24, ఫిబ్రవరి 2022, గురువారం

వేదోదితం స్వకం కర్మ

 

శ్లో॥ వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యాదతంద్రితః |

తద్ధి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాంగతిమ్ ||

 (వ్యాసః) వైదికము, సనాతనము, ధర్మశాస్త్ర సమ్మతము అగు స్వధర్మమును అనుష్ఠించుటయే సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు అగు భగవంతుని మహత్తరమైన సపర్య అనగా అతని పూజయే అగును. అది మానవునికి శ్రేయమును అనగా మేలును, శుభమును చేకూర్చును. అందుకే గీతలో భగవానుడు స్వయంగా అంటాడు - 'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః | (18–46) (తన స్వధర్మాచరణముద్వారా పరమేశ్వరుని పూజించుటవలన మానవుడు పరమసిద్ధిని పొందును.) ఇందువల్లనే నిత్యములు, నైమిత్తికములు అనెడు కర్మలను ఆచరించుట ప్రతివ్యక్తికి పరమధర్మమనియు, ముఖ్యకర్తవ్యమనియు వేదాది సమస్త శాస్త్రములయందు చెప్పబడియున్నది. ప్రతి వ్యక్తికి మూడు విధములగు ఋణములు ఉండును- 1. దేవఋణము 2. ఋషిఋణము 3. పితృ ఋణము “యత్కృత్వా నృణ్యమాప్నోతి దైవాత్ పైత్ర్యాచ్చ మానుషాత్ '' అని చెప్పినట్లుగా నిత్యకర్మలను చక్కగా ఆచరించుటవలన మానవుడు ఈ త్రివిధ ఋణములనుండి విముక్తుడై పోవును.

తమ జీవితపర్యంతము అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యము యథాధికారముగా స్నానము, సంధ్యా, గాయత్రీజపము, దేవతార్చనము, వైశ్వదేవ-బలి, స్వాధ్యాయము ఇత్యాది నిత్యకర్మలను ఎవరు ఆచరించెదరో, వారి బుద్ధి ఆత్మయందు నిశ్చలమగును. బుద్ధి ఆత్మనిష్ఠమైన మీదట నెమ్మది - నెమ్మదిగా మనిషి బుద్ధిలోగల భ్రాంతి, జడత్వము, వివేకహీనత, అహంకారము, సంకోచము మరియు భేదభావము నశించిపోవును. అప్పుడు ఆ వ్యక్తి పరమాత్మచింతనలో నిమగ్నుడగును. తదనంతరము అతడు అహర్నిశములు పరబ్రహ్మయగు పరమేశ్వరుని సాక్షాత్కారమును పొందుటకై ప్రయత్నము చేయుచుండును. తద్వారా అతనికి పరమానందము యొక్క అనుభూతి కలుగుచుండును. పరమానందముయొక్క అనుభూతి లభించిన మీదట ఆ వ్యక్తికి పరమాత్మ యొక్క వాస్తవికమైన తత్త్వజ్ఞానము యొక్క పరిజ్ఞానము అనుభవమునకు వచ్చును. అప్పుడతడు శాశ్వతమైన

జీవన్ముక్త స్థితిని చేరుకొనును. చివరగా, 'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ'లో పరినిష్ఠితుడై ఆత్మోద్ధరణము గావించుకొనును. ఇదియే విశిష్టమైన మానవజీవితమునకు సర్వోత్కృష్టమగు సార్థకత. కావున మానవజన్మమును సఫలమొనర్చుట కొరకై మానవమాత్రుడైన ప్రతివ్యక్తి నిత్యకర్మలను నియమానుసారముగా ఆచరింపవలయును.

నిత్యకర్మలలో కొన్నింటిని ప్రతివ్యక్తి సంతోషపూర్వకంగా నియమితరూపంగా చేయవలసివచ్చును. ఉదా: శౌచాది క్రియలు, స్నానము, భోజనము, శయనము మున్నగునవి. అయితే ఈ కర్మలన్నియును శాస్త్రమర్యాదను అనుసరించి జరుగవలయును. అప్పుడే అవి ధర్మాచరణముగా రూపాంతరమునొందును. జీవితంలోని అతిసామాన్యమైన, సర్వసాధారణమైన క్రియా-కలాపములనుగూర్చి కూడా శాస్త్రములు చక్కగా వివేచనము చేసి, ఒక నియతముగా తమ సమ్మతిని ప్రకటించినవి. ఉదయము నిద్రనుండి మేల్కొనుట ఎప్పుడు? మేల్కొనిన తర్వాత మొట్టమొదటగా ఏమి చేయాలి? ఇందుకుగాను శౌచము, దంతధావనము, క్షౌరము, తైలాభ్యంగము, స్నానము, వస్త్రధారణము, భోజనము, శయనము మొదలగు వాటినన్నింటిని గూర్చిన విధి-నిషేధములను తెలియజేసినవి. కావున శాస్త్ర మర్యాదను

అనుసరించి జీవనమును కొనసాగించుటయే శ్రేయపథమునకు దిక్సూచియగును.


వివాహాలు ఎనిమిది రకములుగా పేర్కొన్నారు.

 మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాలు ఎనిమిది రకములుగా పేర్కొన్నారు.  కానీ మనం సాధారణంగా వివాహం అంటే యువతీ యువకుడు అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో పెళ్లాడటమన్నది సంప్రదాయం. అలాంటి వివాహం మన శాస్త్ర, పురాణాల్లో ఎనిమిది రకాలుగా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి!!

వివాహం అనేది ఎనిమిది రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి.. బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని పేర్లు ఉన్నాయి. వీటిలో  

మొదటిది బ్రహ్మ వివాహం. వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అంటారు.

రెండోది దైవ వివాహం. యజ్ఞంలో రుత్విక్‌‌కు అలంకరించిన కన్యాదానంగా చెపుతారు.

 గోమిధునాన్ని వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేస్తే దాన్ని అర్ష (అర్షం) వివాహంగా చెపుతారు

 మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని వరుడుని పూజించి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అని పిలుస్తారు.బహుశా ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న వివాహం ఈ పద్దతికి చెందినది అయివుండొచ్చు 

  జ్ఞానులు కన్యకు తన శక్తిమేరకు డబ్బిచ్చి వివాహం చేసుకుంటే దాన్ని అసుర వివాహంగా పేర్కొంటారు.  

వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహంగా చెపుతారు.  

బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకుంటే దాన్ని రాక్షస వివాహంగా పేర్కొంటున్నారు.

 నిద్రిస్తున్న మత్తులో ఉన్న స్త్రీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే దాన్ని పైశాచ వివాహంగా పేర్కొంటారు

ప్రశ్న పత్రం సంఖ్య: 42

  ప్రశ్న పత్రం సంఖ్య: 42 

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) కార్బురేటర్ అన్నది  ఇందులో ఉంటుంది

i ) రైలు ఇంజనులో

 ii ) మోటారుసైకిలు లో   

iii ) సైకిలుతో 

 iv ) రేడియోలో 

2) పిడుగు అనునది ఒక

i ) విదుత్ఘాతం 

ii ) అధిక వాయు పీడనం

 iii ) అధిక వర్షకారణం

 iv ) భూమినుంచి ఉద్భవించేది 

3) భగవత్గీతలో మొదటి శ్లోకం ఎవరు చెప్పారు

i ) శ్రీ కృష్ణుడు 

ii ) అర్జనుడు 

iii ) దృతరాష్ట్రుడు

 iv ) సంజయుడు

4) రామాయణంలో రాయబారిగా ఈయనవున్నాడు 

i ) సుగ్రీవుడు

 ii ) అంగదుడు 

iii ) హనుమంతుడు 

iv ) లక్ష్మణుడు 

5) సంస్కృత భాషలో తెలుగు భాషలో లేని ఇది వున్నది

i ) ఏకవచనం 

ii ) ద్వివచనం  

iii ) బహువచనం

 iv )అన్య వచనం 

 6) ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి ____

i ) నదీం

 ii ) ఘటం

 iii ) సాగరం

 |iv ) జల మార్గ . 

7) మనదేశంలో కారు నడిపే వారు అమెరికాలో

i)అదేవిధంగా నడపగలరు 

 ii ) అక్కడి ట్రాఫిక్ సిస్టం వేరు కాబట్టి తెలుకుకొని నడపాలి 

 iii ) ప్రపంచం మొత్తంలో ట్రాఫిక్ పద్దతి ఒకే విధంగా ఉంటుంది

 iv ) అక్కడి కార్లకు స్టీరింగ్ కుడివైపు ఉంటుంది.

8) మొట్టమొదటి సంస్కృత కవి ఎవరు .

i ) కాళిదాసు

 ii ) పోతన 

iii ) వాల్మీకి

 iv ) వ్యాసుడు

9)గాలిపటం(Kite) పైకి ఎగరటానికి కారణం 

i ) గాలి పటం ఫై భాగం మీద గాలి పీడనం కన్నా క్రింది భాగం మీద పీడనం ఎక్కువగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి. ,  

 ii ) గాలి పటం క్రింది భాగం మీద గాలి పీడనం కన్నా భాగం ఫై మీద పీడనం ఎక్కువగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్

టి.iii ) గాలి పటం ఫై భాగం మీద గాలి పీడనం క్రింది భాగం మీద పీడనం సమానంగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి. ,

iv ) గాలిపీడనంకు  గాలిపటానికి సంబంధం లేదు కాబట్టి 

10) ఆంధ్రప్రేదేశ్ లో సాగర తీరంలో వున్నపట్టణం

i ) విజయవాడ 

 ii ) బందర్  

iii ) గుంటూరు 

 iv ) అమరావతి 

11)ఇది ఒక ఉత్తర  భారతదేశక్షేత్రం

i ) తిరుమల

 ii ) సింహాచలం

 iii ) కాశి

 iv ) కన్యాకుమారి

 12) ప్రపంచంలో అతిపెద్ద పర్వతం ఏది

i ) తిరుమ పర్వతం

 ii ) పడమటి కనుమలు

 iii ) తురుపు కనుమలు   

iv )ఎవరెస్టు

13) ఈ వివాహం ఇప్పుడు అమలులో లేదు  

i ) రిజిస్టరు వివాహం ii ) ప్రేమ వివాహం iii )రాక్షస వివాహం iv ) బ్రహ్మ వివాహం  

14) క్రింద వున్న లోకాలలో ఈ లోకం లేదు  

i ) అతలం 

 ii ) సులత   

 iii ) తలాతల  

iv ) తపోలోకం 

15) అష్టైశ్వర్యాలలో ఇది వున్నది

i ) గరిమ  

ii ) గృహము 

 iii ) తాంబూలము 

iv ) సంతానము

16) యత్ర నార్యస్తు పూజ్యంతె  

i ) రమంతె తత్ర మనుష్య

ii ) రమంతె తత్ర దేవతాః    

 iii ) రమంతె యత్ర దేవతాః 

iv )రమంతె తత్ర దానవ 

17) భగవత్గీత కన్నా ముందు ఈ గీత వుంది 

i ) అష్టావక్ర గీత

ii ) రాఘవ గీత  

 iii ) విశ్వామిత్ర గీత 

iv ) ఏ గీత లేదు 

18) కృష్ణ పక్షంలో మరియు శుక్ల  పక్షంలో చంద్రుకు ఈ తిధినాడు ఒకే పరిమాణంలో ఉంటాడు

i ) నవమి 

ii ) సప్తమి చంద్రుని పరిమాణం 

iii ) ఏకాదశి 

 iv ) తదియ 

19) పిండి కొద్దీ

i ) దోశ 

 ii ) రొట్టె 

 iii ) గారే 

iv )   పూరి 

20)  సుమతి శతకము వ్రాసిన కవి ఎవరు

i ) వేమన 

ii ) శ్రీనాధుడు 

iii ) బద్దెన 

iv ) పెద్దన

 

 

శ్లోకం

 శ్లోకం:☝️

   *యదేవ తీవ్ర సంవేగాత్*

*దృఢం కర్మ కృతం పురా l*

   *తదేవ దైవ శబ్దేన*

*పర్యయాణేహ కథ్యతే ll*


భావం: గతంలో తీవ్రమగు కృషితో సాధించిన కర్మల ఫలితమే నేడు మనము అనుభవించుచున్నాము. దానినే విధియని, దైవమని, ప్రారబ్ధమని రకరకాల పేర్లతో పిలుస్తారు. అది మనల్ని నడిపిస్తుంది అంటారు. అలాగని పూర్తిగా మనం అస్వతంత్రులం కాదు.

తెలుగు భాషాభిమానుల కోసం

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

తెలుగు భాషాభిమానులు ఈ క్రింది విషయాన్ని చదవండి. చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

————— 


*"ర"కీ "ఱ"కి మధ్య తేడా ఏమిటి?*


ఈ మధ్యనే వాట్సాప్ లో మెసేజ్ చూసాను. ద్వానా శాస్త్రి గారు రాసారట. బావుంది. అది ఇక్కడ పెడతాను. forwarded as it is.


తెలుగు భాషాభిమానుల కోసం.👇


*అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు?*


అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. తెలుగుకు పట్టిన దుర్గతి ఇది. అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:


అరుఁగు = వీధి అరుగు


అరుగు = వెళ్ళు, పోవు


అఱుగు = జీర్ణించు


ఏఁడు = సంవత్సరం


ఏడు = 7 సంఖ్య


కరి = ఏనుగు


కఱి = నల్లని


కాఁపు = కులము


కాపు = కావలి


కాఁచు = వెచ్చచేయు


కాచు = రక్షించు


కారు = ఋతువు, కాలము


కాఱు = కారుట (స్రవించు)


చీఁకు = చప్పరించు


చీకు = నిస్సారము, గ్రుడ్డి


తఱుఁగు = తగ్గుట, క్షయం


తఱుగు = తరగటం(ఖండించటం)


తరి = తరుచు


తఱి = తఱచు


తీరు = పద్ధతి


తీఱు = నశించు, పూర్తి(తీరింది)


దాఁక = వరకు


దాక = కుండ, పాత్ర


నాఁడు = కాలము


నాడు = దేశము, ప్రాంతము


నెరి = వక్రత


నెఱి = అందమైన


నీరు = పానీయం


నీఱు = బూడిద


పేఁట = నగరములో భాగము


పేట = హారంలో వరుస


పోఁగు - దారము పో( గు


పోగు = కుప్ప


బోటి = స్త్రీ


బోఁటి = వంటి [నీబోఁటి]


వాఁడి = వాఁడిగా గల


వాడి = ఉపయోగించి


వేరు = చెట్టు వేరు


వేఋ = మరొకవిధము


మడుఁగు = వంగు, అడఁగు


మడుగు = కొలను, హ్రదము


మొదలైనవీ ఉన్నాయి.


అయినా తెలుగు భాషను నాశనం చేస్తున్న కాలం దాపురించింది కదా!


[డాక్టర్ ద్వారకా నాధ శాస్త్రి )

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹 *నాకు నచ్చిన ఓ అజ్ఞాత రచయిత రచన*

                 🌷🌷🌷

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

పుల్లమామిడి, నిమ్మ, ఉసిరి, ఉప్పు, కారం, మొ. సృష్టించావు. ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు, కానీ ఆశపడి తింటే అల్సర్, బి.పి బహుమతిగా ఇస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

పంచదార, బెల్లం, తియ్యటి పళ్ళు ఇచ్చావు, కానీ సామీ! ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మాచెమట వాసనతోనే గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏 

వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన అసామికి కూడా దేహాన్ని వదలగానే ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు.


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

కాషాయం కట్టిస్తావు, ఆస్తులపై భ్రమ పుట్టిస్తావు. ఆఖరికి బ్రష్టు పట్టిస్తావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ..👏

నేను, నాది అనే అహం కలిగిస్తావు. అది  వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏 

ముప్పయి మూడు కోట్ల దేవతలను సృష్టించావు. కానీ నన్నొక్కడినే పూజించమంటావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

ఇంద్రియాలను ఇచ్చావు. వాటికి రుచులు పుట్టించావు. అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏 

పాము పడకపై శయనించి, అమ్మ చేత కాళ్ళోత్తించూకుంటూ మమ్ములను చూసి నవ్వుకుంటావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ...👏 

నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.


కానీ సామీ! 

నేనూ తక్కువవాణ్ని కాదు నాకు బాగా తెలుసు, నీ కాళ్ళట్టుకుంటే నీవే నన్నెత్తుకుంటావని..😍


ఆ గేనం (జ్ఞానం) మాత్రం నన్నొదలకుండా చూడుసామీ👏


ఆ ఒక్క వరం మాత్రం నాకివ్వు సామీ !!!



💪హరహర మహాదేవ👏🤘🔱🛕🕉️🚩