🕉 మన గుడి :
⚜ బీహార్ : బుద్ధ గయ
⚜ మహాబోధి ఆలయం
💠 టిబెట్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక సహా అనేక దేశాలకు విస్తరించిన బౌద్ధం.. పుట్టింది భారత్‌లోనే అన్న విషయం అందరికీ తెలిసిందే.
బుద్ధుడు జన్మించినప్పటి నుంచి నిర్యాణం చెందే వరకు నడయాడిన ప్రదేశాలన్నీ బౌద్ధంలో పవిత్ర స్థలాలే.
అందులో సిద్ధార్థుడికి జ్ఞానోదయం కల్గించి గౌతమ బుద్ధుడిగా మార్చిన ప్రదేశం బుద్ధ గయ వారికి పరమ పవిత్ర స్థలాల్లో ఒకటి.
💠 గౌతమ బుద్ధుడు ఇక్కడ జ్ఞానోదయం పొంది ఉండటంతో ఈ ప్రదేశానికి బుద్ధ గయ అని పేరు వచ్చింది.ఈ ఆలయాన్ని మొదట అశోక చక్రవర్తి నిర్మించినట్టు చెపుతారు.
ఇక్కడ కూర్చుని ఉన్న బ్రహ్మాండమైన బుద్ధుడి విగ్రహం ఉంది.
💠 ఆలయానికి ఉత్తర దిక్కున జ్ఞాన వృక్షం (బోధి వృక్షం) ఉంది. ఈ వృక్షం కిందనే బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని తపస్సు చేయగా జ్ఞానోదయం కలిగింది.
జ్ఞానోదయం ప్రసాదించిన రావి చెట్టు బోధివృక్షం అయింది. అక్కడనే మహబోద్గా వెలసింది.
💠 మహాబోధి మందిరంలోని ప్రతి అణుపూ, ప్రతికణమూ బుద్ధ భగవానుని చరిత్రను చాటి చెబుతుంది. ఆయన కూర్చున్న చోటు వజ్రాసనమయింది.
ఆయన తదేక దృష్టితో చూచిన తావున 'అనిమేషలోచన స్తూపం' వెలిసింది.
ధ్యాన ముద్రలో ఆయన తిరిగిన భూమి 'చంక్రమణ చైత్యం' అయింది.
ఆత్మజ్యోతిని పలువన్నెలలో ప్రసరించిన ప్రదేశం 'రత్న మయింది.
ఇలాంటి పుణ్యక్షేత్రానికి ఈనాడు కూడా నిష్టాపరులు లక్షల కొలది ప్రదక్షిణాలు చెయ్యటంలో ఆశ్చర్యం లేదు.
💠 బీహార్ ముఖ్య పట్టణమైన పాట్నాకు 122 కిమీ దూరంలోని సుల్తాస్ సంగ్ లో
జహ్ను ముని ఆశ్రమం ఉంది.
ఈ ఆశ్రమం గంగానదీ మధ్య నుండి ఉద్భవించిన కొండపై ఉంది.
జహ్ను ముని ఆశ్రమానికి సంబంధించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది.
పితృదేవతల భస్మరాసులపై గంగను పారించటం ద్వారా వారికి శాపవిమోచనం కలిగించడానికి ఇక్ష్వాకు వంశీయుడైన భగీరథుడు పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. పరమేశ్వరుడు కరుణించి తన జటాజూటం నుండి గంగను విడువగానే, పరవళ్లు తొక్కుతూ ప్రవహించిన గంగ, ఈ ప్రాంతంలో ఉన్న జాహ్న మహర్షి ఆశ్రమాన్ని ముంచివేస్తుంది. ఆగ్రహించిన మహర్షి గంగను తన దోసిట పట్టి, తాగేస్తాడు.
ఈ పరిణామంతో ఖిన్నుడైన భగీరథుడు మహర్షిని ప్రార్థించగా, మహర్షి తన చెవి నుండి గంగను విడిచి పెడతాడు. అందువల్ల ఇక్కడ గంగను జాహ్నుని పుత్రిక జాహ్నవిగా భావిస్తారు.
💠 సాంప్రదాయకంగా, బుద్ధుడు 563 BC కింది పవిత్రమైన బైసాకి పూర్ణిమ నాడు జన్మించాడు
సిద్ధార్థుడిగా, అతను 534 లో 29 సంవత్సరాల వయస్సులో తన కుటుంబాన్ని త్యజించాడు, సత్యాన్వేషణలో ప్రయాణించి ధ్యానం చేశాడు.
💠 జ్ఞానోదయం అనేది పూర్తిగా కామం (రాగం), ద్వేషం (ద్వేషం) మరియు మాయ (మోహ) నుండి పూర్తిగా విముక్తి పొందే స్థితి.
జ్ఞానోదయం పొందడం ద్వారా, మీరు మోక్షంలోకి ప్రవేశిస్తారు, దాని చివరి దశ నిర్వాణం.
💠 కాలక్రమేణా, ఈ ప్రదేశం బోధ గయ అని, జ్ఞానోదయం పొందిన రోజును బుద్ధ పూర్ణిమగా మరియు చెట్టును బోధి వృక్షంగా పిలుస్తారు .
💠 మహాబోధి ఆలయం, గుప్త సామ్రాజ్యం, 6వ శతాబ్దంలో నిర్మించబడింది.
ఈ చెట్టు మొదట శ్రీలంకలోని శ్రీ మహాబోధి వృక్షం యొక్క మొక్క.
💠 బుద్ధుడు జ్ఞానోదయం పొందిన 200 సంవత్సరాల తరువాత,అశోకచక్రవర్తి పవిత్ర స్థలంలో ఒక మఠం మరియు మందిరాన్ని స్థాపించడానికి బోధ్ గయను సందర్శించాడు.
💠 ఈ ప్రదేశం ద్రవిడుల నిర్మాణ శైలిలో ఉంది. మహాబోధి ఆలయాన్ని అశోక చక్రవర్తి 3వ శతాబ్దంలో నిర్మించగా.. 5-6 శతాబ్దాల్లో గుప్తులు మరింతగా ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చరిత్రకారులు చెబుతుంటారు.
💠 పూర్తిగా ఇటుకలతో నిర్మించిన బౌద్ధ దేవాలయాలలో ఒకటిగా మహాబోధి ఆలయం నిలిచిందని చెబుతుంటారు. ప్రధాన గోపురాన్ని 19వ శతాబ్దంలో 55 మీటర్ల ఎత్తులో పునర్నిర్మించారు.
💠 ఆలయ ప్రాకారానికి 4 మూలల్లో చిన్న చిన్న గదులలో బుద్ధుని నాలుగు విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రతి మందిరానికి పైన ఒక చిన్న గోపురం నిర్మించబడింది.
గర్భగుడిలో కూర్చున్న బుద్ధుడి 5 అడుగుల విగ్రహం ఉంది.
💠 మహాబోధి ఆలయం ఒక బౌద్ధ ఆలయమని అందరికీ తెలుసు. అయితే గర్భాలయంలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఎదురుగా మహాశివుడు లింగాకారంలో కనిపిస్తాడు. హిందూ-బౌద్ధ మతాలకు చెందిన భిక్షువులు ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక భక్తుల విషయానికొస్తే.. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలతో పాటు అనేక ఇతర మతాలకు చెందిన యాత్రికులు ఈ విశిష్ట చారిత్రక ప్రదేశాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.
💠 పాట్నాకు 25 కిమీ దూరంలోని సోనేపూర్లో ప్రసిద్ధి పొందిన హరిహరనాథ దేవాలయం ఉంది.ఈ ఆలయాన్ని శ్రీరాముడు స్వయంగా నిర్మించాడని భక్తుల విశ్వాసం. శ్రీమద్భాగవతంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన గజేంద్ర మోక్ష ఘట్టం ఈ నదితీరానే జరిగిందని భక్తులు భావిస్తారు.
ఈ రాష్ట్రంలోని బీహారీ షరీఫ్ సమీపంలోని బారాగావ్లో ఉన్న ఆదిత్య దేవాలయం కూడా ప్రసిద్ధి చెందిన ఆలయం.
💠 బోధ్ గయ బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు దక్షిణంగా 115 కి.మీ దూరంలో ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి