28, జులై 2023, శుక్రవారం

Potana bhagavata


 

Photo








 

బీహార్ : బుద్ధ గయ

 🕉 మన గుడి : 






⚜ బీహార్ : బుద్ధ గయ


⚜ మహాబోధి ఆలయం


💠 టిబెట్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక సహా అనేక దేశాలకు విస్తరించిన బౌద్ధం.. పుట్టింది భారత్‌లోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. 

బుద్ధుడు జన్మించినప్పటి నుంచి నిర్యాణం చెందే వరకు నడయాడిన ప్రదేశాలన్నీ బౌద్ధంలో పవిత్ర స్థలాలే.

అందులో సిద్ధార్థుడికి జ్ఞానోదయం కల్గించి గౌతమ బుద్ధుడిగా మార్చిన ప్రదేశం బుద్ధ గయ వారికి పరమ పవిత్ర స్థలాల్లో ఒకటి.

 

💠 గౌతమ బుద్ధుడు ఇక్కడ జ్ఞానోదయం పొంది ఉండటంతో ఈ ప్రదేశానికి బుద్ధ గయ అని పేరు వచ్చింది.ఈ ఆలయాన్ని మొదట అశోక చక్రవర్తి నిర్మించినట్టు చెపుతారు. 

ఇక్కడ కూర్చుని ఉన్న బ్రహ్మాండమైన బుద్ధుడి విగ్రహం ఉంది. 


💠 ఆలయానికి ఉత్తర దిక్కున జ్ఞాన వృక్షం (బోధి వృక్షం) ఉంది. ఈ వృక్షం కిందనే బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని తపస్సు చేయగా జ్ఞానోదయం కలిగింది.

జ్ఞానోదయం ప్రసాదించిన రావి చెట్టు బోధివృక్షం అయింది. అక్కడనే మహబోద్గా వెలసింది.

 

💠 మహాబోధి మందిరంలోని ప్రతి అణుపూ, ప్రతికణమూ బుద్ధ భగవానుని చరిత్రను చాటి చెబుతుంది. ఆయన కూర్చున్న చోటు వజ్రాసనమయింది. 

ఆయన తదేక దృష్టితో చూచిన తావున 'అనిమేషలోచన స్తూపం' వెలిసింది. 

ధ్యాన ముద్రలో ఆయన తిరిగిన భూమి 'చంక్రమణ చైత్యం' అయింది. 

ఆత్మజ్యోతిని పలువన్నెలలో ప్రసరించిన ప్రదేశం 'రత్న మయింది. 

ఇలాంటి పుణ్యక్షేత్రానికి ఈనాడు కూడా నిష్టాపరులు లక్షల కొలది ప్రదక్షిణాలు చెయ్యటంలో ఆశ్చర్యం లేదు.


💠 బీహార్ ముఖ్య పట్టణమైన పాట్నాకు 122 కిమీ దూరంలోని సుల్తాస్ సంగ్ లో

జహ్ను ముని ఆశ్రమం ఉంది. 

ఈ ఆశ్రమం గంగానదీ మధ్య నుండి ఉద్భవించిన కొండపై ఉంది. 

జహ్ను ముని ఆశ్రమానికి సంబంధించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. 

పితృదేవతల భస్మరాసులపై గంగను పారించటం ద్వారా వారికి శాపవిమోచనం కలిగించడానికి ఇక్ష్వాకు వంశీయుడైన భగీరథుడు పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. పరమేశ్వరుడు కరుణించి తన జటాజూటం నుండి గంగను విడువగానే, పరవళ్లు తొక్కుతూ ప్రవహించిన గంగ, ఈ ప్రాంతంలో ఉన్న జాహ్న మహర్షి ఆశ్రమాన్ని ముంచివేస్తుంది. ఆగ్రహించిన మహర్షి గంగను తన దోసిట పట్టి, తాగేస్తాడు. 

ఈ పరిణామంతో ఖిన్నుడైన భగీరథుడు మహర్షిని ప్రార్థించగా, మహర్షి తన చెవి నుండి గంగను విడిచి పెడతాడు. అందువల్ల ఇక్కడ గంగను జాహ్నుని పుత్రిక జాహ్నవిగా భావిస్తారు. 

 

💠 సాంప్రదాయకంగా, బుద్ధుడు 563 BC కింది పవిత్రమైన బైసాకి పూర్ణిమ నాడు జన్మించాడు 

సిద్ధార్థుడిగా, అతను 534 లో 29 సంవత్సరాల వయస్సులో తన కుటుంబాన్ని త్యజించాడు, సత్యాన్వేషణలో ప్రయాణించి ధ్యానం చేశాడు. 


💠 జ్ఞానోదయం అనేది పూర్తిగా కామం (రాగం), ద్వేషం (ద్వేషం) మరియు మాయ (మోహ) నుండి పూర్తిగా విముక్తి పొందే స్థితి.

జ్ఞానోదయం పొందడం ద్వారా, మీరు మోక్షంలోకి ప్రవేశిస్తారు, దాని చివరి దశ నిర్వాణం.


💠 కాలక్రమేణా, ఈ ప్రదేశం బోధ గయ అని, జ్ఞానోదయం పొందిన రోజును బుద్ధ పూర్ణిమగా మరియు చెట్టును బోధి వృక్షంగా పిలుస్తారు .


💠 మహాబోధి ఆలయం, గుప్త సామ్రాజ్యం, 6వ శతాబ్దంలో నిర్మించబడింది.

ఈ చెట్టు మొదట శ్రీలంకలోని శ్రీ మహాబోధి వృక్షం యొక్క మొక్క.


💠 బుద్ధుడు జ్ఞానోదయం పొందిన 200 సంవత్సరాల తరువాత,అశోకచక్రవర్తి పవిత్ర స్థలంలో ఒక మఠం మరియు మందిరాన్ని స్థాపించడానికి బోధ్ గయను సందర్శించాడు. 


💠 ఈ ప్రదేశం  ద్రవిడుల నిర్మాణ శైలిలో ఉంది. మహాబోధి ఆలయాన్ని అశోక చక్రవర్తి 3వ శతాబ్దంలో నిర్మించగా.. 5-6 శతాబ్దాల్లో గుప్తులు మరింతగా ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చరిత్రకారులు చెబుతుంటారు.


💠 పూర్తిగా ఇటుకలతో నిర్మించిన  బౌద్ధ దేవాలయాలలో ఒకటిగా మహాబోధి ఆలయం నిలిచిందని చెబుతుంటారు. ప్రధాన గోపురాన్ని 19వ శతాబ్దంలో 55 మీటర్ల ఎత్తులో పునర్నిర్మించారు. 

 

💠 ఆలయ ప్రాకారానికి 4 మూలల్లో చిన్న చిన్న గదులలో బుద్ధుని నాలుగు విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రతి మందిరానికి పైన ఒక చిన్న గోపురం నిర్మించబడింది. 

గర్భగుడిలో కూర్చున్న బుద్ధుడి 5 అడుగుల విగ్రహం ఉంది.


💠 మహాబోధి ఆలయం ఒక బౌద్ధ ఆలయమని అందరికీ తెలుసు. అయితే గర్భాలయంలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఎదురుగా మహాశివుడు లింగాకారంలో కనిపిస్తాడు. హిందూ-బౌద్ధ మతాలకు చెందిన భిక్షువులు ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక భక్తుల విషయానికొస్తే.. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలతో పాటు అనేక ఇతర మతాలకు చెందిన యాత్రికులు ఈ విశిష్ట చారిత్రక ప్రదేశాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.


💠 పాట్నాకు 25 కిమీ దూరంలోని సోనేపూర్లో ప్రసిద్ధి పొందిన హరిహరనాథ దేవాలయం ఉంది.ఈ ఆలయాన్ని శ్రీరాముడు స్వయంగా నిర్మించాడని భక్తుల విశ్వాసం. శ్రీమద్భాగవతంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన గజేంద్ర మోక్ష ఘట్టం ఈ నదితీరానే జరిగిందని భక్తులు భావిస్తారు. 

ఈ రాష్ట్రంలోని బీహారీ షరీఫ్ సమీపంలోని బారాగావ్లో ఉన్న ఆదిత్య దేవాలయం కూడా ప్రసిద్ధి చెందిన ఆలయం. 


💠 బోధ్ గయ బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు దక్షిణంగా 115 కి.మీ దూరంలో ఉంది.

*దత్త మాట

 *దత్త మాట*



మనం ఎదుటి వారికి ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది అనే మాట చాలా సార్లు విని ఉన్నాము కదా.


చాలాసార్లు ఎవరి ఎవరికో డబ్బు సాయం చేశారని పేదలను ఆదుకున్నారని భగవంతునికి బంగారు కిరీటం సమర్పించారని  లేదా ఇంకేదో అర్పించారని  వినగానే మనకూ స్తోమత 

ఉంటే ఇవ్వకపోదునా అనిపిస్తూంది ...?


అయినా నా దగ్గర ఏమంది ఇవ్వటానికి అనుకుంటాము కదా. 


ఇలా ఆలోచించే ఒక కడు పేదవాడు బుద్ధుని అడిగాడట. నేను పేదవాడిగా ఎందుకు ఇలా ఉన్నాను అని అడిగాడు. 


దానికి సమాధానం నీ దగ్గర ఉదారత లేని కారణంగా నువ్వు పేదవాడిగా ఉన్నావు నీ దగ్గర ఉన్నది పరులకి  పంచి పెట్టే గుణం నీకు లేకపోవడం వల్ల అన్నాడట.


నేనే పేద వాడిని నా దగ్గర ఏముంది నేను ఎవరికీ ఏమి ఇవ్వగలను ? 


నువ్వు పేదవాడి వైనా

నీ వద్ద 5 గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని నువ్వు తోటి వారికి పంచటం లేదు 

వాటిని పంచటం ద్వారా నీ ఉదారత్వం చూపించవచ్చు.


నా దగ్గర 5 గొప్ప విషయాలు ఉన్నాయా ? అది నాకు తెలియకుండా అంటూ అంతులేని ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆ పేదవాడు.


*మొదటిది నీ చిరునవ్వు.*

ఎదుటి వారిని చూడగానే  అందమైన చిరునవ్వుని చిందించి అపాయ్యంగా పలకరించ వచ్చు.

*కానీ అది నీవు చేయవు*


*రెండవది నీ చూపు*

నువ్వు తోటివారిని చూసే చూపుతో దయ,కరుణ,ప్రేమ, ఎదుటి వారికి పంచవచ్చు.

*కానీ అది నీవు చేయవు.*


*మూడవది నీ నోరు*

నీవు తినటానికి, నీ కోరకు మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించుకోన్నావే తప్పితే ఆ నోటితో మృదువైన మంచి నాలుగు మాటలు నీ తోటివారికి చెప్పవచ్చు. అలాగే దైవాన్ని స్మరించవచ్చు 

*కానీ అది నీవు చేయవు.*


*నాలుగవది నీ మనస్సు* 

హృదయ మందిరం నుంచి మనస్ఫూర్తిగా ఎదుటి వారిని అభినందించవచ్చు. *కానీ అది నీవు చేయవు.*


*ఐదవది నీ శరీరం* 

నీ శరీరంలో అవయవాలు అన్ని చక్కగా ఉన్నాయి. నీ కాళ్ళని చేతుల్ని చక్కగా 

ఉపయోగించి ఎంతయినా తోటి వారికి సేవ చేయవచ్చు

*కానీ అది నీవు చేయవు.*


*ఇక్కడ అర్థం చేసుకోనే  విషయం ఏమిటంటే మనం ఎన్నో కలిగి ఉన్నాము*

*దానం అంటే ఉదారత్వం*

కాదు. అంటే ఎదుటి వారికి

డబ్బు లేదా వస్తువులు ఇవ్వటం మాత్రమే కాదు మనకి ఉన్నంతలో చేతనయిన సహయం ఇతరులకి ఇవ్వటమే ఉదారత్వం.

Iskon founder


 

Laxmi


 

Python in Kukatpally


 

MS Subramanyam


 

Song


 

Photo










 

హైడ్రో ప్లేనింగ్

 నోట్  : మిగిలిన  మెసేజ్ క్రింద షేర్  చేయబడింది. 

------------------------------------


*♦️అసలు హైడ్రో ప్లేనింగ్ అంటే ఏమిటి*


*⛺హైడ్రో ప్లెనింగ్ అంటే రోడ్డుకి రన్నింగ్ లో ఉన్న మీ కారు టైర్ కి మధ్య గ్యాప్ ఏర్పడటం. అంటే గాలి లో ఉండిపోవడం. దీనికి ప్రధాన కారణం వర్షం వల్ల రోడ్ల పైన నిలిచి ఉన్న నీరు. రోడ్డుపైన నిలిచి ఉన్న నీరు, దుమ్ము వల్ల మీ కారు టైర్లు రోడ్డుతో కాంటాక్ట్ మిస్ అయ్యి గాలిలో తేలటం. అదేమిటి అంత బరువున్న కారు ఆ కొద్దిగా నీళ్లకే గాల్లో తేలుతుందా అని డౌట్ రావచ్చు. అవును.. మీరు కారును స్పీడ్ గా నడిపే టైంలో రోడ్డుకి మీ కార్ టైర్ల కి మధ్య ఉన్న వర్షపు నీళ్ళు, దుమ్ము వల్ల స్పీడ్ లో ఉన్నప్పుడు రోడ్డుతో ఉన్న కాంటాక్ట్ మిస్ అవుతుంది. ఇది ఒక ఫిజిక్స్ ఫార్ములా. దీనివల్ల ఆ స్పీడ్ లో కారు పల్టీలు కొట్టే అవకాశం ఉంది మరి*


*🔶మీ కారు హైడ్రో ప్లేనింగ్ ఎఫెక్ట్ కి గురైతే ఏం చేయాలి.*


*🔹కారు హైడ్రోప్లేనింగ్ ఎఫెక్ట్కి గురైందని తెలిసిన వెంటనే కారుని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి సాధారణంగా సడన్ బ్రేక్ వేస్తూ ఉంటాము. అయితే ఎట్టి పరిస్థితుల్లో సడన్ బ్రేక్ వేయకూడదు. దానికి బదులుగా బ్రేక్ వేస్తూ రిలీజ్ చేస్తూ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి. దానికి తోడు డ్రైవర్ పానిక్ అవ్వకుండా ఉండటం చాలా ముఖ్యం. కారు కంట్రోల్ కోల్పోయి పక్కకు వెళ్ళిపోతున్నప్పుడు బ్యాలెన్స్ కోసం కారు స్టీరింగ్ ని వేరే డైరెక్షన్ లో తిప్పుతూ కంట్రోల్ చేయాలని చూస్తాము. దానికి బదులుగా ఎటువైపు తిరుగుతుందో దాన్ని అదే డైరెక్షన్‌లో వెళ్ళనివ్వాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మీ కార్ టైర్లు అరిగిపోయినవి కాకుండా గ్రిప్ ఉన్న టైలర్ వాడినట్లయితే ఆ గ్రిప్ డిజైన్ మధ్యనున్న గ్యాప్ వల్ల వాటర్, గాలి ప్రవహించి హైడ్రోప్లేనింగ్ ఎఫెక్ట్‌కి గురికాకుండా ఉంటాయి*


*హైడ్రో ప్లేనింగ్ కు సంబంధించి సైబరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్..*

పంచ ప్రయాగలు

 *పంచ ప్రయాగలు*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


కలియుగంలో మానవులు పాపవిముక్తి కొరకు దర్శంచ దగ్గ స్థలాలు యేమిటి అని శుక మహర్షిని శౌనికాది మునులు అడుగగా అతను పంచ పురములు, పంచ ధారలు, పంచ కేదారాలు, పంచ బదరీలు, పంచ శిలలు, పంచ ప్రయాగలు అని శలవిచ్చేడుట. ఆదికాలం నుంచి సంగమ ప్రదేశాలలో చేసే శ్రార్ధ కర్మలు, దానధర్మాలు వేలరెట్ల ఫలితాలనిస్తుందని హిందువుల నమ్మకం.

*ఇవాళ మనం పంచ ప్రయాగల గురించి తెలుసుకుందాం.*


 భగీరథుడు తన పూర్వజులకు ఉత్తమ గతుల ప్రాప్తి కొరకు గంగను భూమి పైకి తెచ్చేందుకు ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన గంగ భూమి మీదకు రావడానికి సమ్మతించి తన ధాటికి శివుడు మాత్రమే తట్టుకోగలడు కాబట్టి శివుని ప్రసన్నుని చేసు కొమ్మని సలహా యిస్తుంది. భగీరథుడు శివుని ప్రసన్నుని చేసుకొని గంగను దివి నుండి భువికి రమ్మని అర్ధిస్తాడు. అప్పుడు గంగ దివి నుండి శివుని శిరస్సు పైకి దూకగా శివుడు గంగను తన ఝటాఝూటంలో బంధించి ఒక్క పాయ  మాత్రమే భూమి పైకి విడిచి పెడతాడు. ఆ వేగానికి కూడా భూదేవి తట్టుకోలేదని తలచిన గంగ ఆ పాయను ఆరు సెలయేళ్లుగా మార్చి భూమి మీదకు వచ్చిందట. సగర పుత్రులకు పుణ్యగతులు కల్పించడానికి వారి భస్మాలను తనలో కలుపుకొనేందుకు యిలా ఆరుపాయలగా గంగ అవతరించెనని మరో కథ. ఈ సంగమాలలో యిచ్చే తర్పణాల వలన మరణించిన వారికి పుణ్యగతులు కలుగుతాయని హిందువుల నమ్మకం. తిరిగి ఆ ఆరు నదులు కలసి గంగ గా మారి భగీరథుని కోర్కె తీర్చి మనదేశంలో యెన్నో వేల యెకరాల గుండా ప్రవహించి భక్తుల పాపాలను కడిగి, భక్తుల పూజలందుకుంటోంది.

       

*ప్రయాగ అంటే నది వేరొక నదితో సంగమించిన ప్రదేశం అని అర్ధం*.

 

ఉత్తరాఖంఢ్ లోని గంగోత్రి అనే హిమనీ నదము నుండి పుట్టిన భగీరథి ( భగీరథుని కొరకై పుట్టింది కాబట్టి భగీరథి అయింది ) అదే రాష్ట్రంలో వున్న దేవప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి గంగ గా పిలువ బడుతుంది . భగీరథి గంగ గా మారే క్రమంలో యేయే నదులతో సంగమించినది, యేయే ప్రదేశాలలో సంగమించినది, ఆయా ప్రదేశాలలో చూడదగ్గ వాటి గురించి తెలుసు కుందాం. 

       

బదరీ నాధ్ నుంచి కిందకి వచ్చేటప్పుడు దారిలో వచ్చే ప్రయాగల క్రమం లోనే తెలుసుకుందాం.


    1) *విష్ణుప్రయాగ*, 2) *నందప్రయాగ*, 3) *కర్ణప్రయాగ*, 4) *రుద్రప్రయాగ*, 5) *దేవప్రయాగ*


1) *విష్ణు ప్రయాగ* 


హిమాలయాలలో వున్న త్రిమూర్తులకు ప్రతీకగా భూమి పై యేర్పడ్డ త్రిభుజాకార హిమనీనదమైన *"సతోపంత్"* లో పుట్టిన *'అలకనంద'* నది వురుకులు పరుగులతో బదరీనాథుని పాదాలను తాకి దిగువకు ప్రవహిస్తూ  చిన్న చిన్న సెలయేళ్లని తనలో కలుపుతుంటూ ప్రవహిస్తూ *జోషిమఠ్* దాటి పన్నెండు కిలోమీటర్లు ప్రవహించి *విష్ణుప్రయాగ* దగ్గర ధౌళి గంగతో కలసి *అలకనంద* గా దిగువకు ప్రవహిస్తుంది".

     

ధౌళి గంగ *'నితిపాస్'* లో పుట్టి తెల్లని రంగులో పడమట వైపునుండి వురుకులు పరుగులతో వచ్చి విష్ణుప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి తన ఉనికిని పోగొట్టు కుంటుంది. అలకనంద నీరు నీలం రంగులోను, ధౌళిగంగ తెల్లటి రంగులోను వచ్చి కలిసే దృశ్యం అద్భతంగా వుంటుంది. యెనిమిది సంవత్సరాల కిందట యిక్కడ రెండు యిళ్లు కూడావుండేవి కావు. సంగమం దగ్గర 1889 లో అహల్యాబాయి హోల్కర్ చే కట్టబడ్డ యెనిమిది భుజాలు కలిగిన కట్టడం వుంది. 2013 లో వచ్చిన వరదలు ఈ కట్టడానికి యే విధమైన క్షతిని కలుగజెయ్యలేదు. అక్కడనుంచి మెట్లదారి గుండా దిగి సంగమం చేరుకున్న భక్తులు తమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు. ఈ ప్రదేశంలో నారదుడు చేసిన ఘోర తపస్సునకు మెచ్చి విష్ణుమూర్తి దర్శన మిచ్చిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని *విష్ణుప్రయాగ* గా పిలువబడుతోంది . ఈ ప్రదేశంలో అనగా సుమారు 25 కిలోమీటర్ల అలకనంద విష్ణుగంగ గా పిలువబడుతోంది. ప్రస్తుతం యిక్కడ 400MW శక్తి గల హైడ్రో ఎలట్రికల్ పవర్ ప్లాంటు ఒక ప్రైవేటు సంస్థ ద్వారా నడుపబడడంతో యిక్కడ పదుల సంఖ్యలోగల యిళ్లతో కాలనీ వెలిసింది. రెండు కిలోమీటర్ల దూరంలో వున్న విష్ణు మందిరాన్ని దర్శించుకోవచ్చు.


2 ) *నందప్రయాగ*


విష్ణు ప్రయాగ నుంచి సుమారు 60 లేక 70 కిలోమీటర్లు ప్రయాణించిన తరవాత నంద ప్రయాగ చేరుతాం. పూర్వం యిది యదువంశ రాజ్య ముఖ్య పట్టణంగా వుండేదిట. ఈ ప్రాంతంలో నందుడు విష్ణుమూర్తి గురించి యాగం నిర్వహించి అతనిని తన పుతృనిగా పొందే వరం పొందిన ప్రదేశం. నందుడు యాగం నిర్వహించిన ప్రదేశంలో చిన్న కోవెల నిర్మించి అందులో బాల క్రిష్ణునికి పూజలు నిర్వహిస్తున్నారు. రిషికేశ్, బదరీనాధ్ రోడ్డుపైనే వుంటుంది యీ కోవెల. నంద మందిరం అని స్థానికులు పిలుస్తారు.

         

అలకనంద, నందాదేవి అభయారణ్యంలోని  *'నంద గుంట'* నుండి పుట్టిన మందాకిని నదితో కలిసే ప్రదేశం యిది. ఇక్కడ మందాకిని తన ఉనికిని పోగొట్టుకుని అలకనందగా దిగివకు ప్రవహిస్తోంది.


ఈ నదులు  వేరువేరు రంగుల నీళ్లతో ప్రవహించి రెండు నదులూ కలిసి కిందకి ప్రవహించడం ఒక అద్భుతం.  ఇక్కడ కణ్వ మహర్షి ఆశ్రమం వుండేదట. ఇక్కడే శకుంతల దుష్యంతుల వివాహం జరిగిన ప్రదేశం గా కూడా చెప్తారు.


3 ) *కర్ణ ప్రయాగ* 


నందప్రయాగ నుంచి సుమారు యెనభై కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ఈ ప్రదేశం చేరుకుంటాం. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశమే *కర్ణప్రయాగ*. పిండారి గంగ పై నిర్మించిన వంతెన వస్తుంది, కుడి వైపున నదీ సంగమం చూడొచ్చు. వంతెనకి అటు పక్కన దుర్గాదేవి మందిరం చిన్న గుట్టమీద వుంది. అదే కర్ణుని సమాధి స్థలం కూడా. వంతెనకు యిటుపక్క టాక్సీస్టాండు వుంటుంది.  దానికి యెదురుగా వున్న కొండపై కర్ణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం వస్తుంది.  మహాభారత యుద్ధం లో కవచకుండలాలను ఇంద్రునకు దానంగా యిచ్చి, రథ చక్రం విరిగి కిందపడిపోయిన కర్ణుని పైకి కృష్ణుని సలహా మేరకు అర్జునుడు  *"అంజాలిక"* అస్త్రాన్ని ప్రయోగిస్తాడు . కాని "అంజాలిక"  కర్ణుని దగ్గరకు చేరనీయకుండా అతను చేసుకున్న పుణ్యం ఫలితంగా యముడు అతనికి కాపలాగా వుంటాడు. విషయం గ్రహించిన కృష్ణుడు వృధ్ద బ్రాహ్మణ వేషధారియై కర్ణుని పుణ్యం దానంగా అడుగుతాడు. వృధ్ద బ్రాహ్మణుని సాక్షాత్తు కృష్ణునిగా గుర్తించిన కర్ణుడు తన శరీరానికి ఉత్తరక్రియలు అలకనంద పిండారి గంగల సంగమ ప్రదేశం లో జరిపించవలసినదిగా కోరి, తన పుణ్యాన్ని దానంగా యిచ్చెస్తాడు. కర్ణునకు శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం యిస్తాడు. పుణ్యం లేకపోవడంతో యముని రక్షణ వలయం మాయమౌతుంది. అంజాలిక అస్త్రం కర్ణుని ప్రాణాలను తీసుకుంటుంది. మహాభారత యుధ్దానంతరము కర్ణునకు యిచ్చిన మాట ప్రకారము కృష్ణుడు కర్ణుని శరీరమునకు కర్మకాండలు యీ ప్రదేశంలో చేస్తాడు . ఈ రెండు చోట్ల చిన్న కోవెలలు వున్నాయి. ఎవరో బాబాలు అక్కడ నివసిస్తున్నారు. వివేకానందుడు అతని గురువు లైన తురియానందజీ, అఖరానందజీ లతో యీ ప్రదేశం లో పద్ధెనిమిది రోజులు తపస్సు చేసుకున్నాడట. పిండారి గంగ వంతెన దాటేక రోడ్డు రెండుగా చీలుతుంది. యెడమ వైపున వున్న దారి 'రాణీఖేత్' వెళ్లేదారి, ఆ దారిలో సుమారు పదిహేడు కిలో మీటర్లు వెడితే రోడ్డుకి దగ్గరగా *'ఆది బదరి'* ఆలయ సముదాయాన్ని చూడొచ్చు. కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలోమీటర్ల ప్రయాణానంతరం రుద్రప్రయాగ చేరుకుంటాం.

 

4. *రుద్రప్రయాగ*


ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా ముఖ్య కేంద్రమైన రుద్రప్రయాగ కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు, బదరీనాధ్ వెళ్లే యాత్రీకులకు ముఖ్యకూడలి. ఇక్కడ భోజన, వసతి సౌకర్యాలు వున్నాయి. సంవత్సరంలో ఆరునెలలు భక్తులతో రద్దీ గా వుంటుంది. కేదారనాధ్ దగ్గర వున్న 

"చోరాబారి" అనే హిమనీ నదములో పుట్టిన మందాకిని అలకనందతో రుద్రప్రయాగ దగ్గర సంగమించింది. ఎత్తైన మెట్లు దిగి కిందకి వెళితే సంగమ ప్రదేశం చేరుకోవచ్చు. సంగమానికి వెళ్లేదారిలో నారదశిల వుంటుంది. ఇక్కడ నారదుడు శివుని కొరకై తపస్సు చేసి శివుని వద్ద సంగీతం నేర్చుకుంటాడు. ఈ ప్రదేశంలో శివుడు రుద్రనాధుడుగా పూజింప బడుతున్నాడు. రుద్రనాధుని కి కోవెలకు యెదురుగా చిన్న గుట్టమీద *చాముండా దేవి* కోవెలను చూడొచ్చు. పక్కగా వున్న కాలిబాటన వెళితే చిన్న గుహ అందులో కోటి లింగేశ్వరుని దర్శించుకోవచ్చు.


5 ) *దేవప్రయాగ* 


రుద్రప్రయాగ నుంచి సుమారు నలబ్బై కిలో మీటర్ల పయాణం తరువాత మనం దేవప్రయాగ చేరుకుంటాం. పూర్వం దేవశర్మ అనే ముని యీ ప్రదేశమ లో తపస్సు చేసుకున్నందు వలన యీ వూరికి *దేవప్రయాగ* అని పేరు వచ్చిందని ఒక కథ, దేవప్రయాగ అంటే దేవతలు కలిసే చోటు అని అర్ధం కాబట్టి ఈ ప్రదేశం సర్వదేవతలు నివాసస్థలం అని కొందరి కథనం. ఎవరు యేవిధంగా నిర్వచించినా యిక్కడి ప్రకృతి మనలని మంత్ర ముగ్ధులను చేస్తుంది అనడంలో అతిశయోక్తి యేమీ లేదు. చుట్టూరా యెత్తైన కొండలు, ఒకవైపున అలకనంద వురుకులు పరుగులతో  వచ్చి, గోముఖ్ దగ్గర గంగోత్రి హిమనీ నదములో పుట్టిన భగీరథి ( మొదటి పేరాలో భగీరథి కథ వివరించేను) తో కలిసి ' గంగ ' గా అవతరించి దిగువకు ప్రవహించడం ఒక అద్భుతాన్ని తలపింపకమానదు. రెండు నదుల సంగమ ప్రదేశంలో *'తొండేశ్వర మహదేవ్'* మందిరం వుంది. ఈ సంగమాన్ని అత్తాకోడళ్ల సంగమం అనికూడా అంటారు. అలకనంద మహాలక్ష్మి స్వరూపమని, భగీరథి స్వయంగా శివుని పత్ని అని, యింట్లో అత్తాకోడళ్ల తగవులు యెక్కువగా వున్నవాళ్లు యిక్కడ పూజలు చేసుకుంటే వారి సంబంధం లో మంచిమార్పులు చోటు చేసుకుంటాయని యిక్కడి వారి నమ్మకం.   


దేవప్రయాగలో వున్న రఘునాధ్ మందిరం వైష్ణవుల పవిత్రమైన 108 దివ్యదేశాలలో 106 దివ్యదేశం గా లెక్కిస్తారు. రావణాబ్రహ్మ ను సంహరించిన పాప పరిహార్ధమై రాముడు తపస్సు చేసుకున్న ప్రదేశం. పుండాల్ గ్రామంలో వున్న *మాతా భువనేశ్వరి మందిరం*, *ధ్యానేశ్వర్ మహదేవ్*, *దండనాగరాజు*, *చంద్రబదనీ దేవి మందిరాలు*  చూడతగ్గవి. 1946 పండిట్ చక్రధరజోషీ చేసి నిర్మించబడ్డ నక్షత్రశాల, సూర్యఘంట, ధృవఘంట దశరధాంచల్ కొండపై వున్నాయి. దేశ విదేశాలనుంచి సేకరించిన గ్రహగతులకు సంబంధించిన అనేక గ్రంథాలు యిక్కడ నిక్షిప్తం చెయ్యబడ్డాయి. ఇక్కడ యాత్రీకులకు వుండడానికి గదులు భోజనసదుపాయాలు వున్నాయి. ఇక్కడి పండాలు ( ఆదిశంకరుల వారిచే యీ ప్రాంతాలలో పూజాది కార్యక్రమాలకై నియమింప బడ్డవారు ) యేడాదిలో ఆరునెలలు బదరీనాథ్ లో పూజాది కార్యక్రమాల నిర్వాహణ, పూజా ద్రవ్యాల విక్రయం చూసుకొని శీతాకాలంలో కోవెల మూసివేసినపుడు ఆరునెలలూ దేవప్రయాగలో వుంటారట.

      

బదరీనాధ్ వెళ్లే భక్తులు వీటిని దర్శించుకోండి, కలియుగంలో దర్శన మాత్రాన పూర్ణ ఫలితం కలుగుతుందని భగవంతుడు శలవిచ్చేడు.


*సేకరణ*

🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-7🪔

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-7🪔*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *భార్యావియోగపు బాధతో విష్ణుమూర్తి శేషాద్రి ప్రయాణము* 


లక్ష్మీదేవి విడిచిన వైకుంఠము శ్రీ మహావిష్ణువునకు పాడుపడిన బీడువలెనున్నది. ఒక కళ లేకుండెను. దిగాలుపడి విష్ణుమూర్తి నింరతరము భార్యను గూర్చి ఆలోచించుచుండెను.


 పూవుల ప్రోవువంటి నా లక్ష్మి ఎచ్చటనున్నదో కదా! సుకుమార శరీర లావణ్య శోభితయగు నా రమాదేవి ఎక్కడ ఏ యిడుములబడుచున్నదో గదా? అని శ్రీమన్నారాయణుడు పదే పదే విలపించుచుండెను. 


ఇప్పుడాయనకు ఏ భక్తుల ఆర్తనాదములున్నూవినబడుటలేదు, ఇప్పుడాయన ఏ మునీశ్వరునికి తన దివ్యసుందర విగ్రహ దర్శన భాగ్యము కలుగజేయుటలేదు, తన తలంపులు లక్ష్మిని గూర్చి తన కన్నులు ఆమెను చూచుటకు నిరీక్షించుచుండెను. 


తన చెవులు ఆమె యొక్క ‘నాథా’ అను శుభకర శబ్ద శ్రవణమున కాతృత చెందుచున్నవి. లక్ష్మీదేవి వైకుంఠమున నివసించుకుండుట నారాయణునకు దుర్భరముగానుండెను. 


ఓదార్చువారు ఓదార్చుచునే యున్నారు. కానీ లాభము లేకుండెను. ఎప్పుడునూ విచారించని వారొక్కమారు విచారించిన అదిమేవో చాలా లోతైన బాధ అయి యుండుట సహజము గదా! దాని నాపజూపుట విఫలమగు ప్రయత్నము మాత్రమే అగును.


తన నిజసతిని వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుట ప్రారంభించినాడు.


ప్రపంచస్థితికి కారకుడయిన శ్రీమహావిష్ణువు యొక్క ఆ స్థితికి లక్ష్మీదేవి కారకురాలయినది. మండుటెండలలో మహావర్షధారలలో ఆయన అడవులందు, కొండలందు, కోనలందు, విచార వదనముతో తిరుగసాగెను. 


రమాదేవికై విలపించసాగెను. రాత్రియనక, పగలనక కాలగణన మనునది లేక తన నిజసతిని గూర్చి అన్వేషణ సాగించుచునే వుండెను. 


మతి భ్రమించినవానివలె తిరుగుచూ వృక్షముల చెంతకు వెడలి ఓ వృక్షములారా! నా ప్రియసతి ఇటు వచ్చుట చూచినారా!’ అనీ, శిలలు వద్దకు వెడలి, ఓ శిలలారా!మీ పక్ర్కల నుండి నా లక్ష్మీదేవి వెడలుట చూచినారా?’ అని అడుగుచుండెను. ఆకలిలేదు, నిద్రలేదు. విశ్రాంతి అనునది అసలు లేనేలేదు. అన్వేషణా ప్రయాణమే పని! రమారమా అని అరచుచూ శుష్కించిన శరీరముతో శేషాద్రికి చేరినాడు.


 *మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా* 

 *వరాహ నరసింహ గోవిందా* *వామన భృగురామ గోవిందా* 

 *బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా* 

 *వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా* 

 *గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా* 


శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం🙏


 *ఓం నమో వెంకటేశాయ* 


*సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 127*

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 127*


🔴 *రాజనీతి సూత్రాణి - పంచమాధ్యాయము* :


1. విద్యా ధనమధనానామ్ 

(ధనం లేనివాళ్ళకి విద్యయే ధనం.) 


2. విద్యా చోరైరపి న గ్రాహ్యా 

(విద్యను దొంగలు కూడా అపహరించలేరు.) 


3. విద్యయా సులభా ఖ్యాతిః 

(విద్య వల్ల కీర్తి లభిస్తుంది.) 


4. యశఃశరీరం న వినశ్యతి 

(విద్యావంతుల భౌతికశరీరం నశించినా యశస్సు అనే శరీరం నశించదు.) 


5. యః పరార్ధమన్యముపసర్పతి స సత్పురుషః (ఇతరుల పనిమీద అన్యుల దగ్గరికి వెళ్ళేవాడు సత్పురుషుడు.) 


6. ఇంద్రియాణం ప్రశమం శాస్త్రమ్ 

(ఇంద్రియాలకి శాంతిని ఇచ్చేది శాస్త్రం.) 


7. అకార్యప్రవృత్తే శాస్త్రాజకశం నివారయతి (చేయకూడని పని చేయబోతుంటే శాస్త్రం అనే అంకుశం నివారిస్తుంది.) 


8. నీచస్య విద్యా నోపేతవ్యా 

(నీచుని విద్య నేర్వగూడదు.) 


9. మ్లేచ్చభాషణం న శిక్షేత 

(మ్లేచ్చుల మాటలు నేర్చుకోకూడదు.) 


10. మ్లేచ్చానామపి సువృతం గ్రాహ్యమ్ 

(మ్లేచ్చులదే అయినా మంచి నడవడికను గ్రహించాలి.) 


11. గుణ న మత్సరః కార్యః 

(ఇతరుల సద్గుణాల చూసి అసూయ పడకూడదు.) 


12. శత్రోరపి సుగుణో గ్రహ్యాః 

(శత్రువునుండైనా సుగుణం నేర్చుకోవాలి.) 


13. విషాదప్యమృతం గ్రాహ్యామ్ 

(విషంలో ఉన్నా అమృతం గ్రహించాలి.) 


14. అవస్థయా పురుషః సంమాన్యతే 

(అతడున్న స్థితిని బట్టి పురుషుడిని గౌరవిస్తారు.) 


15. స్థాన ఏవ నరాః పూజ్యాః 

(వాళ్ళు ఉండవలసిన స్థానంలో ఉన్నప్పుడే మనుష్యుల్ని పూజిస్తారు.) 


16. ఆర్యవృత్తమనుతిష్టేత్ 

(పూజ్యుల నడవడికను అనుసరించాలి.) 


17. కదాపి మర్యాదం నాతిక్రమేత్ 

(ఎన్నడూ కట్టుబాట్లు దాటకూడదు.) 


18. నా స్త్యర్ఘ పురుషరత్నస్యః 

(పురుషశ్రేష్టుడికి వెల కట్టలేము.) 


19. న స్త్రీరత్నసమం రత్నమ్ 

(స్త్రీ రత్నం వంటి రత్నం లేదు.) 


20. సుదుర్లభం హి రత్నమ్ 

(రత్నం చాలా దుర్లభమైనది.) 


21. అయశోభయం భయమ్ 

(అన్ని భయాలలోకి గొప్ప భయం అపకీర్తి.) 


22. నాస్తవ్యలసస్య శాస్త్రాధిగయః 

(సోమరికి శాస్త్రజ్ఞానం లభించదు.) 


23. న స్త్రెణస్య స్వర్గాప్తిర్ధర్మకృత్యం చ (స్త్రీలంపటుడికి స్వర్గం కానీ ధర్మాచరణం కానీ లేదు.) 


24. స్త్రీయో పి స్త్రెణమవమన్యంతే 

(స్త్రీలంపటుడ్ని స్త్రీలు కూడా అవమానిస్తారు.) 


25. న పుష్పార్థీ సిఇచ్చతి శుష్కతరుమ్ 

(పువ్వులు కావలసినవాడు ఎండు చెట్టుకు నీళ్ళు పోయడు.) 


26. అద్రవ్యతో వాలుకాక్వాధనా దనస్యః (అయోగ్యవస్తువును యోగ్యంగా తయారుచేయడం కోసం చేసే ప్రయత్నం ఇసుక ఉడకబెట్టడమే.) 


27. న మహాజనహాస కర్తవ్య 

(పెద్దలని పరిహసించకూడదు.) 


28. కార్యసంపదం నిమిత్తాని సూచయంతి (తలపెట్టిన పని సఫలం అవుతుందా అవదా అన్న విషయాన్ని శకునాలు సూచిస్తాయి.) 


29. నక్షత్రాదపి నిమిత్తాని విశేషయంతి 

(నక్షత్రం కంటే జ్యోతిశాస్త్రం కంటే కూడా శకునాలు విశిష్టమైనవి. ఇవి నిజమవుతాయి.) 


30. న త్వరితస్య నక్షత్రపరీక్షా 

(పని తొందరలో ఉన్నవాడికి నక్షత్రపరీక్ష అనవసరం.) 


31. పరిచయే దోషా న ఛాద్యంతే 

(బాగా పరిచయం ఉన్నవాళ్ల దగ్గర ఎవరూ తమ దోషాలు దాచుకోలేరు.) 


32. స్వయమశుద్ద పరానాశజకతే 

(లోపాలు ఉన్నవాడే ఇతరులను శంకిస్తాడు.) 


33. స్వభావో దురతిక్రమః 

(స్వభావాన్ని అతిక్రమించడం కష్టం.) 


34. అపరాధానుపో దండః 

(అపరాధాన్ని పట్టి దండనం ఉంటుంది.) 


35. ప్రశ్నానురూపం ప్రతివచనమ్ 

(అడిగిన ప్రశ్నను బట్టి సమాధానం ఉంటుంది.) 


36. విభవానురూపమాభరణమ్ 

(ఐశ్వర్యం కొలదీ అలంకరణం.) 


37. కులానురూపం వృత్తమ్ 

(కులాన్ని అనుసరించి నడవడిక ఉంటుంది.) 


38. కార్యానురూపః యత్నః 

(ఎలాంటి కార్యమో అలాంటి ప్రయత్నం.) 


39. పాత్రానురూపం దానమ్ 

(పాత్రను పట్టి దానం.)


40. వయోనురూపో వేషః 

(వయస్సును బట్టి వేషం ఉండాలి.) 


41. స్వామ్యనుకూలో భృత్య 

(యజమానికి తగిన భృత్యుడు.) 


42. భర్త్రువశవర్తినీ భార్యా 

(భర్త చెప్పుచేతల్లో ఉండేది భార్య.) 


43. గురువశానువర్తీ శిష్య 

(గురువు చెప్పినట్టు నడచుకునేవాడు శిష్యుడు.) 


44. పితృవశానువర్తీ పుత్ర 

(తండ్రి మాట వినేవాడు పుత్రుడు.) 


45. అత్యుపచారః శజికతవ్య 

(అతిగా ఆదరం చూపిస్తే శంకించవలసి ఉంటుంది.) 


46. స్వామిని కుపితే స్వామినమేవానువర్తేత (ప్రభువు కోపించినా అతనినే అనుసరించి ఉండాలి.) 


47. మాతృతాడితో వత్సో మాతరమేవానురోదితి (తల్లి కొడితే పిల్లవాడు అమ్మా అనే ఏడుస్తాడు.) 


48. స్నేహవతః స్వల్పో హి రోషః 

(స్నేహం ఉన్నవాని కోపం స్వల్పంగానే ఉంటుంది.) 


49. బాలిశః ఆత్మచ్చిద్రం న పశ్యతి, అపి తు పరచ్చిద్రమేవ పశ్యతి 

(మూర్ఖుడు తనలో ఉన్న లోపాలను చూచుకోడు. పరుల లోపాలే చూస్తాడు.) 


50. సదోపచారః కితవః 

(ఎల్లప్పుడు అత్యాదరం చూపేవాడు దూర్తుడు.) 


51. కామైర్విశేషైరుపచారణముపచారః 

(కోరికలు మనస్సులో పెట్టుకుని చేసే ఆదరం "ఉపచారం") 


52. చిరపరిచితానామప్యుపచారః 

(చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవాళ్ళకి కూడా ఉపచారం చేస్తే శంకించవలసి వుంటుంది.) 


53. శ్వసహస్రాదేకాకినీ గౌ శ్రేయసే 

(వెయ్యి కుక్కలకంటే ఒక్క ఆవు మేలు.)


54. శ్వో మయూరాదద్య కపోతో పరః 

(రేపటి నెమలికంటే నేటి పావురం మేలు.) 


55. అతిసజ్గో దోషముత్పాదయతి 

(అతిగా పెట్టుకున్న సంబంధం దోషానికి హేతువ్ అవుతుంది.) 


56. సర్వం జయత్యక్రోధ 

(క్రోధం లేనివాడు అన్నింటినీ జయిస్తాడు.)


57. యద్యపకారిణి కోపః కర్తవ్య తర్హి స్వకోపే ఏవ కోపః కర్తవ్య 

(అపకారం చేసేవాని మీద కోపం చూపవలసి ఉంటే తన కోపం మీదే కోపం చూపాలి.) 


58. మతిమత్సు మూర్ఖమిత్రగురువల్లభేషు వివాదో న కర్తవ్య 

(బుద్ధిమంతులతోను, మూర్ఖులతోను, గురువులతోనూ, ఇష్టులైన వారితోనూ వాగ్వాదానికి దిగకూడదు.) 


59. నాస్త్య పిశాచమైశ్వర్యమ్ 

(పిశాచాలు లేని ఐశ్వర్యం లేదు. అత్యధికంగా ఐశ్వర్యం కూడబెట్టినవాడు మరణాంనంతరం పిశాచమవుతాడు.) 


60. నాస్తి ధనవతాం సుకర్మసు శ్రమః 

(ధనవంతులకు మంచి పనులు చేయడానికి శ్రమ ఉండదు.) 


61. నాస్తి గతిశ్రమో యానవతామ్ 

(వాహనం ఉన్నవాళ్ళకి నడిచే శ్రమ ఉండదు.) 


62. అలోహమయం నిగడం కలత్రమ్ 

(భార్య ఇనుముతో చేయని సంకెల.) 


63. యో యస్మిన్ కర్మణి కుశలః స తస్మిన్ యోక్తవ్య (ఎవరికి ఏ పనిలో నైపుణ్యం ఉందో వానిని ఆ పనిలో నియోగించాలి.) 


64. దుష్కలత్రం మనస్వినాం శరీరకర్శనమ్ 

(చెడ్డ భార్య ఆత్మాభిమానవంతుల శరీరాలు కృశింప చేస్తుంది.) 


65. అప్రమత్తో దానాన్ నిరీక్షేత 

(భార్యను జాగరూకతతో చూచుకోవాలి.) 


66. స్త్రీషు న కించిదపి విశ్వసేత్ 

(స్త్రీల విషయంలో కొంచెం కూడా విశ్వసించకూడదు.) 


67. న సమాధిః స్త్రీషు లోకజ్ఞతా చ (స్త్రీలలో చిత్తస్థైర్యం కాని లోకజ్ఞానం కాని ఉండవు.) 


68. గురూణాం మాతా గరీయసీ 

(పూజ్యులలో తల్లి గొప్పది.) 


69. సర్వావస్థాను మాతా భర్తవ్యా 

(అన్ని అవస్థలలోనూ తల్లిని పోషించాలి.) 


70. వైరూప్యమలంకారేణాచ్ఛాద్యతే 

(కురూపాన్ని అలంకారం చేత కప్పుకొనవచ్చును.) 


71. స్త్రీణాం భూషణం లాజ్జా 

(స్త్రీలకు లజ్జ అలంకారం.) 


72.  విప్రాణం భూషణం వేద 

(బ్రాహ్మణులకు అలంకారం వేదం.) 


73. సర్వేషాం భూషణం ధర్మః 

(అందరికీ అలంకారం ధర్మం.) 


74. భూషణానాం భూషణం సవినయా విద్యా (వినయసంపన్నమైన విద్య అలంకారాలకి అలంకారం.) 

(ఇంకా ఉంది)...🙏


సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -6🪔*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -6🪔*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *శ్రీ మహావిష్ణువు పై కోపగించి లక్ష్మీదేవి భూలోకమునకు పోవుట :*


భృగుమహాముని భూలోకమున గంగానదీ తీరమున చేరి యచ్చట మహర్షులు యజ్ఞము చేయుచోటికి వెళ్ళెను.


 వారికి తన పరీక్షానుభవములు తెలిపెను. త్రిమూర్తులలో సాత్త్వికగుణ ప్రధానుడు శ్రీమహావిష్ణువు మాత్రమేనని వారికి చెప్పి యజ్ఞఫలమున శ్రీమన్నారాయణునికి ధారపోయవలెనని సలహా యిచ్చెను. 


మునులందరు సంతసించిరి.


అక్కడ వైకుంఠములో విషయాలెలా వున్నాయంటే శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలము పై భృగువు తన్నాడు గదా! 


అందువల్ల శ్రీమన్నారాయణుని హృదయమే నివాసంగా గల లక్ష్మీదేవికి ఎక్కడలేని కోపమూ వచ్చినది. వచ్చుటయేమి హెచ్చినది. హెచ్చిన కోపముతో నిట్లనినది. 


ఎన్నడునూ కోపించని లక్ష్మీదేవి కోపించి శ్రీమన్నారాయణునితో అన్నది గదా-


నాథా! నా హృదయబంధూ! ఏమిటి భృగువునకింత పొగరు? సర్వలోకములకు కర్తలు, శాసనాధికారులు అయిన మిమ్ములను తన్నినందులకు నాకు చాలా విచారముగా నున్నది. 


అందుననూ మీ హృదయము పై తన్నుట వలన నేను చెప్పరాని బాధ పొందవలసివచ్చినది. 


నాథా! ఆ భృగువు గర్వాంధుడయి మీ హృదయము పై తన్నగా, ఆ దుష్టుని మీరు దండించవలసినది కదా! దండించలేదు సరికదా పైగా అతనిపాదములను ఒత్తిరి. అది ఉత్తమకార్యమా?


 నాకది యెంతటి యవమానమును కలిగించినది. ఆ యధముడైన మునిని నేను సర్వనాశన మొనర్చ గోరుచున్నాను అనెను.


శ్రీమహావిష్ణువు ‘‘నా హృదయేశ్వరీ! లక్ష్మీ! నీవు భక్తులకు నాకు మధ్య గల సంబంధము లెరుంగక ఇట్లు కోపము తెచ్చుకొంటివి. 


నా యొక్క భక్తుల మనోభావము లను అర్ధము చేసికొనుట యితరులకు శక్యముకానిది. అది నాకు మాత్రమే అర్దమగును. 


భృగువనిన ఎవరన్నుకొన్నావు, అతడు మహాజ్ఞాని, జ్ఞానియగు భక్తుడు నన్నవమానించునా? 


అతడీనాడు మహోత్కృష్ట కార్యాన్ని నిర్వర్తించుటకు మాత్రమే వచ్చాడు. ఆ కార్యము నెరవేరుటకు నన్ను తన్నినాడు. 


కాని, మరొకటి మరొకటి కాదు. అతని భావమన్న కపిల గోవు వెన్న, అదియుగాక భక్తులు మనకు బిడ్డలవంటివారు. 


బిడ్డలు చేయు పనులకు తల్లిదండ్రులు కోపము తెచ్చుకొని వారిని తెలిసికొనక దండించుట తగునా? కనుక ఓ ప్రాణేశ్వరీ! లక్ష్మీ నీవు శాంతమును పొందవలసియున్నది అని అన్నాడు.


మెల్లమెల్లగా చల్లచల్లగా నీతులు గరపాడు లక్ష్మికి. కాని లక్ష్మీదేవి కోపమును ఆయన ఉపశమింపచేయలేకపోయాడు.


రమాదేవి ఒడలు మండిపోయినది, ఆవేశమే తానయి యిట్లన్నది, 


‘‘ప్రాణప్రియా! నాథా! భృగువు చేసినది మీకిష్టము కావచ్చును. నాకు కాదు. నా నివాసమగు మీ హృదయమును తన్ని నన్ను బాధ పొందించిన ఉసురు ఊరకనే పోదు. అతడనుభవించియే తీరవలెను.


 దుర్మార్గుని శిక్షించియే తీరవలెను, లేనిచో మఱింత విజృంభించును. పగ తీర్చుకొనక నేనొక క్షణమేని విశ్రమించలేను.


 ఆ భృగువును సమర్ధించిన కారణముగా నేటితో మీకును, నాకు గల సాన్నిహిత్యము బెడిసికొట్టినది. 


ఆ బ్రాహ్మణాధముడు మన ఇద్దరును యీ విధముగ వేరుచేసినవాడయ్యెను’’ అని అణుచుకొనలేని కోపముతో బ్రాహ్మణులు భూలోకమున దరిద్రావస్థల ననుభవించెదరు గాక! దారిద్ర్యమును అనుభవించుచు తమకు గల ఉన్నత విద్యలను అమ్ముకొనుచు దుర్భర జీవితములను గడుపుదురుగాక’’ అని శపించివైచెను.


లక్ష్మీదేవి తన భవిష్యత్తును గూర్చి ఆలోచింపసాగినది.


 కట్టుకొన్న భర్తయే కాక తనను హృదయములో భద్రముగా దాచుకున్న భర్త అగు శ్రీ మహావిష్ణువుతో స్పర్థ ఏర్పడింది కదా! అయినప్పుడింక తానేమి చేయవలసివున్నది?


అవమాన దగ్ధ హృదయముతో భర్త వద్ద నుండుట కన్న ఎక్కడో ముక్కు మూసుకొని ఒకచోట తపస్సు చేసుకొనడం మంచిదని రమాదేవి యెంచినది.


‘‘నేను మఱి వైంకుఠమును వదలి వెడలిపోతున్నాను.’’ అన్నది లక్ష్మి. 


‘‘మనసు మార్చుకొను’’మని నారాయణుడు బ్రతిమాలాడు. ఎంత బ్రతిమాలినా లాభం శూన్యం అయినది.


 పట్టుదల వీడలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి బయలుదేరింది భూలోకానికి! పర్వతములు, కొండలు, కోనలూ, గట్లూ, పుట్టలూ, మొక్కలూ, నదులు, నదాలు, సముద్రాలు, జలపాతాలు దాటుకుంటూ ప్రయాణం సాగించినది. 


ఎంత అందమయినదీ ప్రకృతి! పచ్చదనాల శోభలు, ప్రకృతి రమణీయ సంపద మున్నగు వానితో తులతూగుచున్నది. హరిత నీలభరిత ధూమ్రవర్ణ కాంతివంతమై వున్నది. రమాదేవి భూలోకమున తన ప్రయాణం సాగించి, సాగించి, గంగతో సమానమైన పుణ్యనదీ అయిన గోదావరి నదీతీరము చేరింది.


గోదావరి అందము గోదావరిదే! దాని గమనములోని సొగసుదనము దానిదే! పురాణ ప్రసిద్ధ గోదావరీ నదిని లక్ష్మీదేవి చేరినది. 


గోదావరీ తీర స్థలమున  కొల్లాపురము వద్ద ఒక చక్కని పర్ణశాలను చేసికొని అచ్చట లక్ష్మీదేవి తపస్సు ప్రారంభించినది.


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 దశరధనందన గోవిందా దశముఖ మర్దన గోవిందా, గోపీజనప్రియ గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా; | 


 గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. | |6||


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


సనాతన హిందూ ధర్మం 


*ఓం నమో వేంకటేశాయా*


సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ముద్రవిజయగాధ

 #ముద్రవిజయగాధ !!

#ఇదిచదివినతరువాతనీకళ్ళవెంటఆనందభాష్పాలురాలతాయనీవుస్పంధించేవాడివైతే!!


అరుల్ మోజీ శరవణన్,తమిళనాడుకి చెందిన సామాన్య మహిళ,తానూ ఎంతో కొంత సంపాదించి కుటుంబానికి చేదోడుగా ఉందామని అనుకున్నప్పుడు ప్రధాని ముద్రా యోజన ప్రకటించడం,ఆమె దానికి దరఖాస్తు చేసుకుని బ్యాంక్ రుణం పొందడం జరిగింది.ప్రభుత్వ కార్యాలయాలకు కావలసిన చిన్న వస్తువులను సరఫరా చేసే వ్యాపారం ప్రారంభించి మహిళా వ్యాపార వేత్తగా మారింది.ఈ లోపు కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాల్లో కావలసిన చిన్న చిన్న వస్తువుల్ని చిన్న చిన్న వ్యాపారస్థుల దగ్గరే కొనాలనే ఉద్దేశ్యంతో Government e- Market place GeM అనే ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తే దానిలో సప్లయర్ కింద రిజిస్టర్ అయ్యింది,2017 లో ఒకరోజు ప్రధాని కార్యాలయానికి థెర్మో Flask కావాలని ఆ సైట్ లో పెట్టిన విషయం చూసి నేను సరఫరా చేస్తాను అని apply చేసింది.ప్రధాని కార్యాలయం ఆమె ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఆ ఆర్డర్ ఆమెకే ఇవ్వడం,ఆమె సరఫరా చేయడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగి వ్యాపారం మరింత అభివృద్ధి చేసుకోగలిగారు.


ఈ విషయాన్ని ఆమె మొత్తం ఒక లేఖలో వివరించి ప్రధాని కార్యాలయానికి రాస్తే ప్రధాని మోడీ తన మాన్ కి బాత్ లో ప్రస్తావించడంతో ఆమెకి మరింత ప్రాచుర్యం వచ్చింది.వ్యాపారం పరిధి మరింత పెరిగింది..


ఆ తర్వాత ఏ ఈమధ్య మరలా ఆమె ప్రధానికి తన వ్యాపారం పరిమాణం కోటి రూపాయలకు పెరగడం గురించి,కట్టెల పొయ్యినుండి గ్యాస్ కి మారిన తమ ఇంటి ప్రగతి,త్వరలో గ్యాస్ సబ్సిడీ వదులుకుంటామని,అలాగే సొంత ఇంటి కోసం బ్యాంక్ లోన్ కై ప్రయత్నిస్తున్నాం అని వివరిస్తూ రాసిన ఆ లేఖ ప్రధాని మోడీ ని కదిలించింది, అందుకే ఆయన నిన్న మదురై వెళ్ళినపుడు ఆమె కోరిక మేరకు కలిసి అభినందించారు.GeM ద్వారా తనలాంటి చిన్న వ్యాపారస్థులకు ఎంత మేలు కలుగుతుందో ఆమె వివరిస్తే ఆయన ఆనంద పడ్డారు.. 


ఆమె ప్రధానికి రాసే ప్రతి ఉత్తరంలో మోడీని #అప్పా (తండ్రి) అని సంబోధిస్తారు ఎందుకని అడిగిన విలేఖరులకు ఆమె ఇచ్చిన సమాధానం..తమ లాంటి చిన్న వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలనే GeM లాంటి సంస్కరణ తండ్రి లాంటి వ్యక్తి కాక ఇంకెవరు చేస్తారని..


ఇది రాస్తుంటే నా కళ్లలో ఆనందంతో కూడిన తడి..ఇలాంటి ఎన్నో చిన్న సంస్కరణలతో ప్రభుత్వాన్ని పేదల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చేసిన వ్యక్తి నా ప్రధాని,మన మోడీ అని తలుచుకుంటే గర్వంగా ఉంది!!

మై లైఫ్ స్టోరీ

 మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం

"మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:


👉ఎందుకో తెలియదు కానీ - నెహ్రూ "హిందూ మతంమీద ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.


హిందువులను

"రెండవ పౌరులుగా" మార్చడానికి 

"హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. 


🗣️🌎కానీ సర్దార్ పటేల్  నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:


"నేను జీవించి ఉన్నంత కాలం..

మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను..


ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లోకి హిందువులతో వస్తాను" అని.. 


పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. 


సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!


ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె.బి. కృపలానీ 


నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు:


"మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు  హిందువు కానే కాదు" అని.


నిజంగా 

ఇది లౌకిక దేశమైతే 


హిందూ కోడ్ బిల్లుకు బదులుగా 


అన్ని మతాలకు 

కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది.


కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది!


కానీ హిందువులు 

ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, 


అప్పుడే హిందువులంతా, హిందూ ద్రోహుల యొక్క, ఛాతీపైకి ఎక్కుతారు.


నెహ్రూకి కొనసాగింపుగా 

హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.


అయినా కూడా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు..

ఏమీ జరగనట్టుగా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.

1947నుండి 70 ఏళ్లలో ఒక కుటుంబం

 హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !


హిందువులకు అర్థం కాలేదు !


దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది 

ఎక్కడి నుండి శబ్దం రాలేదు !


సగం కాశ్మీర్ పోయింది ! 

శబ్దం లేదు! టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !


సింధు ఇవ్వబడింది!

సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !

ఎవరూ పట్టించుకోలేదు !


తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !


చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !

మీడియా కిక్కురు మనలేదు!


తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! 

కొవ్వొత్తి వెలిగించలేదు !🙈🙉🙊


సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !


మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు.. కాదు కాదు.. చంపబడ్డారు ! 

ఎటువంటి తేడా లేదు.. 


అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !


2జి స్పెక్ట్రం, 

బొగ్గు కుంభకోణం, 

CWG, 

అగస్టా,

వెస్ట్‌ల్యాండ్, 

బోఫర్స్,

వంటి భారీ కుంభకోణాలు జరిగాయి, శరీరం శబ్దం చేయలేదు!


కానీ.

గొడ్డు మాంసం, ఆగిన వెంటనే...

విపత్తు సంభవించింది !


జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే..

అసంతృప్తి బయలుదేరింది.


వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు..

వారి నాలుకలు కుట్టబడ్డాయి.


డీమానిటైజేషన్,

GST అమలు చేసినప్పుడు..


కోపం వారితో నృత్యం చేయించింది..


ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !


రోహింగ్యాల వెలికితీత - ముస్లింల సమూహలలో

నొప్పిని కలిగిస్తోంది.


ఆలోచించండి.. 

కాంగ్రెస్ = ఖన్☪️ గ్రీకు✝️ = హిందుదేశ్ వినాశనం


హిందువులకు ఏమి చేసింది ??


చర్చి కిటికీ కి 

లేదా 

మసీదు పై రాళ్ళు పడితే..మీడియాలో వారాలపాటు చూపబడుతుంది

వందల గుళ్ళు కూలగొడితే ఎవ్వరూ కిమ్మనరు..

ఎంతో కొంత భాజపా కొట్లాడితే, అది మతతత్వం అంటారు.. 

ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !


ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !


ఒకటి కాదు,  

రెండు కాదు,  

50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!


దీని గురించి ఏ ఒక్క హిందువుకు తెలియనీయలేదు !


మొదట హిందువులను 

కాశ్మీర్ లోయ నుండి బలవంతంగా తరిమేసి, 

తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి అని చెప్పబడింది !


మొత్తం కాశ్మీర్ లోయ నుండి హిందూ మతాన్ని సమూలంగా నాశనం చేయాలని చూసారు!


బీజేపి, LK Advani

భారతీయ జనతా పార్టీ


మోడీ ప్రభుత్వం రాకపోతే,

ఇది ఎవరికీ తెలిసేది కూడా కాదు !


వామపక్ష జర్నలిస్టులు, 

ముస్లిం మేధావుల, 

కాంగ్రెస్ మరియు దాని గూఢచారులు 

ఈ సమస్యను దేశం ముందు ఎందుకు పెట్టలేదు?

వీళ్లకు తోడుగా, ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు., బయస్డ్ మీడియా, సూడో సెక్యూలర్లు అందరూ హిందూ పండుగలను, సంప్రదాయాలను దేవుళ్లను సైతం వెక్కిరిస్తూ ఇతర మతాల జోలికి వెళ్లే ప్రయత్నం చేయరు..


ఇది కాంగ్రెస్ సాధించిన విజయం మరియు వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావుల తెలివి !


      సాధారణ హిందువుకు ఈ చరిత్ర గురించి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు !


దేశ ప్రజలకు ఎలాంటి  అనుమానం రాకుండా....

           కాంగ్రెస్ దేశాన్ని ఎన్ని విధాలుగా మోసం చేయగలదో... అన్ని విధాలుగా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పాటుపడింది!


మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుని,

ఎన్ని డ్రామాలు ఆడిందో...!


దీని గురించి ఆలోచించండి,

ఈ సందేశాన్ని 

మీకు సాద్యమైనంత వరకు మనకు అందుబాటులో ఉన్న అన్ని సోషల్ మీడియాలద్వారా

ప్రపంచానికి చటాండి. ఇతరులకు పంచమని 

ఒక అంతర్జాతీయ వాదిగా

ఆకండ విశ్వ సనాతన హైందవ హిందూ భారతీయ భగవత్ స్వారుపులైన  

భరతీయ జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తూ, 


భరత మాతముద్దు బిడ్డ..


దేశ చరిత్ర తెలుసుకో 

దేశ క్యాతి తెలుసుకో

నీ గొప్పదనం గూర్చి అప్పుడే

తెలుస్తుంది. 

నీకున్న ఔనత్యం యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలిస్తేనే, మనలను ప్రపంచం గౌరవిస్తుందన్నది

జగమెరిగిన నగ్న సత్యం.. 


జై హింద్....!

జై భారత్...!!

జై శ్రీ రామ్...!!!


ధర్మో రక్షతి రక్షితః

వ్రుక్షో రక్షతి రక్షితః


విజయోస్తు తదస్తు శుభమస్తు.🕉🕉🕉🚩🚩🚩🚩

పోగాలము పొంచినపుడు

 *1804*

*కం*

పోగాలము పొంచినపుడు

భోగంబులనున్నగాని భువివీడదగున్.

రోగంబుల వెతలబడిన

పోగాలము దరికిరాక పోవెటు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పోయేకాలం వచ్చినప్పుడు ఏ సౌఖ్యాలలో ఉన్న నూ ఈ భూలోకాన్ని విడిచిపెట్టవలసినదే. రోగాలు, కష్టాల బారిన పడియున్ననూ పోయేకాలం రాకపోతే ఎక్కడ కూ పోవు(మరణించవు).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఐదులక్షణములు ముఖ్యము

 శ్లో. కాకస్నానం బకధ్యానం 

     శ్వాననిద్రా తథైవచ 

     అల్పాహారీ గృహత్యాగీ 

     విద్యార్థీ పంచలక్షణం


తా౹౹ విద్యార్థికి. ఈక్రింద చెప్పేటువంటి ఐదులక్షణములు ముఖ్యము ఉండవలెను .

1,కాకి నీటిలో ఒకసారి మునిగిలేచినంతమాత్రంచేతనే స్నానంపూర్తిచేస్తుంది అలాగే విద్యార్థికూడా క్షణమాత్రముననే స్నానంముగించవలెను.


2. కొంగవంటి తపస్సు చేయాలి అంటే మాలికాదులతో దీర్ఝకాలికమైన జపములుకూడదని అర్థం. 

కొంగ ఆలోచన చేస్తున్నాకూడా కొంచేంపరధ్యాసతో ఉంటుంది అలాగే విద్యార్థిగూడా చదువుయందు ముఖ్యమైనధ్యాసతోఉండవలెను. పరధ్యానం ఉండకూడదు


3, గాఢనిద్రకు ఉపక్రమించకుండా కుక్కవలె ఎల్లప్పుడూ చదువుపట్ల మెలకువగా ఉండవలెను.


4 మితముగాఆహారంతీసుకొనవలెను లేకపోతే మృష్టాన్నంతీసు కున్నయెడల నిద్రదరిచేరి బుధ్ధిమందగించి 

పాఠములుఒంటబట్టక సాధనచేయలేక పట్టభద్రులు అవలేక సోమరిపోతులు అగుప్రమాదముఉన్నది.


5, ఇది తల్లిదండ్రులు పిల్లలు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైనవిషయం పిల్లవాడుచదువుపూర్తిఅగునంతవరకు వానియందు అతిమమకారం చూపకూడదు వానిదృష్టి ఎల్లప్పుడూ గురువు .చదువు ఈరెంటియందుమాత్రమే ఉండేటట్టు తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని గురువులకుసహకరించవలెను.

విద్యార్థిగూడా గృహమందు ఉన్నజనులపట్లకాక కేవలం తను గురువుగారిదగ్గరనేర్చుకొనుచున్న పాఠములను మరలామరలా చదువుచూ తోటివారితో ఆపాఠములయందునేర్చుకోవలసిన మెళుకువలు గురించే మమకారంఏర్పరుచుకొనవలెను .

సారాంశం .. 

ఈఐదు లక్షణములు విద్యార్థి అలవరచుకుంటే సంప్రదాయమైన విద్య ,వినయం, నైతికవిలువలు ,అబ్బి తానుఎంచుకున్న విద్య పూర్తిచేసి కృతకృత్యుడు అయి భావితర విద్యార్థులకు ఆదర్శప్రాయుడౌతాడు.

Hindu jagho




 *హిందువులను మీ గుళ్ళలోనే తగలబెడతం.* ఇది కేరళలో నినాదం దీనిపై ఏ సెక్యులర్ మేధావులు పెదవి విప్పరు, కేవలం బిజెపి మాత్రమే ఆరుస్తుంది దానిని మతతత్వ పార్టీ అంటారు. మనమేమో మన ధర్మం గురించి పోరాడే వారికీ  రాజకీయ సపోర్ట్ ఇవ్వం ఎంతసేపు ఎవడు ఎం ఫ్రీగా ఇస్తాడు ఎవడు ఓటుకు నోటు ఇస్తారు అని ఆలోచిస్తారు.   @ఖాన్ గేస్, కమ్యూనిస్ట్ సెక్యులర్ పార్టీలు.. హిందువులకు డెడ్ లైన్ 2024 ఎన్నికలు..!

Music saved


 

fake note.

 



👆🏻*In the last 2-3 days these 500 notes with the star ✳️ symbol have started circulating in the market. Such a note was returned from IndusInd Bank yesterday. This is a fake note. Even today, a friend received 2-3 such notes from a customer, but immediately returned them. The customer also said that someone gave this note in the morning due to a lack of attention. Take care there has been an increase in the number of hawkers carrying fake notes in the market.   Appeal - Please be a conscious citizen. So spread this message to more and more of your brothers so that they are spared loss and foiled by the worthless thieves. Thank you*

శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ చరిత్ర:

 *నిత్యాన్వేషణ:*


శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ చరిత్ర:




ఈ దేవాలయం సామర్లకోట అనే పట్టణం (కాకినాడ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది) లో ఉంది.. రైల్వే స్టేషన్ కి బాగా దగ్గర.. చుట్టూ పచ్చటి పంటపొలాలు, గోదావరి జలాలతో చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది ఈ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి వారి దేవాలయం..

భీమేశ్వర స్వామి వారి దేవాలయం పంచారామాల్లో ఒకటి.. చరిత్ర గురించి చెప్పాలంటే స్థానికంగా తెలిసిన కథనాల ప్రకారం చూస్తే....  ఆ గుడి పేరు చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. మీరు సరిగ్గా గమనిస్తే ద్రాక్షారామం భీమేశ్వరాలయం నిర్మాణం, శిల్పాలు, శైలి కూడా సామర్లకోట మాదిరే ఉంటుంది, అందుకు కారణం రెండిటినీ నిర్మించిన రాజు ఈ భీముడు గారే..


ఈ మందిరం నిర్మాణం శా.శ. 892 లో ప్రారంభమై సుమారు శా.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు.


ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. తెలుగు భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు.


ఇక ఆధ్యాత్మిక పరంగా చుస్తే సామర్లకోట పరమశివుని పంచ ముఖాల్లో ఒకటైన వామదేవ ముఖానికి సంబంధించిన క్షేత్రం.. కుమారస్వామి ప్రతిష్టించిన వామదేవ స్వరూపుడు కనుక కుమార భీమేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు శివయ్య..ఇది యోగలింగం.. శివలింగం ఎత్తు 14 అడుగులు, ఇప్పటికీ పెరుగుతూనే ఉంది, కనుక శిరస్సు పైన శీల కొట్టారు అని చెప్తారు.. దేవాలయం అత్యంత పురాతనమైనది కనుక భారత పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది..


సామర్లకోట, ద్రాక్షారామం దేవస్థానాల్లో శివుడికి పాలతో అభిషేకం చేయరు, ఎందుకంటే అక్కడి లింగాలకి పాల వల్ల కొంచెం నష్టం జరుగుతుంది.. సామర్లకోట క్షేత్రం రైల్వే జంక్షన్ కూడా కనుక, అన్ని ప్రధాన రైళ్ళు ఈ మార్గంలో ఆగుతాయి, మీకు వీలైతే సందర్శించండి..

గయా క్షేత్రం

 🕉 మన గుడి : 




⚜ బీహార్ : గయ


⚜ గయా క్షేత్రం



💠మన దేశంలో అత్యంత పుణ్యప్రదమైన తీర్థ క్షేత్రాలలో 'గయ' ఒకటి. 

ఈ పవిత్ర స్థలంలో కాలు పెడితేనే సమస్త పాపాలు పటాపంచలై సద్గతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

వేదాల్లోనూ, పురాణాలలోను గయకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. సమస్త దేవతలు ఈ క్షేత్రాన్ని పరమ మోక్షదాయకంగా తీర్థ క్షేత్రంగా భావించారు. 


💠 “గయ' తీర్దం సకల తీర్ధాలకి ప్రాణప్రదమైందని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 

పల్గూ నది పశ్చిమ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం, అత్యంత పవిత్రమైనదిగా విరాజిల్లుతోంది. పల్గూనదిని విష్ణుమూర్తి జలరూపంగా భావిస్తారు. మోక్ష సాధనకు గయ తీరానికి మించింది లేదు. ఇతర మోక్ష మార్గాలకన్నా గయ పిండదానానికి ఎన్నో విశిష్టతలున్నాయి.


💠 విష్ణుపాదోద్భవం పల్గూనది. గయాసురుడి శరీర క్షేత్రమే గయాతీర్థం ఈ క్షేతం ఇంతలా ప్రాచుర్యం పొందడానికి, ఇంత మహిమాన్వితం పొందడానికి ఓ పురాణగాథ

ప్రచారంలో ఉంది.


⚜ పురాణగాథ ⚜


💠 పూర్వం గయాసురుడనే రాక్షసుడు ఇక్కడ శ్రీమహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేశాడు. గయాసురుడి భక్తికి, అతని తపసుుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ఇక్కడ ఈ క్షేతంలో అవతరించాడు. 

ఎవరైతే ఇక్కడ తర్పణ చేస్తారో, ఎవరైతే

పిండదానం చేస్తారో వారి పితృదేవతలంతా మోక్షం పొందుతారని, వైకుంఠం చేరుకుంటారని గయాసురునికి శ్రీమహావిష్టువు వరమిచ్చాడు. 


💠 అలాగే బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ యజ్ఞ వేదిక ఏర్పాటుచేసుకుని తపస్సు చేశాడు. ఆ కారణంగా ఈ క్షేతం మరింత పవిత్రత నొందింది. 

బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేయడం వల్ల, అప్పటినుంచి ఈ క్షేత్రం త్రిమూర్తులతోపాటు సమస్త దేవతలకు నిలయంగా భాసిస్తోంది. 

శ్రాద్ద కర్మలకు అత్వంత పవిత్రమైన క్షేతంగా కొనియాడబడుతున్న ఈ క్షేత్రంలో బహ్మదేవుడు కృతయుగంలో తొలుత ఇక్కడ పిండ ప్రదానం చేశాడని ఒక కథ ఉంది. 


💠 అలాగే పిండ ప్రదానానికి సంబంధించి మరో పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది.

 శ్రీ రాముడు అరణ్యవాసం చేస్తుండగా ఆయన తండ్రి దశరథ మహారాజు మరణించాడు. తన జ్యేష్ట పుత్రుడైన శ్రీరాముని చేత పిండ ప్రదానం అందుకుంటాను అని దశరథుడు శ్రీరాముడికి కలలో కనిపించి చెబుతాడు.

 

💠 ఈ నేపధ్యంలో శ్రీరాముడు ఇక్కడ తన తండ్రి దశరథునికి పిండ ప్రధానం చేస్తాడు. అదే సర్వ ప్రథమ పిండ ప్రధానమని భావిస్తారు.


💠 పిండప్రదానానికి ముందు స్నానమాచరించడానికి శ్రీ రాముడు వెళ్ళిన సమయంలో మహారాజైన దశరథుని హస్తాలు రెండు సీతముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఉన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడుగగా సీతాదేవి పిండములు తీసి ఆచేతులలో ఉంచింది. శ్రీరాముడు తిరిగి వచ్చి యధావిధిగా పిండములు ప్రదానము చేసే సమయములో అతని తండ్రి ఆ పిండాలను స్వీకరించక పోయినప్పుడు శ్రీరాముడు ఆశ్చర్యానికి గురికావడమే కాక బాధపడ్డాడు. 


💠 సీతాదేవి జరిగిన ఉదంతం వివరించి , శ్రీరాముడు నమ్మటంలేదు అని సాక్ష్యానికి ఫలగు నదిని, సమీపంలో నిలిచియున్న బ్రాహ్మణుని, ఆవుని, రావిచెట్టుని, తులసిమొక్కని పిలిచింది. 

రావిచెట్టు తప్ప మిగిలిన వారు సాక్ష్యం చెప్పలేదు. 

ఆవు శ్రీ రామునికి భయపడి, ఫల్గూ నది శ్రీరాముని నుండి అధిక వరాలు పొందడానికి, 

బ్రాహ్మణుడు శ్రీరాముని నుండి అధిక దక్షిణ పొందాలని నిజం చెప్పలేదు.

తులసి మొక్క కూడా మనకి ఎందుకులే

అని ఊరుకొని నిజం చెప్పలేదు.


💠 సీతాదేవి ఆ నలుగురిని శపించిందని పురాణకథనం వివరిస్తుంది.

ఫాల్గు నది ఇంకిపోతుంది అని, 

ఆవు ముందు నుండి ఎప్పటికీ నివాళులర్పించబడదని, 

గయలోని బ్రాహ్మణులు ఎప్పుడూ సంతోషంగా ఉండరని - వారు ఎల్లప్పుడూ ఆహారం కోసం ఆరాటపడుతారని మరియు గయలో ఇకపై తులసి మొక్కలు పండించబడవని చెప్పి వారిలో నలుగురిని శపించింది. 


💠 శాపకారణంగా ఫల్గూనదిలో నీరు ఇంకి పోయింది.

నిజం చెప్పిన రావిచెట్టును మాత్రం శాశ్వతంగా జీవించమని వరమిచ్చింది.

 ఈ రావిచెట్టు ఆకులు ఎప్పుడూ రాలవని ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని ఇక్కడివారు చెప్తున్నారు. అక్షయ వృక్షం అంటే ఎప్పటికీ క్షయం పొందని వృక్షం అని అర్ధం. కరువు సమయంలో కూడా ఈ వృక్షం పచ్చగా ఉంటుంది.


💠 వేదభూమి అయిన గయాక్షేత్రం హిందువులకు బౌద్ధులకు గొప్ప పవిత్రమైన యత్రాస్థలం.గయాక్షేత్రం నందు పితృదేవతలకు శ్రాద్ధవిధులను నిర్వర్తించి పిండప్రదానం చేస్తే పితృఋణాన్ని తీర్చుకుని ఇహపర సాధనలో మోక్షం పొందుతారని గట్టి నమ్మకం. 

వారణాసిలో మొదలైన శ్రాద్ధవిధులు గయా శ్రాద్ధవిధులతో పూర్తి అవుతుంది. 


💠 గయ క్షేత్రం పితృగయగా మరియు బుద్ధగయగా రెండు భాగాలుగా ఉంటుంది. 

హిందువుల పురాతన ఆలయాలకు పితృగయ ప్రసిద్ధి. బుద్ధ ఆశ్రమాలు, బౌద్ధ ఆలయాలకు బుద్ధగయ ప్రసిద్ధి. శ్రీమంగళగౌరి మహాశక్తిపీఠం గయాక్షేత్రం నందు కలదు. 


💠 పవిత్రమైన మంగళగౌరి ఆలయం సతీదేవి ఛాతీ భాగం పడిన ప్రదేశమని విశ్వసించబడుతుంది.

నదీతీరంలో చాలా ప్రసిద్ధిచెందిన విష్ణుపద్ ఆలయం ఉంది. 

అక్కడ విష్ణుపాద ముద్రలు ఉంటాయి. 

గయాసురుని చాతి మీద శ్రీ మహావిష్ణువు పాదము ఉంచిన ప్రదేశం ఇదే.



💠 రైలు మార్గం: దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ గయా.

ఎంతోపుణ్యం చేసికున్నవారికి

 శుభోదయం🙏

             చొప్పకట్ల.

ఒకసుభాషితం!


"జనకుని పూజలంగడు బ్రసన్నునిజేయు నతండు పుత్రు డే

వనితమెలంగు భర్తృవశవర్తినియై యది సత్కళత్ర మేజనుడు విపత్తి సౌఖ్యసదృశక్రియు డాతడుమిత్రు డీ

త్రయం

బును జగతిన్ లభించు గడుపుణ్యముఁజేసినయట్టివారికిన్-

          భర్తృహరి సుభాషితములు.


భావము:తండ్రినిపూజించేకొడుకు, భర్తమాటవినేభార్య .కష్టసుఖాలలో మనలను విడువని స్నేహితుడు.ఎంతోపుణ్యం చేసికున్నవారికిగాని లభించరు.🙏🙏🙏🌷👏👏👏🌷👏👏👏👏🌷👏👏👏👏👏👏🌷👏👏🌷🌷🌷

Lightning


 

ఉన్మత్త నటనం

 ఉన్మత్త నటనం


కొత్త ఢిల్లీకి చెందిన సుందరేశన్ కు నటరాజ స్వామి అంటే చాలా మక్కువ. నటరాజ తత్వం తన మనస్సుకు సంతోషాన్ని ఇచ్చే అంశం అయితే, నటరాజ విగ్రహాలు తన కళ్ళకు, మనస్సుకు కూడా సంతోషాన్ని కలిగించే విషయం.


కోనేరిపురం నటరాజ విగ్రహం విశేషము ఏమి? తిరువాలంకాడు నటరాజ మూర్తి ఎటువంటిది? చిదంబర నటరాజ స్వామి ఆకృతిలో ఉన్న పవిత్రమైన విషయం ఏమి? ప్రపంచంలోనే అతి పెద్ద నటరాజ విగ్రహం ఉన్నది నెయ్ వేలిలో. ఇటువంటి ఎన్నో విషయాలు అతనికి కొట్టిన పిండి.


సుందరేశన్ కు, ఆ కదలాడే నటరాజ స్వామిపై ఉన్న కదలని భక్తితో పాటు, మౌనంలో ఎటువంటి కదలిక కూడా లేకుండా ఉండే కంచి పరమాచార్య స్వామి వారు అంటే కూడా అమితమైన భక్తీ.


సుందరేశన్ మహాస్వామివారి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. “నువ్వు మకిళన్ జేరి నటరాజుని చూశావా?” అని అడిగారు స్వామివారు. అ ప్రశ్న బాణంలా తగిలింది.


‘నాకు నటరాజ స్వామిపై ఉన్న ఆసక్తి గురించి మహాస్వామివారికి నేనెప్పుడూ చెప్పలేదు. అది స్వామివారికి ఎలా తెలిసింది?’


లేదన్నాడు సుందరేశన్.


“ఈ మకిళన్ జేరి, పణన్గుడి అనే గ్రామం దగ్గర ఉంది. ఆ ఊరి యొక్క విశేషం ఏమిటో తెలుసా? నటరాజ స్వామి ఒక విష్ణు ఆలయంలో స్థిర నివాసం ఉన్నాడు. ఆ నటరాజ విగ్రహం చిదంబరంలో ఉన్న విగ్రహం కంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. వెళ్లి దర్శించు. వచ్చిన తరువాత నీవు గమనించిన విశేషం ఏమిటో నాకు చెప్పు” అన్నారు స్వామివారు.


సుందరేశన్ మరుసటిరోజే మకిళన్ జేరి వెళ్ళాడు. తనతోపాటు ఆలయ అర్చకుని వెంటబెట్టుకుని విష్ణు ఆలయానికి వెళ్ళాడు. అది పరమాచార్య స్వామివారి ఆజ్ఞ అని తెలియగానే ఆ అర్చకుడు సుందరేశన్ ని నటరాజ స్వామివద్ద వదిలేశాడు.

విగ్రహం చుట్టూ ప్రతి ఇంచి అలంకరింపబడిన గుండ్రని లోహ వలయం, విరబోసుకున్న వెంట్రుకలు, ఒక చేతిలో ఢమరుకం, ఒకచేతిలో పవిత్ర జ్వాలలు, చిరుమందహాసంతో ఉన్న మోము, ఒక కాలు గాలిలోకి ఎత్తి, మరొక కాలు స్థిరంగా నిలిపి - సుందరేశన్ ఆ విగ్రహంలోని ఆణువణువు పరిశీలించాడు. ఏదైనా విశేషం ఉంటే తెలుపమని స్వామివారి ఆదేశం కదా?


ఓహ్! ఆ దత్తూర పుష్పం. అవును అదే, ఇక్కడ వాలిపోయి ఉంది. అది తలపై నిటారుగా కదా ఉండాలి? కిందకు వాలిపోయి నుదురు మీద పడుతున్నట్టుగా ఉంది. ఎందుకలా?


పది అడుగుల దూరంలో నిలబడి గమనించసాగాడు సుందరేశన్. విగ్రహం వెనుకవైపు చూడదలచి వెనుకకు వెళ్లి చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆనందతాండవంలో శరీర భ్రాంతి లేని స్థితిని చూపడానికి సృష్టించిన విగ్రహం ఇది.


సుందరేశన్ పరమాచార్య స్వామివారు ముందర నిలబడ్డాడు.


“మకిళన్ జేరి నటరాజు శరీర భ్రాంతి లేని తాండవం చేస్తున్నట్టు కనబడడం లేదూ?”


“అవును అచ్చంగా అలాగే ఉంది. తలపై ఉన్న దత్తూర పుష్పం వాలిపోయి, తల ముందువైపు నుండి పడిపోయేలాగా ఉంది”


“భేష్! చాలా సునిశితంగా పరిశీలించావు. నటరాజ స్వామి వివిధ క్షేత్రాలలో వివిధ రకములైన తాండవాలు చేశాడు. మకిళన్ జేరిలో చేస్తున్నది ఉన్మత్త నటనం, ఇది అపూర్వ నటనం”


దీన్ని వింటున్న భక్తులు కూడా శరీర భ్రాంతి వదిలి ఆశ్చర్యపోయి వింటున్నారు. కాని మహాస్వామివారు, శరీర స్పృహతోనే శివానందంలో ఓలలాడుతున్నారు.


[కుంభకోణం దగ్గరలోని నన్నిలం దగ్గర ఉంది మకిళన్ జేరి. ఇప్పుడు అక్కడ ఉన్న విష్ణు ఆలయంలో నటరాజ మూర్తి లేదు. స్థానికుల కథనం ప్రకారం, చిన్న ఆలయం కావడంతో, చోరీ భయంతో  ప్రభుత్వంవారు అ మూర్తిని అకడి నుండి తొలగించారు. దాన్ని ఎక్కడ ఉంచారో వారికి తెలియదు]


--- సుందరేశన్, కొత్త ఢిల్లీ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 7


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సౌశీల్యం

 *సౌశీల్యం*

*శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు*


మనకు శీలసంపత్తి కలుగవలెనంటే వేదోక్తములైన ఆచార-అనుష్ఠానములను పాటించాలి. సదాచారము, సద్గుణములు అలవరచుకోవాలి.


వీనికి అలవాటుపడితే మనస్సులో దురాలోచనలు ప్రవేశించుటకు సమయము కానీ, అవకాశము కానీ ఉండదు. రెండవది మనం కర్మానుష్ఠానములను చేయునప్పుడు అహంకారానికి దారితీసే కర్తృత్వభావము అసలే ఉండరాదు.


కర్మానుష్ఠానము చేయవలెననే సంకల్పమూ, చేసే శక్తి, వసతులూ అన్నీ ఈశ్వరునివే.


ఈ విధంగా మన పూర్వ వైదిక మతాచార్యులు తాము ఆచరించి మనకు మార్గనిర్దేశనంచేశారు. ఒక అద్దంలో మనబింబం చూచుకోవాలంటే, అదిశుభ్రంగా ఉండాలి. అది గాలిలో ఉంటే బింబం మసమసకగా ఉంటుంది. అంతేకాదు అద్దం నిశ్చలంగా ఉండాలి. కదులుతూ ఉంటే బింబమూ చెదరుతూ ఉన్నట్లు అగపడుతుంది. మన చిత్తం దర్పణంలాంటిది.


అనేక జన్మలనుంచి మనం తెచ్చుకొన్న మలిన సంస్కారదూషితమైన ఈ చిత్రాన్ని ఎంత శ్రమ పడితే శుభ్రంచేయగలం?


అనేక జన్మసంపర్గమైన చిత్తమాలిన్యాన్ని ఎన్నో సత్కార్యములు చేస్తేకాని పోగొట్టుకొనలేము. అంతే కాదు, ఒక్కరోజు సత్కార్యంచేసి ఊరకుంటే చాలదు. ఈ సదాచారములను అనుదినం అనుష్ఠించాలి.


అప్పుడు చిత్తనైర్మల్యం స్థిరంగా ఉండగలదు. అందుచేత ఆత్మసాక్షాత్కారం కావాలంటే అమనస్కమైన చిత్తరాహిత్యం, ఆ చిత్తరాహిత్యానికి సౌశీల్యం, సౌశీల్య సంపాదనకు వైదిక కర్మానుష్ఠానం, సదాచార సంపత్తీ ఉండాలి. ఆత్మలాభానికి శీలం ఎంతో ముఖ్య మైనదన్న విషయం ఏనాడూ మరువరాదు.

వైదిక ధర్మ ప్రభావం

 వైదిక ధర్మ ప్రభావం


ఆచార్యపురుషులకు, తదనుయాయులకు ఆత్మబలం సచ్చరిత్రం, నీతీసంపదా ఉన్నట్టయితే వారి మతములకు సుస్థిరత్వం ఏర్పడుతుంది. అట్టి ఆచార్య పురుషుల వల్లనే వైదిక మతము అనేక గండములు గడచి నేటికి సుస్ధిరంగా వుంటున్నది.


గౌతమబుద్దుడు కపిలవస్తు నగరంలో అవతరించి, 2500 ఏండ్ల గడచినవి. వారి త్యాగనిరతీ, వైరాగ్యనిష్ఠ ప్రజల మనస్సులను లోగొన్నవి. బుద్ధుని జీవితగాథ విన్నప్పుడు దేశమంతటా కానవచ్చే బుద్ధవిగ్రహాలను కన్నప్పుడు మనకు శాంత్యానందములు, కరుణా లభిస్తూవుంటవి. బౌద్ధము నాస్తిక మతమైన కారణాన దానికే దేశంలో నిలువనీడ లేకపోయిందనే అభిప్రాయ మొకటి ఈ వరకు ఉంటూవచ్చేది. కాని, సంస్కృతంలో పాళీభాషలో వున్న బౌద్ధధర్మ గ్రంథాలను, అశోకుని శిలాశాసనాలను పరికిస్తే బుద్ధదేవుని మహానుభావం మనకు తెలిసివస్తుంది. అట్టి మహనీయుని పుట్టుకచే ఈ దేశం ధన్యమయినదనిపిస్తుంది. ''ప్రాగ్దిశాజ్యోతి'' అనే గ్రంథంలో ఎడ్విను ఆర్నాల్డు కవి బుద్ధుని దివ్యజీవనాన్ని కీర్తించాడు. ఈ బౌద్ధమతం తమిళ దేశంలోను వ్యాపించింది. బౌద్ధధర్మాలనేకం తమిళ గ్రంథాలలో కానవస్తున్నవి. ఇంతగా గౌరవాస్పదమైన బౌద్ధమతం మనదేశంలో ఏల నిలువ జాలకపోయిందా అని ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది.


తమిళ సాహిత్యంలో ఎక్కడ చూచినా జైనమత ప్రచారం కనిపిస్తుంది. దీనినిబట్టి బౌద్ధముకంటే జైనధర్మానికే తమిళనాడులో ప్రాబల్యం లభించిందనుకోవాలి. ఉత్తర భారతంలో గుజరాతు మొదలైన ప్రాంతాల్లో జైనమతస్థు లధికంగా ఉంటున్నారు. బౌద్ధ జైనములు రెండూ అహింసనే పరమధర్మంగా చెపుతున్నా, బౌద్ధులు ఇతరులు చంపిన మృగముల మాంసం తినేవారు. జైనులు మాంససేవనం చప్పగా నిషేధిస్తారు. జైన విగ్రహాలు, ధర్మశాసనాలుకూడా మన దేశమంతటా కనిపిస్తున్నవి. సాంఖ్యమతమనేది కూడా పురాతనమే. బౌద్ధ, జైనములందు కంటే సాంఖ్యమతంలో జ్ఞానులు, ఋషులు ఎక్కువగా ఉన్నా, వారివారి విగ్రహాలుగాని, వారి మతాన్ని ప్రచారంచేసే గాధలు, గీతములుగానీ ఎక్కడా వినరావు మరి తత్త్వశాస్త్ర గ్రంథాలలో చూడబోతే, బౌద్ధ, జైనముల కంటే సాంఖ్యమతానికి ఎక్కువ ప్రస్తావము కనిపిస్తుంది.


వైదికమతాలలో శైవ వైష్ణవాలు తమిళదేశంలో బహుళప్రచారాన్ని పొందినవి. వైష్ణవసిద్దాంతానికి శ్రీమధ్వమునీ శ్రీ రామానుజులు ఆచార్యపురుషులు, రామానుజుల వైష్ణవాన్ని, శైవసిద్ధాంతమూలకమైన శైవాన్ని అవలంబించినవారు తమిళనాడులో విరివిగా ఉన్నారు. వైష్ణవాలయాలన్నిటా రామానుజులకు, నమ్మాళ్వారులకు, మనవాళమునికి వేదాంత దేశికులకు, మరియెందరో ఆళ్వారులకు అర్చా విగ్రహాలు వెలసినవి. శైవాలయాల్లో అట్లే అప్పయ్య, సుందరయ్య, సంబంధయ్య, మాణిక్యవాచకయ్యవార్ల విగ్రహాలు పూజలందుకొంటున్నవి. అంతేకాదు; శేవదివ్యస్థలాల్లో అరువత్తిమూడు నాయనార్ల విగ్రహాలుకూడా నెలకొన్నవి. వైష్ణవాలయాలలో ప్రబంధాలను, శైవాలయాలలో తిరిమరైలను గానంచేసేవారి కోసం వృత్తులు ఏర్పాటైవున్నవి. మరి అద్వైత స్థాపనాచార్యులైన శంకరుల విగ్రహాలు చూడబోతే శైవ వైష్ణవాచార్య విగ్రహాల్లో వెయ్యోవంతుకూడా కనుపించవు. అద్వైతాచార్యులలో ముఖ్యులైన సురేశ్వరాచార్యులకు, అప్పయ్యదీక్షితులకు ఎక్కడా విగ్రహములే కానరావు. పురావస్తుశాఖాధికారి ఒకరు చెప్పినట్లు శాసనాలు, విగ్రహాలు మెదలైన పురావస్తువులను బట్టి దేశచరిత్ర తిరిగి రచించి నట్లయితే, అద్వైతమతప్రసక్తే ఎక్కడా కనుపించకపోవచ్చు.


బౌద్ధమతం వైదిక మతాన్ని ఖండించింది. జైనమేమో బౌద్ధాన్ని ఖండించింది. ఇట్లే మతాచార్యులందరూ వారి వారి కాలములందు ప్రచారంలో ఉన్న మతాలను ఖండిస్తూ, తమ మతాలను స్ధాపింపజూచారు. శైవం, వైష్ణవం మొదలైన ఈ మతాలన్నిటికీ వేర్వేరు లక్షణాలు స్ఫుటంగా కనిపిస్తూ ఉంటవి. శైవవైష్ణవాలు రెండూ ప్రతిమార్చనను అంగీకరించినవే అయినా, వైష్ణవం ఈశ్వరునకు సుగుణమూర్తిని కల్పిస్తే, శైవం ఈశ్వర సంకేతమాత్రమయిన లింగం చాలునంటుంది. ఇస్లాము, క్రైస్తవమతస్థులు, ఆర్య సమాజికులూ ప్రతిమార్చన మొదలైనవే పనికిరాదంటారు. హిందువులు అంగీకరించే వేద ప్రామాణ్యాన్ని బౌద్ధులు, జైనులు అంగీకరించరు. ఈ మతాచార్యులందరిచుట్టూ శిష్యగణం విస్తారంగా పోగవుతూ వుండేది.


నేడు మతస్థులస్థితిని పరిశీలించిచూస్తే మానవలోకంలో సగంమంది క్రైస్తవమును, ఇంచుమించు తక్కినసగం బౌద్ధమును అవలంబించియున్నారు. ఈ రెంటికీ చెందనివారు తక్కినమతాల నాశ్రయించి ఉన్నారు. మరియెన్నో మతాలు పుట్టి పెరిగి నశించిపోయినవి. ఈ మతాలిలా యెందుకు పుట్టుతున్నవి? ఎలా నశిస్తున్నవి? ప్రతిమతమూ తనకే సత్యదర్శనమైనదనీ, తన్ను మించిన పరమధర్మంలేదనీ చెప్పుకుంటూ వుంటుంది. నిజానికి సత్యమనేది ఒక్కటే. అది యిన్నివిధాల వుండదు. మరి ప్రతిమతానికి ప్రజలు అసంఖ్యాకంగా ఎగబడుతూనే వుంటారు. మతాల ఉత్కృష్టతను, వాని నవలంభించిన జనుల సంఖ్యను బట్టి నిర్ణయించుదామా అంటే సత్యం తమనొసటనే పొడిచిందని చెప్పుకొన్న మతములు క్షీణించిపోవుట ఎందువల్ల?


సత్యబలంవల్ల మతములు ప్రజారంజకములవుతున్నవా? ప్రజారంజకములైన మతములే సత్యమతము లవుతున్నవా? ప్రజలు సత్యంకోసం మతాన్ని అవలంబిస్తా రనుకొందామా? అంతరించిపోయిన మతాలన్నీ అసత్యమతములనుకుందామా? ఇలా ఎన్నో ప్రశ్నలుదయిస్తున్నవి. ఇవన్నీ పరిశీలించిచూస్తే, ఒక్కవిషయం స్పష్టమవుతుంది. ప్రజారంజనమునుబట్టి, సంఖ్యాబలాన్ని బట్టి మతాలకు స్థిరత్వంగాని ప్రమాణ్యంగా ని నిలభించదని, మనకండ్లయెదుటనే గాంధిధర్మంకోసమని వేలాది ప్రజలు ఉపవాసంచేసి, బంధిఖానాలు నింపి, ప్రాణాలుకూడా అర్పించారు. మరి ఆ గాంధిధర్మమును, ఆ గాంధీజీ ప్రాయోపవేశాలను పట్టించుకోక ఎగతాళి చేసిన వారినీ మనమే చూచాము. అంతేకాదు, ఆ గాంధి ధర్మానుయాయుల సంఖ్య నానాటికి దిగనాసిల్లటంకూడా మనమే చూస్తున్నాము.


కాబట్టి సత్యప్రతిపాదనంవల్లనే మతాలు సుస్థిరములు, ప్రబలములు అవుతవని చెప్పలేము. మతములు ఏకారణంవల్ల పతనమైనవో తెలిసికొంటే వాని వృద్ధికిగల రహస్యంకూడా తెలిసిపోతుంది. మహాబలిపురంలో గుట్టలను ఆలయాలుగా మలిపించిన మహేంద్రవర్మ అనే రాజు ''మత్తవిలాస'' మనే ప్రహసనం రచించాడు. దానిలో బౌద్ధధర్మచ్యుతులైన భక్షువుల స్వేచ్ఛాచారాన్ని గూర్చిన ప్రస్తావనకనిపిస్తుంది. పురుషులతో పాటు స్త్రీలకు గూడా భిక్షుదీక్షలివ్వడం అపాయకరమని బుద్ధుడు ముందే ఊహించాడు. కాబట్టి తమ సచ్చరిత్రంవల్ల ఇతరులకు మార్గదర్శకులు కాదగిన భిక్షుమండలి ధర్మభ్రష్టమగుటవల్లనే బౌద్ధమతానికి పతనంకలిగిందని ఏర్పడుతున్నది. దీనినే వ్యతిరేకలక్షణతో చెపితే మతపరిరక్షణ కొర కేర్పడిన వారు నిష్కళంక చరిత్రులై తత్వజ్ఞులై ఉదారబుద్ధితో ఆచరణ ప్రచారములు ఎప్పటికప్పుడు చేస్తూవుంటే, మతములు సుస్థిరంగా వర్థిల్లుతవని చెప్పవచ్చు. మతకర్తల మహానుభావం వల్లనే మతాలకు ఆదిలో చోదనలభించుట నిజమే అయినా, తదనంతరం వచ్చే ఆచార్యపరంపరకు ఉత్సాహశక్తి, నియమనిగ్రహాలు, సచ్చరిత్రమూ అలవడాలి. తదనుయాయులకు శ్రద్ధా భక్తులుండాలి. అప్పుడే ఆ మతాలకు సుస్థిరత్వం, ప్రజారంజనం లభిస్తుంది. ప్రజాసామాన్యాన్ని ఆకరించేది ఆచార్యపురుషుల మహానుభావమే. కాని, మత పరమార్థం కాదు. ఎవరో పండితులు మాత్రమే ఆ పరమార్థాన్ని విచారించగలుగుతారు. చిరప్రతిష్ఠితములైన, మతములు గూడా మహనీయులైన ఆచార్యపురుషులు కరవగుటవల్లనే క్రమంగా క్షీణించిపోతవి.


కనుక ఏమతమయినా తదనుయాయులు భక్తిశ్రద్ధలతో ధర్మాచరణం చేస్తూవుంటే సుప్రతిష్ఠితమై వర్ధిల్లుతుంది. ప్రజాబాహుళ్యం ఎగబడి సందడి చేసినంతమాత్రాన చేకూరేది వాపేగాని బలుపుగాదు. నిజానికి సాంఖ్యాద్వైతమతాలకు సందడి చాలాతక్కువ. అనాదియైన వైదికమతానికి కర్తలెవరో ఎరుగము. అయినా, అది నేటికీ బహుజనుల కాలంబమై నిలిచి వున్నదంటే త్యాగధనులు, సచ్చరిత్రులు, భక్తులు అయిన ఆచార్యపురుషు లెందరో దానికాలంబమై ఆచరణ ప్రచారములు చేస్తూవుండటమే కారణం. కనుక, మనయీమతం చిరకాలం ఇలాగే వర్ధిల్లి లోకాన్ని ఉద్ధరించాలనే అభిలాష మనకుండాలి. అట్టి అభిలాషతో మనం సదాచారులమై, ధర్మపరాయణులమై, మనోవాక్కాయములచే సత్కర్మాచరణం చేస్తూవుండాలి.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తాటిచెట్టు

 ఒక తాటిచెట్టు గుండ్రంగా ఉంది, దానిని ఒక లత అల్లుకుంది. 

లత వేగంగా పెరిగి నెలరోజుల్లో చెట్టు మొత్తాన్ని అల్లుకుంది. 

"ఇన్ని నెలలూ ఈ తాటి కాస్త ఎదగలేదు" అంది లత నవ్వుతూ. 

"నా జీవితంలో పదివేల లతలను చూశాను. నీకంటే ముందు ఉన్న ప్రతి లత ఇప్పుడు నువ్వు చెప్పిన మాటనే చెప్పింది. నీకు ఏం చెప్పాలో తెలియడం లేదు" అని తాటిచెట్టు తిప్పికొట్టింది. 

మన మతం అన్ని ఇతర విశ్వాసాలతో సంబంధం ఉన్న చెట్టు లాంటిది.



మన మతంలో వివిధ కులాలకు వేర్వేరు విధులు, మతపరమైన ఆచారాలు ఉన్నప్పటికీ, ఆచారాల ఫలం అందరికీ ఒకేలా ఉంటుంది.

భీమేశ్వరుని గుడి

 సామర్లకోట భీమేశ్వరాలయము 


సామర్లకోటలో భీమేశ్వరుని గుడి 

          ప్రఖ్యాతి గాంచిన భవుని నెలవు 

పరివేష్టితంబైన ప్రాకారశోభలో 

         మధ్యలో వెలసిన మందిరమ్ము 

రెండంచలందున నిండుగా నుండియున్ 

         శివలింగ మత్యంత చెలువు నుండు 

పంచ శైవారామ ప్రముఖమ్ము నందున 

         విఖ్యాతి నొందియు వెల్గు నిద్ది

అల "కుమార భీమారామ" మనెడు దీని 

ఘనుడు చాళుక్యభీముడు కట్టె దొల్లి

అపర కైలాస మియ్యది యవని పైన

ధన్యమగు జన్మ నరునకు దర్శనమున.

నిత్యాన్వేషణ

 *నిత్యాన్వేషణ:*


శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ చరిత్ర:


ఈ దేవాలయం సామర్లకోట అనే పట్టణం (కాకినాడ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది) లో ఉంది.. రైల్వే స్టేషన్ కి బాగా దగ్గర.. చుట్టూ పచ్చటి పంటపొలాలు, గోదావరి జలాలతో చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది ఈ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి వారి దేవాలయం..

భీమేశ్వర స్వామి వారి దేవాలయం పంచారామాల్లో ఒకటి.. చరిత్ర గురించి చెప్పాలంటే స్థానికంగా తెలిసిన కథనాల ప్రకారం చూస్తే....  ఆ గుడి పేరు చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. మీరు సరిగ్గా గమనిస్తే ద్రాక్షారామం భీమేశ్వరాలయం నిర్మాణం, శిల్పాలు, శైలి కూడా సామర్లకోట మాదిరే ఉంటుంది, అందుకు కారణం రెండిటినీ నిర్మించిన రాజు ఈ భీముడు గారే..


ఈ మందిరం నిర్మాణం శా.శ. 892 లో ప్రారంభమై సుమారు శా.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు.


ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. తెలుగు భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు.


ఇక ఆధ్యాత్మిక పరంగా చుస్తే సామర్లకోట పరమశివుని పంచ ముఖాల్లో ఒకటైన వామదేవ ముఖానికి సంబంధించిన క్షేత్రం.. కుమారస్వామి ప్రతిష్టించిన వామదేవ స్వరూపుడు కనుక కుమార భీమేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు శివయ్య..ఇది యోగలింగం.. శివలింగం ఎత్తు 14 అడుగులు, ఇప్పటికీ పెరుగుతూనే ఉంది, కనుక శిరస్సు పైన శీల కొట్టారు అని చెప్తారు.. దేవాలయం అత్యంత పురాతనమైనది కనుక భారత పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది..


సామర్లకోట, ద్రాక్షారామం దేవస్థానాల్లో శివుడికి పాలతో అభిషేకం చేయరు, ఎందుకంటే అక్కడి లింగాలకి పాల వల్ల కొంచెం నష్టం జరుగుతుంది.. సామర్లకోట క్షేత్రం రైల్వే జంక్షన్ కూడా కనుక, అన్ని ప్రధాన రైళ్ళు ఈ మార్గంలో ఆగుతాయి, మీకు వీలైతే సందర్శించండి..

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :30/150 


మేఘజో బలచారీ చ 

మహీచారీ స్తుతస్తథా I 

సర్వతూర్యవినోదీచ 

సర్వవాద్య-పరిగ్రహః ॥ 30॥  


* మేఘజః = మేఘమునుండి ఆవిర్భవించినవాడు, 

* బలచారీ = బలముతో సంచరించువాడు, 

* మహీచారీ = భూమియందు సంచరించువాడు, 

* స్తుతః = స్తుతి చేయబడినవాడు, 

* సర్వతూర్యవినోదీ = సమస్తమైన తూర్యవాద్యములచేత వినోదించువాడు, 

* సర్వవాద్య పరిగ్రహః = సమస్త వాద్యములను ఉపయోగించువాడు. 


*మేఘజః - విశేషం* 


    మేఘాల నుంచీ 

  - ఉరుముల ద్వారా శబ్దమూ, 

  - మెరుపులతో కాంతీ వస్తాయి. 

  - వర్షం కురుస్తుంది. 


1. వేదం శబ్ద స్వరూపం. 

    వేదం ద్వారా తెలియబడేది పరమాత్మ. 

2. కాంతి తేజస్సు. 

3. వర్షం ప్రాణికోటికి జీవనాధారం. 


    కాబట్టి, 

పరమశివుడు 

  - ప్రామాణికమైన వేదం ద్వారా తెలియబడుతూ, 

  - తేజోరూపుడై, 

  - ఆనందామృతమును అనుగ్రహించే ఈశ్వరుడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

మూడూ త్వరగా నశిస్తాయి

 🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️


                *_సుభాషితమ్_*


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*నదీ తీరే చ యే వృక్షాః*

*పరగేహేషు కామినీ౹*

*మంత్రిహీనాశ్చ రాజానః*

*శీఘ్రం నశ్యన్త్యసంశయమ్॥*


*≈భావం≈*

నదుల ఒడ్డున పెరిగే చెట్లు, అజ్ఞాత వ్యక్తి ఇంట్లో నివసించే స్త్రీ, మంత్రులు లేని - ఒకవేళ ఉన్నా సరైన సలహాలు చేయగల మంత్రులు లేని రాజు, రాజ్యం ఈ మూడూ త్వరగా నశిస్తాయి.