20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము

* 656 వ రోజు*

యజ్ఞ సమాన పుణ్యములు

ధర్మరాజు " పితామహా ! యజ్ఞములు చేయవలెనని మీరు అనేకమార్లు చెప్పారు కాని యజ్ఞములు చెయ్యడానికి ఎంతో ధనము కావాలి కదా ! మరి యజ్ఞములు చేయలేని వారి సంగతి ఏమిటి ? వారు ఎలాంటి పుణ్యకర్మలు ఆచరించాలి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అందరికీ యజ్ఞములు యాగములు అందరికీ సాధ్యం కాదు కనుక అంగీరసుడు ఉపవాస వ్రతం ఉపదేశించాడు. ఉపవాస వ్రతం చెయ్యడం కష్టమని కదా యజ్ఞముల గురించి అడిగావు. ఉపవాసము చెయ్యడంలో తేలికైన విధము చెప్తాను విను. రోజుకు రెండు సార్లు అనగా పగటి పూట ఒక సారి రాత్రి పూట ఒక సారి మాత్రమే భోజనము చేసి భోజన సమయంలో మాత్రమే నీరుత్రాగి మధ్యలో ఏమీ తినకుండా త్రాగకుండా ప్రతి రోజు అగ్నిని ఆరాధించే వారు ఉపవాస వ్రతము ఆచరించినట్లేనని పెద్దలు చెబుతారు. ఇది కూడా ఆచరించండం కష్టమని తలచిన అంగీరసుడు చెప్పిన మిగిలిన ఉపవాసవ్రతములు ఆచరించవచ్చు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

శ్రీకృష్ణుని తత్వము

ధర్మరాజు " పితామహా ! శ్రీకృష్ణుడు జ్ఞానప్రతీక అంటారు కదా ! ఆయన బోధనలు నాకు వినవలెనని కోరిక కలుగుతుంది. కనుక శ్రీకృష్ణతత్వము నాకు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు హర, సనత్కుమార సంవాదానాన్ని వివరిస్తాను. పూర్వము ఒక కోరికతో పరమశివుడు సనత్కుమారుడి వద్దకు వెళ్ళాడు. పరమశివుడికి సనత్కుమారుడు అతిథి మర్యాదలు చేసి సత్కరించాడు. పరమ శివుడు కొన్ని సందేహాలు తోర్చమని సనత్కుమారుడిని అడిగాడు. సనత్కుమారుడు అది తన భాగ్యమని చెప్పాడు. శివుడు " మహాత్మా ! ధ్యానముతో దర్శింపతగిన వస్తువేది ? తత్వములు ఎన్ని ? సాంఖ్యము యోగము వాటి తత్వములు ఎన్ని ? సాంఖ్యము యోగము వాటి తత్వములు ఏవి ? ఇంకా ఆధ్యాత్మిక విషయములను వివరించు " అని అడిగాడు. సనత్కుమారుడు " మహాశివా ! తత్వములు 24 అని కొందరు, 23 అని కొందరు, 25 అని కొందరు అంటారు. ప్రాకృతులు 23 అంటారు. వారు మనస్సు బుద్ధి ఒకటే అని అంటారు. అది సరి కాదు. పరిశుద్ధమైన 24 అనే వారు పరిశుద్ధమైన మనసే బుద్ధి అంటారు. నేను మాత్రము 25వ తత్వము ఉంది అని నమ్ముతాను. అదే అధిష్ఠానము. 24 తత్వములు 25వ తత్వములో లీనమైఉంటాయి. కనుక 24 తత్వాలు ఉన్నాయనడము, లేవు అనడము అంటారు. రెండూ సంభవమే. ఈ లోకములో పంచభూతములు ఐదు. వాటి గుణములు అయిదు. ఇంద్రియములు పది. ఇవి కాక బుద్ధి, మనసు, అహంకారము, ప్రకృతి కలిపి మొత్తము 24. ఈ 24 నాలుగు తత్వములను అధిష్ఠించి ఉండేది 25వ తత్వము. బాగా తెలిసిన వాడు 24 తత్వములు కూడినది దేహము అని అంటారు. 25వ తత్వమైన పరమాత్మ కట్టెలో నిప్పు దాగి ఉన్న చందాన శరీరమంతా ఆవహించాడు. కాని మానవుడితో ఉన్న సజమైన ఈర్ష్య, అసూయ, దురభిమానము ఈ జ్ఞానమును అంట నీయదు. నేను నాది అనుకుంటూ నిత్యమూ ఈ దేహమే తానని భ్రమిస్తూ సంసారంలో తిరుగుతుంటాడు. వేదము పరమాత్మతత్వము, బ్రహ్మమును గురించి తెలియజేస్తుంది. దానిని అమృతత్వ తత్వము అంటారు. అమృతత్వతత్వము అన్ని తత్వములకంటే మేలైనది. దానిని ఎరిగిన వాడు మృత్యుంజయుడు ఔతాడు. అది తత్వములక్కన్నింటికీ ఈశ్వరుడు. ఇంతకు మించిన ఈశ్వరుడు లేడు. ఇది సత్యము నిత్యము రహస్యము. పరమశివా ఈ తత్వములు పైనుండి కిందకు వచ్చిన సృష్టి, కింద నుండి పైకి వెళ్ళిన లయము అంటారు. వీటన్నింటినీ దాటన్నింటినీ దాటి బ్రహ్మపదము చేరడమే ఏకత్వము అంటారు. శ్రద్ధలేని వాడికి, మనసులో ఏకాంతత లేని వాడికి, ఇంద్రియములను జయించని వాడికి, వేదాధ్యయనము చేయని వాడికి ఈ జ్ఞానము సిద్ధించదు.

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్ర*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*హం పొందండి*

కామెంట్‌లు లేవు: