22, డిసెంబర్ 2024, ఆదివారం

*22, డిసెంబర్, 2024* *దృగ్గణిత పంచాంగం*

 



         *22, డిసెంబర్, 2024*

          *దృగ్గణిత పంచాంగం*

               


*సూర్యోదయాస్తమయాలు:*

ఉ 06.32 / సా 05.41

సూర్యరాశి : ధనుస్సు 

చంద్రరాశి : సింహం/కన్య


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం*

*హేమంత ఋతౌః / మార్గశిర మాసం / కృష్ణపక్షం*


*తిథి : సప్తమి* మ 02.31 వరకు ఉపరి అష్టమి

*వారం  : ఆదివారం*(భానువాసరే )

*నక్షత్రం : ఉత్తర* పూర్తిగా రోజంతా రాత్రితో సహా. 


*యోగం  : ఆయుష్మాన్* సా 07.00 వరకు ఉపరి  

*కరణం : బవ* మ 02.31 బాలువ రా 03.47 ఉపరి కౌలువ


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 09.00 & 11.00 - 12.00*

అమృత కాలం  : రా 01.04 - 02.52

అభిజిత్ కాలం  : ప 11.44 - 12.29


*వర్జ్యం : మ 02.18 - 04.06*

*దుర్ముహూర్తం :సా 04.11- 04.56*

*రాహు కాలం : సా 04.17 - 05.41*

గుళికకాళం : మ 02.53 - 04.17

యమగండం : మ 12.06 - 01.30

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  ఉ 06.32 - 08.46

సంగవ కాలం    :    08.46 - 10.59

మధ్యాహ్న కాలం  :  10.59 - 01.13

అపరాహ్న కాలం  : మ 01.13 - 03.27

*ఆబ్ధికం తిధి        : శూన్య తిధి*

సాయంకాలం   :  సా 03.27 - 05.41

ప్రదోష కాలం  :  సా 05.41 - 08.15

రాత్రి కాలం : రా 08.15 - 11.41

నిశీధి కాలం      :  రా 11.41 - 12.32

బ్రాహ్మీ ముహూర్తం :   తె 04.49 - 05.41


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



       *22-12-2024-ఆదివారం*

                *రాశి ఫలితాలు:*

                   


```

మేషం

స్తిరస్థులు క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆదయానికి మించి ఖర్చులుంటాయి. బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. 


వృషభం

సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.


మిధునం

సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.


కర్కాటకం

భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి.


సింహం

నిరుద్యోగులు నిరీక్షణ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.


కన్య

ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో ఆకారణ విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేసుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.


తుల

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.


వృశ్చికం

బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. పనులలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాలా బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది.


ధనస్సు

చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందితుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.


మకరం

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు తప్పవు.


కుంభం

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. నూతన రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.


మీనం

ఆదాయ మార్గలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందింతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది

కామెంట్‌లు లేవు: