30, మే 2022, సోమవారం

పొడుపు పద్యము

 మన తెలుగు భాష ప్రేమికులకు ఇదిగో మరో పొడుపు పద్యం. ఛేదించడానికి ప్రయత్నించగలరు. 


.... జాతీయ తెలుగు సాహితీ పీఠము …. 

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          ……  పొడుపు పద్యము  …...

ఆ. నాలుగక్షరముల మేలైన పలుకొండు 

మూడు, రెండు నరసి చూడ ''దురద'' 

ఓండు, రెండు, నాలు గొప్పును  ''చారు''యై   

పదము తెలుప వలయు పసిడి బాల..!

సుభాషితమ్

 🌄💫 *_-||శుభోదయమ్||-_*💫🌄

🪔 *ॐ卐 _-||సుభాషితమ్||-_ ॐ卐* 💎


శ్లో𝕝𝕝 కాలేవర్షతు పర్జన్య:పృథివీ సస్యశాలినీ! 

దేశోయం క్షోభ రహితో,బ్రహ్మణాస్సంతు నిర్భయా:!!


తా𝕝𝕝 *ఈ పుడమిని మేఘములు సరిఐన సమయములో కురియు గాక*...

భూమి సస్యస్యామలమగు గాక.....

*దేశములో ఏ సంక్షోభములు లేకుండు గాక*.... 

బ్రాహ్మణులకు సరిఐన గౌరవం లభించు గాక.... 🧘‍♂️🚩🌄🇮🇳🌅

సోమాతి(సోమావతి) అమావాస్య-విశిష్టత*

 *నేడు సోమాతి(సోమావతి) అమావాస్య-విశిష్టత*


సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.  మౌని అమావాస్య ని శని అమావాస్య అని కూడా పిలుస్తారు. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి. కాల సర్పదోషాలు తొలగిపోవాలంటే.. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణాలు చేసి నట్లయితే అంతా శుభం కలుగుతుంది


సోమవతి రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం…


దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.


సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.


నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ... ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.


శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి... తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.


సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే... సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు.


🙏నమః శివాయ🙏

సమాధానం ఉండే ప్రశ్న - ప్రశ్నే

 సమాధానం ఉండే ప్రశ్న - ప్రశ్నే.


కానీ సమాధానం లేని కేవల ప్రశ్న, ప్రశ్న కాదు,

అది దైవస్వరూపమే.


ఆ సమాధానం లేని కేవల ప్రశ్న "నేనెవడను" అనేదే.


"నేనెవడను" అన్న ప్రశ్నే

బ్రహ్మవిష్ణువుల యెదుట శివజ్యోతి స్తంభంగా వెలసింది.


వెలసింది అంటే అప్పుడే వెలసింది అనికాదు,

బ్రహ్మవిష్ణువులకు అప్పుడే తెలిసింది అని.


దేశకాలములకు అతీతమైన పరమాత్ముడే 

ఆ స్తంభం.


సృష్టి అనే అంతవంతమైన తీగకు ఆలంబన 

ఆ అనంతమైన స్తంభం.


ఆ స్తంభం యొక్క అంతు(అంచు) కనుగొనాలని బ్రహ్మవిష్ణువులు చేసిన ప్రయత్నమే సైన్స్ లో తొలిప్రయోగం.


క్రిందకు తవ్వుతూ ఒకరు (విష్ణువు)

పైకి ఎగురుతూ ఒకరు (బ్రహ్మ)

అన్వేషణ ప్రారంభించారు.


ఉనికే లేని దేశకాలాలు వారి వ్యర్థప్రయత్నాన్ని చూసి ఎగతాళి చేశాయి.


విష్ణువు సిగ్గుపడి యథాస్థానం చేరుకున్నాడు.

"నాకు తెలియదు" అన్న పరమసత్యాన్ని ఆవిష్కరించాడు. శివుడు సంతోషించాడు.

కాలాన్నే చక్రంగా శివుని చేత బహుమానంగా పొంది చక్రహస్తుడైనాడు.


"కనుగొన్నాను" అనే ఓ పెద్ద అబద్ధంతో

 బ్రహ్మ అహాన్ని అలంకరించుకుని

దొంగసాక్ష్యాలతో తిరిగొచ్చాడు.

'గుడిలేని దేవుడు'గా శివుని చేత శాపం పొందాడు.

తన తలవ్రాతను తానే అలా వ్రాసుకున్నాడేమో!


కాబట్టి విజ్ఞానశాస్త్రంలో "తెలుసు" అనడం గొప్ప.

అధ్యాత్మికశాస్త్రంలో "తెలియదు" అనడం గొప్ప.


* * *


"నాకు తెలియదు" అని 

సిగ్గుపడకుండా చెప్పేవాడు - జ్ఞాని.


"నాకు తెలుసు" అని 

సిగ్గులేకుండా చెప్పేవాడు - అజ్ఞాని.


* * *


"నాకు తెలియదు" అన్నా

"భగవదిచ్ఛ" అన్నా

రెంటి అర్థం ఒక్కటే.


* * *


"నాకు తెలియదు" అన్న స్థాయికి శిష్యుణ్ణి ఎదగనిచ్చేవాడే నిజమైన గురువు.


"నాకు తెలుసు" అనే బరువును శిష్యుని బుర్రలో  పెట్టేవాడు కపటగురువు.  


జ్ఞానం పెరిగేకొద్ది మనం అజ్ఞానులమేమోనని తెలుస్తుంది...అంటారు వివేకానంద.


* * *


"అల్లా మాలిక్" అని బాబా అన్నా


"అప్పా! నీ ఆజ్ఞమేరకు వచ్చాను" అని రమణుడు అన్నా.


"అంతా జగజ్జనని ఇచ్ఛ" అని రామకృష్ణులు అన్నా


తమ అల్పత్వాన్ని, తెలియనితనాన్ని  బాహాటంగా తెలియజేయడానికే...


అందుకే వారి బోధనలన్నీ శరణాగతి వైపుకే దారి తీస్తాయి...


"నాకేమీ తెలియదు" అని ఉత్తినే మాట వరుసకు అంటే చాలదు, త్రికరణశుద్ధిగా నాకేమీ తెలియదు అని ఉండాలి.


పైకి "అప్రయత్నంగా" కనిపిస్తే చాలదు.

త్రికరణశుద్ధిగా  అప్రయత్నంగా ఉండాలి.


బరిణెలోకి ఏనుగును పట్టించలేం అని తెలిసి

అప్రయత్నంగా ఉండడమన్నమాట.


అంతేగాని పైకి చెప్పి...లోపల ప్రయత్నం చేయడం కాదు.


అప్పుడే అది నిజమైన శరణాగతి అవుతుంది.

అంతేగానీ భగవాన్ అన్నట్టు ప్రతిరోజా బోర్లాపడి లేస్తుండడం శరణాగతి కాదు...


పరిమితులను గుర్తించడం ఒక ప్రజ్ఞ.


ప్రకృతిలోని సహజ పరిమితుల నుండి నువ్వు విముక్తి పొందాలని ప్రయత్నిస్తున్నావ్. అదే నీ దుఃఖానికి, బాధకి కారణం.


* * *


84లక్షల జీవరాసుల్లో ఒక్క మనిషి తప్ప

మిగతా అన్ని జీవరాసులూ

ప్రకృతి శాసనాన్ని ఎదిరించక, ఏ సందేహమూ లేక బ్రతికేస్తున్నాయి...చచ్చిపోతున్నాయి...


ఒక్క మనిషే ప్రకృతి శాసనాన్ని అధికమించడానికే ప్రయత్నిస్తుంటాడు.


బాహ్యంగా చేసే ప్రయత్నానికి సైన్స్ అని పేరు.

ఆంతరంగా చేసే ప్రయత్నానికి తపస్సు అని పేరు.


వైజ్ఞానికంగా మార్స్ పైకి రాకెట్తో దూసుకెళుతున్నా సరే...

 

సౌకర్యవంతమైన వస్తువులు ఇంటి నిండా నింపేసుకున్నా  సరే...


ఇంకా ఏదో అసంతృప్తి...ఏదో అస్పష్టత...

అంతరాంతరాలలో ఏ మూలో నలుగుతున్న సంశయం...గంభీరమైన విచారం...


ఇది మనిషికి అనాది నుంచి వస్తున్న స్వాభావ వారసత్వం కాబోలు...


ఈ తత్కాలిక ఐహిక సుఖాల నుంచి 

ఈ మానసికవ్యధ నుంచి తప్పించుకుని 'శాశ్వతానందం' పొందే  దిశగా మనిషి చేసే ప్రయాణమే ఆధ్యాత్మికం అయ్యింది.


* * *


పుట్టాలని పుట్టలేదుగాని, పుట్టాడు.

చావాలని చావడు గాని, చస్తాడు.


ఎందుకు పుట్టాలో, ఎందుకు చావాలో

చచ్చేలోపు కనుగొనే ప్రయత్నమే ఆధ్యాత్మికం అయ్యింది.


ఈ శరీరమే నేనని మోసుకు తిరుగుతుంటాడు...  శరీరం లోపల ఏం జరుగుతుందో (అనాటమీ) తెలియదు.


ప్రతిదానికీ  నేను-నేను అంటూ తెలిసినట్టే వ్యవహరిస్తుంటాడు.

కానీ నేను (ఆత్మ) గురించి ఏమీ తెలియదు.


తెలుసు-తెలియదు ఈ  రెంటి మధ్య ఊగిసలాడుతుంటాడు మనిషి.


భౌతికత-ఆధ్యాత్మికత  ఈ రెంటి మధ్య 

ఊగిసలాడుతుంటాడు మనిషి.


* * *


ఈ ఊగిసలాటను పోగొట్టే ఉపాయాన్ని సద్గురుసన్నిధిలో పొందవలసిందేగానీ ఇక వేరే మార్గం లేదు. 


* * *


నాలుగు పావలాలు కలిస్తే రూపాయి అయినట్టు


ఒకటవ పావలా - వ్యక్తి (నేను)

రెండవ పావలా - సంసారం (నాది)

మూడవ పావలా - జగత్తు.

నాల్గవ పావలా - జగదీశ్వరుడు.


ఈ నాల్గింటిలో ఒకటవభాగమైన వ్యక్తిగా (ఒక పావలాగా) మాత్రమే తానుండడం వల్లనే

అనగా వ్యష్టిభావనే తన అసంతృప్తికి కారణం.


* * * 


1. నేను అంటే ఈ తనువు మాత్రమే తానని  

ఉన్నవాడు - పావలా (బ్రహ్మచర్యాశ్రమం)


2. నేను అంటే 'తను, సంసారం' 

నేనని ఉన్నవాడు - అర్థరూపాయి (గృహస్థాశ్రమం)


3.నేను అంటే 'తను, సంసార, ప్రపంచములు' కలిపి నేను అని ఉన్నవాడు - ముప్పావురూపాయి

(వానప్రస్థాశ్రమం)


4. నేనుఅంటే 'తను, సంసార, ప్రపంచ, దైవములు' కలిపి నేను అని ఉన్నవాడు- రూపాయి (సన్న్యాసాశ్రమం)


పూర్ణానుభవం అనేది 'రూపాయి'కి తప్ప 

నాల్గు పావలాలలో ఏ ఒక్క పావలాకూ  కలుగదు.

ఏ ఒక్క పావలా పూర్ణం కాదు. మిగతా మూడుపావలాలతో కలిస్తేనే పూర్ణం.


కాబట్టి పావలాగా ఉన్న నీవు 

రూపాయిగా విస్తరించడమే మోక్షం.


పావలాగా ఉన్నప్పుడూ 'తెలియదు' అని ఉంటాడు.

రూపాయిగా ఉన్నప్పుడూ 'తెలియదు' అని ఉంటాడు.


మొదటి 'తెలియదు' - జ్ఞానము లేక.

రెండవ 'తెలియదు' - అన్యము లేక.


స్వస్తి


* * *

అకాలమరణం

 *అకాలమరణం... ఓ సమీక్ష*


ఒక రోజు కైలాసంలో పార్వతీదేవి ఈశ్వరునితో నాధా, చావు అనునది ఏమి,  దాని స్వరూపము ఏమిటి అని అడిగారు.


అప్పుడు పరమశివుడు, దేవి,  ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనము చేత రోగముల చేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఆ దేహమును వదిలి పోతుంది. అదే మరణము. జీవాత్మ కృశించి వడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించడమే పుట్టుక. కనుక జీవుడు ఈ జననమరణ చక్రములో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు అని పరమేశ్వరుడు చెప్పారు.


పార్వతీ దేవి, నాధా, బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలము బ్రతకడానికి కారణం ఏమిటి అని అడిగారు పార్వతి మాత.. 


ఆ ప్రశ్నకు పరమేశ్వరుడు, దేవీ,  ఈ కాలము శరీరమును కృశింప చేస్తుంది కాని చంపదు. మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడడం, తగ్గించబడడం జరుగుతూ ఉంటుంది. పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు. తగ్గిస్తే మరణం సంభవిస్తుంది అని చెప్పారు ఈశ్వరుడు.


పార్వతీదేవి, పరమేశ్వరా మనిషికి ఆయుష్షు ఎందువలన పెరుగుతుంది ఎందువలన తగ్గుతుందిఅని అడిగారు.


పరమేశ్వరుడు, పార్వతీ మానవుడు ప్రశాంతముగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది. అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది. మానవుడు క్షమించడం నేర్చుకోవాలి. శుచిగా ఉండాలి. అందరి మీద దయ కలిగి ఉండాలి. గురువుల ఎడ భక్తి కలిగి ఉండాలి. వీటన్నింటిని వల్లా మానవుడి ఆయువు వృద్ధి పొందుతుంది.


అధికమైన కోపము కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల ఎడల క్రూరంగా ప్రవర్తించడం, అపరిశుభ్రంగా ఉండడం, గురువులను ద్వేషించడం వీటి వలన ఆయువు క్షీణిస్తుంది.


పార్వతీ తపస్సు చేతనూ, బ్రహ్మచర్యము చేతనూ, మితాహారం చేతనూ, రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించడం చేతనూ ఆయుర్ధాయము పెరుగుతుంది. పైన చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు. ముందు జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకములో జన్మిస్తారు. వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. వారు అకాల మరణం చెందరు. ముందు జన్మలో పాపము చేసుకున్న వాళ్ళు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకములో తిరిగి జన్మిస్తాడు. అతడు అల్పాయుష్కుడౌతాడు. అందువలన అకాలమరణం సంభవిస్తుంది అని పరమేశ్వరుడు చెప్పారు.


🔱*ఓం నమః శివాయ*🔱