1, జనవరి 2024, సోమవారం

Pump idea


 

Unbelievable incidents


 

Innovative ideas


 

Kapila theertham


 

Electric project


 

Dangerous jobs


 

Portable gas stove


 

Inventions

 


తారల వెలుగు!*

 *🌹🌹నూతన సంవత్సర శుభాకాంక్షలు*🌹🌹


వేదన వదన గతం పోయింది!

ఆశల పువ్వుల వర్తమానం పూసింది!

గగనం నుండి రంగుల పతంగి నెక్కి!

నవ్వుతు నింగినే అరచేతిలో పట్టుకుని!

 నూత్న తేజస్సుతో వరాల మూట తెచ్చింది!!


నక్షంత్రాలను నేలకు దించ్చి! 

ఆశలకు రూపం నిచ్చి! 

క్రొత్త ఆశలతో మురిపించి!

గాయల గతాన్ని మరిపించి!

నేస్తమై  బహుమతి తెచ్చింది!2024 సం"!!


*తారల వెలుగు!*

*పువ్వుల నవ్వు!*

*పున్నమి  వెన్నెల!*

*ఆయురారోగ్యంలు తీసుకొని !*

*వరాల కిరీటమై వచ్చింది*! 

*మీ కోసం  పండుగల ప్రమిద క్రొత సం" 2024 !!*


మీకు, మీ కుటుంబానికి *నూతన సంవత్సర శుభాకాంక్షలు*...🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Pressur pump

 


హాస్య కథ//

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

//చిన్న హాస్య కథ//


"నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వకూడ ఇవ్వను" అని జమీందారు SV రంగారావు గద్దించాడు...


నీ డబ్బు నాకు అవసరం లేదు అని ఎన్టీఆర్ చెప్పాడు ...


నా పేరు కూడా ఎక్కడా వాడుకోకుండా బతికి చూపించు అని SVR సవాల్ చేశాడు ...


చూపిస్తాను అని ఎన్టీఆర్ తన భుజానికి ఉన్న కోటు అక్కడే పారేసి సావిత్రి తో కలిసి వెళ్లి పోతుంటే ....

ఏమండీ వాడు వెళ్ళిపోతున్నాడు అని అంజలీ దేవి ఏడ్చింది... SVR తల పక్కకి తిప్పుకున్నాడు శూన్యం లోకి చూస్తూ...

-----

కొంత కాలం గడిచింది...

-----

SVR భవనాన్ని వేలం వేస్తున్నారు... 

నాగభూషణం చేసిన మోసంతో SVR రోడ్డున పడ్డాడు...


వేలం పాటలో ఒకరిని మించి ఒకరు వేలం పాడుతున్నారు...

 

అప్పుడే అక్కడికి కారు వచ్చి ఆగింది ... ముందు కాలు దిగింది... ఆ కారులో నుంచే వినిపించిన అంకె విని అంతా షాక్.... ఎవరు కూడా వేలంలో అతనితో పోటీ  పడలేక పోయారు...

 

కారులోని ఎన్టీఆర్ తరపున పద్మనాభం సూట్ కేసు తెరిచి డబ్బులు ఇచ్చి భవనం కాగితాలు తీసుకున్నాడు...


అటు తర్వాత...

ఒకే షాట్ లో SVR, అంజలీ దేవి దేవుడి పటాన్ని పట్టుకొని కట్టుబట్టలతో భవనం నుంచి బయటకు వస్తుంటే... బయటి నుంచి SVR, అంజలీ దేవి ఫోటోతో ఎన్టీఆర్ భవనం లోపలికి వస్తున్నారు...


బాబూ అని అంజలీ దేవి ఎన్టీఆర్ ను దగ్గరికి తీసుకుంటే... 

SVR గంభీరంగా ఇంత డబ్బు, ఇంత తక్కువ టైంలో నీకు ఎక్కడి నుంచి వచ్చింది ... తప్పు చేశావు కదూ!? అని నిలదీశాడు...


నీ కొడుకు తప్పు చేయడు నాన్నా... తప్పు చేయడు...


మరి ఈ డబ్బు ఎక్కడిది ? 


ఇంటి నుంచి వెళ్ళాక ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియలేదు... నిద్ర, తిండి లేని రోజులు గడిపాను...

చివరకు తెలంగాణకు వెళ్లి జెరాక్స్ సెంటర్ పెట్టి *"ప్రజా పాలన"* దరఖాస్తులు, ఆధార్ కార్డులు జిరాక్స్ తీసి ఇంత వాడిని అయ్యాను నాన్నా అని ఎన్టీఆర్ గర్వంగా చెప్పాడు....!


అప్పుడు SVR కూడా ఎన్టీఆర్ ను గుండెలకు హత్తుకున్నాడు... 

ఇద్దరూ కడివెడు ఆనంద బాష్పాలు రాల్చారు. 

చూసిన అంజలీ దేవి, విన్న సావిత్రి కూడా తమ కొంగులు పిండితే వరదలు వచ్చేలా ఆనంద బాష్పాలు రాల్చారు.

😂

సేకరణ:- శ్రీ రమణ గారి వాట్సాప్ పోస్ట్.

భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*ప్రథమ స్కంధము*


*వైరుల్ గట్టిన పుట్టముల్ విడువగా వారింప నావల్లభుల్*

*రారీవేళ ఉపేక్షసేయ దగవే? రావే? నివారింపవే?*

*లేరే? త్రాతలు కృష్ణ! యంచు సభలో లీనాంగియై కుయ్యిడన్*

*కారుణ్యంబున భూరివస్త్రకలితంగా చేయడే; ద్రౌపదిన్.*


పగవారు పరమనీచులు. నీతిమాలినవారు. గొప్పకులంలో పుట్టి గొప్పవారిని చేపట్టిన పరమ పవిత్ర అయినపాంచాలిని నిండుసభలో బట్టలను ఊడదీయటానికి ప్రయత్నించారు. అన్నా! కృష్ణా! నా భర్తలు ఈ నీచమైన పనిని నిలువరించటానికి రాకున్నారు. నీవు కూడా ఉపేక్ష చేస్తే ఎలా! రావయ్యా! ఈ ఘోరకృత్యాన్ని ఆపవయ్యా! నన్ను రక్షింపగలవారు ఇంకెవరూ లేరు కదయ్యా! అంటూ సభలో మొరపెట్టుకున్న ద్రౌపదికి అంతటా అన్నిటా అన్ని కాలాలలో ఉండే స్వామి ఆమెకు పెద్దయెత్తున వస్త్రాలనిచ్చి కాపాడాడు కదయ్యా!


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 8*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*శ్లోకము 8*

 *భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ*

 *కృపశ్చ సమితింజయః ।*

*అశ్వత్థామా వికర్ణశ్చ*

*సౌమదత్తిస్తథైవ చ ।।*

 

(భవాన్ — భీష్మః — చ — కర్ణః— చ — కృపః — చ — సమితింజయః — అశ్వత్థామా —వికర్ణ — చ — సౌమదత్తిః  — తథా — ఏవ — చ)

 

భవాన్ — స్వయంగా మీరు; సమితింజయః — యుద్ధంలో విజయుడు; సౌమదత్తిః  — భూరిశ్రవుడు (సోమదత్తుని కుమారుడు); తథా — ఈ విధంగా; ఏవ — కూడా; చ —  మరియు.

 

*భావము:*

మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ  ఎప్పటికీ యుద్ధములో విజయులే.


🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

.                *శ్లోకము 9*


*శ్లోకము*

*అన్యే చ బహవః శూరా*

 *మదర్థే త్యక్తజీవితాః ।*

*నానాశస్త్ర ప్రహరణాః*

*సర్వే యుద్ధవిశారదాః ।।*

 

అన్యే — ఇతరులు; చ 

బహవః — చాలామంది; 

శూరాః  — వీర యోధులు; 

మదర్థే — నా కోసం; 

త్యక్త-జీవితాః  — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు; 

నానా-శస్త్ర ప్రహరణాః  — అనేక ఆయుధములు కలిగినవారు; 

సర్వే — అందరూ; 

యుద్ధ-విశారదాః  — యుద్ద రంగంలో నిపుణులు..

 

*భావము:*

మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ  ఎప్పటికీ యుద్ధములో విజయులే.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷


🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 10*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం।*

*పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ।।*


 

*భావము:* 

మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే రక్షింపబడుచున్న పాండవసైన్యం పరిమితమైనది.


*వివరణ:*

దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు, అంత్య  కాలం సమీపించినప్పుడు, పరిస్థితిని నిజాయితీతో అంచనావేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తనసైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది.

భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం. పాండవపక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధ శత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు,  భీష్ముడి సామర్ధ్యాన్ని భీముడి బలం తో పోల్చాడు. కానీ, భీష్ముడు కౌరవులకి, పాండవులకీ కూడా పితామహుడే, ఇరు పక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి (భీష్ముడికి) వున్న ప్రేమ, తనను మనస్పూర్తిగా యుద్ధం చేయనివ్వదు. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ వున్న ఈ పవిత్రయుద్ధంలో,  భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు, అని భీష్ముడికి తెలుసు. కానీ, హస్తినాపుర వాసులకి, కౌరవులపట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా, భీష్ముడు, పాండవులతో  ప్రతిపక్షంలో యుద్ధం చేయటానికి నిశ్చయించాడు. ఈ నిర్ణయం భీష్ముడి నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం  -‌ పంచమి -  మఘా / పూర్వఫల్గణి  -‌ ఇందు వాసరే* *(01-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/drr8PtJqYcQ?feature=shared


🙏🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*01-01-2024 / సోమవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఉద్యోగమున   అధికారులతో నూతన సమస్యలు  తప్పవు.  ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో  మాటపట్టింపులు ఉంటాయి.

---------------------------------------

వృషభం


వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

---------------------------------------

మిధునం


నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోదాలుంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------

కర్కాటకం


ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో  పూర్తిచేస్తారు.

---------------------------------------

సింహం


ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు.  వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి  ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.

---------------------------------------

తుల


వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు  విజయం సాధిస్తారు. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన  ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

---------------------------------------

వృశ్చికం


వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన  మానసికంగా బాధిస్తుంది.

---------------------------------------

ధనస్సు


దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు  నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు.

---------------------------------------

మకరం


వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున  మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. గృహనిర్మాణ   పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి  సైతం ధన సహాయం చేస్తారు.

---------------------------------------

కుంభం


ఆర్థిక వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.  కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

మీనం


నూతన పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

శుభాకాంక్షలు

 "నూతన ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు "


'ఇరువది యిరువదినాలుగు'

నరుదెంచెనుశుభములొసగ నందరికిలలో

తరతమ బేధము మరచియు

చరియింతురు గాక జనులు సంతస మొప్పన్


 అందరికి నూతన ఆంగ్ల వత్సర 2024 శుభాకాంక్షలు. శుభాభినందనలు. వందనములు 🙏🙏

ఆపాత మధురానుభూతులు*

 *ఆపాత మధురానుభూతులు* 


Nostalgia in our Lives:

                  ***


రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మాది...

ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ....

యస్సెల్సీ పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం వాళ్లం...

అద్దెకి బుక్స్ ఇచ్చే షాప్ దగ్గర్లో వుందా, ఆస్పత్రి వుందా అని అద్దె ఇళ్లు చూసుకున్న బంగారు రోజులవి....

సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టే కాలం అది...

గెజిటెడ్ ఆఫీసర్లు అయినా సైకిళ్లు  తొక్కేవాళ్లు ఆ రోజుల్లో...

డ్రాయింగ్ రూమ్ లలో జిమ్ములలో తొక్కే అవసరం పడేది కాదు...

చేబదుళ్లకి కాదేదీ అనర్హం...

పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో కాఫీ పొడైనా...బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ...కొండొకచో కాలి జోళ్లూనూ!!!


అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు...

రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం నిలబడి,డ్యూయెట్లూ...

పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి...

మధ్యతరగతి మందహాసం కాదు...పగలబడి నవ్వేది....

ఇంటి ముందుకు

కోతులాడించేవాడు, పాములాడించేవాడు,గంగిరెద్దులాడించేవాడు,ఎలుగు బంటిని తెచ్చేవాడు,చిలక జోస్యం చెప్పేవాడు,వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు...

మేకప్పులు అంటే మాకు తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు...

గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు....

మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు...

స్టేషన్ దగ్గర చెవి గులిగిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ, ..

ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ..

వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు .. 

మధ్యాహ్నాలు భోజనాలయి వంటింటి గుమ్మం మీద తల పెట్టి కునుకు తీస్తుంటే...

 "దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఈర్ పేన్లు...లబ్బర్ గాజులు రిబ్బన్లహో"...అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు..వాళ్లు వెళ్లగానే "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం"..అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, చూపించినా గంగాళం కాకుండా ,ఆఖర్న ఉగ్గు గిన్నె ఇచ్చి పోయేవాళ్లు..గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి..కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం..పరుపులేకుతాం..గిన్నెలకి సొట్టలు తీస్తాం..బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం ...అరువు మీద  చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు..ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ ,ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ... సరేసరి....మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు...సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..

 రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది..భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది... రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!

అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే ,దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం..తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం....ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు!!

ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు.... *ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న........ ఏమో... మాటలు రావట్లేదు 😌*


జారే అరుగుల ధ్యాసే లేదు

పిర్ర పై చిరుగుల ఊసేలేదు

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

 వీధిలో పిల్లల అల్లరి లేదు

 తాతలు ఇచ్చే చిల్లర లేదు

 ఏడు పెంకులు ఏమైపోయే

 ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.

మేమేఅదృష్టవంతులమ్*!           

1950-70 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత 

గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   

*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*

*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది.


1950-75పుట్టిన వారికి అంకితం.

🙏✍️🕉🌟🇮🇳

చరక సంహిత ఒక పరిశీలన



చరక సంహిత ఒక పరిశీలన 


దైవానుగ్రము వలన ఇటీవల నేను  అగ్నివేశ మహర్షి కృతము, చరక ప్రతి సంస్కృతము అయినట్టి చరక సంహిత అను ఆయుర్వేద గ్రంథ రాజమును తిలకించ తటస్తించింది. ఇదే నాకు మునుపు లభించిన ఈ సరికి ఆ గ్రంథ పఠనము, అవగాహనను కలిగి వుండేడి వాడను. నేను చూసిన కొంత మటుకు అందరితో పంచుకొన తలంచి ఇది లిఖించుచున్నాను. 


మన మహర్షుల మేథా శక్తిని మనం యెంత స్తుతించినా తక్కువే అవుతుంది. సంస్కృత భాషలోని మూల ప్రతిని తెలుగులో సర్వులకు అర్ధమగు రీతిలో బ్రహ్మ శ్రీ పండిత నుదురుపాటి విశ్వనాధ శాస్త్రి గారు అనువాకము చేసినారు. వారు ఈ గ్రంథ పరిచయము గూర్చి విఫులముగా 13 పేజీల ఉపోధ్గాతాము వ్రాయటం విశేషము.  అందు గ్రంథ పరిచయం చేయుటయే కాక విశేషించి ఆయుర్వేద శాస్త్రము ఈ భువిపైకి వచ్చిన, తెచ్చిన వైనం దాని పరిణామ క్రమము నిశిత విశ్లేషణ గావించినారనుటలో అతిశయోక్తి లేదు. 


స్వర్గ లోకమున ఇంద్రునికడ యున్న ఆయుర్వేద శాస్త్రమును భూలోకమునందు మానవాళికి చేతుర్విధ పురుషార్ధముల సాధనకు శరీరారోగ్యము కాపాడుకొనుటకు ఆయుర్వేదము దక్క వేరొండువడి లేదని తలంచి అంగీరసుడు, జమదగ్ని, వసిష్ఠుడు, మొన్నగు దేవ, బ్రహ్మ ఋషివర్యులు నొక సభ యొనర్చి స్వర్గమున నున్న ఇంద్రుని నుంచి ఇలకు తే సమర్థునిగా భరద్వాజ మహర్షిని పంప  తా వెళ్లి సహస్రాక్షుని వేడ ఆ శతక్రతువు మహర్షి ప్రతిభా విశేషములను గ్రహించి హేతు, లక్షణ, ఔషధ స్కంద త్రయాత్మకనైనట్టి  అద్దానిని ఉపదేశించుటయు జరుగగా  భరద్వాజ మహర్షి ఆయుర్వేద సుశిక్షితుడై భువికి వచ్చెను. దానిని అమ్మహర్షి అంగిరసాది ఋషులకు సమర్మముగా ఉపదేశించ అద్దానిని అనుసరించి ఋషులు తమ ఆరోగ్యములను కాపాడుకొనుచు తమ తమ తపస్సులకు అంతరాయము కలుగక దీర్గాయువు నొందిరి. 


అట్టి తరి తపోధనుడైన యాత్రేయుడు అద్దానిని భూలోకమున బహుళ వ్యాపకమొనరింప అగ్నివేశుడు, ఖేలుడు, జాతకర్ణుడు, పరాశరుడు, హారీతుడు, క్షార పాణి అను నలుగురు శిస్యులకు సాంగముగా నుపదేశించెను. కాగా వారు నల్గురు వారి వారి పేర్ల వేరు వేరు తంత్రముల రచించిరి. తొట్ట తొలుతగా అగ్నివేశుడు అగ్నివేశతంత్రము యను ఆయుర్వేద తంత్రమును రచించెను. నయ్యది నూట ఇరువది అధ్యాయముల పరిమితిలో నుండెను. ఆ తంతంత్రమున " ఇత్యాధ్యయ శతం వింశమ్ ఆత్రేయ ముని వాగ్మయం హితార్థం ప్రాణినాం ప్రోక్తం అగ్ని వేసేన న ధీమతః " అని చెప్పబడినది. అగ్నివేశ కృతమైనట్టి ఆయుర్వేదమును చెరకుడు పునరసంస్కారము చేసెను.  అట్టిదే చెరక సంహిత. కాగా కాలాంతరమున పతంజలి మహర్షి అద్దానిని పునసంస్కారమొనర్చినట్లు చరక వాక్యత యగు చెక్రపాణి వ్యాఖ్యాన ఆరంభమున నాంది శ్లోకమున నుడివినట్లు తెలియుచున్నది. 


ఇవ్విధముగా వివరణలిస్తూ వ్యాఖ్యాత 13 పేజీల విశేష విశ్లేషణాత్మక వివరణలు సోదాహరణగా ఆయుర్వేద శాస్త్ర యుత్పత్తి గూర్చి వివరించి వున్నారు. 


ఈ గ్రంధము 1481 పేజీల నిడివి కలిగి యున్నది. అంతేకాదు అనేక రోగ విశేషములు తత్ నివారణలు తెలుపు తంత్రముల విషయ సూచిక 34 పేజీల నిడివి కలిగి ఉన్నదన్న ఈ గ్రంధములో ఎన్ని రోగ విశేషములు, తత్ నివారణ తంత్రములు ఉన్నవో చెప్పకనే చెప్పుచున్నవి. 


ఈ ప్రాచీన గ్రంథ రాజమును  బ్రహ్మ శ్రీ పండిత నుదురుపాటి విశ్వనాధ శాస్త్రి గారు ప్రతి శ్లోకమును తత్ తాత్పర్యమును అత్యంత నిశితముగా పేర్కొన్నారనుట ఈ గ్రంధము చదివిన వారనక మానరు. 


ఆనతి కాలములోనే ఈ గ్రంథ పఠన మొనర్చి సర్వులకు ఆ గ్రంథ గందమును పంచ ప్రయత్నించెదను. తత్ ద్వారా అనేక రోగముల బాపు తంత్రములను తెలియ చేయ మనస్సువిళ్లూరుతున్నది 


ఇట్లు 


బుధ జన విధేయుడు 


భార్గవ శర్మ