1, జనవరి 2024, సోమవారం

హాస్య కథ//

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

//చిన్న హాస్య కథ//


"నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వకూడ ఇవ్వను" అని జమీందారు SV రంగారావు గద్దించాడు...


నీ డబ్బు నాకు అవసరం లేదు అని ఎన్టీఆర్ చెప్పాడు ...


నా పేరు కూడా ఎక్కడా వాడుకోకుండా బతికి చూపించు అని SVR సవాల్ చేశాడు ...


చూపిస్తాను అని ఎన్టీఆర్ తన భుజానికి ఉన్న కోటు అక్కడే పారేసి సావిత్రి తో కలిసి వెళ్లి పోతుంటే ....

ఏమండీ వాడు వెళ్ళిపోతున్నాడు అని అంజలీ దేవి ఏడ్చింది... SVR తల పక్కకి తిప్పుకున్నాడు శూన్యం లోకి చూస్తూ...

-----

కొంత కాలం గడిచింది...

-----

SVR భవనాన్ని వేలం వేస్తున్నారు... 

నాగభూషణం చేసిన మోసంతో SVR రోడ్డున పడ్డాడు...


వేలం పాటలో ఒకరిని మించి ఒకరు వేలం పాడుతున్నారు...

 

అప్పుడే అక్కడికి కారు వచ్చి ఆగింది ... ముందు కాలు దిగింది... ఆ కారులో నుంచే వినిపించిన అంకె విని అంతా షాక్.... ఎవరు కూడా వేలంలో అతనితో పోటీ  పడలేక పోయారు...

 

కారులోని ఎన్టీఆర్ తరపున పద్మనాభం సూట్ కేసు తెరిచి డబ్బులు ఇచ్చి భవనం కాగితాలు తీసుకున్నాడు...


అటు తర్వాత...

ఒకే షాట్ లో SVR, అంజలీ దేవి దేవుడి పటాన్ని పట్టుకొని కట్టుబట్టలతో భవనం నుంచి బయటకు వస్తుంటే... బయటి నుంచి SVR, అంజలీ దేవి ఫోటోతో ఎన్టీఆర్ భవనం లోపలికి వస్తున్నారు...


బాబూ అని అంజలీ దేవి ఎన్టీఆర్ ను దగ్గరికి తీసుకుంటే... 

SVR గంభీరంగా ఇంత డబ్బు, ఇంత తక్కువ టైంలో నీకు ఎక్కడి నుంచి వచ్చింది ... తప్పు చేశావు కదూ!? అని నిలదీశాడు...


నీ కొడుకు తప్పు చేయడు నాన్నా... తప్పు చేయడు...


మరి ఈ డబ్బు ఎక్కడిది ? 


ఇంటి నుంచి వెళ్ళాక ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియలేదు... నిద్ర, తిండి లేని రోజులు గడిపాను...

చివరకు తెలంగాణకు వెళ్లి జెరాక్స్ సెంటర్ పెట్టి *"ప్రజా పాలన"* దరఖాస్తులు, ఆధార్ కార్డులు జిరాక్స్ తీసి ఇంత వాడిని అయ్యాను నాన్నా అని ఎన్టీఆర్ గర్వంగా చెప్పాడు....!


అప్పుడు SVR కూడా ఎన్టీఆర్ ను గుండెలకు హత్తుకున్నాడు... 

ఇద్దరూ కడివెడు ఆనంద బాష్పాలు రాల్చారు. 

చూసిన అంజలీ దేవి, విన్న సావిత్రి కూడా తమ కొంగులు పిండితే వరదలు వచ్చేలా ఆనంద బాష్పాలు రాల్చారు.

😂

సేకరణ:- శ్రీ రమణ గారి వాట్సాప్ పోస్ట్.

కామెంట్‌లు లేవు: