🎻🌹🙏🌲సరస్వతీ నది🌳
సరస్వతీ నది అలహాబాద్ వద్ద త్రివేణి సంగమంలో
అదృశ్యంగా కలుస్తుందని
ఐహీకం. సరస్వతీ నది
ఆవిర్భవించిన స్ధలం బదరీనాధ్ సమీపాన కల
భారతదేశంలో ని చివరి గ్రామమైన మనా. టిబెట్
సరిహద్దునకు 3 కి.మీ దూరంలో వున్నది.
సరస్వతీ నది ప్రవేశ ద్వారం మనా గ్రామంలో వున్నది.
వేద వ్యాసుడు చెప్తుండగా
గణేశుడు వ్రాసిన మహాభారత కావ్యంలో పంచపాండవులు స్వర్గారోహణానికి బయలుదేరినది మనా గ్రామం నుండేనని తెలుస్తోంది.
ఇటువంటి అతి ప్రాచీన విశేషాలు గురించి చదివినా , విన్నా మన శరీరం కుతూహలం తో పులకిస్తుంది.
పర్వత శ్రేణులలో
ప్రవహించే అలకానంద
అందం మనల్ని మైమరిపిస్తుంది.
ప్రకృతి పచ్చదనాలతో నిండిన మనా గ్రామ మార్గమంతా
స్వెట్టర్ లు , చలి టోపీలు
అమ్మే దుకాణాలు, టీ హోటళ్ళు వున్నాయి.
చలి ఎక్కువగా వుండడం వలన వేడి వేడి టీ తోనే ఎక్కువ కాలం గడుపుతారు.
ఆ గ్రామ మహిళలు
తమ భుజం వెనకాల
బుట్టలలో పిల్లలను , వయోవృధ్ధులనే కాకుండా గ్యాస్
సిలిండర్ లను కూడా మోసుకుంటూ
వెళ్ళడం చూసే వారికి
ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
వీరికి ఆరోగ్యాన్ని యిచ్చేది అక్కడి ప్రకృతియే.
ఇక్కడకు వచ్చే పర్యాటకులు ముందుగా
గజముఖ వినాయకుని గుహను దర్శిస్తారు.
వ్యాసభగవానుని ప్రార్ధనను
మన్నించి , వినాయకుడు
భారతం వ్రాసిన ప్రదేశం యిదే.
అది కూడా తన దంతాన్ని
ఊడపెరికి ఘంటంగా
ఉపయోగించి వ్రాశాడు.
గుహలో దర్శనమిచ్చేది ఆ
వినాయకుడే అని చెపుతారు.
గుహలో వొంగుని వినాయకుని దర్శించి
వ్యాసగుహకి వెడతారు
భక్తులు.
మహాభారతం వ్రాసిన పిదప వేదవ్యాసుడు మనో చాంచల్యంతో వున్న సమయాన , నారదుని
బోధతో , మానవజన్మ
మోక్షానికి భాగవతం వ్రాసినగుహ గా కూడా భక్తులు ధృఢంగా
నమ్ముతారు. ఈ గుహ
5300 సంవత్సరాలకన్నా
ప్రాచీనమైనదిగా చెప్తారు.
ఇక్కడ, వినాయకుడు
శుకుడు , వల్లభాచార్యుల
పురాతన శిల్పాలు దర్శనమిస్తాయి.
మహాభారతం యొక్క ఎనిమిది తాళపత్రగ్రంధాలు ఒక
అద్దాల పెట్టెలో పెట్టి పూజించ బడుతున్నాయి.
ఇక్కడే రెండు కొండలమధ్యనుండి ఉరుకు పరుగులతో నురగలు క్రక్కుతూ పెద్ద పెద్ద అలలతో సరస్వతీనది
ప్రవహిస్తూంటుంది. అత్యంత
వేగంతో ప్రవహించే ఆ అలల శబ్దంలో
ఓంకార నాదం వినిపిస్తుంది .
అతి ప్రశాంతమైన వాతావరణంలో
అథఃపాతాళంలో
సరస్వతీనది జన్మస్ధానం వున్నది. మహా ఉధృతంగా
ఆవేశంతో,
కళ్ళని కట్టివేసే శ్వేత వర్ణంతో
సరస్వతీనది భ్రమింప చేస్తుంది.
సరస్వతీనది బాహ్యంగా మాయమవడానికి గల కారణం ఒక
కుతూహలమైన
గాధ.
మహాభారత గ్రంధం వ్రాయడంలో
నిమగ్నుడైన వినాయకుడు.. అతివేగంగా మహాశబ్దంతో ప్రవహించే సరస్వతి నదిని ప్రశాంతంగా వుండమని
ఆదేశించాడు. కాని సరస్వతీ నది ఆహంకారంతో తన
ప్రవాహ వేగాన్ని మరింత పెంచుకుని యింకా
శబ్దాన్ని న
పెంచుకుంటూ ప్రవహించసాగింది.
వినాయకుడు కోపంతో ,
" ఓ నదీ నీవు నామరూపాలు
లేకుండా అదృశ్యమైపోతావు" అని
శపించాడు.
తన తప్పును తెలుసుకున్న సరస్వతీ నది, తనని మన్నించమని కోరింది. అప్పుడు ,
గజముఖుడు ఆ నది మీద దయ తలచి, " ఓ
సరస్వతీ ! యికపైన
నీవు ఇక్కడ మరుగుననే ప్రవహిస్తూ
గంగా , యమునలు సంగమించే ప్రదేశాలలో
మూడవ నదిగా ప్రవహించి
కీర్తి పొందుతావు అని అనుగ్రహించాడు.
అందువలన, అలహాబాద్, గుప్తకాశి, ఋషీ కేష్
గంగా, యమునలు కలసిన స్ధలాలు త్రివేణీ సంగమాలుగా
ప్రఖ్యాతి గాంచాయి.
ఇక్కడ సమీపముననే సరస్వతీ నదికి
చిన్న గుహాలయం వున్నది. గర్వం తొలగి అణిగిపోయిన సరస్వతి అలకానందా నదితో కలసి అంతర్వాహినిగా
ప్రవహిస్తోంది. అలకానందతో
కలసే ప్రదేశం అత్యంత రమణీయంగా వుంటుంది.
ఈ ప్రదేశానికి కేశవ ప్రయాగ అని పేరు. సరస్వతీ నదీ జలాలను మనం అక్కడ వున్న కుళాయిలలో పట్టుకొనవచ్చును.
దీనికి పైన పాండవులు
స్వర్గారోహణ ప్రదేశం వున్నది. అక్కడ
"భీమ్ బుల్"
అనబడే భీముని బండ ఒకటి వున్నది. పాండవులు ఐదుగురు పాంచాలితో
స్వర్గారోహణం చేస్తున్నప్పుడు
మార్గమధ్యంలో తగిలే సరస్వతీ నదిని ద్రౌపది దాటలేనప్పుడు భీముడు
ఒక బండరాయిని వంతెనగా వేసినట్టు పురాణ కధ.
ఆ రాతి మీద భీముని హస్త చిహ్నాలు కనిపిస్తాయని
వ్రాసి వుంటాయి. ఒక్క ధర్మరాజు తప్ప , మిగతా ఐదుగురు తమ దేహాన్ని అక్కడే వదలివేయగా , ధర్మరాజు మాత్రం తన దేహంతో , ధర్మస్వరూపమైన యమధర్మరాజు శునక రూపంతో
మార్గ దర్శి కాగా పై లోకాలకు
వెళ్ళగలిగాడు.
వారు వెళ్ళిన మార్గం , ఆ పర్వతారోహణ మెట్లు, సమున్నత
పర్వతమార్గం
ఈనాటికీ వున్నదని , ఆ ప్రదేశానికి చేరుకోవడం అత్యంత కఠినమని
చెప్తారు.
ఈ *మనా* గ్రామమే
భారత దేశంలోని చివరి
గ్రామం....💐🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి