14, ఫిబ్రవరి 2024, బుధవారం

వృద్దాశ్రమాలు అవసరం

 T*😢 తండ్రి చనిపోయిన తరువాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు.*


*😢 ఆ తల్లికి వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధాశ్రమానికి నెల నెల కట్టేవాడు...* 


*😢 ఖాళీ దొరికినప్పుడు తనకు మనస్సుకు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు, ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు...*


*😢 ఆలా కొన్ని ఏళ్ళు గడిచాయి, ఒక రోజు వృద్దాశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది...*


*😢 మీ అమ్మకు బాగోలేదు, సిరియస్ గా ఉంది, చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది... కొడుకును చూడాలని ఏడుస్తుంది...  మీరు వెంటనే రండి అని...*


*😢 వృద్దాశ్రమం లోకి వచ్చిన కోడుకును చూసి ఆ తల్లి తన శక్తినంత కూడదీసుకుని.* 


*😢 బాబు..! నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది..?*


*😢 తల్లి చేతిలో చెయ్యేసి చెప్పమ్మ... అన్నాడు కొడుకు...*


*😢 నాయనా..! ఈ ఆశ్రమములో ప్రతి గదిలో ఫ్యాన్ లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు, ఆహారం పాడవకుండా పెద్ద ఫ్రిజ్ కూడా కొను...* 


*😢 ప్రిడ్జ్ లేకపోవడంతో పాడయిపోయిన ఆహారం తినలేక కొన్ని రోజులు నేను తినకుండా ఖాళీ కడుపుతో ఆకలితో పడుకున్నాను అన్నది తల్లి...*


*😢 అమ్మా..! ఇన్ని రోజుల నుండి ఇక్కడ వున్నావు కదా అమ్మా... నేను చాల సార్లు నిన్ను చూడడానికి వచ్చాను కదా ఎప్పుడు కూడా చేప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు అమ్మా అని అడిగాడు..?*


*😢 బాబు నేను ఎలాగోలా వేసవిలో వేడిని, ఆకలి బాధను తిట్టుకున్నారు...*


*😢 కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే నువ్వు తట్టుకోలేవురా నాన్నా ! అని చెప్పి ఏడ్చింది...*


*కన్న తల్లి తండ్రులను వృధాశ్రమములో చేర్పించే కొడుకులకు ఈ మేసేజ్ అంకితం...* 


*ఈ మేసేజ్ చదివిన ప్రతి ఒక్కరు కనీసం 100 మందికైనా ఈ మెసేజ్ పంపించండి ప్లీజ్. కొందరైనా మారుతారు అని నా గట్టి నమ్మకంతో...*


*ఈ దేశానికి వృద్దాశ్రమాలు అవసరం లేదని చెప్పె తరం రావాలని ప్రతిఒక్కరూ ప్రార్థించండి.*

🙏🙏🙏🙏🙏🙇🏻🙏🙏🙏🙏🙏

Panchaag


 

Amplifier


 

Photo


 

Ulka


 

ఖర్చులేని స్వర్గం!

 *ఖర్చులేని స్వర్గం!*

              


*వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ‘ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి!’ అన్నాడు.*


*కాసేపు ఆలోచించి…“స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి,” అన్నాను.*


*ఆశ్చర్యంగా అతను నా వంకచూసి “అదెలా?” అన్నాడు.*


*నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా ..* 


కానీ, *ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!*


*దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..* 


*డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..*


*సత్సంగత్వే నిస్సంగత్వం !* 

*నిస్సంగత్వే నిర్మోహత్వం !!* 

*నిర్మోహత్వే నిశ్చలతత్వం !* 

*నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!* 


*సత్పురుషులు ..* *మార్గదర్శనం* 

*సత్సంగత్యం ..* *సహవాసం* 

*సత్ప్రవర్తన ..* *జీవించడం* 

*మించి, ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకటి, మరొకటి లేదు ..*

సరస్వతీ నది🌳

 🎻🌹🙏🌲సరస్వతీ నది🌳

               

సరస్వతీ నది  అలహాబాద్ వద్ద  త్రివేణి  సంగమంలో

అదృశ్యంగా కలుస్తుందని

ఐహీకం.  సరస్వతీ నది

ఆవిర్భవించిన స్ధలం  బదరీనాధ్ సమీపాన కల

భారతదేశంలో ని  చివరి గ్రామమైన మనా. టిబెట్

సరిహద్దునకు 3 కి.మీ దూరంలో  వున్నది. 

సరస్వతీ నది  ప్రవేశ ద్వారం మనా గ్రామంలో వున్నది. 


వేద వ్యాసుడు  చెప్తుండగా

గణేశుడు వ్రాసిన మహాభారత కావ్యంలో పంచపాండవులు స్వర్గారోహణానికి బయలుదేరినది  మనా గ్రామం నుండేనని  తెలుస్తోంది.

ఇటువంటి అతి ప్రాచీన విశేషాలు గురించి చదివినా , విన్నా  మన శరీరం కుతూహలం తో పులకిస్తుంది.


పర్వత శ్రేణులలో 

ప్రవహించే  అలకానంద

అందం మనల్ని మైమరిపిస్తుంది. 

ప్రకృతి పచ్చదనాలతో నిండిన మనా గ్రామ మార్గమంతా

స్వెట్టర్ లు , చలి టోపీలు

అమ్మే దుకాణాలు, టీ హోటళ్ళు  వున్నాయి. 

చలి ఎక్కువగా వుండడం వలన  వేడి వేడి  టీ తోనే ఎక్కువ కాలం గడుపుతారు.

ఆ గ్రామ మహిళలు

తమ  భుజం వెనకాల

బుట్టలలో పిల్లలను , వయోవృధ్ధులనే  కాకుండా గ్యాస్

సిలిండర్ లను కూడా  మోసుకుంటూ

వెళ్ళడం చూసే వారికి

ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 

వీరికి ఆరోగ్యాన్ని యిచ్చేది అక్కడి ప్రకృతియే.


ఇక్కడకు వచ్చే పర్యాటకులు ముందుగా

గజముఖ వినాయకుని గుహను దర్శిస్తారు.

వ్యాసభగవానుని  ప్రార్ధనను

మన్నించి , వినాయకుడు

భారతం వ్రాసిన ప్రదేశం యిదే.

అది కూడా తన దంతాన్ని

ఊడపెరికి ఘంటంగా

ఉపయోగించి వ్రాశాడు.

గుహలో దర్శనమిచ్చేది ఆ 

వినాయకుడే అని చెపుతారు. 

గుహలో  వొంగుని వినాయకుని దర్శించి

వ్యాసగుహకి వెడతారు

భక్తులు. 

మహాభారతం వ్రాసిన పిదప వేదవ్యాసుడు మనో చాంచల్యంతో వున్న సమయాన , నారదుని

బోధతో , మానవజన్మ

మోక్షానికి భాగవతం వ్రాసినగుహ గా  కూడా భక్తులు ధృఢంగా

నమ్ముతారు.  ఈ గుహ

5300  సంవత్సరాలకన్నా

ప్రాచీనమైనదిగా చెప్తారు. 

ఇక్కడ, వినాయకుడు

శుకుడు , వల్లభాచార్యుల

పురాతన శిల్పాలు దర్శనమిస్తాయి. 

మహాభారతం  యొక్క ఎనిమిది తాళపత్రగ్రంధాలు  ఒక

అద్దాల పెట్టెలో పెట్టి పూజించ బడుతున్నాయి.


ఇక్కడే రెండు కొండలమధ్యనుండి ఉరుకు పరుగులతో నురగలు క్రక్కుతూ పెద్ద పెద్ద అలలతో  సరస్వతీనది

ప్రవహిస్తూంటుంది. అత్యంత

వేగంతో ప్రవహించే ఆ అలల శబ్దంలో

ఓంకార నాదం వినిపిస్తుంది .

అతి ప్రశాంతమైన వాతావరణంలో

అథఃపాతాళంలో 

సరస్వతీనది  జన్మస్ధానం వున్నది. మహా ఉధృతంగా

ఆవేశంతో,  

కళ్ళని కట్టివేసే శ్వేత వర్ణంతో

సరస్వతీనది భ్రమింప చేస్తుంది. 


సరస్వతీనది బాహ్యంగా  మాయమవడానికి గల కారణం ఒక

కుతూహలమైన

గాధ. 


మహాభారత గ్రంధం వ్రాయడంలో 

నిమగ్నుడైన  వినాయకుడు.. అతివేగంగా  మహాశబ్దంతో ప్రవహించే సరస్వతి నదిని ప్రశాంతంగా వుండమని

ఆదేశించాడు. కాని సరస్వతీ నది ఆహంకారంతో  తన 

ప్రవాహ వేగాన్ని మరింత పెంచుకుని యింకా

శబ్దాన్ని న

పెంచుకుంటూ ప్రవహించసాగింది. 

వినాయకుడు  కోపంతో , 

" ఓ నదీ  నీవు  నామరూపాలు

లేకుండా అదృశ్యమైపోతావు"  అని

శపించాడు.


తన తప్పును తెలుసుకున్న సరస్వతీ నది, తనని మన్నించమని కోరింది. అప్పుడు , 

గజముఖుడు  ఆ నది మీద దయ తలచి,  " ఓ 

సరస్వతీ ! యికపైన 

నీవు ఇక్కడ మరుగుననే ప్రవహిస్తూ

గంగా , యమునలు సంగమించే ప్రదేశాలలో

మూడవ నదిగా ప్రవహించి

కీర్తి పొందుతావు అని అనుగ్రహించాడు. 

అందువలన, అలహాబాద్, గుప్తకాశి, ఋషీ కేష్ 

గంగా, యమునలు కలసిన స్ధలాలు త్రివేణీ సంగమాలుగా

ప్రఖ్యాతి గాంచాయి. 

ఇక్కడ సమీపముననే సరస్వతీ నదికి

చిన్న గుహాలయం వున్నది.  గర్వం తొలగి అణిగిపోయిన సరస్వతి  అలకానందా నదితో కలసి అంతర్వాహినిగా

ప్రవహిస్తోంది.  అలకానందతో

కలసే  ప్రదేశం అత్యంత రమణీయంగా వుంటుంది.

ఈ ప్రదేశానికి కేశవ ప్రయాగ అని పేరు. సరస్వతీ నదీ జలాలను మనం అక్కడ వున్న కుళాయిలలో పట్టుకొనవచ్చును. 


దీనికి పైన పాండవులు

స్వర్గారోహణ ప్రదేశం వున్నది. అక్కడ

"భీమ్ బుల్" 

అనబడే భీముని బండ ఒకటి వున్నది.  పాండవులు ఐదుగురు పాంచాలితో

స్వర్గారోహణం చేస్తున్నప్పుడు

మార్గమధ్యంలో తగిలే సరస్వతీ నదిని ద్రౌపది దాటలేనప్పుడు భీముడు

ఒక బండరాయిని వంతెనగా వేసినట్టు పురాణ కధ.

ఆ రాతి మీద భీముని హస్త చిహ్నాలు కనిపిస్తాయని

వ్రాసి వుంటాయి. ఒక్క  ధర్మరాజు తప్ప , మిగతా  ఐదుగురు తమ దేహాన్ని అక్కడే వదలివేయగా , ధర్మరాజు మాత్రం తన దేహంతో , ధర్మస్వరూపమైన యమధర్మరాజు  శునక రూపంతో

మార్గ దర్శి కాగా  పై లోకాలకు

వెళ్ళగలిగాడు.

వా‌రు వెళ్ళిన మార్గం , ఆ పర్వతారోహణ మెట్లు, సమున్నత

పర్వతమార్గం 

ఈనాటికీ  వున్నదని , ఆ ప్రదేశానికి చేరుకోవడం అత్యంత కఠినమని

చెప్తారు.  


ఈ *మనా* గ్రామమే

భారత దేశంలోని చివరి  

గ్రామం....💐🙏

ఖర్చు పెడితే పెరుగుతుంది,

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 అపూర్వః కోపి కోశోఽయం

విద్యతే తవ భారతి|

వ్యయతో వృద్ధిమాయాతి

క్షయమాయాతి సఞ్చయాత్||


   *-- నీతిశాస్త్రం --*


తా𝕝𝕝 అమ్మా సరస్వతీదేవి! 

నీ కోశాగారంలో ఉన్న విద్య (జ్ఞానము) అనే సంపద అపూర్వమైనది. అది ఖర్చు పెడితే పెరుగుతుంది, దాచుకుంటే/వాడకపోతే నిరుపయోగమవుతుంది.


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*

వాగీశ్వరీ పంచరత్నం "

 "వాగీశ్వరీ పంచరత్నం "


1)శ్రీ వాణీ శుభపాద పద్మయుగలే షచ్చాస్త్ర సాలంకృతే!!

సుశ్వేతాంబరధారణీచ సురసే శబ్దార్థ  సంశోభితే!!

నానా కావ్య సునాటకాది బహుభిర్విస్తీర్ణ సౌధాంతరే!!

సంగీతామృత వర్షిణి శృతిశిరే శ్రీభారతీం భావయే!!


2)అజ్ఞానార్ణవ తారిణీం స్మితముఖీం విజ్ఞానదీపాంకురాం!!

పద్మాంతస్థిత పద్మజస్య వనితాం పద్మాసనాం  పద్మినీం!!

సౌవర్ణాక్షర మాలినీం సురనుతాం సౌవర్ణ చేలాంచలాం!!

వీణాపుస్తక ధారిణీం సువరదాం శ్రీ భారతీం భావయే!!


3) మాన్యే మంత్రమయే మరాళగమనే మందస్మితే మంజులే!!

నానా రత్నమయ ప్రభాసమకుటే  క్షోణీశ సంపూజితే!!

వాణ్యై వారిజ లోచనీ సురుచిరే వాత్సల్య భావాన్వితే!!

దేవీ వర్ణమయీచ శాంతసుఖదే

శ్రీ భారతీం భావయే!!


4) రమ్యాం రమ్య గుణార్ణవాం రసమయీం రాకేందు బింబాననాం !!

శాంతాం శాస్త్రమయీచ శత్రుదమనాం శ్రీ శారదాం శర్మదాం !!

ఓం కార ప్రతిపాదినీమభయదామైంకార సంవాసినీం!!

ఆత్మజ్ఞాన కరీమనంత ఫలదాం శ్రీ భారతీం భావయే!!


5)వేద్యాం వేదమయీంచ వేదజననీం వేదాంతసారాం పరాం!!

మద్రసనాంతరవర్తినీం మణినిభాం మాధుర్యభావాన్వితాం!!

బ్రాహ్మీం బ్రహ్మబుధార్చితాం బహువిధాం బ్రాహ్మేశవిష్ణ్వాత్మికాం!!

వాగ్దేవీం విమలాం విరించిసహితాం శ్రీ భారతీం భావయే !!

రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*14-02-2024) / బుధవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


ఊహించని కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

---------------------------------------

వృషభం


కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

మిధునం


వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. 

---------------------------------------

కర్కాటకం


 ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

సింహం


సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి.

---------------------------------------

కన్య


ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆప్తులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. గృహ నిర్మాణ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

తుల


బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమౌతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

---------------------------------------

వృశ్చికం


ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

---------------------------------------

ధనస్సు


చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

---------------------------------------

మకరం


కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------

కుంభం


వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహారించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

---------------------------------------

మీనం


సోదరులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

*శ్రీ పంచమి

 🙏 🍁 *శ్రీ పంచమి / మదన పంచమి* 🍀 సందర్భంగా 👇


*ప్రార్థనా శ్లోకం* - 


*యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వితా*

*యావీణా వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా*

*యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిః దేవైః సదా వందితా*

*సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాఢ్యాపహా*


భావము:-

            *మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.*


              ఈ శ్లోకములో సరస్వతి దేవి ధరించినవన్నీ తెలుపులో వున్నాయి. తెలుపు సాత్విక గుణము. జ్ఞానము. తెల్లపువ్వు వలె, చంద్రునివలె,(తూషార)మంచు వలె, హారధవళ - ముత్యాలహారము. తెల్లని వస్త్రములు ధరించినది. తెల్లని పద్మములో ఆసీనురాలయినది, వీణ ధరించినది. సరస్వతి బొమ్మను పిల్లలకు చూపాలి.

సరస్వతి అనగా = చదువుల తల్లి.

సర+స్వ+తి= జ్ఞానము+మనలోని+ఇచ్చునది.

మనలో ఉన్న ఆ జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేస్తుంది.

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 22*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*వాసాంసి జీర్ణాని యథా విహాయ*

*నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।*

*తథా శరీరాణి విహాయ జీర్ణా*

*న్యన్యాని సంయాతి నవాని దేహీ ।।*



*భావము:* 

ఎలాగైతే మానవుడు, జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదే విధముగా జీవాత్మ, మరణ సమయములో పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును.

 

*వివరణ:*

 ఆత్మ స్వభానాన్ని వివరిస్తూ శ్రీ కృష్ణుడు పునర్జన్మ సిద్దాంతాన్ని, రోజూ మనం చేసే పని ద్వారా పునరుద్ఘాటిస్తున్నాడు. వస్త్రములు చిరిగిపోయి పనికిరాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము, కానీ ఈ ప్రక్రియ లో మనము మారిపోము. ఇదే విధముగా, ఒక దేహమును వదిలి మరోచోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ మార్పునకు లోను కాదు.

పునర్జన్మ ఉంటుందని నిరూపించటానికి 'న్యాయ దర్శన్' ఈ క్రింది వాదన ని చెపుతోంది.

జాతస్య హర్షభయశోక సంప్రతిపత్తేః (3.1.18)

మీరు చిన్న శిశువుని గమనిస్తే, ఏ పత్యేకమైన కారణం లేకుండానే, ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి విషాదంగా ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. 'న్యాయ దర్శన్' ప్రకారం, ఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకొంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ, అ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ గుర్తులు మనసులో బలంగా ముద్రింపబడటం వలన అవి గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి. అంతేకాక, జన్మ, మరణ ప్రక్రియలు ఆత్మ కి చాలా బాధాకరమైనవి కనుక అవి పూర్వ జన్మ స్మృతులను చాలా మటుకు తుడిచివేస్తాయి.

'న్యాయ దర్శనము' పునర్జన్మ కి మద్దతుగా ఇంకొక వాదనని పేర్కొంటోంది. స్తన్యాభిలాషాత్ (3.1.21) . అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు, తల్లి తన బిడ్డకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలి? కానీ, అప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వ జన్మలలో, జంతు జన్మలలో ఆయా తల్లుల స్తనాలు, పొదుగుల నుండి కూడా చనుబాలు తాగివుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతస్సిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలుపెడుతుంది.

పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోకపొతే, మనుష్యుల మధ్య ఉన్నఅసమానతన అనేది, కారణం చెప్పడానికి వీలు కాకుండా, అసంబద్దంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డి వాడు అనుకోండి. ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే, తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి? ఒకవేళ మనము అతని కర్మ వలన ఇలా జరిగింది అంటే, అతను ఈ ప్రస్తుత జన్మ యే తన ఏకైక జన్మ అని, కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాత కర్మలు ఏమీ లేవని వాదించచ్చు. ఒకవేళ అది దేవుని సంకల్పము అంటే, అది కూడా నమ్మశక్యంగానిదే, ఎందుకంటే భగవంతుడు పరమ దయ కలవాడు, నిష్కారణముగా ఎవ్వడూ గుడ్డి వాడిగా ఉండాలని కోరుకోడు. కాబట్టి తర్కబద్ధ (logical) వివరణ ఏమిటంటే అతను తన పూర్వ జన్మ కర్మ ల ఫలితంగా గుడ్డి వాడిగా పుట్టాడు. అందువలన, సహజవివేకము మరియు వైదిక గ్రంధముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే.


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీ మహారాణి శివ్ మందిర్

 🕉 మన గుడి : నెం 727


⚜ జమ్మూకాశ్మీర్  : బారాముల్లా


⚜ శ్రీ మహారాణి శివ్ మందిర్ 



💠 మనం కాశ్మీర్ గురించి ఆలోచించినప్పుడల్లా ఈ ప్రాంతం యొక్క సంప్రదాయాలు మరియు సంస్కృతిని ఇస్లామిక్ మతంతో అనుసంధానిస్తాము. 

అయినప్పటికీ, కాశ్మీర్ రాష్ట్రంలో హిందువులు, క్రైస్తవులు మరియు సిక్కులు కూడా విభిన్న జనాభాను కలిగి ఉన్నారు. 


💠 కాశ్మీర్ శైవం లేదా మరింత ఖచ్చితంగా త్రిక శైవం అనేది శైవ-శక్త తంత్రం యొక్క  సంప్రదాయాన్ని సూచిస్తుంది, ఇది 850 సంవత్సరల ముందు ఉద్భవించింది. 

ఈ సంప్రదాయం కాశ్మీర్‌లో చాలా ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, దీనిని తరచుగా కాశ్మీర్ శైవిజం అని పిలుస్తారు


💠 శైవ ఆగమాలు మరియు శైవ మరియు శక్తి తంత్రాల వంటి అనేక శైవ గ్రంథాల నుండి త్రిక తీసుకోబడినప్పటికీ, దాని ప్రధాన గ్రంథాలు మాలినీవిజయోత్తర తంత్రం, సిద్ధయోగేశ్వరిమాత మరియు అనామక-తంత్రం వంటివి. 


💠 ఈ ఆలయం శివుడు మరియు పార్వతికి అంకితం చేయబడింది.

జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని బారాముల్లా జిల్లాలోని ఫతేఘర్ గ్రామంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఆలయం ఇది


💠 "రాణి ఆలయం" లేదా "మహారాణి ఆలయం" అని కూడా పిలుస్తారు, ఇది గుల్మార్గ్ మధ్యలో ఒక చిన్న కొండపై ఉంది. 

గుల్మార్గ్ నలుమూలల నుండి ఈ రాజ దేవాలయం చూడదగినది.  


💠 మోహినేశ్వర్ శివాలయ అని కూడా పిలువబడే మహారాణి ఆలయాన్ని కాశ్మీర్ మాజీ పాలకుడు మహారాజా హరి సింగ్ (చివరి రాజు) భార్య మోహినీ బాయి సిసోధియా నిర్మించారు.

మహారాణి మోహినీ బాయి సిసోడియా ఇక్కడ స్థిరంగా ప్రార్థనలు చేసేవారు, అందువల్ల ఈ ఆలయానికి ఆమె పేరు పెట్టారు.


💠 ఇది చతురస్రాకార గర్భగుడితో శిథిలమైన పురాతన దేవాలయం.  

 గర్భగుడిలోని వేదికపై చాలా పెద్ద శివలింగం యొక్క భాగం కనుగొనబడింది.  ఈ ఆలయం 9వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు


💠 ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలో ఉంది.  

ఆలయ ప్రాంగణం 47 అడుగుల చదరపు. 

ఈ ఆలయం నల్లరాళ్లతో నిర్మించబడింది, వీటిలో కొన్ని 12 అడుగుల పొడవు మరియు 4 అడుగుల ఎత్తును కలిగి ఉంటాయి.  

ప్రధాన ఆలయం లోపలి వైశాల్యం 29 అడుగుల చదరపు.  ఇక్కడ భారీ శివలింగం ఉంచబడింది.  

బ్రౌన్ స్టోన్‌తో చేసిన శివలింగం రెండు వైపులా చెక్కడంతో త్రవ్వకాలలో కనుగొనబడింది. 

 ఒక వైపున మూడు తలలతో శివుని చెక్కడం మరియు మరొక వైపు శివుని భైరవ రూపాన్ని సూచిస్తుంది.


💠 మోహినేశ్వర్ శివాలయ అని కూడా పిలువబడే మహారాణి ఆలయాన్ని 1915లో కాశ్మీర్ మాజీ పాలకుడు మహారాజా హరి సింగ్ (కాశ్మీర్ చివరి రాజు) భార్య మోహినీ బాయి సిసోధియా నిర్మించారు. 

మోహినీ బాయి సిసోధియా ధరంపూర్ మహారాజా మోహన్‌దేవ్ కుమార్తె. 

చివరి డోగ్రా రాజు గుల్‌మార్గ్‌లో తన రాజభవనంలో గడుపుతున్నప్పుడు, ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని రాణి శివుడిని పూజించడానికి ఇక్కడికి వచ్చేది.  నిజానికి, ఆమె నెలల తరబడి ఇక్కడే ఉండి, ఈ ఆలయంలో శివుని పూజించింది.


💠 మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, భగవత్గీత మరియు ఖురాన్ రెండింటిలో జ్ఞానం పొందిన

గులాం మొహమ్మద్ అనే ముస్లిం వ్యక్తి, అతను దాదాపు 30 సంవత్సరాలుగా ఆలయాన్ని సంరక్షకుడిగా ఆలయ బాధ్యతలు చూస్తున్నాడు. 


 💠 భక్తులు ఏడాది పొడవునా ఆలయాన్ని సందర్శించవచ్చు, అయినప్పటికీ ఆలయ సంగ్రహావలోకనం పొందడానికి ఉత్తమ సమయం మహా శివరాత్రి సమయంలో. సందర్శకులపై కొన్ని పరిమితులు విధించబడ్డాయి మరియు ఆలయ ప్రాంగణంలోని ఆయుధాలు, కెమెరాలు, తోలు వస్తువులు లేదా మద్యం అనుమతించరు.


💠 ఆలయ పరిస్థితి అప్పటికే బాగా క్షీణించింది. ఇక్కడ ఆలయ పునరుద్ధరణను భారత సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. 


💠 "జై జై శివ శంకర్, కాంత లగే నా కంకర్, కే ప్యాలా తేరే నామ్ కా పియా..జై జై శివ శంకర్...". కాశ్మీర్‌లోని సిల్వాన్ సెట్టింగ్‌లలో చిత్రీకరించబడిన ఈ అందమైన పాటను బహుశా పాత సినిమాల అభిమాని మరచిపోలేరు. 

రాజేష్ ఖన్నా మరియు ముంతాజ్ నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ "ఆప్ కి కసమ్"లోని పాటను గుల్మార్గ్‌లో చిత్రీకరించారనే విషయం చాలా మందికి తెలియదు. 

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని డోగ్రా రాజుల రాజ దేవాలయం అయిన ప్రసిద్ధ చారిత్రాత్మక శివాలయం వెలుపల చిత్రీకరించబడింది.



💠 ఆలయం ప్రతిరోజూ ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.  భక్తులకు రోజుకు రెండుసార్లు హారతి నిర్వహిస్తారు.


 

💠 ఈ ఆలయం బారాముల్లా బస్టాండ్ నుండి 10 కి.మీ.,  బారాముల్లా రైల్వే స్టేషన్ నుండి 15 కి.మీ, అలాగే శ్రీనగర్ నుండి 64 కి.మీ.ల దూరంలో ఉంది.



© Santosh Kumar

ఆభరణాలుగా మారతాయి

 శ్లోకం:☝️

*పితృభిః తాడితః పుత్రః*

 *శిష్యస్తు గురుశిక్షితః ।*

*ధనాహతం సువర్ణం చ*

 *జాయతే జనమణ్డనమ్ ॥*


భావం: తండ్రి చేత క్రమశిక్షణలో పెట్టబడిన కొడుకు, గురువు చేత శిక్షించబడిన శిష్యుడు మరియు సుత్తితో కొట్టబడిన బంగారం - ఈ మూడూ (భవిష్యత్తులో) ప్రజలలో ఆభరణాలుగా మారతాయి.

పంచాంగం 14.02.2024

 ఈ రోజు పంచాంగం 14.02.2024 Wednesday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు మాఘ మాస శుక్ల పక్ష: పంచమి తిధి సౌమ్య వాసర: రేవతి నక్షత్రం శుభ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పంచమి మధ్యాహ్నం 12:13 వరకు.

రేవతి పగలు 10:46 వరకు.

సూర్యోదయం : 06:47

సూర్యాస్తమయం : 06:14


వర్జ్యం : ఈ రోజు లేదు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:08 నుండి 12:53 వరకు తిరిగి.


అమృత ఘడియలు : పగలు 08:33 నుండి 10:01 వరకు తిరిగి రాత్రి 02:39 నుండి 04:10 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: పగలు 07:30 నుండి 09:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

*సలహా..సంతానం

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సలహా..సంతానం..*


శ్రీ మీరాశెట్టి గారు నిరంతరమూ శ్రీ స్వామివారి మందిర అభివృద్ధి గురించే ఆలోచించేవారు..ఆ విషయమై తరచూ మొగలిచెర్ల కు వచ్చి మా తల్లిదండ్రులైన శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లతో చర్చిస్తూ వుండేవారు..ఆ క్రమం లోనే వారితో నాకు చనువు బాగా ఏర్పడింది..


వింజమూరు లో వుండే శ్రీ గంగిశెట్టి కామేశ్వరరావు కు వివాహం జరిగి ఏడెనిమిది సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలుగలేదు..అతనూ శ్రీ మీరాశెట్టి గారికి దగ్గర బంధువేనన్న సంగతి నిన్ననే మనం చదువుకొని వున్నాము..ఒకసారి మీరాశెట్టి గారు, కామేశ్వరరావు దంపతులు అందరూ కలిసి శివరాత్రి పర్వదినానికి ఒక రోజు ముందుగా  మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి రావడం జరిగింది..ప్రతి శివరాత్రి రోజు, శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉన్న ఆర్యవైశ్య సత్రం తరఫున అన్నదానం చేయడం పరిపాటి..ఆ సేవా కార్యక్రమంలో అందరినీ మీరాశెట్టి గారు భాగస్వామ్యులుగా చేర్చేవారు..ఆ పనుల నిమిత్తమే కామేశ్వరరావు దంపతులూ వచ్చారు..


ఆరోజు మధ్యాహ్నం.. ఆర్యవైశ్య సత్రం లో అందరూ కూర్చుని ఉండగా..కామేశ్వర రావు తో మీరాశెట్టి గారు, " సంతానం కలగాలని శ్రీ దత్తాత్రేయస్వామి వారిని వేడుకోరా..ఆయన తప్పక కరుణిస్తాడు..నీకు త్వరలో పిల్లలు పుడతారు.." అని చెప్పారు..

"ఆ యోగం నాకు లేదేమో పెదనాయనా.." అన్నాడు కామేశ్వర రావు.."అట్లా అనవద్దు..మీ దంపతులు ఇంతవరకూ ఈ స్వామిని వేడుకోలేదు..ఇప్పుడు మనస్ఫూర్తిగా వేడుకోండి.. తప్పక సంతానం కలుగుతుంది..నా మాట నమ్ము.." అని గట్టిగా చెప్పారు..ఈ సంభాషణ అంతా వింటున్న శ్రీ చెక్కా కేశవులు గారు కూడా..కామేశ్వర రావు తో స్వామివారిని వేడుకోమని సలహా ఇచ్చారు..కామేశ్వర రావు తన భార్య వైపు చూసాడు..ఆవిడ ఏదో పని ఉన్నదానిలా చటుక్కున లేచి, బైటకు వెళ్ళిపోయింది..


కొద్దిసేపటికి, కొంతమంది ఆడవాళ్లు కామేశ్వర రావు వద్దకు వచ్చి.."అయ్యా..మీ భార్య స్వామివారి మందిరం లో పెద్ద పెద్ద కేకలు పెడుతున్నది.. జుట్టు విరబోసుకొని మందిరం అంతా తిరుగుతున్నది..నువ్వు వెంటనే మందిరం లోకి వెళ్ళు.." అని చెప్పారు..కామేశ్వర రావు పరుగులాటి నడకతో శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..అతను వచ్చేసరికి, ఒక పెద్ద బండరాయిని నెత్తిన పెట్టుకొని, కామేశ్వర రావు భార్య..మందిరం చుట్టూ పరుగెడుతూ.."దత్తాత్రేయా..నేను ఉండలేను..నేను ఈ అమ్మాయిని వదిలి పోతానూ.." అంటూ కేకలు వేస్తోంది..కామేశ్వర రావు కేమీ అర్ధం కాలేదు..తన భార్య ఎన్నడూ ఇటువంటి విపరీత ప్రవర్తన తో వుండలేదు..ఈరోజు ఏమి జరిగింది?..ఉన్నట్టుండి ఈ ఉపద్రవం ఏమిటి?..సంతానం కోసం, తామిద్దరూ శ్రీ స్వామివారిని మొక్కుకోవాలని అనుకుంటుంటే..ఈలోపల ఈవిడ ఈవిధంగా మారిపోయిందేమిటి?..అని ఆలోచించ సాగాడు..మరి కొద్దిసేపటికే ఆమె లో ఉన్న ఉన్మాదం తగ్గి, మామూలు మనిషిగా మారింది..భార్యను తీసుకొని, శ్రీ స్వామివారి సమాధి వద్దకు వచ్చి.."స్వామీ..నా భార్య లోని ఈ జబ్బును తగ్గించు తండ్రీ..ఆ తరువాత..మేమిద్దరమూ నీ దగ్గరకు వచ్చి..సంతానం గురించి మ్రొక్కుకుంటాము.." అని వేడుకున్నాడు..


"ఒరే కామేశ్వర రావూ..ఈరోజు జరిగింది నీ మంచికేరా.. ఆ అమ్మాయిలో ఉన్న దుష్ట గ్రహం..ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోయింది..ఇంక నువ్వేమీ బాధపడనక్కరలేదు..ఇద్దరూ తలారా స్నానం చేసి..మీకు సంతానం కలిగితే..నీకు తోచినంత హుండీలో వేస్తానని మొక్కుకో..ఖచ్చితంగా పిల్లలు పుడతారు.." అని మీరాశెట్టి గారు చెప్పారు..


కామేశ్వర రావు దంపతులు మీరాశెట్టి గారు చెప్పినట్లే చేశారు..తమకు సంతానం కలిగితే..సమాధి వద్ద  మీద పదివేల రూపాయలు పెడతానని కామేశ్వర రావు మ్రొక్కుకున్నాడు..మరో మూడు నెలల కల్లా కామేశ్వర రావు భార్య నెల తప్పింది..మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది..అమ్మాయికి "నాగ దత్త కల్యాణి" అని పేరు పెట్టుకున్నారు..ఆ అమ్మాయి వివాహం తాలూకు శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన కామేశ్వర రావు ఆనాటి అనుభవాన్ని మాతో మరొక్కసారి పంచుకున్నాడు..తమకు రెండవ సంతానం గా మొగపిల్లవాడు కావాలని శ్రీ స్వామివారినే వేడుకున్నామని..ఆ స్వామివారు ఆ కోరిక కూడా తీర్చాడని..అత్యంత భక్తి తో ఆ దంపతులు చెప్పుకొచ్చారు..మీరాశెట్టి గారిచ్చిన సలహా తమ జీవితం లో ఎంతో విలువైనది అని అంటుంటారు కామేశ్వర రావు దంపతులు..


సర్వం..

శ్రీ దత్తకృప!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం -‌ పంచమి - రేవతి -‌ సౌమ్య వాసరే* (14.02.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*