30, సెప్టెంబర్ 2021, గురువారం

భారతీయ న్యూక్లియర్ ఫిజిక్స్ పితామహుడు.. 😯

 చరిత్ర పుస్తకాలలో చోటు దక్కని.,. భారతీయ న్యూక్లియర్ ఫిజిక్స్ పితామహుడు.. 😯


#న్యూక్లియర్_ఫిజిక్స్_స్వామి_జ్ఞానానంద.. (5.12.1896 - 21.09.1969)

సైన్స్ కు మతానికి పొత్తు కుదరదని చాలా మంది భావన. కాని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ , జగదీశ్ చంద్ర బోస్ , స్వామి జ్ఞానానంద వంటి వారు ఆ రెంటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చక్కగా వివరిస్తూ రెండు ఒక దానికొకటి అవసరమని, అప్పుడే మానవ జాతి పురోగతి అని విస్పష్టంగా చెప్పి ,ఆచరించి మార్గ దర్శనం చేశారు...!


న్యూక్లియర్ ఫిజిక్స్ లో స్పెక్త్రోస్కోపి మీద విశేష పరిశోధన చేసి దేశవిదేశాల్లో దాన్ని బోధించి హిమాలయాలలో తపస్సు చేసి యోగాభ్యాసం చేసి వేద ప్రాశస్త్యాన్ని నేల నాలుగు చెరగులా ఉపన్యాసాలతో వ్యాప్తి చేసిన మహానుభావుడే మన స్వామీ జ్ఞానానంద...!


#స్వామి_జ్ఞానానంద పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర గొరగనమూడిలో 1896 డిసెంబర్ అయిదున జన్మించారు. వీరి అసలు పేరు భూపతి రాజు లక్ష్మీ నరసింహ రాజు తండ్రి గారు రామరాజు గారు మహా వేద విజ్ఞాన ఖని. వేదాలకు ఉపనిషత్తులకు శాస్త్రాలకు సంబంధించిన వందలాది అపూర్వ గ్రంధాలును, ఆయన చదివి గొప్ప గ్రంధాలయాన్ని నిర్మించుకొన్నారు...!

సంపన్నమైన భూస్వామ్య కుటుంబం వీరిది.ఆ వేద భాండా గారాన్ని కుమారుడు లక్ష్మీ నరసింహ రాజు అద్భుతం గా సద్వినియోగ పరచుకొని వేద వేదాంగాలలో ఉత్తమాభినివేశాన్ని సంపాదించుకొన్నారు. ఆ గ్రంధాలకు సార్ధకత చేకూర్చారు...!

నర్సాపురం లోని టేలర్ హై స్కూల్ లో విద్యాభ్యా సంచేశారు.ఇరవైవ ఏట వివాహం జరిగింది... బుద్ధుని ప్రభావం వారి పైన ఉన్నది అందుకని నేపాల్ లోని లుంబిని కి వెళ్లి కొంతకాలం గడి పారు...!

తర్వాత పదేళ్లు దేశ సంచారం లో,పెద్దల దర్శనలతో జీవితాన్ని చదువు కున్నారు. హిమాలయా చేరి అక్కడ యోగాభ్యాసం చేస్తూ మరో పదేళ్లు సార్ధక జీవనం సాగించారు. వేదాధ్యయనం వారిని విడువ లేదు.దాని పై ఉన్న మక్కువ తో అన్ని వేదోపనిషత్తుల సారాన్ని జీర్నిన్చుకొన్నారు. మానసిక వికాసం కలిగింది.ఒక అపూర్వ తెజస్సేదో వారిలో విరాజిల్లింది...!

క్రమం గా వీరి దృష్టి భౌతిక శాస్త్రం వైపుకు మళ్ళింది. దేని మీద దృష్టి పడినా దాన్ని ఆసాంతం కరతలా మలకం చేసుకోకుండా ఉండలేదు అందుకని జర్మని చేరుకొన్నారు. అక్కడి డ్రెస్ డ్రెయిన్లో గణితం, ఫిజిక్సు చదివారు.ఫిజిక్స్ అంటే వీరాభిమానం కలిగింది. అంతే అప్పుడే విస్తరిస్తున్న ’హై టెన్షన్ ఎక్స్ రే ఫిజిక్స్ ‘’లో రిసెర్చి ప్రారంభించారు...!

ప్రేగ్ లోని చార్లెస్ యూని వర్సిటి లో వీరు రిసెర్చ్ కొన సాగించారు.వీరి ఆధ్యాత్మిక గురువు వీరిలోని వేద విజ్ఞానికి అబ్బుర పడి ,శిష్యుని వల్ల వేద విజ్ఞానం ప్రపంచమంతా విస్తరిల్లాలని ఆ కాంక్షించి రాజు గారికి ‘’స్వామి జ్ఞానానంద‘’* అనే ఆశ్రమ నామాన్ని ఒసంగి ఆశీర్వ దించారు.అప్పటి నుండి స్వామి కాషాయామ్బర దారిగా జీవించారు...!

1927 లో మళ్ళీ జర్మనీ దేశం వెళ్లారు స్వామి జ్ఞానానంద. అక్కడ హిందూ మతం మీద వేద విజ్ఞానం మీద పుంఖాను పుంఖం గా ఉపన్యాసాలిచ్చి చైతన్య వంతుల్ని చేశారు.ఆ ఉపన్యాసం ఒక గంగా ప్రవాహమే.ఎన్నో తెలియ రాని విషయాలను విజ్ఞానంతో ముడి వేసి అలవోకగా అందిస్తూ శ్రోతల మనసులను రంజింప జేసే వారు. అదొక తపస్సు గా, యోగం గా, వారు భావించి ఉత్తేజితులను చేశారు...! 

ఆ ఉపన్యాస పరంపర ఒక అత్యద్భుత మైన గ్రంధంగా వెలువడింది. డ్రిస్దేయిన్ వర్సిటి ప్రొఫెసర్ స్వామి ఉపన్యాసాలకు పులకించి పోయాడు.అవి మానవాళికి కర దీపికలన్నాడాయన...!

#జ్ఞానానందకు అయిన్ స్టీన్ గారి సాపేక్ష సిద్ధాంతం పైన ద్రుష్టిపడింది.పడింది అంటే దాన్ని ఆపోసన పట్టినట్లే 1929 లో దానిమీద రెండేళ్లు అధ్యయనం చేస్తూ అండర్ గ్రాడ్యు యేషన్ పూర్తీ చేశారు.

ఆయన సాధించిన యోగా విధానం మీద 150 కి పైగా ప్రసంగాలు చేసి యువతను యోగా మార్గం వైపుకు ఆకర్షితు లయేట్లు చేశారు.యోగ, విజ్ఞాన శాస్త్రాలు సన్నిహిత సంబంధం కలవని ఆయన చెప్పే వారు.యోగాలో బేసిక్స్ నేర్చుకొంటే మనసు, మెదడు, శరీరాలపై పూర్తీ స్వాధీనం కలుగు తుందని సోదాహరణం గా ఉపన్య సహించే వారు స్వామీజీ ఉపన్యాస సారాన్నంతా‘’పూర్ణ సూత్రాలు ‘అనే ఉద్గ్రంధంగా వెలువడి యోగా మార్గానికి కర దీపిక గా నిలిచింది...!

ఇది వారి మహోత్రుష్టరచన గా ప్రశంశలు అందుకొన్నది. తర్వాత ఆయన ప్రొఫెసర్ డోల్షేక్ గారితో కలిసి జర్మని ,ఫ్రాన్స్ ,జెకోస్లోవేకియా లలో పర్య టించారు...!

స్వామి జ్ఞానానంద అభిమాన విషయమైన x ray spectography లో రిసెర్చ్ చేసి 1936 లో D,Scసాధించారు .ఇంగ్లాండ్ ,లివర్ పూల్ వర్సిటీ లలో జాన్ చాడ్విక్ అనే మహా శాస్త్ర వేత్త వద్ద రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో పని చేశారు .న్యూక్లియర్ ఫిజిక్స్ లో ‘’spectography of beeta rays radiation ‘’లో అద్భుత పరిశోధన చేసిPh.D పొందారు...!

అమెరికా వెళ్లి అక్కడి మిచిగాన్ యూని వర్సిటి లో ‘’రేడియో యాక్టివ్ ఐసోటోపులు ‘’మీద రిసెర్చ్ చేశారు .ఆయన రాసిన ‘’హై వాక్యూం ‘’అనే శాస్త్ర గ్రంధం మేధావులైన ఎంతో మంది శాస్త్ర వేత్తలను ఆకర్షించింది...!

దాదాపు పాతికేళ్ళు విదేశాలలోనే చదువు ,వేదాంత ప్రవచనాలు ,యోగా ఉపన్యాసాలు ,తీవ్ర పరిశోధన ల తో గడిపిన స్వామి జ్ఞానానంద* 1947 మాతృదేశామైన భారత దేశం వచ్చేశారు..! 

డిల్లీ లోని నేషనల్ ఫిజిక్స్ లాబరేటరీ లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా తమ అమూల్య మైన సేవలందించారు. ఏడేళ్ళ తర్వాత స్వామీజీకి భీమ వరం వద్ద ఒక ఆక్సిడెంట్ జరిగింది .విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్ లో చేరారు .ప్రమాదం తప్పి ,ఆరోగ్యం కుదురుకొన్నది...!

ఆంద్ర విశ్వ విద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో సౌకర్యాలు ,పరిశోధనా విభాగం ఆ శాఖా ను తీర్చి దిద్దే బాధ్యతను ఆ నాటి వైస్ చాన్సలర్ స్వామి జ్ఞానానంద కు పూర్తీ బాధ్యలతో అప్పగించారు .వారు తమ శక్తి యుక్తులను ధార పోసి 1954 లో చేరి తీర్చి దిద్దారు. న్యూక్లియర్ ఫిజిక్స్ కు గొప్ప భవిష్యత్తు స్వామీజీ వల్లనే మన రాష్ట్రం లో కలిగింది .1-7-1956 లో విశ్వ విద్యాలయం లో న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖ‘’ను స్వామి ఆధ్వర్యం లో ఏర్పడింది. ఎంతో మందిని ప్రోత్సహించి ,ప్రేరణ కల్గించి న్యూక్లియర్ ఫిజిక్స్ భవిష్యత్తును చాటి చెప్పి, అందులో విద్య నేర్వటానికి విద్యార్ధులను సంసిద్ధులను చేశారు...!

ఆంద్ర దేశం లో న్యూక్లియర్ ఫిజిక్స్ కు పునాదులు వేసి, వ్యాప్తి చేసింది స్వామి జ్ఞానానంద ప్రొఫెసర్ గా.., న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో చేరి, హెడ్ ప్రొఫెసర్ గా1965 న పదవీ విరమణ చేశారు. రాష్ట్ర మంతటా పర్య టించి, వారు వేద వేదాంగ ,యోగా శాస్త్ర రహస్యాలను శ్రోతలకు అందించి యోగశాస్త్ర వేద విజ్ఞాన శాస్త్రాల మధ్య ఉన్న సమన్వయాన్ని విశదీక రించే వారు. ఇవి ఒక దానికొకటి వైరుధ్యం ఉన్నవి కావని ,పరస్పర సంబంధం కలవని రుజువు చేశారు. ఆంద్ర విశ్వ విద్యాలయం లో వారి సేవలను గుర్తించి స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ రిసెర్చ్‘’ను ఏర్పాటు చేసి ఘనం గా నివాళులర్పించారు...!

స్వామి జ్ఞానానంద మతాన్ని సైన్స్ ను ‘’సింతెసిస్‘’ చేయాలని భావించారు .ఆయన మహా మానవతావాదిగా నిరూపించుకొన్నారు...!!!


 ( శ్రీభూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు...)

సేకరణ...

సంస్కృత మహాభాగవతం*

 *30.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదియవ అధ్యాయము*


*లౌకిక - పారలౌకిక సౌఖ్యములన్నియును నిస్సారములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*10.1 (ప్రథమ శ్లోకము)*


*మయోదితేష్వవహితః స్వధర్మేషు మదాశ్రయః|*


*వర్ణాశ్రమకులాచారమకామాత్మా సమాచరేత్॥12577॥*


*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* "ఉద్ధవా! సాధకుడు త్రికరణశుద్ధిగా నన్ను శరణుజొచ్చి, నేను ఉపదేశించిన ధర్మములను సావధానముగా పాటింపవలెను. వర్ణాశ్రమ ధర్మములను, వంశముయొక్క సదాచారములను నిష్కామ బుద్ధితో అనుష్ఠింపవలెను..


*10.2 (రెండవ శ్లోకము)*


*అన్వీక్షేత విశుద్ధాత్మా దేహినాం విషయాత్మనామ్|*


*గుణేషు తత్త్వధ్యానేన సర్వారంభవిపర్యయమ్॥12578॥*


విషయభోగములయందు నిమగ్న చిత్తులైన దేహధారులు ఆచరించు కర్మలు అన్నియును ఆరంభమున సుఖకరములుగా అనిపించినను పరిణామమున విషతుల్యములుగనే యుండును. అంతఃకరణ శుద్ధిగలవారు ఈ విషయములను లోతుగా ఆలోచించి, సంసారసుఖముల యెడ విముఖత కలిగి యుండవలయును.


*10.3 (మూడవ శ్లోకము)*


*సుప్తస్య విషయాలోకో ధ్యాయతో వా మనోరథః|*


*నానాత్మకత్వాద్విఫలస్తథా భేదాత్మధీర్గుణైః॥12579॥*


మానవుడు నిద్రించుసమయమున స్వప్నమునందు అనేక విషయానుభవములను కలిగి యుండును. మేల్కొనిన పిదప అవియన్నియును మిథ్యయని బోధపడును. అట్లే జాగ్రదవస్థ యందును మనస్సున ఉత్పన్నములగు సంకల్పవికల్పము లన్నియును మిథ్యయే. ఈ నానాత్వభ్రమకు అజ్ఞానమే కారణము.


*10.4 (నాలుగవ శ్లోకము)*


*నివృత్తం కర్మ సేవేత ప్రవృత్తం మత్పరస్త్యజేత్|*


*జిజ్ఞాసాయాం సంప్రవృత్తో నాద్రియేత్కర్మచోదనామ్॥12580॥*


మానవుడు విహితకర్మలను నిష్కామబుద్ధితో ఆచరింపవలయును. వాటి ఫలములను భగవంతునికే అర్పింపవలయును. సకామకర్మలను ఎన్నడును ఆచరింపరాదు. బ్రహ్మజ్ఞానము కొరకు బాగుగా ప్రయత్నించవలెను. కర్మ పరంపరలో చిక్కుకొనరాదు.


*10.5 (ఐదవ శ్లోకము)*


*యమానభీక్ష్ణం సేవేత నియమాన్ మత్పరః క్వచిత్|*


*మదభిజ్ఞం గురుం శాంతముపాసీత మదాత్మకమ్॥12581॥*


*10.6 (ఆరవ శ్లోకము)*


*అమాన్యమత్సరో దక్షో నిర్మమో దృఢసౌహృదః|*


*అసత్వరోఽర్థజిజ్ఞాసురనసూయురమోఘవాక్॥12582॥*


అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనునవి *యమములు* అనబడును. జిజ్ఞాసువు వీటిని పూర్తిగా ఆదరబుద్ధితో పాటింపవలెను. శౌచము, సంతోషము, తపశ్చర్యలు, స్వాధ్యాయము, 'ఈశ్వరప్రణిధానము' అను నియమములను యదాశక్తి పారమార్థికబుద్ధితో ఆచరింపవలెను. పిమ్మట బ్రహ్మనిష్ఠగల ప్రశాంతచిత్తుడైన గురువును ఆశ్రయింపవలెను. అట్టి గురువును నా స్వరూపునిగానే భావింపవలెను. జిజ్ఞాసువు ఎట్టి అభిమానముగాని, మత్సరబుద్ధిగాని లేకుండా కార్యదక్షుడై మమతారహితుడై యుండవలెను. గురువునెడలను, పరమాత్మనైన నాయందును దృఢమైన భక్తిశ్రద్ధలను కలిగియుండవలెను. మనస్సును లౌకిక విషయములమీదికి ఇటునటు పోనీయరాదు. దేనియందును దోషదృష్టి కలిగియుండరాదు. వ్యర్థమైన అసత్యభాషణములకు దూరముగా ఉండవలెను.


*10.7 (ఏడవ శ్లోకము)*


*జాయాపత్యగృహక్షేత్రస్వజనద్రవిణాదిషు|*


*ఉదాసీనః సమం పశ్యన్ సర్వేష్వర్థమివాత్మనః॥12583॥*


ఇట్లు అభ్యాసము చేయగా చేయగా ఆ జిజ్ఞాసువునకు సర్వత్ర సమభావము ఏర్పడును. అంతట భార్యాపుత్రులు, గృహములు, భూములు, బంధుమిత్రులు, సంపదలు మొదలగువాటియందు ఆసక్తి తొలగిపోవును. అన్ని పదార్థములయందును సమభావముగలిగి (బంగారము నందును, మట్టియందును సమభావము గలిగి) పూర్తిగా ఉదాసీనుడై యుండవలెను.


*10.8 (ఎనిమిదవ శ్లోకము)*


*విలక్షణః స్థూలసూక్ష్మాద్దేహాదాత్మేక్షితా స్వదృక్|*


*యథాగ్నిర్దారుణో దాహ్యాద్దాహకోఽన్యః ప్రకాశకః॥12584॥*


*10.9 (తొమ్మిదవ శ్లోకము)*


*నిరోధోత్పత్త్యణుబృహన్నానాత్వం తత్కృతాన్ గుణాన్|*


*అంతః ప్రవిష్ట ఆధత్త ఏవం దేహగుణాన్ పరః॥12585॥*


ఆత్మ స్వయంప్రకాశకము, సర్వసాక్షి, స్థూల, సూక్ష్మదేహముల కంటె భిన్నమైనది. బాగుగా జ్వలించుచు ప్రకాశించుచున్న అగ్ని దహింపబడు కట్టెలకంటెను వేరైనట్లు, సకలప్రాణుల దేహములను ప్రకాశింపజేయు (చైతన్యవంతమొనర్చు) ఆత్మయు ఆ శరీరములకంటెను భిన్నమైనది. కట్టె సంబంధమువలన అగ్ని కట్టెను అనుసరించి, చిన్న, పెద్ద ఆకారములలో కనబడును. కట్టె పూర్తిగా కాలిన పిమ్మట అగ్ని శాంతమైనట్లు, కాల్చినప్పుడు అగ్ని ఉత్పన్నమై కనబడును. కాని వాస్తవముగా అగ్ని ఆ కట్టెనుండి సర్వధా భిన్నమైనది. అట్లే ఆత్మయు దేహములలో ఉన్నప్పుడు వాటి గుణములను కలిగియున్నట్లు భావింపబడును. దేహములయొక్క పరిణామములు ఆత్మయందు ఆరోపింపబడును. కాని ఆత్మ దేహములకంటె భిన్నమే.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సంస్కృత మహాభాగవతం*

 *30.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదియవ అధ్యాయము*


*లౌకిక - పారలౌకిక సౌఖ్యములన్నియును నిస్సారములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*10.1 (ప్రథమ శ్లోకము)*


*మయోదితేష్వవహితః స్వధర్మేషు మదాశ్రయః|*


*వర్ణాశ్రమకులాచారమకామాత్మా సమాచరేత్॥12577॥*


*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* "ఉద్ధవా! సాధకుడు త్రికరణశుద్ధిగా నన్ను శరణుజొచ్చి, నేను ఉపదేశించిన ధర్మములను సావధానముగా పాటింపవలెను. వర్ణాశ్రమ ధర్మములను, వంశముయొక్క సదాచారములను నిష్కామ బుద్ధితో అనుష్ఠింపవలెను..


*10.2 (రెండవ శ్లోకము)*


*అన్వీక్షేత విశుద్ధాత్మా దేహినాం విషయాత్మనామ్|*


*గుణేషు తత్త్వధ్యానేన సర్వారంభవిపర్యయమ్॥12578॥*


విషయభోగములయందు నిమగ్న చిత్తులైన దేహధారులు ఆచరించు కర్మలు అన్నియును ఆరంభమున సుఖకరములుగా అనిపించినను పరిణామమున విషతుల్యములుగనే యుండును. అంతఃకరణ శుద్ధిగలవారు ఈ విషయములను లోతుగా ఆలోచించి, సంసారసుఖముల యెడ విముఖత కలిగి యుండవలయును.


*10.3 (మూడవ శ్లోకము)*


*సుప్తస్య విషయాలోకో ధ్యాయతో వా మనోరథః|*


*నానాత్మకత్వాద్విఫలస్తథా భేదాత్మధీర్గుణైః॥12579॥*


మానవుడు నిద్రించుసమయమున స్వప్నమునందు అనేక విషయానుభవములను కలిగి యుండును. మేల్కొనిన పిదప అవియన్నియును మిథ్యయని బోధపడును. అట్లే జాగ్రదవస్థ యందును మనస్సున ఉత్పన్నములగు సంకల్పవికల్పము లన్నియును మిథ్యయే. ఈ నానాత్వభ్రమకు అజ్ఞానమే కారణము.


*10.4 (నాలుగవ శ్లోకము)*


*నివృత్తం కర్మ సేవేత ప్రవృత్తం మత్పరస్త్యజేత్|*


*జిజ్ఞాసాయాం సంప్రవృత్తో నాద్రియేత్కర్మచోదనామ్॥12580॥*


మానవుడు విహితకర్మలను నిష్కామబుద్ధితో ఆచరింపవలయును. వాటి ఫలములను భగవంతునికే అర్పింపవలయును. సకామకర్మలను ఎన్నడును ఆచరింపరాదు. బ్రహ్మజ్ఞానము కొరకు బాగుగా ప్రయత్నించవలెను. కర్మ పరంపరలో చిక్కుకొనరాదు.


*10.5 (ఐదవ శ్లోకము)*


*యమానభీక్ష్ణం సేవేత నియమాన్ మత్పరః క్వచిత్|*


*మదభిజ్ఞం గురుం శాంతముపాసీత మదాత్మకమ్॥12581॥*


*10.6 (ఆరవ శ్లోకము)*


*అమాన్యమత్సరో దక్షో నిర్మమో దృఢసౌహృదః|*


*అసత్వరోఽర్థజిజ్ఞాసురనసూయురమోఘవాక్॥12582॥*


అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనునవి *యమములు* అనబడును. జిజ్ఞాసువు వీటిని పూర్తిగా ఆదరబుద్ధితో పాటింపవలెను. శౌచము, సంతోషము, తపశ్చర్యలు, స్వాధ్యాయము, 'ఈశ్వరప్రణిధానము' అను నియమములను యదాశక్తి పారమార్థికబుద్ధితో ఆచరింపవలెను. పిమ్మట బ్రహ్మనిష్ఠగల ప్రశాంతచిత్తుడైన గురువును ఆశ్రయింపవలెను. అట్టి గురువును నా స్వరూపునిగానే భావింపవలెను. జిజ్ఞాసువు ఎట్టి అభిమానముగాని, మత్సరబుద్ధిగాని లేకుండా కార్యదక్షుడై మమతారహితుడై యుండవలెను. గురువునెడలను, పరమాత్మనైన నాయందును దృఢమైన భక్తిశ్రద్ధలను కలిగియుండవలెను. మనస్సును లౌకిక విషయములమీదికి ఇటునటు పోనీయరాదు. దేనియందును దోషదృష్టి కలిగియుండరాదు. వ్యర్థమైన అసత్యభాషణములకు దూరముగా ఉండవలెను.


*10.7 (ఏడవ శ్లోకము)*


*జాయాపత్యగృహక్షేత్రస్వజనద్రవిణాదిషు|*


*ఉదాసీనః సమం పశ్యన్ సర్వేష్వర్థమివాత్మనః॥12583॥*


ఇట్లు అభ్యాసము చేయగా చేయగా ఆ జిజ్ఞాసువునకు సర్వత్ర సమభావము ఏర్పడును. అంతట భార్యాపుత్రులు, గృహములు, భూములు, బంధుమిత్రులు, సంపదలు మొదలగువాటియందు ఆసక్తి తొలగిపోవును. అన్ని పదార్థములయందును సమభావముగలిగి (బంగారము నందును, మట్టియందును సమభావము గలిగి) పూర్తిగా ఉదాసీనుడై యుండవలెను.


*10.8 (ఎనిమిదవ శ్లోకము)*


*విలక్షణః స్థూలసూక్ష్మాద్దేహాదాత్మేక్షితా స్వదృక్|*


*యథాగ్నిర్దారుణో దాహ్యాద్దాహకోఽన్యః ప్రకాశకః॥12584॥*


*10.9 (తొమ్మిదవ శ్లోకము)*


*నిరోధోత్పత్త్యణుబృహన్నానాత్వం తత్కృతాన్ గుణాన్|*


*అంతః ప్రవిష్ట ఆధత్త ఏవం దేహగుణాన్ పరః॥12585॥*


ఆత్మ స్వయంప్రకాశకము, సర్వసాక్షి, స్థూల, సూక్ష్మదేహముల కంటె భిన్నమైనది. బాగుగా జ్వలించుచు ప్రకాశించుచున్న అగ్ని దహింపబడు కట్టెలకంటెను వేరైనట్లు, సకలప్రాణుల దేహములను ప్రకాశింపజేయు (చైతన్యవంతమొనర్చు) ఆత్మయు ఆ శరీరములకంటెను భిన్నమైనది. కట్టె సంబంధమువలన అగ్ని కట్టెను అనుసరించి, చిన్న, పెద్ద ఆకారములలో కనబడును. కట్టె పూర్తిగా కాలిన పిమ్మట అగ్ని శాంతమైనట్లు, కాల్చినప్పుడు అగ్ని ఉత్పన్నమై కనబడును. కాని వాస్తవముగా అగ్ని ఆ కట్టెనుండి సర్వధా భిన్నమైనది. అట్లే ఆత్మయు దేహములలో ఉన్నప్పుడు వాటి గుణములను కలిగియున్నట్లు భావింపబడును. దేహములయొక్క పరిణామములు ఆత్మయందు ఆరోపింపబడును. కాని ఆత్మ దేహములకంటె భిన్నమే.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

నౌకాగ్రకాక న్యాయం

 ఒక రేవులో ఓడ ఆగి ఉంది. దాని జెండాపై ఒక కాకి వాలింది. ఇంతలో నౌకను వదిలారు. నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నది. దానితోనే కాకికూడా.


కాకికి లేచి తిరగడం, కొత్త ప్రదేశంలో వాలడం అలవాటు కదా. కాకి లేచింది. కానీ, వాలడానికి ఒక జెండా తప్ప ఆ సముద్రంలో మరో చోటు ఏదీ దానికి కనపడలేదు. కనుక, తిరిగి అదే జెండామీద కూర్చున్నది. మరొకసారి తిరిగి చూసింది. ఏ ఆధారం లేక జెండా మీదే వాలింది. 


ఇలా మరలా చేసి, చేసి చివరకు "ఏ ఆధారం లేదు, కాబట్టి జెండా మాత్రమే ఆధారం" అని తెలుసుకొని కదలకుండా కూర్చుండి పోయింది. దీనినే "నౌకాగ్రకాక న్యాయం" అంటారు.


అలానే మనసుకు కూడా "హరినామ స్మరణ"నే ఆధారంగా చేసి వేరే పదార్థం జోలికి పోనీయకుంటే అదే మన ధ్యేయ వస్తువైనపుడు పరమాత్మ తత్త్వాన్ని మనలో భాసింపజేస్తుంది. చేసితీరుతుంది కూడా. ఎటువంటి సందేహము వలదు.


🌷🌷🌷🌷🌷

పరమాత్ముడు మళ్ళీ పుట్టాలేమో"

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

        *🌷గుణపాఠం!🌷* 

               🌷🌷🌷

         ఒకసారి సత్య భామ శ్రీకృష్ణునితో ‘స్వామీ.. రామావతారం లో సీత మీ భార్య కదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ అని అడిగింది. 


           ఆ సమయం లో అక్కడే ఉన్న గరుడుడు కూడా 

‘ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?’ అన్నాడు.


             అదంతా అక్కడే ఉండి వింటున్న సుదర్శనుడు

(సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా, అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.

నాతో సరితూగు వారెవరైనా వున్నారా స్వామి’ అని అడగడం జరిగింది .


             ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలను కున్నాడు.


దీర్ఘంగా ఆలోచించి.......!


             ‘సత్యా, నువ్వు సీతగా మారిపో. నేను రాముణ్నవు తాను' అన్నాడు.

           'గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా'.

            చక్రమా, నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు’ అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు. 


          గరుత్మంతుడు వెంటనే హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. 


          హనుమ ఆనందంతో పులకించిపోతూ.....

‘నేను నీ వెనుకే వస్తాను...నువ్వు పద’ అని గరుత్మంతు ని సాగనంపుతాడు. 


         ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలమవు తుందో కదా...అనుకొంటూ ఎగతాళిగా నవ్వి గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురుతాడు. 


 కానీ విచిత్రంగా ....... 

       ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో మారుతీని చూసినా గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.


            ఇంతలో.......‘హనుమా’ అన్నపిలుపు తో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. 

         ‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’

అని శ్రీ రాముడు అడగ్గా.....

           ఆ మాట విన్న హనుమ తన నోటి నుండి సుదర్శనుని (సుదర్శన చక్రం) తీస్తూ.....

           ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు. ఎన్ని చెప్పినా వినక పోవడం తో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’అన్నాడు హనుమంతుడు రామునునితో.

             సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానం తో నేల చూపులు చూస్తూ ఉండి పోయాడు. 


           ఇంతలో హనుమంతు ని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై చూపు పడి....

           

       ‘స్వామీ, మీ పక్కనుండ వలసింది సాక్షత్తు నా తల్లి సీతమ్మ కదా! మరి ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువు గా సత్య భామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది. 


           అలా కృష్ణ పరమాత్ముడు, ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయానికున్న

విలువేమిటో తెలియ చెప్పడం జరిగింది .🙏🏻🙏🏻


#నీతి :-"ఈ రోజులలో కూడా కొంతమంది బంగారు గరిట(గోల్డెన్ స్పూన్), వెండి గరిట (సిల్వర్ స్పూన్).. నోట్లో పెట్టుకొని పుట్టినట్లు. తామే గొప్పవారము అని, మిగిలినవారు హీనులు,చేతగాని వారని భ్రమలలో బ్రతుకుతున్నారు... వాళ్లకు తత్వం బోధపడాలి అంటే, ఆ పరమాత్ముడు మళ్ళీ పుట్టాలేమో"

          "ఎవరైనా గతాన్ని మరచిపోరాదు,వర్తమానాన్ని విస్మరించరాదు,భవిష్యత్తును అతిగా ఊహించరాదు... 

ఇవి ఏవీ మనచేతి లోనివి కాదు అని మాత్రం గుర్తించాలి".

*💥సర్వేజనాః సుఖినోభవంతు💥*

తాయత్తు

 #తమిళంలో 'తాయ్' అంటే తల్లి. 'అత్తు' అంటే ఖండించడం. తాయత్తు అన్న మాటకు అర్థం తల్లి (నుండి) ఖండించినది అని. ఏమిటది? బొడ్డుతాడు (ఉంబిలికల్ కార్డ్). ప్రాచీనకాలంలో బిడ్డ పుట్టగానే మంత్రసాని బొడ్డుతాడునుండి సేకరించిన రక్తాన్ని కొన్ని పసరులతో కలిపి ఒక గొట్టంలో పోసి మూతపెట్టి ఉంచేది. బారసాల అయినాక ఆ గొట్టాన్ని ఒక త్రాటికి కట్టి దానిని మొలత్రాడుగా కట్టేవారు. అదే తాయత్తు.ac


ఈ ఆచారం అనేక ప్రాంతాలలో, పల్లెపట్టుల్లో ఉండేది. ఎవరికైనా పాము కరిచినా, ఏదైనా పెద్ద జబ్బు చేసినా, సిద్ధ వైద్యులు ఈ తాయత్తులోని రక్తాన్ని తీసి ఇతర మందులు కలిపి వైద్యం చేసేవారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి స్టెమ్ సెల్స్ కావాలంటే అతని మొలత్రాడును తడిమితే సరిపోతుంది. అది దాచడానికి అంతకంటే భద్రమైన ప్రదేశం ఏది?


ఐతే కాలక్రమంలో ఇలా స్టెమ్ సెల్స్ భద్రపరిచే జ్ఞానం లుప్తమైపోయింది. కేవలం ఆచారం మాత్రం మిగిలింది. తాయెత్తు గొట్టంలో ఏం ఉంచాలో తెలీక రాగిరేకులపై వ్రాసిన యంత్రాలు వంటివి ఉంచి కట్టడం ప్రారంభించారు. మెల్లగా తాయత్తు అన్నది మూఢనమ్మకం అన్న నమ్మకం ప్రబలి తాయత్తును వదిలి కేవలం మొలత్రాడు మాత్రం కట్టడం ప్రారంభించారు. ఇప్పుడు అదీ పోయింది. పోయి ఇది వచ్చింది:


ఇప్పుడు బొడ్డు తాడునుండి స్టెమ్ సెల్స్ సేకరించి భద్రపరిచే బాంకులు భారత దేశంలో కూడా ఉన్నాయి. ఐతే ఈ ఆధునిక తాయత్తులను చాలా జాగ్రత్తగా క్రయోజెనిక్ ఉష్ణోగ్రతలలో భద్ర పరచాలి. అది ఉంటే కాన్సర్ లాంటి ఏ రోగాన్నైనా నయం చేయవచ్చనీ, భవిష్యత్తులో మనిషి అవయవం ఏదైనా కోల్పోతే ఈ రక్తంనుండి మళ్లీ ఆ అవయవాన్ని పునరుత్పత్తి చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ దిశగా కృషి జరుగుతోంది.


ఐతే తాయత్తుల్లో పోసి మొలత్రాటికి కట్టి ఉంచితే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఈ స్టెమ్ సెల్స్ బ్రతుకుతాయా? బ్రతకవు. వాళ్లు ఏం పసర్లు కలిపి ఏ ప్రాసెస్ తో వాటిని సజీవంగా ఉంచారో,అసలు సజీవంగా ఉంచగలిగారో లేదో, వాటిని ఎలా పునర్వినియోగం చేసారో ఇప్పుడు మనకు తెలియదు. స్టెమ్ సెల్స్ ఉపయోగం గురించి ఆధునిక వైద్య విజ్ఞానం గుర్తించింది నిన్న మొన్ననే. మొలత్రాడు, తాయత్తులు ఏనాటివి? మరి శతాబ్దాలుగా అలా సేకరించిన వారు ఏ భౌతిక ప్రయోజనం లేకుండానే కేవలం మూఢనమ్మకంతో అలా చేసారా? తెలియదు. వారికి స్టెమ్ సెల్స్ గురించిన పరిజ్ఞానం ఉండేది అనడానికి ఆచారాలే తప్ప ఆధారాలు ఇప్పుడు దొరకడం లేదు కనుక దానిని గురించి వాదన ఇప్పుడు అవసరం లేదు కానీ నమ్మకం మంచిదేగా !!...

మన ఘంటసాల

 🚩మన ఘంటసాల !

తెలుగు వాడికి తెల్లవారితే 'దినకరా శుభకరా' ;

మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే 'భగవద్గీత' ;

సాయంత్రం వేడుకైతే 'పడమట సంధ్యా రాగం, కుడి ఎడమల కుసుమ పరాగం' ;

రాత్రి 'కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది' , అలా కానప్పుడు 'నడిరేయి ఏ జాములో'' ... 'నిద్దురపోరా తమ్ముడా' ....'కల ఇదనీ నిజమిదనీ తెలియదులే' ,

అంతలోనే తెల్ల వారితే 'నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో' అన్న సందేహంలో సంతృప్తి - ఇవన్నీ ఆయన ప్రసాదించిన వరాలే.

తెలుగు విద్యార్ధికి 'ప్రేమ తమాషా వింటేనే కులాసా' . కానీ 'పది మందిలో పాట పాడితే అది అంకితమెవరో ఒకరికే' అన్న సుతి మెత్తని బెత్తం దెబ్బా! తొందర పాటు నిర్ణయాలకు పోతుంటే 'కల కానిది విలువైనది బ్రతుకు- కన్నీటి ధారలలోనే బలి చేయకు' అన్న అక్షర లక్షల 'థెరపీ', ఆవేశం వస్తే 'ఆవేశం రావాలి' కానీ 'ఆవేదన కావాలి' అన్న మందలింపూ, ఆందోళనకు దిగితే 'తెలుగు వీర లేవరా' అన్న అదిలింపూ, ఎవరికి వారయి విడిపోతుంటే 'ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి' అన్న విదిలింపూ- ఇవన్నీ ఆయన అందించిన వివరాలే.

తెలుగు తల్లికి 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' నువ్వున్నావమ్మా అనగానే ఎంత సంబరం!

తెలుగు పడుచుకి 'దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవే నీవే' అనగానే ఎంతటి గర్వం!

'తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా' ఎంతటి సిగ్గూ! ఇదంతా ఆయన గొంతు మహత్మ్యమే.

'పాపాయి నవ్వులే మల్లె పూలు' , ' ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే' అన్నప్పుడు ఎన్ని మల్లెలు పాపాయిలుగా పుట్ట్టా లను కున్నాయో? ఎన్ని బంతి పూలు ఆది శంకరుని తలచు కున్నాయో! 'బలే బలే పావురమా' , 'జగమే మారినది మధురముగా -- పావురములు పలుక' , 'గోరోంక గూటిలో చేరావు చిలక' , 'నా పాట నీ నోట పలకాల సిలక' అన్నప్పుడు ఎన్ని పక్షులు తెలుగు నేర్చుకున్నాయో!'శివ శంకరీ శివానంద లహరీ--మనసు కరుగదా' అనగానే ఎన్ని మృదంగాలు నాట్యమాడ లేదూ! 'మది శారదా దేవి మందిరమే' అనగానే ఎన్ని గంటలు మ్రోగ లేదూ!

ప్రతి సంక్రాంతి 'అసలైన పండుగ-- కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండుగ' గా వాసి కెక్కిందంటే అది ఆ గళం అందించిన బలమే.ప్రతి ఉగాది 'భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు' గా చెలామణి అయ్యిందంటే అది ఆ కంఠం ప్రోద్బలమే. ఇన్నిటికీ, ఇందరికీ, అన్నిటికీ, అందరికీ 'తెలుగు వారి ఇలవేల్పు' గా వెంకటేశ్వరుడుంటే "తెలుగు వారి గళ వేల్పు" ఘంటసాల !”

ఆరుద్రగారు అన్నట్టు మాస్టారూ, 'నీలి మేఘాలలో గాలి కెరటాలలో మీరు (నీవు)

పాడే పాట వినిపించునే వేళా'!

అతడు కోట్ల తెలుగుల ఎద

అంచుల ఊగిన ఉయాల

తీయని గాంధర్వ హేల

గాయకమణి ఘంటసాల - సి.నారాయణరెడ్డి

ఘంటసాలవారి కమనీయ కంఠాన

పలుకనట్టి రాగభావమేది!

ఘంటసాలవారి గాన ధారలలోన

తడియనట్టి తెలుగు టెడద యేది! - దాశరథి

అతడు ప్రసన్న మధుర భావార్ద్రమూర్తి

సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి

లలిత గాంధర్వ దేవత కొలువుదీరు

కలికి ముత్యాలశాల మా ఘంటసాల - కరుణశ్రీ

“ఘంటసాల” ఆ పేరు వింటేనే తెలుగు వాడి గుండెల ఘంటలు గుడి ఘంటలు మొగినత శ్రావ్యమ్గా మోగుతాయి.

“ఘంటసాల” ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండరని ఘంటా పతంగా చెప్పవచ్చు.

ఆబాల గోపాలాన్ని తన కంచు కంఠంతో ఊగిసలాడించి, ఉర్రూతలూగించి, ఊయలలూపిన గాన గంధర్వుడు, గాయకులలో 'న భూతో న భవిష్యతి' గా వాసికెక్కిన మన గళవేల్పు ఘంటసాల మాస్టారి 90 వ పుట్టినరోజిది. ఏ అమరలోకంలో వారీ వేళ సురలకు స్వరలహరుల కచేరీ ఇస్తున్నారో ప్రస్తుతం. త్రిస్థాయిలలో పాడటమే కాక, అద్భుతమైన బాణీలు కట్టి, తెలుగు పద్యాలకు తన శైలిలో, తన ప్రతిభతో క్రొత్త వరవడిని దిద్ది పద్యమంటే ఇలా పాడాలని సూత్రీకరించిన మహా మేధావి, అయినా నిగర్వి మన మాస్టారు. గొంతులో తీపి, హృదయంలో మధురిమ గల గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు.

తెలుగు వారి హృదయాలలో గాయకుడుగా, సంగీత దర్శకుడుగా చెరగని ముద్ర వేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1922లో డిసెంబర్‌ 4 గుడివాడ సమీపం లోని చౌటుపల్లి గ్రామం లో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు . భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మకేమో కానీ, ఘంటసాల గాత్రం మాత్రం తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోతుంది. ప్రజలకు ఆరాధ్యుడుగా, ఓ సంస్కృతికి చిహ్నంగా మాత్రం ఏ గాయకులూ లేరు. ప్రతి తెలుగు కుటుంబంతో పెనవేసుకొన్న గాత్రం ఘంటసాలది.

ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. ఆరేళ్ళపాటు గురువు పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ సాగింది. శాస్త్రిగారు సంగీతరావుగారి తండ్రి. తన తండ్రిని గురించిన విశేషాలు సంగీతరావు గారి వ్యాసాల్లో కనబడతాయి. అవి చదివితే గాయకుడుగా, సంగీత దర్శకుడుగా ఘంటసాలకు మార్గం చూపినది శాస్త్రిగారే ననిపిస్తుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు. శాస్త్రిగారి నుంచి ఘంటసాలకు శృతిశుద్ధి, నాదశుద్ధి, గమకశుద్ధి, తాళగత, స్వరగత లయశుద్ధి అలవడ్డాయి. పాటల్లో సాహిత్యం ముఖ్యమనే అవగాహన కలిగింది.

ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. విజయనగరం చేరిన ఘంటసాల వారాలు చేసుకుంటూ సంగీత కళాశాలలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్న సమయం లో పట్రాయని సీతారామశాస్త్రి గారు ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితముగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. వారాలు చేసుకుంటూ, మధుకరం(భిక్షాటన) చేసుకుంటూ సంగీత సాధన చేసి ద్వారం వెంకట స్వామి నాయుడి గారి చేతుల మీదుగా సంగీత పట్టా పుచుకున్నారు. సంగీత కళాశాల పట్టం పొంది విజయనగరం విడిచిపెట్టే తరుణంలో ఘంటసాల గారి కచేరి ఏర్పాటు కావడం, ఆదిభట్ల నారాయణ దాసుగారు తంబూరా బహూకరించడం ఘంటసాల జీవితం లో ఒక పర్వదినం. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు.

1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తానే తన పెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాలవారు ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి, కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాలవారు ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.ముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండు రూపాయలు చెల్లించి అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశలకోసం వెతికి రాత్రి ఆ పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల వారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు.

1951లో పాతాళభైరవి ,1953లో వచ్చిన దేవదాసు 1955లో విడుదలయిన అనార్కలి ,1955లో విడుదలయిన అనార్కలి ,1957లో విడుదలయిన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి.1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేష శైలవాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకుని అర్ధ శతాబ్దం పాటు తన పాటలతో ఆంధ్రుల మనసులని పరవసింపచేసారు .

ముద్దబంతి పూవులో...

నీవేనా నను పిలచినది...

శివశంకరి... శివానందలహరి...

మనసున మనసై, బ్రతుకున బ్రతుకై...

దేవదేవ ధవళాచల...

ఘనాఘన సుందరా...

కుడిఎడమైతే...

జేబులో బొమ్మ...

తెలుగువీర లేవరా...

రాజశేఖరా నీపై...

కనుపాప కరువైన...

పాడాలని పాడేసిన పాటలు కావివి. ఒక్కో పాట ఆణిముత్యమనటంలో కొత్తగా చెప్పేదేమీ లేదు. సినిమా చూసినా చూడకపోయినా, ఆయన పాటలు వింటే చాలు, సినిమా చూసినట్లే అంటే అతిశయోక్తి కాదు. కవి వ్రాసిన కవిత్వాన్ని గొంతుతో చిత్రంగా ఆవిష్కరించగలిగిన నేర్పరి. అందుకే ఆయన, ఆయన గాత్రం అజరామరం.

ఘంటసాలగారి ఆరోగ్యం ఎప్పుడూ అంతంతమాత్రమే. పెద్ద రికార్డింగ్ ఏదైనా జరిగితే ఆ మర్నాడు ఆయన విశ్రాంతి తీసుకోక తప్పేదికాదని సావిత్రిగారు ఏదో సందర్భంలో చెప్పారు.

.త్రిపురనేని మహారథి ఒక సంగతి చెప్పారు. రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన ఒక రికార్డింగుకు ఘంటసాల వెళ్ళి తయారుగా కూర్చున్నప్పటికీ రాజేశ్వరరావుగారు ఎంతకీ తన గదినుంచి బైటకు రాలేదట. ఘంటసాలగారు విసుక్కుంటూ ‘నేనింతమందికి పాడానుగాని రాజేశ్వర్రావుగారిలా ఇలా హింసపెట్టేవాళ్ళని ఎక్కడా చూళ్ళేదు’ అన్నాడట. దానికి మహారథి ‘దానికేముందండీ, పాడనని చెప్పి వెళ్ళిపోవచ్చుగా?’ అన్నాడట. వెంటనే ఘంటసాల ‘అమ్మమ్మమ్మ, ఎంతమాట? రాజేశ్వర్రావు రికార్డింగు మానుకోవడమా? అలా ఎన్నటికీ చెయ్యను’ అన్నారట. అది ఆయన వినయానికీ, సంస్కారానికీ కూడా మంచి ఉదాహరణ.

ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు.

"నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నోసార్లు చెప్పేవాడు.

మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.

పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు.

సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.

ఘంటసాల ఆ తాత్వికతను జీవితంలోనూ పొదుగుకున్నారు. కొత్తగా వచ్చిన గాయకులకు అవకాశం వచ్చేలా తన వంతు ధర్మాన్ని నిర్వర్తించే వారు. తమ సినిమాలో తానే పాడాలని ఒత్తిడి చేసే నిర్మాతలు, దర్శకుల్ని ఉద్దేశించి కొత్తగా వచ్చిన వారు బాగానే పాడుతున్నారు. వారికి అవకాశం ఇవ్వండి అంటూ వారిని తిప్పి పంపిన సందర్భాలు ఉన్నాయి. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తో ‘నా తరువాత నా అంతటి వాడవవుతావు నాయనా’ అంటూ మనసారా ఆశీర్వదించిన నిండు మనిషాయన. ‘బతికి ఉన్నంత కాలం పాడుతూ ఉండాలని, పాడుతున్నంత కాలమే బతికుండాలని కోరుకుంటున్నాను’ అంటూ తన బలమైన ఆకాంక్షను వ్యక్తం చేసేవారు. చివరికి తాను ఆశించినట్లే , బతికున్నంత కాలం ఆయన పాడుతూనే ఉన్నారు.

1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండేనొప్పి రావటం తో కొంత కాలం విశ్రాంతి తీసుకుంటున్న సమయం లో భగవద్గీత చేయాలన్న ఆలోచన రావటం వెంటనే దాన్ని అమలుపరచడం జరిగాయి. ఈనాటికీ ఘంటసాల వారి భగవద్గీత ఒక ఆణిముత్యం. 1974 ఫిబ్రవరి 11న ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అర్ధశతాబ్దం పాటు మనలని తన గాన మాధుర్యం తో అలరించిన ఆ గొంతు మూగబోయింది. ఘంటసాల గారు మన అందరి హృదయాలలోనూ ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వారు అమరులు….వారు అమరులు….వారు అమరులు.

ఘంటసాల వెంకటేశ్వరరావు మనని వదలి వెళ్ళి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ ఆయన పాటలను ఎవరూ మరిచిపోలేదు. ఆయనకు సాటి

రాగల గాయకుడూ రాలేదు. తెలుగు సినీ సంగీతపు స్వర్ణయుగానికి ప్రతీకగా ఆయన అమరుడే.

గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ, శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం, కరుణశ్రీ వారి సులభ శైలి గద్యాలు, పద్యాలు, రావులపర్తి బద్రిరాజు గారి వెంకటేశ్వరుడు, ఘంటసాల వారి 'మృత్యు వంటే భయం లేని' రచన, దేవులపల్లి వారి అపర కాళిదాసీయ మేఘ సందేశం-- ఆ గొంతులో ఎంతగా బందీలైపోయాయంటే మళ్ళీ అటువంటివి మరో గొంతు నుండి విడుదల కాలేదు.

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు 1944 లో 'స్వర్గ సీమ' చిత్రానికి తొలుతగా పాడి మూడు పదుల కాలం సంగీత సామ్రాట్టు గా చిత్ర సీమను ఏలారు. 'విధి ఒక విష వలయం' కనుక ఆ అమృత కంఠానికి కేవలం అయిదు పదుల కాలం మాత్రమే భౌతిక రూపం దక్కింది. ఇక అప్పటి నుంచి తెలుగు వారికి పద్యాలు కరువయ్యాయి, మంచి తెలుగు పలుకులు అరుదయ్యాయి.

చలచిత్ర నేపథ్య సంగీత స్వరహేల

గంధర్వ మణిమాల ఘంటసాల

సంగీత సాహిత్య సరసార్ధ భావాల

గాత్ర మాధుర్యాల ఘంటసాల

పద్యాల గేయాల వచనాల శ్లోకాల

గమకాల గళలీల ఘంటసాల

బహువిధ భాషల పదివేల పాటల

గాన వార్నిధిలోల ఘంటసాల

కమ్ర కమనీయ రాగాల ఘంటసాల

గళవిపంచికా శృతిలోల ఘంటసాల

గాంగనిర్ఘర స్వరలీల ఘంటసాల

గాయకుల పాఠశాల మా ఘంటసాల।

శ్రీమద్భాగవతము

 *30.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2277(౨౨౭౭)*


*10.1-1401-వ.*

*10.1-1402-*


*క. మధుసూదన సత్కరుణా*

*మధురాలోకన విముక్త మానస భయులై*

*మధురవచనములఁ దారును*

*మథురానగరంబు ప్రజలు మనిరి నరేంద్రా!* 🌺



*_భావము: ఓ రాజా! ఆ తరువాత, కంసుని భయానికి పారిపోయి ఎక్కడెక్కడో తలదాచుకున్న తన జ్ఞాతులూ, బంధువులయిన యదువులు, వృష్ణులు, భోజులు, మరువులు, దశార్హులు, కుకురులు, అంధకులు మొదలైన వారినందరినీ శ్రీకృష్ణుడు పిలిపించాడు. వారి మనసుకు సంతోషము కలిగిస్తూ, వారికి ధన వస్తు వాహనములు బహుమానంగా ఇచ్చి, వసతి కల్పించి, వారి వారి గృహాలలో నివసించమని నియోగించాడు. వారందరు, మధు అనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుని మధుర వీక్షణములచే మనస్సులోని భయము పోగొట్టుకున్నవారై, ఆతని అమృతవాక్కులచే సాంత్వనము పొంది, మథురానగర పౌరులుగా సుఖంగా జీవించారు."_* 🙏



*_Meaning: Suka Maharshi narrated further the events that followed the slaying of Kamsa, to Parikshit: "O king! Sri Krishna then sent word about killing of Kamsa to all the relatives (clans of Yadu, Vrushni, Bhoja, Maruvu, Dasarha, kukura and Andhaka etc.), who fled the country for fear of Kamsa over the decades and took refuge at various places. To their pleasure and happiness, he gave away gifts in the form of money, things and houses for their comfortable stay. All of them were appreciative of Sri Krishna's delightful glances and kind gesture and lived as subjects of Magadha._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ధర్మం తప్పని వాడు

 ఒక యజ్ఞం జరుగుతోంది. యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు భార్య చెప్పింది. 

"నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది."


ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.


ఈ వార్త ఆనోటా ఈనోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఉమ్మేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప. 


"యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు" అన్నాడాయన.


ఊరు ఊరంతా ధనవంతులయ్యారు ఒక్క అర్క సోమయాజి తప్ప.

ఆయన భార్యకు ఇది నచ్చలేదు. "మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.

అర్కసోమయాజి ససేమిరా అన్నాడు. చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది. ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు. 


ఊరి పొలిమేర దాటాడో లేదో ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నాయి. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప. 


అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.


"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను." అన్నాడు కలిపురుషుడు.


*ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే*


ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు అయినప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు. కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది..


II ధర్మో రక్షతి రక్షితః || 🙏🙏🌹 ఓం నమో వెంకటేశాయ🌹🙏🙏

త్రిగుణములు :

 

త్రిగుణములు : 

ఇవి అన్యోన్య దాంపత్యమును అన్యోన్య సంశయమును గలవి. అన్యోన్య సంకలితములైఅన్యోన్య ఉపజీవితము గలవి. దుర్బోధము లైనవి. ఒక గుణము ప్రధానముగా వ్యక్తమైనప్పుడు మిగిలిన రెండు గుణములు అణగియుండును. తమోగుణము నియమితమైతే రజో గుణము సాగును. రజస్సు నియమితమైతే సత్వము సాగును. సత్వము అణిగినప్పుడు తమస్సు మొదలగును. ప్రతి వ్యవహారములోను గుణములు గుణములతో సంపర్కమవుతూ ఉండును. గుణములే వాసనల రూపమును క్షోభపెట్టి కాలానుగుణ్యముగా జీవుని అనుభవమునకు తీసుకొని వచ్చుచుండును. అపక్వవాసనలను పక్వానికి తెచ్చేవి గుణములే. క్షోభకు గురియైన వాసనలే ప్రారబ్ధ  అనుభవము నిచ్చుచున్నవి. త్రిగుణ రహితునికి సంచిత వాసనలు 

నిర్బీజమగును. క్షోభ లేనందున ప్రారబ్ధముండదు. అదే జన్మరాహిత్యము. త్రిగుణ రహితుడే పరబ్రహ్మము.

 

శుద్ధ సాత్వికములు : 

సత్వముసంతోషముఅహింసధైర్యముక్షమఆర్జవముసన్న్యాసముపరిత్యాగమువిజ్ఞానము మొదలగునవి సహజమై యుండుట శుద్ధ సత్వగుణము.

 

సత్వగుణ జనితములు : జపముదానముయజ్ఞముతపస్సు మొదలగునవి.

 

త్రిగుణ సామ్యము : శుభముశాశ్వతత్వము

 

త్రిగుణముల అవ్యక్తము : మోక్షము

 

త్రిగుణ రహితము : అచల పరిపూర్ణముపరమ పదము.

 

త్రిగుణ కర్తలు : 

అనాసక్త భావముతో కర్మలను చేసేవాడు సాత్విక కర్త. రాగముతో కర్మలు చేసేవాడు రాజసిక కర్త. స్మృతి భ్రష్టుడై యుక్తాయుక్త విచక్షణ లేకుండా కర్మలు చేసేవాడు తామసిక కర్త. కేవలము సర్వాంతర్యామిసర్వబాహ్యాంభ్యంతర స్వరూపుడగు పరమాత్మను ఉద్దేశించి కర్మలు చేసేవాడుమరియు ప్రతి కర్మను పరమాత్మారాధనగా చేసేవాడు గుణాతీతకర్త.

 

త్రిగుణ వాసములు : 

వనవాసము సాత్వికవాసము. గ్రామవాసము రాజసిక వాసము. జూదపాన గృహము తామసిక వాసము. దేవాలయములుఋష్యాశ్రమములుపుణ్య క్షేత్రములుహృదయ నివాసము - ఇవి గుణాతీత వాసములు.

 

త్రిగుణావస్థలు : 

సత్వగుణము ప్రవృద్ధమైనప్పుడు జాగ్రదవస్థ. రజోగుణము ప్రవృద్ధమైనప్పుడు స్వప్నావస్థ. తమోగుణము ప్రవృద్ధమైనప్పుడు సుషుప్త్యావస్థ. మూడు గుణములు క్షీణించినప్పుడు మూడు అవస్థలకు సాక్షియైఆత్మానుభవము పొందినప్పుడు తురీయావస్థ.

 

త్రిగుణ కర్మలు : 

సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రీతి కలిగించే ఉద్దేశ్యముతో ఫలాభిలాష లేకుండాసమర్పణ భావముతో అనుష్ఠింపబడే నిత్య నైమిత్తిక కర్మలు సాత్విక కర్మలు. లోక సంబంధమైన ఫలమును కోరి చేసే కర్మలు రాజసిక కర్మలు. సహజీవులను బాధిస్తూహింసిస్తూదంభ మత్సరములతో కూడిన కర్మలుఇతరులపై ఆధిపత్యమును చెలాయించే కర్మలు తామసిక కర్మలు. కర్తృత్వముభోక్తృత్వము లేకుండా జరిపే కర్మ సాధనములందు ఫలత్యాగముతోనుసర్వము బ్రహ్మరూపమని చేసే కర్మలు గుణాతీత కర్మలు.