21, జూన్ 2024, శుక్రవారం

ఆభరణం

        

               *ఆభరణం*

                 

*ఐశ్వరస్య విభూషణం సుజనతా,* *శౌర్యస్య వాక్సంయమో,*

*ఙ్ఞాన స్యోపశమ, శ్రుతస్య* *వినయో,విత్తస్య పాత్రే వ్యయః,!*

*అక్రోధస్తపసః,క్షమా* *ప్రభవితుః,ధర్మస్యమిర్వ్యాజతా*

*సర్వేషామపి సర్వకారణ మిదం* *శీలంపరం భూషణం!!*

```

ఇదొక అద్భుతమైన సుభాషితం!


ఆభరణం అంటే అర్థం ఏమిటో ఎవరెవరికి ఎటువంటి ఆభరణం వుండాలో చెబుతుంది...

 

ఎన్ని సిరి సంపదలున్నా మానవత్వం మంచితనం లేని వాడికి సమాజంలో విలువివ్వరు కనుక...‘సుజనతా’ఐశ్వర్యవంతుడి ఆభరణం!


శూరుడైనా కూడా...

’బలంవంతుడ నాకేమని’ అన్నట్లు ఏది పడితే అది వాగకుండా మితభాషి అయి వుండటం ఆభరణం!


జ్ఞాని కి ఇంద్రియ లౌల్యం నుంచి ఉపశమనం పొందటం ఆభరణం!

 

విని నేర్చుకునే వాడు శ్రోత, విద్యార్థి వారికి వినయం ఆభరణం!


అధికారం వున్నవాడికి పాత్రత తెలుసుకుని వ్యవహరించడం ఆభరణం!


మరియు...

కోపం లేక పోవటం ఆభరణం!


ఉన్నత స్థాయిలో వున్నవాడికి క్షమా గుణం, ధర్మం తప్పకుండా ఆచరించడం ఆభరణం!


ఇవికాక సర్వ కాల సర్వావస్థలలోనూ అందరూ కలిగివుండవలసిన ఆభరణం సౌశీల్యం!


ఆభరణం అంటే ఏమిటో, దాని విలువ తెలియక, మూర్ఖ మానవుడు పైకి కనిపించే వస్తువులనే ఆభరణాలని భ్రమ పడి సంబరపడిపోతుంటాడు.


      🌹🌷🪷🍁🪷🌷🌹


*జప / ధ్యానాలు ఎందుకు గొప్పవి?*

                 

*మానవునకు రోగం కలిగించేది- పాపం!*

*మానవునకు భోగం కలిగించేది- పుణ్యం!* 

*మానవుని భవిష్యత్తు నిర్ణయించేది- కర్మ!*


*మానవునకు లాభం కలిగించేది- సేవ!*

*మానవునకు సంపాదన నిలిపేది- పొదుపు!*

*మానవుని విలువ పెంచేది - దానం!* 


*మానవునకు నష్టం కలిగించేది - హింస!*

*మానవునకు అశాంతి కలిగించేది- ఆశ!*

*మానవునకు శాంతి కలిగించేది- తృప్తి!*


*మానవునకు దుఃఖం కలిగించేది- 'కామం!* 

*మానవుని పతనం చేసేది - అహంకారం !*

*మానవునకు అందరిని దగ్గర చేసేది- ప్రేమ !*


*మానవునకు అందరినీ దూరం చేసేది- అసూయ !*

*మానవుని స్థితిని సూచించేది-గుణం !*

*మానవుని దైవంగా మార్చేది- దయ !*


*మానవుని ఆత్మస్థితి తెలిపేది- వాక్కు !*

*మానవునకు విజయం చేకూర్చేది- ధర్మం !*

*మానవుని గొప్పవాడిగా చేసేది- జ్ఞానం !*


*మానవునకు- ముక్తి'ని ఇచ్చేది- సత్యం !*

*మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది- జపం / ధ్యానం !*


*అందుకే జపం / ధ్యానం అన్నింటికంటే గొప్పవి.*


   *సేకరించిన విషయాలు* 

 *భాగస్వామ్యం చేస్తున్నాను*


   *న్యాయపతి నరసింహారావు*

 🌷🪷🍁🙏🙏🍁🪷🌷

కామెంట్‌లు లేవు: