ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
10, సెప్టెంబర్ 2024, మంగళవారం
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
శా. శ్రీరామాయణకల్పవృక్షమునకున్
శ్రీకారముం జుట్టియున్
యారాధించియు రామునిన్మదిని ది
వ్యాకారు సీతాపతిన్
సారంబంతయు జెప్పినాడ వు కదా !
సాహిత్య ముప్పొంగ , నే
డేరీ ? నీవలె కావ్యమల్లు కవు లు
ర్విన్ సత్యనారాయణా !
ఇంత గొప్పదా
__
*_✳️“మరణం ఇంత గొప్పదా...!!!”_✳️*
__________________________
_[మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ జనన మరణాలు సృష్టి నియమాలు..... విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. మరణమే లేకుంటే ఎన్నెన్ని అనర్థాలో..! అదేంటో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ కథ చదవండి...]_
...................................................
*ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి _"ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి"_ అని అడిగాడు. అప్పుడా సన్యాసి _"ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు."_ అని చెప్పాడు.*
*రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా...*
*"నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు.గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను."*
*రాజు ఆలోచించాడు... _"అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి?"_ నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే? పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. _"నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలపండి"_ అని...*
*సన్యాసి ఇలా అన్నాడు... "సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు."*
*రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు.అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు.*
*నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారు మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు _"నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు..."నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు.*
_రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి..._
_*"మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు"* అన్నాడు._
_అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు..._
_*మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది*_
*"మరణాన్ని నివారించే బదులు, మీరు ప్రతిరోజూ, ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అపుడు ప్రపంచం మారుతుంది.*
*1. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం (పవిత్ర స్నానం) లాగా ఉంటుంది.*
*2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది.*
*3. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర లాగా ఉంటుంది.*
*4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహా ప్రసాదం అవుతుంది.*
*5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది.*
*6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది.*
*7.ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది.* 🙏
-****✳️"శివార్పణం🙏***
సత్సంగం
✳️ *సత్సంగం* ✳️
కష్టం... ప్రార్ధన నేర్పిస్తుంది.
ఇష్టం... త్యాగాన్ని నేర్పిస్తుంది.
శ్రమ... ఓర్పును నేర్పిస్తుంది.
ప్రేమ... క్షమించడం నేర్పిస్తుంది.
విజయం... గెలుపు విలువను నేర్పిస్తుంది.
ఓటమి... కన్నీటి బరువును నేర్పిస్తుంది.
ఓర్చుకుంటే... నేర్చుకుంటావు.
జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది.
ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది.
ఈ అనుభవాలన్నీ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి.
ఆయుధం కత్తి అయితే, శత్రువును మాత్రమే గెలవగలo.
ఆయుధం ఆలోచన అయితే, మనసును మాత్రమే గెలవగలo.
ఆయుధం అనుభవమైతే, ఆశయాన్ని మాత్రమే గెలవగలo.
ఆయుధం పుస్తకమైతే, (చదువు) ప్రపంచాన్నే గెలవగలo.
కాబట్టి మనం జీవితంలో ఎదగాలంటే, నిత్య విద్యార్థి అవ్వాల్సిందే. అప్పుడు మనకి విజయం తథ్యం.
✳️ శివార్పణం🙏
తెలుగు రాష్ట్రాలను
*తెలుగు రాష్ట్రాలను ముంచిన వాన*
ఉ॥
దిక్కులు గూడబల్కుకొని దీరి దివీశు ననుజ్ఞమేరకుం
జిక్కగ నొక్కచోట గుమి జేరిన మేఘచయమ్ము నంతటిం
జక్క ద్రవింపజేయగ బ్రసారితనీరము లొక్కచోటునం
గ్రక్కున ద్రిమ్మరించబడె కాలువ లేఱులు సంద్రమైసనన్
ఉ॥
పల్లెలు పట్నముల్ నగరభాగము లెల్లను కంఠదఘ్నమై
యల్లలలాడె నీరముల నార్తి వెలార్చుచు దీనసంస్థితిన్
ముల్లెలు మూటగట్టుకొని పోవగ మార్గము లేక పౌరులున్
తల్లడబాటు గల్గ మది దైన్యత నందిరి దిక్కుదోచకన్
చం॥
పడవలు వీధులం దిరిగె వాహనముల్ జలమందు సొచ్చెడిన్
నడవలు కాల్వలేఱులయె నాశనమయ్యె గృహమ్ములన్నియున్
వడివడి గట్లు దాటుకొని వాహిను లూళ్ళను ముంచె భీతిమై
సుడిగొనె జీవులెల్ల పెనుచోద్యము నిచ్చిన వర్షహేలకున్
*~శ్రీశర్మద*
8333844664
పూరి - దోసె - ఉప్మా
*పూరి - దోసె - ఉప్మా - గారె*
_ఈ పదాలతో ఒక పద్యం..._
*_పసిడి హృదయాల పెం'పూరి' భారతమున_*
*_భాషయు మన 'దో సె'లయేటి భవ్య రుచులు_*
*_మానసంబుల 'తుప్మా'న జ్ఞాన సుధల_*
*_వసుధ పొం'గారె'పుడు కుటుంబ మనుగతిని!_*
_(పూరణ: -శ్రీమతి బులుసు అపర్ణ గారు శతావధాని)_
ఒకనికి ఖేదమిచ్చె మఱి*
🌹🦜🙏🏽🦜🌹
“ *ఒకనికి ఖేదమిచ్చె మఱి*
*యొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే”.*
..............................................
*చంపకమాల..* *సవరణ*
సకలము పంటనూర్ప, వరి సంద్రము
పాలయె జోరువానకున్
చకచక సాగెనొక్కడట సంపద
దూయ తుఫానుమంటలో
నొకనికి ఖేదమిచ్చె మఱి
యొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే
తికమక చేయువాన్కి ధర
దిప్పలు దప్పవు జీవితమ్మునన్ !!
.................................................
🦄🐓🦜🦢🐘
పి.ఎల్.నాగేశ్వరరావు
హైదరాబాదు
ఆయన కవి సమ్రాట్టు.
శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 ఆయన కవి సమ్రాట్టు. దేశం పట్టరానంతటి మహాకవి. ఆయనే మన విశ్వనాథ. ఆయన గురించి తెలుసుకోవడం, ఆ కవిత్వాన్ని ఆకళింపు చేసుకోవడం ఒక జన్మాంతర అదృష్టమనే చెప్పాలి. తెలుగు జ్ఞానపీఠం అధిరోహించిన ఆ కవీశ్వరుని పద్యాలన్నీ పంచదార గుళికలే. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు విశ్వనాథ జయంతి సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమ కాలంనాటి ఆయన గొప్ప కావ్యమైన ' ఆంధ్రప్రశస్తి ' గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఆ రోజుల్లో తెలుగువారందరూ ఆంధ్రులేనని అనుకొనేవారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
మాతృదేవతాయై నమః:
మాతృదేవతాయై నమః: పితృదేవతాయై నమః
పురాణాలను పుక్కిట పట్టిన వంశమది. ఇంటి పేరు పురాణపండ. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని కాకరపర్రు. పండితుల కర్మాగారంగా ఆ గ్రామం ప్రసిద్ధికెక్కింది. అక్కడి వారే పురాణపండ రామ్మూర్తిగారు. ఉషశ్రీ గారి తండ్రి. తొలి రోజుల్లో ఆయన జ్యోతిశ్శాస్త్ర పండితులు. ఆయుర్వేద వైద్యులు. కారణాంతరాల వల్ల తూర్పుగోదావరి జిల్లా ఆలమూరుకు తరలి వచ్చారు. అక్కడి నుంచి ఆయన పురాణ ప్రవచనాలకు శ్రీకారం చుట్టారు. 1950దశకం నుంచి 1980వరకూ నిరాఘాటంగా ఆయన ప్రవచనాలు సాగాయి. భీమవరం సోమేశ్వరాలయంలో 1970 నుంచి 78 వరకూ ఏకధాటిగా భారత ప్రవచనాలను వినిపించారు. కాకినాడ దేవాలయం వీధిలో కూడా ఆయన ప్రవచనాలు ప్రతిధ్వనించాయి. ఉభయగోదావరి జిల్లాలలో ఆయన ప్రవచనం వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. పురాణవాచస్పతి, ఉపన్యాస సార్వభౌమ బిరుదులందుకున్నారు. గజారోహణ సత్కారాన్నీ అందుకున్నారు. కొన్ని గంటల పాటు నిలబడి ఉపన్యసించడం ఆయన ప్రత్యేకత. రామ్మూర్తిగారు నిలబడి ప్రవచనాలు చెబుతుండడం చూసి, వచ్చిన వారు సైతం గౌరవసూచకంగా నిలబడే వినేవారట. దేవాలయం వీధి కిటకిటలాడిపోయిన సందర్భాలు అనేకం. ఆయన ప్రవచనాలకు ఇసకేస్తే రాలనంతమంది జనం వచ్చేవారు. ఎటువంటి పుస్తకమూ ముందు పెట్టుకోకుండా ఆయన ప్రవచనాలు చెప్పేవారు. రాజమండ్రిలో భరద్వాజ ప్రెస్‌ను స్థాపించారు. భారతాన్ని తెలుగులోకి అనువందించారు. ఆ ప్రెస్‌లోనే ముద్రించారు. ఈ చిత్రంలో ఉన్నది ఉషశ్రీ గారి జననీ జనకులు రామ్మూర్తిగారు, అన్నపూర్ణగారు. ఇలాంటి వ్యక్తులను చూసినా చాలు.. జన్మలు ధన్యమవుతాయి. ఉషశ్రీగారు తన జననీ జనకుల గురించి కావేరి క్యాసెట్స్ వారు రూపొందించిన శ్రీమద్భాగవతం ఆడియో క్యాసెట్ ప్రారంభంలో వివరించారు. పితృదేవతాయై నమః, మాతృదేవతాయై నమః అంటూ ఆ క్యాసెట్ ప్రారంభమవుతుంది.
సేకరణ .
*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 8
_*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 8 వ భాగము*_
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
*సన్న్యాసాశ్రమ స్వీకార బీజము*
ఒకనాడు శంకరుని చేరి ఆర్యాంబ “నాయనా! ఎప్పుడూ ఇంటిపట్టున ఉండవు కదా! ఇలా ఇల్లూ వాకిలీ వదలి పెట్టి వెళ్ళిపోతూ ఉంటే నేను ఏమైపోతాను? వచ్చిన పెండ్లి వారు అందరూఇంటివద్ద ఉండవని చెప్పుకొంటున్నారు. అందరి ఇళ్ళకూ వెళ్ళడం ఎందుకు? ఇక్కడనేగోష్ఠి పెట్టుకోవచ్చు గదా! నీ ఉపనయనం తరువాయి ఎలాగూ తీరింది. ఇంక పెళ్ళి చేస్తాను. కోడలు రావాలని ముచ్చట పడు తున్నాను. నీకు బిడ్డలు కలగాలని ఆ బిడ్డలను ముద్దాడాలనీ ఉంది. ఎప్పుడు తీరుస్తావోగదా నా కోరిక!” అని చెప్పిన తల్లి మాటలకు ఇలా సమాధానం చెప్పాడు శంకరుడు: "అమ్మా! నా కోసం బెంగ పెట్టుకోకు. నీకు మాత్రం ఊళ్ళో వారి మీద ప్రేమ లేదా? అందరి యిళ్ళూ నీకు సమానమే. దేశమంటే ధర్మమంటే నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. వేద ధర్మాలన్నీ పాడయి పోతున్నాయి అని ఎన్నో సార్లు నాతో అన్నావు. నేను మాత్రం నీలాగున తలపోయడం తగదా? కాని దానికి నేను పూనుకొంటే కష్టంగా ఉంటుంది. నేను పెండ్లి ఆడాలనీ, వైదికధర్మాలు కాపాడాలనీ నీ ఆకాంక్ష. నీ కోరికమంచిదే. కాని దేశ మంతటా నీవనుకొన్నట్లు ఆచరించేటట్లు చేయవలసి ఉంది. నిజానికి మన ఇద్దరి ఆశయాలు ఒకటే" చల్లగా తన కోరికను వెల్లడించాడు శంకరుడు. దానికి మండి పడి ఆర్యాంబ “చాల్లే చెప్పావు. కుఱ్ఱనాగమ్మవు. నీ కోరికలిప్పుడా? పెళ్ళి చేసుకోవాలి. పిల్లలను కనాలి. మనుమలూ, ముని మనుమలూ కలగాలి. అప్పుడు నీ కోరిక తీర్చుకో”. కొడుకు కోరికను మొక్కను మొదట్లోనే తుంచినట్లు పలికింది. మళ్ళీ అంటుంది “సంసారం ఈది ఈది వైరాగ్యానికి వెళ్ళాలి. అప్పుడే అది నిలబడు తుంది. బౌద్ధ సన్న్యాసు లను చూస్తున్నావు కదా! వాళ్ళ జీవితాలు ఎలా వెళుతున్నాయో” తల్లితో శంకరుడిలా నచ్చ జెప్పు తాడు: “అమ్మా! నీ ఊహలు నా ఊహలు వేరుకాదు. నిన్ను చూచు కొన్నట్లుగానే తల్లులందరినీ చూచుకోవలదా? నేను బౌద్ధుల వంటి సన్న్యాసం కోరు కోవడం లేదు. అదియా నీ బెంగ!” అని అప్పటికి తల్లికి ధైర్యం చెప్పాడు.
*సోదరునితో ఆర్యాంబ చర్చ:*
ఆర్యాంబకు తోడబుట్టిన వాడు చెట్టంతవాడు ఉన్నాడు. అతని పేరు జయదేవుడు. ఆమె పుట్టింటి వారు తరచు రావడం పోవడం ఉంది. తన మేనల్లుడు అవతార పురుషుడని విని ఎంతో సంబర పడిపోయే వాడు. శంకరుడు సన్న్యసిస్తాడని ఆ నోటా ఈనోటా తెలిసి క్రుంగిపోయాడు. వ్రేలెడు లేడు సన్న్యాసమా! నా సోదరి ఎంత బాధ పడు తోందో! కనుక్కుందామని వచ్చాడు శంకరుని ఇంటికి. ఆదరించి సంతోషంగా లోపలికితీసుకొని వెళ్ళింది ఆర్యాంబ అన్నగారిని. పుట్టినింటి వారందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొంది. అల్లుడు కనబడడే? అని అడిగాడు. “ఏం చెప్పమంటావు అన్నా! వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్లే అలవాటు లేదు. వెళ్ళడాని కి రావడానికీ ఒక వేళ అంటూ లేదు. నేనెంత పోరినా ప్రయోజనం లేదు. చూడగా చూడగా వాడు ఇంట్లో ఉంటాడనిపించడం లేదు. కాని నేనంటే హద్దు లేని ప్రేమ. నా మీద ఈగ వాలనివ్వడు. తన బ్రహ్మ చర్య నిష్ఠలో అంతరాయం రానీయడు. నా కష్టం చూచి పూర్ణానది నీ కాళ్ళ దగ్గఱకు వస్తుందిలే అన్నాడో లేదో అలాగే జరిగింది. ఊరివారంతా నీ పుత్రుని మహిమే అన్నారు. ఎందరెందరి తోనో వాదిస్తాడు.వాళ్ళ మతాలను ఖండిస్తాడు. ఒప్పుకొని వెళ్ళిన వారందరూ ఆనందంగానే వెడతారు. దేశంలో తల ఒక మతమూ అవలంబి స్తున్నారట. కర్మకాండ కాలిపోయినదట. దారి తెన్ను తెలియక ఒకరినొకరు ద్వేషించు కొంటూ నిందించు కుంటూ అజ్ఞానాంధకారంలో ఉన్నా రట. పరిస్థితి చక్క దిద్ది ధర్మం నిలబెట్టవలసిన సమయమట. లోకంలోని ఇళ్ళన్నీ తనవేనట. తల్లులందరూ తన తల్లులే నట. నా ఆలనా పాలనా ఎవరికి కావాలి చెప్పు. నీ కన్నీ బోధ పరచాను. నాకేం చేయాలో తెలియ డం లేదు. నీవే ఏదో ఉపాయం చూడాలి” తన గోడు వెళ్ళబోసుకొంది. అప్పుడు జయదేవుడు ఇలా అన్నాడు చెల్లెలితో: "శంకరుడు మామూలు బాలుడు కాదు.సర్వజ్ఞుడు. మాటలతో వానిని ఒప్పించడం నీ తరం నా తరం కాదు. నాకొక ఆలోచన వచ్చింది. ముందు వానికి పెండ్లి చేద్దాము. అప్పుడు సన్న్యాసం తలపు సన్నగిలవచ్చు. పైగా పెళ్ళి కుదిర్చేదీ చేసేదీ పెద్ద వాళ్ళం మనమే కదా! ఆ పైన మన మాట కాదంటాడా?".
పుత్రుని మనోభావనలు ఉద్దేశాలు విశాలము ఉదాత్తమైనవని తెలుసా తల్లికి. “నాయనా! నన్ను విడచి వెడతా వన్న మాట. నీ తండ్రి నింత బూడిద చేసికొనే యోగం ఆనాడు నీకు లేక పోయింది. నాకు కూడా అటువంటి గతే పట్టిస్తావా నాయనా! నీ చేతులారా నన్నింత బూడిద చేసికో. నా కోరిక అదే. ఆ తర్వాత నీ ఇష్టం. నాఇష్టంతో పని ఉండదు. సన్న్యాసం ఇప్పుడు పుచ్చుకుంటే నా కోరిక తీరదు గదా! నన్ను కాదనకు" అని తన అనుమానాన్ని వ్యక్తంచేసింది ఒకనాడు తనయుని దగ్గఱ. దానికి బదులుగా "అమ్మా! నీ కోరిక ఏనాడు తీర్చలేదు? ఇంత దానికే భయపడి పోతావా! ఎన్ని కష్టాలైనా, ఎన్ని గడ్డు అడ్డాలు వచ్చినా తప్పక నీ కోరికతీరుస్తాను. నన్ను నమ్ము. నా మాటపై మొదట నమ్మకం లేకపోవడం తర్వాత ఆశ్చర్యపోవడం నీకు మామూలే కదా! నా జన్మ అందరికోసం. నీ అనుమతికోసం ఎదురుచూస్తోంది" తల్లి మౌనం వహించడంతో అర్ధాంగీకార మని తెలిసింది.
*సన్యాస కాండ: మానసిక సన్న్యాసము:*
శంకరుడు తల్లిని ఒక్క క్షణం కూడా విడిచి పెట్టి ఉండడం లేదు. ఒక రోజు ఆర్యాంబ నదికి స్నానానికి బయలుదేరింది. శంకరుడు తోడి బాలురు కూడా వచ్చారు. ఒడ్డు దరినే మొలలోతు నీళ్ళలో స్నానం చేస్తోంది ఆర్యాంబ. పిల్లలందరికీ ఈత కొట్టడం వచ్చు. మెల్లగా దిగి బారలు వేస్తున్నారు. సరదాగా చిన్న చిన్నఆటలు ఆడుతున్నారు. వెనుకఈత ఈదుతున్నాడు శంకరుడు. అది ఆ పిల్లలకు రాదు. అంతలో శంకరుడుమునగడం తేలడం చూస్తున్నారు. అదిఈతలా లేదు. అనుమానం వచ్చి “మొసలేమోరా!”అని ఒకడు, “ఏదో పట్టుకొని పోతున్నట్లు ఉంది” అని ఇంకొక బాలుడు అంటున్నారు. “మొసలి లాక్కు పోతుంది వాళ్ళమ్మకు చెప్పండి రా” ఇంకొకడన్నాడు. అది చూచిన ఆర్యాంబ గొల్లుమంది. "అమ్మా! అమ్మా! అమ్మా!” అంటున్నాడు శంకరుడు మునుగుతూ తేలుతూ. “నాయనా! నాయనా!” అని తల్లి రోదన. ఇంతలో శంకరుని నోట నుండి “అనుమతి! అనుమతి! అనుమతి!” ఆతురతతో శంకరుని ప్రార్థనాస్వరం.ఆ మాటలు కడసారి మాటలు లా అనిపించా యామెకు. మరల "ఉత్తమ మరణం! ఉత్తమ మరణం! … అనుమతి! ...” అన్న పలుకులు తెలిసీతెలియనిధ్వనిలో ఆమె చెవులకు సోకాయి. “నా బిడ్డను రక్షించుదేవా ఆపద్బాంధవా! కరుణించు” దీనాతి దీనంగా వేడుకొంటోంది. “ఓ పంచభూతములారా! ఈశ్వరా! భాస్కరా! దేవతల్లారా! అనుమతి ఇచ్చాను నాయనా! నా బిడ్డ సన్న్యాసిగానైనా బ్రతికిఉంటే సంతోషిస్తాను" త్రికరణ శుద్ధిగా అనేసింది ఆర్యాంబ. ఆ శపథం వినీ వినగానే శంకరుడు “సన్న్యస్తం మయా" అన్నాడు మునుగుతూ తేలుతూ. ఎనిమిదేండ్లు నిండీనిండని బాల శంకరుడు మకరి బంధంలో నుండి బయట పడ్డాడు. మకరిని సంహరించి కరిని బ్రోచిన దైవంకరుణతోఈదుకొంటూ వచ్చిన బిడ్డను కౌగిట ఇరికించు కొంది ఆ తల్లి.
*తల్లికి శంకరుని వాగ్దానము*
“సన్న్యస్తం మయా” అన్న మాటతో శంకరుని బంధనాలన్నీ పటా పంచలై సర్వస్వతంత్రుడైనాడు ఆ క్షణం నుండి. ఒక క్రొత్త పుట్టుకకు నాంది ఆ క్షణం. ఆర్యాంబ ఏమో పెన్నిధి దొఱకిన పేదలా శంకరుని చంక నుండి దింపడం లేదు. తోడి వారితో కలిసి ఇల్లు చేరుకుంది. శంకరుడు తల్లితో “అమ్మా! నన్ను బ్రతికించుకొని నీకు లోకంపై ఉన్న ప్రేమను చాటుకున్నావు. నిజానికి ఈ నాటితో లోకమాత వయ్యావు. నీ కరుణతో లోకానికి అక్షయమైన జ్ఞాన భిక్షనందించావు. జగత్ప్ర ఖ్యాతి వడసిన మా నాన్న గారి సహచర్యభాగ్యం నీకు లభించింది. తల్లీ! నీకు ఏ లోటూ లేకుండా చూచు కుంటాను. నా తండ్రి ధనం మన వంశీయుల చేతుల్లో ఉంచితే నిన్ను బంగారం లా చూచు కొంటారు. నన్ను నమ్ము” అన్న తనయుని మాటలు అమృతాలుగా భావించి ఇలా అడుగు తుంది: “నాయనా! సరే కానీ, ఇంతబ్రదుకు బ్రదికి ఇంత గొప్ప పుత్రుణ్ణి కని నా అంత్య క్రియలు కడకు జ్ఞాతుల చేతుల్లో పెట్టి వెడతావా? నీవన్న మాట మరచావా? చెప్పు”. దానికి శంకరుడు "అమ్మా! నీకు ఇచ్చిన మాట ఎలా మరువగలను? ఆడిన మాట తప్పడం మహా అపరాధం కదా! నేనే వచ్చి నీ అంత్య క్రియలు చేస్తాను. మాట తప్పను. తప్పను. అంతే కాదు. అవసానకాలమందు నన్ను స్మరించుకో. ఎక్కడ ఉన్నా మనో వేగంతో వచ్చి నీ ముందు వాలుతాను. నీ ముప్పు గడిపి నీ మెప్పు అందుకొంటాను” అని తల్లికి నచ్చజెప్పుతాడు.
*కైలాస శంకర కాలడి శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము*
*8 వ భాగము సమాప్తము*
🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃
శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 7
_*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 7 వ భాగము*
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
*రాజుకు శంకరుని వరము:*
వెళ్ళే ముందు రాజుకు ఒక కోరిక ఉదయించింది.రాజశేఖర మహా రాజు కేవలం ప్రతాపవంతుడైన ప్రభువు మాత్రమే కాదు. కవి, విద్వాంసుడు, శాస్త్రకోవిదుడు. నిత్యము కవితా రసాస్వాదనలో తనియు కళాప్రపూర్ణుడు. రాజశేఖరుడు సంస్కృత భాషలో ముచ్చటగా మూడునాటకాలు రచించాడు. తన ఆస్థానంలో నున్న కవులు పండితులు ఎంతో మెచ్చుకొన్న కృతులవి. కాని రాజుకు తృప్తి లేదు. ఏలన రాజు కదా అని విరుద్ధంగా ఎవరు మాట్లాడుతారు? శంకరుడు సహజకవీంద్రుడని విని ఆయన అభిప్రాయమే విశ్వసనీయమని తలచి శంకరునిచేరి ఒక పళ్ళెరములో పది వేల బంగారు నాణెములను ఉంచి, అందులో తాను రచించిన నాటక ప్రతులను పెట్టి భక్తితో శంకరునికి సమర్పించాడు. "స్వామీ! ఈ నాటకాలు మూడూ నాచే దేవభాషలో రచించ బడినవి. దయతో తాము ఒక్కపరి పరిశీలించిన నా ఆనందానికి మేర ఉండదు. తమ అభిమతాన్ని ప్రసాదించెదరు గాక!" వినయ భయభక్తులతో వేడుకొన్నాడు. అపుడు శంకరుడు రాజుకు నాటకాలనందించి చదివి వినిపించ మన్నాడు.
ఇష్టదేవతా ప్రార్థనలు చేసి రాజశేఖరుడు తన రచనలను శంకరునికి రమ్యమైన స్వరంతో శ్రావ్యంగా వినిపించాడు. “రాజశేఖరా! నీ నాటకాలు పండితులనూ, కవులనూ అలరించేలా నవరస పూర్ణమై క్రొత్తపోకడలతో ప్రకాశిస్తున్నాయి. నాకు ఆనందాన్నిచ్చాయి. అందు వలన నేను నీకొక వరము ఇవ్వ దలచాను కోరుకో రాజా!" అని పలికిన బాలుని మాటలకు ఉబ్బి తబ్బిబ్బయి రాజశేఖరుడు "స్వామీ! మీ దయ వలన రాజ్యం సుభిక్షంగా సురక్షితంగా ఉంది ఇప్పుడు నా పరోక్షాన దేశాన్ని ఇంకా మెఱుగుగా పాలించే నాథుడుండాలి కదా! అదేకొఱత. నా మనసు లోని దిగులు.
సత్పుత్రుణ్ణి ప్రసాదించండి" అని కోరుకున్నాడు. అలానే అనుగ్రహించి పుత్రకామేష్టి చేయమని చెవిలో చెప్పాడు శంకరుడు. "బ్రహ్మచారిని. నాకీ ధనమేల? ఈ ఊరి జనులకు పంచి పెట్టండని ఆనతిచ్చాడు బ్రహ్మచారి శంకరుడు.
*శంకరుని శిష్యులు:*
బాల్యంలోనే గురువయ్యాడు శంకరుడు. ఎందరెందరో ఆయన కడ వేదం నేర్చుకొని వేద పారంగ తులయ్యారు. శాస్త్రాలను క్షుణ్ణంగా చదువుకొన్నవారు కూడ వాటిలోని సూక్ష్మాలను తెలిసి కొనడానికి శంకరుని వద్దకు వచ్చేవారు. అట్టి వారందరికీ ధర్మమర్మాలను విశదీకరించే వాడు. విద్యార్థుల స్థాయి నెంచుట కోసం అప్పుడు రహస్య పరీక్షా పద్ధతిని ప్రవేశ పెట్టాడు. ఆ విధంగా శంకరుని శిష్యులు మణిపూసలవలె అందరి మన్ననలూ పొందేవారు. శంకరుడే కాదు శంకర శిష్యుడన్నా పండిత ప్రకాండులకు సైతం హడలే, ఆనందమే! మహిమాన్వితుడు కావడంతో బాలుడైనా శంకరుని దైవంగానే భావించుకొనే ఆ శిష్యులు కూడ పురా జన్మఫలంగా ఆ భాగ్యం పొందారు. శంకరుడన్న గురుడే. గురుడే శంకరుడు.
*మాతృస్థాన విశిష్టత:*
‘న మాతు: పరదైవతమ్’ మంత్రాలలోని కెల్ల గాయత్రీ మంత్రం శ్రేష్ఠం. దైవాలలో కెల్ల మాత శ్రేష్ఠదైవతం. ఎందు వలన? బీజోత్పత్తి నాటి నుండి తన గర్భంలో పదిలంగా కాపాడుతూ, తన జీవ సత్యాలు బిడ్డకు సమర్పించుతూ, తన్మూలాన తాను బలహీనురాలయినా భరిస్తూ, నవ మాసాలు, నవ రాత్రులు, నవ ఘడియలు మోసి, దుర్భర వేదన అనుభవించి కన్న బిడ్డను కంటిరెప్ప వలె కాపాడుతూ ఉంటుంది. బిడ్డను చంక నుండి దింపదు. దించితే ఏడుస్తాడని చంకనే ఎత్తుకొని అహరహము పనులు చేసి కొంటుంది. చంకలోని బిడ్డ కంటిలో గుచ్చుతాడు. మెడలోని మాంగల్యాన్ని పీకుతాడు. అవన్నీ ఇష్టంగా సహిస్తుంది. బిడ్డ మల మూత్రాదులను ఓపికతో బాగు చేస్తుంది. ప్రేమకు, సహనానికి, వాత్సల్యానికి, కారుణ్యానికీ మారు పేరే అమ్మ! బిడ్డ పెరిగి చెడ్డ వాడయినా తల్లి ప్రేమ పోగొట్టు కోదు. ఇన్ని పాట్లుపడి పెంచిన తల్లి ఋణం ఎన్ని జన్మలెత్తినా తీరనిది అంటారు. నరుడై పుట్టినవాడు ఋణాలు తీర్చుకోవాలి.ఋణాలు మిగిలిఉంటే జన్మ రాహిత్య మెలా? కనుక తల్లికి పుత్రుడు భక్తి శ్రద్ధలతో సేవ చేయాలి. తల్లి ఏర్పఱచిన ప్రేమ పాశాన్ని తల్లియే తొలగించాలి. అప్పటికి గాని జనని ఋణం తీరదు. ఈ ధర్మాలన్నీ శంకరునికి పుట్టుకతోనే ఎఱుక. తల్లికి అపార సేవ చేసేవాడు.
*పెండ్లి ప్రయత్నము:*
తాను అత్తగారు కావాలని ప్రతీ తల్లికీ ఉండడం సహజం. కాని ధర్మబద్ధ మైన ఆంతర్యం వేరు. కుమారునికి పెండ్లి జరిగితే పితృదేవతల ఋణాలు తీరే దారి ఏర్పడుతుంది. ఆర్యాంబ పుట్టింటి వారు కూడా ఆర్యాంబకు కోడలు రావాలని ఉబలాట పడు తున్నారు. శంకరుని కీర్తి దేశం దశ దిశలా వ్యాపించి ఉండడంతో ఆడపిల్లలు కలవారెందరో శంకరుని అల్లునిగా పొందాలని ఉవ్విళ్లూరు తున్నారు. వచ్చి చూచి తలలూపి తమ అభిమతం ఆర్యాంబ చెవిలో చెప్పి వెడుతున్న వారెందరో. ఆర్యాంబ ఉబలాటం మేరలు దాటుతోంది. తన కుమారుడు తండ్రి వలెనే గృహస్థుడై యజ్ఞ యాగాదులు చేసికొంటూ, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండే భాగ్యాన్ని కనులార చూడాలని ఆమె ఆకాంక్ష. అదేమీకాక, పరమహంస పరివ్రాజకుడై జగద్గురుడై ఆసేతు హిమాచల పర్యంతం దిగ్విజయ యాత్ర చేసి, ధర్మస్థాపన చేసి ఆచంద్రతారార్కం నిలిచిపోతాడని ఆ ముద్దరాలెఱుగదు.
శ్రీరామునికి నిశ్చయించిన పట్టాభిషేక సంరంభం ఆగకపోతే రాముడు అడవులకు వెళ్ళడం ఎప్పుడు, దుర్వారులు ఖర దూషణాది రాక్షసులను, రావణ కుంభ కర్ణాది దుష్టులను మట్టు పెట్టే దెపుడు అనే ప్రశ్న వచ్చేది.
అదే విధంగా ఆర్యాంబ ఉత్సాహ పడిన రీతిగా శంకరుడు గృహస్థుడై ఇంటి పట్టున ఉండి తన సంసారాన్ని తల్లిని కని పెట్టుకొని కాలం గడుపు తుంటే భారత భూమిలో కావలసియున్న అద్వైత ధర్మపరిరక్షణ మరి ఎవరి వలన సాధ్యం అన్న ప్రశ్న ఉదయించింది మహర్షి సత్తములకు. వెంటనే బయలుదేరి చేరారు శంకరుని ఇంటికి. మహర్షులు వేంచేయగానే కనిపెట్టి వారికి అర్ఘ్య పాద్యాది అర్చనలు చేశారు శంకరుడు, ఆర్యాంబ. ఆర్యాంబ అడిగింది ఋషులను ఈ విధంగా: "మహర్షివరులారా! మీ రాకతో మా యిల్లు పావన మయ్యింది. పిల్లవాడు నా బిడ్డడు. మీరు మహనీయ తపోధనులు. మీ మీ తపో వ్యాసంగాలను మాని మమ్ములను ఈ విధంగా అనుగ్రహించడం మా అదృష్టం. మీ సేవలు చేసికొనే భాగ్యాన్ని మాకు ఒసగారు మా పూర్వ పుణ్యవిశేష ఫలంగా. మా పాపాలు నేటితో పటాపంచలయినట్లు తోచు చున్నది” అంటూ ఆర్యాంబ మునులకు నమస్కరించినది. మహర్షులాశీర్వదించారు.
మరల మునులతో అంటుంది ఆర్యాంబ: "స్వాములారా! ఈ నా కుమారుడు పుట్టినప్పటి నుండి కని విని ఎఱుగని ప్రజ్ఞలు చూపిస్తున్నాడు. మూడో యేటకే శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా నేర్చు కున్నాడు. పెద్ద పండితులను నిర్భయంగా సునాయా సంగా జయిస్తున్నాడు. వాదంలో ఓడిపోయిన వారు వీణ్ణి ఏదైనా చేస్తారేమోనన్న భయం నన్ను పట్టి పీడిస్తోంది. తన మతం వదలడు. ఇతరమతాలు మతి లేని వంటున్నాడు. ఓడిపోయిన వారు నవ్వుతూ పోతున్నారు. ఈ బాలునిపై ఎంత అభిమానం లేకపోతే మీరిలా వస్తారు? మీ రాకలో ఏదైనా పరమ రహస్యం ఉండాలి. నేను వినదగినదయితే చెప్పండి" అని వేడుకొన్నది ఆమె. అందుకు సమాధానంగా మహర్షులు ఆర్యాంబతో "అమ్మా! నీవూ నీ భర్త శివగురుడు పార్వతీపతిని గూర్చి తపస్సు చేయగా ఉద్భవించినవాడు ఈ బాలుడు. ఆ పరమేశ్వరుడు నీ పతిని కోరుకొమ్మన్నాడు: పూర్ణాయుర్దాయము కల పేరు ప్రతిష్ఠలు లేని పలువురు పుత్రులు కావాలా, లేక పూర్ణాయువు లేని లోకోద్ధారకుడగు సత్పుత్రుడు కావలెనా యని. సత్పుత్రునే కోరుకొన్నాడు నీ భర్త. నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక శివగురుడీ విషయం నీకు చెప్పిఉండక పోవచ్చును. ఆ నాటి మాట అటుంచు. నేడు మీ పుట్టుకలు సార్థక మయ్యాయి. ఈ యీ నీ బిడ్డ సాక్షాత్తూ పరమేశ్వరుని అవతారము. ఆ పరాత్పరుడే నీ కుమారుడై నీ ముందు తాండవిస్తున్నాడు తెలిసిందా! నీవు శంకరుని కొక్కతివే తల్లివి కాదు. నీవు లోకమాతవు. నీ బిడ్డ మహిమలు హిమవన్నగం వలె మహెూన్నతాలు. ఆయనను దర్శించడానికే మేము వచ్చినది” అని రహస్యాన్ని చల్లగా వెలిబుచ్చారు మహర్షులు. ఆ మాటలు విన్న ఆర్యాంబ దిగ్భ్రాంతురాలై ఒక ప్రక్క తన కొడుకు గుఱించి చెప్పిన పరమరహస్యం విని మనస్సులోని ఆనందం పెల్లుబకగా అంతలోనే ములుకులు వలె నాటాయి బిడ్డ ఆయువుగుఱించి వారు పలికినమాటలు. ఆమె తేరుకొనే లోపల మునులు మరల అన్నారు: "తల్లీ! అల్పాయువు గూర్చి అలజడి పడకు. మరో ఎనిమి దేండ్లు సంపాదించుకొంటాడు. తిరిగి ఇంకొక పదేండ్లు ఉండడానికి వరం పొందుతాడు.
అంతటితో ముప్పది రెండేళ్ళ ప్రాయం. అమ్మా! అవతార పురుషులకు ఆయువుతో నిమిత్తమేల? ఆ సర్వేశ్వరుడు అంతటా నిండిఉంటాడు. అట్టివానికి జనన నిధనాలు ఉండవు. ఎల్లప్పుడూ మనందరితో ఉండే పరమాత్ముని గూర్చి ఎందుకు గుండెలు నీరు చేసికోవడం?".
*తల్లికి శంకరుని ఓదార్పు:*
మహర్షులువచ్చిరన్న సంతోషం పరితాపంగా మారిందిఆర్యాంబకు. ఆ విషయం తలపుకు వస్తే చైతన్యం తప్పి కూలబడి పోతున్నది. బిడ్డ మీద గంపెడాసలు పెట్టుకొన్న తల్లి ఆ ఖేదాన్ని ఎలా భరించగలదు? ఆనాటి కానాడు ఆర్యాంబ క్రుంగి పోతోంది. తన తనయుని యిల్లు వెయ్యిళ్ళ మొదలు కావాలనుకునే ఆమె ఈ పరిస్థితిని తట్టుకోలేక పోతోంది. కుమారుని చూడకుండా ఉండలేదు. చూచినపుడల్లా కండ్ల నీరు ధారాపాతమే. అతడు చూడకుండా బట్టతో ఒత్తుకొనేది. చూస్తే బిడ్డడేమౌతాడోనని బెంగ. తల్లి పడుచున్న వేదనను చూచి "అమ్మా! మునుల మాటలకింత బాధపడడం ఎందుకు? వెర్రిదానవు కదా! మనము ఎవ్వరం నిజం కాదు తెలుసునా?కొందరు ముందు కొందరు తర్వాత. అందరికీ అంతే. నీటి బుడగలు ఎంతసేపు నిలకడగా ఉంటాయి? మన పుట్టుకలు కూడా అట్టివే. ఈ దేహం కట్టుకొన్న వస్త్రం లాంటిది. శిధిల మైతే పారవేసి క్రొత్త బట్ట కట్టుకొంటాం. అంతే ఈ నశ్వర శరీరం కూడా. శరీరాల మీది మమకారం విచిత్రమైనది. జీవుల తాపత్రయం ఇది. ప్రయాణాలలో మన కెందరో తారసపడతారు. పరిచయమౌతారు. తర్వాత ఎవరి దారిన వారు పోతారు. అదే మన జన్మ విషయంకూడా. పోయే టప్పుడు మనం చేసిన పుణ్య పాపాలు మాత్రమే మూట కట్టుకొని తీసికొని వెడతాము తరువాతి జన్మలో తత్ఫలాలనుభవించ డానికి. పుణ్యపాపాల అనుభవం పూర్తి కాగానే ఈ పాంచభౌతిక కాయంతో నిమిత్తం లేదు. ఆ జీవి ఒక్క క్షణమైనా ఉండదా శరీరంలో. దీన్నే కాలచక్ర మన్నారు. ఈ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అమ్మా! అందరిలాగా మాయలో పడిపోకు” అని పరిపరి విధాల అనునయ వాక్యాలతో ఊరడిస్తూ తల్లికి జ్ఞాన బోధ చేశాడు తనయుడు.
*కైలాస శంకర కాలడి శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము*
*7 వ భాగము సమాప్తము*
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 6
_*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 6 వ భాగము*_
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓
*శంకరుడు పూర్ణానదిని తన ఇంటికి తెచ్చుట:*
అది మండువేసవి.మిట్టమధ్యాహ్న వేళ. నిప్పులు చెరిగే మండు టెండకు వడగాడ్పు తోడయ్యింది. ఆర్యాంబ పూర్ణలో మునిగిబిందెడు నీళ్ళు తెచ్చుకొందామని బయలు దేరింది. నది ఊరికి ఎంతో దూరంలో లేదు. ఇసుకదారిలో వెళ్ళాలి. కొంత దూరం వెళ్ళాక ఆర్యాంబ కాళ్ళు కాలి, తలమాడి పోయి ఒళ్ళు తెలియక పడి పోయింది. ఒక పుణ్యాత్ముడు చూచి లేవనెత్తి ఉపచారాలు చేసాడు. మరొకరు శంకరునికి కబురు చేశారు. ఆర్యాంబను ఆ ఊరిలో అందరు తల్లిగా ఎంతో గౌరవంగా చూసుకొనేవారు. పరుగున వచ్చి తల్లిని చూచాడు శంకరుడు. ఇంటికి చేర్చి అక్కడ ఉపచర్యలు చేస్తున్న కొడుకును చూచి ఆమె అడిగింది: “నాయనా! ఈమండు టెండలో ఎలా రాగలిగావు? నాకోసం ఎంత శ్రమపడుతున్నావో కదా!” అంటూ కుమారుని చూచుకొని కడుపుకు హత్తుకొంది. అప్పుడు తల్లితో: “అమ్మా! పెద్దదానివైనావు ఈ వయస్సులో ఎందుకిలా శ్రమ పడతావు. ఇంటిదగ్గర నూయి ఉన్నది కదా. ఆ నీళ్ళు వేడిచేసికొని వేన్నీళ్ళ స్నానం చేసుకోవచ్చు గదా. నేనే నూతిలో నీళ్ళు తోడి పెడతాను. రోజూ రెండు తడవులు నదికి వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలుసా? శ్రమపడకు.నదికి వెళ్ళకు” అంటూ కాళ్ళా వ్రేళ్ళా బ్రతిమి లాడాడు శంకరుడు. ఆ బిడ్డ మాటలకు ఆనందంలో మునిగిన తల్లికి ఆనందబాష్పాలు జలజలారాలుతుండగా“నాయనా! నీవింకా పసిపాపవు. నీవు నీళ్ళు తోడడమేమిటి? అంత మాట అన్నావు. నాకదే ఆనందం. మీ నాన్న గారు కూపోదకం స్నానానికి పనికి రాదన్నారు.” అని చెప్పింది ఆర్యాంబ. ఇంక మా అమ్మ నదికి వెళ్ళడం మానుకోదు అని ఎరిగి ఆ తల్లితో అన్నాడు.“అమ్మా! నీమాట కాదంటానా? నీ పాదాల కడకే వస్తుందిలే ఆ మహానది. ఇంక నీ ఇష్టం వచ్చినట్లు స్నానాలు చేయ వచ్చు” అని చటుక్కున అన్నాడు. ఆ మాటల లోని ప్రేమాధిక్యాన్ని గుర్తించిన ఆర్యాంబ సంబర పడి పోయింది. అమ్మ చంక దిగి అటూ ఇటూ తిరుగుచున్న శంకరుని మనస్సులో పట్టుదల ప్రవేశించింది. తిన్నగా పూర్ణానదీతీరం చేరాడు. రెండు చేతులనూ మొలకు ఆన్చి అలనాడు గంగ రాకకై ఎదురు చూస్తున్న గరళకంఠునిలా పూర్ణానది వైపు తిరిగి చూపు నిలిపి తన అభీష్టం తెలిపి మౌనంగా ఒక క్షణం నిలబడ్డాడు. గిఱ్ఱున ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రొద్దు గ్రుంకే సమయం అది. వాతావరణం క్షణంలో మారింది. ఆకసాన నిండా కప్పిన కారు మబ్బులు. ఉఱుములూ, మెఱుపులతో పిడుగులతో ప్రారంభమై చినుకూచినుకూ గాలివానగా మారి కుండపోతగా కురిసింది వర్షం. రాత్రంతా ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు కని విని ఎరుగని వర్షం. ఆ నీరంతా పూర్ణానది తన పొట్టలో ఇమిడ్చుకొని పొంగు హద్దు మీరగా ఊరు మీదకు వచ్చింది. వచ్చివచ్చి శంకరుని ఇంటి గుమ్మం ప్రక్కగా ఒరుసుకొని వెళ్ళింది. ఆర్యాంబ తలుపు తీసికొని చూచుకొనే సరికి పూర్ణానది తన గుమ్మం దగ్గఱగా ప్రవహించడం చూచింది. "ఆమ్మా! చూచావా! పూర్ణకు నీ మీదనున్న ప్రేమ.” అని చమత్కరించాడు. “బాల వాక్యం బ్రహ్మవాక్యం” అన్నారు పెద్దలు.
*కేరళదేశాధిపతి పిలుపు:*
ఆప్రాంతాన్ని పాలించే నృపాలుడు రాజశేఖరుడుఅను పేరుగలవాడు. ధర్మపాలన చేస్తూ, దేశానికి రక్షణ ఇస్తూ, భక్తులనూ యతులనూ గౌరవిస్తూ, ప్రజలకు ప్రీతిపాత్రుడై ఏలుతున్నాడు.బాలుడై బ్రహ్మచారియై, విద్యా వినయ సంపత్తులలో అద్వితీయుడై విఖ్యాతి నందుకొనుచున్న అద్భుత బ్రహ్మచారిని కనులారా చూడాలనిపించి,కబురు పంపించాడు యోగ్యుడైన మంత్రిని శంకరుని వద్దకు పంపి. ఆ ఆజ్ఞను శిరమున దాల్చి పరివారంతో ప్రయాణమైన మంత్రి కొన్ని రోజులకు శంకరుని ఊరు చేరుకొన్నాడు. శంకర బాలుని చేరి నమస్కారము లర్పించి వినయం ఉట్టిపడేటట్లు ఇట్లా నివేదించాడు:
"స్వామీ! మన కేరళదేశానికి రాజుగా ఉన్న రాజశేఖరుడు పంపగా రాజాజ్ఞానుసారం మీ దర్శనానికి వచ్చాము. మన రాజు ఎల్లవేళలా ప్రజాభీష్టాన్నే కోరు కొంటూ ప్రజలను తన బిడ్డల వలె చూచుకొనుచున్నవాడు. సామంత మంత్రి సేనానాయక పండిత ప్రముఖకళావిదులతో నిండిన నిండు సభలో కొలువుండి శాస్త్ర చర్చలతో ధర్మసందేహవిచారణలో అనునిత్యము గడపడం, ధర్మం ఉన్నచోటే జయమున్నదని నమ్ముతున్నవాడు. తమ కీర్తి ప్రభలకు అత్యంత సంతోషితుడై, తమ పాదధూళితో మా రాజ భవనాన్ని పావనం చేయాలని కోరుకొంటూ మీకు విన్నపం సమర్పించ మన్నాడు. మీ రాకతో రాజగృహమే కాక కేరళ రాజ్యమే సుఖంగా ఉంటుంది. మా రాజు కోరికను మన్నించి దయచేయండి” అన్నాడు. దానికి సమాధానంగా శంకరు డిట్లా అన్నాడు: “నేను బ్రహ్మచారిని. బ్రహ్మచర్యవ్రతాన్ని నియమబద్ధంగా ఆచరించాలి కదా. మూడు వేళలా స్నానాలు చేస్తూ సంధ్యోపాసన చేయాలి. దినకరుణ్ణీ, పావకుని, గురువులనూ తప్పక కొలువాలి. అర్హదినాలలో ఉపవాసాలు చేయాలి. తక్కిన సమయాలలో వేదాన్ని అధ్యయనం చేయాలి. శిష్యులకు విద్య గఱపాలి. మా తల్లి పెద్దది. ఆమె సంరక్షణ చేయాలి.ఇక తీరిక ఎక్కడుంటుంది చెప్పండి? ఈ పరమ పునీతమైన నియమాలను విడనాడి గజ వాహనాలు, రాజభోగాలు మాకేల? మా సందేశంగా రాజున కిట్లనుడు: పితృదేవతలకు ఋషులకు ప్రజలు ఎప్పుడూ ఋణపడి ఉంటారు. ఎందుకంటే వారు ప్రజల శ్రేయోభిలాషులు. రాజా! ప్రజలు ఆ ఋణం తీర్చుకొనేటట్లుకనిపెట్టాలి.
ఆ విధులన్నీ జనులు పాటించేలా చూడడం నీ బాధ్యత". అలా సందేశం పంపాడు శంకరుడు.
*శంకరుని కడకు రాజు వచ్చుట:*
ఆతృతతో ఎదురు చూస్తున్న రాజును కలిసి విన్నవించాడు మంత్రి: “మహారాజా! అ శంకరుడు కేవల బ్రహ్మచారి కాదు. మానవ రూపంలో ఉన్న జగదీశ్వరుడే, సందేహము లేదు. ఏ పూర్వ పుణ్య ఫలమో మాకు ఆయన దర్శనమయినది. కైలాసవాసునిలా బాలసూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ఏడేండ్లు నిండ లేదు. అతని మేను మల్లె పూరంగును మించి మిల మిల మెఱసిపోతున్నది. ఆయన ఏ మణులు ధరించలేదు. ధరిస్తే ఆ మణులే ఈ మహాను భావుని తేజస్సులో మాయమౌతాయి నిస్సందేహంగా. ముఖాన్ని చంద్రబింబంతో పోల్చడం కవుల చేతకానితనం అవుతుంది. కండ్లు రెండూ సూర్యచంద్రులే. ఆ బాల శంకరుని చూడగా చూడగా ఒకప్పుడు భారతి వలెను, ఒకసారి మహేశ్వరుని వలెను, మరొకపరి కమలనాభు నిలా కన్పట్టుతాడు. ప్రభూ! పంచభూతాలు, అష్ట దిక్పాలకులూ, ఇంద్రాది దేవతలూ, రుద్రగణాలు,పదునాల్గు భువనాలు, సమస్త చరాచర సృష్టి జాల మంతా ఆయనలోనే ఇమిడిపోయినట్లు అగుపడు తుంది" అని పరమానందంతో శంకరుని సందేశాన్ని కూడా రాజుకు తెలియ జేసాడు మంత్రి. “మంత్రిశేఖరా! ఇంక తడవెందుకు సుముహూ ర్తం నిర్ణయం చేసి మన ప్రయాణానికి సన్నద్ధం చేయండి” అని రాజు ఆదేశించాడు.రాజు, పరివారము శంకరుని ఊరు చేరగానే ఊరు బయట దూరంగా నిర్మించిన డేరాలలో పరివారా న్నుంచి రాజశేఖరుడు ఒక్కడు పాదచారియై వడి వడిగా అడుగులు వేసికొంటూ శంకరుని దర్శనానికి బయలుదేరాడు. అల్లంత దూరాన ఉన్నప్పుడు రాజుకు మహాద్భుత దృశ్యాలు కన్పట్టాయి. ఒక దివ్యసభ కండ్లకు కనబడింది. మహర్షి గణాల మధ్య శారదాదేవితో చతురాననుడు సింహాసనా సీనుడై ఉన్నాడు. “ఆహా! సత్యలోకమా! ఏమి అదృష్టము!” అనుకొను నంతలో దృశ్యం చెల్లాచెదరయ్యింది. ఇంతలో మరొక దృశ్యం. తెల్లని పాలసముద్రం. ఆదిశేషుని పాన్పుపై పద్మనాభుడూ, పాదాలు ఒత్తుతున్న లక్ష్మీదేవి. ప్రక్కనే శూలము, కపాలము, దండము చేతులలో ధరించి మెడలో సర్పహారాలతో గరళ కంఠుడు, సామగానమాల పించు నారదాది దేవర్షులు పరివేష్ఠించి ఉన్న పరమాత్ముని ప్రార్థిస్తున్నాడు రాజు.
ప్రార్థన ముగియు నంతలోనే ఆ దృశ్యం తెర మఱుగైంది. మరి కొంత దూరం వెళ్ళాక ఇంకొక దివ్యదర్శనం. మేరు పర్వతం మీద పార్వతీపతి తాండవ నృత్యం చేస్తున్నాడు. ప్రక్కనే గిరిజాదేవి ఎద్దు మీద చేయి వేసి ఆన్చి నిలబడి ఉంది. నారదాదులు నమస్కరిస్తున్నారు. తమ సతులతో బ్రహ్మ, విష్ణుమూర్తి, దేవేంద్రుడు విచ్చేసి ఉన్నారు. గంగాధరునితో వారందరూ ఏవేవో అడుగు తున్నారు. వారివారి కోరికల్ని ప్రసాదిస్తూ అతి శీఘ్రంగా బయలు దేరాడు పశుపతి. ఆ దృశ్యం చూచీ చూడకుండానే అంతలో అదృశ్యమయ్యింది. అక్కడ నలుగురు బ్రహ్మచారు లున్నారు. గోష్పాదమంత శిఖ, తెల్లని యజ్ఞోప వీతము, చేత పాలాశ దండము, మొలకు మౌంజి త్రాడు, వెన్నరంగు శరీరచ్ఛాయ కలిగి తామర రేకల వంటి కన్నులతో, తెల్లని కౌపీనము, విభూతి రేఖలు, మొలకు కృష్ణాజినము ధరించి దేదీప్య మానంగా వెలిగి పోతున్నాడు బాలుడు ఏడెనిమిది ఏండ్ల ప్రాయము వాడు. ఆ బాలుడే తాను కలుసుకొనడానికి వచ్చిన దివ్యబాలుడని ఎవరూచెప్పనక్కర లేకుండానే తెలిసి పోయింది రాజుకు. భక్తితన్మయుడై సాష్టాంగ నమస్కారం చేశాడు. శంకరుని ఆశీర్వచనం వినిలేచాడు. ముకుళిత హస్తుడై కులగోత్రాలు చెప్పుకొని వినయ విధేయతలతో నిలబడ్డాడు రాజశేఖరుడు. తనకు దగ్గరగా ఒక దర్భాసనం ఇచ్చి కూర్చోబెట్టినాడు. సింహాసనమూ, హంస తూలికాతల్పమూ ఈ దివ్య దర్భాసనానికి సరిరావు అనిపించింది రాజశేఖరునికి.
బ్రహ్మచారికి నమస్కరిస్తూ “మహానుభావా! అనేక జన్మలలో సంపాదించు కొన్న పుణ్యం తమ దర్శనంతో పండింది. నేడు నేను, నా కుటుంబము, నా ప్రజలు పరమ పవిత్రులం అయి పోయాము. మీరందించిన సందేశం నాకు శిరోధార్యం. తప్పక అలాగే ఆచరిస్తాను" అని పరమానంద పూర్వకంగా నివేదించుకొన్నాడు రాజు శంకరునితో.రాజు మాటలకు సంతోషించిన శంకరుడు అతనితో ఈ విధంగా ప్రసంగించాడు: “రాజా! నీకు కుశలమే కదా! నీ పేరు ప్రసిద్ధ మైనది. ధర్మాన్ని తప్పకుండా పాలిస్తున్నావు కదా! ఎల్లవేళల రాజ్యప్రజల గురించి ఆలోచిస్తున్నావు కదా! దేశంలో అందరూ ఎవరి వృత్తులు వారు నిర్వర్తిస్తున్నారు గదా! విజ్ఞులైన పండితులను, దైవాజ్ఞలను ఆదరిస్తు న్నావు కదా! సమర్థులైన వారినే తగు స్థానములలో నియమిస్తున్నావు కదా! దుర్గాల్ని వైరిదుర్భేద్యంగా కాపాడు కొంటున్నావు కదా! ధరాతలం సస్యశ్యామల మై ఉన్నదా! " ఈవిధంగా యోగక్షేమాలు అడిగి తెలిసి కొన్నాడు ఆ విశిష్ట వటువు. శంకరునికి వందనం చేసి, విడచి వెళ్ళలేక వెళ్ళలేక సెలవు తీసికొన్నాడా రాజశేఖర ప్రభువు తన జన్మ ధన్యమైనదన్న సంతుష్టితో.
*కైలాస శంకర కాలడి శంకర*
*శ్రీ శంకరాచార్య చరిత్రము*
*6 వ భాగము సమాప్తము*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
శివ మహిమ
శివ మహిమ-- ధూర్జటి !
మ: తన యిల్లా లఖిలైక మాత , తన సంతానంబు భూతవ్రజం ,
బను లాపంబులు వేదముల్ , తన విహారాగారముల్ మౌనిహృ
ద్వనజంబుల్ , తన సేవకుల్ కమలజాత శ్రీధరుల్గాఁ జెలం
గిన దేవోత్తము నమ్మహాత్ముఁ దరమే కీర్తింపఁగా నేరికిన్ ?
శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము- అవతారిక -10 వపద్యము: మహాకవి ధూర్జటి .
శ్రీ కృష్ణరాయ సార్వ భౌముని భువన విజయమునలంకరించిన యష్టదిగ్గజ కవులలో నొకడు ధూర్జటి!
పరశివ తత్వము ననుసరించెడి శైవుడు. అయిన నేమి యతడు మానసికముగా నద్వైతి. శివకేశవుల యెడ నారాధనా భావముగలవాడు. శ్రీ కాళహస్తీశ్వర శతకము. శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము ఇతని రచనలు. రెండును పరమేశ్వరాంకితములే!
ఇదియాతని స్వతంత్రతకు నిదర్శము. రాయల కొలువున నున్నను రాచరికమును తూర్పారబట్టిన ఘనుడు ధూర్జటి.
" రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు"- అంటూ రాజసేవ యెంత దుర్భరమైనదో వివరించినాడు.
ప్రస్తుత పద్యము శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యమున అవతారిక లోనిది. తన గ్రంధమునకు కృతిపతియగు పరమశివుని
గూర్చి సభక్తికముగా చేసిన విన్నపమిది. స్వామీ సర్వశక్తి సమన్వితుడవే , నిన్నేమని ప్రస్తుతించనయ్యా! అదినాతరమా! అంటూ
పరమ శివునకు గల ప్రత్యేకతలను యీవిధముగా ప్రకటించుచున్నాడు.
తనయిల్లా లఖిలైకమాత ! లోకమాత యైన జగజ్జననినియగు పార్వతీమాత నీకు భార్య.
లోకంలో అందరూ అనేమాట - "యిల్లాలివల్ల యింటికి పేరని' పార్వతి జగజ్జనని . 'ఆకీట బ్రహ్మ పర్యంతం' యీసృష్టకంతకూ
ఆమెయే జనని ,అంటే విశ్వజనని."యాదేవీ సర్వ భూతేషు ప్రాణరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః" అంటున్నాయి పురాణాలు. కాబట్టి సర్వలోక సంరక్షణాభారమును మోసేతల్లి నీయిల్లాలు. ముగురమ్మల మూలపుటమ్మ. ఆయమ్మకు అనుశాసకుడవీవు స్వామీ ! నీవైభవమేమని చెప్పను?
ఇక నీ సంతానమా సర్వ భూత సముదాయము. ఇక్కడ భూతమనగా పిశాచమని భావింపరాదు. ప్రకృతిని నడిపించు శక్తులుగా భావించాలి. ఫలితార్ధం . సర్వప్రకృతిని శాసింపగల వారు నీసంతానం.తద్వారా ప్రకృతియంతా నీవశంస్వామీ!
నీకు గనక కోపంవస్తే లోకాలన్నీ మాయమే!
" అనులాపంబులు వేదముల్"-
నీ నోట పలికే మాటలన్నీ వేదములే! నీవు వేద ప్రచోదకుడవు. నీయనుగ్రహము వలననే వేద విజ్ఙానమంతా లోకంలో వ్యాపిస్తోంది. శబ్దానికి అనుశాసనం ముఖ్యం. అంటే నియమం. అదివ్యాకరణంవల్ల కలుగుతుంది. ఆవ్యాకరణం మాహేశ్వర ప్రోక్తం. సంస్కృత వ్యాకరణమంతా మాహేశ్వర సూత్రముల ననుసరించియే నడుస్తుంది.
"తన విహారాగారముల్ మౌనిహృద్వనజంబుల్:" నీవు నిరంతరం మహామునుల హృదయకమలాలలో విహరిస్తూఉంటావు స్వామీ! నిన్ను దర్శించాలంటే మునులకే సాధ్యం మావంటి వారికది యెలా సాధ్యమౌతుంది? మాలో సద్భక్తిని గలిగించు. మమ్ము గూడా మునులను చేయి మాహృదయాలలోగూడ విహరించు. అంతవరకూ నీదర్శనం మాకుసాధ్యమా?స్వామీ!
తన సేవకుల్ కమలజాత శ్రీధరుల్"- ఇక నీ సేవకులా బ్ర హ్మ , విష్ణువులు.వారు సామాన్యులా? సకలజగత్ సృష్టికర్త బ్రహ్మ. సకల లోక పోషకుడు విష్ణువు.వీరిద్దరూ నీసేవకులు. నీయాజ్ఙకులోబడి సృష్టి బ్రహ్మ నిర్వహిస్తే , నీయానతో పరిపోషణ విష్ణువు కొనసాగిస్తాడు. అంతా నీవశం.
ఇలాంటి సర్వ శక్తి సమన్వితుడవైన నిన్ను యేమని వినుతించ గలను? స్వామీ!
నేనశక్తుడను. స్వామీ నమస్కారమయ్యా! పరమేశ్వరా! నమస్కారము!
అంటున్నాడు ధూర్జటి!
ఓం నమః శివాయ! ఓం నమః శివాయ!
స్వస్తి!🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
మహాదర్శనము " -- పదకొండవ భాగము
11. " మహాదర్శనము " -- పదకొండవ భాగము-- ఉన్నతి త్రయము --2
11. పదకొండవ భాగము-- ఉన్నతి త్రయము -2
మరుదినము , మరలా భోజనాలైన వెంటనే దేవరాతుని ఇంటిలో సభ చేరినది . అక్కడ ఉన్న వారు అతనితో పాటు ఇంకా ఇద్దరు , మరియూ , శిశువు రూపములో నున్న ఒక మహానుభావుడు . అయినా , ఆ ముగ్గురికీ పాపడు చిన్న దేహములో చిన్నవాడి వలె కనపడుతున్ననూ , ఆ జీవనము మాత్రము తామందరి కన్నా ఉత్తమమైనదన్న విషయములో అణుమాత్రము సందేహము లేదు .
దేవరాతుడు మనసులో దేవతలకు పూజాదులను సమర్పించి , ఆరంభించినాడు . ’ మీ తల్లి వచ్చినారా ? ’ యని ఆలంబినిని అడిగినాడు .
" ఇగో , ఇక్కడే తెరవెనుకే కూర్చొని ఉంది "
" సరే " దేవరాతుడు ప్రారంభించినాడు . " నిన్న కాయోన్నతి గురించి చెప్పడమయినది . ఈ దినము మానోన్నతి , విద్యోన్నతుల గురించి చెప్పవలెను కదా ? మానోన్నతి యనునది మనకు ఎవరికీ తెలియని విషయము కాదు . అయితే అది కొందరు మాత్రమే ఆచరణలో పెట్టిన విషయము . గతి లేని వారు , దరిద్రులు , దీనులైన వారి విషయమును వదిలేద్దాము , వారికి మానము , మర్యాదలు లేవు అంటాము . అలాగయితే మాన , మర్యాదలు ఉన్నవారు ఏమి చేయవలెను అనుదానిని మాత్రము మనము ఆలోచించము . తనకేదో ఒక అంతస్తు ఉంది , అనేదే మానము . ఆ మానము వలననే , సముద్రమునకు ఒడ్డు వలె మనకు ఒక మర్యాద ఏర్పడి ఉండునది . శ్రోత్రియ బ్రాహ్మణుడు తనకు దాహముతో ప్రాణమే పోవుచున్ననూ కాళ్ళూ చేతులూ కడుక్కొని శుద్ధాచమనము చేయు వరకూ నీరు తాగడు . అలాగే ఉత్తములు ఎవరూ మాసిన బట్టలను వేసుకోరు . అలాగే మనసులో వచ్చు ఆలోచనలను , అది యోగ్యమైనది , ఇది అయోగ్యమైనది అని విభాగించుకుని , దాని ప్రకారము నడచుకొనుట మానోన్నతి . "
" కలప కావాలనుకొను వాడు వేలి మందముతో నున్న చెట్టును కొట్టడు . సమిధలు కావాలను వాడు పెద్ద కొమ్మను నరకడు . దాని వలెనే , తన స్థాయి , అంతస్తులకు తగ్గదానిని తప్ప వేరే దేనిని చేసేదిలేదు అను హఠమే మానోన్నతి .
" వేరే మాటలలో చెప్పవలెనన్న , ప్రతియొక్క మానవుడూ , తనకు కీర్తి రావలెను అంటాడు . ఆ కీర్తి ఎట్లుండవలెను అని నిర్ధారించేది మానోన్నతి . ఎవరైనా తనకు ’ గొప్ప కాముకాగ్రణి ’ అని కీర్తి రావాలి అంటాడేమి ? అట్లేమయినా వస్తే దాన్ని అపకీర్తి అంటాము . ఇలాగ కీర్తి , అపకీర్తి అని నిర్ణయించేది ఏదో , అదే మానోన్నతి .
" కాబట్టి తనది కానిది, తనకు తగనిది, తనకు వద్దనే ఒక మర్యాద కల్పించు కొనునది కూడా ఒక మానోన్నతి . ఇతరులకు హింస కాకుండా , తనకు నొప్పి కలుగకుండా నడచుకొనునది ఒక మానోన్నతి . అంతేనా ? " కామ క్రోధాదులకు వశుడై పిచ్చి పట్టినట్లు నడచుకోకుండా , పెద్దలు చెప్పిన మార్గములోనే నడుస్తాను అని తనలోనే ఈశ్వరుడున్నాడని , అదే ఈశ్వరుడు ఇతరుల లోనూ ఉన్నాడని నమ్మి , ఈశ్వరునికి ద్రోహము కాకుండా నడచుకొనుటే మానోన్నతి . అయితే మానవుడు అతి వేగముగా ఇఛ్చా ద్వేషములకు వశుడై వ్యవహరిస్తాడు . ఇతరులను మెప్పింపవలెనన్న దాక్షిణ్యము చేతనో , తన యోగ క్షేమములకు హానియగునన్న లోభముచేతనో , తానే సరైనవాడు అన్న మోహము చేతనో అపమార్గములో ప్రవర్తిస్తాడు . అటుల జరగనీకుండా నిలిపెడి శక్తి ఏది ఉందో అది మానోన్నతి . న్యాయమైన , ధర్మమైన ఆత్మ వినియోగమే మానోన్నతి . తెలిసిందా ? "
" దీనిని మనము ఏదో ఒక రూపములో చేస్తూనే యున్నాము కదా ? "
" అవునాలంబీ , అక్కడే మానవుని మనసు చెడిపోయేది . అభ్యాసపు బలము వల్లనో , విద్యాబలము వల్లనో , తనదే ఒప్పు , మిగిలినవారిదే తప్పు అన అహంకారము వల్లనో , మొత్తానికి ఎట్లో ఆపత్కాలములో చెడిపోవును . అటుల కాకుండా చూసుకోవలెను అని దీని ఉపదేశము . ధనవంతుడొకడికి , భార్య వచ్చి , గుమ్మడి కాయ చెడిపోయినది అని చెప్పిందట. వాడు , పోనీలే , ఆవుకు వెయ్యి అన్నాడట. అది కూడా ముట్టలేదట . సరే , అలాగయిన , దానమివ్వు అన్నాడట . అటువంటి పదార్థమును దానము చేయరాదను జ్ఞానమూ , తానొక శ్రీమంతుడు , తాను అట్టి దానమును చేయరాదను దార్ఢ్యమూ ఉంటే వాడు అటుల చెప్పేవాడా ?
" ఇంకొక సారి ఒక రాజు యుద్ధములో ఓడిపోయి , శత్రువు చెరలో చిక్కినాడట . శత్రువు తనకు శరణాగతుడై సామంతుడై ఉంటే , వాడిని వదలివేసి అతనికి ముందరి లాగే స్థాన మానములను ఇచ్చెదనని చెప్పెనట . దానికి ఆ ఓడిన వాడు , ’ నీపైన ఎత్తిన చేతులతో నీకు నమస్కరించుట నా వంటి వానికి యోగ్యము కాదు . ఏనాటికైనా పోవు అశాశ్వతమైన దేహపు భోగమునకై నేను నీకు చేతులు జోడించి వేడుకోను " అన్నాడట . అటుల శాశ్వతమైన దానిని అశాశ్వతమైన దానికోసము బలి ఇవ్వకుండా ఉండుటే మానోన్నతి .
" నేను అప్పుడే చెప్పినట్లు దీనిని పొందుటకు అదృష్టము ఉండవలెను . ఆలంబీ , ఇది అందరికీ తెలుసు . కానీ దానిని వహించగల ధైర్యము , ధృతి , సామర్థ్యము అందరికీ ఉండదు . కాబట్టి దానిని పెంచుటకు తల్లిదండ్రులు , ముఖ్యముగా తల్లి కష్టపడవలెను .
ఆలంబిని అది విని , " అట్లయిన , మాతృత్వమంటే ఇంత కఠినమైనదా ? " అనిపించినది . " ఔనౌను , ఇది చేయవలసిన కార్యము . నా కొడుకు లో ఇది ఉండవలసిన సద్గుణము . దానికోసము నేను కష్ట పడవలెను , కష్ట పడతాను ." అనుకున్నది . దీనినంతా ఒక్క ’ సరే ’ అని చెప్పి ముగించింది .
ఆచార్యుడు కొనసాగించాడు , " మానోన్నతి అంటే ఏమిటో తెలుసుకున్నావు కదా , సూక్ష్మముగా చెప్పవలెనంటే , ఇదే , సమాజమును ...లేదా సమాజమనే ఏనుగును నియంత్రణలో నుంచు అంకుశము . దీనినే ఇతర మాటలలో ధర్మమంటారు . ధర్మము అనేక ముఖములు కలది . పులి ధర్మము వేరే , ఆవు ధర్మము వేరే . వృక్ష ధర్మము , తీగ ధర్మములు వేరు వేరు .ఇట్లు నానాముఖమై, అడుగడుగునకూ భిన్నముగా నుండు ధర్మమును ఆరాధించుటయే మానోన్నతి . అది పర్వతమంత ఎత్తైనదైననూ గాలి సుడి కన్నా సూక్ష్మమైనది . బలమైన మనసు దీన్ని అర్థము చేసుకొనగలదు . నోటితో చెప్పవలెనంటే ఎలాగెలాగ ఎంతెంత చెప్పిననూ చాలక , ఇంకా మిగిలియే ఉండును . అట్లని దీనిని వదలివేయుటకు ఎవరికీ సాధ్యము కాదు . కాబట్టి మనసును ఒద్దిక చేసుకొని ధర్మమును ఆరాధించెదనను పట్టుతో వ్యవహారము చేయుటయే మానోన్నతి . "
" ఇక విద్యోన్నతి విషయమును కొంత చెప్పవచ్చునా ? "
" అటులే , వింటున్నాము "
" నిజానికి అన్నిటికన్నా సులభమైనది విద్యోన్నతి . కాయోన్నతి లో దేహమును గురించి, మానోన్నతిలో మనసును లక్ష్యము చేసి నట్లే , విద్యోన్నతి లో బుద్ధిని సూక్ష్మపరచుకొనవలెను . అది ఎలాగంటావా ? అది ఆలోచన వలన మాత్రమే సాధ్యము . విద్య అనేది , గమ్యాన్ని చేర్చు సాధనము . ఆ గమ్యాన్ని చేర్చు సామర్థ్యమును సంపాదించి ఇచ్చునది యని ఆ విద్యను ఆరాధించుట విద్యోన్నతి . "
" అందరూ దీన్ని సాధించవలెను అను ఆశయము సదాశయము . నిజము . అయితే సామాన్యముగా సర్వులూ విద్యను ’ అశనాయా పిపాసా ’ రూపమైన , అనగా , ఆకలిదప్పులు అను మృత్యువును దాటించు సాధనమనియే ఆరాధించెదరు . ఇంతటి జీవనోపాయ సాధకమైన వృత్తిని అవలంబించు చేతనమును ఇచ్చు విద్యయే అపరా విద్య . దీనిని సాధించుటవలన కూడు గుడ్డలు సమృద్ధియగును . కానీ మనుష్యుని లక్ష్యము అంతేనా ? "
" కూడు గుడ్డలకు అవతల ఇంకేదో ఉంది అని నమ్ముటకూ ఒక విలక్షణమైన సామర్థ్యము కావలెను . ఆలంబీ అంతటి అవతలి దాన్ని సాధించి ఇచ్చునది పరా విద్య . భక్తుడొకనికి ఎవరో ఒక ముత్యపు హారాన్ని ఇచ్చినారట . అతడు , ఇచ్చినవారిపైన గౌరవముతో దాన్ని తీసుకున్నాడట . కానీ అతడికి కావలసినది తన ఇష్ట దైవము . ఆ హారపు ముత్యములలో ఆ ఇష్ట దైవము ఉందో లేదో యని ఒక్కొక్కదాన్నీ పగలగొట్టి చూచి , దానిలో తన తన ఇష్ట దైవము లేదని దాన్ని పారవేసినాడట ! అట్లే , తన చుట్టూ ఉన్నదాంట్లో అమృతముందా ? అని వెదుకవలెను . పువ్వు నుండీ పువ్వుకు సాగి వాటిలోని మధువును సంగ్రహించు తుమ్మెద వలె , భూమిలోనున్న నీరువలె లోకములో నున్న కనపడని అమృతమును వెదకవలెను . ఆ అమృతము ఎక్కడ నిండి ఉండునో అక్కడికి పోవు సామర్థ్యమును కల్పించి ఇచ్చునదే విద్య . ఆ విద్యను గురించి అందరూ చెప్పెదరు , కానీ దాన్ని తెలిసినవారు లక్షకు ఒక్కరుంటే ఎక్కువ . అటువంటి విద్యను సాధించునది విద్యోన్నతి . "
" ఇలాగ అందరూ తెలుసుకున్నాము అనుకున్ననూ ఎవరూ చూడని ఆ విద్యను పొందుట ఎట్లు ? అనెదవేమో , ఈ సమాజము అను వృక్షము ఒకటుంది . అది ఎంతోకాలానికి ఒకసారి మాత్రమే ఈ విద్యోన్నతి ఉన్న మహాపురుషుడు యను సత్ఫలాన్ని ఇచ్చేది . అపుడేమవునో తెలుసా ? ఒక సూర్యుని ఉదయమైతే , అతని కిరణాలు ఎంతవరకూ పోగలవో , అంతవరకూ పగలు అగునట్లే , అమృతపు ప్రవాహమొకటి పారును . లేదా , అమృత వర్షము కురియును . అలాగు కురియు అమృతసోనలు కూడా అసహ్యమని ఇంటిలోపలికి వెళ్ళిపోవు వారు లేకపోలేదు . ఎలాగంటే , దినదినమూ ఉదయించు సూర్యుని చూచువారిలో , ’ ఈ సూర్యుడు స్థావర జంగమముల ఆత్మ ' యని నమస్కరించు వారెందరు ? అలాగే , విద్యోన్నతి ఉన్న మహాపురుషుడు అమృతమే జీవన లక్ష్యము అని సాగిననూ , ’ ఇది నా అనుభవము , మీరు కూడా పొంది కృతార్థులు కండి ’ అని పిలుస్తున్ననూ దానిని వినక చెవిటివారివలె అందరూ వెళ్ళిపోతారు . దేశ కాలములు ప్రసన్నమై , పంచభూతములు సరేనని ఒప్పుకొని , దేవ , ఋషి , పితరులు అనుగ్రహించ వలెననుకొన్నపుడే అంతటి మహాత్ముని ఉదయమగును . "
" ఆలంబీ , నువ్వు పుణ్యాత్మురాలవు . అంతటి మహాపురుషుని గర్భమున మోసి పుత్రునిగా పొందినావు . నీ రక్త మాంసాలు ఆ చేతనానికి గూడు కట్టి ఇచ్చినాయి . వాటిలో చేరుకున్న ఆ చేతనము తన స్వస్వరూపమును తెలుసుకొనుటకు ఇబ్బంది కాకుండునట్లు కాయోన్నతిని సాధించి ఇచ్చుటకు ఒప్పుకున్న నువ్వు , ఆ దేహములోని బుద్ధి అంధకారావృతమైన గుహ కాకుండా చూసుకో . ఆ బుద్ధి పరిశుద్ధమై , తనలో ప్రతిఫలించిన చైతన్యపు బింబమును సాక్షాత్కరించుకొనుటకు అనుకూలమగునట్లు , ఆ బుద్ధికి ఇప్పటి నుండి శ్రేయస్సు , ప్రేయస్సులను నేర్పించు . దాని శ్రేయస్సు , ప్రేయస్సు కన్నా గొప్పదని తప్పక చెబుతుండు . ముఖ్యముగా ఒకటి మరవద్దు , ఆ మహానుభావుడు మన కడుపున పుట్టినందుకు మనలను తల్లిదండ్రులుగా పొందినందుకు విచారించు సందర్భము రాకుండా చూసుకో . "
" అటులనే , మరి ఈ బుడమకాయ వంటి బొమ్మకి ఇంకా మాటలే రావు కదా , దీనికి అర్థమగునట్లు చెప్పుట ఎలాగ ? "
" దానికి ఒక ఉపాయముంది , అది బుడమ కాయ , బొమ్మ , మాటలు రావు , వివేకము లేదు మొదలైనవన్నీ నీ భ్రాంతులు . ఆలంబీ , ఈ శిశువు దేహములోనున్న చైతన్యము కొడుకని భావించక , నీతో సమమైన మనసు గలవారితో మాట్లాడునట్లే మాట్లాడు . అయితే , నువ్వు వాడిని మాట్లాడించునపుడు అన్నీ తెలిసిన సమాన వయస్కులతో మాట్లాడినట్లు మాట్లాడుట లేదు అన్నది కూడా మరవద్దు . ఆలంబినీ దేవి ఒప్పుకున్నది . దేవరాతుడు , ’ నేను ఇంతవరకూ , ఇటువంటి మాటలనే మాట్లాడలేదు కదా ! అవెలా వచ్చినాయి ? " అని ఆలోచిస్తూ కూర్చున్నాడు .
ఆలంబిని తొడపై పడుకున్న పాపడు నవ్వాడు . ఆ వయసు పిల్లలు ఏడ్చుట తెలిసినది , నవ్వుటను చూచియే ఉండలేదు , ఇదేమాశ్చర్యము అని తల్లిని అడిగింది . ఆమె వచ్చి చూచి , ’ ఇదేమి విచిత్రమో ? నేను కూడా ఇంతవరకూ చూచియుండలేదు ’ అని ఆశ్చర్యపోయినది .
ఆచార్యునికి , ’ ఆ నవ్వు నాకోసమే ’ అనిపించింది . " అలాగైతే , నేనింతవరకూ మాట్లాడినది , ఈ పాపడైన మహాభావుని ప్రభావమా ? " అనుకొని పాపడి వైపుకు తిరిగినాడు . అతనికి ఉత్తరమిచ్చినట్లు పాపడు మళ్ళీ ఒకసారి నవ్వాడు .
ఆచార్యుడు ఆలోచనలో పడ్డాడు . తానింతకు మునుపు కూడా అమృతము గురించి మాట్లాడినది ఉన్నమాటే . అయితే , ఆ అమృతము మరణమును మించినది అను అర్థములో మాత్రమే . ఈ దినము అమృతమంటే బ్రహ్మానందము అను అర్థములో . ఇతడు ఇలాగే , నాకు తెలియకుండానే నన్ను మార్చివేయునా ? ఇప్పుడు కర్మఠుడనైన నేను పోను పోనూ బ్రహ్మిష్ఠుడ నౌతానా ? అనిపించినది . మరలా కొడుకును చూసినాడు , వాడు మరలా నవ్వినాడు .
ఆచార్యునికి దిగులు పుట్టింది . అయినా సంతోషము తప్పలేదు : " ఒకవేళ అయితేనేమి ? కర్మలో కామముందట . అది తప్పితే , కర్మ నిష్కామమైతే , బ్రహ్మమే గతియట ! కానిమ్ము , అదికూడా ఏమీ అవిహితమైనది కాదు కదా , బ్రహ్మము ఎందెందు చూసినా ఉంది అనుట ఉందిగదా , దానినే ఇంకా గట్టిగా చెప్పునట్లవుతుంది . " అని ఇంకా ఏమేమో ఆలోచిస్తూ అక్కడినుండీ లేచి వెళ్ళిపోయినాడు . వెళ్ళునపుడు పాపడి ముఖమొకసారి చూడాలనిపించెను . " వద్దు , వద్దు " అని ఎవరో తోసుకొని వెళ్ళినట్లే అయింది , వెళ్ళిపోయినాడు .
మంగళవారం*🍁 🌹 *సెప్టెంబర్,10, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
🌹 *సెప్టెంబర్,10, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - శుక్లపక్షం*
*తిథి : సప్తమి* రా 11.11 వరకు ఉపరి *అష్టమి*
*వారం:మంగళవారం*(భౌమవాసరే)
*నక్షత్రం : అనూరాధ* రా 08.04 వరకు ఉపరి *జ్యేష్ఠ*
*యోగం : విష్కుంబ* రా 12.31 వరకు ఉపరి *ప్రీతి*
*కరణం : గరజి* ఉ 10.37 *వణజి* రా 11.11 ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.00 - 12.30 సా 04.00 - 06.00*
అమృత కాలం :*ఉ 08.48 - 10.32*
అభిజిత్ కాలం : *ప 11.40 - 12.29*
*వర్జ్యం : రా 01.58 - 03.39*
*దుర్ముహూర్తం : ఉ 08.23 - 09.12 రా 10.54 - 11.41*
*రాహు కాలం: మ 03.09 - 04.41*
గుళికకాళం : *మ 12.04 - 01.36*
యమగండం : *ఉ 09.00 - 10.32*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం: :*ఉ 05.55*
సూర్యాస్తమయం :*సా 06.13*
*ప్రయాణశూల: ఉత్తరం దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.55 - 08.23*
సంగవ కాలం :*08.23 - 10.50*
మధ్యాహ్న కాలం :*10.50 - 01.18*
అపరాహ్న కాలం:*మ 01.18 - 03.46*
*ఆబ్ధికం తిధి :భాద్రపద శుద్ధ సప్తమి*
సాయంకాలం : *సా 03.46 - 06.13*
ప్రదోష కాలం : *సా 06.13 - 08.34*
రాత్రి కాలం : *రా 08.34 - 11.41*
నిశీధి కాలం :*రా 11.41 - 12.28*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *జైశ్రీరామ్ జైహనుమాన్*🍁
*🍁🌷హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షించడానికి కారణమేమిటో తెలుసా?🍁
ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు.
అదేవిధంగా ఆంజనేయస్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు ఉండదు.
ప్రతి ఒక్కరి ఇంటిలో ఆంజనేయస్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది.
మన హిందూ దేవుళ్ళలో ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.
రామాయణంలో శ్రీ రామచంద్ర ప్రభుకి ఆంజనేయుడు నమ్మినబంటుగా ఉంటాడు.
ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుని పూజించిన లేదా ఆంజనేయుడుని పూజించిన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి.
ఆంజనేయుడు శ్రీరాముడికి ఏ విధమైనటువంటి భక్తుడో మనకు తెలిసిందే.
ఇక రామభక్తులు ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చేస్తుంటారు.
ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, గ్రహస్థితులు, భూత ప్రేత పిశాచాల భయం ఉండదని భావిస్తారు.
ఈ విధంగా భూతాలకు భయపడేవారిని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్లి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా వారికి ఆ భయం తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
అదే విధంగా ఇలాంటి భయాందోళనలో ఉన్నవారు ఎక్కువగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల వారికి ధైర్యం కలుగుతుందని భావిస్తారు.
నిజంగానే ఆంజనేయస్వామి పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తాడా... మనల్ని ఆంజనేయ స్వామి ఈ విధంగా రక్షించడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...
రామనామం ఎంత మధురమైనదో ఆంజనేయస్వామి ఎంతో అద్భుతంగా వివరించారు.
ఈ క్రమంలోనే విష్ణుమూర్తి తన రాముడి అవతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెబుతాడు.
ఈ క్రమంలోనే శ్రీరాముడు తన తనువు చాలిస్తూ.. హనుమా కలియుగం అంతమయ్యేవరకు భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడాలని వారికి కలిగే భయం, ఆందోళన, భూత ప్రేత పిశాచాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నింపాలని ఈ భూలోక వాసులకు నువ్వు రక్షణ కల్పించాలని చెబుతూ తన అవతారాన్ని చాలిస్తాడు.
ఈ విధంగా శ్రీ రాముడు ఆంజనేయుడిని కోరిక కోరడంతో శ్రీ రాముడి ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తానని మాట ఇవ్వడం వల్ల ఆంజనేయస్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళనలను నుంచి రక్షిస్తున్నాడు.🙏🍁
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
*శ్రీ లలితా దేవ్యై నమః
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శ్రీ లలితా దేవ్యై నమః*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️☸️
*"శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాసనేశ్వరి*
*చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత" అంటూ మొదలవుతుంది శ్రీ లలితా సహస్రనామం.*
*సర్వలోకాలకు అమ్మ అయిన ఆ జగన్మాత, అన్ని లోకాలకు అధికారిణి అయిన లలిత అమ్మవారి అవతారం గురించి బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది.*
*భండాసురుడనే రాక్షసుడు దేవతలను వేధించే సమయంలో వాడిని అంతం చేయడానికి ఆ ఆదిపరాశక్తి అవతారించవలసిన పరిస్థితి ఏర్పడింది.*
*"అమ్మ" అవతారించాలని శివుడు యజ్ఞం ఆరంభించాడు. అందులో సమస్త విశ్వాన్ని, 14 భువనాలను, 7 సముద్రాలను అన్నిటిని ఆహుతులుగా వేశాడు.*
*తరువాత దేవతలందరూ తమను తాము ఆ యజ్ఞంలో అర్పించుకున్నారు.*
*అప్పుడు ఆ చిదగ్నికుండంలో నుండి అమ్మ దేవతల రక్షణకు అవతరించిందని, దేవతా స్త్రీ సైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్ళి వాడిని సంహరించిందని తెలుస్తుంది.*
*ఈ అమ్మవారి మహిమలు అమోఘం. లలితా సహస్రనామంలో "మహచతుష్షష్టికోటి యోగినీగణ సేవితా" అనే ఒక నామం ఉంటుంది. అంటే లలితా దేవిని 64 కోట్ల మంది మహయోగినులు నిత్యం పూజిస్తూ ఉంటారని అర్దం.*
*"కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః" అనే నామం, అమ్మవారి చేతి గోళ్ల నుండే విష్ణు మ్ముర్తి యొక్క 10 అవతారలు వచ్చాయి అని చెప్తోంది.*
*"ఓం కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరాయై నమః" అనే నామాన్ని రోజు జపిస్తే త్వరగా వివాహం అవుతుంది.*
*"ఓం కదంబవనవాసిన్యై నమః" అనే నామాన్ని గృహిణులు జపిస్తూ పసుపు లేదా ఎరుపు పూవులతో పూజిస్తే కుటుంబసౌక్యం కలుగుతుంది.*
*"బిసతంతుతనీయసీ" అను నామం షడ్చక్రాలపైన వున్న 'కుండలనీ శక్తి' కి అధిదేవత. ఈ నామం మానసిక శారీరక దృడత్వాన్ని ఇస్తుంది.*
*ఇలా మన నిత్య జీవితంలో ప్రతి ఆటంకానికి ఈ లలితా సహస్రనామ స్తొత్రంలో నామాలు పరిష్కారాలగా చెప్పబడ్డాయి.*
*లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామలు "సూపర్ రెమిడిలు"గా పనిచేస్తాయి. చాలా మహిమ కలవి. ఇంట్లో లేక వ్యాపార స్థలంలో వాస్తు దోషముంటే రోజు వీటిని గట్టిగా చదివితే దాని చెడు ప్రభావాలు ఉండవు.*
*గర్భవతులు రోజూ లలితా సహస్రనామాన్ని చదివితే గర్భ దోషాలు తొలగిపొతాయి.పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.*
*ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ లలితా సహస్త్రనామాల మహిమ అనంత ఫలితాన్ని ఇస్తుంది.*
*శ్రీ మాత్రే నమః।*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా।*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా।*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా*
*శ్రీ గిరి నిలయా నిరామయా సర్వమంగళా।*.
*శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా*
*శ్రీ గిరి నిలయా నిరామయా సర్వమంగళా।*.
*శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా*
*జగమున చిరునగవున పరిపాలించే జననీ*
*అనయము మము కనికరముగ కాపాడే జననీ*
*మనసే నీవశమై స్మరణే జీవనమై*
*మాయని వరమీయవే మంగళ నాయకి।*
*శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా।*
*శ్రీ గిరి నిలయా నిరామయా సర్వమంగళా।*
*శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా।*
*అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతీ।*
*అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతీ।*
*రవ్వల తళుకుల కళకళ జ్యోతుల కర్పూర హారతీ।*
*సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి।*
*శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా।*
*శ్రీ గిరి నిలయా నిరామయా సర్వమంగళా।*
*శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా।*
*సర్వకామదా। సర్వకామదా॥*
*ఓం శ్రీ మాత్రే నమః!*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
ఆంజనేయ స్వామి శ్లోకాలు*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*శక్తివంతమైన*
*ఆంజనేయ స్వామి శ్లోకాలు*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి.*
*భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.*
1) విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ
వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ
రామదూత నమోస్తుతే!!
2) ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ
సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం
శివరూపా నమోస్తుతే!!
3) కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో
మమకార్యమ్ సాధయప్రభో!!
4) గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా
స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష
శ్రియం దాపయామ్ ప్రభో!!
5) ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ
శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ
కపినాథ నమోస్తుతే!!
6) సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ
గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ
రామదూత నమోస్తుతే!!
7) వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్
సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం
ఆంజనేయం నమామ్యహమ్!!
8) వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ
జగతాం పతయే నమః!
వివాహం కురమేదేవ
రామదూత నమోస్తుతే!!
*ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.*
*ఓం నమో శ్రీ ఆంజనేయ।*
*జై శ్రీ రామ్॥*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
గణపతికి గరిక పూజ
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
*గణపతికి గరిక పూజ ఫలితం*
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
*గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగుతాయి.*
*గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు.*
*గణపతిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి.*
*గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది.*
*దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి.*
*గరికను దారంతో కట్టి గణపతికి వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి.*
*భయరోగాది కష్టాలు, సర్వ దారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది చతుర్థీ వ్రతం. ముఖ్యంగా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి ముఖ్యమైనది. ప్రతినెలా ఆ చతుర్ధికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.*
*కృష్ణ చతుర్థినాడు దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో గణపతిని అర్చించి, 21 ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయి.*
*ఓం శ్రీ గణేశాయ నమః అంటూ 21 సార్లు ప్రతి నిత్యం, పఠించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి...*
*గం గం గణేశాయ నమః।*
*ఓం నమః శివాయ॥*
*శుభమస్తు. అవిఘ్నమస్తు.*
*శుభోదయం. శుభదినం.*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఉపవాసం రకాలు
ఉపవాసం రకాలు - సంపూర్ణ వివరణ - 2 .
అంతకు ముందు పోస్టు నందు ఉపవాసం యొక్క ప్రాముఖ్యత , రకాల గురించి వివరించాను. ఇప్పుడు మీకు మరికొంత సమాచారం అందిస్తాను.
* రసోపవాసం -
కేవలము పండ్లరసాలతో చేయు ఉపవాసాన్ని రసోపవాసం అంటారు. ఈ ఉపవాసమును వారంరోజులు మొదలుకుని నెలరోజుల వరకు కూడా చేయవచ్చును . ఈ రసోపవాసములో ముఖ్యముగా నిమ్మరసం , పలుచని నారింజరసం , బత్తాయిరసం , కమలారసం , తేనెనీళ్ళు , కొబ్బరినీళ్లు , బార్లీనీరు మొదలగునవి రోజుకి 3 నుండి 5 సార్లు రోగిని అనుసరించి ఇవ్వవలెను .
* ఫలోపవాసం -
ఉపవాసం చేయలేనివారికి ఫలోపవాసం చేయించాలి . కేవలం రసముతో నిండిన ఫలములు మాత్రమే ఆహారముగా ఇవ్వవలెను . ఫలహారము అని అరటిపండ్లు తినరాదు. ఎక్కువుగా బత్తాయి , నారింజ , కమలా , ద్రాక్ష , అనాస , దానిమ్మ , మామిడి , పుచ్చ మొదలగు పండ్లను తినవచ్చు . ఫలోపవాసం రోగిని అనుసరించి 10 రోజుల నుండి 40 రోజుల వరకు ఉంచవచ్చు.
ఇప్పుడు మీకు రసోపవాసం చేయు విధానం గురించి వివరిస్తాను .
ఒక గ్లాసు మంచినీటిలో ఒక నిమ్మకాయ పిండి దానిలో రెండు చెమ్చాలు స్వచ్చమైన తేనె కలుపుకుని తాగవలెను . దీనినే నిమ్మరసం అంటారు. కాని నిమ్మరసం అనగా గ్లాసు నిండా చిక్కని నిమ్మరసం పిండుకొని తాగరాదు. పైన చెప్పిన నిమ్మరసం రోజుకి 4 నుంచి 5 సార్లు చేయవచ్చు . ఉదయం 7 గంటలకు , 10 గంటలకు , మధ్యాహన్నం 1 మరియు 3 గంటలకు , సాయంత్రం 6 గంటలకు అనగా ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి నిమ్మరసం తీసుకోవచ్చును . ప్రతి రసానికి మధ్యన ఒక గ్లాసు మంచినీరు తప్పక తాగవలెను . రోజుకి 5 సార్లు రసం తాగలేనివారు ఉదయం , మద్యాహ్నం , సాయంత్రం మూడు సార్లు తీసికొనవచ్చు. ఈ ప్రక్రియను అనుభవ వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం చాలా మంచిది .
తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు తెలియచేస్తాను .
మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
10-09-2024) రాశి ఫలితాలు
ఈ రోజు (10-09-2024) రాశి ఫలితాలు
గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు
మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి
సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును
మేషం
10-09-2024
దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి తప్పవు.
వృషభం
10-09-2024
ఆదాయం మరింత పెరుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిధునం
10-09-2024
విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు
కర్కాటకం
10-09-2024
ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.
సింహం
10-09-2024
బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
కన్య
10-09-2024
విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.
తుల
10-09-2024
కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
వృశ్చికం
10-09-2024
అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు
10-09-2024
కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.
మకరం
10-09-2024
ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి.
కుంభం
10-09-2024
ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
మీనం
10-09-2024
మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.