20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

కాలక్షేపో న కర్తవ్యః

 శ్లోకం:

కాలక్షేపో న కర్తవ్యః క్షీణమాయుర్దినే దినే 

యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనమ్ 

భావం:

కాలక్షేపో న కర్తవ్యః: కాలాన్ని వృధా చేయడం ఏమాత్రం తగదు.

క్షీణమాయుర్దినే దినే: 

సూర్యోదయ, సూర్యాస్తమయాలతో మన ఆయుష్షు ప్రతిరోజూ క్షీణిస్తూనే ఉంది.

యమస్య కరుణా నాస్తి:

మృత్యువుకు

 (యముడికి) ఏమాత్రం జాలి, కరుణ ఉండవు. వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా ప్రాణాలు తీసుకెళ్ళవచ్చు.

కర్తవ్యం హరికీర్తనమ్:

కాబట్టి, ఆ సమయం రాకముందే భగవంతుని నామాన్ని స్మరించడం, కీర్తించడం మన ప్రధాన కర్తవ్యం కావాలి.

విశేషం:

ఈ శ్లోకం మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని గుర్తుచేస్తుంది. 

లోకంలో అన్నీ వాయిదా వేయవచ్చు కానీ, భగవన్నామ స్మరణను మరియు మంచి పనులను వాయిదా వేయకూడదు. 

"రేపు చేద్దాం" అనుకున్న పని చేసేలోపే యముడు తలుపు తట్టవచ్చు, అందుకే "ఇప్పుడే, ఇక్కడే" హరి నామాన్ని స్మరించాలని పెద్దలు చెబుతారు.

Please join us in Jagathguru Bharathi theertha vani WhatsApp group by the following link:

https://chat.whatsapp.com/DLG1Aegdmdi9JDobpIlYEH?mode=wwt

పున్నె మదెంతొ ప్రోవుబడ

 ఉ॥

పున్నె మదెంతొ ప్రోవుబడ మొల్కల నెత్తును భక్తితత్త్వమై 

యెన్నియొ జన్మలెత్తినను నింతయు యత్నము లేక తానుగా 

క్రొన్ననలెత్త దేరికిని కోరి ప్రయత్నత దైవమందు నా 

కొన్నమనోరథమ్ము నొనగూర్చుకొనన్వలె భక్తిగోరుచున్ 

ఉ॥

అమ్మనొ యయ్యనో సుతునొ యన్ననొ యర్కునొ లచ్చిగేస్తునో 

మన్నన యొప్పగా గొలిచి మర్త్యులు ముక్తినిబొంద మార్గమున్ 

పన్నుగ నాదిశంకరులు వర్తిల జేసిరి గాన ధీమతుల్ 

తిన్నగ నొక్కటం గొనుడు తృప్తి భజించుడు భక్తినెమ్మెయిన్ 

*ఉ॥

*~శ్రీశర్మద*~శ్రీశర్మద*

జపం చేస్తే ఫలితం

  జపం చేస్తే ఫలితం......!! 

జపం :

ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది. నదిలో చెసే జపం రెట్టింపు ఫలాన్నిస్తుంది. గోశాలలో జపం వందరెట్లు,యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది . పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితము. శివ సాన్నిద్యంలో జపం చెస్తే అనంతమైన ఫలాన్నిస్తుంది.

అలాగే ఇతర జప ఫలితములు (వివిధ ఆసనములపై) :-

వెదురు తడకపై కూర్చునిచేస్తే - దారిద్ర్యము

రాతిపై కూర్చునిచేస్తే - రోగాలు,

నేలపై కూర్చునిచేస్తే - ధుఖము,

 కొయ్యపీటపై-దౌర్భాగ్యము ,

గడ్డితో చేసిన చాపపై - చిత్తచాపల్యము కలుగుతాయి.

జింక చర్మము పై కూర్చునిచేస్తే- జ్ఞానసిద్ధి

వ్యాఘ్ర చర్మం(పులి తోలు)- మోక్షము

వస్త్రాసనం మీద- ధన సమృద్ధి

పేముతో అల్లిన ఆసనం - రోగ నివారణము కలుగును.

ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై జపము చేసిన పుష్టిని కలుగిస్తుంది.

కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు. జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు మంత్రమును ‘పునఃపునః’ ఉచ్చరించజపం చేస్తే ఫలితం......!! 

జపం :

ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది. నదిలో చెసే జపం రెట్టింపు ఫలాన్నిస్తుంది. గోశాలలో జపం వందరెట్లు,యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది . పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితము. శివ సాన్నిద్యంలో జపం చెస్తే అనంతమైన ఫలాన్నిస్తుంది.

అలాగే ఇతర జప ఫలితములు (వివిధ ఆసనములపై) :-

వెదురు తడకపై కూర్చునిచేస్తే - దారిద్ర్యము

రాతిపై కూర్చునిచేస్తే - రోగాలు,

నేలపై కూర్చునిచేస్తే - ధుఖము,

 కొయ్యపీటపై-దౌర్భాగ్యము ,

గడ్డితో చేసిన చాపపై - చిత్తచాపల్యము కలుగుతాయి.

జింక చర్మము పై కూర్చునిచేస్తే- జ్ఞానసిద్ధి

వ్యాఘ్ర చర్మం(పులి తోలు)- మోక్షము

వస్త్రాసనం మీద- ధన సమృద్ధి

పేముతో అల్లిన ఆసనం - రోగ నివారణము కలుగును.

ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై జపము చేసిన పుష్టిని కలుగిస్తుంది.

కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు. జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు మంత్రమును ‘పునఃపునః’ ఉచ్చరించటము.  

🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻టము.  

🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

    శ్లో𝕝𝕝   *శకటం పంచ హస్తేషు* 

            *దశహస్తేషు వాజినం* |

            *గజం హస్తసహస్రేషు* 

            *దుష్టం దూరేణ వర్జయేత్* ||

తా𝕝𝕝 *బండికి అయిదు మూరల దూరములోను, గుర్రానికి పదిమూరల దూరములోను, ఏనుగుకు వేయి మూరల దూరములోను, ఉండవచ్చును......*

*కానీ? దుష్టునకు కొన్ని యోజనముల దూరములో ఉండుట శ్రేయష్కరము...*

  👉 *తెలుగు పద్యము :* 👇

కం॥

*బండిని బారెడు దవ్వుల !* 

*నిండుగ గుఱ్ఱంబు నేడు !* 

*నికరపు బారల్ మెండుగ హస్తిని విడువుము !* 

*కొండొక దుష్టునకు లేదు కొలమానమున్ !* 

*భావము :* 

*బండిని బారెడు దూరమున వదలవలె ! గుఱ్ఱమును ఏడు బారల దూరమున వదలవలె ! ఏనుగును ఎక్కువ బారల దూరమున వదలవలె ! దుష్టుని ఎంత దూరమున వదలవలెనను కొలత కొలమానము నందేలేదు! అని భావము దుష్టుడు ఎంత ప్రమాద కారియో గదా !* 

✍️🌹💐🌸🙏

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము

* 656 వ రోజు*

యజ్ఞ సమాన పుణ్యములు

ధర్మరాజు " పితామహా ! యజ్ఞములు చేయవలెనని మీరు అనేకమార్లు చెప్పారు కాని యజ్ఞములు చెయ్యడానికి ఎంతో ధనము కావాలి కదా ! మరి యజ్ఞములు చేయలేని వారి సంగతి ఏమిటి ? వారు ఎలాంటి పుణ్యకర్మలు ఆచరించాలి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అందరికీ యజ్ఞములు యాగములు అందరికీ సాధ్యం కాదు కనుక అంగీరసుడు ఉపవాస వ్రతం ఉపదేశించాడు. ఉపవాస వ్రతం చెయ్యడం కష్టమని కదా యజ్ఞముల గురించి అడిగావు. ఉపవాసము చెయ్యడంలో తేలికైన విధము చెప్తాను విను. రోజుకు రెండు సార్లు అనగా పగటి పూట ఒక సారి రాత్రి పూట ఒక సారి మాత్రమే భోజనము చేసి భోజన సమయంలో మాత్రమే నీరుత్రాగి మధ్యలో ఏమీ తినకుండా త్రాగకుండా ప్రతి రోజు అగ్నిని ఆరాధించే వారు ఉపవాస వ్రతము ఆచరించినట్లేనని పెద్దలు చెబుతారు. ఇది కూడా ఆచరించండం కష్టమని తలచిన అంగీరసుడు చెప్పిన మిగిలిన ఉపవాసవ్రతములు ఆచరించవచ్చు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

శ్రీకృష్ణుని తత్వము

ధర్మరాజు " పితామహా ! శ్రీకృష్ణుడు జ్ఞానప్రతీక అంటారు కదా ! ఆయన బోధనలు నాకు వినవలెనని కోరిక కలుగుతుంది. కనుక శ్రీకృష్ణతత్వము నాకు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు హర, సనత్కుమార సంవాదానాన్ని వివరిస్తాను. పూర్వము ఒక కోరికతో పరమశివుడు సనత్కుమారుడి వద్దకు వెళ్ళాడు. పరమశివుడికి సనత్కుమారుడు అతిథి మర్యాదలు చేసి సత్కరించాడు. పరమ శివుడు కొన్ని సందేహాలు తోర్చమని సనత్కుమారుడిని అడిగాడు. సనత్కుమారుడు అది తన భాగ్యమని చెప్పాడు. శివుడు " మహాత్మా ! ధ్యానముతో దర్శింపతగిన వస్తువేది ? తత్వములు ఎన్ని ? సాంఖ్యము యోగము వాటి తత్వములు ఎన్ని ? సాంఖ్యము యోగము వాటి తత్వములు ఏవి ? ఇంకా ఆధ్యాత్మిక విషయములను వివరించు " అని అడిగాడు. సనత్కుమారుడు " మహాశివా ! తత్వములు 24 అని కొందరు, 23 అని కొందరు, 25 అని కొందరు అంటారు. ప్రాకృతులు 23 అంటారు. వారు మనస్సు బుద్ధి ఒకటే అని అంటారు. అది సరి కాదు. పరిశుద్ధమైన 24 అనే వారు పరిశుద్ధమైన మనసే బుద్ధి అంటారు. నేను మాత్రము 25వ తత్వము ఉంది అని నమ్ముతాను. అదే అధిష్ఠానము. 24 తత్వములు 25వ తత్వములో లీనమైఉంటాయి. కనుక 24 తత్వాలు ఉన్నాయనడము, లేవు అనడము అంటారు. రెండూ సంభవమే. ఈ లోకములో పంచభూతములు ఐదు. వాటి గుణములు అయిదు. ఇంద్రియములు పది. ఇవి కాక బుద్ధి, మనసు, అహంకారము, ప్రకృతి కలిపి మొత్తము 24. ఈ 24 నాలుగు తత్వములను అధిష్ఠించి ఉండేది 25వ తత్వము. బాగా తెలిసిన వాడు 24 తత్వములు కూడినది దేహము అని అంటారు. 25వ తత్వమైన పరమాత్మ కట్టెలో నిప్పు దాగి ఉన్న చందాన శరీరమంతా ఆవహించాడు. కాని మానవుడితో ఉన్న సజమైన ఈర్ష్య, అసూయ, దురభిమానము ఈ జ్ఞానమును అంట నీయదు. నేను నాది అనుకుంటూ నిత్యమూ ఈ దేహమే తానని భ్రమిస్తూ సంసారంలో తిరుగుతుంటాడు. వేదము పరమాత్మతత్వము, బ్రహ్మమును గురించి తెలియజేస్తుంది. దానిని అమృతత్వ తత్వము అంటారు. అమృతత్వతత్వము అన్ని తత్వములకంటే మేలైనది. దానిని ఎరిగిన వాడు మృత్యుంజయుడు ఔతాడు. అది తత్వములక్కన్నింటికీ ఈశ్వరుడు. ఇంతకు మించిన ఈశ్వరుడు లేడు. ఇది సత్యము నిత్యము రహస్యము. పరమశివా ఈ తత్వములు పైనుండి కిందకు వచ్చిన సృష్టి, కింద నుండి పైకి వెళ్ళిన లయము అంటారు. వీటన్నింటినీ దాటన్నింటినీ దాటి బ్రహ్మపదము చేరడమే ఏకత్వము అంటారు. శ్రద్ధలేని వాడికి, మనసులో ఏకాంతత లేని వాడికి, ఇంద్రియములను జయించని వాడికి, వేదాధ్యయనము చేయని వాడికి ఈ జ్ఞానము సిద్ధించదు.

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్ర*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*హం పొందండి*

శ్రీ మల్లికార్జునర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1393

⚜  తమిళనాడు : ధర్మపురి

⚜  శ్రీ మల్లికార్జునర్ ఆలయం

💠 భారతదేశంలోని తమిళనాడులోని ప్రతి ప్రాంతానికి దాని స్వంత ఈశ్వరన్ కోయిల్ ఉంది, ధర్మపురిలో, అటువంటి ఈశ్వరన్ కోయిల్‌ను మల్లికార్జునేశ్వర ఆలయం అని పిలుస్తారు .

 దీనిని కామాక్షి అమ్మన్ ఆలయం అని కూడా పిలుస్తారు . 

💠 స్థానికంగా కొట్టై కోయిల్ (కోట ఆలయం) అని పిలుస్తారు . 

ఈ ఆలయం 8 లేదా 9వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది ముఖ్యమైన ధర్మపురి ఆలయాలలో ఒకటి. 

💠 దీనికి గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరించే వేలాడే స్తంభ రహస్యం ఉంది!!! గర్భ గ్రహ (గర్భగుడి) పక్కన ఉన్న అర్ధ మండపంలో, ఈ 4 స్తంభాలు ఉన్నాయి మరియు వాటిలో ఒకటి వేలాడుతోంది. అక్షరాలా వేలాడుతోంది. 

దీనికి బేస్ మరియు స్తంభం మధ్య 2 సెం.మీ. ఖాళీ ఉంది.

💠 అర్థ మండపంలో అందమైన శిల్పాలతో కూడిన రెండు స్తంభాలు ఉన్నాయి. 

మీరు ఈ స్తంభం కింద ఒక కాగితపు ముక్కను ఉంచితే, అది ఎటువంటి అడ్డంకులు లేకుండా అవతలి వైపుకు వస్తుంది. 

అంటే, స్తంభం నేలను తాకకుండా నిర్మించబడింది. 

ఈ స్తంభం బరువు అనేక టన్నులు అని చెబుతారు.

 కాబట్టి, వీటిని 'వేలాడదీసే స్తంభాలు' అని కూడా అంటారు. 

ఇది తమిళుల నిర్మాణ నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించడం లాంటిది.

💠 ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి ఆలయం, కర్ణాటకలోని బేలూరు మరియు కర్ణాటకలోని హళేబీడుల మాదిరిగానే నేల నుండి కొన్ని సెంటీమీటర్ల ఎత్తులో ఉంది. 

ఈ మూడు ఆలయాలలో వేలాడే స్తంభాలు మూలస్థానం నుండి చాలా దూరంగా ఉంచబడ్డాయి, అయితే ఈ ఆలయ వేలాడే స్తంభం అర్థ మండపంలోనే కనిపిస్తుంది. 

ఈ ఆలయాన్ని సందర్శించే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ అద్భుతం జరగడాన్ని చూడటానికి ఈ స్తంభం దిగువన కాగితం లేదా వస్త్రాన్ని చొప్పిస్తారు. 

💠 ఈ వేలాడే స్తంభంలో ఒక వైపు త్యాగాల కథ ఉంది. 

గతంలో యోధులు ఎత్తు నుండి తిరుశూలం (త్రిశూలం) పై పడి తమను తాము త్యాగం చేసుకున్నప్పుడు, కామాక్షి దేవి మానవుల స్థానంలో నిమ్మకాయలు వేయాలని సూచించింది. 

కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి త్రిశూలం మీద తలక్రిందులుగా పడి, కామాక్షి దేవి తన చేతిని దానిపై ఉంచి అతన్ని రక్షించే దృశ్యం ఉంది. 

కాబట్టి ఆమెను తడుతత్కొండ నాయకి అని పిలుస్తారు.

💠 ఇతర ఆలయాలలో, దేవతను అన్ని రోజులలో చూడవచ్చు. 

కానీ ఈ ఆలయంలో ఒక రోజు మాత్రమే పూర్తి రూపంలో చూడవచ్చు. 

ఇతర రోజులలో ఆమె ముఖం మాత్రమే పూజ కోసం కనిపిస్తుంది. ఆమెను సులిని రాజ దుర్గ అని పిలుస్తారు. 

💠 అరుముగర్ లేదా మురుగన్ లేదా కార్తికేయ స్వామికి మరో ప్రత్యేక మందిరం ఉంది. 

ఆయన తన నెమలి పర్వతంపై కూర్చుని ఉన్నారు మరియు ఆయన పాదాల కింద ఒక పాము పాకుతోంది.

 ఆ పాము భూమిని తాకకుండా అరుముగర్ పాదమును మోస్తుందని దీని అర్థం. 

💠 మహామండపంలో శివుడు నృత్య భంగిమలో కనిపిస్తాడు. 

ప్రధాన దేవత మండప శిల్పాలు చూడటానికి అందంగా ఉంటాయి. ఇక్కడ యోగ నరసింహుడు కనిపిస్తాడు. 

ప్రవేశ ద్వారం యొక్క ఎడమ వైపున వీరభద్రుడు కనిపిస్తాడు. 

💠 ఈ ఆలయంలో భైరవుడు , సూర్యుడు కనిపిస్తారు.

 ఇక్కడ వల్లి మరియు దైవనై అనే భార్యలతో కూడిన వాలంపురి గణేశుడు , సుబ్రమణ్య విగ్రహాలు కూడా కనిపిస్తాయి. 

కోష్ట వినాయకుడిలో , దక్షిణామూర్తి , విష్ణువు , బ్రహ్మ మరియు దుర్గ కనిపిస్తారు.

💠 తూర్పు ముఖంగా ఉన్న శ్రీ సిద్ధేశ్వరునికి ఒక ఉప మందిరం, దక్షిణ ముఖంగా ఉన్న శ్రీ కాలభైరవునికి ఒక ఉప మందిరం ఉన్నాయి. 

బయటి వైపున వాలంపురి సెల్వ గణపతికి ఒక ఉప మందిరం మరియు ఇష్ట సిద్ధి షణ్ముగనాథుడికి మరొక ఉప మందిరం ఉన్నాయి మరియు ఈ రెండు ఉప మందిరాలు తూర్పు ముఖంగా ఉన్నాయి. 

💠 దక్షిణ ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించే భక్తులు అక్కడ గోపురం పైన ఉంచబడిన శివుడు మరియు పార్వతి యొక్క రంగురంగుల విగ్రహాన్ని చూడవచ్చు. 

💠 ఈ ఆలయంలో అనేక నాగ దేవతల విగ్రహాలు ఉన్నాయి మరియు ప్రత్యేక నవగ్రహ సన్నధి కూడా ఉంది. 

అన్నాభిషేకం, ఆరుద్ర దర్శనం, మాసి మాగం, ప్రధోషం, నవరాత్రి వంటికొన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటారు.

💠 హోసూర్ నుండి ధర్మపురికి దూరం 99 కి.మీ, సేలం నుండి: 66 కి.మీ.

రచన

©️ Santosh Kumar

మహనీయుల మాట

🌺 *మహనీయుల మాట* 🌺

పాలలోపడ్డ బొగ్గుముక్క తాను కరిగి అయినా పాలరంగును మార్చాలని చూస్తుంది. గానీ తనరంగును మాత్రం మార్చుకోదు.

అలాగే కొందరు వ్యక్తులు తాము పతనమవుతూ ఇతరులనుకూడా పతన మార్గంలోకి లాగుతారు తప్ప తాము మాత్రం మారరు.

🌷 *నేటిమంచిమాట* 🌷

ఎంత వజ్రాలగని అయినా అక్కడ అన్నీ వజ్రాలేఉండవు.

బొగ్గు, రాయి అన్నీ కలిసే ఉంటాయి.

మంచిగాని, చెడుగానీ ఒంటరిగా దొరకవు.

మంచిచెడ్డల మిశ్రమమే ప్రపంచం.

ఈ ప్రపంచమనే గనిలో మనమే కావలసిన దానిని ఏరుకోవాలి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌸పంచాంగం🌸

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,

తేదీ    ... 21 - 02 - 2026,

వారం ...  స్థిరవాసరే ( శనివారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

ఫాల్గుణ మాసం,

శుక్ల పక్షం,

తిథి      : *చవితి* మ2.00 వరకు,

నక్షత్రం  :  *రేవతి* రా8.15 వరకు,

యోగం :  *శుభం* సా5.09 వరకు,

కరణం  :  *భద్ర* మ2.00 వరకు,

                 తదుపరి *బవ* రా1.05 వరకు,

వర్జ్యం                  :  *ఉ8.44 - 10.16*

దుర్ముహూర్తము   :  *ఉ6.28 - 8.00*

అమృతకాలం      :  *సా5.57 - 7.29*  

రాహుకాలం         :  *ఉ9.00 - 10.30* 

యమగండం        :  *మ1.30 - 3.00*

సూర్యరాశి           :  *కుంభం* 

చంద్రరాశి             :  *మీనం*

సూర్యోదయం      :  6.29,

సూర్యాస్తమయం :  5.59,

                *_నేటి మాట_*

 *భక్తిలో - ఫలితం పొందడం ఎలా???*

మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి.

ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖమని అంటున్నాం. 

ఈ రెంటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మిక, ప్రకృతిలో మార్పు సహజం, ప్రకృతిలో భాగమైన మనం ఆ మార్పులకు అతీతులం కాదు. బాహ్యజీవనం సాగించక తప్పదు. 

అందుకే జీవనమంతా ఆధ్యాత్మికతతో పరిమళించేలా ఉండాలి. 

అప్పుడే అది పరిపూర్ణ జీవనం అవుతుంది... నిద్రపోయినప్పుడు కూడా కలల రూపంలో ప్రకృతి మనని అంటిపెట్టుకొని ఉంటుంది. 

ఆ తర్వాత సుషుప్తి అవస్థలో మాత్రమే అది మనని పూర్తిగా వదులుతుంది.

ఇలలోని దేహాన్ని, కలలోని దేహభావనను వదిలి ఉండాల్సిన సత్యవస్తువుతో ఉండటం ధ్యాన సమాధి. 

ఆ సత్యవస్తువు మనకు ముందే తెలియదు కాబట్టి మన సాధన మనని ఆ స్థితికి చేరుస్తుంది. 

నామజపం, యోగసాధన, భజన, భక్తి పారవశ్యమైనా మనకి ఆ స్థితి రుచి చూపించటానికే..

మహర్షులు నిరంతర జప, ధ్యాన సమాధుల్లో ఉండేవారు, నిరంతర దైవస్మరణతో ఉంటే మన నిత్య జీవితంలో కూడా ఆ ఫలాన్ని పొందవచ్చు...

             *_🌸శుభమస్తు🌸_*

 🙏సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

పంచాంగం

యమస్య కరుణా నాస్తి:

 శ్లోకం:

కాలక్షేపో న కర్తవ్యః క్షీణమాయుర్దినే దినే 

యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనమ్ 

భావం:

కాలక్షేపో న కర్తవ్యః: కాలాన్ని వృధా చేయడం ఏమాత్రం తగదు.

క్షీణమాయుర్దినే దినే: 

సూర్యోదయ, సూర్యాస్తమయాలతో మన ఆయుష్షు ప్రతిరోజూ క్షీణిస్తూనే ఉంది.

యమస్య కరుణా నాస్తి:

మృత్యువుకు

 (యముడికి) ఏమాత్రం జాలి, కరుణ ఉండవు. వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా ప్రాణాలు తీసుకెళ్ళవచ్చు.

కర్తవ్యం హరికీర్తనమ్:

కాబట్టి, ఆ సమయం రాకముందే భగవంతుని నామాన్ని స్మరించడం, కీర్తించడం మన ప్రధాన కర్తవ్యం కావాలి.

విశేషం:

ఈ శ్లోకం మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని గుర్తుచేస్తుంది. 

లోకంలో అన్నీ వాయిదా వేయవచ్చు కానీ, భగవన్నామ స్మరణను మరియు మంచి పనులను వాయిదా వేయకూడదు. 

"రేపు చేద్దాం" అనుకున్న పని చేసేలోపే యముడు తలుపు తట్టవచ్చు, అందుకే "ఇప్పుడే, ఇక్కడే" హరి నామాన్ని స్మరించాలని పెద్దలు చెబుతారు.

Please join us in Jagathguru Bharathi theertha vani WhatsApp group by the following link:

https://chat.whatsapp.com/DLG1Aegdmdi9JDobpIlYEH?mode=wwt

నిర్వాణ షట్కం

 నిర్వాణ షట్కం లేక నిర్వాణ శతకం శ్లోకాలు - వాటి అర్థాలు తాళపత్రనిధి

తాళపత్రనిది తాళపత్రనిధి

thalapathranidhi

తాలపేట్రేగు

శ్లోకం :

మనోబుధ్యహంకార చిత్తాని నాహం

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రై న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయు: చిదానంద రూప: శివోహం శివోహం

1 @thatapathramuni

అర్థం :

మనస్సు,బుద్ధి,చిత్తము, అహంకారము అనేటువంటివి ఏమీ నేను కాను. చెవి, నాలుక, ముక్కు, నేత్రములు మొదలైన ఇంద్రియాలను నేను అసలు కాను. ఆకాశము, భూమి,అగ్ని,వాయువు, నీరు లాంటి పంచభూతాలను నేను కానే కాను. ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను! శివుడనే తప్ప మరి వేరవరినీ కాను. లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు

జై గోమాత

thalapathranidhi

జై భారత్ మాత

భగవంతుని యందు భక్తి

 శ్రీరామ (96)

( భక్తి మార్కెట్ లో కొనేది కాదు. ఎన్నోజన్మలు సత్కర్మానుష్ఠానము చేసినందువల్ల భగవంతుని యందు భక్తి ఏర్పడుతుంది)

శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).

                            -----------------

"భక్తి మార్గం చాలా సులభం" అని మనలో చాలా మంది అభిప్రాయం.

కానీ భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం కలగడం, భగవంతునియందు భక్తి జన్మించడం, అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అంటున్నాడు ప్రహ్లాదుడు.

ఆ విషయం ఇప్పుడు చెప్పుకుందాం.

హిరణ్యకశిపుడు,

 "నాయనా!గురువుల దగ్గర ఏమి నేర్చుకున్నావు?" 

అని ప్రహ్లాదుని అడిగాడు.

" నాన్నగారు! గురువులు నన్ను చక్కగా చదివించారు.

ధర్మార్థకామములకు సంబంధించిన అన్ని శాస్త్రములను చదివాను.

ఇవి గాక నేను ఇంకా ఎన్నో విషయములు తెలుసుకున్నాను.

అన్ని విద్యలలోని సారము గ్రహించాను.

తండ్రీ! త్రికరణశుద్ధిగా విష్ణువును ధ్యానిస్తూ, సారం లేని ఈ సంసారం వదిలేసి అరణ్యాలలో ఉండటం మంచిదని తెలిసింది.

విద్యలన్నిటి సారాంశం ఇదే" 

అన్నాడు.

ఈ మాటలకు మండిపడ్డాడు హిరణ్యకశిపుడు.

" నీకీ బుద్ధి ఎవరు పుట్టించారు? " అని ప్రహ్లాదుని గద్దించాడు.

" తండ్రీ! విష్ణుభక్తి ఒకరు చెబితే వస్తుందా!

ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే విష్ణువు మీద భక్తి జన్మిస్తుంది" అన్నాడు ప్రహ్లాదుడు.

ఉ// అచ్చపు జీకటింబడి గృహ వ్రతులై విషయ ప్రవిష్టులై/

చచ్చుచు బుట్టుచున్ మరల జర్విత చర్వణులైన వారికిం/

జెచ్చెర బుట్టునే పరులు సెప్పిన నైన,నిజేచ్ఛ నైన నే/

మిచ్చిన నైన గానలకు నేగిన నైన హరి ప్రబోధముల్//

(తండ్రీ! అజ్ఞానపు చీకటిలో బడి,

సంసారం చేస్తూ, 

విషయ భోగములలో కూరుకుపోయి,

జనన మరణాలకు లోనై,

అనుభవించిన ఆహార, నిద్రా, మైధునాదులనే తిరిగి, తిరిగి అనుభవించుచు,

పశుప్రాయులుగా ఉన్న మనష్యులకు, విష్ణుభక్తి ఒకరు చెబితే వస్తుందా?

తమంత తమకు తోస్తుందా?

డబ్బులిచ్చి కొనుక్కునేదా తండ్రీ నారాయణుని మీది భక్తి? 

అంతేకాదు అడవులకు వెళ్ళి ముక్కు మూసుకున్నంత మాత్రాన భక్తి వస్తుందా? 

ఎంత వెర్రి వాడవు! 

ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే మాధవుని మీద భక్తి జన్మిస్తుంది ).

ఉ// కానని వాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్/

గానని భంగి, గర్మములు గైకొని కొందరు కర్మ బద్ధులై/

కానరు విష్ణు, గొందరట గందు రకించన వైష్ణవాంఘ్రి సం/

స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా! //

( గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివాని సహాయంతో వస్తువులను చూడగలడా?

అలాగే కర్మబద్ధులై కర్మలనాచరిస్తున్న వారు విష్ణువును చూడలేరు.

విష్ణు భక్తుల పాదపరాగం శిరస్సుపై ధరించినందువల్ల పవిత్రులై, 

కర్మలను త్యజించిన, కొంతమంది పుణ్యాత్ములు మాత్రమే నారాయణుని దర్శించగలుగుతారు).

శా// శోధింపంబడె సర్వ శాస్త్రములు రక్షోనాధ వేయేటికిన్/

గాధల్, మాధవ శేముషీ తరణి సాంగత్యంబునం గాక దు/

ర్మేధన్ దాటగ వచ్చునే సుత వధూ మీనోగ్ర వాంఛా మద/

క్రోధోల్లోల విశాల సంసృతి మహా ఘోరామి తాంభోనిధిన్//

(రాక్షసరాజా! లోకములో గల సమస్త శాస్త్రములు క్షుణ్ణంగా పరిశీలించాను. 

ఈ సంసారము అనేది మహావిశాలమైన సముద్రం లాంటిది.  

భార్యలు, భర్తలు, పిల్లలు, ఆ సముద్రము లోని తిమింగిలముల వంటి జలజంతువులు.

కొరికలు, గర్వము, క్రోధము అనునవి ఆ సముద్రములోని పెద్ద పెద్ద అలలు. 

మహా ఘోరమైన ఈ సంసార సముద్రానికి ఒడ్డు అనేది లేదు. 

అహంకార, మమకారములతో కలుషితమైన మన "బుద్ధితో" ఈ సంసార సాగరాన్ని దాటటం అసంభవం.

విష్ణు భక్తి అనే ఓడ ఉంటేనే దీనిని దాట గలం).

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

20-2-'26.

గురువులకు

 🌸గురువులకు నమస్కారములు🙏🙏🙏

నేను డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ని  ఒకరోజు కాలేజీలో పాఠము చెబుతున్నప్పుడు  విద్యార్థులు నన్ను ఈ విధంగా అడిగినారు

మేడమ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటున్నారు కదా అది మా క్లాస్ రూమ్ కి అనునయించి చెప్తారా అని అడిగారు అప్పుడు నేను చెప్పాను టీచర్ క్లాసు లోకి రాకముందు మీరు బాగా అల్లరి చేస్తుంటారు దూకుతారు కొట్టుకుంటూ ఉంటారు ఏమో చేస్తుంటారు మీ క్లాస్ కొచ్చిన  గురువుగారు వెంటనే మిమ్మల్ని సరిగా కూర్చోమని చెప్పి ప్రశాంత వాతావరణం సృష్టిస్తాడు ప్రశాంత వాతావరణం సృష్టించాడు కాబట్టి గురు బ్రహ్మ  కాసేపు ఆగి  తరువాత పాఠము మొదలుపెట్టి చెబుతారు క్లాసులో గురుదేవులు రాజు ఆయన క్లాస్ లో ఉన్నంతసేపు విద్యార్థుల పాటము వింటున్నారా లేదా చూచి వారిని సరి అయిన న దారిలో పెట్టే ది గురువుగారేఆ పరిపాలన గురువు గారిదే అందుకని గురువిష్ణు ఆ తర్వాత గురువు  విద్యార్థులు అభివృద్ధి లోకి రావాలని వారికి శుభం జరగాలని కోరుకుంటూ ఉంటాడు ఆయన మహేశ్వరుడు శివుడు అనగా మంగళ కరుడుశుభం కోరుకుంటాడు అందుకని గురువు మహేశ్వరుడు గురువు తన పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు పడే సంతోషం కన్నా తను చదువు చెప్పిన విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు చాలా సంతోష పడతాడు అని ఈ విధంగా వాళ్ళకి నేను చెప్పడం జరిగింది విద్యార్థులు చాలా సంతోషపడినారు మాకు ఇప్పటిదాకా తెలియదు మేడమ్ ఇప్పుడు తెలుసుకున్నాము అని అన్నారు

జయలక్ష్మి  పిరాట్ల

హైదరాబాద్

మన కష్టాలను మనం

🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

మన కష్టాలను మనం స్వబుద్ధితో తొలగించుకోలేము.అలా తొలగించుకోగలిగితే వార్థక్యం, మరణం కూడా రాకుండా చేసుకోవచ్చు గదా ! 

అందువలన అన్ని సమస్యలకు పరిష్కారం ఈశ్వర శరణాగతే అంటున్నారు 

శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు, 

శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో.

శ్లో// ఆయుర్నశ్యతి పశ్యాతాం ప్రతిదినం, యాతి క్షయం యౌవ్వనం/

ప్రత్యాయాంతి గతాః పునర్నదివాసా: కాలో జగద్భక్షకః/

లక్ష్మీ స్తోయతరంగ భఙ్గ చపలా, విద్యుచ్చలం జీవితం/

తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాథునా//

(ప్రతి దినమూ చూస్తుండగానే ఆయుర్దాయము తగ్గిపోతున్నది.

భోగానుభవమునకు సమర్థమైన యౌవనం గతించి,అన్ని దుఃఖములకు స్థానమైన వార్ధక్యం వస్తోంది.

ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించినా, ఆ గడిచి పోయిన రోజులు తిరిగి రావు. 

కాలపురుషుడు అన్నింటినీ నశింపజేస్తున్నాడు. ఐశ్వర్యము నీటి తరంగం లాగా అశాశ్వతమైనది.

జీవితంకూడా మెరుపుతీగెవలె క్షణికమైనది.

నాది, నావాళ్ళు, అనుకొనే సమస్తముతోను వియోగాన్ని పొందించి దుఃఖం పాలుజేసే మరణం ఏ క్షణంలో సంభవిస్తుందో తెలియదు. 

ఓ ఈశ్వరా! అందువల్ల నిన్నే శరణువేడుకుంటున్నాను.

దయతో నన్ను రక్షించు.

 ఎప్పుడోకాదు, ఇప్పుడే రక్షించు).

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

20-2-'26.

సావడి కబుర్లు - 4

సావడి కబుర్లు - 4

*గెలుపు - ఓటమి రహస్యం — సనాతనధర్మ దృక్పథం.*

1500 సంవత్సరాలుగా విదేశీ పాషండ మతాల దురాక్రమలతో విసిగి వేసారిన హిందూ జాతి,  దేశానికి స్వతంత్రం వచ్చినా, పాలకులకు జాతీయ భావాలు లేకపోవడంతో అదే అణిచివేతకు గురౌతూ వచ్చింది. గత పది  సంవత్సరాలుగా జాతీయ భావాలు ప్రస్పుటంగా గల పాలకులు రావడంతో హిందూ సమాజం  చైతన్యమై సంఘటితమౌతూ మహోన్నతమైన రేపటికి సిద్ధమవుతోంది. 

ఇది ఎంతో కాలంగా దేశాభిమానుల హృదయాల్లో రగులుతున్న అగ్ని జ్వాలలు వెలిగించిన అఖండ దీపం.

 ఇటువంటి తరుణంలో,  శతాబ్దాల క్రితం అవైదిక మతాల దాడి నుంచి వేద ధర్మాన్ని రక్షించడానికి ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైతంపై కొందరి అహంకారపూరిత అసంధర్భ అవమానకరమైన వ్యాఖ్యలకు సమాజం ఉలిక్కిపడింది. 

ఆ ఘటనపై ప్రతిస్పందన ఎలా ఉండాలి?  "కిం కర్తవ్యం?"  అంటూ  మానసికంగా మదనపడుతున్న కొంతమంది పెద్దలు కలిసి చర్చించుకోవడం జరిగింది.  చర్చల్లో వెలువడిన అభిప్రాయాల్లో, విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదని, అద్వైత సిద్ధాంతాన్ని నలుదిశలా వ్యాప్తి చేసిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారి ఆలోచనా విధానం వలే,  అవతల వారిని నొప్పించక ఒప్పించాలనే అభిప్రాయం కూడా ఒకటి.‌

 ఆరోజు సమావేశంలో నాతో పాటు ఉన్న శ్రీ సిఎస్ఎన్ శర్మగారితో మాటల్లో గెలుపు ఓటమిల రహస్యం గురించి ప్రస్తావన వచ్చింది. 

అసలు గెలుపు అంటే ఏమిటి! ఓటమి అంటే ఏమిటి?.

సాధారణంగా మనం గెలవడము అంటే దానిలో ఇతరుల ఓటమిని చూస్తాం. దానినే కోలమానంగా వాడతాం.  కానీ నిజమైన గెలుపు అంటే ఏమిటంటే మనని  వ్యతిరేకించే వారిలో వారి భావాలపై  తప్పొప్పులను    విశదీకరించి వారి మనసులను గెలవడం. మన అభిప్రాయానికి వారిని ఒప్పించి మనతో కలుపుకునేలా చేయడం.

అలాగే, ఓటమి అంటే తాను నమ్మిన సిద్ధాంతం లేదా విషయం సరైనది కాదని గ్రహించడం.  అంతేకాని, వారి మానసిక స్థితిని లేదా వినయాన్ని ఆక్రమించి అవమానం చేయడం, నిరుత్సాహపరచడం కాదు. 

ఈ ఆలోచన మన మనస్సులోని మానసిక రుగ్మతలు ఈర్ష్య, శత్రుత్వం, భయాలనూ తొలగించి, మన మధ్య ఉన్న సామాజిక విభేదాలను దూరం చేస్తుంది. ఇది సానుకూల మనస్తత్వాన్ని పెంపొందిస్తూ, సమాజాన్ని ఐక్యమయం చేస్తుంది. ఇదే మన సనాతన ధర్మం యొక్క అద్భుతమైన విశిష్టత.

*జయస్య నాస్తి విరామః పరాజయస్య చ|*

*ఉభయోరపి సంన్యాసః ధర్మస్య ఫలముచ్యతే॥*

జీవితంలో గెలుపుతో  ఎప్పుడూ ఆగకూడదు, అలాగే ఓడిపోయినప్పుడు కూడా ఆగిపోకూడదు. ఓటమి తర్వాత కూడా నిలబడి ముందుకు సాగాలి.‌

గెలుపు-ఓటమి రెండింటినీ సమానంగా చూసి, వాటి పట్ల మమకారం, ఆసక్తి , ఆశ-నిరాశలను త్యజించడమే (సంన్యాసం) నిజమైన ధర్మ ఫలం, అదే ఉత్తమ ఫలితం. ఆ రెంటినీ సమత్వ దృష్టితో (సమం పశ్యన్) చూడడమే ఉత్తమమని సనాతన ధర్మం చెబుతోంది.  

భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పినది కూడా ఇదే.

అహంకారాన్ని విడిచి పెడితే మనకి ఆత్మ విశాలత్వ స్వరూపం అర్థమవుతుంది.

_*జ్ఞాత్వా తు పరంజ్ఞానమతః పునస్త్వశ్ష్రేయసి*_

_*అహంకారవినాశేన తత్స్వరూపస్థితిః॥*_

గెలుపు అంటే అహంకారాన్ని జయించి, ఇతరుల మనస్సులను గెలవడం. మన భావాలు గెలిచినప్పుడు కూడా, వ్యతిరేకులను అవమానించకూడదు.  దీనినే  మహాభారతంలో

_*సత్యవాదీ పరః శ్రేయాన్వృత్తికరణమాప్నుయాత్*_

_*పరాజయేపి విజయీ భవతి యః సత్కర్మసు రతః॥*_

అంటూ, సత్కర్మలు చేసేవారిని ఓటమి ఎన్నటికీ ఓడించలేదు. అతని సత్కర్మల వలన అతను ఎప్పటికీ విజయవంతుడే అంటూ, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని మహాభారతంలో వ్యాసమహర్షి తెలియజేశారు.

నిత్య జీవితంలో కూడా ఈ వాదాన్ని అనుసరిస్తే  ఆరోగ్యకరమైన సమాజం మనకు కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదం వచ్చినా, ఉద్యోగుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినా, సమాజంలో అసమానతలు తలెత్తినా సానుకూల దృక్పతితో ఇతరులు చెప్పిన విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని బలాబలాలను ఒప్పించగలిగితే సమస్యలకు శాంతియుత పరిష్కారాలు లభించగలవు.

చివరిగా,  భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు. 

*సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ।*

*అహం త్వా సర్వపాపేభ్యో మొక్షయిష్యామి మాశుచః॥*

ఈ సత్యాన్ని అర్థం చేసుకుని జీవిస్తే, మన మనసులో ఉన్నటువంటి  గెలుపు-ఓటమిల  అర్థాలే మారిపోతాయి. గెలిచిన వారు వినయంతో, ఓడినవారు అవగాహనతో మసులుకుంటే, అక్కడి శాంతి తరంగాలు సమాజాన్ని ఒక మహా కుటుంబంగా నిలబెడతాయి. 

ఇదే మన సనాతన ధర్మం ప్రబోధించే ఉన్నత  సిద్దాంతం.

జైహింద్

జై భారత్

మృశి

(దశిక ప్రభాకరశాస్త్రి)

 9849795167

20.02.2026

వేద ఆశీర్వచనము

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - తృతీయ - ఉత్తరాభాద్ర -‌‌ భృగు వాసరే* (20.02.2026)

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటిhttps://youtube.com/watch?v=12JwfZLVARg&feature=shared.

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పార్వతి దేవి స్తుతి🙏

 🌸పార్వతి దేవి స్తుతి🙏

సీస పద్యము 

శాంకరి !శాంభవి! శర్వాణి !శారద!

కరుణతో కాపాడు కాళికాంబ!

భవునిరాణి !భవాని! బాధలు దూరము 

చేసియు చాముండి! చింత తీర్చు

కళ్యాణి !భగవతి! కామాక్షి !నిర్మల!

బహుభుజ భార్గవి! వందనములు

మాతంగి !మాతృక! మాలిని! మలయమ్మ!

మమ్ము కావుము దేవి మమత తోడ

తే శంభుప్రియగౌరి ! పార్వతి !శరణు శరణు

సర్వమంగళ !సావిత్రి! జయము జయము

 సింహరథ సింహ వాహిని !శీఘ్రముగను

శైలముదిగిరాశ్యామల !శంభురాణి!

సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల