9, మే 2023, మంగళవారం

అకాల మృత్యు హరణం

 *అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం!!* 

పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు...

💧 *తీర్ధం* యొక్క విశిష్టత ప్రత్యేకంగా ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం...

దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో

💦 *పంచామృతాలు* ,

☘ *తులసి దళాలు* ,

🥃 *సుగంధ ద్రవ్యాలు* ,

📿 *మంత్ర శక్తులు* ఉంటాయి. 

దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. 

తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి.

*మొదటిసారి* తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. ( *అకాల మృత్యు హరణం* )

*రెండవసారి* తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ( *సర్వవ్యాధి నివారణం!* )

*మూడవది* పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి.( *సమస్త పాపక్షయకరం* )

*మన పురాణాల* ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. 

దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. 

తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. 

ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి...

మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. 

*కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం ముద్ర* వస్తుంది. 

ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. 

తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. 

అలా చేయకూడదు, తల పైన బ్రహ్మ రంద్రం *సహస్రార చక్ర* ఉంటుంది...

మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము, కనుక కళ్లకద్దుకోవడం మంచిది...

పితృయజ్ఞరహస్యాలు

 *పితృయజ్ఞరహస్యాలు* 

మనిషి మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు

పెడుతుంటారు. 

 *మాసికాలు ఎందుకు పెట్టాలి?* 

*అన్ని_మాసికాలు_పెట్టాలా?*

*కొన్నిమానేయవచ్చా?*

వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 

*అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*

*కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* 

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.

*మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.*

దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

*మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.* 

*ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది*.

*ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.*

*ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.*

*నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.* 

*కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.*

*యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*

*ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*

*దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.*

*అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.*

*సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.*

*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*

*వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.*

*దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*

*మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).* 

*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*

*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.* 

*ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.*

*ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.* 

*ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*

*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.* 

*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*

*ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.* 

*ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.*

*నిజానికి మొత్తం 16 పిండాలు సంవత్సర కాలంలో ఇస్తారు.*

*వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*

*అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*

*ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*

*కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*

*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.* 

*మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*

*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.* 

*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*

*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   

ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.

*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.*

*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.*

పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 

*నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* 

అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 

గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 

ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.

 వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  

వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 

  తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. మాసికాలు అన్ని బ్రాహ్మణ కులానికి సంబంధించినవి! మరి మిగతా కులాల సంగతి ఏమిటి అని చాలామందికి సందేహం వస్తుంది మిగతా కులాల వారు ఆమ శ్రాధ్ధం అంటే స్వయంపాక దానం చేయాలి. అది ఉదయం 12లోపు చేయాలి .బ్రాహ్మణ కులం వారు 12 తర్వాత. అపరాహ్ణ కాలంలోనే భోక్తలకు భోజనం పెట్టాలి.మనిషి మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు పెడుతుంటారు 

 మాసికాలు_ఎందుకు_పెట్టాలి?*

*అన్ని_మాసికాలు_పెట్టాలా?*

*కొన్నిమానేయవచ్చా?*

వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 

*అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*

*కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* 

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.

*మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.*

దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

*మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.* 

*ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది*.

*ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.*

*ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.*

*నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.* 

*కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.*

*యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*

*ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*

*దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.*

*అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.*

*సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.*

*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*

*వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.*

*దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*

*మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).* 

*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*

*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.* 

*ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.*

*ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.* 

*ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*

*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.* 

*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*

*ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.* 

*ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.*

*నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.*

*వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*

*అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*

*ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*

*కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*

*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.* 

*మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*

*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.* 

*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*

*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   

ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.

*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.*

*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.*

పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 

*నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* 

అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 

గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 

ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.

వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  

వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 

తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు. ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. మాసికాలు అన్ని బ్రాహ్మణ కులానికి సంబంధించినవి! మరి మిగతా కులాల సంగతి ఏమిటి అని చాలామందికి సందేహం వస్తుంది మిగతా కులాల వారు ఆమ శ్రాధ్ధం అంటే స్వయంపాక దానం చేయాలి. అది ఉదయం 12లోపు చేయాలి .బ్రాహ్మణ కులం వారు 12 తర్వాత. అపరాహ్ణ కాలంలోనే భోక్తలకు భోజనం పెట్టాలి.

శివార్పణం

 *ఓం నమః శివాయ. శివాయ గురవే నమః*

లంకలో రావణకాష్టం

 లంకలో రావణకాష్టం

శ్రీలంకలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అక్కడి తమిళులు భయం గుప్పిట నివసిస్తున్నారు. ఎన్నో రకాల ఆంక్షలు. తమిళనాడులో తలదాచుకున్న కొంతమంది శ్రీలంక తమిళులు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు.

అంతకు వారం క్రితమే శ్రీలంక తమిళుల నాయకుడు పద్మనాభ హత్య జరిగింది. దాంతో శ్రీలంకలో భయంకరమైన పరిస్థితి నెలకొంది.

ఆరోజు మహాస్వామి వారి దర్శనం కోసం చాలామంది భక్తులు వేచిఉన్నారు. లంక తమిళుల వంతు రాగానే, వారి బాధలను, కష్టాలను స్వామివారికి చెప్పుకున్నారు. మహాస్వామివారు కరుణాస్వరూపులుగా అగుపించారు.

“మీ అస్తులన్నింటిని వదులుకుని కేవలం ఈ స్థితి నుండి బయటపడడానికి ఇక్కడకు వచ్చారు. ఇక్కడ మీ జీవితం ఎలా ఉంది? మీరు తెరిగి వెళ్తే, మీ ఆస్తులు మీకు దొరుకుతాయా?”

బహుశా అంత ప్రేమతో ఎవరూ వారిని పలకరించి ఉండరు. వారు లంకలో వారి దయనీయ పరిస్థితి గూర్చి వివరించారు. వారికి కలిగిన గాయాలకు పరమాచార్య స్వామివారి వాక్కులే పరమౌషదాలు.

“మీ దేశానికి శాంతి చేకూరుతుంది. . . మీరు మీ సంపద అంతా తిరిగి పొందుతారు!” అని ఆశీర్వదించారు స్వామివారు.

వీరు చాలా ఎక్కువసేపు సమయం తీసుకోవడం వల్ల, వరుసలో నిలబడి ఉన్న భక్తులు విసుగు చెందడం మొదలెట్టారు. శ్రీమఠం సేవకుడోకరు వారికి, “ఈరోజు కుదరకపోతే, మనమందరం మరొక్క రోజు వచ్చి పరమాచార్య స్వామివారిని దర్శించుకోవచ్చు. కాని వారి పరిస్థితి చూడండి ...” అని వివరించడంతో శాంతపడ్డారు.

--- టి. ఎ. భాష్యం, ఉత్తర మాడ వీధి, చిన్న కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 6 

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఆకలితో ఉన్న సింహం

 ఈ కథ మన హిందువులకు ముఖ్యంగా మరీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా నమ్మే వారికోసం ఇవ్వబడింది.ఎక్కడైనా మన ఉపన్యాసాల లో చెప్పుకోవచ్చు.

@@@@@@@@@@@@@@@@@@@

ఆకలితో ఉన్న సింహం నక్కతో అన్నది. *ఏదన్నా జంతువుని తీసుకురా లేకపోతే నిన్ను తింటాను* అన్నది. 

నక్క వెతగ్గా ఒక గాడిద కనబడింది. *సింహం నిన్ను తన వారసుడిగా నిన్ను ఈ అడవికి రాజును చేస్తానన్నది, నాతో రా!* అన్నది. 

గాడిదను చూడగానే దాడి చేసి దాని చెవులు కొరికేసింది. గాడిద పారిపోతూ నక్కతో కోపంగా:  *ఇంత మోసం చేస్తావా* అన్నది.

*పిచ్చిదానా! కిరీటం పెట్టడానికి చెవులడ్డమని కోరికిందంతే: ఏం సందేహించకు* అని నచ్చ చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది. 

ఈసారి దాడిలో దాని తోక దొరికితే కొరికి తెంపేసింది. మళ్ళీ పారిపోతూ కోపంతో బాధతో వెంట వస్తున్న నక్కతో: *మళ్ళీ మోసం చేశావు కదూ!* 

నక్క: *ఛీ! ఛీ! అదేంలేదు. నీన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తోక అడ్డమని కొరికేసిందంతే!* అన్నది.

సరే అని మళ్ళీ వచ్చిన గాడిదని సింహం చంపేసి నక్కతో: *దీని చర్మం వలిచి మెదడు, గుండె, లివరు ఊపిరితిత్తులు తీసుకురమ్మన్నది.*

నక్క మెదడు తాను తినేసి మిగిలినవి పట్టుకొచ్చింది. అవి చూసి సింహం: *వీటిలో మెదడేది?* అని అడిగింది.

నక్క: *ప్రభూ! దీనికి మెదడే లేదు. ఉండి ఉంటే మీరు దాడి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేది కాదు కదా!* అన్నది.

*నిజమే!* అన్నది సింహం.

సారాంశం, సందేశం:  *ఈదేశంలో హిందువుల మీద ఎన్ని దాడులు, అకృత్యాలు, హత్యలు జరుగుతున్నా సిక్యులర్ హిందువులు మాత్రం కళ్ళు తెరవటంలేదు. ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు.*

ఉదర నిమిత్తం బహుకృత వేషః

 ఉదర నిమిత్తం బహుకృత వేషః

ఆది శంకరాచార్యులవారు  దాదాపు రెండువేల ఐదువందల ఏళ్ళ క్రితం చెప్పిన శ్లోకం ఇప్పటి మన సమాజంలో మనం చూస్తున్న విషయాలకు అద్దంపట్టినట్లు ఉన్నదంటే అతిశయోక్తిలేదు. రోజులల్లో మనకు చాలామంది సత్గురువులు తారసపడుతున్నారువారి ఆకారాలు, వస్త్రధారణలు మనలను వారు సాక్షాతూ భగవానుని అవతారం అనేవిధంగా మభ్యపెడుతున్నారు. పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకొని, ఖరీదయిన భావంతులలో సకల భోగాలను అనుభవిస్తూ, మనలకు వేదాన్తభోదనలను చేస్తున్నారువారి శిష్యగణం అంతా అత్యంత ధనవంతులు, పెద్ద పెద్ద రాజకీయనాయకులు, ఇంకా ఇతర ధనికవర్గానికి చెందిన గొప్పవారు. వారి దర్శనానికి టికెట్, వారి పాద ప్రక్షాళణానికి టికెట్, మనఇంట్లో వారి పాదాలనుమోపితే టికెట్ ఇలా ప్రతి దానికి ఎంతో ఖరీదైన టికెట్లను వసూలు చేస్తూ వారి పబ్బాలను గడుపుకొని మనలను ఉద్ధరిస్తున్నామని చెప్పుతున్నారు. వారిని చుస్తే  "పైన పటారం లోన లొటారం" అన్న సామెతకు సారూప్యంగా వుంటున్నారు. ఒక స్వామిజి విభూతి ఇస్తారు, ఒక స్వామిజి కుంకుమ ఇస్తారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ దీవెనలు ఇస్తూ సామాన్యుల ధనాన్ని దోచుకుంటున్నారు. కొందరు గుండు చేసుకొని దర్శనమిస్తే కొందరు మీసాలకుగడ్డాలకు  కూడా రంగు వేసుకొని దర్శనమిస్తున్నారు, మరికొందరు జడలు పెంచుకొని వుంటున్నారుకొందరు ఖరీదైన కాషాయ వస్త్రాలు ధరిస్తే, కొందరు తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారుఏదో ఒక ప్రేత్యేక గుర్తింపు కలిగి వారే పరమేశ్వరుని అవతారాలని లేక ఈశ్వరుని దూతలమని చెప్పుకొంటూ అనేక విధాలుగా మన మనస్సులను వారి వశం చేసుకొని మననుంచి ద్రవ్యాన్ని కాజేస్తున్నారువారి శిష్యులకు పని జరిగింది పని జరిగింది అని ప్రచారాలు చేస్తూ అమాయక సామాన్య ప్రజలను వారి శిష్యగణంలో చేర్చుకొని వలసినంత దండుకుంటున్నారుసమశ్యలలో మునిగి తేలే సగటు మధ్యతరగతి మానవులు వారి ప్రసంగాలకు, వారిగూర్చి ఇతరులు చేసే ప్రచారాలకు లొంగి వారికేదో మేలు జరుగుతుందని భ్రమపడి అప్పులు చేసి మరి వారి దర్శనానికి వెళ్లి వారి వలలో పడుతూ తమ  జీవితాలను ఇక్కట్ల పాలు చేసుకుంటున్నారు

సముద్రంలో కొట్టుకొని వెళ్లే వాడికి చిన్న గడ్డిపరక దొరికినా ఎంతో ఊరట కలిగిస్తుంది అన్నట్లు నిత్యం సమశ్యలలో చిక్కుకొని అనేక కస్టాలు పడే సగటు మానవులకు దొంగ స్వాములు, గురువులు, దేవతా అవతారమూర్తులు చేసే ప్రసంగాలు, మాటలు వారికి ఎంతో ఆశను కలిగిస్తాయి. అందుకే వారికి ఏదో ఉపశమనం కలుగుతుందనే ఆశతో వారు ఏమిచేస్తున్నారో కూడా తెలియకుండా వారి వశమవుతున్నారు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో భగవంతుని అవతారం ఎత్తే సమయం ఇంకా రాలేదని తత్వవిదులు చెపుతున్నారు. నిజానికి భగవంతుడు భూమి మీద అవతారం ఎత్తితే సమాజాన్ని ఒక శ్రీ రాముడి లాగ లేక ఒక శ్రీకృష్ణుని లాగా ఉద్ధరిస్తారే కానీ వారి వారి స్వార్ధానికి మనలను దోచుకోరనే చిన్న నిజం తెలిస్తే ఎవ్వరు మోసపోరు. శ్రీ రామచంద్రులవారు ఒక సార్వభౌమ కుటుంబంలో జన్మించి కూడా అతి సామాన్యుని వలె నారవస్త్రాలను (చౌకబారు బట్టలు) ధరించి తన భార్య తమ్మునితో అడవిలో గుడిసెలలో (పర్ణశాలలో) నివసించి ఆకులు, అలమలు తిని మనకు తండ్రి మాటను నిలపెట్టుకోవటమే కుమారుని ధర్మం అని బోధించారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మగారు ఇప్పటికి నిత్యనూతనము సదా ఆచరణీయం అయిన శ్రీమత్ భగవత్గీతను మనకు ప్రసాదించారుఒక్కసారి ఆలోచించండి రోజుల్లో మనకు కనబడే బాబాలు, స్వామీజీలు వారి ముందు ఏపాటివారో

నిజానికి భగవంతుని ఆరాధించటానికి, భగవంతుని చేరటానికి కావలసింది నిష్కల్మషమైన మనస్సు, అకుంఠితమైన దీక్ష, శ్రర్ధ  మాత్రమే. అవిలేకుండా ఎవ్వరు భగవంతుని కృప కటాక్షాలను పొందలేరుధనంతో కొనలేనిది కేవలం భగవంతుడు మాత్రమేఇక శ్రీ శంకరాచార్యుల వారు నుడివిన శ్లోకాన్ని పరికిద్దాం

జటిలో ముండి లుంఛిత కేశః కాషాయాంబర బహుకృత వేషః| 

పశ్యన్నపి పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః||”

ఒకానొకడు జడలు ధరించీ, మరొకడు ముండనం చేయించుకునీ, ఇంకొకడు వెంట్రుకలు పెరికేసుకునీ, మరొకడు కాషాయ వస్త్రాలను ధరించీ ఉంటారు. చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని మూర్ఖులు పొట్టనింపు కోవటానికే అనేకానేక వేషాలు వేస్తూంటారు.”

జడలు పెంచుకోవడం, బోడిగుండు చేయించుకోవడం, జుట్టును దారుణంగా పెరికివేయడం, ఆర్భాటమైన వస్త్రాలు ధరించడంఇవన్నీ కూడా మూర్ఖమతులు పొట్టనింపుకోవడానికి చేసే ఆడంబరమైన, అర్థరహిత చర్యలు మాత్రమే.

జ్ఞాని అయినవాడు జడలు పెంచుకోడు, ప్రత్యేకమైన వస్త్రధారణ హాస్యస్పదమని తలుస్తాడు. ఉదర పోషణార్థం కష్టపడి పని చేస్తాడే కానీ కాషాయ వేషధారణల్లాంటివి చేయడు. ‘మూడవకన్నుఅంటేదివ్యచక్షువుఉండి కూడా దానిని వినియోగించని వాడు మూర్ఖ మానవుడు. సత్యం కళ్ళెదుట నిత్యమాడుతూన్నాఅంధులుగా ఉండ నిశ్చయించుకుంటారు మూఢులు.

కాబట్టి ప్రతి సాధకుడు తాను తన సాధన వలన మాత్రమే భగవంతుని కృపకు పాత్రుడు కావలి కానీ ఇతరత్రా ఎంతమాత్రం కాదు అనే యదార్ధాన్ని తెలుసుకోవాలి

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ