🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 127*
🔴 *రాజనీతి సూత్రాణి - పంచమాధ్యాయము* :
1. విద్యా ధనమధనానామ్
(ధనం లేనివాళ్ళకి విద్యయే ధనం.)
2. విద్యా చోరైరపి న గ్రాహ్యా
(విద్యను దొంగలు కూడా అపహరించలేరు.)
3. విద్యయా సులభా ఖ్యాతిః
(విద్య వల్ల కీర్తి లభిస్తుంది.)
4. యశఃశరీరం న వినశ్యతి
(విద్యావంతుల భౌతికశరీరం నశించినా యశస్సు అనే శరీరం నశించదు.)
5. యః పరార్ధమన్యముపసర్పతి స సత్పురుషః (ఇతరుల పనిమీద అన్యుల దగ్గరికి వెళ్ళేవాడు సత్పురుషుడు.)
6. ఇంద్రియాణం ప్రశమం శాస్త్రమ్
(ఇంద్రియాలకి శాంతిని ఇచ్చేది శాస్త్రం.)
7. అకార్యప్రవృత్తే శాస్త్రాజకశం నివారయతి (చేయకూడని పని చేయబోతుంటే శాస్త్రం అనే అంకుశం నివారిస్తుంది.)
8. నీచస్య విద్యా నోపేతవ్యా
(నీచుని విద్య నేర్వగూడదు.)
9. మ్లేచ్చభాషణం న శిక్షేత
(మ్లేచ్చుల మాటలు నేర్చుకోకూడదు.)
10. మ్లేచ్చానామపి సువృతం గ్రాహ్యమ్
(మ్లేచ్చులదే అయినా మంచి నడవడికను గ్రహించాలి.)
11. గుణ న మత్సరః కార్యః
(ఇతరుల సద్గుణాల చూసి అసూయ పడకూడదు.)
12. శత్రోరపి సుగుణో గ్రహ్యాః
(శత్రువునుండైనా సుగుణం నేర్చుకోవాలి.)
13. విషాదప్యమృతం గ్రాహ్యామ్
(విషంలో ఉన్నా అమృతం గ్రహించాలి.)
14. అవస్థయా పురుషః సంమాన్యతే
(అతడున్న స్థితిని బట్టి పురుషుడిని గౌరవిస్తారు.)
15. స్థాన ఏవ నరాః పూజ్యాః
(వాళ్ళు ఉండవలసిన స్థానంలో ఉన్నప్పుడే మనుష్యుల్ని పూజిస్తారు.)
16. ఆర్యవృత్తమనుతిష్టేత్
(పూజ్యుల నడవడికను అనుసరించాలి.)
17. కదాపి మర్యాదం నాతిక్రమేత్
(ఎన్నడూ కట్టుబాట్లు దాటకూడదు.)
18. నా స్త్యర్ఘ పురుషరత్నస్యః
(పురుషశ్రేష్టుడికి వెల కట్టలేము.)
19. న స్త్రీరత్నసమం రత్నమ్
(స్త్రీ రత్నం వంటి రత్నం లేదు.)
20. సుదుర్లభం హి రత్నమ్
(రత్నం చాలా దుర్లభమైనది.)
21. అయశోభయం భయమ్
(అన్ని భయాలలోకి గొప్ప భయం అపకీర్తి.)
22. నాస్తవ్యలసస్య శాస్త్రాధిగయః
(సోమరికి శాస్త్రజ్ఞానం లభించదు.)
23. న స్త్రెణస్య స్వర్గాప్తిర్ధర్మకృత్యం చ (స్త్రీలంపటుడికి స్వర్గం కానీ ధర్మాచరణం కానీ లేదు.)
24. స్త్రీయో పి స్త్రెణమవమన్యంతే
(స్త్రీలంపటుడ్ని స్త్రీలు కూడా అవమానిస్తారు.)
25. న పుష్పార్థీ సిఇచ్చతి శుష్కతరుమ్
(పువ్వులు కావలసినవాడు ఎండు చెట్టుకు నీళ్ళు పోయడు.)
26. అద్రవ్యతో వాలుకాక్వాధనా దనస్యః (అయోగ్యవస్తువును యోగ్యంగా తయారుచేయడం కోసం చేసే ప్రయత్నం ఇసుక ఉడకబెట్టడమే.)
27. న మహాజనహాస కర్తవ్య
(పెద్దలని పరిహసించకూడదు.)
28. కార్యసంపదం నిమిత్తాని సూచయంతి (తలపెట్టిన పని సఫలం అవుతుందా అవదా అన్న విషయాన్ని శకునాలు సూచిస్తాయి.)
29. నక్షత్రాదపి నిమిత్తాని విశేషయంతి
(నక్షత్రం కంటే జ్యోతిశాస్త్రం కంటే కూడా శకునాలు విశిష్టమైనవి. ఇవి నిజమవుతాయి.)
30. న త్వరితస్య నక్షత్రపరీక్షా
(పని తొందరలో ఉన్నవాడికి నక్షత్రపరీక్ష అనవసరం.)
31. పరిచయే దోషా న ఛాద్యంతే
(బాగా పరిచయం ఉన్నవాళ్ల దగ్గర ఎవరూ తమ దోషాలు దాచుకోలేరు.)
32. స్వయమశుద్ద పరానాశజకతే
(లోపాలు ఉన్నవాడే ఇతరులను శంకిస్తాడు.)
33. స్వభావో దురతిక్రమః
(స్వభావాన్ని అతిక్రమించడం కష్టం.)
34. అపరాధానుపో దండః
(అపరాధాన్ని పట్టి దండనం ఉంటుంది.)
35. ప్రశ్నానురూపం ప్రతివచనమ్
(అడిగిన ప్రశ్నను బట్టి సమాధానం ఉంటుంది.)
36. విభవానురూపమాభరణమ్
(ఐశ్వర్యం కొలదీ అలంకరణం.)
37. కులానురూపం వృత్తమ్
(కులాన్ని అనుసరించి నడవడిక ఉంటుంది.)
38. కార్యానురూపః యత్నః
(ఎలాంటి కార్యమో అలాంటి ప్రయత్నం.)
39. పాత్రానురూపం దానమ్
(పాత్రను పట్టి దానం.)
40. వయోనురూపో వేషః
(వయస్సును బట్టి వేషం ఉండాలి.)
41. స్వామ్యనుకూలో భృత్య
(యజమానికి తగిన భృత్యుడు.)
42. భర్త్రువశవర్తినీ భార్యా
(భర్త చెప్పుచేతల్లో ఉండేది భార్య.)
43. గురువశానువర్తీ శిష్య
(గురువు చెప్పినట్టు నడచుకునేవాడు శిష్యుడు.)
44. పితృవశానువర్తీ పుత్ర
(తండ్రి మాట వినేవాడు పుత్రుడు.)
45. అత్యుపచారః శజికతవ్య
(అతిగా ఆదరం చూపిస్తే శంకించవలసి ఉంటుంది.)
46. స్వామిని కుపితే స్వామినమేవానువర్తేత (ప్రభువు కోపించినా అతనినే అనుసరించి ఉండాలి.)
47. మాతృతాడితో వత్సో మాతరమేవానురోదితి (తల్లి కొడితే పిల్లవాడు అమ్మా అనే ఏడుస్తాడు.)
48. స్నేహవతః స్వల్పో హి రోషః
(స్నేహం ఉన్నవాని కోపం స్వల్పంగానే ఉంటుంది.)
49. బాలిశః ఆత్మచ్చిద్రం న పశ్యతి, అపి తు పరచ్చిద్రమేవ పశ్యతి
(మూర్ఖుడు తనలో ఉన్న లోపాలను చూచుకోడు. పరుల లోపాలే చూస్తాడు.)
50. సదోపచారః కితవః
(ఎల్లప్పుడు అత్యాదరం చూపేవాడు దూర్తుడు.)
51. కామైర్విశేషైరుపచారణముపచారః
(కోరికలు మనస్సులో పెట్టుకుని చేసే ఆదరం "ఉపచారం")
52. చిరపరిచితానామప్యుపచారః
(చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవాళ్ళకి కూడా ఉపచారం చేస్తే శంకించవలసి వుంటుంది.)
53. శ్వసహస్రాదేకాకినీ గౌ శ్రేయసే
(వెయ్యి కుక్కలకంటే ఒక్క ఆవు మేలు.)
54. శ్వో మయూరాదద్య కపోతో పరః
(రేపటి నెమలికంటే నేటి పావురం మేలు.)
55. అతిసజ్గో దోషముత్పాదయతి
(అతిగా పెట్టుకున్న సంబంధం దోషానికి హేతువ్ అవుతుంది.)
56. సర్వం జయత్యక్రోధ
(క్రోధం లేనివాడు అన్నింటినీ జయిస్తాడు.)
57. యద్యపకారిణి కోపః కర్తవ్య తర్హి స్వకోపే ఏవ కోపః కర్తవ్య
(అపకారం చేసేవాని మీద కోపం చూపవలసి ఉంటే తన కోపం మీదే కోపం చూపాలి.)
58. మతిమత్సు మూర్ఖమిత్రగురువల్లభేషు వివాదో న కర్తవ్య
(బుద్ధిమంతులతోను, మూర్ఖులతోను, గురువులతోనూ, ఇష్టులైన వారితోనూ వాగ్వాదానికి దిగకూడదు.)
59. నాస్త్య పిశాచమైశ్వర్యమ్
(పిశాచాలు లేని ఐశ్వర్యం లేదు. అత్యధికంగా ఐశ్వర్యం కూడబెట్టినవాడు మరణాంనంతరం పిశాచమవుతాడు.)
60. నాస్తి ధనవతాం సుకర్మసు శ్రమః
(ధనవంతులకు మంచి పనులు చేయడానికి శ్రమ ఉండదు.)
61. నాస్తి గతిశ్రమో యానవతామ్
(వాహనం ఉన్నవాళ్ళకి నడిచే శ్రమ ఉండదు.)
62. అలోహమయం నిగడం కలత్రమ్
(భార్య ఇనుముతో చేయని సంకెల.)
63. యో యస్మిన్ కర్మణి కుశలః స తస్మిన్ యోక్తవ్య (ఎవరికి ఏ పనిలో నైపుణ్యం ఉందో వానిని ఆ పనిలో నియోగించాలి.)
64. దుష్కలత్రం మనస్వినాం శరీరకర్శనమ్
(చెడ్డ భార్య ఆత్మాభిమానవంతుల శరీరాలు కృశింప చేస్తుంది.)
65. అప్రమత్తో దానాన్ నిరీక్షేత
(భార్యను జాగరూకతతో చూచుకోవాలి.)
66. స్త్రీషు న కించిదపి విశ్వసేత్
(స్త్రీల విషయంలో కొంచెం కూడా విశ్వసించకూడదు.)
67. న సమాధిః స్త్రీషు లోకజ్ఞతా చ (స్త్రీలలో చిత్తస్థైర్యం కాని లోకజ్ఞానం కాని ఉండవు.)
68. గురూణాం మాతా గరీయసీ
(పూజ్యులలో తల్లి గొప్పది.)
69. సర్వావస్థాను మాతా భర్తవ్యా
(అన్ని అవస్థలలోనూ తల్లిని పోషించాలి.)
70. వైరూప్యమలంకారేణాచ్ఛాద్యతే
(కురూపాన్ని అలంకారం చేత కప్పుకొనవచ్చును.)
71. స్త్రీణాం భూషణం లాజ్జా
(స్త్రీలకు లజ్జ అలంకారం.)
72. విప్రాణం భూషణం వేద
(బ్రాహ్మణులకు అలంకారం వేదం.)
73. సర్వేషాం భూషణం ధర్మః
(అందరికీ అలంకారం ధర్మం.)
74. భూషణానాం భూషణం సవినయా విద్యా (వినయసంపన్నమైన విద్య అలంకారాలకి అలంకారం.)
(ఇంకా ఉంది)...🙏
సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి