సామర్లకోట భీమేశ్వరాలయము
సామర్లకోటలో భీమేశ్వరుని గుడి
ప్రఖ్యాతి గాంచిన భవుని నెలవు
పరివేష్టితంబైన ప్రాకారశోభలో
మధ్యలో వెలసిన మందిరమ్ము
రెండంచలందున నిండుగా నుండియున్
శివలింగ మత్యంత చెలువు నుండు
పంచ శైవారామ ప్రముఖమ్ము నందున
విఖ్యాతి నొందియు వెల్గు నిద్ది
అల "కుమార భీమారామ" మనెడు దీని
ఘనుడు చాళుక్యభీముడు కట్టె దొల్లి
అపర కైలాస మియ్యది యవని పైన
ధన్యమగు జన్మ నరునకు దర్శనమున.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి