ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
21, జూన్ 2024, శుక్రవారం
*శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం*
🕉 *మన గుడి : నెం 855*
⚜ *కర్నాటక :- షామనూర్ - దవనగిరి*
⚜ *శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం*
💠 కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా షామనూర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది.
💠 షామనూర్ గ్రామం వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ముందు భాగంలో రెండు భుజాలపై రాముడు మరియు లక్ష్మణుడు ఉన్న హనుమంతుని యొక్క అతిపెద్ద విగ్రహం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లాకు చెందినది.
💠 రాక్షసుడైన రావణుడి నుండి తన భార్య సీతను కనుగొని, తిరిగి పొందాలనే తపనలో శ్రీరాముడికి సహాయం చేసిన శ్రీ హనుమంతునికి ఈ ఆలయం అంకితం చేయబడింది.
హనుమంతుడు లేదా ఆంజనేయుడు కర్ణాటకలో అనేక దేవాలయాలను కలిగి ఉన్నాడు మరియు ఈ ఆలయం ఒక ప్రధాన ఆలయం వలె ఉంటుంది.
💠 ఈ దేవాలయం మరియు షామనూరు గ్రామం చరిత్రలో కనీసం 800 సంవత్సరాల క్రితం నాటివి. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దావణగెరెలో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం.
💠 2000వ సంవత్సరంలో శామనూరు ప్రజలు మరియు ఇతర ప్రాంతాల భక్తుల ద్రవ్య విరాళాలతో ఈ ఆలయం ద్రావిడ ఆలయ శైలిలో పునర్నిర్మించబడింది.
💠 ఈ ఆలయాన్ని శ్రీగెరెలోని తరాలబాలు జగద్గురు బృహన్మఠానికి చెందిన డాక్టర్ శివమూర్తి శివాచార్య మహాస్వామీజీ మార్చి 11, 2000న ప్రారంభించారు.
💠 శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారాలు ప్రత్యేక పూజలు ఉంటాయి..
ప్రతి సంవత్సరం, మహా శివ రాత్రి తర్వాత 10వ రోజు నుండి మూడు రోజుల రథోత్సవం జరుగుతుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు ఇదే ఉత్తమ సమయం.
💠 బస్సు లేదా రైలులో దావణగెరె చేరుకోవచ్చు. దీనికి రైల్వే స్టేషన్ ఉంది.
శ్రమ చేత చేయలేనిది లేదు
చిలికి పెరుగును వెన్న తీయ వచ్హు
యెసరునేసి బియ్యమునన్నముగా చేయవచ్హు
చెరుకు గడనుండి రసము తీయ వచ్హు
శ్రమ చేత చేయలేనిది లేదు భార్గవా
ఆభరణం
*ఆభరణం*
*ఐశ్వరస్య విభూషణం సుజనతా,* *శౌర్యస్య వాక్సంయమో,*
*ఙ్ఞాన స్యోపశమ, శ్రుతస్య* *వినయో,విత్తస్య పాత్రే వ్యయః,!*
*అక్రోధస్తపసః,క్షమా* *ప్రభవితుః,ధర్మస్యమిర్వ్యాజతా*
*సర్వేషామపి సర్వకారణ మిదం* *శీలంపరం భూషణం!!*
```
ఇదొక అద్భుతమైన సుభాషితం!
ఆభరణం అంటే అర్థం ఏమిటో ఎవరెవరికి ఎటువంటి ఆభరణం వుండాలో చెబుతుంది...
ఎన్ని సిరి సంపదలున్నా మానవత్వం మంచితనం లేని వాడికి సమాజంలో విలువివ్వరు కనుక...‘సుజనతా’ఐశ్వర్యవంతుడి ఆభరణం!
శూరుడైనా కూడా...
’బలంవంతుడ నాకేమని’ అన్నట్లు ఏది పడితే అది వాగకుండా మితభాషి అయి వుండటం ఆభరణం!
జ్ఞాని కి ఇంద్రియ లౌల్యం నుంచి ఉపశమనం పొందటం ఆభరణం!
విని నేర్చుకునే వాడు శ్రోత, విద్యార్థి వారికి వినయం ఆభరణం!
అధికారం వున్నవాడికి పాత్రత తెలుసుకుని వ్యవహరించడం ఆభరణం!
మరియు...
కోపం లేక పోవటం ఆభరణం!
ఉన్నత స్థాయిలో వున్నవాడికి క్షమా గుణం, ధర్మం తప్పకుండా ఆచరించడం ఆభరణం!
ఇవికాక సర్వ కాల సర్వావస్థలలోనూ అందరూ కలిగివుండవలసిన ఆభరణం సౌశీల్యం!
ఆభరణం అంటే ఏమిటో, దాని విలువ తెలియక, మూర్ఖ మానవుడు పైకి కనిపించే వస్తువులనే ఆభరణాలని భ్రమ పడి సంబరపడిపోతుంటాడు.
🌹🌷🪷🍁🪷🌷🌹
*జప / ధ్యానాలు ఎందుకు గొప్పవి?*
*మానవునకు రోగం కలిగించేది- పాపం!*
*మానవునకు భోగం కలిగించేది- పుణ్యం!*
*మానవుని భవిష్యత్తు నిర్ణయించేది- కర్మ!*
*మానవునకు లాభం కలిగించేది- సేవ!*
*మానవునకు సంపాదన నిలిపేది- పొదుపు!*
*మానవుని విలువ పెంచేది - దానం!*
*మానవునకు నష్టం కలిగించేది - హింస!*
*మానవునకు అశాంతి కలిగించేది- ఆశ!*
*మానవునకు శాంతి కలిగించేది- తృప్తి!*
*మానవునకు దుఃఖం కలిగించేది- 'కామం!*
*మానవుని పతనం చేసేది - అహంకారం !*
*మానవునకు అందరిని దగ్గర చేసేది- ప్రేమ !*
*మానవునకు అందరినీ దూరం చేసేది- అసూయ !*
*మానవుని స్థితిని సూచించేది-గుణం !*
*మానవుని దైవంగా మార్చేది- దయ !*
*మానవుని ఆత్మస్థితి తెలిపేది- వాక్కు !*
*మానవునకు విజయం చేకూర్చేది- ధర్మం !*
*మానవుని గొప్పవాడిగా చేసేది- జ్ఞానం !*
*మానవునకు- ముక్తి'ని ఇచ్చేది- సత్యం !*
*మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది- జపం / ధ్యానం !*
*అందుకే జపం / ధ్యానం అన్నింటికంటే గొప్పవి.*
*సేకరించిన విషయాలు*
*భాగస్వామ్యం చేస్తున్నాను*
*న్యాయపతి నరసింహారావు*
🌷🪷🍁🙏🙏🍁🪷🌷
జూన్21 పొడవైన రోజు:
ఉత్తరాయణంలో జూన్21 పొడవైన రోజు:
జ్యోతిష శాస్త్రం ప్రకారం కాలనిర్ణయంలో పరిశోధనకు ఈరోజు అత్యంత ప్రధానమైనది.
ఈ రోజున (జూన్21)ఉత్తరాయణంలో సాయన అయనాంతం జరుగుతుంది.
అనగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏటా జూన్ 20 మరియు 22 మధ్య భూమిపై అయనాంతం సంభవిస్తుంది. ఉత్తర అర్ధగోళంలో , జూన్ అయనాంతం వేసవి కాలం (అత్యంత పగటికాలం ఉన్న పొడవైన రోజు),
జూన్ 21నాడు 02:21 నిమిషాలకు సూర్యుని వైపు భూమి యొక్క గరిష్ట అక్ష వంపు 23.44°. అదేవిధంగా, ఖగోళ భూమధ్యరేఖ నుండి సూర్యుని డెక్లినేషన్ 23.44°. ఉంటుంది.
ఈరోజు మిట్ట మధ్యాహ్నం శంకు యొక్క ఛాయ 23.44° గా ఉంటుంది. దీని ద్వారా
భారతదేశంలో పగటికాలం నిడివి13:58 నిమిషాలు ఉంటుంది. దీనినే సాయన ఉత్తర అయనాంతం అని కూడా అంటారు.
దేవుళ్ళ సొమ్ము*
*దేవాదాయ ధర్మా దాయ శాఖ నుండి జగన్ రెడ్డి పథకాలకు మళ్లించిన హిందూ దేవుళ్ళ సొమ్ము*
*1)అమ్మ ఒడి 26,41,65,000*
*2) జగన్ విద్యా దీవెన 2,25,00,000*
*3) YS వాహన మిత్ర 56,80,000*
*4) జగన్ చేదోడు 32,50,000*
*5) YS నేతన్న నేస్త 1,20,000*
*6) YS పెన్షన్ Rs.19,50,000*
*7) జగన్ విద్యా దీవెన 2,25,00,000*
*8) YS ఆసరా 2,25,00,000*
*మొత్తం సొమ్ము 47,00,65,000* *అత్తా సొమ్ము అల్లుడు దానం అన్నట్టు హిందూ దేవాలయ హుండీ సొమ్ము రాజకీయ దానం. ఓ హిందు మిత్రమా నీ జేబు నుండి రూపాయి చందా/దానం చేస్తే ఎవరికీ వెళుతుంది నీ దైవానికి కాదు . అందుకే హుండీ లో డబ్బులు వేయడం ఆపేద్దాం మానేద్దాం.మిత్రమా అంతర్లీనంగా నీలో దాగివున్న నీ నమ్మకాన్ని, నీ ఆచారాల్ని,వేల సంవత్సరాలనుండి వున్న నీ చరిత్రను నీ దేవుడు రాయి అని నీముందే చెప్పినా ఏమీ చేయలేని నీ నిస్సహాయతను ఈ విధంగా సాధించుకో, కాపాడుకో.భారతీయుడిగా,ఒక హిందువుగా ఉండు కానీ, బానిసలాకాదు సుమా*
జై శ్రీరామ్🚩🕉️🚩🙏🏻
కోరికలకోసం దేవుని పూజించడం
*కోరికలకోసం దేవుని పూజించడం సరికాదు*
“ఎన్ని సౌకర్యాలు ఉన్నా మాకు అవసరం లేదు. భగవంతుని సాక్షాత్కారం కావాలనేది మన పూర్వీకుల ఆశయం. అలాగే వారు 24 గంటలూ భగవంతుని ధ్యానించారు. మనం కూడా ధ్యానం చేస్తాం. దేని మీద?
*ద్యాతం విదామహర్నిశం*
రోజులో 24 గంటలు, “డబ్బు ఎలా జోడించాలి? దాన్ని ఎలా రెట్టింపు చేయాలి? ”.ఇత్యాది వాటిమీద.
మేము డబ్బు గురించి మాత్రమే ధ్యానం చేస్తున్నాము. అయినా మేము ప్రయోజనాలను పొందడం లేదు. మా పూజలను ఎవరు అడ్డుకుంటున్నారు.?అని మమ్మల్ని అడుగుతుంటారు.
అంటే..దానికి సమాధానం.. భగవంతుడే.
*దత్తత్కర్మ కృతం యదేవ మునిపిష్టైష్టిర్బలైర్వఞ్జితః ॥*
మన సాధనాలకూ వాటి మార్గాలకూ ఎంత తేడా! కాబట్టి మనం ఋషులు చెప్పిన వారి మార్గాన్ని అనుసరించాలి. మనసులోని కోరికల కోసం దేవుడిని పూజించడం సరికాదు. కోరికలను వదిలించుకోవడం ద్వారా మాత్రమే నిజమైన ఆనందం,ప్రతిఫలం లభిస్తుంది. మనకు కలిగే విపరీత పోకడల కోరికలను పరిష్కరించడానికి ప్రయత్నించడంలో విజయం సాధించలేము. కోరికలు తరగనివి. అంతమేలేనివి. అలాంటి నిరంతర కోరికలు కోరేవారికి పశ్చాత్తాపం మాత్రమే సరైన మార్గం. కోరిక భగవంతునికి ఆనందాన్ని కలిగించదు.
త్రికరణశుద్ధి పూజ మాత్రమే ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది.అదే భక్తి మార్గం ఎంచుకుని తృప్తి పొందండి.
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు*
కాలేయం శుభ్రపడటానికి ,
కాలేయం శుభ్రపడటానికి , కాలేయ వ్యాధుల నివారణ కొరకు అద్బుత యోగం -
కామంచి చెట్టు మీకు ప్రతి గ్రామాలలోను లభిస్తుంది. దాని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు . రహదారుల ప్రక్కన విపరీతంగా ఉంటుంది. ఈ ఆకులను తరచుగా పప్పులో వేసుకొని గాని , పులుసు కూరగా గాని వండుకుని తింటూ ఉంటే జీవితంలో లివర్ రోగం రాదు. ఒకవేళ ఇప్పటికే లివర్ లో సమస్యలు ఉన్నవారు ఈ ఆకు రసాన్ని గాని ఆకు కూరని గాని రోజు సేవిస్తూ ఉంటే లివర్ వాపు , కామెర్లు , శరీరం అంతా చెడు నీరుతో కలిగే వాపు తగ్గిపోతాయి .
గమనిక - ఒకవేళ దీని ఆకు రసం లొపలికి తీసుకోవాలి అంటే వేడిచేసి చల్లార్చి ఇవ్వాలి. పచ్చి రసం వాంతులు కలిగిస్తుంది.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
సంచయాల సంచీ*
*సంచయాల సంచీ*
జగత్తు అంతా ఒక మాయే అని వేదాంతుల మాట. భౌతికవాదులు ఈ మాటను అంగీకరించకపోయినా, ఇది అక్షరసత్యం.
ఎందుకంటే ఈ జగత్తు అంతా మనిషిని ఎన్నో భ్రమలకు గురిచేస్తుంది. ఈ ప్రపంచంలోని సంపదలన్నీ ప్రకృతి సహజంగా ఏర్పడ్డవే. ఈ సంపదలన్నీ ప్రాణుల రక్షణ కోసం ఉద్దేశించినవే. వీటిని ప్రతిప్రాణీ తనకు ప్రాణధారణకు అవసరమైనంత మేరకే వాడుకోవాలి. అంతేగాని, ఇతరులకు ఏమీ మిగిలించకుండా తన సొంతం చేసుకోకూడదు. ఇది పెద్దలమాట.
మనిషిలోని దురాశ, స్వార్థం ఈ నియమాన్ని తుంగలో తొక్కి స్వైరవిహారం చేస్తున్నాయి. తోటి ప్రాణుల బాగోగులను ఎంతమాత్రం లెక్కచేయడం లేదు. అన్నీ తనకే కావాలని అర్రులు చాస్తున్నాడు స్వార్థపరుడైన మనిషి.
జీవితం అంటే సంచయమే తప్ప మరొకటి కాదని విర్రవీగుతున్నాడు.ఆదిత్యయోగీ..
సంచయం అంటే ఆర్జన. తన కోసం సమకూర్చుకోవడం. బతకడానికి ఆరడుగుల నేల చాలని ఎందరు చెప్పినా మనిషి వింటాడా? విననే వినడు. ఎంత వీలైతే అంత భూమిని సొంతం చేసుకోవడానికి ఎత్తులకు పైయెత్తులు వేస్తుంటాడు. సక్రమంగా, అక్రమంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు.
ఎంత భూమిని ఆక్రమించినా మరణించిన తరవాత అంతా ఈ లోకంలోనే వదిలేయాలి. భూమి, ధనం, భవనాలు, అధికారాలు... అన్నింటినీ తృణప్రాయంగా వదిలేయవలసిందే. కేవలం సంపదలే కాదు, తనవాళ్లు కూడా ఎవరూ వెంటరారు. జన్మను ఇచ్చిన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, మిత్రులు, సంతానం, చివరికి కట్టుకున్న భార్య కూడా జీవించి ఉన్నంతవరకే వెంట ఉండేది. చచ్చిన తరవాత ఎవరి దారి వారిదే.
అయినా మనిషి సంచయాలను వదలడు. తన సంతతి కోసం కోట్లు కూడబెట్టాలని ప్రయత్నిస్తాడు. తరతరాలూ తిన్నా తరగనంత ఆస్తిని సంచయం చేసి పెడతాడు.
*మనిషి సంచయాల సంచీ ఎన్ని వేసినా నిండదు. అది ఎప్పుడూ భుజానికి వేలాడుతునే ఉంటుంది. పెరుగుతున్న సంపదలు తరుగుతున్న ఆయువును ఆపలేవు. ఎంత ధనం వెచ్చించినా మరణం ఆగదు. సామాన్యుణ్ని, మాన్యుణ్ని మృత్యువు సమానంగా కబళిస్తుంది. సామాన్యుడి అంతిమయాత్ర చడీచప్పుడు లేకుండా ముగుస్తుంది. మాన్యుడి అంతిమ ప్రయాణం రాజలాంఛనాలతో సాగుతుంది. శ్మశానంలో ఇద్దరి చోటూ ఒకటే!*ఆదిత్యయోగీ*
అవసరాలకు మించి ఉన్నదంతా దీనులకు, ఆర్తులకు ఉపయోగపడాలి. ఇది సృష్టిలోని సమన్యాయం. కానీ దీనిపై మనిషికి స్పృహ ఉండదు. ఎంత పడితే అంత దోచుకోవడమే మనిషికి అలవాటు. అగ్నిజ్వాలలో ఆజ్యం పోస్తే మండుతూనే ఉంటుంది కానీ చల్లారుతుందా? ఒక కోరిక ఇంకొక కోరికను ప్రసవిస్తుంది. కోరికలు ఎంత కాలమైనా పెరిగేవే కాని, తరిగేవి కావు. కనుక మనిషి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. సంచయాల సంచీని ఖాళీ చేస్తుండాలి.
మనిషి జీవితం ఒక సంచీలాంటిదే. ఇందులో పుణ్యాలు, పాపాలు, సుకృతాలు, దుష్కృతాలు... అన్నీ ఉంటాయి. అన్నింటినీ ఆజీవనాంతం మోయడం సాధ్యం కాదు గనుక పాపాలను, దుష్కృతాలను వెంటనే వదిలించుకోవాలి. అతడికి ఉత్తమ స్థితిని తెచ్చిపెట్టేవి సుకృతాలే. మనిషి మరణించినా అతడి కీర్తి శాశ్వతం. మంచి మనిషిని లోకం ఎల్లప్పుడూ గుర్తు చేసుకొంటుంది. అతడు సంపాదించిన ధనం కాని, ఆస్తులు కాని ఎవరినీ ప్రభావితం చేయలేవు. సంపదలు వస్తూ పోతుంటాయే తప్ప, వాటికి శాశ్వతత్వం లేదు. మనిషి గుణగణాలే శాశ్వతంగా చెరగని ముద్ర వేస్తాయి...
.
జన జగత్తులతో జ్ఞాని
ఒకానొక రోజున మహర్షి అరుణాచలం మీద ఉండగానే ఒక బాలుణ్ణి పాము కాటు వేసింది. వాడు మరణించాడు. తల్లి, రమణా! రమణా! అని ఏడుస్తోంది. ఈయన కూడా పరుగెత్తుకుని వెళ్లారు కిందకి, ఎవరు ఇంతగా పిలుస్తున్నారు
అని. ఎందుకంతగా అరుస్తున్నావు? అన్నారు.
“ఎవర్ని ?నిన్ను పిలువ లేదు. నా కొడుకు పేరు రమణుడు. వాణ్ణి పాము కరచింది. మరణించాడు" అన్నది ఆమె.
"ఎక్కడికి పోయాడు? అంతా ఇక్కడే ఉన్నది", అని చూశారు. ఐదు నిముషాల తర్వాత “రమణాలే” అన్నారు. పిల్లవాడు లేచాడు.
“ఏం చూశావు ఇప్పటిదాక" అన్నారు.
"ఇప్పటిదాకా బ్రహ్మానంద స్థితిలో మిమ్మల్ని" చూశాను అన్నాడు ఏడేండ్ల పిల్లవాడు.
అంటే వాడికి మరణానుభవంలోనించే రమణ దర్శనాన్ని ఇచ్చినటువంటి దీనిని, మహి మ అనడానికి వీలులేదు. ఇది గురువు అనుగ్రహ మే. అక్కడి నుంచి రమణులు నిమిత్తమాత్రుడిగా తపుకున్నారు.
రమణుల జీవితంలో జ్ఞాన యోగం ఒక ఎత్తయితే, ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన స్త్రీవాద రచయిత చలం రమణుల్ని ఒకసారి అడిగారు, “భగవాన్! అరుణాచలం నుంచి మీరు ప్రతి సాయంకాలం దిగివచ్చి మంచం మీద కూర్చుని
దేనినో చూస్తున్నట్లు, మీ ముఖ మండలం మీద వెలిగే ఆ దివ్యమైన వెలుగు ఎంత అద్భుతమో, ఎంత సౌందర్యమో" అనీ, “ఏం చూస్తారు? మీరు" అని అడిగినప్పుడు, “ఆ క్షణాన నన్ను నేను చూసుకుంటాను" అని చెప్పారు.
నిజమే! దేన్నయినా చూస్తే మనసు వికారం చెందవచ్చు. దేన్నయినా చూస్తే అది నాకు కావాలని అనిపించవచ్చు.ఆదిత్యయోగీ..
కానీ తనను తాను చూసుకునేటువంటి దివ్యానుభవం జ్ఞానులకు,
యోగులకు మాత్రమే సాధ్యం. ఆ యోగస్థితిని అటువంటి ఉదాత్త స్థాయిని మనం కూడా అనుభవించగలిగిన ఒక మౌన జ్ఞాన భూమికని రమణులు అందరికీ కూడా ప్రతిపాదన చేశారు.
అలాగే అరుణాచలేశ్వరుడికి సమర్పణం చేసి, శరణాగతి పొందిన తర్వాత యాభైనాలుగు సంవత్సరాలు ఆ అరుణాచల దేవాలయం పక్కనే ఉన్నా ఆ దేవాలయంలో మళ్ళీ అడుగు పెట్టలేదు. అవసరం లేదన్నారు. ఎందుకంటే ఆ
గుడిలో ఉన్న
దేవుడు రాయి, మాట్లాడడు. అట్లాగే అరుణాచలం కొండ. అదీ మాట్లాడదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అద్వైతమూర్తి,
జ్ఞానమూర్తి రమణులూ పలకరు. అంతా మౌనమే. అక్కడ ప్రజ్ఞానమంతా మౌనం పరిమళించనట్లుగా, విస్తృతమైనట్లుగా, వ్యాపించినట్లుగా దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య చేసినట్లుగా ఉంటుంది కాబట్టి. రమణులు మానవ జీవితాన్ని
సుసంపన్నం చేసి, “మీరు ఎక్కడ ఉన్నా సరే మీతో మీరు ఉండండి. దేనితో కూడి ఉన్నా మీకు దుఃఖమే. మీరు ఎంత జ్ఞాన యోగంలో ఉన్నా, కర్మయోగమనేది తప్పదు. ఒక శిఖరాన్ని అధిరోహించిన తర్వాత టె
న్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం మీద జండా పాతాడు. అక్కడే కాపురం పెట్టాడా? దిగి రాలేదా?" అన్నారు. దిగి రావాలి. మనం కూడా ఎంత జ్ఞాన యోగంలోకి వెళ్లినా ఇదిగో ఈ సంసారం, ఈ కుటుంబం, ఈ ప్రపంచం, ఈ జగత్తు, ఈ
సమాజం వీటన్నిటితో గనక మమేకం కాకపోయినట్లయితే ఆ జ్ఞానం వృథా అనేవారు.
అలాగే అరుణాచలం నుంచి సాయంకాలం వాహ్యాళికి వెళ్ళి తిరిగి వచ్చినపుడు అక్కడ పది పదిహేను ఆవగింజలు కిందపడి ఉంటే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ఏరి డబ్బాలో వేసేవారు. ఎందుకింత శ్రమ, పోనీ ఆవగింజలే
కదా! అంటే, “అంతేనా ! ఒక్కొక్క ఆగింజలో ఒక్కొక్క చెట్టు ఉన్నది సుమా! ఒక్కొక్క చెట్టు కొన్ని వేల గింజలను సృష్టించగలదు. వృధా చేసే హక్కు మనకెక్కడ ఉన్నది? అన్నారు. జ్ఞాని అయినవాడు కర్మ యోగాన్ని వదిలిపెట్టడు.ఆదిత్యయోగీ..
ఒకానొక రోజున ఒక పరిచారకుడు, ఈయన తన కౌపీనాన్ని ఉతుక్కునే ముందే ఉతికి , ఆరేసినప్పుడు, రమణులు చూశారు. ఎవరో ఇది ఉతికారు అనుకున్నారు. పిండి రుబ్బేవాణ్ణి పక్కకు జరగమన్నారు. “కాయకష్టం లేకుండా
ముద్ద ఎత్తే హక్కు జ్ఞానికి కూడా లేదు. కర్మ యోగంలో దేహాన్ని ధరించి వచ్చాను గనుక నేనూ
కష్టపడవలసిందే. ఈ రోజు నీవు నా బట్టలు ఉతికినందుకు నేను నీ పని చేసిఋణం తీర్చుకుంటానన్నారు".
జ్ఞాని ఎటువంటి పాఠాలు నేర్పుతాడో చూడండి.
ఒక స్త్రీ ఆయన దగ్గరికి రావడానికి సంకోచిస్తూ, ప్రాపంచికమైన యాతనలు పడుతూ ఉన్నప్పుడు, గేటుకు అవతల నించుని భగవాన్ని ప్రార్థిస్తూ ఉంటే రమణులు ఎవరో పిలిచినట్లు బయటకు వచ్చి, గేటు దగ్గరే నించుని “ఓం
నమశ్శివాయ అనుకో! కష్టాలన్నీ తీరుతాయి" అన్నారు. వారి జీవితంలో ఎవరికైనా సరే ఒక మంత్రాన్ని నేరుగా ఉపదేశించినటువంటి సన్నివేశం అదే! మళ్లీ ఎవరికీ చేయలేదు. మళ్ళీ పదిహేను రోజుల తరువాత ఆమె వచ్చి 'మీరు
చెప్పినట్లే చేశాను. అన్నీ బాగా అయిపోయినై, భగవాన్"! అన్నప్పుడు నిమిత్తమాత్రంగా, నిర్లిప్తంగా, నిర్మలంగా తనకేమీ పట్టనట్లుగానే ఆయన వ్యవహరించారు......*
.
యాగాలు చేయడానికి
శ్లోకం:☝️
*ప్రియం పశూనాం భవతి*
*యద్ బ్రహ్మభ్యః ప్రదీయతే |*
*అథో వశాయాస్తత్ప్రియాం*
*యద్దేవత్రా హవిః స్యాత్ ||*
భావం: బ్రాహ్మణులు యాగాలు చేయడానికి పాలలో అధిక కొవ్వు పదార్థాలు (నెయ్యి) అందించబడతాయి. యజ్ఞాల వలన దేవతలు తృప్తులై తద్వారా పర్యావరణం, సమాజం మరియు పాడిపంటలు కూడా గొప్పగా అభివృద్ధి చెందుతాయి.
సంతృప్తి అనేది
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *ధాన్యానాముత్తమం దాక్ష్యం*
*ధనానాముత్తమం శ్రుతం*
*లాభానాం శ్రేయ ఆరోగ్యం*
*సుఖానాం తుష్టిరుత్తమా*
*తా𝕝𝕝 భౌతిక విషయాల కంటే నైపుణ్యం శ్రేష్ఠమైనది సంపద కంటే జ్ఞానం గొప్పది....లాభాల కంటే ఆరోగ్యం శ్రేష్ఠమైనది మరియు సంతృప్తి అనేది ఆనందానికి ఉత్తమ రూపం.....*...
✍️🪷🌺💐🙏
సన్యాసమనగానేమి
#సన్యాసమనగానేమి?
*సన్యాసమనగానేమి? - అవి ఎన్ని రకములుగా చెప్పబడినవి? - వాటి వివరములు!!*
ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు!!...
అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు, ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.
అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము!!...
*సన్యాసం నాలుగు రకాలు...*
*1. వైరాగ్య సన్యాసం...*
వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది.
ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు.
అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది...
*2. జ్ఞాన సన్యాసం...*
సత్ సాంగత్యం ద్వారా, లౌకిక వాంచలు తగ్గిపోయి.
సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు...
*3. జ్ఞాన వైరాగ్య సన్యాసం...*
సాధన ద్వారా, ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు .
*4. కర్మ సన్యాసం...*
బ్రహ్మ చర్యము, గృహస్త, వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ, ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం.
*ఈ సన్యాసులు ఆరు రకాలు...*
*1. కుటిచకుడు...*
శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు...
*2. బహుదకుడు...*
వీరు రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు
*3. హంస...*
ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.
*4. పరమహంస...*
వెదుర దండాన్ని కలిగి, ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి నిరంతర సాధన లో ఉంటారు...
*5. తురియాతితుడు...*
దేహాన్ని ఓ శవంలా చూస్తాడు...
*6. అవధూత...*
ఇతనికి ఏ విధమైన నిష్ఠ నియమాలు లేవు.
జగత్ మిధ్య నేను సత్యం అంటూ, నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు.
చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు.
నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము, అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు...
కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు...
🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩