22, డిసెంబర్ 2024, ఆదివారం

Panchang


 

భర్తలకు

 ప్రేమ గల భర్తలకు అతి ప్రేమతో !!


కొత్తగా పెళ్లైన జంట, ఓ గార్డెన్ లో, నడుస్తుండగా, ఒక కుక్క సడెన్ గా, అరుస్టూమీదపడి, కరవబోయింది.


కొత్తగా పెళ్లయిందిగా, పాపం భర్త .. .... భార్యని పైకెత్తి పట్టుకున్నాడు, భార్యకి ఏమీ కాకూడదని.


ఆ కుక్క వెంటపడి మరీ, భర్తని కండలూడేలా కొరికేసి, అరుస్తూ ఓ సందులోకి పారిపోయింది.


కుక్క పారిపోయాక భర్త, భార్యని కిందకి దింపి, భార్య కళ్లల్లొ గొప్పగా చూసాడు, మెచ్చుకుంటుది కదాని.


దానికి బార్య అరుస్తూ అన్న మాటలకి, అప్పటివరకూ ఎంతో నిబ్బరంగా వున్న భర్త పాపం, మాటలురాక నిక్షేష్టుడై కింద పడిపోయాడు.


ఇంతకీ అరుస్తూ ....

ఎమన్నాదో .... తెలుసుకోవాలని వుందా?


.


.


.


.


.


.


.


.


.


.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.


భార్య : " ఇంతవరకూ ... నేను .... కుక్కల మీదకి రాళ్లనూ, కర్రలనూ విసిరేవాళనే చూసా ... కానీ జీవితంలో మొదటిసారి పెళ్లాన్ని కుక్క మీదకి విసిరేయాలని ట్రై చేసే ..... వాడినిప్పుడే చూసా"


Husband... "😱😱😱😱"


Moral : A Wife is Wife 


No One ELSE Can MIS-UNDERSTAND a Husband Better, than a wife 


భర్తల్ని అపార్ధం చేసుకోవటంలో, భార్యలకి ఎవరూ సాటి లేరు

- స్వామీ అపరిచాతానంద 😀

అశ్వగంధ చూర్ణం

 అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు - 


*  చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడే వారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు పొందగలరు .


*  దీనిని తెలుగులో పెన్నేరు అని కూడా అంటారు.దీని వేరు భాగంలో "samniferin " అనే రసాయనం ఉంది . ఇది మంచి నిద్ర కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.


*  ఇది శరీరంలో వేడిని , వాతాన్ని తగ్గించును 


*  జీర్ణక్రియ మీద దీని ప్రభావము ఉంటుంది. జీర్ణశక్తిని పెంచును. 


*  పేగుల్లో మృదుత్వాన్ని తగ్గించును . 


*  విరేచనం సాఫీగా అయ్యేలా చేయును . 


*  విరేచనాలు అతిగా అవ్వకుండా చూస్తూ ప్రేగులకు హాని కలగకుండా కాపాడును.


*  రక్తస్రావ సంబందించిన సమస్యలతో ఇబ్బందిపడేవారు మరియు రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడేవారు వారు వాడుతున్న మందులతో పాటు ఈ అశ్వగంధ వాడుతున్నట్లైతే తొందరగా ఫలితాలు వస్తాయి 


*  వీర్యదోషాలకు కూడా మంచి మందుగా పనిచేయును . 


*  శరీరంలో వేడిని మాత్రమే కాదు .జ్వరాన్ని కూడా తగ్గించును . 


*  శరీరానికి అద్భుతమైన టానిక్ గా పనిచేయును . 


*  వాతం , కీళ్లనొప్పులు , నడుమునొప్పి గలవారు వారు తీసుకునే మందులతో పాటు ఈ అశ్వగంధని వాడుకోవడం వలన శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి. 


*  థైరోయిడ్ గ్రంధి , గజ్జల్లో వచ్చే బిళ్లలు దాన్ని లింఫ్ గ్రంధుల వాపు వీటిపైన అశ్వగంధ బాగా పనిచేస్తుంది .


*  మెదడు వ్యాధులు , నరాల జబ్బులు , వణుకుడు , మూర్చలు మొదలయిన జబ్బులతో బాధపడే వారు వైద్యుని సలహా మేరకు ఈ అశ్వగంధ వాడుకోవచ్చు . 


*  తలతిరుగుడు , ఒళ్ళు తూలుడు , మగతగా ఉండటం , నిద్రపట్టక పోవడం , ఇవన్ని వాత సంబంధ సమస్యలు వీటికి అద్బుత ఔషదం ఈ అశ్వగంధ .


*  గుండె జబ్బులు ఉన్నవారు , గుండె ఆపరేషన్ చేయిచుకున్న వారు , గుండెపోటు వచ్చి తగ్గి మందులు వాడుకుంటున్నవారు తెల్ల మద్ది చెక్క చూర్ణం , అశ్వగంధ చూర్ణం సమానంగా తీసుకుని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొనిన మంచి ఫలితాలు వస్తాయి .


*  స్త్రీల కుసుమ వ్యాదులు, తెల్లబట్ట , అతి రక్తస్రావం వంటి సమస్యల్లో స్త్రీలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉండును.


*  చర్మవ్యాధుల్లో కూడా మంచి ఔషధంగా పనిచేయును . 


*  క్షయవ్యాధి , పోలియో వ్యాధికి కూడా ఔషదాలతో పాటు ఇది వాడుకోవచ్చు . 


         పైన చెప్పినటువంటి యోగాలు మాత్రమే కాక మరెన్నో రోగములకు ఈ అశ్వగంధ చూర్ణం అత్యద్భుతంగా పనిచేయును. బయట షాపుల్లో దొరికే అశ్వగంధ చూర్ణం శుద్ధిచేయబడి ఉండదు. శుద్ధిచేయబడని చూర్ణం వాడటం వలన ఫలితాలు అంత తొందరగా రావు. ఫలితాలు త్వరగా రావలెను అనిన శుద్ధి చేయబడిన అశ్వగంధ చూర్ణాన్ని వాడవలెను. 


                మేలైన అశ్వగంధ గడ్డలను తీసుకొని వచ్చి శుభ్రముగా కడిగి బాగుగా ఎండించి స్వచ్ఛమైన దేశివాళి ఆవుపాలయందు ఉడికించి బాగుగా ఎండించవలెను. మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా 11 సార్లు ఉడికించి ఎండించి ఆ తరువాత మెత్తటి చూర్ణం చేయవలెను . 


          పైన చెప్పిన పద్ధతిలో తయారు చేసినటువంటి అశ్వగంధ చూర్ణం సంపూర్ణమైన ఫలితాలు అతి త్వరగా ఇచ్చును.  


       అవసరం ఉన్నవారికి మాత్రం చేసి ఇవ్వబడును.  మీకు ఈ చూర్ణం కావలెను అనినచో నన్ను సంప్రదించగలరు.  నా నెంబర్ 9885030034 కి ఫోన్ చేయగలరు. 


    ఈ అశ్వగంధ చూర్ణం 40 రకాల రోగాల మీద పనిచేయును . HIV సమస్యతో ఇబ్బంది పడుతున్న రోగులకు ఇది ఇచ్చినప్పుడు CD4 కౌంట్ పెరగడం జరిగింది . వారి శరీరం నందు వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా నీరసం , నిస్సత్తువ తగ్గాయి . ఈ చూర్ణముతో చాలా మందికి చికిత్స చేశాను . 


    కాళహస్తి వేంకటేశ్వరరావు 


అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

అతిమూత్రవ్యాధి నివారణా యోగాలు -

 అతిమూత్రవ్యాధి నివారణా యోగాలు -


 * తంగేడు చెట్టు సమూలం తెచ్చి ఎండించి చూర్ణం చేసి దానికి సమముగా పంచదార కలిపి పూటకు రెండున్నర గ్రాముల చొప్పున సేవించుచున్న అతిమూత్ర వ్యాధి నివారణ అగును.


 * వెల్లుల్లి రేఖలు రెండుపూటలా తినవలెను . మొదటిరోజున ఒక రేఖ , రెండొవరోజున రెండు రేఖలు ఈ విధముగా పదిరోజులు క్రమం తప్పకుండా పెంచుకుంటూ పోతూ తినవలెను .


 * నేరేడు గింజలను నీడలో ఎండించి మెత్తటి చూర్ణం చేసి నిత్యం అయిదు గ్రాముల చొప్పున నీటితో కలిపి సేవించుచున్న అతిమూత్ర వ్యాధి హరించును .


 * మర్రిచెక్క రసము కాని కషాయం కాని సేవించుచున్న అతిమూత్ర వ్యాధి తగ్గును.


 * మేడిచెక్క కషాయం కాని రసము కాని సేవించిన అతిమూత్ర వ్యాధి తగ్గును.


 * తంగేడు పువ్వులను నీడలో ఎండించి చూర్ణం చేసి ఉదయం , సాయంత్రం 5 గ్రాముల చూర్ణాన్ని నీటితో కలిపి తాగవలెను.


 * మర్రిపండ్లలోని గింజలను తీసుకుని నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణమును ఉదయం , సాయంత్రం 10 గ్రాముల చూర్ణమును నీటిలో కలిపి తీసుకొనుచున్న 40 రోజులలో అతిమూత్ర వ్యాధి హరించును .


 * రావిచెట్టు పైన బెరడు నీడన ఎండించి చూర్ణం చేసుకుని రెండున్నర గ్రాముల చూర్ణమునకు తేనె , పంచదార కలిపి ముద్దలా చేసి ఉదయం , సాయంత్రం ఆహారానికి గంటన్నర ముందు తీసికొనవలెను.


 * అత్తిపత్తి ఆకు అనగా ముట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు ఈ ఆకు పది గ్రాములు , పాతబెల్లం కలిపి నూరి కుంకుడు గింజ అంత మాత్రలు చేసుకొని ఉదయం , మధ్యాన్నం , సాయంత్రం మూడుపూటలా తీసికొనవలెను.  


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

దశావతారాలు

 🙏దశావతారాలు🙏


👉మాతృమూర్తి గర్భంలో ఈదుతూ ఎదిగే "మత్స్యం"


నీటి నుంచి నేల మీదకు ప్రాకే బాల్యం ఒక "కూర్మం"


వయసులోని జంతు ప్రవర్తన ఒక "వరాహం"


మృగం నుంచి మనిషిగా మారే దశ "నరసింహం"


మనిషిగా మారినా ఎదగాలని ఎగిరితే నాడు "వామనుడు"


ఎదిగినా క్రోధం తగదని తేలిస్తే వాడు "పరశురాముడు"


సత్యం, ధర్మం, శాంతి ప్రేమలతో తానే ఒక "శ్రీరాముడు"


విశ్వమంతా తానే అని విశ్వసిస్తే నాడు "శ్రీకృష్ణుడు"


ధ్యానియై, జ్ఞానియై జన్మ కారణమెరిగినవాడు ఒక "బలరాముడు"


కర్తవ్య మొనరించి జన్మసార్ధకతతో కాగలడు. కర్మ యొక్క ప్రతి దశలోని అంతరం.. మలుచుకుంటే జన్మ ఒక్కటిలోనే మనిషి దశావతారం.


ఒకరకంగా దశావతారాలు మానవ పరిణామక్రమం (evolution)ని సూచిస్తాయి. మనిషి ఎదుగుతున్న కొద్ది మార్పు రావాలి అనేది నీతి. 


ఒక్కొక్క యుగానికి ఒకొక్క అవతారంలో ఎలా బ్రతకాలో చూపించిన భగవంతుడు.

ఈ కలియుగంలో ఎలా బ్రతకాలో మాత్రం మరిచాడు ఎందుకో.!?! అనే అనుమానం కూడా రావచ్చు.


అలాంటి అనుమానం అక్కర్లేదనే తిరుమలలో పద్మ పీఠం మీద మౌనంగా నిల్చున్న శ్రీనివాసుడు తెలియచేస్తాడు. కానీ అయన మౌనంగా ఉంటాడా? అంటే మౌనంగా ఉంటూనే తన పని తాను చేస్తాడు. మౌనంగా ఉన్నట్టు ఉంటాడు అంతే. అది రాతి విగ్రహం అని పోరబడితే అది మన అజ్ఞానం. స్వయంగా స్వామి అక్కడ నిల్చున్నాడు అని అనుకుంటేనే మనకు ఫలితం. 


*దశావతారాలు🙏*

సేకరణ

చమత్కారాలు

🔵భాషా చమత్కారాలు🔴 


🥀నక్షత్రయుక్తo చమత్కారం చూ( చదవండి )డండి .🥀


💥💥💥💥💥💥💥💥💥


నక్షత్రము గల చిన్నది

నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్

నక్షత్రమునకు రమ్మని

నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెన్


💥💥💥💥💥💥💥💥💥


ఇందులో నాలుగు నక్షత్రాలు దాగి ఉన్నాయి. పదే పదే చదివితేనే కానీ అంతసులువుగా అర్థమయేవికావు. ఇటువంటి ప్రహేళికలను'ప్రముషితా' ప్రహేళికలని అంటారని కవి దండి తన'కావ్యాదర్శం' లో చెప్పాడు.


ఇప్పుడు వివరణ చూద్దాం!

మహాభారతంలో విరాటపర్వం చదువనివారుండరు. విరాటరాజు కుమార్తె "ఉత్తర" (నక్షత్రం పేరు ) ఆమె అభిమన్యుని భార్య. 

నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ పాత్ర "భరణిని" ( నక్షత్రం పేరు ) చేతిలో పట్టుకొని ; నక్షత్రప్రభున్ నక్షత్రాలకు ప్రభువైన చంద్రుని వంశపు ( చంద్రవంశము ) అభిమన్యుని; నక్షత్రమునకు రమ్మని అంటే ఒక "మూల" ( నక్షత్రం పేరు ) కు రమ్మని పిలిచి; 

నక్షత్రము పైనవేసి అంటే "హస్త" (నక్షత్రం పేరు ) మును అతని మీదవేసి; నాథుని పిలిచెన్ అంటే పతియైన అభిమన్యుని ప్రేమగా పిలిచిందట.


అమ్మో! ఈ పద్యం అర్థంకాకుంటే మీకు నిజంగానే నక్షత్రాలు కనిపించేవి కదూ! అదీ మరి కవి చమత్కారమంటే!


💥💥💥💥💥💥💥

తెలుగును తెలుగులో రాస్తే

 *సేకరించబడినది*

******************


*తెలుగును తెలుగులో రాస్తే జైల్లో పెడతారా?*

మాతృ భాష. అమ్మ భాష. మన భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి/తెలంగాణా తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం. పడాలి కూడా. భాసించేది భాష.అంటే వెలిగేది, వెలుగును పంచేది. అంటే నిజమయిన వెలుగుగురించి చెప్పాలన్నా కాంతిమంతంగా వెలిగే భాష లేకపోతే సాధ్యం కాదన్నమాట. అందుకే మండే సూర్యుడి వెలుగును సంకేతిస్తూ భాస్కరుడు అంటున్నాం. మాట కూడా అంతటి సూర్యుడికి తక్కువేమీ కాదని భాష అంటున్నాం.

మాట్లాడే భాష ;

రాసే భాష,

మాండలిక భాష ;

ప్రామాణిక భాష;

భాషా భేదాలు;

భాషా భాగాలు ;

బాషా శాస్త్రం ;

భాషోత్పత్తి శాస్త్రం;

మెదడు- భాష;

భాష- ఆలోచనలు;

భాష- సృజనాత్మకత;

భాష- అభివృద్ధి…

ఇవన్నీ చాలా లోతయిన అంశాలు. ఏ కొద్ది మందికో తప్ప ఎవరికీ పట్టవు. భారత దేశంలో మాతృభాష పరిరక్షణలో తమిళుల స్ఫూర్తి, పట్టుదల ఇంకెవరికీ అబ్బలేదు. అది వారి రక్తంలో అణువణువునా ఉంది. మన రక్త పరీక్షలో లేదని తేలింది.

ఇంకొన్నేళ్ళకు తెలుగుభాష అంతరించిపోతుందని కొందరు అనవసరంగా భయపెడతారు. ఇంత ప్రామాణికమయిన లిపి, వాడుక ఉన్న తెలుగు భాష అంతరించిపోదు. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణ మూర్తి లాంటివారు 50 ఏళ్ల కిందటే అంచనా వేసినట్లు కనీసం చివర క్రియాపదం ఒంటికాలి మీద అయినా తెలుగు బతికి ఉంటుంది.

ట్రెయిన్ లేట్ గా వచ్చింది.

బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది.

డోర్ ఓపెన్ కాలేదు.

కార్ స్పీడ్ గా వెళ్ళింది. ఇలా మనం రోజువారీ వ్యవహారంలో అద్భుతమయిన తెలుగు మాట్లాడుతున్నాం అనుకుంటున్న తెలుగులో ముప్పాతిక భాగం తెలుగు కాదు.

ట్రయిన్ ఈజ్ లేట్.

దేర్ ఈజ్ నో బ్యాలెన్స్.

డోర్ ఈజ్ నాట్ ఓపెనింగ్… అని మాట్లాడితే బాధపడాలికానీ- చివర క్రియా పదంలో అయినా తెలుగుభాష వాడుతున్నందుకు మనల్ను మనమే అభినందించుకోవాలి. ముప్పాతిక భాగం భాష చచ్చి, పాతిక భాగమే బతుకుతోందని బాధపడ్డం దండగ. ఆమాత్రం అయినా బతికిస్తున్నాం కదా! అనుకుంటే పండగ.

తెలుగు భాషలో ఒత్తులు నేటితరానికి పెద్ద సమస్య. భాషా పండితులు, మేధావులు, శ్రేయోభిలాషులు అందరూ అలోచించి అసలు ఒత్తులే లేని తెలుగు భాషను ఆవిష్కరించడానికి ప్రయత్నించాలి. ఒత్తులు పలకలేని యాంకర్లను సానుభూతితో అర్థం చేసుకోవాలేగాని, వారిని సంస్కరించడానికి ప్రయతించకూడదు.

ఒత్తులు రాయలేనివారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పూర్తిగా ఇంగ్లీషులో రాయడంతో పోలిస్తే ఒత్తుల్లేకుండా అయినా తెలుగులో రాస్తున్నవారు దేవుళ్లతో సమానం. ఒత్తలేని జాతిని పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకోవాలి. భావం ప్రధానం కానీ భాష ప్రధానం కాదు- అన్న ఆధునికుల సిద్ధాంతాన్ని భాషా శాస్త్రవేత్తలు నిండుమనసుతో, నిర్మాణాత్మక దృష్టితో, వాస్తవ స్థితిగతుల నేపథ్యంలో అంగీకరించాలి.

తెలుగు భాష అంతరించకపోవచ్చు కానీ, తెలుగు లిపి మాత్రం అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. దానికి మనమే కారణం. కానీ మనం ఒప్పుకోము.

సినిమా పాటలు ఏవి విడుదల చేసినా- భాష తెలుగే అయినా ఇంగ్లీషు లిపిలోనే ఉంటాయి. నెమ్మదిగా తెలుగు భాషను ఇంగ్లీషు లిపిలో రాయడం ఆచారం, పద్ధతి, ఫ్యాషన్ గా అలవాటు చేశారు.

మొన్నటివరకు ఈ లిపి హత్యా నేరాలు సినిమావారే చేసేవారు. ఇప్పుడు వారికి వాణిజ్య ప్రకటనలు కూడా తోడయ్యాయి. “మా తాజా కూరలే కొనండి” అన్న తెలుగు పిలుపును

“Ma taja kurale konandi”

అని ఇంగ్లిష్ లిపిలోనే అఘోరించాలి.

పొరపాటున తెలుగు లిపిలో రాస్తే… పాతరాతియుగపు గుహల్లో చెకుముకి రాళ్లను రాజేసి వంట చేసుకునే ఆదిమ మానవులు అనుకుంటారన్న పరమ నాగరిక ఆలోచన అయినా ఉండి ఉండాలి! లేదా వెంటనే పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జైల్లో పెడతారన్న భయమైనా ఉండి ఉండాలి!

మాయాబజార్లో పింగళి మాట-

“పెళ్లి చేయమంటే కష్టం కానీ; చెడగొట్టమంటే చిటికెలో పని”-

అన్నట్లు భాషను ఉద్ధరించాలంటే కష్టంకానీ, నాశనం చేయాలంటే చిటికెలో పని. రండి బాబు రండి!

రండి తల్లీ రండి!

తలా ఓ చెయ్ వేసి తెలుగు లిపిని నామరూపాల్లేకుండా చేద్దాం.

తిలాపాపం తలా కడివెడు పంచుకుందాం.

వారం, పది రోజుల వ్యవధిలో కొన్ని కోట్లమందిని ప్రభావితం చేయగల సినిమా అతి పెద్ద మాధ్యమం. మాస్ మీడియా. అలాంటి సినిమాల్లో ఏటికి ఎదురీదుతూ…పట్టుమని నలుగురయినా తెలుగు భాషను, వ్యక్తీకరణను, సంస్కృతిని, మొత్తంగా తెలుగుతనాన్ని పట్టుకుని వేలాడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా నమస్కరించాలి.

ఏనాడో భాషా శాస్త్రవేత్తలు లెక్కకట్టినట్లుగా-

# తెలుగు సినిమాల్లో ముప్పాతిక శాతం ఇంగ్లీషును విధిగా వాడాలి.

# అర్థంలేని ఆరు పాటల్లో అర్థమున్న రెండుపాటలయినా పూర్తిగా ఇంగ్లీషు భాషలోనే పెట్టాలి. దీనికి హాలీవుడ్ కు వెళ్లాల్సిన పనేలేదు. మనవాళ్లెవరయినా అందమయిన తెలుగు రాయమంటే వణికిపోతారుకానీ, ఇంగ్లీషులో రాయమన్నా, పాడమన్నా అది మనకు వెన్నతో పెట్టిన మిథ్య.

# ఎలాగూ డిజిటల్ మీడియా అవసరాలు బాగా పెరిగాయి కాబట్టి పాటలకే కాకుండా మాటలకు కూడా ఇంగ్లీషు లిపిలో అక్షరాలు సినిమా మొత్తం వేయాలి. అసలు తెలుగు సినిమా మొత్తానికి ఇంగ్లీషు లిపిలో అక్షరాల్లేకపోతే సెన్సారు వారు అనుమతించకూడదు.

# తెలుగు భాషను ఇంగ్లీషు లిపిలోకి దించుతున్న పుణ్యపురుషులకు ఉత్తమ లిప్యంతరీకరణ (transliteration) అవార్డులను ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వాలి!

మన పొరుగున కర్ణాటక సముద్రతీరం మంగళూరు- ఉడిపి ప్రాంతాల్లో తుళు మాట్లాడతారు. తుళు ప్రత్యేక భాషే అయినా, కోటి మందికి పైగా తరతరాలుగా మాట్లాడుతున్నా ఇప్పుడు లిపి లేదు. కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి. నిజానికి ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు తుళుకు ప్రత్యేక లిపి ఉండేది.

అనేక కారణాల వల్ల లిపి అంతరించిపోయింది. కృష్ణదేవరాయల మాతృభాష తుళు. తుళు తన సొంత లిపిని మరచిపోయి, కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు- మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత లిపిని పూర్తిగా మరచిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు.

ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని, ఒరుసుకుని నున్నగా, గుండ్రంగా తయారయినట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా, అందంగా ఏర్పడింది.

నవ్వుతున్నట్లు ‘అ’అక్షరం ఎంత అందంగా ఉంటుంది? పురి విప్పిన నెమలిలా ‘ఖ’ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా ‘గ’ ఉంటుంది. బుగ్గన సొట్టలా ‘ఠ’ ఉంటుంది. రాయంచలా ‘హ’ ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల అందం, అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం. భాషకు శాశ్వతత్వం ఇచ్చేది, తరతరాలకు భాషను అందజేసేది లిపి.

మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు. తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన, బాగా దగ్గరయిన వర్ణమాల ఉంది. అంత నిర్దుష్టమయిన, నిర్దిష్టమయిన లిపి తెలుగుకు ఉంది. ముత్యాల్లాంటి, రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తాయి. అసహ్యించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి. వాడకూడనివిగా అనిపిస్తాయి.

తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తుంది. తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది. తెలుగును ఇప్పుడు ఇంగ్లీషులో రాయడం ఫ్యాషన్. మర్యాద. ట్రెండ్.

… *అన్నిటికీ మించి తెలుగు భాషను తెలుగు లిపిలోనే రాసే కొద్ది మంది మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా గట్టి భద్రత కల్పించాలి!*


సందర్భం:-

19-12-24 గురువారం ప్రధాన పత్రికలో ఫస్ట్ పేజీ రంగుల ప్రకటన.

“PRATHI INDIAN KI THODUGA

OKKATAVDAM. EDUGUDAM”

పొద్దున్నే వివిధ భంగిమల్లో పలుపలు విధాలుగా దీన్ని చదవడానికి ప్రయత్నించి…అర్థం కాక కాస్త విరామమిచ్చి… చివరికి ఇంగ్లిష్ ఏ బి సి డి లు తెలియడం వల్ల పజిల్ చిక్కు ముడి విడివడినట్లు…అది:-

“ప్రతి ఇండియన్ కి తోడుగా

ఒక్కటవుదాం.ఎదుగుదాం”

అన్న తెలుగు భాష, తెలుగు భావాన్ని ఇంగ్లిష్ లిపిలో అఘోరించారని అర్థమయ్యింది.

ఇలా నిత్యం పట్టపగలు నడిబజారులో తెలుగు లిపిని హత్య చేస్తున్న నేరాలు-ఘోరాలు ఎన్నో? ఎన్నెన్నో?

(అందమైన తెలుగు లిపి గుండెకోత గురించి రెండు మూడు పాత వ్యాసాలతో తాజా ఉదంతం కలబోత)

-పమిడికాల్వ మధుసూదన్ 9989090018

ముక్తి... మోక్షం.

 *ముక్తి... మోక్షం.....*


సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు. అందుకే అంటారు పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది..


వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు ? అని అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని, భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, దానధర్మాలు చేయాలని.. 


ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు. సామాన్యంగా. మరి ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టంగా చెబుతున్నారు. శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసలిచ్చినా, యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా, సత్కర్మలు, పుణ్యకార్యాలు ఎన్ని చేసినా, దేవతలను ఎంతగా పూజించినా ముక్తిలేదు. వందమంది బ్రహ్మలకాలం అంటే కోటానుకోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు, అని. మరి ఎలా వస్తుంది ? "ఆత్మైక్య బోధేన" నేను ఆత్మను అని "అనుభవరీత్యా గ్రహిస్తే" తప్ప ముక్తిలేదు.


పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే, వాటిని సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చై పోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే.


అయితే ముక్తి పొందాలనుకున్నవారు, మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా ? చేయకూడదా ? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి - నిష్కామంగా, ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం. సరే మరి ఇంత కర్కశంగా చెప్పటం ఎందుకు ? 

వేదాంతాన్ని అభ్యసించటానికి ఒక సద్గురువును సమీపించేటప్పటికే శిష్యుడు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. 


ఈ సంసార సాగరాన్ని తరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించినప్పుడు గురువు చెప్పే సునిశిత విషయాలను గ్రహించే మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, బుద్ధిసూక్ష్మత శిష్యునికి ఉండాలి. అలా ఉండాలంటే అప్పటికే అతడు ధార్మిక జీవనానికి అలవాటు పడి, నిష్కామ కర్మలు, జపతపాలు ఇష్టదేవతారాధన మొదలైన వాటిని సక్రమంగా ఆచరించే ఉండాలి. 


అయితే ఆ కర్మకాండను విడిచిపెట్ట లేకుండా దానికే అతుక్కుపోయి ఉండకూడదు. తాను చెప్పే నూతన విషయాలను; సూక్ష్మ బుద్ధికి తప్ప అంతుబట్టని వేదాంత విషయాలను అతడు చక్కగా అర్థం చేసుకొని వదలవలసిన వాటిని వదిలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. తీవ్రమైన మోక్షాపేక్షతో తన దగ్గరకు వచ్చిన శిష్యుడు దృఢ నిశ్చయంతో మోక్షమార్గంలో ప్రయాణించాలంటే తాను కొన్ని కఠోరమైన సత్యాలను చెప్పక తప్పదు. అందుకే ఇలా గట్టిగా చెప్పటం. ఇక్కడ అన్ని మతాల ఆచారాలను ఖండిస్తున్నట్లుగా అనిపిస్తుందే గాని అవి పరిమిత ప్రయోజనాలనిస్తాయనటంలో సందేహించాల్సింది లేదు

విశ్వనాథ సత్యనారాయణ రైలు ప్రయాణం

 విశ్వనాథ సత్యనారాయణ రైలు ప్రయాణం 

(ఒకసారి అబ్బూరి, జలసూత్రం, విశ్వనాథ ఒకే రైల్లో ప్రయాణిస్తున్నారు. విశ్వనాథ కాసేపు విశ్రాంతి తీసుకుంటానని పై బెర్తు మీదకెక్కారు. కాసేపటికి అదే పెట్టె ఎక్కి కూర్చున్న ప్రయాణికులిద్దరు పిచ్చాపాటీ మాట్లాడటం ప్రారంభించి సంభాషణను సాహిత్యం వైపు మళ్లించారు. యాధృచ్ఛికంగా, పైబెర్తు మీద ఉన్నది విశ్వనాథ అన్నది వాళ్ళకి తెలియకనే, ఆ సంభాషణ విశ్వనాథ సాహిత్యం వైపు మళ్లుతుంది)

పెద్దాయన (ఒక ప్రయాణికుడు) అన్నాడు, “ఏమన్నా అనువోయి, విశ్వనాథ ఉన్నాడే – మహా ఘటికుడు, వాడి తస్సాదియ్యా, ఏం రాస్తాడయ్యా – కొన్ని పద్యాలు అమోఘం… ఈ పద్యం విను…

ఒక యెన్నొ పుట్టుకలకు ముందరైన మ

త్ర్పారబ్ధ మీరీతి బరిణమించె

నానా విచిత్ర జన్మకృతాస్మదఘరాశి

అయి అయి నేటి కిట్లయ్యె దుదకు

పితృదత్తమగు నాస్తి హతమయ్యె నా యందు

ఆయనిచ్చిన భార్య యట్లె పోయె

నా తండ్రి చేసిన నానా మహాపుణ్య

కర్మ లీగతి గంగ గలసిపోయె

మిగిలినది యొక్కడే నాకు మేరువంత

బరువు నా గుండెలో మధ్య భాగమందు

అంతె పేరున కంతె భార్యాస్థిగాని

నా శరీరాస్థి నిజము కృష్ణార్పణమ్ము…”

[జలసూత్రం రుక్మిణీనాథ] శాస్త్రి వాళ్ళిద్దరి వంకా, ముఖ్యంగా పద్యం చదివినాయన వంకా కనురెప్ప వాల్చకుండా చూస్తున్నాడు ఆశ్చర్య సంభ్రమాలతో. నేనూ చకితుణ్ణయినాను. ఎంచాతనంటే ఆ పద్యం నాకూ ఎంతో నచ్చిన పద్యం. నేను పైకి చూశాను. సత్యనారాయణ గారు మేల్కొని ఉన్నారు. కింద మాకెదురుగా కూచున్న వాళ్ళ వంక చూస్తున్నారు. … ఇంతలో ఏదో స్టేషను వచ్చి రైలాగింది. వాళ్ళిద్దరూ దిగిపోయారు. …

“వాళ్ళెవరో కనుక్కుంటే బాగుండేది” అన్నాడు శాస్త్రి.

“అనవసరం” అన్నాను. …

సత్యనారాయణ గారు కిందికొచ్చారు.

కింద జరుగుతున్నదంతా వింటున్నారా అని అడిగాను. ఆయన నవ్వుతూ, “వినకేం – నాకు దుఃఖం కూడా వొచ్చింది. నన్ను మెచ్చుకునే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు – ఒక్క తిట్టేవాళ్ళే కాక – అని తెలిసింది” అన్నారు.

“మీరు మరీని – మిమ్మల్ని తిట్టే అధికారం యెవరికుందండీ? ఆ రోజులు మరిచిపొండి” అన్నాడు శాస్త్రి.

“ఇప్పుడు విన్నారుగా – ఇలా దేశంలో ఎంతమంది మీరెవరో తెలియకుండా మీ కవిత్వాన్ని మెచ్చుకునే వాళ్లున్నారో! నాకు మాత్రం నమ్మకం ఉంది. మీర్రాసిన పద్యాల్లో చాలావరకు నిలుస్తయని”

“అది కాదయ్యా! నేను చచ్చిపోయిం తరవాత ఎలా ఏడిస్తే నాకేం లాభం? ఆ దృష్టితో నేను రాయటం లేదు. నా ఆనందం కోసం నేను రాస్తున్నాను. నా అనుభూతి నాది. కవిత్వం చెప్పటం నా ధర్మం. అంతే కాదు, విద్యుక్త ధర్మం అని భావించేవాళ్ళల్లో నేను మొదటివాణ్ణి. ఎందుకంటే, నా సంస్కారం పూర్వజన్మ సుకృతం కనుక. నీకు నచ్చితే చదువు. లేకపోతే మానేయి. ఎవరి కవిత్వాన్ని అయినా ఆనందించాలంటే ఆ కవికున్న సంస్కారంలో కొంత పాలన్నా ఆ చదివేవాడికుండాలి. అది లేనప్పుడు ఆ కవిత్వం జోలికి పోకూడదు… ఆ నా పద్యం విన్నావు కదా! నా ట్రాజెడీ – నా గుండె పగిలి ధారాపాతమయిన నెత్తుటితో విరచితాలయిన పంక్తులవి – వింటున్నావా శాస్త్రీ! సహృదయతా, సానుభూతీ లేని వాడెలా గ్రహించగలడిలాంటి పద్యాన్ని?” అన్నారు సత్యనారాయణ గారు.

అప్పిచ్చు వాడు

 అప్పిచ్చు వాడు వైద్యుడు!

కాఫీ కప్పిచ్చు వాడు సర్వరుడు!

తిని టిప్పిచ్చు వాడు కస్టమరుడు!

కరీం బీడీకి నిప్పిచ్చు వాడు నిజమగు మిత్రుడు!

బాకీ తీర్చక తిప్పిచ్చువాడు బతక నేర్చినవాడు!

వండి పెళ్ళామును మెప్పిచ్చు వాడు అసలు మొగుడు!

మామిడికాయ పప్పులో ఇంగువ గుప్పిచ్చు వాడు గొప్ప వంటగాడు! 

ముప్పూటా స్విగ్గీ తెప్పిచ్చువాడు భార్యా బాధితుడు!

ఇంట్లో ఉండీ లేడని చెప్పిచ్చువాడు దేశ ముదురుడు!

పాటకు లిప్పిచ్చు వాడు కథానాయకుడు!                       

పోస్టులందు హాస్యము చొప్పిచ్చువాడు మేటి రాతగాడు!

ప్రేయసి మనసు నొప్పిచ్చువాడు ఆధునిక ప్రియుడు!

ప్రియురాలిని ఒప్పిచ్చువాడు పాత కాలపు ప్రేమికుడు!

ఆపద తప్పిచ్చు వాడు భగవంతుడు!

కాలము తీరినంత పైకి రప్పిచ్చు వాడు యమకింకరుడు, 

మొబైలే లేని వాడు దైవ స్వరూపుడు

వాట్సప్ లేనివాడు యోగీశ్వరుడు

ఉండీ ఫార్వర్డ్ లు చేయనివాడు ధృఢచిత్తుడు

కదరా సుమతీ!.. ✍️

8. వ పాశురం

 _*రేపటి తిరుప్పావై ఎనిమిదవ పాశురం*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 

*🌴8. వ పాశురం🌴*


    *కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు*

    *మేయ్ వాన్ పరన్దనకాణ్!* *మిక్కుళ్ళపిళ్ళైగళుమ్*

    *పోవాన్ పొగిన్ఱారై* *ప్పోగామల్ కాత్తున్నై*

    *కూవువాన్ వన్దు* *నిన్ఱోమ్; కోదుకల ముడైయ*

    *పావాయ్!* *ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు*

    *మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ*

    *దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్*

    *ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.*


*🌳భావం:🌳*


తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని , అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా ! మరింక ఆలస్యమెందుకు ? లెమ్ము ! ఆశ్వాసురరూపుడైన కేశిని , చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి , మన నోమునకు కావలసిన *'పఱై'*  అనే సాధనమును పొందుదాము. అతని రాకకు ముందే మనమచటకు పోయిన అతడు *'అయ్యో ! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!'* యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.


  

   *🍀అవతారిక:🍀*


క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము.     


           

  *🌹8 వ మాలిక🌹*


*(మలయమారుత రాగము - ఆదితాళము)*


ప.    తూరుపు తెలవారె ! ఓ జవ్వనీ లేవవె !

    తీరుగ మహిషములు మేతకై ! తరలె !

    తూరుపు తెలవారె ! ఓ జవ్వనీ లేవవె !


అ..ప.    పరమార్ధమని యెంచి శ్రీకృష్ణునే చేరు

    తరుణుల నిలిపి యిటు నీకై వచ్చితి మమ్మ   

    తూరుపు తెలవారె ! ఓ జవ్వనీ లేవవె !


చ..    కేశినోటిని జీల్చి మల్లుర మదమణచిన

    కేశవుడౌ సర్వేశుని జేరి

    ఆశల 'పఱ'గొని కృష్ణు స్తుతింయింప - లో

    కేశుడౌ తాను కాపాడడే మనల

    తూరుపు తెలవారె ! ఓ జవ్వనీ లేవవె !

    తీరుగ మహిషములు మేతకై తరలె !


🙏💐🌻🌺🌸🦜🦚🌞🌝

జ్ఞానాన్ని పెంచే పెద్ద ఆయుధం అతని సహనం

 🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏 🔥* * *మనిషిలో జ్ఞానాన్ని పెంచే పెద్ద ఆయుధం అతని సహనం.. అయితే అజ్ఞానాన్ని పెంచే అతి పెద్ద ఆయుధం అతని ఆవేశం* జీవితంలో ఎవరికీ ఎవరూ శాశ్వతం కాదు.. ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలసి సంతోషంగా బతకడం లోనే ఉంది నిజమైన అనందం🔥మనిషికి గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు.. వెనుక ఉన్న దానాన్ని చూసి కాదు.. ఎంత ఖరీధైన చెప్పులు వేసుకున్నా గుడి బయటే వదిలేస్తాము.. కానీ గుడిలోకి తీసుకువెళ్ళాము కదా!!..కాలానికి గొప్ప శక్తి ఉంది.. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్న ఎదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపము బయట పెడుతుంది🔥నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి..ముందున్న కాలుకి తాను ముందు ఉన్నానని గర్వం లేదు..తాను వెనుక పడ్డానన్ని వెనుకున్న కాలుకి అవమానం లేదు..ఈ రెండిటికి తెలుసు వాటి స్థానం శాశ్వతం కాదని క్షణాల్లో మారుతుందని..మన జీవితం కూడా అంతే..మనకన్నా ముందు ఉన్న వాళ్ళన చూసి ఈర్ష్య పడకూడదు..మన వెనుకున్న వారిని చూసి గర్య పడడం రెండు ప్రమాదమే🔥విజయం నుంచి బలం చేకూరదు..మీ పోరాఠాలు మీ బలాలను వృద్ధి చేస్తాయి.. కష్టాలెదురైనప్పుడు వాటికి లొంగక పోవడమే నీ బలం..నువ్వు అనే తాళం చెవ్విని పోగొట్టుకుంటే సంతోషం అనే తలుపు ఎప్పటికి తెరుచుకోదు..అందుకే అనందంగా జీవించండి🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజెన్సీస్ . D.N.29-2-3 .గోకవరం బస్టాండ్ దగ్గర .స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం. మందులు అయిపోయిన వారు లేదా కొత్త వారికి రాలేని వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏

*22, డిసెంబర్, 2024* *దృగ్గణిత పంచాంగం*

 



         *22, డిసెంబర్, 2024*

          *దృగ్గణిత పంచాంగం*

               


*సూర్యోదయాస్తమయాలు:*

ఉ 06.32 / సా 05.41

సూర్యరాశి : ధనుస్సు 

చంద్రరాశి : సింహం/కన్య


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం*

*హేమంత ఋతౌః / మార్గశిర మాసం / కృష్ణపక్షం*


*తిథి : సప్తమి* మ 02.31 వరకు ఉపరి అష్టమి

*వారం  : ఆదివారం*(భానువాసరే )

*నక్షత్రం : ఉత్తర* పూర్తిగా రోజంతా రాత్రితో సహా. 


*యోగం  : ఆయుష్మాన్* సా 07.00 వరకు ఉపరి  

*కరణం : బవ* మ 02.31 బాలువ రా 03.47 ఉపరి కౌలువ


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 09.00 & 11.00 - 12.00*

అమృత కాలం  : రా 01.04 - 02.52

అభిజిత్ కాలం  : ప 11.44 - 12.29


*వర్జ్యం : మ 02.18 - 04.06*

*దుర్ముహూర్తం :సా 04.11- 04.56*

*రాహు కాలం : సా 04.17 - 05.41*

గుళికకాళం : మ 02.53 - 04.17

యమగండం : మ 12.06 - 01.30

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  ఉ 06.32 - 08.46

సంగవ కాలం    :    08.46 - 10.59

మధ్యాహ్న కాలం  :  10.59 - 01.13

అపరాహ్న కాలం  : మ 01.13 - 03.27

*ఆబ్ధికం తిధి        : శూన్య తిధి*

సాయంకాలం   :  సా 03.27 - 05.41

ప్రదోష కాలం  :  సా 05.41 - 08.15

రాత్రి కాలం : రా 08.15 - 11.41

నిశీధి కాలం      :  రా 11.41 - 12.32

బ్రాహ్మీ ముహూర్తం :   తె 04.49 - 05.41


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



       *22-12-2024-ఆదివారం*

                *రాశి ఫలితాలు:*

                   


```

మేషం

స్తిరస్థులు క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆదయానికి మించి ఖర్చులుంటాయి. బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. 


వృషభం

సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.


మిధునం

సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.


కర్కాటకం

భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి.


సింహం

నిరుద్యోగులు నిరీక్షణ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.


కన్య

ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో ఆకారణ విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేసుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.


తుల

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.


వృశ్చికం

బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. పనులలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాలా బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది.


ధనస్సు

చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందితుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.


మకరం

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు తప్పవు.


కుంభం

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. నూతన రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.


మీనం

ఆదాయ మార్గలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందింతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది

ఏది చేయాలి ఏది చేయకూడదు

 16.24

*తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ ।*

*జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ।। 24 ।।*

तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ |

ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि || 24||


తస్మాత్ — కాబట్టి; శాస్త్రం — శాస్త్రములు; ప్రమాణం — ప్రమాణములు; తే — నీకు; కార్య — విధులు (చేయవలసినవి); అకార్య — నిషేధింపబడిన కార్యములు; వ్యవస్థితౌ — నిర్ణయించుకోవటానికి; జ్ఞాత్వా — తెలుసుకొన్న పిదప; శాస్త్ర — శాస్త్రముల; విధాన — ఉపదేశము; ఉక్తం — తెలియచేయబడిన విధముగా; కర్మ — కర్మలు; కర్తుమ్ — చేయుట; ఇహ — ఈ జగత్తులో; అర్హసి — అర్హుడవు.


*BG 16.24 : కాబట్టి, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధివిధానాలు, ఉపదేశాలను తెలుసుకొనుము మరియు ఆవిధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము.*


*వ్యాఖ్యానం*


శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు ఈ అధ్యాయము లోని తన ఉపదేశము యొక్క అంతిమ ముగింపును ఇక్కడ ఇస్తున్నాడు. దైవీ మరియు ఆసురీ గుణములను పోల్చిచూపి, తేడాలను వివరించిన పిదప, ఆసురీ గుణములు ఏ విధంగా నరక లోకాలకు దారి తీస్తాయో వివరించాడు. ఈ విధంగా, శాస్త్ర విధివిధానములను తిరస్కరిస్తే మనకు వచ్చే లాభం ఏమీ లేదు అని ధృవీకరించాడు. ఇప్పుడు, ఏ ఒక్క పని (కార్యము) యొక్క ఔచిత్యం (మంచో చెడో) నిర్ణయించాలన్నా వేద శాస్త్రములే ప్రమాణములు అని గట్టిగా చెప్తున్నాడు. 

  కొన్నికొన్ని సార్లు, మంచి ఉద్దేశ్యంతో ఉన్నవారు కూడా, ‘నేను ఏ నియమాలు పట్టించుకోను, నా మనస్సు చెప్పినట్టే వింటాను, నాకు నచ్చినట్టు చేస్తాను’ అని అంటుంటారు. మనస్సు చెప్పినట్టు అనుసరించటం మంచిదే అనుకున్నా, వారి మనస్సు వారిని తప్పుదోవ పట్టించటం లేదు అన్న గ్యారంటీ లేదుగా? ఇలా ఒక నానుడిలో చెప్పినట్టు, ‘నరకానికి మార్గం మంచి భావాలతోనే వేయబడి ఉంటుంది’ (The road to hell is paved with good intentions) అందుకే, మన మనస్సు మనలను సరియైన దిశలోనే తీసుకువెళుతున్నదా లేదా అనేదాన్ని శాస్త్రములతో పరీక్షించి సరిచూసుకోవాలి. మనుస్మృతి ఇలా పేర్కొంటున్నది: 

 భూతం భవ్యం భవిష్యం చ సర్వం వేదాత్ ప్రసిధ్యతి  

  (12.97)  

 ‘భూత, వర్తమాన, భవిష్యత్తులలో ఏ ఆధ్యాత్మిక సూత్రము యొక్క ప్రామాణికత అయినా వేదము ఆధారంగానే నిర్ణయింపబడాలి.’ కాబట్టి, శాస్త్రముల ఉపదేశం అర్థం చేసుకుని, తద్విధముగానే నడుచుకొమ్మని అర్జునుడికి చెప్తూ ఈ అధ్యాయమును ముగిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు.


ఒరిజినల్ ఇంగ్లీష్ మూలం ఇక్కడ చూడండి: https://www.holy-bhagavad-gita.org/chapter/16/verse/24