9, అక్టోబర్ 2021, శనివారం

సంధ్యా వందనము చేస్తే

 సంధ్యా వందనము చేస్తే 

పుణ్యం వస్తుందా అండీ?  

అంటే పుణ్యం 

ఎంత మాత్రం రాదు... 


దంత ధావనము 

ఎందుకు చేస్తున్నాము? 


మననోరు 

వాసన రాకుండా ఉండటానికి కదా... 


మనం స్నానం 

ఎందుకు చేస్తున్నాము? 


దేహ పరిశుభ్రత కోసంకదా


అంతేగాని 

పుణ్యంకొరకు కాదుకదా 


అలానే మనసులో 

ఉన్న మాలిన్యం 

పోవడానికి, 

నీమనస్సు

ఆనందంగాఉండి

దైవ సంపదను 

పొందడానికి మనం

"సంధ్యావందనం"

విధిగా చేయాలి..... 


మనిషిగా పుట్టి 

యజ్ఞోపవీత అర్హత 

ఉన్నవారు విధిగా 

సంధ్యాసమయంలోనే

సంధ్యావందనం చేయాలి...


ఆసమయంలో 

కుదరనిపక్షంలో 

మనకు వీలైన 

సమయంలో చేయాలి 

అంతే గాని 

సంధ్యావందనం 

మానేయకూడదు... 


సంధ్యావందన ప్రాశస్త్యం:- 


సూర్యోదయానికి పూర్వం లోకాన్ని చీకట్లోనే ఉంచాలనే ప్రయత్నంతో సూర్యుని కిరణాలు భూమిని చేరకుండా కొందరు అసురులు 

సూర్యుని రాకకు 

ఆటంకం కలిగిస్తుంటారు... 


యజ్ఞోపవీత అర్హత ఉన్నవారు సూర్యోదయానికి 

పూర్వం లేచి 

ప్రత్యక్ష భగవానుడైన 

సూర్యుడిని ఉపాసించి సంధ్యావందనం ద్వారా 

నీటిని తర్పణగా 

విడువడంవలన ఈ నీరు 

సూర్య ఆగమనానికి

అడ్డుపడుతున్న రాక్షసులని 

బ్రహ్మాస్త్రమై వెంటాడి 

వారిని నాశనం చేస్తుంది... 


లోకానికి వెలుగును అందించే 

ఆ దివాకరుడి వెలుగుకు 

మనవంతు సహాయం 

మనం చేయగలగడం 

మన అదృష్టం. ..


మనతో అయన సేవ చేయించుకోవాలనుకోవడం 

నిజంగా 

మన పూర్వజన్మ సుకృతం... 


అందుకే 

సూర్యోదయానికి పూర్వమే 

సంధ్యావందనం చేయాలి... 


సంధ్యా వందనాది క్రియల్ని

ఎవరైతే క్రమంతప్పకుండా

చేస్తారో వారికి రాబోవు 

గ్రహ భాధలు కూడా 

ఉపశమించి 

ఎంతటి కష్టాన్నైనా 

తట్టుకు నిలబడే శక్తిని 

మానసిక ధైర్యాన్ని కలిగించి

వారి ముఖము నందు 

బ్రహ్మ తేజస్సుని ప్రతిబింబిస్తుంది.


మనిషిగా పుట్టి 

యజ్ఞోపవీత అర్హత 

ఉన్న వారు విధిగా 

సంధ్యా వందనంచేసి 

ఆనందంగా వుండగలరు.

కామెంట్‌లు లేవు: