9, మే 2023, మంగళవారం

లంకలో రావణకాష్టం

 లంకలో రావణకాష్టం


శ్రీలంకలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అక్కడి తమిళులు భయం గుప్పిట నివసిస్తున్నారు. ఎన్నో రకాల ఆంక్షలు. తమిళనాడులో తలదాచుకున్న కొంతమంది శ్రీలంక తమిళులు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు.

అంతకు వారం క్రితమే శ్రీలంక తమిళుల నాయకుడు పద్మనాభ హత్య జరిగింది. దాంతో శ్రీలంకలో భయంకరమైన పరిస్థితి నెలకొంది.


ఆరోజు మహాస్వామి వారి దర్శనం కోసం చాలామంది భక్తులు వేచిఉన్నారు. లంక తమిళుల వంతు రాగానే, వారి బాధలను, కష్టాలను స్వామివారికి చెప్పుకున్నారు. మహాస్వామివారు కరుణాస్వరూపులుగా అగుపించారు.


“మీ అస్తులన్నింటిని వదులుకుని కేవలం ఈ స్థితి నుండి బయటపడడానికి ఇక్కడకు వచ్చారు. ఇక్కడ మీ జీవితం ఎలా ఉంది? మీరు తెరిగి వెళ్తే, మీ ఆస్తులు మీకు దొరుకుతాయా?”


బహుశా అంత ప్రేమతో ఎవరూ వారిని పలకరించి ఉండరు. వారు లంకలో వారి దయనీయ పరిస్థితి గూర్చి వివరించారు. వారికి కలిగిన గాయాలకు పరమాచార్య స్వామివారి వాక్కులే పరమౌషదాలు.


“మీ దేశానికి శాంతి చేకూరుతుంది. . . మీరు మీ సంపద అంతా తిరిగి పొందుతారు!” అని ఆశీర్వదించారు స్వామివారు.


వీరు చాలా ఎక్కువసేపు సమయం తీసుకోవడం వల్ల, వరుసలో నిలబడి ఉన్న భక్తులు విసుగు చెందడం మొదలెట్టారు. శ్రీమఠం సేవకుడోకరు వారికి, “ఈరోజు కుదరకపోతే, మనమందరం మరొక్క రోజు వచ్చి పరమాచార్య స్వామివారిని దర్శించుకోవచ్చు. కాని వారి పరిస్థితి చూడండి ...” అని వివరించడంతో శాంతపడ్డారు.


--- టి. ఎ. భాష్యం, ఉత్తర మాడ వీధి, చిన్న కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 6 


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: