28, జులై 2023, శుక్రవారం

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :30/150 


మేఘజో బలచారీ చ 

మహీచారీ స్తుతస్తథా I 

సర్వతూర్యవినోదీచ 

సర్వవాద్య-పరిగ్రహః ॥ 30॥  


* మేఘజః = మేఘమునుండి ఆవిర్భవించినవాడు, 

* బలచారీ = బలముతో సంచరించువాడు, 

* మహీచారీ = భూమియందు సంచరించువాడు, 

* స్తుతః = స్తుతి చేయబడినవాడు, 

* సర్వతూర్యవినోదీ = సమస్తమైన తూర్యవాద్యములచేత వినోదించువాడు, 

* సర్వవాద్య పరిగ్రహః = సమస్త వాద్యములను ఉపయోగించువాడు. 


*మేఘజః - విశేషం* 


    మేఘాల నుంచీ 

  - ఉరుముల ద్వారా శబ్దమూ, 

  - మెరుపులతో కాంతీ వస్తాయి. 

  - వర్షం కురుస్తుంది. 


1. వేదం శబ్ద స్వరూపం. 

    వేదం ద్వారా తెలియబడేది పరమాత్మ. 

2. కాంతి తేజస్సు. 

3. వర్షం ప్రాణికోటికి జీవనాధారం. 


    కాబట్టి, 

పరమశివుడు 

  - ప్రామాణికమైన వేదం ద్వారా తెలియబడుతూ, 

  - తేజోరూపుడై, 

  - ఆనందామృతమును అనుగ్రహించే ఈశ్వరుడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: