9, అక్టోబర్ 2021, శనివారం

సంస్కృత మహాభాగవతం*

 *9.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*


*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*సనకాదయ ఊచుః*


*13.17 (పదిహేడవ శ్లోకము)*


*గుణేష్వావిశతే చేతో గుణాశ్చేతసి చ ప్రభో|*


*కథమన్యోన్యసంత్యాగో ముముక్షోరతితితీర్షోః॥12703॥*


*సనకాది మహర్షులు ఇట్లు పలికిరి* "తండ్రీ! చిత్తము శబ్దాది విషయములయందే లగ్నమై యుండును. శబ్దాది విషయములు చిత్తమును తమవైపు లాగుకొనుచుండును. అనగా చిత్తము, విషయము పరస్పరము కలిసిమెలిసి యుండును. ఇట్టి స్థితిలో సంసారసాగరమునుండి బయటపడి, ముక్తిని పొందగోరు పురుషుడు చిత్తము, విషయములు అను ఈ రెండింటినుండి బయటపడుట ఎట్లు?"


*శ్రీభగవానువాచ*


*13.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*ఏవం పృష్టో మహాదేవః స్వయంభూర్భూతభావనః|*


*ధ్యాయమానః ప్రశ్నబీజం నాభ్యపద్యత కర్మధీః॥12704॥*


*శ్రీభగవానుడు చెప్పెను* దేవశ్రేష్ఠుడు, స్వయంభువుడు, సృష్టికర్త ఐన బ్రహ్మదేవుడు సనకాది మునుల ప్రశ్నకు తగిన సమాధానమునకై కొంత తడవు తన మనస్సునందు (లోతుగా) ఆలోచించెను. కానీ కర్మాధీను డగుటవలన ఆ పరమేష్ఠికి ప్రశ్నయొక్క ఆధారమేమిటో బోధపడకుండెను?"


*13.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*స మామచింతయద్దేవః ప్రశ్నపారతితీర్షయా|*


*తస్యాహం హంసరూపేణ సకాశమగమం తదా॥12705॥*


అప్పుడు సనకాదుల ప్రశ్నకు సమాధానమును తెలిసికొనుటకై బ్రహ్మదేవుడు నన్ను (శ్రీహరిని) స్మరించెను. అంతట నేను అతనికి హంసరూపమున ప్రత్యక్షమైతిని. 


*యథాహంసః క్షీరం నీరంచ పృథక్కర్తుం శక్తః, ఏవమ్ అహం గుణాన్, చేతశ్చ సమీచీనోపాయోపదేశేన పృథక్కర్తుమ్ అవతీర్ణః* - హంస నీటీని, పాలను వేఱుచేయుటలో సమర్థమైనది. అట్లే విషయములను, చిత్తమును వేఱుపరచెడి ఉపాయమును ఉపదేశించుటకై హంసరూపమున అవతరించినది. (వీరరాఘవీయ వ్యాఖ్య)


*13.20 (ఇరువదియవ శ్లోకము)*


*దృష్ట్వా మాం త ఉపవ్రజ్య కృత్వా పాదాభివందనమ్|*


*బ్రహ్మాణమగ్రతః కృత్వా పప్రచ్ఛుః కో భవానితి॥12706॥*


అంతట సనకాదిమహర్షులు హంసరూపముననున్న నా కడకు వచ్చి, బ్రహ్మదేవుని ముందుంచుకొని నాకు ప్రణమిల్లిరి. పిదప వారు 'నీవు ఎవరు?' అని ప్రశ్నించిరి.


*13.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ఇత్యహం మునిభిః పృష్టస్తత్త్వజిజ్ఞాసుభిస్తదా|*


*యదవోచమహం తేభ్యస్తదుద్ధవ నిబోధ మే॥12707॥*


ఉద్ధవా! తత్త్వజిజ్ఞాసువులైన సనకాదిమునులు ఇట్లు ప్రశ్నింపగా నేను వారికి తెలిపిన విషయమును ఇప్పుడు నీకు వివరింతును. వినుము.


*13.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*వస్తునో యద్యనానాత్వమాత్మనః ప్రశ్న ఈదృశః|*


*కథం ఘటేత వో విప్రా వక్తుర్వా మే క ఆశ్రయః॥12708॥*


*13.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*పంచాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుతః|*


*కో భవానితి వః ప్రశ్నో వాచారంభో హ్యనర్థకః॥12709॥*


"విప్రోత్తములారా! మీరు ఆత్మనుగుఱించి నన్ను ప్రశ్నించియున్నచో 'ఆత్మ అంతటను ఒక్కటే. మీలోను, నాలోను, ఆత్మ ఒక్కటే. ఆత్మ తప్ప మరియొక వస్తువు ఏదియును లేదు. ఇట్టి స్థితిలో దేని ఆధారముగా నేను ఎవరినని చెప్పవలెను? వాస్తవముగా పంచమహా భూతములతో (పృథివ్యాపస్తేజోవాయు రాకాశములతో) గూడిన తత్త్వము అన్ని ప్రాణులయందును సమానమే. కనుక 'నీవు ఎవరు?' (కోభవాన్?) అను ప్రశ్న వ్యావహారికముగా సరిపోవచ్చునేమోగాని తాత్త్వికముగా అర్థరహితమైనది.


*13.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*మనసా వచసా దృష్ట్యా గృహ్యతేఽన్యైరపీంద్రియైః|*


*అహమేవ న మత్తోఽన్యదితి బుధ్యధ్వమంజసా॥12710॥*


మనస్సు చేతను, వాక్కుచేతను, దృష్టిచేతను, ఇంకను తదితర ఇంద్రియములద్వారాను చూడబడునది. వినబడునది, యోచన చేయుబడునది అంతయు నేనే. నేను తప్ప అన్యమేదియును లేదని నిశ్చయముగా ఎరుంగుడు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

స్వర్ణభస్మం

 స్వర్ణభస్మం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


      కొన్నిరకాల వ్యాధులలో మరియు కొన్ని మొండి జబ్బులలో ఔషధాలుగా మూలికలు కు బదులుగా భస్మాలు ఉపయోగించడం జరుగుతుంది. వీటి ఫలితం కొన్ని సమయాలలో ఎలా ఉంటుంది అంటే అల్లోపతి వైద్యవిధానంలో ఇంజక్షన్ మందు పనిచేసే సమయంకంటే లోపలే ఈ భస్మ ఔషధం అత్యంత వేగంగా ఫలితాన్ని ఇవ్వగలదు . 


                 ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇంకా భస్మాలు తయారు చేసే ప్రక్రియ మరియు తయారుచేసే వ్యక్తులు ఇంకా ఉన్నారు . మూలికలు ఉపయోగించి ఔషదాలు తయారు చేసే ప్రక్రియకు పూర్తి బిన్నదిశలో ఈ భస్మ తయారి ప్రక్రియ ఉంటుంది.  


           మొదట మనం తయారు చేయాలి అనుకుంటున్న భస్మానికి మూల ధాతువుని సేకరించుకోవాలి . ఉదాహరణకి చెప్పాలంటే స్వర్ణభస్మ తయారి విధానం గురించి మీకు వివరిస్తాను .


          మంచి స్వర్ణపు రేకులను సేకరించుకొనవలెను . అది అత్యంత స్వచ్ఛమైనది అయి ఉండవలెను . ఆ రేకులను మొదట కాల్చి నువ్వులనూనె , పుల్లటి మజ్జిగ , ఉలవ కట్టు , ఆవుపంచితం వీనిలో 7 పర్యాయములు వేసిన శుద్ది అగును. లేదా ఎర్రటి ముండ్ల తోటకూర నూరి ఆ రసము నందు బంగారు రేకులను 2 దినములు నానబెట్టినను స్వర్ణం శుద్ది అగును. 


                   ఆ విధంగా శుద్ది అయినటువంటి స్వర్ణపు రేకులను చిన్న కుండ యందు ఉంచి పైన ఒక మట్టిచిప్ప బోర్లించి లోపలికి వాయుప్రసారం జరగకుండా చుట్టూ చీల మన్ను ఉపయోగించి సీలు వేయవలెను . దానిని నడుము వరకు తీసినటువంటి గొయ్యి మధ్యభాగం నందు ఉంచి అన్నివైపులా సెగ తగిలేవిధంగా చుట్టూ ఆవుపిడకలని పేర్చుకుంటూ రావలెను . ఆ పిడకల సంఖ్య 500 వరకు ఉండవలెను . దీనినే ఆయుర్వేద పరిభాషలో" గజపుటం " అంటారు . 


                 ఈ విదంగా అన్నివైపుల సమానంగా పేర్చిన తరువాత మన ఇష్టదైవాన్ని మరియు ధన్వంతరిని ప్రార్ధించి ఒక క్రమ పద్దతిలో ఆ పిడకలని వెలిగించవలెను . ఆయొక్క పిడకల వేడికి లోపల ఉన్నటువంటి స్వర్ణపు రేకులు భస్మంగా మారతాయి. ఆ తరువాత దానిని జాగ్రత్తగా సేకరించుకుని తగిన మోతాదుల్లో ఔషదాల్లో వాడుకోవచ్చు . ఇది అత్యద్బుతంగా పనిచేయును . తరుచుగా కొన్ని ప్రత్యేక ఔషధాలలో నేను దీనిని వాడుతాను. 


            దీనిని ఉపయోగించుట వలన త్రిదోషములు అనగా వాత ,పిత్త ,కఫములు దోషం పొందడం వలన కలుగు వ్యాదులను పొగొట్టును. ముఖ్యంగా వాతవ్యాధులను హరించుటలో చాలా ఉపయోగపడును. లొపలికి తీసుకోవడడం వలన నేత్రవ్యాధులను హరించును . ఆయుషుని వృద్ధిపరుచును. బుద్దిని పెంచును. నేను ఇప్పటివరకు దీనిని చాలా రోగాలపై ప్రయోగించి విశేషమైన ఫలితాలు పొందాను. క్షయరోగం నివారించుటలో ఇది నాకు చాలా సహాయపడింది. అజీర్ణం వలన కలుగు జ్వరాన్ని నివారించును. ఎంతో బలమైన ఔషదాలు వాడినను తగ్గని మొండి వ్యాదులను ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గించవచ్చు.  


     

                  విషము తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ముందు తామ్రభస్మంతో ముందు వాంతిని చేయించి ఒక పావుతులం స్వర్ణ భస్మమును లొపలికి ఇచ్చిన విషము కంటే వేగముగా హృదయమును చేరి హృదయం నకు విషమును చేరకుండా అడ్డుకొనును . కాని పావుతులం ఒకేసారి ఒక్క మోతాదుగా ఇవ్వవలెను . 


              ఈ స్వర్ణభస్మముని 10 గ్రాములను 60 మోతాదులుగా లేదా 100 మోతాదుగా విభజించి వాడుకోవచ్చు . దీనిని ఎంత పెద్ద మోతాదులో వాడినను ఎటువంటి విపరీత పరిణామాలు సంభవించవు. మీకు ఎటువంటి సమస్యలు లేకున్నను ధనమును ఖర్చుపెట్టగలవారు వాడుకొనవచ్చు. 


          మంచి ఆరోగ్యం , మేధాశక్తి, హృదయమునుకు బలమునిచ్చును. రక్తపోటు వ్యాధి ఉన్నవారు దీనిని వాడటం వలన మంచిఫలితాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా రసాయన ఔషదం దీనిని ఉపయోగించువారికి పెట్టుడు మందులు మరియు విషములు వారిపై పనిచేయవు. ఆపకుండా 20 సంవత్సరములు ఉపయొగించువారికి "కాయసిద్ధి " కలగచేయును . అనగా వయస్సు పెరుగుతున్నా ముసలి లక్షణములు కలగవు. 


           ఈ స్వర్ణభస్మానికి మరికొన్ని భస్మాలు కలిపి మధుమేహరోగులు తీసుకోవచ్చు. ఈ స్వర్ణభస్మ సేవించడం వలన మధుమేహ రోగులలో అంతర్గత అవయవాలు మధుమేహం పెరగటం వలన దెబ్బతినకుండా కాపాడవచ్చు. అదేవిధముగా స్త్రీలకు , పిల్లలకు లేహ్యాలలో కలిపి ఇవ్వడం ద్వారా వయస్సురీత్యా వచ్చు హార్మోనల్ సమస్యలకు మరియు శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించుటకు అద్భుతముగా పనిచేయును . పిల్లలకు మంచి తెలివితేటలు కలుగును. మేధస్సు పెరుగును . శరీరదోషాలు పోగొట్టును. 


    ఈ స్వర్ణ భస్మం అనునది ఆయుర్వేదము నందలి భస్మప్రకరణలో తెలియచేసిన మిగిలిన భస్మములన్నిటిలో ఇది "రారాజు " వంటిది. 


          ప్రస్తుతకాలంలో పూర్తిగా పురుగుమందులతో కలుషితం అయిన ఆహారాన్ని మనం తీసుకొనుచున్నాము .ఇలాంటి ఆహారాన్ని సేవించుట వలన మన శరీరము నందలి ధాతువులు దోషాన్ని పొంది అనేకరకాల రోగాలు రావడం జరుగును. ఇలా విషపూరితం అయిన శరీరాన్ని శుద్ధి చేసుకొనుట అత్యంత ముఖ్యం . ఇలా శుద్ధి చేయుటకు స్వర్ణభస్మం అత్యంత ఉపయోగికారిగా ఉండును . 


 

 గమనిక -  

  

    ఈ స్వర్ణభస్మం ఖరీదు కొంచం ఎక్కువగా ఉండును. ఈ భస్మాన్ని వాడదలచిన వారు అనుభవపూర్వకంగా అవగాహన ఉన్న వైద్యుల వద్ద మాత్రమే తీసుకోండి . అవసరం ఉన్నవారు నన్ను సంప్రదించగలరు. 


      నా నంబర్ 9885030034 . ఈ నంబర్ కి ఫోన్ ద్వారా సంప్రదించగలరు. 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


                 అనువంశిక ఆయుర్వేదం 


                       9885030034

"60 ఏళ్ళ పూర్వం జీవన శైలి."*

 🤘🤘*"60 ఏళ్ళ పూర్వం జీవన శైలి."*🤘🤘


*"🌹ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు."*


*"🌹కొంతమంది కచ్చిక, (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు."*


*"🌹మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే, నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి."*


*"🌹ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, 

లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. 

Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు."*


*"🌹కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు."*


*"🌹బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ, పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలు ది."*


*"అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు."*


*"🌹ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు, ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే."*


*"🌹అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి."*


*"అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు."*


*"🌹బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు."*


*"🌹సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ, రాలేకపోతే, అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం."*


*"🌹రాత్రిపూట7, 8 గంటలకు మాదాకవళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళం అబ్బాయికిచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.*"


*"టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేవి."*


*"🌹పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు."*


*"🌹ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు."*


*"🌹డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు. గదులు కూడా చాలా పెద్దవి."*


*"3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది."*


*"🌹వైద్యం కి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది. అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు."*


*"🌹ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు. అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు."*


*"🌹పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు."*


*"🌹రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం. అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర. వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రే."*


*"🌹ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది. రెండు రూపాయలు పెట్టి, ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు."*


*"🌹అదీ ఆరోజుల్లో జీవన శైలి.

ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు నిర్వహించేవారు.😃🤷🏻‍♂️"*


*"🌹అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి 

వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు. ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు."* 


*"కక్షలూ కార్పణ్యాలు. కోప తాపాలు కుళ్ళూ కపటం. ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునే వారే లేరు. అహంకారం ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి."* 


*"🌹వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. మరుజన్మ ఉన్నదో లేదో 

ఆ రోజులు మరలా వస్తాయో రావో !అంతా దైవేఛ్ఛ."*

🙏


Credits: చరిత్రలో ఈరోజు

శ్రీమద్భాగవతము

 *09.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2286(౨౨౮౬)*


*10.1-1415-వ.*

*10.1-1416*


*శా. "అంభోరాశిఁ బ్రభాసతీర్థమున ము న్నస్మత్తనూసంభవుం*

*డంభోగాహము సేయుచున్ మునిఁగి లేఁ డయ్యెం గృపాంభోనిధుల్*

*శుంభద్వీర్యులు మీరు మీ గురునకుం జోద్యంబుగా శిష్యతన్*

*గాంభీర్యంబునఁ బుత్రదక్షిణ యిడం గర్తవ్య మూహింపరే.* 🌺



*_భావము: విద్యాభ్యాసములో కృతార్థులైన బలరామ కృష్ణులను, వారి అపూర్వప్రభావమునకు ఆశ్చర్యమొందిన సాందీప ముని తన భార్యతో కలిసి వారితో: "సముద్రమునందలి ప్రభాస తీర్థములో ఇంతకు పూర్వము మా తనయుడు స్నానము చేస్తూ మునిగిపోయి మరణించాడు. మీరు కరుణాసముద్రులు, మహా పరాక్రమవంతులు. గురుదక్షిణగా, నా కుమారుని తెచ్చి ఇస్తే, అది అద్భుత కార్యముగా, యుక్తముగా , ఘనముగా ఉంటుంది. ఆలోచించండి. !"_* 🙏



*_Meaning: Balarama and Sri Krishna successfully completed their studies in the shortest possible time. Amazed at their exceptional and incredible brilliance, Guru Sandeepa, along with his wife spoke to them: "Some time ago, our son while taking bath in prabhasa teertha, in the sea, drowned and died. You are personification of compassion and are great warriors. It would be a tremendous gesture and quite an appropriate and wonderful gift for me, if you can bring back my son and offer as Guru Dakshina. Think over"_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347314215).*

జ్ఞానోదయం- మౌనం

 *🧘‍♂️జ్ఞానోదయం- మౌనం 🧘‍♀️*



*ఒక పౌర్ణమి రోజున బుద్ధుడికి జ్ఞానోదయమైంది. ఆ వారమంతా ఆయన మౌనంలోనే ఉన్నారంటారు. ఒక్క మాటైనా మాట్లాడలేదు. పురాణగాథల ప్రకారం స్వర్గంలో దేవతలు భయపడిపోయారట. వాళ్లకు తెలుసు- కొన్ని లక్షల సంవత్సరాలకోసారి ఎవరో బుద్ధుడిలా వికసించడం జరుగుతుందని. ఇప్పుడు ఆయన మౌనంలో ఉన్నాడు.



*దేవతలు ఏదైనా మాట్లాడమని ఆయనను కోరారు. అప్పుడాయన- ‘తెలిసినవారికి అర్థమవుతుంది నేనేం చెప్పకపోయినా... తెలియనివారికి నేనేం చెప్పినా బోధపడదు. ఇది అంధుడి ముందు వెలుగును వర్ణించడంలాంటిది. జీవితంలోని అమృతాన్ని రుచిచూడని వారితో నేనేం మాట్లాడినా వ్యర్థం. అందుకే ఈ మౌనం. పవిత్ర గ్రంథాలు ఏనాడో చెప్పాయి- ఎక్కడ మాటలు ఆగిపోతాయో, అక్కడ సత్యం మొదలవుతుంది’ అన్నాడు.



*బుద్ధుడి మాటలు కచ్చితంగా నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎందుకంటే ఆయన నిశ్శబ్దానికి ప్రతిరూపం. అదే జీవానికి మూలం, అన్ని రుగ్మతలకూ ఔషధం.



*మనుషులు కోపంగా ఉంటే మౌనాన్ని పాటిస్తారు. ముందు అరుస్తారు, తరవాత నిశ్శబ్దం ఆవరిస్తుంది. తెలివైన వారూ చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోతారు.



*మాటల ఉద్దేశం నిశ్శబ్దాన్ని సృష్టించడానికే. మాటలు శబ్దానికి కారణమైతే వారు లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని అర్థం. ‘శబ్దాలు, మాటలు ఏదైనా వ్యక్తపరచడానికే. అవి అనుబంధోత్పత్తి మాత్రమే. దానికంటూ అస్తిత్వం లేదు. ఆలోచనను వ్యక్తపరచేందుకు వాహకనాళం. ఒక మట్టికుండలాంటిది... మట్టికాదు... ఓంకారం అసలైనది’ అంటారు ఆది శంకరాచార్య మాండూక్యోపనిషత్తులో.



*మనసులోని రొద దేని గురించి? ధనం, కీర్తిప్రతిష్ఠలు, సంబంధబాంధవ్యాలు... శబ్దం ఏదో ఒక దాని గురించి. దేని గురించీ కానిది నిశ్శబ్దం. నిశ్శబ్దం మూలం... శబ్దం ఉపరితలం.



*మొదటినుంచీ బుద్ధుడిది సంతృప్తికరమైన జీవితం. ఏ సుఖమైనా కావాలనుకుంటే చాలు- ఆయన పాదాల దగ్గరుండేది. వెళ్ళి ప్రపంచాన్ని చూడాలనుకున్నాడు. తనకు తానుగా యథార్థం తెలుసుకోవాలనుకున్నాడు. తన స్థానాన్ని, భార్యను, కొడుకును వదిలిపెట్టాడు. నిశ్శబ్దం ఎంత దృఢంగా ఉంటే లోపలి నుంచి తలెత్తే ప్రశ్నలు అంత శక్తిమంతంగా ఉంటాయి. ఆయనను ఏదీ ఆపలేదు.



*ఎటువంటి మనిషైనా జీవితంలో కొన్నిసార్లైనా మౌనంగా ఉండే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఎందుకంటే మనసులో, హృదయంలో జరుగుతున్నదాన్ని సంపూర్ణంగా ఏ మాటలూ వివరించలేవు. మౌనం శక్తిమంతమైన సందేశాలను అందిస్తుంది. సహనం, మౌనం- రెండూ బలమైన శక్తులు. సహనం మానసికంగాను, మౌనం భావోద్వేగాలపరంగానూ అని అర్థం చేసుకోవాలి. మనిషి తన సహజ స్వభావాన్ని తెలుసుకోవాలి. సహజ లక్షణాలుగా భావించే శాంతి, కరుణ, ప్రేమ, స్నేహం, సంతోషం... ఇవన్నీ నిశ్శబ్దం నుంచి పుట్టేవే. నిశ్శబ్దం బాధను, అపరాధాన్ని, దుఃఖాన్ని మింగేస్తుంది.



*వివేకంతో ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరూ కష్టాలసాగరం దాటవచ్చు. సుఖాల తీరం చేరుకోవచ్చు. ఎవరైనా మౌనంగా ఉండిపోయారంటే వారు మాట్లాడలేకపోయారని, ఓడిపోయారని కాదు. అర్థం చేసుకోలేనివారితో వాదించడం ఇష్టంలేక అలా ఉండిపోయారనుకోవాలి.

తమిళనాడు ప్రభుత్వ రాయల్ గన్ సెల్యూట్..

 🙏🙏. 👆🏽👆🏽👆🏽


దేవతల సేనాని కుమారస్వామి వారికి తమిళనాడు ప్రభుత్వ రాయల్ గన్ సెల్యూట్..


దసరా నవరాత్రి వేడుకల కోసం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్యాకుమారి జిల్లా నుంచి తిరువనంతపురం నగరానికి బయలుదేరిన సరస్వతీ దేవీ..


మున్నుట్టి నంగా .. కుమారస్వామి ..

వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారం..


అప్పట్లో ఇప్పటి కన్యాకుమారి తిరువంతపురం రాజ్యంలో భాగంగా ఉండేది..


తిరువనంతపురం రాజ్యానికి పేరుకు రాజు ఉన్నా రాజ్యానికి సర్వంసహా చక్రవర్తి సాక్షాత్తు ' పద్మనాభ స్వామి వారే ' ..


నవరాత్రి ఉత్సవానికి తన రాజ్యంలోని 3 ప్రధాన ప్రాంతాల నుంచీ .. అంటే సరస్వతి దేవిని కళ్లుకుల్లమ్ నుంచీ..

కుమారస్వామి వారిని వెల్లిమల కుమార కోవిల్ నుంచీ..

మన్నుట్టి నంగా అమ్మను సుచీంద్రమ్ నుంచీ తిరువంతపురం ప్యాలెస్ కు ' పద్మనాభ స్వామి వారు సగౌరవంగా ఆహ్వానించేవారు..



పాలకులు ఎవరున్నా.. రాష్ట్రాలు విడిపోయినా నాటి రాజశాసనాన్ని అందరూ గౌరవించడం సాంప్రదాయం..


ఒకసారి ముస్లిం నవాబు దీన్ని పాటించనందు వలన అతని కుటుంబం దసరా రోజే సజీవదహనం అయ్యిందని కన్యాకుమారి లో జానపద గాధ ఉన్నది..


కారణాలు ఏమైనా ఈరోజుకూ ఈ ఉత్సవం నిరాటంకంగా జరుగుతుంది..


ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూసే అదృష్టం ఉండాలి..


దేవతల సేనానికి తమిళనాడు నుంచీ బుల్లెట్లతో వీడ్కోలు...

తిరువంతపురం లో దేవతలకు స్వాగతం పలకడానికి అద్భుతమైన ఏర్పాట్లు..


ఆ బుల్లెట్ సౌండ్స్ వినండి..శివగణాల హ్రూంకార ద్వనుల్లాగా వినబడతాయి..


ఒక్కసారి చేతులవంక చూసుకోండి రోమాంచితం అయ్యుంటాయి..


*హరహర మహదేవ్.. * *జయ జయ కార్తికేయ.. * *జయ పద్మనాభ..*


              🌸🙏🙏🌸

దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావ

 ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది? మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు !!! కాబట్టి 504 గంటలను 24 గంటలు విభజించినచో, సమాధానం 21.00 21 రోజులు. నేను ఆశ్చర్యపోయాను. దీనిని ధృవీకరించడానికి, నేను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌లో శోధించాను. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ మరియు నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని. నేను షాక్ అయ్యాను !!!! ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పూర్తిగా నమ్మదగినది. సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుండి మనము దసరా మరియు దీపావళిని జరుపుకుంటాము.

మీరు నన్ను నమ్మకపోతే, గూగుల్ సెర్చ్ చేయండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతో ఖచ్చితత్వంతో రాశాడు. మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది. హిందూ సంస్కృతిలో జన్మించినందుకు గర్వపడండి!

జై శ్రీ రామ్ 🙏🙏🙏


🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

      *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷*

సంస్కృత మహాభాగవతం

 *9.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*


*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఉద్ధవ ఉవాచ*


*13.8 (ఎనిమిదవ శ్లోకము)*


*విదంతి మర్త్యాః ప్రాయేణ విషయాన్ పదమాపదామ్|*


*తథాపి భుంజతే కృష్ణ తత్కథం శ్వఖరాజవత్॥12694॥*


*ఉద్ధవుడు పలికెను* కృష్ణా! విషయభోగములే పెక్కు ఆపదలకు మూలములని సామాన్యముగా మానవులు అందరును ఎరుగుదురు. ఐనను, వారు కుక్కలవలె, గాడిదలవలె, మేకలవలె తద్ద్వారా కలిగే దుఃఖములను భరించుచుందురు. అందులకు కారణమేమి?


*శ్రీభగవానువాచ*


*13.9 (తొమ్మిదవ శ్లోకము)*


*అహమిత్యన్యథా బుద్ధిః ప్రమత్తస్య యథా హృది|*


*ఉత్సర్పతి రజో ఘోరం తతో వైకారికం మనః॥12695॥*


*శ్రీభగవానుడు నుడివెను* "ఉద్ధవా! అజ్ఞానియైనవాడు తన హృదయమునందు *నేను-నాది* అను మిథ్యాభినివేశమును కలిగియుండును. అదియే అతని దుఃఖములకు కారణమగును. వాస్తవముగా మనస్సు *స్వరూపతః* సత్త్వగుణ విశిష్టమైనది. కానీ, అది అహంకార, మమకార, వికారముల కారణముగా ఘోరమైన రజోగుణముచే వ్యాప్తమగును.


*13.10 (పదియవ శ్లోకము)*


*రజోయుక్తస్య మనసః సంకల్పః సవికల్పకః|*


*తతః కామో గుణధ్యానాద్దుఃసహః స్యాద్ధి దుర్మతేః॥12696॥*


*13.11 (పదకొండవ శ్లోకము)*


*కరోతి కామవశగః కర్మాణ్యవిజితేంద్రియః|*


*దుఃఖోదర్కాణి సంపశ్యన్ రజోవేగవిమోహితః॥11697॥*


రజోగుణముచే ఆవృతమైన మనస్సు పలువిధములైన సంకల్ప, వికల్పములను చేయుచు నిరంతరము ఆ విషయములనే స్మరించుచుండును. దానివలన కోరికలు ఉత్పన్నములై బుద్ధి కలుషితమగును.తత్పలితముగా అతడు తన ఇంద్రియములపై అదుపును కోల్పోవును. కామవశుడై రజోగుణవేగముచే మోహితుడై పెక్కు కర్మలలో చిక్కుకొనును. దాని పరిణామమున అతనిని దుఃఖపరంపర క్రమ్ముకొనును.


*13.12 (పండ్రెండవ శ్లోకము)*


*రజస్తమోభ్యాం యదపి విద్వాన్ విక్షిప్తధీః పునః|*


*అతంద్రితో మనో యుంజన్ దోషదృష్టిర్న సజ్జతే॥12698॥*


బుద్ధి రజస్తమోగుణములచేత విక్షిప్తమైనను వివేకవంతుడు మనస్సుచే లోతుగా ఆలోచనచేయుచు, విషయ భోగములవలన ఆపదలే సంభవించునని గ్రహించును. కనుక, అతడు విషయప్రమాదములలో చిక్కుకొనడు. అంతట జాగరూకుడై విషయాసక్తుడుగాక, అతడు తన మనస్సును పరమాత్మయందే లగ్నమొనర్చును.


*13.13 (పదమూడవ శ్లోకము)*


*అప్రమత్తోఽనుయుంజీత మనో మయ్యర్పయంఛనైః|*


*అనిర్విణ్ణో యథా కాలం జితశ్వాసో జితాసనః॥12699॥*


సాధకుడు ఆసనమున స్థిరముగా కూర్చుండి, ప్రాణాయామముద్వారా ప్రాణవాయువును అదుపుచేయవలెను. త్రికాలములయందును యథాశక్తి సావధానుడై యోగాభ్యాసమొనర్చుచు మనస్సును నాయందే లగ్నముచేయవలెను. ఎట్టి ఆటంకములు ఎదురైనను విసుగుచెందక, ఉత్సాహముతో ఈ అభ్యాసమును కొనసాగింపవలెను.


*13.14 (పదునాలుగవ శ్లోకము)*


*ఏతావాన్ యోగ ఆదిష్టో మచ్ఛిష్యైః సనకాదిభిః|*


*సర్వతో మన ఆకృష్య మయ్యద్ధాఽఽవేశ్యతే యథా॥12700॥*


ఉద్ధవా! పూర్వము హంసరూపములో నేను నా శిష్యులైన సనకాది మునులకు ఉపదేశించిన ఈ యోగమును వారు సాధకులకు అందించిరి. సాధకుడు తన మనస్సును అన్నివిధములుగా నిగ్రహించి దానిని నాయందే ఎట్లు లగ్నమొనర్చవలెనో, వారు లోకమునకు వెల్లడించిరి".


*ఉద్ధవ ఉవాచ*


*13.15 (పదిహేనవ శ్లోకము)*


*యదా త్వం సనకాదిభ్యో యేన రూపేణ కేశవ|*


*యోగమాదిష్టవానేతద్రూపమిచ్ఛామి వేదితుమ్॥12701॥*


*ఉద్ధవుడు ప్రశ్నించెను* "కేశవా! నీవు ఈ యోగమును సనకాది మహాత్ములకు ఏ సమయమున, ఏ రూపములో వివరించితివి? తెలిసికొనగోరుచున్నాను.


*శ్రీభగవానువాచ*


*13.16 (పదహారవ శ్లోకము)*


*పుత్రా హిరణ్యగర్భస్య మానసాః సనకాదయః|*


*పప్రచ్ఛుః పితరం సూక్ష్మాం యోగస్యైకాంతికీం గతిమ్॥12702॥*


*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* "హిరణ్యగర్భుని మానసపుత్రులైన సనకాది మహర్షులు *దుర్ జ్ఞేయము, అసాధారణము* ఐన ఈ యోగవిధానము యొక్క సూక్ష్మమైన అత్యంతికసీమను గూర్చి తమ తండ్రిని ఇట్లు ప్రశ్నించిరి-


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*444వ నామ మంత్రము* 9.10.2021


*ఓం పుష్ట్యై నమః*


సకల జీవులలోనూ పరిపూర్ణతా (పుష్టి) రూపంలో విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పుష్టిః* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం పుష్ట్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులను తష్టిని కలుగ జేసి, అందుకు అనుగుణంగా పుష్టిని కూడా ప్రసాదించి వారిని శాంతిసౌఖ్యములతో జీవనము కొనసాగునట్లు అనుగ్రహించును.


*ఉన్నది పుష్టి మానవులకు. ఆలజాతికిన్ తిన్నది పుష్టి* అని యన్నట్లు మానవునికి ధనకనకవస్తువాహనములు, సంతృప్తికరమైన ఆహారపదార్థములు, పిల్లాపాపల సంతోషము - ఇది అంతయును ఉండగా కలిగే తుష్టి (సంతోషము) అంతా పుష్టియే యగును. అదే జంతుజాలమునకు ఎంత బాగా తింటే అంత పుష్టి. 


దేవదారు వనమునందు పుష్టి అను దేవత ఉన్నది. అట్టి పుష్టి యను దేవతా స్వరూపిణియైన పరమేశ్వరి *పుష్టిః* అని యనబడినది.


అమ్మవారికి స్థూలరూపంలోను, సూక్ష్మరూపంలోను, కారణరూపంలోను కూడా బుద్ధి, కీర్తి, ధైర్యము, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి రూపములతో విలసిల్లి, సకలజీవులకు పుష్టిని కలుగజేస్తుంది. జీవులకు మానసిక స్థైర్యము కలిగించే దేవత అమ్మవారు. అందుచే ఆ తల్లి *పుష్టిః* అని యనబడినది. 



*యా దేవీ సర్వభూతేషు పుష్టిరూపేణ సంస్థితా|*


*నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ:*


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం పుష్ట్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*443వ నామ మంత్రము* 9.10.2021


*ఓం తుష్ట్యై నమః*


సర్వభూతములందును తుష్టి (సంతోష) రూపంలో ఉండు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *తుష్టిః* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం తుష్ట్యైనమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధన చేయు భక్తులను ఆ తల్లి వారి జీవనమంతయు ధనకనక వస్తువాహన సమృద్ధితోను, శాంతిసౌఖ్యములతోను సంతోషముగా నుండునటులు అనుగ్రహించును.


జగన్మాత సంతోషరూపిణి. పరమేశ్వరుడు ఆ తల్లికి పతిదేవుడు. కుమార, గణనాథులు ఆమె పుత్రులు, అనంతకోటి జీవరాశులు ఆ తల్లి బిడ్డలు. బ్రహ్మోపేంద్రమహేంద్రాదులు ఆ తల్లిని నిరంతరమూ కీర్తిస్తుంటారు. చతుష్షష్టికోటి యోగినీ గణములు సేవిస్తూ ఉంటారు. దుష్టశిక్షణలో గజసమూహముల యధిపతి సంపత్కరీదేవి, అశ్వదళాధీశ్వరి అశ్వారూఢ, మంత్రిణి శ్యామల, చక్రరాజ, గేయచక్ర, కిరిచక్ర రథసంపద, జ్వాలామాలిని, నిత్యాదేవతలు, బాలాత్రిపురసుందరి, వారాహి మొదలైన ఆమె శక్తిసైన్యము, అసురుల శస్త్రములకు తనవద్దగల ప్రత్యస్త్ర సంపద ఉండగా పరబ్రహ్మస్వరూపిణియైన ఆ తల్లి సదా సంతోషస్వరూపిణియే కదా! అదే సంతోషము అనంతకోటి జీవరాశులయందును నెలకొనజేయు ఆపరమేశ్వరి *తుష్టిః* అని యనబడినది. ఆ తల్లి *ఇందుగలదందు లేదని సందేహము వలదు* అనునట్లు సర్వత్రా *తుష్టిరూపేణ సంస్థితా* యని అనబడినది.


*యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా|*


*నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ:॥*


సకల జీవరాశులలోను తుష్టిరూపంలో నెలకొని యున్నది గనుక ఆ తల్లి *తుష్టిః* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం తుష్ట్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం*

 *8.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*


*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీభగవానువాచ*


*13.1 (ప్రథమ శ్లోకము)*


*సత్త్వం రజస్తమ ఇతి గుణా బుద్ధేర్న చాత్మనః|*


*సత్త్వేనాన్యతమౌ హన్యాత్సత్త్వం సత్త్వేన చైవ హి॰12687॥*


*శ్రీభగవానుడు వచించెను* "ఉద్దవా! సత్త్వరజస్తమోగుణములు అను మూడును బుద్ధికి సంబంధించినవేగాని, ఆత్మకు సంబంధించినవిగావు. సత్త్వగుణముద్వారా రజస్తమోగుణములను రూపుమాపవలెను. అంతఃకరణశుద్ధి కలిగిన పిదప సత్త్వగుణమునుగూడ త్యజించి గుణాతీతుడు కావలెను.


*13.2 (రెండవ శ్లోకము)*


*సత్త్వాద్ధర్మో భవేద్వృద్ధాత్పుంసో మద్భక్తిలక్షణః|*


*సాత్త్వికోపాసయా సత్త్వం తతో ధర్మః ప్రవర్తతే॥12688॥*


పురుషుడు సత్త్వగుణ సంపన్నుడైనప్పుడు అతనిలో ఎల్లప్పుడూ భక్తిరూపస్వధర్మము వృద్ధి చెందును. సర్వదా సాత్త్విక పదార్థములను సేవించుటవలననే సత్త్వగుణము పెంపొందును. తద్ద్వారా నాయొక్క భక్తిరూప స్వధర్మము నందు ప్రవృత్తి కలుగుచుండును.


*13.3 (మూడవ శ్లోకము)*


*ధర్మో రజస్తమో హన్యాత్సత్త్వవృద్ధిరనుత్తమః|*


*ఆశు నశ్యతి తన్మూలో హ్యధర్మ ఉభయే హతే॥12689॥*


సత్త్వగుణమువలన సర్వోత్కృష్టమైన ధర్మము వర్ధిల్లును. అట్టి ధర్మము రజోగుణమును, తమోగుణమును నష్టపరచును. రజస్తమోగుణములు నశించుటతోడనే వాటి మూలముగా పుట్టెడు అధర్మము వెంటనే తప్పక సమసిపోవును.


*13.4 (నాలుగవ శ్లోకము)*


*ఆగమోఽపః ప్రజా దేశః కాలః కర్మ చ జన్మ చ|*


*ధ్యానం మంత్రోఽథ సంస్కారో దశైతే గుణహేతవః॥12690॥*


శాస్త్రము, జలము, సంతానము, దేశము, సమయము, కర్మ, జన్మ, ధ్యానము, మంత్రము, సంస్కారము అను ఈ పదియును సాత్త్వికములైనచో సత్త్వగుణము, రాజసములైనచో రజోగుణము, తామసములైనచో తమోగుణము వృద్ధిచెందును.


*13.5 (ఐదవ శ్లోకము)*


*తత్తత్సాత్త్వికమేవైషాం యద్యద్వృద్ధాః ప్రచక్షతే|*


*నిందంతి తామసం తత్తద్రాజసం తదుపేక్షితమ్॥12691॥*


శాస్త్రవేత్తలగువారలు ఆహార - ఆగమాది విషయములయందు ప్రశంసించిన (ఆదరించిన) వాటిని సాత్త్వికములుగను, నిందించిన (నిరాదరించిన) వాటిని తామసములుగను, ఉపేక్షించినవాటిని (నస్తుతం, ననందితం) రాజసములుగను ఎరుంగవలయును.


*13.6 (ఆరవ శ్లోకము)*


*సాత్త్వికాన్యేవ సేవేత పుమాన్ సత్త్వవివృద్ధయే|*


*తతో ధర్మస్తతో జ్ఞానం యావత్స్మృతిరపోహనమ్॥12692॥*


సత్త్వగుణాభివృద్ధి కొరకు సాత్త్వికవస్తువులను మాత్రమే సేవింపవలెను. దానివలన ధర్మము, జ్ఞానము వృద్ధియగును, స్వస్వరూపస్మృతి గలిగి, అన్నివిధములుగా సంశయనివృత్తి యగును. భగవత్తత్త్వజ్ఞానము కలుగునంతవరకును ఇట్లే చేయుచుండవలెను.


*13.7 (ఏడవ శ్లోకము)*


*వేణుసంఘర్షజో వహ్నిర్దగ్ధ్వా శామ్యతి తద్వనమ్|*


*ఏవం గుణవ్యత్యయజో దేహః శామ్యతి తత్క్రియః॥12693॥*


వెదురు కర్రల రాపిడివలన అగ్ని ఏర్పడును. ఆ అగ్ని తనకు మూలమైన ఆ వెదురువనమునే దహించి, శాంతించును. దేహముగూడ గుణములయొక్క వైషమ్యముచే ఉత్పన్నమగును. మిక్కిలి లోతుగా సమాలోచన చేసినపిమ్మట ఆ మథనమువలన జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లును. అది (జ్ఞానాగ్ని) సకల (స్థూల, సూక్ష్మ, కారణ) శరీరములను, గుణములను దగ్ధమొనర్చి స్వయముగా శాంతమగును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

మహాకాళీ

 శ్లో.మహాకాళీ మహాశక్తిమ్ మహాలక్ష్మీ మహాధనమ్ l

మహా సరస్వతీ దద్యాత్ సుబుద్ధిమ్

విజయం సదా ll

భావం:-

మహాకాళీ,మహాలక్ష్మీ,మహాసరస్వతిగా మనచేత పూజింపబడే ఆ జగదంబ,జగజ్జనని,జగన్మాత,పరాశక్తి మనకు ఎల్లప్పుడూ శక్తిని, సంపదలను,సద్బుద్ధినీ,విజయాన్నీ అనుగ్రహించుగాక.

ప్రశ్నల పట్టిక*

 * ప్రశ్నల పట్టిక*


 రేవంతరెడ్డి అంటే అర్థమేమిటబ్బా ?

_____________________


(1) రెడ్డిరాజులకు పవిత్రమైన కటారి (ఖడ్గం) పేరేమిటి ?


(2) ఓరుగల్లునుండి తురుష్క సరదారులను పారద్రోలి ఆంధ్రదేశాధీశ్వర బిరుదు వహించిన ప్రముఖుడెవరు ?


(3) " డిల్లిసుల్తాన్ పట్టుకుపోతాన్ " అని అన్నదెవరు ?


(4) తూణీరం అంటే ఏమిటో గుర్తుకు వచ్చిందా ?


(5) రేవంత్, రేవంత్ రెడ్డి అని తెలుగులో వ్రాయకూడదు. రేవంత, రేవంతుడు, రేవంతరెడ్డి అని వ్రాయాలి. ఇంతకూ రెేవంతు (రేవంతుడు) అంటే ఏమిటో తెలుసా ?


(6) బోయలలో అంగజాల ఇంటిపేరు కలిగిన వారున్నారు. అంగజాలవారంటే ?


(7) మాఅమ్మాయికి ఏడో నెల శ్రీమంతం చేయాలి, కాదుకాదు సీమంతం చేయాలి, ఇంతకు శ్రీమంతమా, సీమంతమా, ఏది ఒప్పు ?


(8) స్త్రీలు కాలి రెండవ వ్రేలికి పెట్టుకొనే ఆభరణాలను మెట్టెలు / మట్టెలు అంటారు కదా! మూడవ వ్రేలికి ధరించిన ఆభరణాలను ఏమంటారు ?


(9) ధృడం, సింధూరం, శాఖాహారం, చాణుక్యుడు, బేధము. ఇవి తప్పుల్లేని పదాలేనా ?


(10) రెండుసార్లు తాత్కాలిక భారత ప్రధానిగా పనిచేసిందెవరు ?


॥కూర్పు॥

_____________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*స్వామి కృప..సరోజ జీవితం..*


మొగలిచెర్ల గ్రామ సరిహద్దులో ఫకీరుమాన్యం వద్ద ఆశ్రమం నిర్మించుకొని, తీవ్ర తపోసాధన చేసిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు కపాలమోక్షం ద్వారా 1976 వ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నాడు సిద్ధిపొందే నాటికి ఆ ప్రాంతానికి బస్ సౌకర్యం కూడా లేదు..ఎవరైనా శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించాలని అనుకుంటే..మొగలిచెర్ల గ్రామం వరకూ బస్ లో వచ్చి , అక్కడినుండి కాలినడకన రావాల్సివచ్చేది..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని తమ కష్టాలను ఆ సమాధి వద్ద విన్నవించుకుంటే..తమకు ఊరట కలుగుతుందనే విశ్వాసం తో ఎందరో భక్తులు వచ్చేవారు..వారికి ఉపశమనం కలిగేది కూడా..1980 నాటికి అంటే శ్రీ స్వామివారు సిద్ధిపొందిన నాలుగు సంవత్సరాలకు మందిరం వద్దకు బస్ సౌకర్యం ఏర్పడింది..అప్పటి నుండీ భక్తుల రాకపోకలకు ఉన్న ఇబ్బందులు కొంతమేర తీరిపోయాయి..


అలా బస్ సౌకర్యం ఏర్పడిన తొలినాళ్ళలో..పామూరు ప్రాంతం నుంచి పదహారు, పదిహేడేళ్ల ప్రాయం లో ఉన్న తమ కూతురిని తీసుకొని దంపతులు వచ్చారు..అమ్మాయి పేరు సరోజ..చూడటానికి ఏ లోపమూ లేకుండా లక్షణంగా ఉంది..కానీ ఆ అమ్మాయి ప్రవర్తన మాత్రం విపరీతంగా ఉండేది..ఉన్నట్టుండి పెద్దగా కేకలు పెట్టేది..పరుగెట్టేది..ఆ సమయంలో ఎవరైనా ఆపబోతే..వారిమీద చేతిలో ఉన్న వస్తువులను విసిరికొట్టేది..ఒక్కొక్కసారి రాళ్లు కూడా రువ్వేది.. ఈ విపరీతపు పోకడ ఒక సంవత్సర కాలం నుంచీ ఉందనీ..ఎవరెవరికో చూపించినా ఫలితం కలుగలేదనీ.. స్వామివారి గురించి విని..ఇక్కడ బాగుపడుతుందనే ఆశతో అమ్మాయిని తీసుకొని వచ్చామని చెప్పారా దంపతులు..


ఆ రోజుల్లో భక్తులు వుండటానికి ఒకే ఒక్క రేకుల షెడ్ ఉండేది..అందులోనే తమ కూతురు తో సహా ఆ దంపతులు వుండసాగారు..ఉదయం ఐదు గంటలకల్లా లేచి, స్నానం చేసి, కూతురితో సహా స్వామివారి మందిరం లోకి వచ్చేవారు..అమ్మాయిని తీసుకొని స్వామివారి సమాధి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసేవారు..మొదటి రెండు రోజులూ ఆ అమ్మాయి ప్రవర్తన లో పెద్దగా మార్పు రాలేదు..తల్లిదండ్రులతో పాటు ప్రదక్షిణాలు చేస్తున్నా..మధ్యాహ్నానికి మళ్లీ యథా ప్రకారం ప్రవర్తించేది..మూడు నాలుగు రోజులు గడిచిపోయాయి..ఐదోరోజు ఉదయాన్నే ప్రదక్షిణాలు చేస్తున్న సరోజ..ఒక్కసారిగా వెఱ్ఱి కేక పెట్టి..స్పృహ లేకుండా పడిపోయింది..తల్లీ తండ్రీ ఇద్దరూ భయపడి పోయారు..సుమారు అరగంట పాటు అమ్మాయి స్పృహ లేకుండా ఉన్నది..అమ్మాయిని జాగ్రత్తగా ఎత్తుకొని షెడ్ లోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు..పది కిలోమీటర్ల దూరం లో ఉన్న లింగసముద్రం గ్రామం వెళితే కానీ వైద్యుడు దొరకడు.. ఎలా తీసుకెళ్లాలి?..సతమతం అవుతున్నారు..ఇంతలో..సరోజ కళ్ళు తెరిచింది..మెల్లిగా తనంతట తానే లేచి కూర్చుంది..తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు..


ఆరోజు సాయంత్రం సరోజ ఎప్పటిలాగే స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది..అమ్మాయి ముఖం కూడా ప్రశాంతంగా ఉంది..ప్రక్కరోజు కూడా ఎటువంటి వికారపు చేష్టలు చేయకుండా బుద్ధిగా ఉంది..ఆ తరువాత ఆ అమ్మాయి లో ఇంతకుముందు ఉన్న విపరీతపు పోకడలు కనబడలేదు..తన పని తానే చేసుకోసాగింది..


రెండురోజుల క్రితం సరోజ కేక పెట్టి, స్పృహలేకుండా పడిపోయి..తిరిగి లేచిన తరువాత వచ్చిన మార్పు ఇది అని చూస్తున్న మాకందరికీ అర్థమైపోయింది..ఆ అమ్మాయిని పీడిస్తున్న వ్యాధి అంతటితో పోయిందని తల్లిదండ్రీ కూడా భావించారు.."అమ్మాయిని పట్టిపీడిస్తున్న దుష్టగ్రహం ఆరోజుతో వదలిపోయిందని" అర్చకస్వామి చెప్పారు..


రెండు రోజుల తరువాత తల్లీ తండ్రీ సహాయం లేకుండానే..మందిర ఆవరణ అంతా శుభ్రం చేసింది..మరో వారం కల్లా..అమ్మాయికి పూర్తి స్వస్థత చిక్కిందని నమ్మకం కుదిరాక..ఆ దంపతులిద్దరూ స్వామివారికి పొంగలి పెట్టుకొని..సంతోషంగా అమ్మాయిని తీసుకొని తమ గ్రామానికి వెళ్లిపోయారు..ఆ తరువాత మరెన్నడూ సరోజ విపరీతపు ప్రవర్తన కనబడలేదు..అప్పటినుండి శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దర్శనం చేసుకోవడమనే అలవాటును సరోజ పాటించసాగింది..


ఆనాడు స్వామివారి దయవలన బాగుపడ్డ సరోజ వివాహం చేసుకొని..సరోజమ్మ గా మారి..ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి..ఆ పిల్లలకు వివాహాలు చేసి..తన భర్తతో సహా మూడో కూతురిని, మనుమరాలిని తీసుకొని పదిరోజుల క్రితం శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చింది.. తన జీవితం బాగుపడటానికి శ్రీ స్వామివారే కారణమని..అందుకే తన కుమారులిద్దరికీ దత్తుడి పేరే పెట్టాననీ..ఇద్దరి వివాహాలూ ఇక్కడే జరిపించాననీ..కూతురి పెళ్లి మాత్రం..తమ వంశాచారం ప్రకారం అల్లుడి ఇంటిదగ్గర చేశామని..ఇప్పుడు మనుమరాలి నామకరణం చేయించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాననీ చెప్పింది...


బాధ్యతలన్నీ తీరిన తరువాత..స్వామివారి సన్నిధిలోనే శేష జీవితాన్ని వెళ్లదీయాలని తన కోరిక అని చెప్పింది సరోజమ్మ..


సర్వం..

శ్రీ దత్త కృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీమద్భాగవతము

 *08.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2285(౨౨౮౫)*


*10.1-1414*


*క. గురువులకు నెల్ల గురులై*

*గురులఘుభావములు లేక కొమరారు జగ*

*ద్గురులు త్రిలోకహితార్థము*

*గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్.* 🌺



*_భావము: గురువులకే గురువులై, సర్వోత్తములైనా కూడా, గొప్ప, చిన్న భావన లేక ప్రవర్తించే మనోజ్ఞమైన జగద్గురువులు, ముల్లోకములకు మేలు కలిగిస్తూ, గురుశిష్య న్యాయము పాటిస్తూ, బలరామ కృష్ణులు తమ గురువు సాందీపులవారిని సేవించారు._* 🙏



*_Meaning: Though Balarama and Sri Krishna were Divine personalities and were Gurus for all Gurus of the universe, they never had the feeling of that supremacy but were always humble in their dealings with others. Causing happiness to all the beings around them, they conducted themselves with profound obeisance and deference towards their Guru and served him with respect and reverence._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

బంగారం గురించి తెలియదు

 *Secrets behind Gold Business* 🥇🪙



Consumer Rights Protection Forum...


 బంగారం గురించి తెలియదు .రాగిని బంగారం ధరకు కొని ఎంత  నష్టపోతున్నారో తెలుసా...?


కొన్ని ప్రకటనలు వృధా% చాలా అని, మరియు ఛార్జీలు వసూలు చేయడం మొదలైనవి లేవని, నిజం ఏమిటి? 

 బంగారు గొలుసు సార్వభౌమత్వానికి 1 గ్రాము రాగిని జోడించడం ద్వారా మాత్రమే ఆభరణాలు తయారు చేయబడతాయి ...!  ఉదాహరణకు 10 గ్రాముల బంగారు గొలుసు తయారు చేయడానికి 1 గ్రాము రాగి మరియు 9 గ్రాముల బంగారాన్ని జోడించి బంగారు ఆభరణాలను తయారు చేస్తారు. కానీ ఒక సాధారణ మనిషి బంగారం కొనేటప్పుడు, 9గ్రా. బంగారం + 1గ్రాము రాగి కలిపి బిల్లులో 10 గ్రాముల బంగారంగా అమ్ముతారు. దానికి తోడు, వారు రాగిని బంగారం ధరకు అమ్ముతున్నారు, 1 గ్రాము బంగారం వృధాగా తరుగుగా చూపిస్తున్నారు.


 * దీనిలో 9గ్రా బంగారం + 1గ్రా. రాగి (బంగారంగా) + నష్టం (తరుగు) 1 = 11 గ్రాములు. కాబట్టి 10 గ్రాముల ఆభరణాల కొనుగోలుదారులు 9గ్రాముల బంగారాన్ని మాత్రమే కాకుండా 2 గ్రాముల రాగిని కూడా బంగారంగా జోడించి బంగారం ధరను వసూలు చేస్తారు ..* కాబట్టి మనం 10గ్రా గ్రాముల ఆభరణాలకు 11 గ్రాముల బంగారం ధరను చెల్లిస్తాము. వారు ఎవరిని మోసం చేస్తున్నారు!  వారు పేదలను మోసం చేస్తున్నారు మరియు పరాన్నజీవులై పేదల రక్తాన్ని పీలుస్తున్నారు .  ఒక కొత్త ఆభరణాల దుకాణాన్ని తెరిచి, కొన్నేళ్ల వ్యవధిలో బహుళ భవనాలు, అంతస్తులు నిర్మించి, కొనుగోలు చేస్తే డబ్బు వారికి ఎలా వచ్చింది? పై లెక్కలు అంత గొప్పగా మారడానికి సరైనవని అంగీకరిస్తున్నారు. ఇది నిజం కాదా ఈ రోజు ఒక గ్రాము బంగారం ధర ఎంత? 24 pure గోల్డ్ ని అభారణాలుగా మార్చడానికి 2 గ్రాముల బంగారం వసూలు చేస్తున్నప్పుడు ఒక గ్రాము రాగి ధర ఎంత? ఈ ఖాతాను తనిఖీ చేయండి ...! *


  1 గ్రాము బంగారం విలువ రూ. 4760 / - *

  10 గ్రాముల బంగారం రూ. 47600 / - *

1 గ్రాముల రాగి - రూ. 7/- *

 * 9 గ్రాముల  బంగారం ధర 42840/-


 * 9 గ్రాముల బంగారం + 1 గ్రాము రాగి - రూ. 42840 + రూ. 7= 42847/ - *


 * 10గ్రా. బంగారంలో - రూ. 47600- 42847 లాభం = రూ. 4753 *


 * వ్యర్థం 1గ్రా= రూ. 4753 / - *


 * 10గ్రా ఆభరణానికి రూ.9506/-కు స్థూల లాభం *


 *  ప్రజలు ఈ అవగాహనను గ్రహించినప్పుడల్లా బంగారం ధర ఖచ్చితంగా తగ్గుతుంది ...  మీరు అవగాహన కల్పించాల్సిన మంచి ఆత్మలు కావాలి! *  మీ పరాక్రమం చూపించడానికి మరింత భాగస్వామ్యం చేయండి. ప్రభుత్వం జోక్యం చేసుకుని సరసమైన ధరను నిర్ణయించే వరకు మనం ఏదైనా చేయగలం.

NOTE:కేవలం ఇది 10% తరుగు ఆధారంగా లెక్కించబడినది.15%నుండి 20% తరుగు తీసుకునే షాపులు కూడా ఉన్నాయి.(వాస్తవంగా ఎంత మంచి డిజైన్ ఉన్న ఆభరణం ఐనా 5%వరకు మాత్రమే తరుగు పోతుంది)

సంధ్యా వందనము చేస్తే

 సంధ్యా వందనము చేస్తే 

పుణ్యం వస్తుందా అండీ?  

అంటే పుణ్యం 

ఎంత మాత్రం రాదు... 


దంత ధావనము 

ఎందుకు చేస్తున్నాము? 


మననోరు 

వాసన రాకుండా ఉండటానికి కదా... 


మనం స్నానం 

ఎందుకు చేస్తున్నాము? 


దేహ పరిశుభ్రత కోసంకదా


అంతేగాని 

పుణ్యంకొరకు కాదుకదా 


అలానే మనసులో 

ఉన్న మాలిన్యం 

పోవడానికి, 

నీమనస్సు

ఆనందంగాఉండి

దైవ సంపదను 

పొందడానికి మనం

"సంధ్యావందనం"

విధిగా చేయాలి..... 


మనిషిగా పుట్టి 

యజ్ఞోపవీత అర్హత 

ఉన్నవారు విధిగా 

సంధ్యాసమయంలోనే

సంధ్యావందనం చేయాలి...


ఆసమయంలో 

కుదరనిపక్షంలో 

మనకు వీలైన 

సమయంలో చేయాలి 

అంతే గాని 

సంధ్యావందనం 

మానేయకూడదు... 


సంధ్యావందన ప్రాశస్త్యం:- 


సూర్యోదయానికి పూర్వం లోకాన్ని చీకట్లోనే ఉంచాలనే ప్రయత్నంతో సూర్యుని కిరణాలు భూమిని చేరకుండా కొందరు అసురులు 

సూర్యుని రాకకు 

ఆటంకం కలిగిస్తుంటారు... 


యజ్ఞోపవీత అర్హత ఉన్నవారు సూర్యోదయానికి 

పూర్వం లేచి 

ప్రత్యక్ష భగవానుడైన 

సూర్యుడిని ఉపాసించి సంధ్యావందనం ద్వారా 

నీటిని తర్పణగా 

విడువడంవలన ఈ నీరు 

సూర్య ఆగమనానికి

అడ్డుపడుతున్న రాక్షసులని 

బ్రహ్మాస్త్రమై వెంటాడి 

వారిని నాశనం చేస్తుంది... 


లోకానికి వెలుగును అందించే 

ఆ దివాకరుడి వెలుగుకు 

మనవంతు సహాయం 

మనం చేయగలగడం 

మన అదృష్టం. ..


మనతో అయన సేవ చేయించుకోవాలనుకోవడం 

నిజంగా 

మన పూర్వజన్మ సుకృతం... 


అందుకే 

సూర్యోదయానికి పూర్వమే 

సంధ్యావందనం చేయాలి... 


సంధ్యా వందనాది క్రియల్ని

ఎవరైతే క్రమంతప్పకుండా

చేస్తారో వారికి రాబోవు 

గ్రహ భాధలు కూడా 

ఉపశమించి 

ఎంతటి కష్టాన్నైనా 

తట్టుకు నిలబడే శక్తిని 

మానసిక ధైర్యాన్ని కలిగించి

వారి ముఖము నందు 

బ్రహ్మ తేజస్సుని ప్రతిబింబిస్తుంది.


మనిషిగా పుట్టి 

యజ్ఞోపవీత అర్హత 

ఉన్న వారు విధిగా 

సంధ్యా వందనంచేసి 

ఆనందంగా వుండగలరు.

నవావరణ పద్యార్చన*

 *శ్రీ ప్లవ - శరన్నవరాత్రులు - నవావరణ పద్యార్చన*

           రచన: శ్రీశర్మద - స్వర్ణపురి (పొన్నూరు)


అశ్వయుజ శుక్ల తదియ: ది.09-10-2021


శార్దూలము: 

నీ లాక్షారుణ పాదపద్మరుచులే నిత్యమ్ముగా నిల్చెనో

యీ లోకాల ప్రభాతరక్తిమములై యింపైన కెంజాయలై

నీ లావణ్యనఖాగ్రదీధితులు తూణీరమ్ముల న్వేసెనో

హేలాలీల మనోజుమార్గణములన్ హ్రీంకారసంచారిణీ!

✍️శ్రీశర్మద

అన్ని విన్నవే, తెలిసినవే

 అన్ని విన్నవే, తెలిసినవే ! కాకపోతే ఇపుడెన్ని చెప్పగలరో ?

________________________


(1) సన్నిరాయి దాచిపెడితే పెళ్ళాగిపోతుందా ?

ఇందులో సన్నిరాయి అంటే ఏమిటి ?


(అ) రోలు

(ఆ) రోకలి

(ఇ) గుండ్రాయి

(ఈ) విసుర్రాయి (తిరుగలి)


(2) శ్మశానం, రుద్రభూమి, వల్లకాడు, కాడు > కాటికాపరి, సమాధులు, ఒలుకలమిట్ట, ప్రేతభూమి ఇలా మన భాషలో మనదికాని భాషలో గోరీలకు పేరుంది. ఈనాటికి ఒక మాటను అచ్ఛతెలుగులో జానపదులు ఉపయోగిస్తున్నారు. ఆమాట ఏమిటో చెప్పండి చూద్దాం.


(3) విధవకు వ్యతిరేకార్థమేమిటి ? (భార్య చనిపోయిన పురుషుడిని ఏమంటారు ?)

నాకు తెలుసు మీకు వెధవ అని స్ఫురించిందని కాని అది కాదుగా ?


(4) సామెతలేని మాటలు ఆమెతలేని పెండ్లిలాంటిది, ఇందులో ఆమెత అనగా ?


(అ) వధువు

(ఆ) విందు

(ఇ) డోలుసన్నాయి

(ఈ) వేదమంత్రాలు


(5) జంగమయ్య జంగమయ్య జగడమెట్లవస్తుందో చెప్పు. ముందు బిక్షం పెట్టవే ------- అని అన్నాడట ఆ జంగముడు.

పై సామెతలోని ఖాళీని పూరించుము ?


(6) అయోధ్య ప్రజలు సీతారాములకు నీరాజనం పట్టారు.ఇందులో నీరాజనం అనగా ?


(అ) చలవపందిర్లువేయడం

(ఆ) హారతులు ఇవ్వడం

(ఇ) గందరజతం పూలు చల్లడం

(ఈ) నీరు + జనం = నీరాజనం > చలవపందిర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహం తీర్చే ప్రజలు వుండడం.


(7) కరుడుకట్టిన ముజాహిదీన్ తీవ్రవాదులు కాశ్మీరీపండిట్లను పొట్టన పెట్టుకొన్నారు. ఇందులో కరుడుగట్టిన అనగా ?


(అ) నీటి అడుగున గట్టిపడిన లవణాలు, మలినాలు.

(ఆ) కఠినమనస్కులు

(ఇ) కనికరంలేనివారు

(ఈ) రాయిలాంటి హృదయం కలవారు.


(8) వారు పాషాణహృదయులు, వారిది పాషాణ మనస్తత్వం.ఇందులో పాషాణం అనగా ?


(అ) విషం

(ఆ) రాయి

(ఇ) కల్మశం

(ఈ) కఠినం


(9) సరిగా పొందికగా ఉండలేకపోతే కుదురుగా కూర్చోలేవా అనంటారు !

కాని ఇందులో కుదురు అనే పరికరాన్ని ఒకపుడు ఇంట్లో వాడేవారు , ఏమిటా కుదురు ? మీకేమైనా తెలుసా ?


(10) ఉంటే కుండగాలు (కుండకాలు ) లేకుంటే ఎండగాలు ! ఎండగాలమంటే ఏమిటి ?


గమనిక > అన్నింటికి సరైన సమాధానాలు చెప్పినవారిలో మొదటగా చెప్పినవారికి ఓ చిరుకానుక వుంటుంది సుమా !


॥నిర్వహణ॥

_______________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.


పై ప్రశ్నావళి యొక్క జవాబులను ఎదురు చూసిన మరియు చూచుచున్న సభ్యబృందానికి ఇదిగో వాటికి సరియైన సమాధానాలు.


________________________


1) సన్నిరాయి దాచిపెడితే పెళ్ళాగిపోతుందా ?

ఇందులో సన్నిరాయి అంటే ఏమిటి ?


(అ) రోలు

(ఆ)రోకలి

(ఇ) గుండ్రాయి✅

(ఈ) విసుర్రాయి (తిరుగలి)


(2) శ్మశానం, రుద్రభూమి, వల్లకాడు, కాడు > కాటికాపరి, సమాధులు, ఒలుకలమిట్ట, ప్రేతభూమి ఇలా మనవి మనదికాని భాషలో గోరీలకు పేరుంది. ఈనాటికి ఒక మాటను అచ్ఛతెలుగులో   జానపదులు ఉపయోగిస్తున్నారు.  ఆమాట ఏమిటో , చెప్పండి చూద్దాం.


సమాధానం:- ఒలికిలి. ఇప్పటికి పల్లెలలో నిన్ను ఒలికిలలో పెట్టా అంటూ తిడుతుంటారు, విన్నాం కదా!


(3) విధవకు వ్యతిరేకార్థమేమిటి ? (భార్య చనిపోయిన పురుషుడిని ఏమంటారు ? నాకు తెలుసు మీకు వెధవ అని స్ఫురించిందని కాని అది కాదుగా ?


సమాధానం > విధురుడు. విధురుడంటే పరిత్యజించబడినవాడు. భార్య మరణించి దూరమైపోయింది కనుక భార్యావియోగిని విధురుడంటారు.

కాని విదురుడు అనరాదు, విదురుడు దృతరాష్ట్రని తమ్ముడు కదా ! విధురుడికి విదురినికి తేడా చూడండి.


(4) సామెతలేని మాటలు ఆమెతలేని పెండ్లిలాంటిది, ఇందులో ఆమెత అనగా ?


(అ) వధువు

(ఆ) విందు✅

(ఇ) డోలుసన్నాయి

(ఈ) వేదమంత్రాలు


(5) జంగమయ్య జంగమయ్య జగడమెట్లవస్తుందో చెప్పు. ముందు బిక్షం పెట్టవే ------- అని అన్నాడట ఆ జంగముడు

పై సామెతలోని ఖాళీని పూరించుము ?


వివరణ: - ఖాళీలో బొచ్చుముండా అని పూరించాలి. ఒకామెకు జగడాలు ఎలా పుడతాయనే సందేహం కలిగి, తనింటికి బిక్షకు వచ్చిన జంగమయ్యను, జంగమయ్య జంగమయ్యా జగడాలెలా పుడతాయని అడిగింది. అందుకా ఆ సాధువు ముందు బిక్షంపెట్టవే బొచ్చుముండా అంటూ కోపంగా సమాధానమిచ్చాడు.

అడుక్కుతినే నాకొడకా, నాబట్ట, నీనోట్లో నా సాడు పొయ్యా అంటూ లంకించుకొందా వనితారత్నం.

ఆ సాధువు శాంతంగా అమ్మా ఇప్పుడర్థమైందా జగడాలు ఎలా పుడతాయో, జగడానికి కారణం నోటిమాటే, మన మాట మృదువుగా వుంటే బంధం పెరుగుతుంది, దురుసుగా వుంటే శత్రుత్వం పెరుగుతుందని ఉపదేశం చేశాడు. నోరుమంచిదైతే ఊరు మంచిదైతుందన్న లోకోక్తి కూడా ఇలాంటిదే.


(6) అయోధ్య ప్రజలు సీతారాములకు నీరాజనం పట్టారు. ఇందులో నీరాజనం అనగా ?


(అ) చలవపందిర్లువేయడం

(ఆ) హారతులు ఇవ్వడం✅

(ఇ) గందరజతం పూలు చల్లడం

(ఈ) నీరు + జనం = నీరాజనం > చలవపందిర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం.


(7) కరుడుకట్టిన  ముజాహిదీన్  ఉగ్రవాదులు కాశ్మీరీపండిట్లను పొట్టన పెట్టుకొన్నారు. ఇందులో కరుడుగట్టిన అనగా ?


(అ) నీటి అడుగున గట్టిపడిన లవణాలు✅

(ఆ) కఠినమనస్కులు

(ఇ) కనికరంలేనివారు

(ఈ) రాయిలాంటి హృదయం కలవారు.


వివరణ : - ఓబొక్కెన తీసుకోండి, అందులో నిండుగా నీళ్ళు పోసి కొన్నాళ్ళపాటు అలానే వదిలేసేయండి. కొన్నాళ్ళకు ఆ బకెట్టులోవున్న నీటిలోని లవణాలు, మలినాలు అడుక్కు చేరుకొని గట్టిపడి ముద్దలా అయిపోతాయి. అలా ముద్దలామారి బొక్కెనకిందన అతుక్కుపోయిన ఆ గట్టి పదార్ధం చాకుతో గోకినా, బలవంతంగా గీకినా, అమ్లాలు (ఆసిడ్స్) పోసి కుంచె (బ్రష్) తో తోమినా  పూర్తిగాపోదు. అంతో ఇంతో ఏదోరూపంలో అతుక్కొనేవుంటుంది. అడుగు చేరి గట్టిపడిన పదార్థాన్నే కరడు అంటారు. తీవ్రవాదుల మనస్తత్వం కూడా ఇలా కఠినంగానే వుంటుంది కనుక ఈ స్వామ్యాన్ని చెప్పడం జరిగింది.


(8) వారు పాషాణ హృదయులు, వారిది పాషాణ మనస్తత్వం. ఇందులో పాషాణం అనగా ?


(అ) విషం

(ఆ) రాయి✅

(ఇ) కల్మశం

(ఈ) కఠినం


(9) కుదురుగా కూర్చోలేవా !

ఇందులో కుదురు అనే పరికరాన్ని ఒకపుడు ఇంట్లో వాడేవారు , ఏమిటా కుదురు ?


ఇప్పుడైతే పిండిమరలు వడ్లమరలు వచ్చాయి కాని, 50 సంవత్సరాల కిందటి వరకు అమ్మలందరు రుబ్బురోలుకింద రుబ్బు కొనేవారు, తిరుగలి (విసుర్రాయి) తో విసురుకొనేవారు. రోలురోకలితో సజ్జలు, జొన్నలు, కొర్రలు, సాములు వడ్లు దంచుకొంటారు. దంచేటపుడు అవి రోకటిపోటులకు చెదరిపోకుండా వెదురుతో చేసిన కుదురును రోలుపై దంచుకొనేవారు. ఈ తరానికి రోలు, రోకలి,తిరుగలి,కవ్వం, ఉట్టి, కత్తిపీఠ, మూకుడు, పొంత, ముంత, పెనం సంకటికట్టి, తెడ్డు, వంటి గృహోపకరణాలు తెలియవంటే అతిశయోక్తికాదు.


(10) ఉంటే కుండగాలు (కుండకాలు ) లేకుంటే ఎండగాలు ! ఎండగాలమంటే ఏమిటి ?


సమాధానం. ఇది వానాలేదు, వంగడాలేదనే సామెత లాంటిదే. వర్షాలు కురిసి పంటలు పండేకాలం వస్తే బీదాబిక్కి  కూలికి వెళతారు, నాలుగు డబ్బులు వస్తాయి. కుండలో  ఎసరుపోసి పోయిమీద పెట్టి మంటపెట్టి సంకటో ఊరబిండో వండుకుతింటారు. కుండ పొయ్యి మీద కాలుతుంది కాబట్టి కూలీపోతేనే కుండ కాలుతుందనే అర్థం ఈ సామెతలో సరిపోయింది.

ఇక ఎండకాలడమంటే..

కుండలు కడిగిన తరువాత వాటిని ఎండలో బోర్లిస్తారు. ఎందుకంటే సూర్యరశ్మికి కుండలోనున్న క్రిమికీటకాలు ( బ్యాక్టీరియా, ఫంగస్) నశిస్తాయని. కూలిలేకపోతే కుండపోయిమీదకు ఎక్కికాలకుండా ఎండలోనే ఎండుతూ వుంటుంది కదా! ఇది మనవారి ఆరోగ్య సూత్రమన్నమాట. అందుకే ఎండకాలిందనేమాట ఈ సామెతలో సరిపోయింది.


నేను MA (చరిత్ర) చదివేటపుడు ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డిగారిని కలవడం జరిగింది. మాటల సందర్భంలో పై సామెతగురించి వివరించమని అడిగినపుడు స్వర్గీయ పైవిధంగా తెలియచేశారు. వారికి కృతజ్ఞతలు.  


॥నిర్వహణ॥

_______________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.