమయంలో భగవంతుని మీద మనసుని లగ్నం చేయడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి- నిస్తేజంగా ఉన్న మనసు భగవన్నామంతో ఉత్తేజితం అవుతుంది. రెండు- ఎటువంటి కష్టం వచ్చినా, వాటిని ఆ భగవంతుని మీద భారం వేసే నమ్మకం కలుగుతుంది. మర్నాడు నిస్సత్తువగా గడవాల్సిన అమావాస్య కూడా ఉత్సాహంగా సాగిపోతుంది.


మాఘ శివరాత్రే ఎందుకు!


శివరాత్రినాటికి చలి, శివశివా అని వెళ్లిపోతుందంటారు పెద్దలు. రథసప్తమినాటికి మొదలయ్యే సూర్యకిరణాల తీక్షణత మరుసటి వారంనాటి శివరాత్రికి వేడినందుకుంటాయి. అంటే శివరాత్రినాటికి చలి, వేడి ఒకేస్థాయిలో ఉంటాయన్నమాట. ఎండాకాలం ఉపవాసం ఉండటం కష్టం. చలికాలం జాగరణ చేయడం కష్టం. ఈ రెండూ ఇష్టంగా చేసేందుకు వాతావరణం కూడా కాస్తా అనుకూలించాలి కదా! అలాంటి సమశీతోష్ణ స్థితి ఉండేది మహాశివరాత్రినాడే!


 


ఉపవాసం, జాగరణ


శరీరానికి ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తున్నంతసేపూ అది సుఖంగా ఉంటుంది. సుఖపడే శరీరం మనసుని కూడా జోకొడుతుంది. కానీ ఒక్కరోజున కనుక శరీరాన్ని ఎండపెడితే, నేనంటూ ఒకదాన్ని ఉన్నానంటూ అది మనకి గుర్తుచేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటూ మనసు విచారణ సాగిస్తుంది. ఉపవాసజాగరణలతో శరీరం, మనసు రెండూ మెలకువతో ఉంటాయి. మనసావాచా శివుని ధ్యానించేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది!


బిల్వ పత్రం


శివరాత్రినాడు శివుని బిల్వపత్రంతో పూజించాలని చెబుతారు. మూడుకొసలుగా చీలి, చూడగానే త్రినేత్రుని గుర్తుకుతెచ్చే బిల్వం (మారేడు) మన దేశంలోనే పుట్టిన ఒక ఔషధి వృక్షం. బిల్వవృక్షం ఎదిగేందుకు ఎలాంటి ప్రత్యేక వాతావరణం అవసరం లేదు. కోసిన తరువాత కూడా సుదీర్ఘకాలం నిల్వ ఉండే ఈ దళాలు, ఆరోగ్యపరంగా దివ్యౌషధాలు. అందుకే బిల్వ పత్రానికి ‘మృత్యు వంచనము’ అన్న పేరు కూడా ఉంది. సుదీర్ఘకాలంపాటు శివలింగం చెంతనే ఉన్నా ఈ పత్రాలు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయే కానీ, గాలిని కలుషితం గావించవు. మరి శివుని బిల్వ పత్రాలతో కాకుండా మరే పత్రాలతో పూజించగలం!


అభిషేకం


విగ్రహాన్ని స్పర్శించడం ద్వారా భగవంతుని పూజించుకునే గొప్ప మార్గం... అభిషేకం! అందునా శివుని అభిషేక ప్రియుడు అంటారు. పళ్లు, పూలు ఏవీ దొరక్కపోయినా కాసిని బిల్వపత్రాలతో పూజించి, లింగానికి అభిషేకం చేస్తే తృప్తి పడిపోతాడు భోళాశంకరుడు. శివలింగం గుడిలో ఉంటే నిరంతరం పైనున్న ధారాపాత్ర నుంచి నీటి ధార పడుతూ ఉండాల్సిందే! అభిషేకం అంటేనే ప్రక్షాళన చేయడం అన్న అర్థం వస్తుంది. శరీరాన్ని ఎలాగైతే నీటితో శుద్ధి చేసుకుంటామో, మనసుకి అంటిన మలినాన్ని తొలగించేందుకు సూచనగా సాగే ఆచారమే అభిషేకం.

                  అరుణాచలశివ 🌹


ఓం నమః శివాయ🙏


🌷🕉

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్

తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః(37)


సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి(38)


అర్జునా... ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో యుద్ధానికి నడుం బిగించు. సుఖదుఃఖాలూ, లాభనష్టాలూ, జయాపజయాలూ సమానంగా భావించి సమరం సాగించు. అప్పుడు నీకు పాపం కలగదు.

మాఘ పురాణం - 27

 _*మాఘ పురాణం - 27 వ అధ్యాయము*_


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🙏ఓం నమో భగవతే నారాయణాయ*


*సులక్షణ మహారాజు కథ*

*🌅🛕📚TVBC📚🛕🌅*

**************************

🕉️📚🕉️📚🕉️📚🕉️📚

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారమను అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.


నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును , పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి , కృతఘ్నునకు , వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో ? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను , అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా ! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు , సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రధసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులు ఓక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను , రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి , తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్బపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియకపడియుండెను. గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*⛳🛕ॐ•TVBC•卐🛕⛳*

•••••••••••••••••••••••••••••

*🪀📖courtesy by📲🙏*.

*🛕卐ॐ•TVBC•ॐ卐🪔*•••••••••••••••••••••••••••

http://www.youtube.com/c/TVBCTelanganavenkateshwaraBhakthichannel

🕉️📚📚📚📚🕉️


అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి యెండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే  సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి , అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానను లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు , వనమున , జలమున , గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.


అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకా వనమున యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము , నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు , మృగములు , పక్షులు అచటికి వచ్చినవి , బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా ! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా , బాలుడు పశుపక్ష్యాదులు  విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము , కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య , ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల , అట్లు వచ్చిన పక్షులు , మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ రెక్కలతో నీడను కల్పించినవి , తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె , ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు , పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను  మాన్పించి తమ యుపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదౌలో నుండుట , తులసిని జూచుట , తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని , యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి కృష్ణ , గోవింద ,  అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు , ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.


*🌳రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము🌳*


సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి , తండ్రి , తాత , సోదరుడు యిట్టి బంధువుల నెరుగడు. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.


మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి బాలకా ! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము , పుత్రపౌత్ర సమృద్ధిని , సంపదలను , భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను , సర్వసమృద్దులను , సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగ అంతర్దానమందెను. సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.


సులక్షణ మహారాజు ఆశ్చర్యమును , ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పెరిడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి , తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను , పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను , మనుమలతోను , భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


జహ్నుమునీ ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.

*-❀꧁❀-TVBC❀-꧂❀-*


🟨🟥🟨🟥🟨🟥🟨🟥

*🙏స్వస్తి 🙏*

📚🕉️📚🕉️📚🕉️

*FOR MORE DAILY "DEVOTIONAL UPDATES"  & SPIRITUAL INFORMATION 📖 WATCH 🪀 AND SUBSCRIBE TO TVBC ON YOUTUBE.🤳*

🟨🟥🟨🟥🟨🟥🟨🟥

పన్నియూర్ శ్రీ వరాహమూర్తి ఆలయం

 🕉 మన గుడి : నెం 1030


⚜ కేరళ : పట్టాoభి - పాలక్కాడ్


⚜ పన్నియూర్ శ్రీ వరాహమూర్తి ఆలయం



💠 శ్రీ విష్ణువు యొక్క ' వరాహ ' అవతారాన్ని పూజించే దేవాలయాలు కేరళలో చాలా తక్కువ . 

ఈ ఆలయంలో శ్రీ శివుడు ('వడకోవిల్'), శ్రీ అయ్యప్ప , శ్రీ దుర్గాభగవతి , 

శ్రీ గణపతి , శ్రీ సుబ్రమణ్య మరియు 

శ్రీ లక్ష్మీ నారాయణుడు వంటి ఉపదేవతలను కూడా ఆరాధిస్తారు . 

ఈ ఆలయానికి చిత్రగుప్తుడు మరియు యక్షి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతారు . 


 💠 పన్నీర్ శ్రీ వరాహమూర్తి ఆలయం భారతదేశంలోని కేరళలోని పాలక్కాడ్ జిల్లా, పట్టంబి తాలూకాలోని కుంబిడి వద్ద ఉన్న పురాతన హిందూ దేవాలయ సముదాయం.  

ఈ ఆలయం దాదాపు 4000 సంవత్సరాల క్రితం పరశురామునిచే ప్రతిష్టించబడిన కేరళలో మొట్టమొదటి ఆలయంగా నమ్ముతారు.  


💠 ఈ ఆలయంలో హిరణ్యాక్షుడిని చంపిన తర్వాత భూదేవితో ఉన్న విష్ణువు యొక్క మూడవ అవతారం అయిన వరాహమూర్తి ఉన్నాడు.


💠 పూర్వం 800 (బ్రాహ్మణుల కుటుంబాలు కేరళను పాలించినప్పుడు) సుమారుగా 1300 సంవత్సరాల పాటు కేరళలోని ప్రఖ్యాత గ్రామమైన పన్నియూర్‌ను పరిపాలించిన దేవుడైన శ్రీ వరాహ మూర్తిని పూజించారని కూడా చెబుతారు.


 🔆 ఆలయ చరిత్ర 

 


💠 క్షత్రియులపై విజయం సాధించిన తరువాత, పరశురాముడు తాను గెలిచినదంతా కశ్యపునికి దానం చేశాడు.  

అతను తన ధ్యానాన్ని కొనసాగించడానికి ఒక భూమిని కోరుకున్నాడు మరియు దాని కోసం అతను సముద్రం నుండి ఒక చిన్న భాగాన్ని బయటకు తీశాడు.  

ఈ చిన్న చిన్న భూభాగమే ఇప్పుడు కేరళగా ఉందని చరిత్ర చెబుతోంది. 


💠 పరశురాముని భూభాగం పెరగడం మరియు విస్తరించడం ప్రారంభించింది. కలవరపడిన పరశురాముడు నారదుని సహాయం కోరాడు.  

విష్ణువును ప్రార్థించమని నారదుడు అతనికి సలహా ఇచ్చాడు.  

కాబట్టి పరశురాముడు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తన ధ్యానాన్ని ప్రారంభించాడు.  


💠 విష్ణువు అతని ముందు ప్రత్యక్షమై, "ఒకసారి నేను ప్రపంచాన్ని రక్షించడానికి వరాహమూర్తిగా అవతరించాను. 

నా రూపాన్ని ఆరాధించండి మరియు ఈ ప్రదేశంలో 'త్రిమూర్తి' అనుగ్రహం లభిస్తుంది" అని చెప్పాడు.


💠 విష్ణువు సలహాను అనుసరించి, పరశురాముడు తన భూభాగం మధ్యలో శ్రీ వరాహమూర్తిని స్థాపించాడు మరియు దానిని ఉంచడానికి ఒక ఆలయాన్ని నిర్మించాడు.  

అతను అక్కడ అన్ని పూజా కార్యక్రమాలను సక్రమంగా ప్రారంభించాడు. 

 ఆ దివ్య దేవాలయమే నేటి పన్నియూర్ మహాక్షేత్రం.


💠 మహాపండిత్ అప్పత్ అదీరి 600 సంవత్సరాల క్రితం రాగి ముక్కలపై తన ఆత్మకథను వ్రాసాడు, అందులో అతను భవిష్యత్తు కోసం తన అంచనాలను రూపొందించాడు.  

ఈ ముక్కలు ఇటీవల కనుగొనబడ్డాయి మరియు గ్రంథాలు మలయాళంలోకి అనువదించబడ్డాయి.  

పన్నియూర్ మహాక్షేత్రం కోల్పోయిన వైభవాన్ని మరియు కీర్తిని ఖచ్చితంగా తిరిగి పొందుతుందని మహాపుండిత్ అంచనా వేశారు.  

అతను తన రచనలలో సూచించిన సమయం ఇప్పుడు పండింది.  


💠 శుభదినం వచ్చినప్పుడు, శ్రీ వరాహమూర్తిని విశ్వసించే ప్రతి ఒక్కరికీ 'అభీష్ట కార్య సిద్ధి' (అనగా తాను ప్రార్థించిన ప్రతి విషయం యొక్క సాక్షాత్కారం) దీవించబడుతుందని అతను ముందే చెప్పాడు.  

ఆపదలో ఉన్నప్పుడు 'వరాహమూర్తి రక్షకణే' (నన్ను రక్షించు, వరాహమూర్తి) అనే పదాన్ని మూడుసార్లు ఉచ్ఛరిస్తే,

 శ్రీ వరాహమూర్తి రాబోయే అన్ని ఆపదల నుండి రక్షిస్తాడని భక్తుల నమ్మకం.


🔅 దేవప్రశ్నంగల్ 


💠 1983 నుండి ఇక్కడ జరుగుతున్న 'దేవప్రశ్నంగల్' లో ఈ ఆలయం గురువాయూర్ మరియు శబరిమల వంటి గొప్ప దేవాలయాలతో సమానంగా ప్రతిష్ట మరియు ప్రాముఖ్యతను పెంచుతుందని సూచిస్తుంది.  

ప్రతి ఒక్కరినీ అనుగ్రహించడానికి శ్రీ వరాహమూర్తి ఈ ఆలయంలో ఉన్నటు స్పష్టమవుతుంది. 


💠 శ్రీ వరాహమూర్తి యొక్క ఆశీర్వాదం మరియు మహిమాన్వితమైన ఉనికిని అనుభవించినట్లు చాలా మంది భక్తులు పేర్కొన్నారు.  

శ్రీ వరాహమూర్తి భక్తులందరికీ 'అభీష్ట కార్య సిద్ధి' అనుగ్రహించబడుతుందని చెప్పబడింది.  

దీంతో శ్రీ వరాహమూర్తి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.


💠 ఇక్కడ నిర్వహించబడే వివిధ పూజలలో అత్యంత ముఖ్యమైనది 'అభీష్ట సిద్ధి పూజ'.  

ఈ పూజ ఖర్చు రూ.101/- మరియు 'అభీష్ట కార్య సిద్ధి'కి మార్గం సుగమం చేస్తుందని నమ్ముతారు.


💠 శ్రీ వరాహమూర్తి అనుగ్రహం పొందడానికి 'సంధ్య దీపారాధన' అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది.  

గంధపు చెక్కతో కప్పబడి, మెరిసే ఆభరణాలతో అలంకరించబడిన శ్రీ వరాహమూర్తి యొక్క దివ్య రూపం ప్రతి మనస్సును ఆలింగనం చేసుకోవడానికి మరియు సాంత్వన పొందేలా ఉంది.


💠 ఎలా చేరుకోవాలి ? 

సమీప రైల్వే స్టేషన్ కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుట్టిప్పురం వద్ద ఉంది.

 ప్రసిద్ధ గురువాయూర్ దేవాలయం కేవలం 33 కి.మీ దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

14-01-గీతా మకరందము

 14-01-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


శ్రీ భగవద్గీత 

అథ చతుర్దశోఽధ్యాయః 

పదునాల్గవ అధ్యాయము 

గుణత్రయ విభాగయోగః

గుణత్రయ విభాగయోగము 

 

శ్రీ భగవానువాచ :-

పరం భూయః ప్రవక్ష్యామి 

జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ | 

యజ్జ్ఞాత్వా మునయస్సర్వే 

పరాం సిద్ధిమితో గతాః || 

 

తాత్పర్యము:- శ్రీ భగవంతుడు చెప్పెను - (ఓ అర్జునా!) దేనిని తెలిసికొని మునులందఱును ఈ సంసారబంధమునుండి (విడివడి) సర్వోత్తమమగు మోక్షసిద్ధినిబడసిరో అట్టి పరమాత్మవిషయకమైనదియు, జ్ఞానములలోకెల్ల నుత్తమమైనదియునగు జ్ఞానమును మఱల చెప్పుచున్నాను.


వ్యాఖ్య:- ‘భూయః’ -  ‘క్రిందటి అధ్యాయమున చెప్పబడిన అఖండ జ్ఞానమును మఱల చెప్పుచున్నాను వినుము’ - అని పలుకుటచే భగవానునకు భక్తుల యెడల యెంత కరుణగలదో, వారిని తరింపజేయవలెనను కుతూహలమెంతకలదో విశదమగుచున్నది. ఉత్తముడగు గురువు విశ్వాసపాత్రుడగు శిష్యునకు మనస్సునకెక్కుటకై ఒకే బోధను మఱల మఱల చెప్పుచుండును.


 "వక్ష్యామి" అని చెప్పక "ప్రవక్ష్యామి” (లెస్సగా వచించుచున్నాను) అని చెప్పుటవలన ఈ అధ్యాయమందు తెలుపబడిన విషయములు భగవంతునిదృష్టిలో ఎంత ముఖ్యమైనవో యోచించుకొనవచ్చును.

‘జ్ఞానానాం జ్ఞానముత్తమమ్’ - ప్రపంచములో అనేక జ్ఞానములు (భౌతిక జ్ఞానము, సంగీతజ్ఞానము, శిల్పజ్ఞానము, గణితజ్ఞానము మున్నగునవి) ఉన్నను, వానియన్నింటిలోను భగవానునిదృష్టిలో ఆధ్యాత్మికజ్ఞానమే సర్వశ్రేష్ఠమైనదని ఈ వాక్యముద్వారా, మఱియు ‘పరమ్’ అను పదముద్వారా స్పష్టమగుచున్నది.

‘యజ్జ్ఞాత్వా మునయః సర్వే’ - ఈ జ్ఞానమును తెలిసికొని పూర్వము మునులందఱును బంధవిముక్తులైరని ఇట తెలుపబడినది. ఔషధముయొక్క శ్రేష్ఠత్వము రోగులపై అది కలుగజేయు ఫలితముమీద ఆధారపడియుండును. దేని సేవనముచే రోగము శమించునో ఆ ఔషధము చాల గొప్పదని అర్థము. అట్లే పూర్వము మునులందఱును ఈ జ్ఞానమును సేవించుటవలన బంధరహితులై శాశ్వత మోక్షపదము నొందిరని యిట తెలుపుటచే ఆ జ్ఞానముయొక్క మహిమ వెల్లడియగుచున్నది. ప్రత్యక్షఫలితమును జూపుటద్వారా భగవానుడు జనులకు జ్ఞానముపై పరమ విశ్వాసమును కలుగజేయుచున్నారు. ‘సర్వే’ అని చెప్పుటచే ఈ జ్ఞానము నెఱింగినవారిలో ఒకరు కూడ ముక్తినిబడయక నుండలేదనియు అందఱును తరించిపోయిరనియు తెలియుచున్నది. అయితే ‘మునయః’ = (మననశీలురు) అని పేర్కొనుటవలన, వారందఱును తత్త్వమును బాగుగ మననముచేసియే తరించిరిగాని, వాచాజ్ఞానముచే గాదని స్పష్టమగుచున్నది.

‘పరాం సిద్ధిమ్’ - మోక్షస్థితి అన్నిటికంటెను గొప్పపదవి - అని చెప్పబడుటచే, చిన్నచిన్న ప్రాపంచికపదవులను, గతులను గొప్పగ తలంచి మురిసిపోక వానికంటె ఎన్నియోరెట్లు ఆనందకరమైనట్టి పరమాత్మపదమును జ్ఞానసముపార్జనముద్వారా పొంది ధన్యులు కావలయును.


ప్రశ్న:- భగవానుడు చెప్పబోవు జ్ఞానమెట్టిది?

ఉత్తరము:- (1) జ్ఞానములన్నిటిలోను ఉత్తమమైనది (2) దాని నెఱుంగుటవలన మునులందఱును మోక్షస్థితిని బడసిరి.

ప్రశ్న:- మోక్షస్థితి యెట్టిది?

ఉత్తరము:- ప్రపంచములో అన్నిపదములకంటెను సర్వోత్తమమైనది.

తిరుమల సర్వస్వం -159*

 *తిరుమల సర్వస్వం -159*

*స్వామి పుష్కరిణి -6*



 *పరీక్షిన్మహారాజు* 


 ద్వాపరయుగంలో ఒకానొకప్పుడు అర్జునుని మనుమడు అభిమన్యుని పుత్రుడు అయిన పరీక్షిత్తు మహారాజు సుదీర్ఘ సమయం పాటు వేటాడడంతో అలసిపోయి, పరివారానికి దూరమై, దప్పికతో అలమటిస్తూ శమీకమహర్షి ఆశ్రమానికి సమీపించి త్రాగునీటికై అర్థిస్తాడు. ధ్యానమగ్నుడైన ఋషిపుంగవుడు క్షత్రియుని రాకను గమనించక పోవడంతో కోపోద్రిక్తుడైన మహారాజు యుక్తాయుక్త విచక్షణ మరచి, ఆ ఋష్యాశ్రమంలో చచ్చిపడియున్న సర్పాన్ని తన వింటికోపుతో తీసి, ఋషి మెడలో వేసి వెనుదిరుగుతాడు. ఈలోగా సమిధల కోసం వనానికేతెంచిన శమీకుని కుమారుడు 'శృంగి' ఆశ్రమానికి తిరిగి వచ్చి, తండ్రి కంఠము నందున్న మృతసర్పాన్ని గాంచి కృద్ధుడై, తండ్రిగారిని ఆ విధంగా అవమానించిన వాడు ఏడు దినాలలో 'తక్షకుడు' అనే విషసర్పపు కాటుతో మరణిస్తాడని శపిస్తాడు. ఈ వార్తను తెలుసుకున్న పరీక్షిత్తు పాముకాటును తప్పించుకోవడానికి మంత్రుల సలహా మేరకు ఒంటిస్తంభపు భవనంలో నివసిస్తూ, కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసుకొని, భాగవత శ్రవణంతో కాలం గడుపుతుంటాడు.


 ఇంతలో, 'కాశ్యపుడు' అని పిలువబడే మహిమాన్వితుడైన విప్రుడు, తన మంత్రశక్తితో పరీక్షిత్తు మహారాజును తక్షకుని విషం నుంచి రక్షించి, మహారాజు నుండి భూరి కానుకలను పొందే నిమిత్తం ఆఘమేఘాలపై ప్రయాణించి, సరిగ్గా ఏడవనాటి ఉదయానికి పరీక్షిత్తు మహారాజు నివసించే నగర శివార్లకు చేరుకుంటాడు. మునిపుత్రుని శాపాన్ననుసరించి, ఆరోజే పరీక్షిత్తు మృత్యువాత పడాల్సి ఉంది.


 సరిగ్గా అదే సమయానికి మహారాజును తన విషపు కోరలకు బలి కావించి, మునిపుత్రుని శాపాన్ని నిజం చేసే ఉద్దేశ్యంతో తక్షకుడు కూడా నగర పొలిమేరలకు చేరుకుని, కశ్యపునికి తారసపడతాడు. కశ్యపుని ద్వారా అతని అంతరార్ధాన్ని గ్రహించిన తక్షకుడు ఆ విప్రుని మహిమను పరీక్షింప గోరి, దగ్గరలోనున్న ఒక మహావృక్షాన్ని తన విషపు కోరలతో భస్మీపటలం గావించి, దానిని పునర్జీవింప జేయవలసిందిగా కశ్యపుని కోరుతాడు.

బూడిదకుప్పగా మారిన మహావృక్షాన్ని తన మంత్రశక్తితో తిరిగి బ్రతికించిన కశ్యపుని దివ్యశక్తికి అచ్చెరువొందిన తక్షకుడు, ఆ విప్రునితో, కశ్యపుడు నిస్సందేహంగా మహా మహిమాన్వితుడని, అయితే ఋషిపుత్రుని శాపం అనృతం కాకూడదని, అందువల్ల తాను ఇచ్చే అమూల్యమైన ధనరాశులను స్వీకరించి రాజు గారిని రక్షించే ప్రయత్నాన్ని విరమించుకొన వలసిందిగా ప్రార్థిస్తాడు. ధనాశకు లోనైన కశ్యపుడు తన మహిమతో పరీక్షిత్తు మహారాజు పూర్వాపరాలనెరిగి, అల్పాయుష్కుడైన మహారాజును రక్షించడం వ్యర్థమని తలచి, తక్షకుడు ఇచ్చిన విశేషమైన సంపదను స్వీకరించి, స్వస్థలానికి వెనుదిరుగుతాడు. తత్ఫలితంగా, ఆరోజు సాయం సమయంలో తక్షకుని కాటువల్ల పరీక్షిత్ మహారాజు మరణిస్తాడు.


 తదనంతరం, దురాశాపరుడై తన విద్యుక్తధర్మాన్ని విస్మరించి, మహారాజు మరణానికి కారకుడైన కశ్యపుని ఉదంతాన్ని ఆనోటా ఆనోటా విన్న రాజ్య పౌరులందరూ అతనిని అసహ్యించుకొని సభ్యసమాజం నుండి బహిష్కరిస్తారు. ఇలా అందరూ తనను వెలివేయడంతో, నడిమంత్రపు సిరిగా వచ్చిన ధనాన్ని ఏం చేసుకోవాలో తోచని కశ్యపుడు, 'శాక్యముని' తో తన గోడును వెల్లడించు కుంటాడు. తన దివ్యదృష్టి ద్వారా జరిగిన వృత్తాంతాన్నంతా తెలుసుకున్న మహర్షి ప్రజలందరికీ రాజు పితృతుల్యుడని, అటువంటి భూపాలుణ్ణి సర్వకాల సర్వావస్థలయందు రక్షించు కోవలసిన బాధ్యత పౌరులందరిపై ఉందని, అడియాసకు లోనై తన బాధ్యతను విస్మరించిన కశ్యపుడు ఘోరాపరాధానికి ఒడిగట్టాడని, ఆ పాపం కశ్యపుణ్ణి అనేక జన్మల పాటు పీడిస్తుందని శెలవిచ్చాడు. ఇంతటి మహాపరాధానికి ప్రాయశ్చిత్తం లేదని కూడా చెబుతాడు. అయితే, దారి-తెన్ను గానని కశ్యపుడు పరిపరివిధాల ప్రాధేయ పడడంతో, ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, కశ్యపుని పాపనివృత్తి చేయడానికి స్వామిపుష్కరిణి స్నానమొక్కటే మార్గమని తరుణోపాయం సూచిస్తాడు.


‌ పరమానంద భరితుడైన కశ్యపుడు ఇంకెంత మాత్రం ఉపేక్షించకుండా, హుటాహుటిన బయలుదేరి, తిరుమలక్షేత్రాన్ని చేరుకుని భక్తిప్రపత్తులతో స్నానమాచరిస్తాడు. తదనంతరం శ్రీవేంకటేశ్వరునికి ప్రణమిల్లి తనను పాపవిముక్తుణ్ణి చేయవలసిందిగా వేడుకొంటాడు.



‌ అలా స్వామిపుష్కరిణి మహిమతో పాపాన్ని పరిహరించుకొని, స్వస్థలానికి చేరుకున్న కశ్యపుణ్ణి, పురజనులందరూ జరిగినదంతా మరచి మునుపటి వలె ఆదరించి అక్కున జేర్చుకుంటారు. 

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*298 వ రోజు*


*అభిమన్యుడిని కపటోపాయముతో చంపమని ద్రోణుడు చెప్పుట*


అప్పుడు ద్రోణుడు కర్ణుని చూసి " కర్ణా ! నేను అర్జునుడికి కవచధారణ విద్య ఉపదేశించాను. దానిని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు. ఆ కవచ ధారణ విద్య వలన అతడి శరీరంపై ఎవరూ శరములు నాట లేరు. ఎదో వంచన చేసి అతడిని మనం చంపాలి. అభిమన్యుని చేతిలో విల్లు ఉన్నంతవరకు మనం అతడిని చంపలేము. యోధులంతా అతడిపై దాడి చేసి ఒకరు అతడి విల్లును త్రుంచాలి, వేరొకరు అతడి సారధిని చంపాలి, మరొకరు అతడి రథం విరుగ కొట్టాలి కాని ఇవన్నీ ఏక కాలంలో జరగాలి. నీకు చేతనైతే అభిమన్యుని ఈ కపటోపాయంతో చంపు " అన్నాడు. అది విని కర్ణుడు ఆలోచించి అక్కడి యోధులను కూడగట్టుకుని ఒక్కుమ్మడిగా అభిమన్యునిపై లంఘించాడు. కొంత మంది అతడి విల్లు విరిచారు, ద్రోణుడు అతడి రథాశ్వములను చంపాడు, కృపాచార్యుడు అతడి రథసారథిని చంపాడు, అభిమన్యుడు నిరాధయుడు విరధుడు అయ్యాడు. అదే తగిన సమయమనుకుని బాహ్లికుడు, శకుని, శల్యుడు,  అశ్వత్థామ, కృతవర్మ 

అతడి మీద బాణవర్షం కురిపించారు. అభిమన్యుడు ఖడ్గము డాలు తీసుకుని రథము మీద నుండి కిందకు దూకి గాలిలో గిరగిరా తిరుగుతూ కౌరవ యోధులను ఖండించాడు. అభిమన్యుడు ఎప్పుడు తన తల ఖండిస్తాడో అని యోధులంతా అక్కడి నుండి పారి పోయారు. ద్రోణుడు ఒక బల్లెము తీసుకుని అభిమన్యుడి ఖడ్గం విరిచాడు. కర్ణుడు అభిమన్యుని డాలు విరిచాడు. అప్పుడు అభిమన్యుడు రథములోని చక్రాయుధం తీసి దానిని గిరగిరా త్రిప్పుతూ శత్రు సేనలను చంపుతూ సింహనాదం చేసాడు. రక్తసిక్తమైన అతడి ముఖమును చూసిన శత్రు సేనలు భయభ్రాంతం అయ్యాయి. అభిమన్యుడు తన చక్రాయుధంతో శత్రువులు వేస్తున్న బాణములు ఖండిస్తూ శత్రుసంహారం చేస్తున్నాడు. ద్రోణుని వైపు దూసుకు పోతున్నాడు. అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని చీల్చి చెండ్డాడుతున్నాడు. ఆ సమయమున శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడుమొదలైన యోధులు ఒకటిగా కూడి అభిమన్యుని చక్రయుధం ఖండించారు. అప్పుడు అభిమన్యుడు తన గదను తీసుకుని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అభిమన్యుని దెబ్బకు భయపడి అశ్వత్థామ రథం నుండి దూకి రథం వెనక్కు పోయి దాక్కున్నాడు. అప్పుడు అభిమన్యుడు అశ్వత్థామ సారథిని, రథాశ్వలను చంపాడు. అభిమన్యుడు శకుని మీద లంఘించి అతడికి సాయంగా ఉన్న ఇరవై ఏడు మంది యోధులను గదాయుధంతో చంపాడు. గజములపై పది మంది యోధులు అభిమన్యుని ఎదుర్కొన్నారు అభిమన్యుడు వారిని గజములతో సహా యమపురికి పంపాడు. కేకయరాజులను ఏడుగురిని ఒక్క సారిగా యమపురికి పంపాడు. ఇంతలో దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యునిపై

అనేక శరములు గుప్పించాడు. అభిమన్యుడు అతడు వేసిన బాణములను గదాదండంతో అడ్డుకుని అతడి అశ్వములను, సారథిని చంపి అతడి రథమును విరుగకొట్టాడు. దుశ్శాసనుడి కుమారుడు గదాయుధంతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారిరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది. ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కార సాగింది. యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తున్నారు. అభిమనుడు దుశ్శాసన కుమారుడు గదలతో మోదుకుని కిందపడ్డారు. గాయపడిన వారి శరీరముల నుండి ప్రాణములు వేరయి స్వర్గలోకం చేరాయి. అప్పటికీ కసి తీరని కౌరవ యోధులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి చంపారు. సూర్యుడు అస్తమించాడు. పాండవుల కీర్తిని ఇనుమడింప చేస్తూ అభిమన్యుడు కౌరవయోధులతో అత్యంత పరాక్రమంతో పోరాడి వీరస్వర్గం అలంకరించాడు. ధృతరాష్ట్ర మహారాజా ! ఆ విధంగా యోధాను యోధుడైన అభిమన్యుడు రణరంగమున మరణించగానే కౌరవసేనల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఆ సమయాన అక్కడ చేరిన భూతగణాలు " అభిమన్యుని అమానుషంగా అధర్మ యుద్ధంలో అన్యాయంగా పలువురు కలిసి వధించారు " అని ఆక్రోశించాయి. అభిమన్యుడు మరణించగానే పాండవ సేనలు పారిపోయాయి. ఇదంతా దూరం నుండి చూస్తున్న ధర్మరాజు " మన అభిమన్య కుమారుడు దుర్భేద్యమైన వ్యూహంలో ప్రవేశించి హయములను, గజములను చంపి రధములను విరిచి, పదాతి దళమును తనుమాడి. అనేక సైనిక ప్రముఖులను చంపి ద్రోణుడు మొదలైన మహాయోధులను భయభ్రాంతులను చేసి వీరస్వర్గం అలంకరించాడు. అటువంటి మహాయూధుని మరణముకు చింతించ పని లేదు " అన్నాడు. అప్పటికే చీకట్లు కమ్మాయి. ఆ రోజుకు యుద్ధము మాని వారి వారి శిబిరాలకు వెళ్ళారు. కౌరవ సేనలో ఆనందోత్సాహాలు నిండగా పాండవ యోధుల్లో విషాద ఛాతలు కమ్ముకున్నాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


  శ్లో𝕝𝕝 *కలిః శయానో భవతి* *సంజిహానస్తుద్వాపర*

 *ఉత్తిష్ఠే త్రేతా భవతి* 

*కృతం సంపద్యతే చరన్*


తా𝕝𝕝  *నిద్రపోతుంటే కలియుగం, లేచి కూర్చుంటే ద్వాపర, లేచి నిలబడితే త్రేతా, లేచి తన లక్ష్యం వైపు అడుగులు వెయ్యడం సత్యయుగం*. *లక్ష్య ప్రాప్తి కొరకు అడుగులు వెయ్యాలి..... ముందుకు వెళ్ళాలి.....*


✍️💐🪷🌹🙏

మనసున ఒక భావనతో

 **2020*

*కం*

మనసున ఒక భావనతో

మనిషి కి ముందొండొక విధి మసలెడి జనులన్

కనుగొనగలవారలె సరి

మనుగడ సాగించగలరు మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనసులో ఒకభావన ఉంచుకుని మనిషి ముందు మరో విధంగా ప్రవర్తించే వారిని కనిపెట్ట గలిగే వారేఈ భూలోకంలో సరైన మనుగడ సాగించగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సోమవారం 24 ఫిబ్రవరి 2025🌷* _*మాఘ పురాణం - 26

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷సోమవారం 24 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 26 వ*_

       _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*పుణ్యక్షేత్రములలో నదీస్నానము*


☘☘☘☘☘☘☘☘☘


ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్టులవారు వివరించగా , ఆ రాజు *"మహర్షి ! మీ కృపవలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు గలదు , అది ఏమనగా , మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిం"* డని వినమ్రుడై కోరగా వశిష్టులవారు మరల యిట్లనిరి. దిలీప మహారాజా ! మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక , తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా మాఘమాసములో యే నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది. ఆవశ్యమైనది కూడా , అటులనే ప్రయాగ అతిముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన యేడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానముతో బాటు విష్ణు దేవాలయములు , మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.


ఇక త్రయంబకమను ముఖ్యమైన క్షేత్రం కలదు , ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జనించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుట కిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప జేసినాడు. కావున మాఘమాసములో గోదావరియందు స్నానము చేసిన యెడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే గాక , ఇహమందు , పరమందు కూడా సుఖపడుదురు , మన దేశములో యెన్నో నదులున్నవి , ప్రతి నదీతీరమున యెన్నో క్షేత్రములున్నవి , ఆ నదులలో మహానదులు , పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగావున్నవి. అటువంటి కొన్నిపేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము. నందిని , మందాకిని, నళిని , తామ్రవర్ణి , భీమరధి , గంగా , యమున , నేత్రావతి , పంపానది , కృష్ణవేణీ , మహేద్రతనయ , గోదావరి , నర్మదా మొదలైనవి మహానదులు. భగీరధి , గంగ , నర్మద , యమున , సరస్వతి , కృష్ణవేణీ , బాహుద , భీమరధి , తుంగభద్ర , రేణుక , మలావహరి , కావేరి, క్పతమాల , తామ్రపర్ణి , విశోక , కేశికి , గండకి , విచిత్రక , వశిష్ఠప్రవర , కాశ్యపి , సరయు , సర్వపాపహరి , కుశాపతి , పల్గుని కరతోయ , పుణ్యద , ప్రణిత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యము నందించునని , మహానదులు , పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ , యమున మొదలైన నదులు , మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేషఫలప్రదం , మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను , పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను , ఆ నదీతీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్దములగు ఉపనదులు కూడా కలసి తమతమ స్నేహసౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే *"వరం తప"* అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతి వృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము.


విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును , ఈశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి. ఈశ్వరునికి పంచరుద్రుదు , త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు ! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదుతలలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి , తాను నరికిన బ్రహ్మ తలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలోవున్న బ్రహ్మతల యెండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి *"భిక్షాందేహీ"* యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి , కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక , అతనికి *"పురుషత్వము నశించునుగాక"* అని శపించిరి. ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమయి పోయినాడు , అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి , ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ , విష్ణువులు , శివుని  వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటినుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.


*మాఘపురాణం ఇరవైఆరావ*  

  *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

సోమవారం🕉️* *🌹24, ఫిబ్రవరి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🕉️సోమవారం🕉️*

*🌹24, ఫిబ్రవరి, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*                


        *ఈనాటి పర్వం*

 *సర్వేషాం విజయైకాదశీ*

 

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః* *మాఘమాసం - కృష్ణపక్షం*


*తిథి       : ఏకాదశి* మ 01.44 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : పూర్వాషాఢ* సా 06.59 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*


*యోగం  : సిద్ధి* ఉ 10.05 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం   : బాలువ* మ 01.44 *కౌలువ* రా 01.21 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 06.00 - 07.30 & 11.00 - 12.30*

అమృత కాలం  : *మ 02.07 - 03.45*

అభిజిత్ కాలం  : *ప 11.57 - 12.44*


*వర్జ్యం          :  రా 02.49 - 04.23 తె*

*దుర్ముహూర్తం  : మ 12.44 - 01.31 & 03.05 - 03.52*

*రాహు కాలం   : ఉ 07.56 - 09.25*

గుళికకాళం       : *మ 01.49 - 03.17*

యమగండం     : *ఉ 10.53 - 12.21*

సూర్యరాశి : *కుంభం*

చంద్రరాశి : *ధనస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 06.28* 

సూర్యాస్తమయం :*సా 06.13*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.28 - 08.49*

సంగవ కాలం         :      *08.49 - 11.10*

మధ్యాహ్న కాలం    :      *11.10 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 03.52*


*ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ ద్వాదశి*

సాయంకాలం        :  *సా 03.52 - 06.13*

ప్రదోష కాలం         :  *సా 06.13 - 08.40*

రాత్రి కాలం          :  *రా 08.40 - 11.56*

నిశీధి కాలం          :*రా 11.56 - 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.50 - 05.39*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*అచింత్యమలివృంద రుచి బంధురగలం కురిత కుంద నికురుంబ ధవలం*

*ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ ।*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

పానుగంటి లక్ష్మీ నరసింహారావు

 పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ప్రసిద్ధ వ్యాసాల సంపుటి *సాక్షి* (స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణతో రూపొందించిన పత్రిక) నుండి ఓ మచ్చుతునక ఇదిగో.


*ఒక తెలుగువాడు తెలుగు శ్రోతలతో ఆంగ్లంలో ప్రసంగించేసరికి జంఘాలశాస్త్రి ఉద్వేగభరితుడై ఇలా అంటాడు. -- మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా? కిచకిచలాడలేని కోతిని మీరెక్కడైన చూచితిరా? ... అయ్యయ్యో. మనుజుడే. అంత మనుజుడే. ఆంధ్ర మాతాపితలకు బుట్టినవాడే. .. అట్టివాడాంగ్లేయభాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాట్లాడలేకుండునా? ఆశ్చర్యము, అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున మాటాడకుండ చేసినది అశక్తికాదు. అనిష్టత. అసహ్యత. అది శిలాక్షరమైన మాట. .. తెలుగుబాస యంత దిక్కుమాలిన బాస లేదనియే యా యాంగ్లేయ తేజస్సు నమ్మకము*

😀😀😀

Krishna Story*

 *Krishna Story*

*Dwarasamudra (Halebidu)*🙏


1. Marriage of Vasudeva and Devaki

2. Krishna killing Putana

3. Krishna killing Bakasura 

4. Krishna killing Sakatasura 

5. Krishna uprooting Yamalarjuna trees and liberating Nalakuvara & Manigriv (Kubera sons)

6. Krishna stealing butter (Navanita Chora Leela)

7. Krishna subduing Kaliya (Kaliya Mardana)

8. Krishna as Veṇugopala with cows (Govinda Leela)

9. Krishna killing Kesi (Kesi vadha)

10. Nanda Maharaja offering gifts to Indra

11. Indra in Svarga (Devaloka)

12. Krishna lifting Govardhana Hill (Govardhana Leela)

13. Krishna revealing his Vishvarupam to Indra, Indra seeking his forgiveness

14. Gopas and Gopis celebrating Govardhana Puja

15. Akrura taking Krishna and Balarama to Mathura

16. Krishna and Balarama crossing the Yamuna river

17. Krishna killing Kuvalayapida  (the elephant sent by Kamsa)

18. Krishna defeating Canura & Mustika  (Kamsa’s wrestlers)

19. Krishna killing Kaṁsa (Kamsa Vadha)

🙏🕉️

ఉమామహేశ్వరులకు

 🈸🈸🈸🈸🈸🈸🈸

ఉమామహేశ్వరులకు నమస్కరిస్తూ ఈ రోజు పఠనం ముగిద్దాం 👆

🈸🈸🈸🈸🈸🈸🈸

*త్రిశాఖైః బిల్వపత్రైశ్చ*


 *అచ్ఛిద్రైః కోమలైః శుభైః*


*శివపూజాం కరిష్యామి*


 *ఏకబిల్వం శివార్పణం!!*


*తాత్పర్యం:-*


*మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను.*


*ఓం నమః శివాయ॥*

🈸🈸🈸🈸🈸🈸🈸

ఓం శాంతిః శాంతిః శాంతిః!

సర్వేజనా సుఖినోభవంతు!!

ఓం తత్సత్!!


సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!

🈸🈸🈸🈸🈸🈸🈸

(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)

🈸🈸🈸🈸🈸🈸🈸

*విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (60)*


*భగవాన్ భగహానందీ*

*వనమాలీ హలాయుధః ।*


*ఆదిత్యో జ్యోతిరాదిత్యః*

*సహిష్ణుర్గతిసత్తమః ॥* 


*ప్రతి పదార్థం:~*


*560) భగవాన్ - పూజనీయుడు; పూజ్యులు అందరిలోనూ పూజ్యతముడు;*


*561) భగహా - ప్రళయకాలమున సకల సంపదలను హరించి తనయందే లీనము చేసుకును వాడు;*


*562) ఆనందీ - ఆనందమే స్వరూప స్వభావములుగా కలిగినవాడు*


*563) వనమాలీ -   వనమాలను ధరించినవాడు.*


*564) హలాయుధ: - నాగలిని ఆయుధముగా ధరించిన వాడు.*


*565) ఆదిత్య: - అదితి, కశ్యపులకు జన్మించిన శ్రీ వామన మూర్తి*


*566) జ్యోతిరాదిత్య: -  దివ్య ప్రకాశముతో విరాజిల్లుచున్న సూర్యుడు*


*567) సహిష్ణు: - అపారమైన సహనము కలవాడు; ద్వంద్వములను సహించువాడు.*


*568) గతిసత్తమ: - శరణాగతులకు ఉత్తమమైన గమ్యము;*


*తాత్పర్యము:~*


*ఉత్పత్తి ప్రళయములు, భూతములయొక్క గతాగతములు, వీనిని సంపూర్ణముగా నెరింగినవాడును, ప్రళయకాలమందు ఈ గుణములన్నీ తనలోనే ఆవహింపచేసికొనువాడును, ఆనంద స్వరూపుడును, తన్నాశ్రయించిన భక్తులకు  ఆనందమును ప్రసాదించువాడును, వైజయంతి మాలను సదా ధరించి యుండువాడును, నాగలిని ఆయుధముగా ధరించిన పరశురామావతారమును, వామనావతారమును, జ్యోతి స్వరూపుడైన సూర్య భగవానుడును, ద్వంద్వములను సహించువాడును, శరణాగతులకు ఉత్తమమైన గమ్యము తానే అయినవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*


*పాఠకులందరికీ శుభం భవతు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌        *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*స్వాతి నక్షత్రం 4వ పాదం జాతకులు పై 60వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(59వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️ *సగరులు - సాగరం; భగీరథుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘ఈ ముని పెద్ద దొంగ! మన యాగాశ్వాన్ని దొంగిలించాడు. ఇతన్ని క్షమించకూడదు. కొట్టండి, చంపండి.’’ అంటూ సగరపుత్రులంతా ఒక్కసారిగా కపిలమునిని చుట్టుముట్టారు. మారణాయుధాల్ని ఎక్కుపెట్టారు.*


*ఆ కలకలానికి తపోభంగం కలిగింది. కళ్ళు విప్పి చూశాడు కపిలముని. ఆ చూపుల్లో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లాయి. అరవైవేలమంది సగర పుత్రులూ ఆ జ్వాలలకు ఆహూతయిపోయారు. భస్మమయిపోయారు. బూడిదగుట్టలయ్యారు.* 


*కపిలముని నేత్రాగ్నికి తన అరవై వేలమంది పుత్రులూ బూడిదయిపోయారని నారదుడు చెప్పగా తెలుసుకున్నాడు సగరుడు. బాధపడ్డాడు.*


*అప్పుడు మనవడు అంశుమంతుణ్ణి పిలిచాడు. యాగాశ్వాన్ని తీసుకుని రమ్మని అతన్ని పంపాడు. తన పినతండ్రులు తవ్విన సముద్రమార్గం గుండా అంశుమంతుడు రసాతలానికి చేరాడు. అక్కడ బూడిదగుట్టల్నీ, వాటి సమీపంలో తపస్సు చేసుకుంటున్న కపిలమునినీ చూశాడతను. కట్టి వేసి ఉన్న యాగాశ్వాన్ని కూడా గమనించాడు. కపిలమునిని సమీపించాడు. చేతులు జోడించి నమస్కరించాడతనికి. అనేక విధాల స్తుతించాడు.*


*అనుగ్రహించాడు కపిలముని. చల్లగా కళ్ళు తెరచి, మెల మెల్లగా ఇలా చెప్పాడు. ‘‘యాగాశ్వాన్ని నిరభ్యంతరంగా తీసుకుని వెళ్ళు. నీ పినతండ్రులు పవిత్రులు కావాలంటే దానికి గంగాజలమే పరిష్కారం.’’*


*కపిలునికి ప్రదక్షిణ నమస్కారం చేశాడు అంశుమంతుడు. యాగాశ్వాన్ని తీసుకుని బయల్దేరాడు. అశ్వాన్ని తాత సగరునికి అప్పగించాడు. యాగం పూర్తయిందప్పటికి. కొన్నాళ్ళకు రాజ్యభారాన్ని అంశుమంతుడికి అప్పగించి, తపోనిష్ఠలో తనువు చాలించాడు సగరుడు.*


*సగరపుత్రులు తవ్విన కారణంగా సముద్రానికి ‘సాగరం’ అని పేరు వచ్చింది.*


*తన పినతండ్రులకు ఉత్తమ గతులు కల్పించేందుకు అంశుమంతుడు అనేక సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. అయితే అది సాధించకుండానే కాలధర్మం చెందాడు. అంశమంతుడు కొడుకు దిలీపుడు కూడా గంగను రప్పించి, తన పితామహాదులకు ఉత్తమగతులు కల్పించాలని ఎంతగానో ప్రయత్నించాడు. అతని ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరకి ఆ కార్యాన్ని దిలీపుని పుత్రుడు భగీరథుడు సాధించాడు.*


*భగీరథుడు:~*


*ఎవరూ సాధించలేని గొప్ప కార్యాన్ని సాధించి ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందాడు భగీరథుడు. దివి నుండి భువికి గంగను తీసుకుని వచ్చింది అతనే!*


*తన పితృదేవతలకు సద్గతి కల్పించాలని భగీరథుడు కఠోరమయిన తపస్సు చేశాడు. అతని తపస్సుకు దేవతలూ మునులూ ఆశ్చర్యపోయారు. ఆఖరికి గంగాదేవి ప్రత్యక్షమయింది. విషయం అడిగి తెలుసుకుంది. అప్పుడు ఇలా అంది. ‘సరే, నీ కోరిక నేను నెరవేరుస్తాను. నీ పితృదేవతలకు సద్గతి కల్పిస్తాను. అయితే నేను స్వర్గలోకం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు నా ప్రవాహవేగాన్ని తట్టుకునే మహనీయుడు కావాలి. లేకపోతే భూతలాన్ని చీల్చుకుని, నేను పాతాళంలోకి జారిపోతాను. నన్ను తట్టుకునే మహనీయుణ్ణి ముందు చూడు.’’*


*‘‘తప్పకుండా తల్లీ’’ అన్నాడు భగీరథుడు.‘*


*‘మరో విషయం. నేను భూమి మీద ఉంటే భూలోకంలోని పాపాత్ములంతా నాలో స్నానం చేసి, తమ పాపాలు నాకు అంటగడతారు. ఆ పాపాల్ని నేనెలా భరించేది?’’ అడిగింది గంగ.*


*ఆలోచించాడు భగీరథుడు. ఇలా అన్నాడు. ‘‘నీ ప్రవాహవేగాన్ని తట్టుకునే మహనీయుడు శంకరుడు ఉన్నాడు. అతడు నిన్ను భరిస్తాడు. విష్ణుపాదోద్భూతమయిన నిన్ను పాపాలు అంటవు. నిప్పును చెదలు అంటుతాయా తల్లీ? దయచేసి నా ప్రార్థన ఆలకించి, భూలోకంలోకి దిగి రా.’’ వేడుకున్నాడు భగీరథుడు.*


*అంగీకరించింది గంగ. తనని తట్టుకుని నిలబడే శంకరుని కోసం ముందు ప్రార్థించమంది. శంకరుని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడు భగీరథుడు. అతని తపస్సును మెచ్చుకున్నాడు శంకరుడు. ప్రత్యక్షమయ్యి భగీరథుని అభీష్టాన్ని నెరవేర్చేందుకు సిద్ధమయ్యాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  -  పూర్వాషాడ -‌‌ ఇందు వాసరే* (24.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Panchaag