30, సెప్టెంబర్ 2021, గురువారం

తాయత్తు

 #తమిళంలో 'తాయ్' అంటే తల్లి. 'అత్తు' అంటే ఖండించడం. తాయత్తు అన్న మాటకు అర్థం తల్లి (నుండి) ఖండించినది అని. ఏమిటది? బొడ్డుతాడు (ఉంబిలికల్ కార్డ్). ప్రాచీనకాలంలో బిడ్డ పుట్టగానే మంత్రసాని బొడ్డుతాడునుండి సేకరించిన రక్తాన్ని కొన్ని పసరులతో కలిపి ఒక గొట్టంలో పోసి మూతపెట్టి ఉంచేది. బారసాల అయినాక ఆ గొట్టాన్ని ఒక త్రాటికి కట్టి దానిని మొలత్రాడుగా కట్టేవారు. అదే తాయత్తు.ac


ఈ ఆచారం అనేక ప్రాంతాలలో, పల్లెపట్టుల్లో ఉండేది. ఎవరికైనా పాము కరిచినా, ఏదైనా పెద్ద జబ్బు చేసినా, సిద్ధ వైద్యులు ఈ తాయత్తులోని రక్తాన్ని తీసి ఇతర మందులు కలిపి వైద్యం చేసేవారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి స్టెమ్ సెల్స్ కావాలంటే అతని మొలత్రాడును తడిమితే సరిపోతుంది. అది దాచడానికి అంతకంటే భద్రమైన ప్రదేశం ఏది?


ఐతే కాలక్రమంలో ఇలా స్టెమ్ సెల్స్ భద్రపరిచే జ్ఞానం లుప్తమైపోయింది. కేవలం ఆచారం మాత్రం మిగిలింది. తాయెత్తు గొట్టంలో ఏం ఉంచాలో తెలీక రాగిరేకులపై వ్రాసిన యంత్రాలు వంటివి ఉంచి కట్టడం ప్రారంభించారు. మెల్లగా తాయత్తు అన్నది మూఢనమ్మకం అన్న నమ్మకం ప్రబలి తాయత్తును వదిలి కేవలం మొలత్రాడు మాత్రం కట్టడం ప్రారంభించారు. ఇప్పుడు అదీ పోయింది. పోయి ఇది వచ్చింది:


ఇప్పుడు బొడ్డు తాడునుండి స్టెమ్ సెల్స్ సేకరించి భద్రపరిచే బాంకులు భారత దేశంలో కూడా ఉన్నాయి. ఐతే ఈ ఆధునిక తాయత్తులను చాలా జాగ్రత్తగా క్రయోజెనిక్ ఉష్ణోగ్రతలలో భద్ర పరచాలి. అది ఉంటే కాన్సర్ లాంటి ఏ రోగాన్నైనా నయం చేయవచ్చనీ, భవిష్యత్తులో మనిషి అవయవం ఏదైనా కోల్పోతే ఈ రక్తంనుండి మళ్లీ ఆ అవయవాన్ని పునరుత్పత్తి చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ దిశగా కృషి జరుగుతోంది.


ఐతే తాయత్తుల్లో పోసి మొలత్రాటికి కట్టి ఉంచితే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఈ స్టెమ్ సెల్స్ బ్రతుకుతాయా? బ్రతకవు. వాళ్లు ఏం పసర్లు కలిపి ఏ ప్రాసెస్ తో వాటిని సజీవంగా ఉంచారో,అసలు సజీవంగా ఉంచగలిగారో లేదో, వాటిని ఎలా పునర్వినియోగం చేసారో ఇప్పుడు మనకు తెలియదు. స్టెమ్ సెల్స్ ఉపయోగం గురించి ఆధునిక వైద్య విజ్ఞానం గుర్తించింది నిన్న మొన్ననే. మొలత్రాడు, తాయత్తులు ఏనాటివి? మరి శతాబ్దాలుగా అలా సేకరించిన వారు ఏ భౌతిక ప్రయోజనం లేకుండానే కేవలం మూఢనమ్మకంతో అలా చేసారా? తెలియదు. వారికి స్టెమ్ సెల్స్ గురించిన పరిజ్ఞానం ఉండేది అనడానికి ఆచారాలే తప్ప ఆధారాలు ఇప్పుడు దొరకడం లేదు కనుక దానిని గురించి వాదన ఇప్పుడు అవసరం లేదు కానీ నమ్మకం మంచిదేగా !!...

కామెంట్‌లు లేవు: